Bala
-
హీరోయిన్ని లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. నిజమెంత?
మలయాళ మూవీ‘ప్రేమలు’సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది మమిత బైజు(Mamitha Baiju). తెలుగులోనూ ఈ బ్యూటీకి ఫుల్ పాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడీయోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రేమలు తర్వాత ఈ బ్యూటీ ఆ స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు కానీ వరుస అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తమిళ్లోనూ హీరో సూర్య సరసన నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ దర్శకుడు మమితను లాగిపెట్టి కొట్టాడని, దీంతో ఆమె ఆ సినిమా నుంచే తప్పుకుందనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.బాల చేతిలో దెబ్బలు?తమిళ దర్శకుడు బాల వణంగాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య హీరోగా, కృతిశెట్టి, మమిత హీరోయిన్లుగా నటించాల్సింది. కానీ కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కృతి, మమిత కూడా ఈ చిత్రం నుంచి వైదొలిగారు. అయితే సూర్య, కృతి శెట్టి ఎందుకు తప్పుకున్నారనే విషయం చెప్పకుండా సైలెంట్‌గా వారి పనిలో బిజీ అయిపోయారు. మమిత మాత్రం దర్శకుడు బాల తనను కొట్టాడని, అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత మమిత మాట మార్చింది. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పింది.నా కూతురు లాంటిది: బాలతాజాగా ఈ విషయంపై దర్శకుడు బాల కూడా స్పందించారు. మమితను కొట్టానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. షూటింగ్ సమయంలో ఓవర్ మేకప్ వేసుకొని వస్తేఏ.. ‘ఎందుకు మేకప్ వేసుకున్నావ్?’ అంటూ కొట్టేలా చేయి పైకిఎత్తేవాడినని..అంతేకాని ఆమెపై చేయి చేసుకోలేదని చెప్పారు. మమితా తనకు బిడ్డలాంటిదని..ఒక మహిళను నేను ఎందుకు కొడతాను ’ అని బాల అన్నారు. -
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
-
నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్
నాకు నాలుగు పెళ్లిళ్లయ్యాని అందరూ ఈర్ష్యపడుతున్నారు.. పెళ్లి కాని ప్రసాదులైతే నాపై ఎంతో ఏడుస్తున్నారు అని మలయాళ నటుడు బాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ అంతలోనే యూటర్న్ తీసుకున్నాడు. తనకు రెండు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయంటున్నాడు.అది నా మొదటి పెళ్లితాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల మాట్లాడుతూ.. నాకు 21 ఏళ్ల వయసులో చందనతో వివాహం జరిగింది. ఆమె నా స్కూల్‌మేట్. ఇద్దరం ప్రేమించుకున్నాం, గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. కానీ నా దృష్టిలో అది నిజమైన పెళ్లి కాదు. ఎందుకంటే తను మరో వ్యక్తితో వెళ్లిపోకూడదనుకుని ఆవేశంలో అలా చేశాను. మా కుటుంబాలు మమ్మల్నిద్దరినీ విడదీయడంతో కలిసుండలేకపోయాం.కోకిల నా రెండో భార్యకానీ తనతో నాకు ఇప్పటికీ పరిచయం ఉంది. మా మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో తన భర్తతో సంతోషంగా ఉంది. ఇకపోతే నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని జనాలు నమ్మడం ఆశ్చర్యంగా ఉంది. చట్టపరంగా కోకిల నా రెండో భార్య. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను మూడో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్ ఉన్నాయి. అది లీగల్ మ్యారేజ్ కాదునిజానికి అది చట్టపరమైన వివాహం కాదు. ఇంతకుమించి తనగురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. అయితే ఓ విషయం. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంది, చాలా సాయం చేసింది. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటాను. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తి. తనకెప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.బాలా- అమృత విడాకులుసింగర్ అమృతా సురేశ్‌తో జరిగిన వివాహం గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఇకపోతే బాలాకు, అమృతకు 2010లో పెళ్లి జరగ్గా వీరికి అవంతిక అనే కూతురు ఉంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమృత.. బాలాపై కేసు కూడా పెట్టింది.చదవండి: పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున -
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
-
పెళ్లి కాని వాళ్లకు నన్ను చూస్తేనే అసూయ: నటుడు
సమాజంలో పెళ్లికాని ప్రసాదులూ ఉన్నారు.. ముచ్చటగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ మధ్యే మలయాళ నటుడు బాల (బాలకుమార్) సైతం నాలుగో వివాహం చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరిద్దరికీ దాదాపు 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయితే చాలామంది తనను చూసి కుళ్లుకుంటున్నారంటున్నాడు బాల. రాజులా బతుకుతున్నా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు బాల మాట్లాడుతూ.. 'ఇప్పుడు నా వయసు 42 ఏళ్లు, కోకిలకు 24 ఏళ్లు. అయినా మా సంసార జీవితం సంతోషంగా సాగుతోంది. నేను రాజులా బతుకుతున్నా.. భార్యను రాణిలా చూసుకుంటున్నా.. త్వరలోనే మాకు ఓ బుజ్జి బాబు/పాపాయి రానుంది. ఇదంతా చూసి మీరు అసూయ చెందితే దానికి నేనేం చేయలేను. తప్పులు వెతకడమే మీ పనిమీ దగ్గర డబ్బు లేకనే ఏ అమ్మాయి దొరకడం లేదు. అయినా నా నాలుగు పెళ్లిళ్లపై ఏడుస్తారేమో! ప్రతిదాంట్లో తప్పులు వెతకడమే మీలాంటివారి పని' అని కౌంటరిచ్చాడు. కోకిల మాట్లాడుతూ.. చాలాకాలంగా మామ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇప్పుడు నేను అతడికి తోడుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి అతడు అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అది చూసే నేను ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చింది.పెళ్లి హిస్టరీ..ఇకపోతే బాల.. కంగువ మూవీ డైరెక్టర్ శివకు తమ్ముడవుతాడు. కాగా బాల 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. తర్వాత పొరపచ్చాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను పెళ్లాడగా ఆమెతోనూ సుదీర్ఘ ప్రయాణం చేయలేదు. పోయిన ఏడాదే విడిపోయాడు. ఈ మధ్యే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. -
మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్
మలయాళ నటుడు బాల (బాలకుమార్) మూడో పెళ్లి చేసుకున్నాడు. పదిరోజుల క్రితం తన మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో పాటు కూతురు అవంతికను వేదించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో అరెస్ట్ అయిన 24గంటల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఈ క్రమంలో తాజాగా మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు.'బాల' మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. 'కంగువ' సినిమా దర్శకుడు శివకు స్వయాన తమ్ముడు అవుతాడు. కొద్దిరోజుల క్రితమే బెయిల్ మీద బయటకొచ్చిన బాల.. మూడో పెళ్లి చేసుకుని తన భార్యతో కేరళలోని కలూర్ పావకులం ఆలయానికి వచ్చాడు. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిలను ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే, ఇరుకుటుంబాల మధ్య మాత్రమే ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లి గురించి బాల ఇలా చెప్పుకొచ్చాడు. కోకిల తన మామయ్య కూతురని వెళ్లడించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు చిరకాల కోరిక ఉండేదని అన్నాడు. ఇలా ఆమె కోరిక నెరవేరిందని బాల చెప్పాడు. 'కష్ట సమయంలో కోకిల మాత్రమే నాకు మద్దతుగా నిలిచింది. నేను మళ్లీ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావడానికి ఆమె కారణం.' అని చెప్పాడు.బాల గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతని మొదటి వివాహం 2010లో గాయని అమృత సురేష్‌తో జరిగింది. ఈ జంటకు అవంతిక అనే కుమార్తె ఉంది. వారు 2019లో విడాకులు తీసుకున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో రెండోసారి వివాహం చేసుకున్నాడు. 2023లో వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకులు ఇచ్చి కూడా తనను వేదిస్తున్నాడని కేసు పెట్టిన మొదటి భార్య కోర్టులో న్యాయపోరాటం చేస్తుంది. కూతురు అవంతికతో పాటు తనను కూడా సోషల్‌మీడియాలో దారుణంగా తిడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో ఉంది. -
భార్య, కూతురిపై నటుడి టార్చర్.. అరెస్టైన కొన్ని గంటల్లోనే బెయిల్
మలయాళ నటుడు బాల (బాలకుమార్) అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్‌పై బయటకొచ్చారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో బాలను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. విడాకుల తర్వాత బాలా తనతో పాటు కుమార్తెను కూడా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కొచ్చిలోని కడవంతర పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హజరుపరిచారు. వారిద్దరి వాదనలు విన్న తర్వాత పలు హెచ్చరికలతో బాలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బాలా అరెస్టు తర్వాత మాజీ భార్య అమృత కోర్టు విచారణలో భాగంగా తన కష్టాలను వివరించింది. తాను చెప్పలేని శారీరక, మానసిక హింసను ఎదుర్కొన్నానని నటుడు బాలపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. '2019లో తన నుంచి విడాకులు తీసుకుని నేను దూరంగా ఉంటున్నాను. కూతురు అవంతికతో ప్రశాంతంగా జీవిస్తున్న నాకు అతని వేధింపులు మాత్రం తగ్గలేదు. నాతో పాటు అవంతికను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. మా ఇద్దరి గురించి సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కనీసం సొంత కూతురని కూడా చూడకండా తప్పుడు మాటలతో దూషిస్తున్నాడు. తను ఇప్పుడు స్కూల్‌కు కూడా వెళ్లడం ఇబ్బందిగా మారింది.హెచ్చరికతో పాటు బెయిల్జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అరెస్టు అయిన కొన్ని గంటల తర్వాత స్థానిక కోర్టు బాలకు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఎర్నాకులం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతని మాజీ భార్య అమృత సురేష్, వారి కుమార్తెపై సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అతన్ని కోర్టు హెచ్చరించింది. భవిష్యత్‌లో విచారణాధికారులు పిలిచినప్పుడల్లా తదుపరి విచారణ కోసం బాలా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కోర్టు తెలిపింది.'కంగువ' సినిమా నిర్మాతకు తమ్ముడుబాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. -
మాజీ భార్య ఫిర్యాదు.. ప్రముఖ నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ఫ్లాట్‌లో ఉండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.బాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఈ మధ్య సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని.. ఇతడి మాజీ భార్య అమృత తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురి వెంటపడటంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొచ్చిలో బాలాతో పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.బాలా తనని వేధిస్తున్నాడని చెప్పి అమృత.. గతంలో రెండు మూడుసార్లు గృహ హింస కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధనని మీరి తమని వేధిస్తున్నాడని అమృత కేసు పెట్టడంతో ఈ గొడవ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు..?
-
టీడీపీ అంతమే.. మా పంతం
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్‌బోర్డును తొలగించారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అనంతపురం అర్బన్‌తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు. -
హీరోయిన్‌పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
Mamitha Baiju: డైరెక్టర్ చేతిలో చీవాట్లు తిన్న హీరోయిన్ (ఫోటోలు)
-
డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్. ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయాలి.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను. కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు.. కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు. అయితే సెట్లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా! తిట్టడమే కాదు కొట్టాడు కూడా! హీరో సూర్య సర్‌కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
వరలక్ష్మి శరత్ కుమార్ ఇంతలా కష్టపడిందా.. రివీల్ చేసిన టాప్ డైరెక్టర్
వరలక్ష్మి శరత్ కుమార్‌ను ప్రశంసించని వారు ఉండరనే చెప్పాలి. ఆమె స్టార్ వారసురాలైనా ప్రతిభతోనే కథానాయకిగా రంగ ప్రవేశం చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ సూపర్ బెల్లీ డ్యాన్సరన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. తన తండ్రి శరత్ కుమార్ సిఫార్సునే తీసుకోని ఆమె ప్రతిభనే నమ్ముకుని వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆమెను దర్శకుడు బాలా తనకు నచ్చిన నటి అని ప్రశంసించడం విశేషం. సేతు, నందా, శివ పుత్రుడు వంటి పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు బాలా. ఈయన ప్రస్తుతం కోలీవుడ్‌లో వణంగాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మొదట నటుడు సూర్య కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఆయన చిత్రం నుంచి వైదొలగడంతో నటుడు అరుణ్ విజయ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు బాలా ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ తాను చాలా తక్కువ మంది కథానాయకిలతోనే చిత్రాలు చేశానని, అందులో తనకు నచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు తెరకెక్కించిన తారై తప్పట్టై చిత్రం షూటింగ్లో ఘనంగా నటించిన ఆర్కే సురేష్‌కు నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు మధ్య జరిగిన సన్నివేశంలో ఆమె ఒంటి ఎముక చిట్లినా లెక్కచేయకుండా మళ్లీ మళ్లీ టేక్ చెప్పినా నటించారని చెప్పారు. అసలు ఆర్కే సురేష్ ఆమైపె బలంగా పడాలన్నారు. షార్ట్ సరిగ్గా రావాలని తాను గట్టిగా అరవడంతో ఆర్కే సురేష్ ఆమైపె బలంగానే పడ్డారన్నారు. అలా తొలి షాట్ లోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఒంటి ఎముక చిట్లిందన్నారు. ఆమె తనతో ఆ విషయాన్ని చెప్పలేదన్నారు. తాను పర్ఫెక్షన్ కోసం మరో రెండు మూడు టేకులు చేశానన్నారు. ఆమె కాదనకుండా నటించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఊరికి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరిస్తున్నప్పుడు తన ఒంటి ఎముక చిట్లినదానికి సంబంధించిన ఎక్స్‌రేను చూపించడంతో ఇది నిజమా అని అడిగానన్నారు. దాంతో ఆమె నిజమేనని చెప్పి చాలా కష్టపడినట్లు చెప్పారన్నారు. అలా ఆమె కఠిన శ్రమజీవి అని దర్శకుడు బాలా పేర్కొన్నారు. -
నా అనుకున్న వాళ్లే హీరో విక్రమ్‌ను తొక్కేశారా.. ఆయనకు జరిగిన నష్టం ఏంటి?
సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నారు. వారిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి అరుదైన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఒకరు. అయితే కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రాలతో పాటు నేరుగా తెలుగు మూవీస్‌లోనూ యాక్ట్ చేశారు విక్రమ్. విభిన్నమైన కథలతో, పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే విక్రమ్ సినిమా కెరీర్ ఆరంభం సవాళ్లతో కూడుకున్నది. విక్రమ్‌ను దురదృష్టవంతుడని కూడా అప్పట్లో కోలీవుడ్‌లో అనేవారు. విక్రమ్ కెరీర్ ప్రారంభంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో విక్రమ్‌ను సినీ ప్రపంచం దురదృష్టవంతుడిగా ముద్ర వేసింది. కానీ 1999లో బాలా దర్శకత్వంలో వచ్చిన సేతు సినిమాతో విక్రమ్ జీవితం మారిపోయింది. వంద రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది. సేతు సినిమాతో తమిళనాట కొత్త ఉదయానికి సాక్షిగా విక్రమ్ నిలిచాడు. అక్కడి నుంచి విక్రమ్ వెనక్కి తిరిగి చూడలేదు. మేనమామతో విక్రమ్‌కు కష్టాలు విక్రమ్ సినీ ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నప్పుడు ఆయన కజిన్, హీరో ప్రశాంత్ కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు. అతను నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోకి ఆయన సినిమాలు విడుదల అయ్యేవి. హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ విక్రమ్‌కి సొంత మేనమామ అవుతాడు. ఆయనకు తమిళ చిత్రసీమలో ఒక నటుడు, డైరెక్టర్, నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది. కానీ త్యాగరాజన్ తన మేనళ్లుడు అయిన విక్రమ్‌కు ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రశాంత్ కూడా విక్రమ్ గురించి ఎక్కడా మాట్లాడకుండా అప్పట్లో దూరం పాటించాడు. విక్రమ్ కూడా వారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. విక్రమ్ నటించిన ఏడు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో విక్రమ్ అన్ లక్కీ యాక్టర్ అనే ముద్ర పడింది. విక్రమ్‌తో సినిమా చేస్తే నష్టపోతామని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలోనే దర్శకుడు బాలాను విక్రమ్ కలిశాడు. విక్రమ్ హీరోగా ఆయన 'సేతు' సినిమాను తెరకెక్కించాడు. అయితే సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. చివరకు చిత్ర నిర్మాతలు తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. వారికి థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి. సినిమా భారీ హిట్ అయినా నిర్మాతలు అంతగా లాభపడలేదు. దీనికి విక్రమ్ కూడా కారణమని చెప్పారు. అతనికి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా వారి పేర్లు ఎక్కడా ఉపయోగించుకోకుండా ఉండటం అని పలువురు చెప్పుకొచ్చారు. విక్రమ్ మామ కొడుకు అయిన ప్రశాంత్ అప్పట్లో పెద్ద స్టార్. కానీ ప్రశాంత్ మాత్రం విక్రమ్ ఎవరో తనకు తెలియనట్లు ఉండేవాడు. సేతు సినిమాకు మరిన్నీ థియేటర్లు కావాలని నిర్మాతలు మాట సాయం కోరినా ప్రశాంత్ స్పందించలేదట. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని తర్వాత అందరూ భావించారు. అందుకే విక్రమ్ కోసం త్యాగరాజన్, ప్రశాంత్ ఎలాంటి రికమెండేషన్ చేయలేదని పలువురు విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు. విక్రమ్‌కు వచ్చిన సినిమా అవకాశాలను కూడా రానీయకుండా త్యాగరాజన్ ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విక్రమ్ అవకాశాల కోసం ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. చివరకు విక్రమ్ తన లక్ష్యాన్ని చేరుకుని సూపర్ స్టార్ అయ్యాడు. కానీ ఈరోజు హీరో ప్రశాంత్ అంటే చాలామందికి తెలియని స్థితిలో ఆయన ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికీ హీరో విక్రమ్ తన మేనమామ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు. ఒకప్పుడు రాబోయే తరానికి సూపర్ స్టార్ అని అనుకున్న ప్రశాంత్ ఇప్పుడు సినిమా ప్రపంచంలోనే లేరు. అప్పట్లో ఆయనతో పాటు ఎంట్రీ ఇచ్చిన అజిత్, విజయ్, విక్రమ్ నేడు సూపర్ స్టార్లుగా ఎదిగారు. చియాన్ విక్రమ్ ఎప్పటికీ తమిళ సినిమా సూపర్ స్టార్. పొన్నియన్ సెల్వన్ విజయంతో జోరుమీద ఉన్న ఆయన.. త్వరలో తంగళన్, ధ్రువనక్షత్రం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
జనసేన బి ఫారం చెల్లదట..!
-
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ఇటీవల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. మలయాళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటించారు బాలా. బాలా ప్రముఖ తమిళ చిత్రనిర్మాత శివ సోదరుడు. అతను ప్రస్తుతం సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రముఖులు ఉన్ని ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఎన్ఎమ్ బాదుషా తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు. బాలా చివరిసారిగా అనుప్ పందళం దర్శకత్వం వహించిన షెఫీక్కింటే సంతోషం చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో బాలా అమీర్ అనే పాత్రలో కనిపించారు. అనూప్ పందళం స్వయంగా రాసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే కొన్ని తమిళ చిత్రాలలో కూడా పనిచేసిన బాలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో బలంగా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ సినిమాలతో బాలా ఫేమ్ సంపాదించారు. -
‘బలగం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఘనంగా బిగ్‌బాస్ ఫేమ్ బాలాదిత్య కూతురి నామకరణం.. ఫోటోలు వైరల్
-
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సూర్య.. ఆ సినిమా నుంచి ఔట్
హీరో సూర్య–దర్శకుడు బాలది హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘నందా’, ‘పితామగన్’ (శివపుత్రుడు) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే 19 ఏళ్ల తర్వాత మళ్లీ బాల దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా ఆరంభమైనందుకు అభిమానులు ఆనందపడ్డారు. ‘వణంగాన్’ టైటిల్‌తో ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సూర్య–బాల. ఈ చిత్రం నుంచి సూర్య తప్పుకున్నారు. ఈ విషయం గురించి బాల ఓ లేఖ విడుదల చేశారు. ‘‘వణంగాన్’ కథలో చేసిన మార్పుల వల్ల ఈ కథ సూర్యకి తగ్గట్టుగా ఉంటుందా? అనే ఫీలింగ్ కలిగింది. నా మీద, ఈ కథ మీద సూర్య పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంత గౌరవం, ప్రేమ చూపించే నా తమ్ముడికి చేదు అనుభవం ఎదురు కాకుండా చూడటం ఒక అన్నయ్యగా నా బాధ్యత. అందుకే మేమిద్దరం (సూర్య–బాల) ఒక అవగాహనకు వచ్చాం. ఈ సినిమా నుంచి తను (సూర్య) తప్పుకోవడం కరెక్ట్ అని నాకు, సూర్యకి అనిపించింది. ఇందుకు సూర్య బాధపడ్డారు. భవిష్యత్తులో మేం కలిసి సినిమా చేస్తాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు బాల. కాగా ‘వణంగాన్’ పనులు కొనసాగుతాయని బాల స్పష్టం చేశారు. అయితే సూర్య స్థానంలో ఏ హీరోని తీసుకోవాలనుకుంటున్నారో బయటపెట్టలేదు. -
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్... 18 ఏళ్ల బంధానికి ముగింపు!
చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సమంత, ధనుష్, అమీర్ ఖాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకివ్వగా.. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్‌కు డివోర్స్ ఇచ్చాడు. దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి నేటితో తెరపడింది. గత నాలుగేళ్లుగా బాల, మధుమలార్ విడి విడిగా ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. ఇక దర్శకుడి బాల.. తమిళ్లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడు. ఆయన దర్శకత్వం వహించిన శివపుత్రుడు, శేషు, వాడు- వీడు చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే 2008లో బాల 'నాన్ కాదవుల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా సూర్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
సీక్రెట్‌గా రెండో పెళ్లి, రిసెప్షన్ ఫొటో వదిలిన నటుడు
దర్శకుడు శివ సోదరుడు, పాపులర్ నటుడు బాలా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఎలిజబెత్ ఉదయన్ అనే వైద్యురాలిని సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓనం పండుగనాటి నుంచే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్లకు ఫుల్స్టాప్ పెడ్తూ తన భార్యను అభిమానులకు పరిచయం చేశాడీ నటుడు. రిసెప్షన్లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బాలా 2010లో ప్లేబ్యాక్ సింగర్ అమృత సురేశ్‌ను పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు. వీరికి అవంతిక అనే కూతురు కూడా ఉంది. ఇక బాలా సినిమాల విషయానికి వస్తే అతడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Actor Munna Simon (@munnasimon) View this post on Instagram A post shared by Actor Munna Simon (@munnasimon) -
ఫెయిర్ అండ్ యమి
ఇంట్లో టీవీ పెడితే యమి గౌతమ్ కనిపిస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లేని రోజు ఉంటుందా? యమి ఆ క్రీమ్ పూసుకుని మెరిసే సౌందర్యవతి. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్‌గా మాత్రమే కాదు నటిగా కూడా ఆమె బాలీవుడ్లో పై వరుసలో ఉంది. ఈ అందమైన జీవితంలోనూ సవాళ్లు ఉంటాయి. ప్రశ్నలు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ యమి విజేతగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ఉదయం నాలుగ్గంటలకు యమి గౌతమ్ ఫోన్ మోగింది. చేసింది ఒక ప్రముఖ పత్రిక నుంచి జర్నలిస్ట్. ‘ఏంటి?’ అని అడిగింది యమి. ‘మీ మీద ట్రోలింగ్ జరుగుతోంది.. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని అడిగాడు జర్నలిస్ట్. అప్పటికి ట్రోలింగ్ అంటే ఏమిటో యమికి తెలియదు. ‘ట్రోలింగ్ అంటే?’ అని అడిగింది. ‘మిమ్మల్ని తిట్టి పోస్తున్నారు’ అన్నాడతను. ‘ఎందుకు?’ అని అడిగింది నెర్వస్‌గా. ఇంతలో ఫోన్ కట్ అయ్యింది. అభయ్ డియోల్ బాలీవుడ్లో పేరున్న నటుడు. తన ఫేస్బుక్ పేజిలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘సినిమా తారలు అనవసరంగా కలరిజమ్ను ప్రచారం చేస్తున్నారు. తెల్లరంగే గొప్పది అనే ఈ ప్రచారం ఆ రంగు లేని వారందరినీ అవమానించే స్థాయిలో ఉంది. షారుక్‌ఖాన్, ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహమ్... వీళ్లంతా తెల్లగా చేసే క్రీములంటూ ఫెయిర్‌నెస్ క్రీములను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’ అని పోస్ట్ పెట్టాడు. ఈ వరుసలో యమి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఫెయిర్‌నెస్ క్రీముల్లో ఫెయిర్ అండ్ లవ్లీ అగ్రస్థానంలో ఉంది. దాని బ్రాండ్ అంబాసిడర్ యమి. దాంతో సోషల్ మీడియాలో యమి మీద విమర్శలు వెల్లువెత్తాయి. భిన్నమైన రంగులు ఉన్నవారిని న్యూనత పరిచే ఇటువంటి యాడ్స్‌లో నటించేవారికి కనీస ఆలోచన లేదని చాలామంది రాశారు. ఇలా జరుగుతుందని యమి ఊహించలేదు. దానికి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. ఆ రోజంతా వెక్కివెక్కి ఏడుస్తూ కూచుంది. అసలు ఇందుకేనా ఈ రంగంలోకొచ్చింది? ∙∙ యమికి పుస్తకం తప్ప అద్దం తెలియదు. పుస్తకమే తన అద్దం అన్నట్టుగా ఎప్పుడూ అందులోనే తల దూర్చి ఉండేది చిన్నప్పుడు. వాళ్లది హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్. తండ్రి ముకేష్ గౌతమ్ చిన్నస్థాయి పంజాబీ సినిమాల దర్శకుడు. ఆయన పంజాబీ. తల్లి అంజలి గౌతమ్ హిమాచల్ కొండజాతి మూలాలున్న స్త్రీ. యమి గౌతమ్ బాల్యం బిలాస్పూర్లో గడిచినా హైస్కూల్, కాలేజ్ చండీగఢ్‌లోనే సాగాయి. చిన్నప్పటి నుంచి చదువు మీదే ఆమె ధ్యాస. ఐ.ఏ.ఎస్ చేయాలనేది కల. స్కూలు సొంతదే అయినా ఆ స్కూల్లో ఆమె చాలా బిడియంగా తిరుగుతూ ఉండేది. నలుగురి ఎదుటకు రావడానికి చాలా సంకోచించేది. వాళ్ల తాతను ఇంప్రెస్ చేయడానికి ఒకసారి టీచర్లు యానివర్సరీ డేలో ఏదో కవిత చదివించాలని ప్రయత్నిస్తే యమి స్కూల్ వదిలి ఇంటికి పారిపోయింది. ఇలాంటి అమ్మాయిలకు చదువే కరెక్ట్ అని అనుకున్నారు అందరూ. కాని విధి వేరేగా ఆమె ప్రయాణాన్ని నిశ్చయించింది. అలా స్కూల్ వదిలి బిడియంతో పారిపోయిన అమ్మాయి ఇవాళ వందలాది మంది చూస్తూ ఉండగా కెమెరా ముందు డైలాగ్ చెప్పగలుగుతోంది. ఇది వింత కాకపోతే మరేమిటి? ∙∙ యమి లా డిగ్రీలో చేరింది. ఫైనలియర్లో ఉంది. ఆ రోజు ముంబైలో ఉండే బంధువులు చుట్టపు చూపుగా వాళ్లింటికి వచ్చారు. అందులో ఒకామె టీవీ రంగంలో పని చేసింది. ఆమె యమిని చూసిన మరుక్షణం నుంచి నువ్వు టీవీలో పనిచెయ్ టీవీలో పనిచెయ్ అని వెంటబడింది. ‘అమ్మా... ఏమిటి ఈ నస’ అని కిచెన్‌లోకి వచ్చి విసుక్కుంది యమి, తల్లితో. కాని ఆ వచ్చినామె వద్దన్నా యమి ఫొటో తీసుకుని ముంబై వెళ్లింది. ఆ తర్వాత తనకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్లన్నింటిలో చూపించింది. ఒక ప్రొడక్షన్ హౌస్ వారు యమి ఫొటోను చూసి ‘వెంటనే రమ్మనమనండి’ అని అన్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. వెళ్లాలా వద్దా. ‘ఏమో.. ట్రై చేయరాదూ’ అని తల్లిదండ్రులు అన్నారు. అలా తన 20వ ఏట యమి ముంబైలో అడుగుపెట్టింది. వెంటనే రెండు సీరియల్స్‌లో పాత్రలు దొరికాయి. ‘కలర్స్’ టీవీలో ప్రసారమైన ‘యే ప్యార్ నా హోగా కమ్’ సీరియల్‌తో యమి స్టార్ అయిపోయింది. ఆ వెంటనే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఆమెను తన మోడల్‌గా ఎంపిక చేసుకుంది. కన్నడ రంగం నుంచి తొలిగా ‘ఉల్లాస ఉత్సాహ’ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ఇది మన తెలుగు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’కు రీమేక్. హీరో కన్నడ స్టార్ గణేష్. అయితే ఆమెకు బాలీవుడ్లో పేరు రావాలి. అక్కడ హిట్ కావాలి. ‘వికీ డోనర్’ ఆ అవకాశం ఇచ్చింది. దర్శకుడు సూజిత్ సర్కార్ హీరో జాన్ అబ్రహమ్ను వొప్పించి అతడు నిర్మాతగా ఒక చిన్న సిన్మాకు దర్శకత్వం వహించే చాన్స్ కొట్టాడు. కథాంశం కొత్తది. ప్రత్యుత్పత్తి కేంద్రాలకు ‘వీర్యాన్ని డొనేట్ చేస్తూ’ జీవించే కుర్రాడికథ అది. ఆ పాత్రకు కొత్తవాడైన ఆయుష్మాన్ ఖురానాను తీసుకున్నాడు. అతడి ప్రియురాలిగా యమి గౌతమ్‌ను తీసుకున్నాడు సూజిత్. ‘వికీ డోనర్’ పెద్ద హిట్. ఆ వెంటనే తెలుగులో అల్లుశిరీష్‌తో ‘గౌరవం’, తరుణ్‌తో ‘యుద్ధం’ సినిమాలు చేసింది యమి. అవి సరిగ్గా ఆడలేదు. అజయ్ దేవగణ్‌తో చేసిన ‘యాక్షన్ జాక్సన్’ కూడా సత్ఫలితం ఇవ్వలేదు. కాని వరుణ్ ధావన్‌తో చేసిన ‘బద్లాపూర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే చాన్స్ వచ్చింది. ‘కాబిల్’ కూడా ప్రేక్షకులు హిట్ చేశారు. ఇటీవల ఆమె వికీ కౌశల్‌తో చేసిన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్’, ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘బాలా’ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఉరిలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా, బాలాలో అమాయకమైన స్మాల్‌టౌన్ గర్ల్‌గా యమి తన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో ఎదిగిన నటి. స్టార్ పెర్ఫార్మర్. పెద్ద బేనర్లు, ఆమె చేస్తే బాగుండు అనుకునే స్క్రిప్ట్‌లు ఆమెకోసం వెయిట్ చేస్తున్నాయి. ∙∙ ‘తెల్లరంగు గొప్పది, నల్లరంగు తక్కువది అనే భావన తప్పు. తెల్లరంగు ఉన్నవారికే అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్లనే అందరూ అభిమానిస్తారు అని ప్రచారం చేయడం కూడా తప్పు. గతంలో ఆ ధోరణిలో యాడ్స్ వచ్చేవేమో. ఇప్పుడు మన సౌందర్యాన్ని మనం మరింత పెంచుకోవడం ఎలా అనే పాయింట్‌తో యాడ్స్ వస్తున్నాయి. అలాంటి యాడ్స్‌లో చేయడం తప్పు కాదు. నేను అలాంటి యాడ్స్‌నే చేస్తున్నానని గట్టిగా చెప్పగలను. అయినా నేను ఒక స్వతంత్రురాలిని. వేరొకరి ఆలోచనలు, భావధారను బట్టి నేను నా నిర్ణయాలను మార్చుకోను. ఏది సరైనదైతే అదే నేను చేస్తాను’ అని తన మీద వచ్చిన విమర్శలకు జవాబు ఇచ్చింది యమి ఆ తర్వాత. ∙∙ యమికి తన చెల్లెలు సురీలీ గౌతమ్‌తో, తమ్ముడు ఓజస్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తనకు షూటింగ్ లేకపోతే వారితోనే సమయాన్ని గడుపుతుంది. ఆమెకు పోల్ డాన్స్ తెలుసు. ప్రొఫెషనల్‌గా ఆ డాన్స్‌ను నేర్చుకుంది. మనం అనుకునే రంగం వేరు కావచ్చు, ప్రవేశించే రంగం వేరు కావచ్చు... కాని ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే గెలుపు అసాధ్యం కాదు అంటుంది యమి. ఆమె తమ బాహ్యసౌందర్యంతో పాటు మానసిక సౌందర్యాన్ని కూడా మెరుగు పెట్టుకుంటున్నదని ఆమె ఎదుగుదల, ఆలోచనలు, వ్యాఖ్యలు తెలియచేస్తున్నాయి. ఆమెను భవిష్యత్తులో మరింత అందంగా మనం చూడబోతున్నాం. – సాక్షి ఫ్యామిలీ -
‘రూ వంద కోట్ల క్లబ్ చేరువలో బాలా’
ముంబై : ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. శనివారం రూ 6 కోట్లు కలెక్ట్ చేసిన బాలా మొత్తం వసూళ్లు రూ 82.73 కోట్లు రాబట్టగా ఆదివారం రూ 90 కోట్ల మార్క్ దాటి రూ 100 కోట్ల క్లబ్‌కు చేరువవుతుందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత వారం విడుదలైన బాలా పాజిటివ్ రివ్యూలతో క్రమంగా వసూళ్లను కొల్లగొడుతూ నిలకడగా సాగుతోంది. బట్టతల కష్టాలను ఎదుర్కొనే వ్యక్తిగా ఆయుష్మాన్ ఖురానా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా, భూమి పెడ్నేకర్, యామి గౌతమ్‌లు సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. -
మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్
రియాలిటీ షోలతో, రేడియో జాకీగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా ‘విక్కీ డోనర్’ నుంచి తాజాగా విడుదలైన బాలా మూవీ వరకు సమకాలీన సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సాగే కథలు ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరొందాడు. గతేడాది బదాయీ హో, అంధాధున్లతో హిట్లు ఖాతాలో వేసుకున్న ఆయుష్మాన్.. తాజాగా బాలాతో 100 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మూవీ యూనిట్ సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో బాలా సినిమాలో అతడికి జోడీగా కనిపించిన భూమీ ఫడ్నేకర్ ఆయుష్మాన్‌తో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో భూమి మాట్లాడుతూ.. ‘ తెరపై మా జంట చూడముచ్చటగా ఉంటుందని ఎంతో మంది కితాబిచ్చారు. మా మధ్య మంచి కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అందుకేనేమో మూడు సినిమాల్లో జంటగా కనిపించినా ఇప్పటికీ మాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. తనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో భాగం కావడం మరో విశేషం. వీటి ద్వారా ఎంతోమంది ఎదుర్కొనే సమస్యలను వినోదం కలగలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాం’ అని పేర్కొన్నారు. కాగా భూమి ఫడ్నేకర్ తొలి సినిమా దమ్ లగా కే హైసాలో ఆయుష్మాన్ హీరో అన్న సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శుభ్ మంగళ్ సావధాన్(పురుషుల్లో సంతానలేమి ఇతివృత్తంగా), బాలా (బట్టతల కారణంగా యువకుడు పడే ఆవేదన ప్రధానాంశంగా) సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా: నటి
పెళ్లనగానే అమ్మాయి తరపు బంధువులు.. ముందుగా అబ్బాయికి ఏమైనా ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు చూస్తారు. అయితే ముందూవెనకా ఎంతున్నా తలపై కాసిని వెంట్రుకలు లేకపోతే మాత్రం పెళ్లి కుదరదు అని తేల్చి చెప్పేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. బట్టతల కనిపించకుండా ఉండటం కోసం అబ్బాయిలు పడే పాట్లు చెప్పనలవి కాదు. ఇటీవల ఈ నేపథ్యంపై వచ్చిన సినిమా ‘బాలా’. ఇందులో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా నటించిన యామీ గౌతమ్‌కు తాజాగా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులుగా ‘ఎందుకు చేసుకోకూడదు’ అని యామినీ తిరిగి ప్రశ్నించింది. బట్టతల అనేది పెళ్లికి అడ్డు కాదని జవాబిచ్చింది. నిజానికి బట్టతల ఉన్నావారు చాలా శాంతస్వరూపులని అభివర్ణించింది. అయితే, అసలు బట్టతల వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి.. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలని.. ఇదే సినిమా ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొంది. బాలా సినిమా విజయం పట్ల యామినీ సంతోషం వ్యక్తం చేసింది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే సినిమాతో ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని, ఇందులో టిక్‌టాక్ స్టార్‌గా వైవిధ్యభరితమైన పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానంది. నవంబర్ 7న విడుదలైన ‘బాలా’ ఐదు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విజయ ఢంకా మోగిస్తోంది. -
రూ. 50 కోట్ల క్లబ్లో చేరిన ‘బాలా’
ముంబై: వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. తాజాగా రూ. 50 కోట్ల చేరిపోయింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. వరుసగా నాలుగో రోజుకూడా బాక్సాఫీస్ వద్ద 8 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరిందని ప్రముఖ బాలీవుడ్ సినీ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. #Bala crosses ₹ 50 cr... Remarkable hold on Day 4... Trends better than Ayushmann’s last hit #DreamGirl [Day 4: ₹ 7.43 cr]... Holiday on Day 5 [#GuruNanakJayanti] should only boost biz... Fri 10.15 cr, Sat 15.73 cr, Sun 18.07 cr, Mon 8.26 cr. Total: ₹ 52.21 cr. #India biz. — taran adarsh (@taran_adarsh) November 12, 2019 అదే విధంగా ‘బాలా’ మూవీ సౌదీ అరేబియాలో సెన్సార్ పూర్తి చేసుకుందని.. నవంబర్ 14న ఈ చిత్రం సౌదీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కాగా సౌదీలో రిలీజ్ ఆయ్యే అయూష్మాన్ ఖురానా మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా, భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. #Bala clears Saudi Arabia censor... First movie of Ayushmann Khurrana to release in #SaudiArabia on 14 Nov 2019. pic.twitter.com/S6m2D7Yun5 — taran adarsh (@taran_adarsh) November 11, 2019 -
బాక్సాఫీస్ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్
వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బాలా’. భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 7న బాలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి మార్కులే పడ్డాయి. -
‘బాలా’ ట్రైలర్ విడుదల
-
బట్టతల ఉంటే ఇన్ని బాధలా..?
అయుష్మాన్ ఖురానా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ బాలీవుడ్లో గొప్ప పేరు తెచ్చుకున్న క్రేజీ హీరో. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో అమ్మాయి గెటప్‌తో అలరించిన ఆయుష్మాన్.. ఇప్పుడు బట్టతల వల్ల కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో సరదాగా చెప్పడానికి ‘బాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో హీరో చూడడానికి బాగానే ఉంటాడు కానీ బట్టతల ఉంటుంది. దీంతో అతన్ని చూసి అంతా నవ్వుతుంటారు. టోపీ పెట్టుకొని తన బట్టతలను కవర్ చేస్తుంటాడు. అయినప్పటికీ అందరి ముందు నవ్వులపాలవుతుంటాడు. జుట్టు పెరగడానికి మార్కెట్లో దొరికే ప్రతి ఆయుర్వేద నూనెలను వాడుతుంటాడు. అయినా జుట్టు పెరగడు. ఇంకా ఊడిపోతూనే ఉంటుంది. చివరకు ఆవు పేడను కూడా తలకు రాసుకుంటాడు. అయినా ఎలాంటి పెరుగుదల ఉండదు. దాంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంటాడు. అయితే తలలో జుట్టు ఇంజెక్ట్ చేయడానికి అతని శరీరంలో ఎక్కడా అంత జుట్టు లేదని, దాంతో పర్సనల్ పార్ట్స్‌లో వచ్చే వెంట్రుకలతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని డాక్టర్స్ అంటారు. దాంతో ఆయుష్మాన్ భయంతో పారిపోతాడు. ఇందులో యామి గౌతమ్, భూమి పెడ్నేకర్ కథానాయికలుగా నటించారు. హీరో యామిని ఇష్టపడతాడు. ఆమె ముందు విగ్గు పెట్టుకొని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి బట్టతల ఉందన్న విషయాన్ని యామికి తెలిస్తే పరిస్థితేంటి? బట్టతల పోవడానికి అతను ఏన్ని పాట్లు పడ్డాడు? అన్నదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ రెడీ!
టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ కబీర్ సింగ్ పేరుతో రిలీజ్‌కు రెడీ అవుతుండగా తమిళ అర్జున్ ఆదిత్మ వర్మ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే బాల దర్శకత్వంలో రూపొందిన సినిమా అవుట్‌పుట్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను పక్కన పెట్టేసి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి షూట్ చేశారు. 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ బ్యూటీ బాణిత సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
బిందుమాధవికి భలేచాన్స్
నటి బిందుమాధవికి భలే చాన్స్ తలుపు తట్టనుందని సమాచారం. తెలుగింటి ఆడపడుచు అయిననీ అమ్మడు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కళుగు వంటి చిత్రాల్లో నటిగా చక్కని ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకుంది. అయినా ఎందుకనో నటిగా రావలసినంత పేరు రాలేదు. ఈ మధ్య చేతిలో అకాశాలు లేక సొంత ఊరికి వెళ్లిపోయింది కూడా. అలాంటి బిందుమాధవికి అనుకోకుండా ఒక లక్కీచాన్స్ తలుపుతట్టిందన్నది తాజా సమాచారం. దర్శకుడు బాలా విషయానికి వస్తే ఈయన చిత్రాల్లో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా ప్రస్తుతం యువ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా కథను వినిపించారని, అది సూర్యకు బాగా నచ్చిందని టాక్ స్ప్రెడ్ అయింది. అయితే ప్రస్తుతం సూర్య వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఎన్జీకే చిత్రం మేడే సందర్భంగా తెరపైకి రానుంది. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించిన కాప్పాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబరులో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత శివ దర్శకత్వంలో ఒక చిత్రం, హరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. దీంతో బాలా దర్శకత్వంలో ప్రస్తుతం నటించలేనని చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో యువ నటులు ఆర్య, అధర్వ హీరోలుగా నటించడానికి సై అన్నారు. ఇందులో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని సమాచారం. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించడం మరో విశేషం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మరో సౌత్ రీమేక్
విక్రమ్ కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రం ‘పితామగన్’. తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువదించారు. విక్రమ్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇందులో సూర్య నటన కూడా అద్భుతం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ హిట్ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కానుంది. ‘పితామగన్’ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ తీసుకున్నారు. కానీ సతీష్ యాక్టర్‌గా బిజీగా ఉండటంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ బాలా–విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సేతు’ సినిమాను ‘తేరే నామ్’ టైటిల్‌తో రీమేక్ చేశారు సతీష్. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. మరి.. ‘పితామగన్’ రీమేక్‌కి ఏ దర్శకుడిని ఎంపిక చేస్తారో, విక్రమ్–సూర్య పాత్రలకు ఏ హీరోలను ఎంపిక చేస్తారో చూడాలి. -
బాలా అవుట్.. గౌతమ్ ఇన్!
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ అవుట్‌పుట్ నచ్చలేదని సినిమాను మళ్లీ షూట్ చేస్తున్నాం అని నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్టైన్మెంట్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి తమిళ పరిశ్రమ షాక్ అయింది. హీరో ధృవ్ మినహా మిగతా టీమ్‌ను మార్చి రీషూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు సంస్థ అధినేతలు. దాంతో దర్శకుడు బాలా స్థానంలో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్‌ను గౌతమ్ మీనన్ చేపట్టనున్నారట. ప్రస్తుతం విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ చేసిన ‘ధృవనక్షత్రం’ రిలీజ్‌కి రెడీ అయింది. ఇప్పుడు ‘వర్మ’ సినిమా చేస్తే తండ్రీ–కొడుకులతో గౌతమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినట్లు అవుతుంది. -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ పూర్తయ్యింది..!
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగాని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా టాలీవుడ్లో ఎంతటి సంచలన సృష్టించిందో అందరికి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ రెడ్డి తరువాత ఘన విజయం సాధించటంతో అర్జున్ రెడ్డి రీమేక్ కోసం భారీ ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమా తమిళ రీమేక్‌తో విక్రమ్ తనయుడు ధ్రువ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాల దర్శకుడు. చెన్నై తో పాటు నేపాల్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాలు జరుపుకుంటున్న వర్మ టీం త్వరలో ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌కు సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తుండగా షాహిద్ కపూర్ గా హీరోగా నటించనున్నాడు. -
‘ఝాన్సీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఝాన్సీ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : జ్యోతిక, జీవి ప్రకాష్ కుమార్, ఇవానా, రాక్‌లైన్ వెంకటేష్ సంగీతం : ఇళయరాజా దర్శకత్వం : బాలా నిర్మాత : కోనేరు కల్పన శివపుత్రుడు, నేను దేవుణ్ని, వాడు వీడు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాలా. రియలిస్టిక్ టేకింగ్, డార్క్ ఎమోషన్స్‌తో సినిమాలను తెరకెక్కించే బాలా.. జ్యోతిక ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ్లో ఫిబ్రవరిలోనే రిలీజ్ అయిన నాచియార్ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో ఈ రోజు(శుక్రవారం) విడుదల చేశారు. మరి బాలా మార్క్ టేకింగ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? రఫ్ అండ్ టఫ్ పోలీస్ పాత్రలో జ్యోతిక ఏ మేరకు ఆకట్టుకున్నారు..? కథ ; మైనర్లయిన గాలి రాజు (జీవి ప్రకాష్ కుమార్), రాశి (ఇవానా) ప్రేమించుకుంటారు. రాశి గర్భవతి అవుతుంది. దీంతో గాలి రాజు మీద రేప్ కేసు నమోదు చేస్తారు. ఈ కేసును సిన్సియర్ ఆఫీసర్ ఝాన్సీ ( జ్యోతిక) డీల్ చేస్తుంది. రాశిని తన సంరక్షణలోనే ఉంచుకొని కేసు ఎంక్వయిరీ చేస్తుంటుంది. గాలిరాజును అరెస్ట్ చేసిన పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. రాశికి పుట్టిన పిల్లాడి డీఎన్ఏ, రాజు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవటంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు రాశి ఎవరి వల్ల గర్భవతి అయ్యింది..? ఈ కేసులో గాలి రాజు ఎలా ఇరుక్కున్నాడు..? కేసును ఝాన్సీ ఎలా సాల్వ్ చేసింది..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; ఇప్పటి వరకు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో కాస్త లైటర్‌వేలో తెరకెక్కిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. బాలా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్, రా నెస్ కాస్త తక్కువగానే కనిపిస్తాయి. పాత్రల ఎంపిక, నటీనటుల నుంచి తనకు కావాల్సినది రాబట్టంలో తనకు తిరుగులేదని బాలా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు తెరమీద కనిపించిన జ్యోతిక డిఫరెంట్ రోల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ గర్ల్గానే తెలిసిన జ్యోతికను రఫ్ అండ్ టఫ్ రోల్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. యువ నటుడు జీవి ప్రకాష్ తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. రాశి పాత్రతో వెండితెరకు పరిచయం అయిన ఇవాన నటన సూపర్బ్. ఇది ఆమెకు తొలి సినిమా అంటే నమ్మలేం. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమా నిడివి. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాను ఎక్కువగా సాగతీయకుండా ఒకటి రెండు సన్నివేశాల్లోనే అసలు కథ మొదలు పెట్టాడు బాలా. తొలి భాగంలో వచ్చే ఒకటి రెండు కామెడీ సీన్స్ తప్ప కథకు అవసరం లేని సన్నివేశాలు పెద్దగా కనిపించవు. ఇళయరాజా సంగీతం పరవాలేదనిపిస్తుంది. పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తెలుగు రిలీజ్ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలేవి తీసుకున్నట్టుగా అనిపించదు. తమిళ బోర్డులు, నేమ్ ప్లేట్లు తమిళ్లోనే కనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన కథా కథనం మైనస్ పాయింట్స్ ; తమిళ నేటివిటి డబ్బింగ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆగష్టు 17న వస్తున్న జ్యోతిక ‘ఝాన్సీ’
జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోలీవుడ్ మూవీ నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరుతో విడుదల కానుంది. కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్‌లు కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా ఆగస్టు 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంచలన దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళనాడు మంచి రెస్పాన్స్ వచ్చింది. జ్యోతిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం మందించగా యువ నటుడు జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు. -
ఝాన్సీగా జ్యోతిక
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బాల దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా నాచియార్. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తెలుగులో డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి జోత్యిక పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు వివాదాస్పదమైన జ్యోతిక పాత్రకు సినిమా రిలీజ్ తరువాత మంచి ప్రశంసలు దక్కాయి. యువ నటుడు జీవీ ప్రకాష్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించటం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్‌ను ఝాన్సీ పేరుతో విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత జ్యోతిక తెలుగు తెర మీద కనిపించనుండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
బాలా కొత్త చిత్రానికి రంగం సిద్ధం
తమిళ సినిమా: దర్శకుడు బాలా శైలి భిన్నంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేతు, నందా, పితామగన్ లాంటి చిత్రాలే అందుకు నిదర్శనాలు. నాన్‌కడవుల్, పరదేశీ, తారైతప్పట్టై వంటి చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. బాలా స్వీయ దర్శకత్వంలో చిత్రాలు నిర్మించడంతో పాటు ఇతర దర్శకులకు తన బ్యానర్లో అవకాశాలు ఇస్తుంటారు. కొద్ది కాలంగా విజయాలకు దురంగా ఉన్న ఈ సంచలన దర్శకుడు ‘నాచియార్’చిత్రంతో ప్రైమ్ టైమ్‌లోకి వచ్చారు. ఈ చిత్ర సక్సెస్‌కు చిత్ర పరిశ్రమ తోడవడంతో అర్ధ శతోత్సం దాటి ప్రదర్శితమవుతూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం బాలా నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘వర్మ’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్. ఈ విషయాన్ని పక్కన పెడితే బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లెన్స్ చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్‌కు అవకాశం ఇస్తున్నారు. లెన్స్ చిత్రం ఆంగ్లం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైంది. తమిళంలో లెన్స్ చిత్రాన్ని దర్శకుడు వెట్ట్రిమారన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి గానూ జయప్రకాశ్ రాధాకృష్ణన్ గత ఏడాది గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన తాజాగా ఒక మంచి కథను రెడీ చేశారట. దీన్ని దర్శకుడు బాలాకు వినిపించగా ఆయనకు బాగా నచ్చడంతో తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని మాట కూడా ఇచ్చారట. బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. -
‘అర్జున్ రెడ్డి’లా మారిపోయిన ధృవ్
గత ఏడాది సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కోలీవుడ్ ఈ సినిమాను విక్రమ్ తనయుడు ధృవ్ మీరోగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను విలక్షణ దర్శకుడు బాలా డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ లుక్ ను చాలా కాలం క్రితమే రిలీజ్ చేశారు. అయితే కథలోని క్యారెక్టర్‌కు తగ్గ లుక్ కోసం ధృవ్ ఆరు నెలలుగా కష్టపడుతున్నాడు. తాజాగా సినిమాకు తగ్గ మేకోవర్‌తో రెడీ అయిన ధృవ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. బాగా పెరిగిన గెడ్డం, మీసంతో ధృవ్ రఫ్ లుక్‌లో అదరగొడుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. Stargazing. #dhruvfinallyanatchathiram😋 A post shared by Vikram (@the_real_chiyaan) on Mar 3, 2018 at 11:55pm PST -
ఒక్క సినిమానే : విక్రమ్
దక్షిణాదిలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచతుడు, ఐ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ త్వరలో తన నటవారసుడిని తెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ధృవ్ ఎంట్రీపై మాట్లాడిన విక్రమ్, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధృవ్... అర్జున్ రెడ్డి రీమేక్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడట. ‘వర్మ’ సినిమా రిలీజ్ తరువాత ధృవ్ చదువు మీద దృష్టి పెట్టనున్నట్టుగా వెల్లడించాడు. తిరిగి ఉన్నత చదువులు పూర్తయిన తరువాతే ధృవ్ తదుపరి చిత్రం మొదలువుతుందని వెల్లడించాడు విక్రమ్. -
హీరోయిన్ జ్యోతికపై మరో పిటిషన్
తమిళసినిమా: నటి జ్యోతిక, దర్శకుడు బాలాపై మరో కేసు నమోదైంది. బాలా దర్శకత్వంలో నటి జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం నాచియార్. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై కలకలాన్ని రేకెత్తిస్తోంది. అందులో పోలీస్ అధికారిగా నటిస్తున్న జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లో కొందరు మహిళలను అసభ్య పదజాలతో దూషించిన సన్నివేశంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై మేటుపాలెంకు చెందిన డ్రైవర్ రాజన్ స్థానిక జ్యుడీషియల్ మ్యాజిస్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. తాజాగా సోమవారం కరూర్ నేర విభాగ కోర్టులో నటి జ్యోతిక, దర్శకుడు బాలాలపై మరోపిటిషన్ దాఖలైంది. దీన్ని ఇండియా కుడియరసు పార్టీ రాష్ట్ర నిర్వాహకుడు దళిత్ పాండియన్ దాఖలు చేశారు. అందులో నాచియార్ చిత్రంలో నటి జ్యోతిక చెప్పిన సంభాషణలు మహిళలను కించపరిచేవిగా, అసభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. కావున నటి జ్యోతిక, దర్శకుడు బాలాలపై భారతీయ శిక్షాసృతి చట్టం ప్రకారం 294(పీ), ఐటీ చట్టం2015 విభాగాల్లో కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు ఈ నెల 29న విచారణకు రానుంది. -
భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను తన కుంచె ద్వారా ఎత్తిచూపిన కార్టూనిస్టు బాలాను తమిళనాడు సర్కార్ అరెస్టు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఐజేయూ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారి బెదిరింపులు తాళలేక ఒక వ్యక్తి, భార్య, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తరునెల్వేలి కలెక్టరేట్ వద్ద నిప్పు అంటించుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై తమిళనాడు సీఎం, తిరునెల్వేలి కలెక్టర్, ఇతర పోలీసులపై బాలా వేసిన వ్యంగ్య కార్టూన్ ఫేస్బుక్లో వైరల్ అయింది. వైఫల్యాల్ని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కలెక్టర్ ఫిర్యాదు మేరకు బాలాపై కేసు పెట్టి జైలుపాలు చేయడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొన్నారు. -
తమిళ 'అర్జున్ రెడ్డి'కి జోడి ఎవరు..!
తెలుగులో సంచలన విజయం సాదించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను బాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవలే విక్రమ్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటులు ఎంపిక జరుగుతోంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర్ హాసన్ తో పాటు బాలనటిగా సత్తా చాటి ఇటీవల నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రియ శర్మల్లో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం జ్యోతిక, జీవి ప్రకాష్ కాంబినేషన్ లో రూపొందుతున్న నాచియార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలా, ఆ సినిమా రిలీజ్ తరువాత డిసెంబర్ నుంచి అర్జున్ రెడ్డి రీమేక్ పై దృష్టి పెట్టనున్నాడు. ఈ లోగా హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
బాలమురళి పేరిట సంగీత కళాశాల
శంకరగుప్తం గ్రామంలో ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం –‘మంగళంపల్లి’ 87వ జయంత్యుత్సవంలో ఆస్థానశిల్పి రాజకుమార్ ఉడయార్ రాజమహేంద్రవరం కల్చరల్ : సంగీత సామ్రాజ్య సార్వభౌమ, పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట ఆయన స్వగ్రామం శంకరగుప్తం గ్రామంలో సంగీత కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్రప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజకుమార్ వడయార్ ప్రకటించారు. గురువారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతసభ ఆధ్వర్యంలో విక్రమ్హాల్లో జరిగిన మంగళంపల్లి 87వ జయంత్యుత్సవ కార్యక్రమంలో ఆయన తాను రూపొందించిన బాలమురళి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలో గోదావరి గట్టుపై, ఏవీ అప్పారావు రోడ్డులోని శారదానగర్‌లో ఉన్న బాలమురళీకృష్ణ పార్కులో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తానన్నారు. సభకు అధ్యక్షత వహించిన భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ మహామనిషి బాలమురళి మన మధ్యలో లేకున్నా ఆయన స్వరం మన జీవితాలను పండిస్తూనే ఉంటుందన్నారు. పిల్లలకు బాలమురళి కీర్తనల పోటీలు నిర్వహించాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిత్యవిద్యార్థి డాక్టర్ కర్రిరామారెడ్డిని ‘పుంరూప శారద’ బిరుదుతో సంగీతసభ తరఫున డాక్టర్ టి.వి.నారాయణరావు సత్కరించారు. కర్రి రామారెడ్డి మాట్లాడుతూ ఎన్నో డిగ్రీలు తీసుకున్న తాను ఈ సారి సంగీతంలో సర్టిఫికెట్ కోర్సు చేస్తున్నానని వెల్లడించారు. కొన్ని శాస్త్రీయ రాగాలు వినడం వలన మధుమేహ లక్షణాలు తగుగ్తాయని, గర్భిణులు మంచి సంగీతాన్ని వింటే, పుట్టిన బిడ్డలకు మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందన్నారు. అనంతరం విజయనగరం సంగీత కళాశాల అధ్యాపకుడు బి.ఏ.నారాయణను ‘మురళీమనోజ్ఞ సంగీత రత్నాకర’ బిరుదుతో నిర్వాహకులు సత్కరించారు. బీఏ నారాయణ గాత్రకచేరీ శ్రోతలను అలరించింది. పాత్రికేయుడు వీఎస్ఎస్ కృష్ణకుమార్ స్వాగత వచనాలు పలికారు. సంగీతసభ వ్యవస్థాపకుడు సాగి శ్రీరామచంద్రమూర్తి, వి.శేషగిరి వరప్రసాద్, వాడ్రేవు మల్లపరాజు, సంగీతాభిమానులు తదితరులు హాజరయ్యారు. -
జ్యోతిక లీడ్ రోల్లో 'నాచియార్'
పెళ్లి తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన స్టార్ హీరోయిన్ జ్యోతిక, రీ ఎంట్రీలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. 36 వయోదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మగలిర్ మట్టుమ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతోంది ఈ సీనియర్ హీరోయిన్. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రియలిస్టిక్ సినిమాలను తెరకెక్కించే క్రియేటివ్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో జ్యోతిక ఓ సినిమా చేయనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో సూర్య విడుదల చేశాడు. నాచియార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జ్యోతికతో పాటు కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ కీలక పాత్రలో నటించనున్నాడు. బి స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ఇళయరాజ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Jo you're always blessed and deserve the best!! Can't be more happier to tweet First Look of Bala Anna's #Naachiaar #Jyotika #DirectorBala pic.twitter.com/1yk43mEqAR — Suriya Sivakumar (@Suriya_offl) 28 February 2017 -
బాల దర్శకత్వంలో జ్యోతిక..?
పెళ్లి తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన స్టార్ హీరోయిన్ జ్యోతిక, రీ ఎంట్రీలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. 36 వయోదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మగలిర్ మట్టుమ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల తరువాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన జ్యోతిక హీరోయిన్గా నటిస్తుందన్న వార్తలు వినిపించాయి. కానీ చివరి నిముషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా జ్యోతిక తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రియలిస్టిక్ సినిమాలను తెరకెక్కించే క్రియేటివ్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో జ్యోతిక నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జ్యోతిక లీడ్ రోల్లో నటించనుందట. బాల సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ పూర్తిగా డీగ్లామర్ లుక్‌లో కనిపిస్తుంటారు. మరి జ్యోతికను బాల ఎలా చూపిస్తాడో చూడాలి. -
సంబరాలు... సరదాలు... ఓ సమస్య
నిజ జీవిత కథలను వైవిధ్యంగా తెరకెక్కించగల ప్రతిభాశాలి తమిళ దర్శకుడు బాల. ఆయన నిర్మించిన ‘చండివీరన్’ తెలుగులో ‘కాళి’ పేరుతో విడుదల కానుంది. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్య పాత్రల్లో శర్కునమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ– ‘‘హృదయం’ అనే తెలుగు సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు మురళి. ఆయన తనయుడు అధర్వ ‘కాళి’లో హీరోగా నటించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. ‘‘నీటి కోసం రెండు ఊర్ల మధ్య జరిగిన పోరాటమే ఈ చిత్రకథ. సంక్రాంతి సంబరాలు, పల్లెటూరి సరసాలు, సరదాలన్నీ ఉన్నాయి. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ‘‘ఈ చిత్రంలో ‘ఎసేయ్ మావా...’ అనే పాట రాశా’’ అని డా. చల్లా భాగ్యలక్ష్మి అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: పి.జి.ముత్తయ్య, సంగీతం: ఎస్.ఎన్ .అరుణ గిరి, సమర్పణ: బాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు. -
గోదారి తీరం కన్నీటి రాగం
సంగీత సామ్రాజ్య సార్వభౌమ, పద్మవిభూషణ్, ఫ్రెంచ్ శెవాలియర్ అవార్డు గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ మృతితో సంగీతాభిమానులు శోకసాగరంలో మునిగిపోయారు. గోదారమ్మ ఒడిలో కనులు తెరిచిన బాలమురళి భారతీయ శాస్రీ్తయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సంగీత ప్రపంచ మేరునగ ధీరుడు. తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి స్థలం కేటాయింపునకు ఆయన విశేష కృషి చేశారు. నేటికీ ఆయన గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవాసమితి నిధికి శాశ్వత సభ్యుడు. 2003 పుష్కరాలలో ఆయన నగరానికి వచ్చి, అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2012లో శారదానగర్‌లోని ఒక పార్కుకు నగర పాలక సంస్థ ఆయన పేరుపెట్టింది. ఆ కార్యక్రమానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినా, నాటి మునిసిపల్ కమిషనర్‌కు ఫోను ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. – రాజమహేంద్రవరం కల్చరల్ సంగీత సభ ఏర్పాటు రాజమహేంద్రవరానికి చెందిన బాలమురళి వీరాభిమాని సాగి శ్రీరామచంద్రమూర్తి 1995లో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట సంగీత సభను నెలకొల్పారు. ఏటా ఆయన పుట్టిన రోజున సంగీత సభలు నిర్వహించడం, సంగీత కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన పుట్టిన రోజున గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయంలో బాలమురళి పేరిట పూజలు చేసి, ప్రసాదాన్ని ఆయనకు పంపేవారు. ఆయన మరణ వార్తవిని నగర ,ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏటా ఆయన పుట్టినరోజు నిర్వహిస్తున్నా డాక్టర్ బాలమురళీకృష్ణ సభ ఆధ్వర్యంలో 1995 నుంచి ఎందరో పెద్దల సహకారంతో క్రమం తప్పకుండా ఏటా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాను. నా మనుమడికి ఆయన పేరే పెట్టుకున్నాను. ఇక్కడ నిర్వహించే ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వస్తానని చెప్పారు. ఆ మంచి రోజు రాకుండానే ఆయన కన్నుమూయడం బాధాకరం. – సాగి శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ వ్యవస్థాపక కార్యదర్శి, రాజమహేంద్రవరం తొలి సంగీత కచేరీ కాకినాడలోనే.. కాకినాడ కల్చరల్ : ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాల మురళీకృష్ణకు కాకినాడ నగరంతో మంచి అనుబంధం ఉంది. బాలమురళి ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఆయన తొలి సంగీత కచేరీ సూర్యకళా మందిర్‌లోనే నిర్వహించారు. అభ్యుదయ ఫౌండేషన్ 5 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సూర్యకళా మందిర్‌లో 2013 జనవరి 13న నిర్వహించిన అభ్యుదయ సంప్రదాయ సాంస్కృతిక వైభవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంగీత కచేరీ నిర్వహించి సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధులను చేశారు. సూర్యకళా మందిరం శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని 2004 అక్టోబర్‌లో భవనాన్ని ఆధునికీకరించారు. ఈ భవనాన్ని బాలమురళీకృష్ణ ప్రారంభించారు. కాకినాడలోని సంగీత విద్వాంసులు మునిగంటి వెంకట్రావు, డాక్టర్ ఇ.వి.కృష్ణమాచార్యులు, పెద్దాడ సూర్యకుమారిలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. రాజమహేంద్రవరంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తా కొత్తపేట : ప్రముఖ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, నేపథ్య గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి తీరని లోటని ప్రముఖ శిల్పి, ఉభయ గోదావరి జిల్లాల సంగీత, వాయిద్య, నృత్య కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు డి.రాజ్‌కుమార్ వుడయార్ నివాళులర్పించారు. మంగళంపల్లి మృతి చెందారన్న వార్త తెలిసి రాజ్‌కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. వివిధ సందర్భాల్లో బాలమురళీకృష్ణతో మంచి పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి తాను రూపొందించిన పలు విగ్రహాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆవిష్కరించినప్పుడు ఆయన తనకు ఫోన్ చేసి అభినందించేవారన్నారు. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని తన వుడయార్ ఫై¯న్ ఆర్ట్స్ గ్యాలరీ వద్ద మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఉన్న పార్కులో ఆయన జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జూలై 6న మంగళంపల్లి విగ్రహాన్ని నెలకొల్పుతానని రాజ్‌కుమార్ తెలిపారు. – ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్ -
బాల దర్శకత్వంలో ఎన్టీఆర్..?
మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి హీరో.. అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా సినిమాలు తెరకెక్కించే ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడితో సినిమా చేసే ఎలా ఉంటుంది.? అలాంటి అరుదైన కాంబినేషన్ త్వరలోనే వెండితెర మీద సందడిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివపుత్రుడు, నేను దేవుణ్ని, వాడు వీడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన బాల, తెలుగులో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ చూసి షాక్ అయిన మోహన్ లాల్ బుడ్డోడి టాలెంట్ గురించి బాలతో చెప్పాడట. అయితే తాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్న ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ త్వరలోనే ఎన్టీఆర్ కు కథ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బాల చేసే ప్రయోగాలకు అంగీకరిస్తాడా..? టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న జూనియర్ ఒక్కసారిగా రూట్ మార్చి ప్రయోగం చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో..? మరి ఇలాంటి రిస్క్ ఈ సమయంలో ఎన్టీఆర్ చేస్తాడో.. లేదో..? చూడాలి -
వసుధైక స్ఫూర్తితో...
‘కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి..’ మాజీ రాష్ర్టపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలామ్ యువతకు చేసిన సూచన. బాల అనే యువకుడు ఆ మహానుభావుడు చెప్పినట్టే సాధించాడు. సినిమా అంటే అతడికో ఆసక్తి.. దర్శకుడు కావాలన్నది కోరిక. ఎంతలా అంటే.. డిగ్రీ అయిపోగానే ఇంటిని వదిలేసి హైదరాబాద్ వెళ్లగలిగినంత..! స్నేహితుల గదుల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం వెతుక్కుంటూ గడిపాడు. సీరియళ్లతో అదృష్టం పరీక్షించుకున్నాడు. నిరూపించుకున్నాక తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. తన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తీసిన ‘వసుధైక 1957’ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య పంచుకోవాలని భావించిన బాల సోమవారం వారితో కలిసి తెనాలి వచ్చారు. స్థానిక థియేటర్లో ఆ సినిమాను కలిసి తిలకించాడు. అనంతరం ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వీవీ వినాయక్‌పై అభిమానంతో.. కొల్లిపర మండలం తూములూరు మా ఊరు. తండ్రి జోజప్ప వ్యవసాయం. తల్లి మేరీ గృహిణి. అందరిలోకి చిన్నవాడిని. సినిమాలంటే చాలా చాలా ఇష్టం. ఇంటర్ చదివేటప్పుడే సినిమా దర్శకుడ్ని కావాలనుకున్నా. చదువుతోపాటు ఆ కోరిక పెరిగి డ్రీమ్‌లా మారిపోయింది. వీవీ వినాయక్ తీసిన ‘ఆది’ సినిమాతో ఆయన అభిమానినయ్యా. ఆయనలా దర్శకుడిని కావాలని ఫిక్సయ్యా. ఇంట్లో మాత్రం నేను చదువుకుని ఉద్యోగం చేయాలని ఆశపడ్డారు. తెనాలిలో డిగ్రీ పూర్తిచేయగానే నేరుగా హైదరాబాద్ వెళ్లా. అక్కడ స్నేహితులతో గడుపుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. ఏడాది తర్వాత ఫలితం ఏడాది కష్టపడ్డాక ఫలితం దక్కింది. ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ ‘మనసు చూడతరమా’ టీవీ సీరియల్‌కు దర్శకత్వ విభాగంలో అప్రెంటిస్‌గా కుదిరాను. మరో చానల్లో ‘అంతఃపురం’ సీరియల్‌కు సహదర్శకుడిగా వ్యవహరించాను. అలాగే, కొన్ని సినిమాలకు పనిచేస్తూ వచ్చాను. ఖాళీ సమయాల్లో నా ఆలోచనలతో సినిమా కథలు రాస్తూ, వాటికి స్క్రీన్‌ప్లే రూపొందిస్తుంటా. స్నేహితుడి ద్వారా నిడమలూరు శ్రీనివాసరావు పరిచయమయ్యారు. ఆయన నిర్మాతగా సినిమా తీయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను కలిసి కథ చెప్పగానే ఇంప్రెస్సయ్యారు. వసుధైక 1957 సినిమాతో ఇలా మీముందున్నా. సంతోషంగా ఉంది నేను దర్శకత్వం వహించిన సినిమా నా ఊళ్లో ఆత్మీయుల సమక్షంలో తిలకించడం ఆనందంగా ఉంది. ఒకప్పుడు నన్ను పట్టించుకోని మా ఊరివాళ్లు, ఇప్పుడు పరిశీలనగా చూస్తున్నారు. నేను సాధించానన్న భావన వారి కళ్లలో నాకు కనిపించింది. అదే నాకు సంతోషాన్ని ఇచ్చింది. దీన్ని కలకాలం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ప్రేక్షకులు మెచ్చే సినిమాలతో మంచి దర్శకుడిగా సినీ పరిశ్రమలో గుర్తింపు పొందాలనేది నా కోరిక. అది యదార్థ గాథ వసుధైక 1957 సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, రఘు, షాణి, సుభాష్, శ్రీలత కారుణి, పావని, బేబి యోధ నటించారు. 1957లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఐదేళ్ల పాప జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాసుకున్న కథ ఇది. ప్రేమకథతో తీస్తే పాపులారిటీ వస్తుంది. లో బడ్జెట్ సినిమా అయినందున తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతను హార్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చా. వసుధైక కుటుంబం అనే మాటలోంచి టైటిల్‌ను తీసుకున్నా. పాజిటివ్ టాక్ వచ్చింది. టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నా రెండో చిత్రం ప్రేమకథా చిత్రమే. త్వరలోనే ప్రకటిస్తా. -
అధర్వతో ఇద్దరు ముద్దుగుమ్మల రొమాన్స్
ఈ మధ్య ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పవచ్చు. అది కమర్షియల్ చిత్రం అయినా క్లాసికల్ చిత్రం అయినా, హారర్ చిత్రం అయినా, టైమ్ మిషన్ చిత్రం అయినా కావచ్చు. ఇప్పటి వరకూ సింగిల్ హీరోయిన్‌తో సరిపుచ్చుకుంటూ వచ్చిన యువ నటుడు అధర్వ తాజాగా ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుండడం విశేషం. దివంగత సీనియర్ నటుడు మురళి వారసుడిగా బానాకాత్తాడి చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అయిన అధర్వకు ఆ చిత్రం ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వకపోయినా వరుసగా అవకాశాలు రాబట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో బాలా దర్శకత్వంలో నటించిన పరదేశీ చిత్రం నటుడిగా అధర్వకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కాస్త వెనకబడినా ఇటీ వల ఈటీ, కణిదన్ చిత్రాలు ఆయనకు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం రుక్మిణి వండి వరుదు చిత్రాన్ని పూర్తి చేసిన అధర్వ తాజాగా చాలా మంది కథానాయకుల మాదిరిగానే సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చమ బోద ఆగదా అనే చిత్రాన్ని నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇద్దరు నాయికలు ఉండే ఇందులో ప్రముక నటీమణుల్ని నటింపజేయాలని మొదట భావించినా, బడ్జెట్ ఎగిరి కూర్చోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఉత్తరాది భామలు అనైక, మిష్టిలను ఎంపిక చేశారు. వీరిలో అనైక దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం సత్య-2 ద్వారా పరిచయం అయ్యిందన్నది గమనార్హం. తమిళంలోనూ వసంతబాలన్ దర్శకత్వం వహించిన కావయతలైవన్ చిత్రంలో నటించింది.ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించకుండా పోయిన అనైక ఇప్పుడు అధర్వ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుందన్న మాట. మరో హీరోయిన్ మిష్టి హిందీలో సుభాష్‌ఘాయ్ దర్శకత్వం వహించిన కాంచీ చిత్రం ద్వారా పరిచయమైంది.అయితే తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం అవుతుంది. ఇకపోతే అధర్వ తొలి చిత్రం బానాకాత్తాడి చిత్రానికి దర్శకత్వం వహించిన బద్రి ఈ చమ బోద ఆగదా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది కమర్షియల్ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో అధర్వకు జంటగా మిష్టి నటిస్తుండగా ఎవరూ నటించడానికి సాహసించని ఒక బోల్డ్ పాత్రలో అనైక నటిస్తోందని తెలిపారు. ఆ పాత్రకు సంబంధించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదన్నారు.అయితే ఇద్దరు హీరోయిన్లకు చిత్రంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. -
బిజీ బిజీగా బల్లాలదేవ
సౌత్ నార్త్ అన్నతేడా లేకుండా వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు యంగ్ హీరో రానా. ఇప్పటికే రానా ప్రధాన పాత్రలో నటించిన బెంగళూర్ నాట్కల్ తమిళనాట మంచి విజయం సాధించగా, ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న సబ్ మెరైన్ వార్ ఫిలిం ఘాజీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజమౌళి భారీ చిత్రం బాహుబలి 2లోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు.ఇలా మూడు సినిమాలతో సందడి చేస్తున్న రానా చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. జాతీయ అవార్డులు సాధించిన క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా రానాతో సినిమా తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా హీరో, విలన్ అన్న తేడా లేకుండా ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పటం రానాకు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడు బాల, రానా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. మరో జాతీయ అవార్డ్ దర్శకుడు పరుత్తి వీరన్ ఫేం అమీర్ కూడా రానా హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు బల్లాలదేవ. -
సౌత్‌లోకి బాలీవుడ్ నటి రీఎంట్రీ!
చెన్నై: నిన్నటితరం బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలాకు దక్షిణాది సినీ పరిశ్రమతో మంచి అనుబంధముంది. 'కిమినల్', 'భారతీయుడు', 'బొంబాయి' సినిమాలతో దక్షిణాదిలోనూ మనీష పేరు తెచ్చుకోంది. ఇప్పుడు మరోసారి దక్షిణాది సినిమాలో నటించేందుకు ఆమె సిద్ధమవుతోంది. జాతీయ అవార్డు సాధించిన ప్రఖ్యాత దర్శకుడు బాలా తమిళంలో తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్లో మనీషా కోయిరాలా కూడా నటించనుంది. ఇప్పటికీ పేరు ఖరారుకాని ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది. చిత్రంలో విశాల్, ఆధ్వర్వ, ఆర్య, అరవింద స్వామి, మనీషా ప్రధాన పాత్రల్లో నటించనున్నారని, మరో కీలక పాత్ర కోసం అనుష్కను అడుగుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు 'కుట్ర పరంపరై' టైటిల్ ఖరారు చేస్తారని వినిపిస్తోంది. బాలా సొంత బ్యానర్ బీ స్టూడియోపై స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించవచ్చునని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా.. బాలా తాజా సినిమా 'థరై థప్పట్టై' విడుదల ఆలస్యంగా కారణంగా ఈ ప్రాజెక్టు లో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, బాలా తాజా సినిమా 'థరై థప్పటై' గురువారం ప్రపంచమంతటా విడుదల కానుంది. -
బాల డైరెక్షన్లో విక్రమ్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు విక్రమ్. ప్రస్తుతం కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిన విక్రమ్, త్వరలో మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తనకు నటుడిగా ప్రూవ్ చేసుకునే చిత్రాలను అందించిన క్రియేటివ్ డైరెక్టర్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్టార్ హీరోగా ఎదిగిన తరువాత కూడా ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న విక్రమ్ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. శంకర్ దర్శకత్వలో భారీగా తెరకెక్కిన 'ఐ' నిరాశపరచటంతో పాటు ఇటీవల విడుదలైన ట్రావెల్ డ్రామా 'టెన్ ఎన్నాదుకుల్లా' కూడా ఆశించిన స్ధాయి ఫలితం ఇవ్వలేదు. దీంతో మరోసారి తన కెరీర్‌ను మలుపు తిప్పిన బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు విక్రమ్. కెరీర్ స్టార్టింగ్‌లో విక్రమ్‌కి 'సేతు', 'పితామగన్' లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలను అందించిన బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విక్రమ్. ప్రస్తుతం అరిమనంభి ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విక్రమ్ ఆ సినిమా పూర్తవ్వగానే బాల సినిమాలో నటించనున్నాడు. బాల కూడా ప్రస్తుతం 'తారై తప్పటై' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే విక్రమ్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుంది. -
సోలో హీరోగా అరవింద్‌స్వామి
తనీ ఒరువన్ సినిమాతో విలన్‌గా మెప్పించిన అరవింద్ స్వామి ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి, ప్రస్తుతం విలన్‌గా కెరీర్ ఎంజాయ్ చేస్తున్న అరవింద్ స్వామి మరోసారి సోలో లీడ్‌గా కనిపించనున్నాడు. కోలీవుడ్ లో రియలిస్టిక్ దర్శకుడిగా పేరున్న బాల దర్శకత్వంలో అరవింద్ స్వామి ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం శశికుమార్, వరలక్ష్మీల కాంబినేషన్లో 'తారై తప్పట్టై' సినిమా చేస్తున్న బాల, ఈ సినిమా పూర్తయిన తరువాత అరవింద్ స్వామి లీడ్ రోల్లో సినిమా కోసం వర్క్ చేయనున్నాడు. సాఫ్ట్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించే అరవింద్ స్వామి, బాల లాంటి దర్శకుడితో కలిసి పనిచేయగలడా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా అరవింద్ స్వామి, బాలల కాంబినేషన్లో సినిమా దాదాపుగా కన్ఫామ్ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
ఒక్క రోజు కథ
ఒక్క రోజులో జరిగే కథ ఇతివృత్తంగా రింగారం అనే చిత్రం తెరకెక్కుతోంది. జె.స్టూడియో ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో బాలా హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్గా కంగారు చిత్రం ఫేమ్ ప్రియాంక నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలో కళాభవన్ మణి, ఆడుగళం వి.ఎస్.ఐ జయబాలన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు శివకార్తిక్ పరిచయం అవుతున్నారు. ఈయన కె.బాలచందర్, ఆయన శిష్యుడు సి.జె.భాస్కర్, సముద్రకనిల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. రింగారం చిత్ర వివాదాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథా చిత్రం అని తెలిపారు. ఒక్క రోజులో జరిగే సంఘటనల సమాహారమే చిత్రం అని పేర్కొన్నారు. ఒకరి వల్ల మరొకరు ఎదుర్కొనే ప్రతిఘటన కారణంగా ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందన్నది ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు చెప్పారు. ఒక షాపింగ్ మాల్లో పని చేసే హీరోయిన్ మంచి వ్యక్తిత్వం గల హీరోపై మనసు పారేసుకుంటుంది. ఆమె తడ్రి క్వారీ యజమాని పూర్తిగా స్వార్థపరుడు. తనకు మంచి జరుగుతుందంటే ఇతరుల గురించి ఏ మాత్రం ఆలోచించని మనస్తత్వం గల వ్యక్తి. నాలుగో వ్యక్తి సైనికుడు. ఇతన్ని దారిద్య్రం వెంటాడుతున్నా చేతిలో తుపాకీని వదలడు. ఈ నలుగురి చుట్టూ తిరిగే కథే రింగారం అని దర్శకుడు వివరించారు. అలీ మిర్జా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఇలియానా హారిష్ చాయాగ్రహణం నెరపుతున్నారు. -
శ్రీయ అవుట్ వరలక్ష్మి ఇన్
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అన్న మహాకవి రాసిన పాటలోని పల్లవిని గుర్తు చేసుకునేలా చేస్తున్నారు దర్శకుడు బాల. ఈ జాతీయ ఉత్తమ నటుడు పరదేశి చిత్రం తరువాత తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో శశికుమార్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ పాత్రకే నటీమణుల్లో ఆశలు రేకెత్తించి నిరాశ పరుస్తున్నారు. వైవిధ్యంతో కూడిన కథలను తెరకెక్కించే బాలా ఈసారి గరగాట్టాన్ని నేపథ్యంగా ఎంచుకుని చిత్రాన్ని రూపొందించనున్నారు. దీంతో గరగాట్ట నృత్యం బాగా ఆడే హీరోయిన్ బాలాకు అవసరం అయ్యారు. దీంతో నృత్యంలో ప్రావీణ్యం ఉన్న నటి శ్రీయను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా శ్రీయను కాదని ఆ పాత్రలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారని తెలిసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కల్సా నృత్యంలో శిక్షణ పొంది పలు నృత్య రూపకాలను ఆడారన్నది గమనార్హం. పోడాపొడి చిత్రం నిరాశ పరచడం, రెండవ చిత్రం మదగజరాజా చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కాకపోవడంతో అలిగి కన్నడ చిత్ర పరిశ్రమ వైపు పరిగెత్తిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు బాలా అవకాశం ఇవ్వడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందట. ఈ చిత్రం కోసం ఇళయరాజా ఆరు రోజుల్లో 12 పాటలను సిద్ధం చేశారు. ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం. -
బాలా దర్శకత్వంలో?
తమన్నా అందగత్తె మాత్రమే కాదు. మంచి నటి కూడా. అయితే, నటిగా నిరూపించుకోదగ్గ గొప్ప సినిమాలేవీ... ఈ పాలరాతి బొమ్మను వరించకపోవడం బాధాకరం. ఎట్టకేలకు నటిగా సత్తా చాటడానికి తమన్నాకు ఓ గొప్ప అవకాశం చిక్కింది. బాలా దర్శకత్వంలో ఈ మిల్కీ బ్యూటీ నటించనుందని తెలిసింది. గ్లామర్ హీరోయిన్లను సైతం డీగ్లామరైజ్డ్గా చూపించడం బాలా స్టైల్. అందంతో ప్రమేయం లేకుండా కేవలం అభినయానికే పెద్ద పీట వేయడం బాలా మార్క్. మరి ఇప్పటివరకూ అందాలతారగా వెలిగిన తమన్నాను బాలా ఎలా చూపిస్తారో, ఆమె నుంచి ఏ స్థాయి నటనను రాబడతారో ప్రత్యేకించి చెప్పాలా! విశాల్ ఇందులో కథానాయకునిగా నటిస్తాడని సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా బాలా దర్శకత్వంలో నటించనున్నట్లు విశాల్ చెప్పారు. సేతు, శివపుత్రుడు, నేను దేవుణ్ణి, వాడు-వీడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన దర్శకునిగా మారిన బాలాతో పనిచేసే అవకాశం తమన్నాకు రావడమే నిజమైతే... తను నిజంగా లక్కీనే.