
తనయుడు ధృవ్‌తో విక్రమ్
దక్షిణాదిలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచతుడు, ఐ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ త్వరలో తన నటవారసుడిని తెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాల దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ధృవ్ ఎంట్రీపై మాట్లాడిన విక్రమ్, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధృవ్... అర్జున్ రెడ్డి రీమేక్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడట. ‘వర్మ’ సినిమా రిలీజ్ తరువాత ధృవ్ చదువు మీద దృష్టి పెట్టనున్నట్టుగా వెల్లడించాడు. తిరిగి ఉన్నత చదువులు పూర్తయిన తరువాతే ధృవ్ తదుపరి చిత్రం మొదలువుతుందని వెల్లడించాడు విక్రమ్.
Comments
Please login to add a commentAdd a comment