varma
-
లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి: పిఠాపురం వర్మ
సాక్షి,కాకినాడజిల్లా: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు వర్మ ఆదివారం(జనవరి 19) మీడియాతో మాట్లాడారు.‘నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది. పార్టీ పూర్తిగా పోయిందని,టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువ గళంతో సమాధానం చెప్పారు.ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి.లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు.అలాంటిది పార్టీని బలోపేతం చేసి, టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి?కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్‌ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా.ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.టీడీపీ కార్యకర్తల మనసులో మాట.ఏదేమైనా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం’అని వర్మ అన్నారు. కాగా, లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు.మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. ఈ నేతల జాబితాలో పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరడం పొటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన మధ్య సంబంధాలపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
పవన్ కల్యాణ్ Vs పవన్ కల్యాణ్.. పిఠాపురంలో విచిత్ర పరిస్థితి
పనివాడు పందిరి వేస్తె పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బుగ్గైపోతోంది. గతంలో జగన్‌ను సీఎం కానివ్వను.. ఇది శాసనం.. అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కట్ చేస్తే గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు. ఇటు జగన్ రాజాలాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడారు. హే జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తా అన్నారు... డైలాగ్ ఐతే ఎవరో రాసింది సులువుగా చెప్పేశారు కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొక్కడం సంగతి అటుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట సంకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా డిసైడైన పవన్ భూతవైద్యులు, కోయదొరలను, ఎరుకలసాని, గవ్వలు రాళ్లతో భవిష్యత్ చెప్పేవాళ్ళు, కొండదొరలను సైతం సంప్రదించి..చంద్రబాబు సలహాతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేచోట పిఠాపురంలో పోటీ చేయాలనీ డిసైడయ్యారు. ఎంసెట్‌లో రెండుసార్లు మూడేసి లక్షల ర్యాంకులతో కుదేలైపోయి ఏందీ.. ఈసారీ ఎంసెట్ రాలేదా.. అదేంటి.. బాగా చదవాలమ్మా అని చుట్టాలు ఇచ్చే బోడి సలహాలతో విసిగిపోయి...సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడిమాదిరి పరువుపోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈపాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్షా అనాలన్న కసిమీద ఉన్నారు. అందుకే పిఠాపురంలో గెలుపుకోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్లి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. నా గెలుపు నీ చేతిలో ఉందంటూ పవన్ మోకరిల్లారు.. సరే వర్మ పని చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్లేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు.. ఆయనకూడా అచ్చం ఈయన మాదిరిగానే మెడ మీద చెయ్యివేసి రుద్దుకుంటూ... సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూహ..హ..అంటుంటే ఎవుడ్రా నువ్వూ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నించారట.. ఏయ్ నేను పవన్ కళ్యాణ్.. ఎస్..నేనే పవన్ కళ్యాణ్ అంటున్నారాయన..ఇంతకూ ఎవరా అని చూస్తే అయన నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అని, అయన పేరుకూడా కె. పవన్ కళ్యాణ్ అని, తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని అయన అంటున్నారు. ఆ బకెట్ గుర్తు చూడడానికి గాజు గ్లాసు గుర్తు మాదిరిగానే ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటపుడు గందరగోళానికి గురై గాజు గ్లాసును బదులుగా ఈ బకెట్ గుర్తుమీద నొక్కేస్తే ఎలా అని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓ రెండు మూడు వేల ఓట్లు ఆ బకెట్ గుర్తు పాలైనా తనకు ఓటమి తప్పదని జనసేనాని టెన్షన్ పడుతున్నారు. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు. -సిమ్మాదిరప్పన్న. -
AP: కన్ఫ్యూజన్లో పవన్.. ‘వర్మ’పైనే భారం !
సాక్షి, కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి బీజేపీ నేతలతో తిట్లు తిన్న పవన్ కల్యాణ్‌కు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ శ్రేణులు కలిసి రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్ధుల నియోజక వర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తన సొంత నియోజక వర్గంపైనే దృష్టి సారించారు. తాను ఎమ్మెల్యే అవ్వడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి పిఠాపురంలో నా గెలుపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నా అంటూ టీడీపీ నేతను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించడం పై ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ ఏం చేస్తున్నారు..? పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిరుగుతున్నారు. ఎలాగో ఒకలా ఈ ఎన్నికల్లో అయినా తనని ఎమ్మెల్యేని చేయమని అడుగుతున్నారు. ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టింది లగాయితు పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ అభ్యర్ధులు పోటీ చేస్తోన్న మిగతా 20 నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేయాలి. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ అభ్యర్ధుల నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేసి పెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఒక వైపే చూస్తున్నారు. రెండో వైపు చూడ్డానికి భయపడుతున్నారు. కాపుల ఓట్లే కారణమా.. పిఠాపురం సీటును ఆయన ఎంచుకోడానికి కారణం ఆ నియోజక వర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండడమే. కులాలు లేవు మతాలు లేవు..నేను విశ్వమానవున్ని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తమ కులం ఓట్లకోసమే పిఠాపురం ఎంచుకున్నారని టీడీపీ సీనియర్లే అంటున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఎవరూ కదలి రావడం లేదు. పిఠాపురం లో టీడీపీ రెబల్ వర్మను చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన అయిష్టంగా పవన్ కు మద్దతుగా ఉంటానని అన్నారు. అయితే మాటలు చెప్పినంత జోరుగా వర్మ ప్రచారంలో పాల్గొనడం లేదు. దూసుకుపోతున్న వంగా గీత.. పిఠాపురం నియోజకవర్గంలో పాలకపక్ష అభ్యర్ధి వంగాగీత దూసుకుపోతున్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల్లోనూ మంచి పేరు ఉండడమే కాకుండా అన్ని వర్గాలూ ఆమెకు అండగా ఉన్నాయి. వాటిని మించి ప్రభుత్వం అయిదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు..అభివృద్ధి ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందాయి. అవే తనని గెలిపిస్తాయని గీత ధీమాగా ఉన్నారు. ఓటమిని ఒప్పుకున్నట్లే.. పిఠాపురం గెలుపు భారం వర్మపై వేసిన పవన్ ఓటమిని ఆయన ముందుగానే ఒప్పుకున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి.. ఆ పార్టీ తరపున మిగతా అభ్యర్ధుల నియోజక వర్గాలు పట్టించుకోకుండా కేవలం తన సొంత నియోజక వర్గానికే పరిమితం అయిన పవన్ కల్యాణ్ కనీసం తనని తాను గెలిపించుకునే పరిస్థితిలో లేనందునే వర్మలాంటి ఊత కర్రలకోసం వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా..? -
వర్మ పేకాట క్లబ్లో పార్ట్నర్ అవుతావా పవన్?
-
రీల్ వర్సెస్ రియల్‌లో... పవన్ గందరగోళం!
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురంలో నిజంగానే రిస్కులో పడ్డట్టే ఉన్నారు. ఆయన వ్యక్తం చేస్తున్న భావాలు కాని, పిఠాపురంలో తెలుగుదేశం నేత వర్మ చేస్తున్న ప్రకటనలు కాని గమనిస్తే ఆ నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్‌కు తలనొప్పి తప్పదేమోనన్న అనుమానం వస్తోంది. ఇది ఆయన చేజేతులా చేసుకున్నట్లే అనిపిస్తుంది. తను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్న వైనమే ఆయనను గందరగోళంలోకి నెడుతోంది. నటనలో ఆయనకు మంచిపేరే ఉండవచ్చు. రాజకీయాలలో ఆయన ఇంకా ఓనమాలు నేర్చుకోలేదనిపిస్తుంది. పేరుకు పదిహేనేళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నట్లు కనిపిస్తున్నా, ఆయనకు అలవాటైంది.. ఎవరో ఒకరికి భజన చేయడం, లేదా ఎవరో ఒకరిని నోటికి వచ్చినట్లు దూషించడం తప్ప ఒక ప్రణాళికబద్దంగా రాజకీయం నడపడం ఆయనకు చేతకాదని పదే-పదే రుజువు చేసుకుంటున్నారు. తాను పిఠాపురంలో పోటీ చేయదలచినప్పుడు స్థానికంగా అక్కడ ఉండే తన పార్టీ నేతలతో, అలాగే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం నేతలతోను సత్సంబంధాలు పెట్టుకుని సంప్రదింపులు జరిపి ఉండాలి. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా పర్యటనలు చేయడం, స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవడం చేయాలి. అదేమి చేయలేదు.. అసలు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా, కేవలం ఒక సామాజికవర్గం వారు అధికంగా ఉన్నారన్న భావనతో, తాను అక్కడికి వెళ్లగానే అంతా ఎగబడతారని ఆయన అనుకుని ఉండాలి. పవన్ తనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించుకోగానే పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అనుచరులు రచ్చ-రచ్చ చేసి ఆయన గాలి తీసేశారు. చంద్రబాబును, పవన్‌ను కలిపి బండబూతులు తిట్టారు. తదుపరి రెండు రోజులకు వర్మను చంద్రబాబు నాయుడు పిలిచి ఏదో సర్దిచెప్పి పంపించారు. దాంతో అంతా చల్లారిందనుకుంటే, మరో వివాదం తెచ్చిపెట్టుకున్నారు. తాను పార్లమెంటుకు వెళితే పిఠాపురం సీటును జనసేన స్థానిక నేత ఉదయ్ శ్రీనివాస్‌కు ఇస్తానని, అసెంబ్లీకే వెళితే ఉదయ్ లోక్ సభకు పోటీ చేస్తారని అన్నారు. ఇక్కడే వర్మకు మళ్లీ మండింది. పవన్‌కల్యాణ్ లోక్ సభకు పోటీచేస్తే పిఠాపురం సీటు తనకే ఇస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన వెల్లడించారు. పవన్ అయినా చంద్రబాబు చెప్పినట్లు వినాల్సిందేనని అన్నారు.. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారనే కదా! ఒకసారి పిఠాపురం జనసేనకు కేటాయించాక మళ్లీ వర్మకు ఆశ చూపించడం ఏమిటి? పైకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి, అంతర్గతంగా పవన్ అక్కడ ఉండడులే అన్న సంకేతం ఇవ్వడం ఏమిటి? పవన్ చేసిన మరో తప్పిదం ఏమిటి? టీడీపీతో పొత్తు పదేళ్లు ఉంటుందని ప్రకటించడం. అంటే దీనిని బట్టి పొత్తులో ఉన్న సీట్లలో రెండో పార్టీకి, ఇప్పుడే కాకుండా వచ్చేఉపదేళ్లలో జరిగే రెండు ఎన్నికలు కూడా అవకాశం ఉండదన్నమాటే కదా! ఉదాహరణకు పిఠాపురం సీటును తీసుకోండి. పవన్‌కల్యాణ్ లేదా ఉదయ్ ఇక్కడ నుంచి ఈసారి పోటీచేస్తారనుకుందాం. పవన్ చెప్పినదాని ప్రకారం 2029, 2034 లలో కూడా అదే ప్రకారం జనసేనే తీసుకుంటుందని కదా? అప్పుడు వర్మ వంటి నేతల పరిస్థితి ఏమిటి? రాజకీయంగా అవకాశాలు ఉండవనే కదా? ఆయన అనుచరులు ఇందుకు అంగీకరిస్తారా? ఇప్పుడే పవన్ లేదా, జనసేన అభ్యర్ధి ఎవరైతే వారిని ఓడిస్తే వచ్చే ఎన్నికలకు తమకు ఇబ్బంది ఉండదని అనుకోరా! అసలు ఐదేళ్ల తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎవరైనా చెబుతారా? ఆ మాటకు వస్తే 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్‌కల్యాణ్ 2019లో ఆ రెండిటికి దూరం అయి బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీచేశారు కదా. అది చంద్రబాబుకు ఉపయోగపడాలన్న లక్ష్యమే కావచ్చు. కాని అధికారికంగా అయితే పొత్తు లేదు కదా! మళ్లీ 2024కి టీడీపీ, బీజేపీలతో అవగాహన పెట్టుకున్నారు. ఈ పరిస్థితిలో వచ్చే పదేళ్లు తాను పిఠాపురంలోనే ఉంటానని చెబితే వేరే పార్టీవారు అంగీకరిస్తారా? ఈ మాత్రం ఆలోచన పవన్‌కు లేకపోయింది. మరో సంగతి చూద్దాం... తనకు లక్ష మెజార్టీ వస్తుందని ఒకసారి అంటారు. తనను ఓడించడానికి ఇంటికి లక్ష ఇవ్వబోతున్నారని మరోసారి అంటారు. వైసీపీ అభ్యర్ధి 2009లో ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాలలోకి వచ్చారని, అందువల్ల ఆమె జనసేనలో చేరాలని ఆయన అన్నారు. ఇది ఎంత తెలివితక్కువతనం. నిజానికి వంగా గీత 1994 నుంచి టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ పక్షాన తూర్పుగోదావరి జడ్పి చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారు. తదుపరి ఆమె ప్రజారాజ్యంలో చేరి పిఠాపురంలో పోటీ చేసి గెలిచారు. ఈ చరిత్ర తెలుసుకోకుండానే ఆయన మాట్లాడేసరికి వంగా గీత ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పవన్‌ను వైసీపీలోకి రమ్మంటే బాగుంటుందా? అన్న ప్రశ్న వేశారు. తాను గెలవడం ఖాయమని, మెజార్టీ ఎంతన్నదే ప్రశ్న అని ఆమె అన్నారు. పవన్‌కు తన గెలుపుపై ఏదో భయం రాబట్టే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని తన పార్టీలోకి రావాలని బతిమలాడుతున్నట్లు మాట్లాడారు. నిజంగా గెలుపు ధైర్యం ఉంటే ఎవరినైనా ఎదుర్కుంటానని చెప్పాలి. పైగా ఎంపీగా పోటీ చేయాలని అమిత్-షా చెబితే అలాగే చేస్తారట. అంటే పిఠాపురంలో పోటీలో ఉంటానో, లేదో అని సస్పెన్స్‌లో పెట్టినట్లే కదా! ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా? నిజానికి తన పార్టీలో ఎవరు ఎక్కడ పోటీచేయాలో వేరే పార్టీవారు చెప్పడం ఏమిటి? అసెంబ్లీ టిక్కెట్లు ఏమో చంద్రబాబు సలహా మేరకు ఇస్తారా? ఎంపీ సీట్లు అమిత్-షా సూచన ప్రకారం చేస్తారా? జనసేనకు సొంత ఆలోచన ఉండదా? టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారికి జనసేన టిక్కట్లు ఇస్తుంటే అసలు పార్టీ నేతలు నెత్తి, నోరు మొత్తుకుంటున్నారు. పిఠాపురంలోనే ఉంటానని ఇప్పుడు చెబుతున్నారు. దానిని ఎలా నమ్మాలి? ఆయన సినిమా షూటింగ్‌లు మానుకుని పిఠాపురంలో ఉంటానని చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? అసలు ఐదేళ్లుగా తాను మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నప్పుడు ఒక నియోజకవర్గం ఎంపిక చేసుకుని అక్కడ కేంద్రీకరించి తగు ఏర్పాట్లు చేసుకోవాలి కదా! అదేమి చేయలేదు. ఇప్పుడు సడన్‌గా వచ్చి ప్రజలంతా తన వెంట ఉండాలని అంటే, ప్రత్యేకించి ఒక కులం వారంతా తనకు మద్దతు ఇవ్వాలంటే ఇవ్వడానికి వాళ్లేమేనా పిచ్చోళ్లా? నిజమే. కొంతకాలం క్రితం వరకు ఆ వర్గంలో పవన్‌పై ఒక ఆశ ఉండేది. ఈయన తమకు ఇష్టం లేకపోయినా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఒక అరవై సీట్లు తెచ్చుకుని, సీఎం సీటులో వాటా కోరతారు అనుకుంటే, పూర్తిగా దిగజారిపోయి జనసేనను చంద్రబాబు కాళ్లదగ్గర పడేశారే అన్న బాధ వారిలో ఏర్పడింది. దాంతో ఆ వర్గంలో కూడా పవన్ పట్లవిముఖత ఏర్పడింది. ఇరవైనాలుగు సీట్లకు ఒప్పుకుని, తర్వాత దానిని 21 సీట్లకు తగ్గించడం, తనను ఎవరూప్రశ్నించరాదని అనడం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలుస్తానని చెప్పి కలవకుండా అవమానించడం వంటి ఘట్టాలతో ఈయనపై పూర్తిగా అపనమ్మకం ఏర్పడింది. గతంలో కాపు ఉద్యమం జరిగితే కనీసం ఇటువైపు తొంగిచూడని పవన్‌కల్యాణ్ ఇప్పుడు తమను ఏమి ఉద్దరిస్తారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే పవన్‌కల్యాణ్ భయపడుతున్నట్లుగా అర్ధం అవుతుంది. పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి వైసీపీ నేతలు మొహరిస్తున్నారని వాపోతున్నారు. ఇందులో తప్పేమి ఉంటుంది. ప్రత్యర్ది పార్టీవారిని ఓడించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. ఆయన కూడా రాష్ట్రం అంతా తిరిగి వైసీపీని పాతాళానికి తొక్కేస్తా అంటూ ఎలా చెప్పారు? అంటే రాజకీయంగా కనీస అవగాహన లేకుండా పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్నారని తేలిపోతుంది. పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి కానప్పుడు తాము ఎందుకు ఆయనకు మద్దతు ఇవ్వాలని పిఠాపురం ప్రజలలో ఆలోచన వచ్చింది. అలాగే టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు మరింత గందరగోళంలోకి నెట్టాయి. ఈ నేపధ్యంలో పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేస్తారా? లేదా? అన్నది మళ్లీ అనుమానంగా మారింది. దానికి కారణం ఎక్కడ పోటీచేసినా గెలుస్తానో, లేదో అన్న సందేహం వపన్‌ను వెంటాడుతుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
కొలికపూడి తలెక్కడ దాచుకున్నాడు: వర్మ
సాక్షి,హైదరాబాద్: తల నరుకుతా అన్నవాడు.. తల ఎక్కడ దాచుకున్నాడు? అని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రశ్నించారు. తన తల నరికి తెస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాసరావుపై రెండు రోజుల క్రితం ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ డీజీపికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొలికిపూడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కొలికిపూడిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కొలికిపూడి ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. కొలికపూడి ఇంట్లో లేకపోవడంతో అయన ఇంటి దగ్గరే పోలీసులు ఎదురు చూస్తున్నారు.కేసు గురించి కొలికపూడి భార్యకు సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. వ్యూహం సినిమా విషయంలో కొలికిపూడి వర్మపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇదీచదవండి..జగన్ పదునైన ప్రశ్నలు -
నాకు అమ్మ ప్రేమ బోర్ కొట్టింది..
-
వైరల్ అవుతున్న విజయ్ వర్మ పెళ్లి నాటి ఫోటో!
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో విజయ్ వర్మ పేరు ఎక్కడికెళ్లినా వినిపిస్తోంది. తను నటించిన దహాద్, డార్లింగ్స్, మీర్జాపూర్, గల్లీబాయ్, లస్ట్ స్టోరీస్-2 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తమన్నాతోనే అతనికి మరింత గుర్తింపు దక్కింది. తాజాగా విజయ్ వర్మని ఇష్టపడుతున్నట్లు తమన్నా ఓపెన్ అయింది. దీంతో అతను మరింత పాపులర్ అయ్యాడు. విజయ్ ఏ ఇంట్లో ఉంటాడో అనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. సినీ పరిశ్రమలో స్థిరపడిన అతనికి ఇప్పటికీ ముంబయిలో సొంత ఇల్లు లేదు. ప్రస్తుతం అక్కడ సముద్రానికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలలో, అతను వివిధ కారణాల వల్ల 14 అద్దె ఇళ్లకు మారాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని అతని ఇంట్లో ఒక మీడియా ప్రతినిధితో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) అలియా భట్‌తో విజయ్ వర్మ పెళ్లి ఫోటో స్టోరీ ఇదే విజయ్ వర్మ ఇంటి హాలులో కొన్ని ఫోటో ఫ్రేమ్‌లు ఉన్నాయి. వాటిలో ఒక ఫోటో ఆసక్తగా కనిపిస్తోంది. అదేమిటంటే, స్టార్ హీరోయిన్ అలియా భట్, విజయ్ వర్మ కలిసి ఒకే ఫోటోలో ఉన్నారు. అది కూడా పెళ్లి బట్టలతో.. ఇదేమిటని ప్రశ్నించగా.. 'ఇది డార్లింగ్ సినిమా కోసం ఫోటోషాప్ చేసిన ఫోటో.. అందులో అలియా నా భార్యగా నటించారు. ఆ సమయంలోనే మేకర్స్ ఈ ఫోటో తీశారు.. మా అమ్మ కూడా ఈ ఫోటోను చూసినప్పుడు, షాక్ కావడమే కాకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావ్'? అని అడిగిందంటూ చెప్పుకొచ్చాడు. చివరగా కిచెన్ రూమ్‌ను మాత్రం చూపించలేనని తెలిపాడు. ఎందుకంటే? 'నువ్వు ఇక్కడ వీడియో షూట్ చేయబోతున్నావు కాబట్టి నా దగ్గరకు వచ్చిన వారిని వంటింట్లో ఉంచాను' అంటూ నవ్వుతూ మరో రూమ్ వద్దకు మీడియా ప్రతినిధిని తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) -
వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే కేంద్రమంత్రి బీఎల్ వర్మ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఇక ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కారే వస్తుందని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కేంద్ర సహకార శాఖల మంత్రి బీఎల్ వర్మ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నేలకొండపల్లిలో కొనసాగుతున్న ఖమ్మం– కోదాడ జాతీయ రహదారి పనులను పరిశీలించారు. అనంతరం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు మూడెకరాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ఆయన మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తర్వాత తెల్దార్‌పల్లికి వెళ్లి, ఇటీవల హత్యకు గురైన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏ1గా ఉన్న నిందితుడి పేరును ఏ9గా మార్చారని, తమ ప్రాణాలకు కూడా రక్షణ లేదని మృతుడి కుటుంబీకులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారు. ఎఫ్ఐఆర్ కాపీని కృష్ణయ్య కుమారుడు నవీన్ ద్వారా తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్య చేసినా ఆ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. మునుగోడులో రాజకీయం కోసం తహతహలాడుతున్న కేసీఆర్ ఈ హత్యను గాలికి వదిలేశారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కోనేరు చిన్ని పాల్గొన్నారు. -
హీరో పేరు వర్మ, కానీ సినిమాకు ఆర్జీవీకి సంబంధం లేదు
నట్టి కుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి హీరోగా నటించిన చిత్రం ‘వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. నట్టి క్రాంతి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హీరోగా నా తొలి సినిమాకి మా నాన్నే (నట్టి కుమార్) దర్శకుడు కావడం నా అదృష్టం. టైటిల్ ‘వర్మ’ కాబట్టి రామ్‌గోపాల్ వర్మ గురించి అనుకుంటారు. కానీ వర్మకు సంబంధమే లేదు. సినిమాలో హీరో పేరు వర్మ. సైకోలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేది కథ. థ్రిల్లర్ మూవీ. చివరి అరగంటపాటు భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ‘చట్టం, టెంపర్’ సినిమాల క్లైమాక్స్‌కు ప్రేక్షకులు ఎలా చప్పట్లు కొట్టారో ‘వర్మ’కి కూడా అలా చప్పట్లు కొడతారనే నమ్మకం ఉంది. హీరోగానే కాదు.. మంచి పాత్రలొస్తే బయటి చిత్రాల్లోనూ నటిస్తాను. అన్నీ కలిసి వస్తే దర్శకత్వం కూడా చేస్తాను. నేను నిర్మించిన ‘డియర్ జాను’ (డి.జె.) సినిమా కూడా ఈ నెల 28న రిలీజ్ కానుంది’’ అన్నారు. -
ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి?
సాక్షి, అమరావతి: కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలహాబాద్ హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దంతులూరి శ్రీనివాస రంగనాథవర్మ స్పష్టం చేశారు. ఇంట్లో వాళ్లు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదనేందుకు న్యాయమూర్తులేమీ చట్టాలకు అతీతులు కారన్నారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధన పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తరువాత ఈ విషయాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమంటే అది గొంతు నొక్కేయడమేనన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం.. ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ, లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. గతంలోనూ చాలా మంది రాశారు. ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత హోదాలో కాకుండా ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేఖను బహిర్గతం చేయడంలో మంచి చెడులను ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం. గతంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, జోసెఫ్ మరొకరు మీడియా ముందుకు వచ్చి రోస్టర్ విషయంలో నాటి ప్రధాన న్యాయమూర్తి పారదర్శకంగా వ్యవహరించడం లేదని బహిరంగంగా తమ ఆవేదనను గొంతెత్తి చెప్పారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు.. 2004–05లో ఇంగ్లాడ్ బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయవ్యవస్థపై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టుకలిగి ఉన్నారని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. విదేశీ స్కాలర్స్ కూడా భారత న్యాయవ్యస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయకూడదంటే ఎలా..? ముఖ్యమంత్రి ఫిర్యాదుపై సుప్రీంకోర్టు సీజే ఓ కమిటీ ద్వారా అంతర్గత విచారణ జరుపుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఆరోపణలు రుజువైతే సాధారణంగా బదిలీ చేస్తారు. లేదా రకరకాల కారణాలతో చర్యలు తీసుకుండానే వదిలేస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేశారనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? ఆధారాలున్నప్పుడు కూడా ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? బాధతోనే సీఎం స్పందించారు.. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించరాదు. వ్యవస్థలను అభద్రతా భావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదు. అలా అభద్రతా భావం కలిగించినప్పుడు బాధతోనే ముఖ్యమంత్రి స్పందించి సీజేఐకి లేఖ రాశారు. అందులో తప్పేమీ లేదు. కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు వాడరాదు. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడమే అవుతుంది. లోతుగా విచారణ జరిపి ఆరోపణలకు ఆస్కారం రాకుండా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు... ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు. అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత దర్యాప్తు పూర్తి చేయాలి. అది ఆపడానికి వీల్లేదు. హైకోర్టు దర్యాప్తును ఆపేయడమే కాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చింది. అలా చేసి ఉండాల్సింది కాదు. నియామకాల్లో పారదర్శకత ఉండాలి.. న్యాయవ్యవస్థలో చాలా వరకు రాజకీయ నియామకాలేనన్న ఆరోపణలున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత ఉండాలి. అభిప్రాయ సేకరణ జరగాలి. సమర్థతకు పట్టం కట్టాలి. ఇష్టానుసారంగా నిందలు సరికాదు... న్యాయమూర్తుల బెంచ్ మీద నుంచి ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నది నా అభిప్రాయం. నేను జడ్జిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఒకరు ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారని వ్యాఖ్యానించడంపై సీజేకు ఫిర్యాదు వెళ్లింది. ప్రభుత్వమే భూ కబ్జాదారంటే ఎలా? అది ఎంత పెద్ద మాట? కోర్టులు, న్యాయమూర్తులు ఇలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఇక సుప్రీంకోర్టు సీజేకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు? ఆ లేఖలు.. మక్కీకి మక్కీ జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఓ న్యాయమూర్తికి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిర్గతం చేయడం సంచలనం రేకెత్తించింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు లేఖ వచ్చింది. రెండు లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి? ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నదే ప్రజల ఆకాంక్ష. -
వర్మ హీరో అయ్యాడు
సినిమా : సినిమా అతనికో కల. ఎలాగైనా నటుడు అవ్వాలనే పట్టుదలతో రంగంలోకి దిగాడు. అయితే ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడంతో ఒక్క సారిగా హీరో అవ్వడం సాధ్యం కాదు కాబట్టి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని నటుడుగా ఎదగాలకున్నాడు. అంతే చిన్న పాత్రనైనా కాదకుండా నటించేశాడు. అలా మొత్తం మీద గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా అవతారమెత్తాడు. అతని పేరే వర్మ. సినిమా మీద ఆసక్తితో ప్రముఖ నటనా స్కూల్లో శిక్షణ పొందాడు. అలా రెండేళ్లు శిక్షణ పొందిన వర్మ ఎవరి ప్రోత్సాహం లేకపోవడంతో తీవ్ర ప్రయత్రం చేసి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో వచ్చిన పాత్రల్లో నటించాడు. అలా ధీరన్, కాళీ, తడం, ఇరుంబుతిరై, తమిళ్‌పడం 2 చిత్రాల్లో నటించాడు. అలా ఇటీవల విడుదలయిన కరుప్పు దురై, హీరో, పంచాక్షరం వంటి చిత్రాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించి గుర్తింపు పొందాడు. నటుడిగా నిరూపించుకున్నాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హీరో స్థాయికి చేరుకున్నాడు. కృషి, పట్టుదల ఉంటే కలలను నెరవేర్చుకోవచ్చు అని వర్మ విషయంలోనూ నిజమైంది. చివరకు దీనదయాళన్ అనే నవ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. వర్మ భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంతో నటుడు వర్మ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. నటుడిగా తానేమిటో నిరూపించుకుంటానని అంటున్నాడు. మొత్తం మీద కోలీవుడ్‌లో మరో హీరో పరిచయం అవుతున్నాడన్న మాట. -
స్టార్‌హోటళ్లలో జల్సా చేయాలని!
బంజారాహిల్స్: పుట్టింది మధ్య తరగతి కుటుంబంలో... స్నేహితులు బడా బాబుల కుమారులు కావడంతో వారిలాగే దర్జాగా ఉండాలని, స్టార్ హోటళ్లలో మందు, విందులో జల్సాలు చేయాలని, ప్రేమించిన యువతితో షికార్లు చేయాలనుకున్నాడు. తనకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో చోరీల బాటపట్టాడు. తాను పని చేస్తున్న సంస్థలోనే యజమాని కళ్లుగప్పి డబ్బులు తస్కరించి పోలీసులకు చిక్కాడు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, డీఐ రమేష్‌తో కలిసి ఏసీపీ కేఎస్ రావు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామానికి చెందిన పోతూరి గౌతంవర్మ అలియాస్ గౌతం (28) ఐటీఐ చదివాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి వెంకటగిరిలోని హైలం కాలనీలో అద్దెకుంటూ జూబ్లీహిల్స్‌లోని వెజ్ టోకిరి రెస్టారెంట్లో ఆరు నెలల క్రితం కెప్టెన్‌గా కుదిరాడు. నమ్మకంగా పని చేస్తున్నట్లు నటిస్తూ మే 20న జీతాల కోసం యజమాని తీసుకొచ్చిన రూ. 3 లక్షలు దొంగిలించి పరారయ్యాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక అం శాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశా రు. గతంలో ఇతగాడు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో పట్టుబడి 5 నెల లు జైలుకెళ్లి వచ్చాడు. అయినా.. తీరు మార్చుకోకపోగా జల్సాలకు అలవాటు పడి మళ్లీ చోరీల బాటపట్టాడు. దొంగిలించిన రూ. 3 లక్షల్లో రూ. 2 లక్షలు వైజాగ్, కాకినాడ, విజయవాడ, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాం తాల్లోని స్టార్‌హోటళ్లలో ఉంటూ ఖర్చు చేశారు. నిందితుడి నుంచి రూ.లక్ష రికవరీ చేశారు. గౌతమ్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. -
విజేత.. వర్మ
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు విజయం వరించింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా చక్రం తిప్పిన గాదె ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడంతో.. కొత్తగా పోటీ చేసిన రఘువర్మకు ఉపాధ్యాయులు పట్టం కట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన వర్మ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు శాసనమండలిలో గళం విప్పుతానన్నారు. విశాఖసిటీ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంరంభంలో పాకలపాటి రఘువర్మ ఘన విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదె శ్రీనివాసుల నాయుడిపై తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రఘువర్మ గెలుపొందారు. ఈ నెల 22న నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం 19,593 ఓట్లుండగా.. 17,293 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 550 చెల్లని ఓట్లుగా లెక్కింపు అధికారులు పరిగణించారు. మిగిలిన 16,743 ఓట్లకు గాను.. 8,372 ఓట్లను గెలుపు కోటా ఓట్లుగా నిర్ధారించారు. ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన మొదటి రౌండ్లో పాకలపాటి రఘువర్మకు 6165 ఓట్లు, గాదె శ్రీనివాసుల నాయుడికి 4659, అడారి కిశోర్‌కుమార్‌కు 2,173, జన్నెల బాలకృష్ణకు 299, నూకల సూర్యప్రకాష్‌కు 122, డా.పాలవలస శ్రీనివాసరావుకు 60, గాది బాలగంగాధర్తిలక్కు 44, ఉప్పాడ నీలం 24 ఓట్లతో నిలిచారు. రెండు రౌండ్లు ముగిసేసరికి పాకలపాటి రఘువర్మ 7,834 ఓట్లు, గాదె శ్రీనివాసుల నాయుడు 5,632, అడారి కిశోర్‌కుమార్ 2,548, జన్నెల బాలకృష్ణకు 444, నూకల సూర్యప్రకాష్‌కు 135, డా.పాలవలస శ్రీనివాసరా>వుకు 66, గాది బాలగంగాధర్తిలక్కు 50, ఉప్పాడ నీలం 34 ఓట్లు సాధించారు. అయితే.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థీ కోటా ఓట్లయిన 8,372 ఓట్లకు చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించారు. ఊరించిన విజయం: కోటా ఓట్లకు ఇంకా 538 ఓట్ల దూరంలో రఘువర్మ నిలిచిపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల గణన ప్రారంభమైంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారి నుంచి లెక్కింపు మొదలుపెట్టారు. రౌండ్లు పూర్తవుతున్నా.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువ కాకపోవడంతో వర్మ విజయం కాసేపు ఊరించింది. ఉప్పాడ నీలం అనే అభ్యర్థికి సంబంధించిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా వర్మకు 12 ఓట్లు వచ్చాయి, ఆ తర్వాత గాది బాలగంగాధర్ ఓట్లలో 15, పాలవలస శ్రీనివాసరావు ఓట్లలో 9, నూకల సూర్యప్రకాష్ ఓట్లలో 45, బాలకృష్ణ ఓట్లలో 147 ఓట్లు వచ్చాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి 8062 ఓట్లతో రఘువర్మ నిలిచారు. దీంతో.. విజయానికి ఇంకా 310 ఓట్ల దూరంలో నిలిచారు. ఏడో రౌండ్లో అడారి కిశోర్‌కుమార్‌కు సంబంధించి 2,709 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇవన్నీ లెక్కించినా.. గాదె విజయం సాధించే అవకాశం లేకపోవడంతో ఎన్నికల అధికారుల సూచన మేరకు రఘువర్మ కోటా ఓట్లను చేరుకునేంత వరకూ లెక్కించి విజేతను ప్రకటించాలని నిర్ణయించారు. అడారి ఓట్లలో 922 ఓట్లు లెక్కించే సరికి రఘువర్మ విజయం ఖరారైనట్లు అధికారులు ప్రకటించారు. రఘువర్మకు 8,372 ఓట్లు రాగా, గాదె శ్రీనివాసుల నాయుడు 6,044 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ సృజన పర్యవేక్షించారు. విజయం ఖరారు చేసిన అనంతరం రఘువర్మకు ధ్రువపత్రాన్ని కలెక్టర్ భాస్కర్ అందించారు. సమస్యలపరిష్కారానికి కృషి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు తన గళాన్ని మండలిలో వినిపిస్తానని విజయం సాధించిన అనంతరం పాకలపాటి రఘువర్మ ప్రకటించారు. తన విజయం ఉపాధ్యాయులందరిదీ అని వ్యాఖ్యానించారు. గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పాకలపాటి రఘువర్మకు ఉద్యమ సంఘాలైన యూటీఎఫ్, ఎస్టీయూ, గిరిజన ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులతో పాటు 20 వరకూ సంఘాలు మద్దతు ఇచ్చాయి. మరోవైపు... ఎమ్మెల్సీగా రెండు దఫాలుగా చేసిన గాదెపై ఉన్న వ్యతిరేకత ఓటింగ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో గాదె పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలూ గెలుపుపై ప్రభావం చూపాయి. రఘువర్మకు అభినందనలు మురళీనగర్(విశాఖ ఉత్తర): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మను రామాటాకీస్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేÔశంలో ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్టీయూ సంఘాల ప్రధాన నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి కృషి వల్లే తాను గెలుపొందానని రఘువర్మ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని చెప్పారు. అందరిని స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుతానని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తమరాన త్రినా«థ్, బి.వెంకటపతిరాజు, యూటీఎఫ్ నాయకులు జాజులు, ఎస్టీయూ అధ్యక్షుడు పైడిరాజు పాల్గొన్నారు. -
వర్మ బంగ్లాలో ఏం జరిగింది?
‘‘డిసెంబర్ 31’ సినిమా మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్‌గా ఉంది. స్టోరీ లైన్ విన్నాను. సస్పెన్స్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్. ఏసీపీ రవీంద్ర పాత్ర పవర్‌ఫుల్‌గానే కాకుండా సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. జి. కొండలరావు, నవకాంత్, షకలక శంకర్, పోసాని కృష్ణమురళి, గౌతంరాజు, నరేష్, గిరీష్, హర్ష, శ్రావణి, మధురెడ్డి, అమీషా ముఖ్యతారలుగా జి. కొండలరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డిసెంబర్ 31’. ‘వర్మగారి బంగ్లా’ అనేది ట్యాగ్ లైన్. గణగళ్ల మానస సమర్పణలో శ్రీ గౌతం క్రియేషన్స్ పతాకంపై జి.లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని వీవీ వినాయక్ విడుదల చేశారు. జి. కొండలరావు మాట్లాడుతూ– ‘‘ప్రతి డిసెంబర్ 31న ఎంతోమంది అమ్మాయిలు పార్టీ పేరుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. హత్యలు చేయబడుతున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? వీటిని ఏ విధంగా ఆపవచ్చు? ఈ హత్యలు చేస్తోంది ఎవరు? వంటి వాటిని గుర్తించడం కోసం స్పెషల్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిష్ట్ ఏసీపీ రవీంద్ర రంగంలోకి దిగి హంతకులను ఎలా పట్టుకున్నారు... అన్నదే ఈ చిత్ర కథాంశం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అంబటి రాఘవేంద్రరెడ్డి, రాయితి రమణమూర్తి, జి.అప్పారావు, సంగీతం:బోలె, కెమెరా: వెంకట్. -
వర్మ ప్రేయసి
తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’తో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక విడుదల కావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ‘తూచ్.. అవుట్‌పుట్ నచ్చలేదు’ అంటూ నిర్మాతలు మళ్లీ తీయడానికి రెడీ అయిపోయారు. ధృవ్‌నే హీరోగా ఈ సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దర్శకుడు, హీరోయిన్ ఇతర తారాగణం స్థానంలో కొత్తవారు ఉంటారు. ఈ కొత్త వెర్షన్‌కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాత వెర్షన్లో హీరోయిన్గా నటించిన మేఘా చౌదరి స్థానంలో బన్నితా సాంధును ఎంపిక చేశారు టీమ్. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు. ఇంతకుముందు వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘అక్టోబర్’లో హీరోయిన్గా నటించారు బన్నిత. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘అక్టోబర్’ చిత్రంలో నటించడానికి ముందు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారామె. 2016లో గాయకుడు కిశోర్ కుమార్ ‘ఏక్ అజ్నబీ హసీనా’ అనే పాటను రీ–క్రియేట్ చేసిన మ్యూజిక్ వీడియోతో ఫేమస్ అయ్యారు బన్నిత. -
నేనే తప్పుకున్నాను
‘‘దర్శకుడు బాలా రూపొందించిన ‘వర్మ’ చిత్రం మాకు సంతృప్తికరంగా లేదు. సినిమాను మళ్లీ మొదటి నుంచి చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ చేస్తున్న ఈ4 ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ పేర్కొంది. అయితే బాలా లాంటి దర్శకుడుని తప్పించడమేంటి? అనే కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై బాలా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘నిర్మాతలు ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ల వల్ల నేను వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలన్నది నా సొంత నిర్ణయమే. ధృవ్ విక్రమ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘వర్మ’ కొత్త ప్రాజెక్ట్‌ను దర్శకుడు గౌతమ్ మీనన్ టేకప్ చేస్తారని టాక్. -
‘వర్మ’ వివాదంపై స్పందించిన బాలా
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నిర్మాతలు సినిమాను రీషూట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలా ఇచ్చిన ఫస్ట్ కాపీ సంతృప్తిగా లేకపోవటంతో మరో దర్శకుడితో సినిమాను రీ షూట్ చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్శకుడు బాలా స్పందించారు. ప్రాజెక్ట్ నుంచి తనను ఎవరూ తప్పించలేదని. తానే ప్రాజెక్ట్ ను వదిలి బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన బాలా అందుకు సాక్ష్యాలుగా నిర్మాణ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ కాపీలను కూడా విడుదల చేశారు. ధృవ్ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
వివాదాస్పద చిత్రంలో జాన్వీ?
వివాదాస్పద చిత్రంలో నాయకిగా అతిలోకసుందరి శ్రీదేవి వారుసురాలు జాన్వీకపూర్ నటించనుందా? జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ గురించి ఇటీవల చాలానే చర్చ జరుగుతోంది. ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ హిందీ చిత్రం పింకూను తమిళంలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అజిత్ కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ద్వారా జాన్వీ కోలీవుడ్‌కు పరిచయం కానుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ గురించి మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది. వర్మ చిత్ర వ్యవహారం తెలిసిందే. తెలుగు సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డికి రీమేక్‌గా తమిళంలో బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని, మళ్లీ పూర్తిగా రీషూట్ చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. అతని తొలి చిత్రమే ఇలా అవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వర్మ చిత్రాన్ని తెరకెక్కించింది సాధారణ దర్శకుడు కాదు. తమిళ సినీ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలను అందించిన జాతీయ అవార్డులను తమిళ సినిమాకు అందించిన దర్శకుడు బాలా. అలాంటి దర్శకుడిని ఇది అవమానించే చర్చగా భావిస్తూ పలువురు దర్శకులు ఆయనకు మద్దతుగా గొంతు విప్పుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియదు. వర్మ చిత్ర నిర్మాత మాత్రం ఆ చిత్రాన్ని రీషూట్ చేయడానికి ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు గౌతమ్‌మీనన్, 96 చిత్రం ఫేమ్ సీ ప్రేమ్‌కుమార్, మలయాళ సినీ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్, బిజాయ్ నంబియార్‌లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఇకపోతే వర్మ చిత్రంలో ధృవ్‌నే మళ్లీ నటిస్తాడని నిర్మాతలు పేర్కొన్నారు. అతనికి జంటగా నటించిన బెంగాలీ బ్యూటీ మేఘా చౌదరి పరిస్థితినే అర్థం కావడం లేదు. ఆమె పాత్రలో ఇప్పుడు శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాన్వీ వివాదాస్పదంగా మారిన అర్జున్‌రెడ్డి రీమేక్‌లో నటించడానికి అంగీకరిస్తుందా? అన్నది వేచి చూడాలి. -
‘వర్మ’కేమైంది!
తమిళసినిమా: వర్మకేమైంది? కోలీవుడ్‌లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారిన షాకింగ్ న్యూస్. దర్శకుడు బాలా సృష్టి వర్మ. దీన్ని ఆయన సృష్టి అనవచ్చో కాదో. ఎందుకంటే వర్మ బాలా ముద్దుబిడ్డ కాదు. అద్దె బిడ్డ అనవచ్చు. ఆయన రాసుకున్న కథా చిత్రం కాదు. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ వర్మ. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఇది. ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థకు ఫస్ట్ కాపీ విధానంలో బాలా నిర్మాణ సంస్థ బీ స్టూడియోస్ రూపొందిస్తున్న చిత్రం వర్మ. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా ఈ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు వర్మ చిత్రాన్ని విడుదల చేయడం లేదని వెల్లడిస్తూ మీడియాకు ఇక ప్రకటనను విడుదల చేశారు. అర్జున్‌రెడ్డికి రీమేక్‌లా లేదు అందులో వారు పేర్కొంటూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రాన్ని వర్మ పేరుతో రీమేక్ చేసి ఫస్ట్‌కాపీ బేస్డ్లో బాలా బి.స్టూడియోస్ సంస్థ తమకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే బాలా తెరకెక్కించిన వర్మ చిత్రం ఫస్ట్‌కాపీ చూసిన తరువాత తమకు సంతృప్తి అనిపించలేదన్నారు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒరిజినల్ చిత్రానికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. దీంతో వర్మ చిత్రాన్ని విడుదల చేయరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని మళ్లీ వేరే దర్శకుడితో రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. హీరోగా ధృవే నటిస్తారని, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. జూన్ 29న విడుదల చేస్తామని ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలా పూర్తిగా అదీ ఒక జాతీయ అవార్డు గ్రహీత, పలు వైవిధ్యభరిత చిత్రాల సృష్టికర్త తెరకెక్కించిన చిత్రాన్ని విడుదల సంతృప్తిగా లేదని పక్కన పడేయనున్నట్లు చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నా చిత్రం రిలీజ్ కావడం లేదా? వర్మ చిత్రంలో ధృవ్‌కు జంటగా నవ నటి మేఘాచౌదరి నటించింది. మోడలింగ్ రంగంలో పాపులర్ అయిన ఈ బెంగాలీ బ్యూటీ హీరోయిన్గా ఇదే తొలి చిత్రం. వర్మ చిత్రం విడుదల కావడం లేదు తెలుసా అన్న ప్రశ్నకు మేఘాచౌదరి షాక్ అయ్యింది. కొత్తగా రూపొందించనున్న చిత్రంలో ధృవ్ నటించనున్నాడు. మరి ఈ చిన్నది ఉంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. విక్రమ్ కూడానా? వర్మ చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించడంతో ఆ చిత్ర దర్శకుడు బాలా చాలా హర్ట్ అయ్యారు. ఈయనకు దర్శకుడిగా ప్రత్యేక బ్రాండ్ ఉంది. ఆయన చిత్రాలకు ఆయనే కథలను రాసుకుంటారు. అలాంటి దర్శకుడు అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు ముందు వ్యతిరేకించారట. అయితే సేతు చిత్రంతో తనకు సినీ జీవితాన్ని చ్చిన నటుడు విక్రమ్ తన కొడుకును హీరోగా పరిచయం చేయమని కోరడంతో ఆయన కోసమే అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు బాలా సమ్మతించినట్లు సమాచారం. అయినా రీమేక్‌ను అలానే కాపీ కొట్టి చేయనని బాలా ముందే చెప్పారట. తీరా వర్మ చిత్రం పూర్తయిన తరువాత నటుడు విక్రమ్ కూడా నిర్మాతల తరఫున మాట్లాడటం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
డైరెక్టర్ బాలాకు షాక్
తమిళనాట డైరెక్టర్ బాలాకు ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. భిన్నంగా సినిమాలు తీస్తూ.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించిన బాలాకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కుతున్న వర్మ సినిమాను బాలా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవుట్‌పుట్ చూసిన నిర్మాతలు దానితో సంతృప్తి చెందలేదని, పూర్తి సినిమాను మళ్లీ రీషూట్ చేస్తామని ప్రకటించారు. హీరో ధృవ్ తప్పా మిగిలిన క్యాస్టింగ్ మొత్తాన్ని మార్చనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ బాలాను కూడా తప్పించడం తమిళ నాట హాట్ టాపిక్ అయింది. విక్రమ్ సూచన మేరకే నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో మళ్లీ రీషూట్ చేయబోతున్నట్లు సమాచారం. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. -
వర్మా.. ఇదేం ఖర్మ!
తూర్పుగోదావరి, గొల్లప్రోలు : మొదటి చిత్రంలో ఉత్త చేతులతో మురుగు కాలువలోని పూడిక తీస్తున్న మహిళ ఎవరో తెలుసా... శానిటరీ ఇన్స్పెక్టర్...ఆ పక్కన నిలబడి పెత్తనం చెలాయిస్తున్నది పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. పూడిక పేరుకుపోతే పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి ఆ పనులు చేపట్టించాలి గానీ ఇదేమి దౌర్జన్యం...అందరూ చూస్తుండగానే మురుగులో చేతులు పెట్టించి తీయించడం... అదీ ఓ మహిళా ఉద్యోగిపట్ల ఇంత అమానుషమా అని అక్కడున్నవారు ముక్కునవేలేసుకున్నారు. రెండో చిత్రం చూశారు కదా...మురుగు కాలువలో దిగి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పని చేస్తున్నది ఎవరో తెలుసా... ఆ ఇంకెవరు మున్సిపల్ కార్మికుడై ఉంటారనుకుంటే బురదలో కాలేసినట్టే...మన పక్క రాష్ట్రమైన పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖామంత్రి కమలకన్నన్. నిరసనగా ఇలా చేశారంటే కానేకాదు ... పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ‘నేను సైతం’ అంటూ శ్రమదానంగా ఇలా పనిలోకి దిగారు. ఆ మంత్రి పనిలో పెత్తనం లేదు...అహంకారం అంతకన్నా లేదు...ఆత్మీయత కనిపిస్తోంది. మరి ఇక్కడ ఇంత అరాచకమేమిటని పంచాయతీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. గొల్లప్రోలు పట్టణం 9, 10 వార్డుల్లో టీడీపీ గ్రామదర్శిని కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటిస్తున్న సమయంలో పదో వార్డులో పాత పోలీస్ స్టేషన్ వీధిలోని మహిళలు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఆ పక్కనే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టరు శివలక్ష్మిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సత్వరమే శుభ్ర పరచాలని ఆదేశించడంలోనూ తప్పులేదు. కానీ అక్కడున్న జనం మెప్పు కోసం మహిళా అధికారి అని కూడా చూడకుండా చేతులతో మురికిని తీయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె చేసేది లేక టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు చూస్తుండగా అవమాన భారంతో కాలువలో మురికిని చేతులతో తొలగించారు. ఎమ్మెల్యే వైఖరిపై పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విరాళంగా తొలి పారితోషికం
పెరంబూరు: నవ నటుడు ధృవ్ తన తొలి పారితోషికాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం అందించారు. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్ అమెరికాలో నటనలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ధృవ్ తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. తండ్రి విక్రమ్‌కు సేతు చిత్రం ద్వారా నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు బాలానే ధృవ్ తొలి చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఇటీవల వరద బీభత్సంతో కేరళ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆర్థికంగా, ఇతరత్రా సాయం చేశారు. తాజాగా ధృవ్ వర్మ చిత్ర హీరోగా అందుకున్న పారితోషికాన్ని వరద బాధితుల సహాయార్థం అందజేసి దాతృత్వం చాటుకున్నాడు. ఆయన కేరళ సీఎం పినరాయి విజయన్ను సోమవారం కలిసి తన తొలి చిత్ర పారితోషికాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయనతో పాటు వర్మ చిత్ర నిర్మాత ముఖేశ్ ఆర్.మెహతా, ఏవీ.అనూప్ ఉన్నారు. ఇప్పటికే ధృవ్ తండ్రి, నటుడు విక్రమ్ కేరళ వరద బాధితులకు సహాయంగా రూ.35లక్షలను అందించిన విషయం తెలిసిందే.