సినిమా : సినిమా అతనికో కల. ఎలాగైనా నటుడు అవ్వాలనే పట్టుదలతో రంగంలోకి దిగాడు. అయితే ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడంతో ఒక్క సారిగా హీరో అవ్వడం సాధ్యం కాదు కాబట్టి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని నటుడుగా ఎదగాలకున్నాడు. అంతే చిన్న పాత్రనైనా కాదకుండా నటించేశాడు. అలా మొత్తం మీద గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా అవతారమెత్తాడు. అతని పేరే వర్మ. సినిమా మీద ఆసక్తితో ప్రముఖ నటనా స్కూల్‌లో శిక్షణ పొందాడు. అలా రెండేళ్లు శిక్షణ పొందిన వర్మ ఎవరి ప్రోత్సాహం లేకపోవడంతో తీవ్ర ప్రయత్రం చేసి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో వచ్చిన పాత్రల్లో నటించాడు. అలా ధీరన్, కాళీ, తడం, ఇరుంబుతిరై, తమిళ్‌పడం 2 చిత్రాల్లో నటించాడు.
అలా ఇటీవల విడుదలయిన కరుప్పు దురై, హీరో, పంచాక్షరం వంటి చిత్రాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించి గుర్తింపు పొందాడు. నటుడిగా నిరూపించుకున్నాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హీరో స్థాయికి చేరుకున్నాడు. కృషి, పట్టుదల ఉంటే కలలను నెరవేర్చుకోవచ్చు అని వర్మ విషయంలోనూ నిజమైంది. చివరకు దీనదయాళన్ అనే నవ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. వర్మ భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంతో నటుడు వర్మ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. నటుడిగా తానేమిటో నిరూపించుకుంటానని అంటున్నాడు. మొత్తం మీద కోలీవుడ్‌లో మరో హీరో పరిచయం అవుతున్నాడన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment