Vijay Varma And Alia Bhatt Wedding Photo Viral On Social Media, Know Secret Inside - Sakshi
Sakshi News home page

Vijay Varma Marriage Photo: ఆ పెళ్లి ఫోటో సీక్రెట్‌ రివీల్‌ చేసిన విజయ్‌ వర్మ

Published Sat, Jun 17 2023 11:37 AM | Last Updated on Sat, Jun 17 2023 12:11 PM

Vijay Varma And Alia Bhatt Wedding Photo Viral - Sakshi

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో విజయ్‌ వర్మ పేరు ఎక్కడికెళ్లినా వినిపిస్తోంది. తను నటించిన దహాద్, డార్లింగ్స్, మీర్జాపూర్, గల్లీబాయ్, లస్ట్‌ స్టోరీస్‌-2 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తమన్నాతోనే అతనికి మరింత గుర్తింపు దక్కింది. తాజాగా విజయ్‌ వర్మని ఇష్టపడుతున్నట్లు తమన్నా ఓపెన్‌ అయింది. దీంతో అతను మరింత పాపులర్‌ అయ్యాడు.  

విజయ్ ఏ ఇంట్లో ఉంటాడో అనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. సినీ పరిశ్రమలో స్థిరపడిన అతనికి ఇప్పటికీ ముంబయిలో సొంత ఇల్లు లేదు. ప్రస్తుతం అక్కడ సముద్రానికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలలో, అతను వివిధ కారణాల వల్ల 14 అద్దె ఇళ్లకు మారాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని అతని ఇంట్లో ఒక మీడియా ప్రతినిధితో పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్‌ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది)


అలియా భట్‌తో విజయ్ వర్మ పెళ్లి ఫోటో స్టోరీ ఇదే 
విజయ్‌ వర్మ ఇంటి హాలులో కొన్ని ఫోటో ఫ్రేమ్‌లు ఉన్నాయి. వాటిలో ఒక ఫోటో ఆసక్తగా కనిపిస్తోంది. అదేమిటంటే, స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్, విజయ్‌ వర్మ కలిసి ఒకే ఫోటోలో ఉన్నారు. అది కూడా పెళ్లి బట్టలతో.. ఇదేమిటని ప్రశ్నించగా..

'ఇది డార్లింగ్ సినిమా కోసం ఫోటోషాప్ చేసిన ఫోటో.. అందులో అలియా  నా భార్యగా నటించారు. ఆ సమయంలోనే మేకర్స్‌ ఈ ఫోటో తీశారు.. మా అమ్మ కూడా ఈ ఫోటోను చూసినప్పుడు, షాక్ కావడమే కాకుండా ఎప్పుడు  పెళ్లి చేసుకున్నావ్‌'? అని అడిగిందంటూ చెప్పుకొచ్చాడు. చివరగా కిచెన్‌ రూమ్‌ను మాత్రం చూపించలేనని తెలిపాడు. ఎందుకంటే?  'నువ్వు ఇక్కడ వీడియో షూట్ చేయబోతున్నావు కాబట్టి నా దగ్గరకు వచ్చిన వారిని వంటింట్లో ఉంచాను' అంటూ నవ్వుతూ మరో రూమ్‌ వద్దకు మీడియా ప్రతినిధిని తీసుకెళ్లాడు.  

(ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్‌ ఎక్కడ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement