Ravi Teja's Neninthe Movie Heroine Aditi Gautam Got Married - Sakshi
Sakshi News home page

Neninthe Heroine Marriage: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్‌, వరుడు ఎవరో తెలుసా?

Feb 7 2023 2:19 PM | Updated on Feb 7 2023 4:18 PM

Ravi Teja Neninthe Movie Heroine Aditi Gautam got Married - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ ‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై బ్యూటీ శియా గౌతమ్ అలియాస్‌ అదితి గౌతమ్‌. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే హీరోయిన్‌గా మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయింది. నేనింతే తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆమెకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. 

చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తు‍న్నారు.. ఇది పెయిడ్‌ బ్యాచ్ పనే: కిరాక్‌ ఆర్పీ

వేదం చిత్రంలో మనోజ్‌ భాజ్‌పాయి భార్యగా నటించిన ఆమె ఆ తర్వాత తెలుగులో కనిపించనే లేదు. ఆ తర్వాత కన్నడ మూవీ డబుల్‌ డెక్కర్‌లో నటించిన ఆమె హిందీలో రణ్‌బీర కపూర్‌ సంజూ సినిమాతో అదృష్టం పరీక్షించుకుంది. అయినా అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. సంజూ మూవీ మంచి హిట్‌ అయినప్పటికీ శియాకు మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో నటనకు కాస్తా బ్రేక్‌ ఇచ్చిన ఆమె ఇటీవల వచ్చిన గోపిచంద్‌ పక్కా కమర్షియల్‌ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది.

చదవండి: వచ్చే వారం ప్రభాస్‌-కృతి సనన్‌ నిశ్చితార్థం? ట్వీట్‌ వైరల్‌

అప్పుడప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తున్న శియ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. తన హల్దీ, సింగీత్‌, పెళ్లి వేడుకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆమెకు సినీ సెలబ్రెటీలు, ఫాలోవర్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. శియ భర్త పేరు నిఖిల్‌ పాల్కేవాలా. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇక శియా పెళ్లి వేడుకలో నటి ప్రియమణి ​తన భర్తతో కలిసి హాజరైంది. ప్రియమణితో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు శియా పెళ్లిలో సందడి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement