
ఎస్‌జే సూర్య (S. J. Suryah) మంచి నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా! వాలి, ఖుషి(తమిళ, తెలుగు, హిందీ), నాని, అంబే ఆరుయిరే, పులి, ఇసై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఖుషి (Kushi Movie) తను డైరెక్ట్ చేసిన రెండో మూవీ. అయితే తొలిరోజు సరిగా రెస్పాన్స్ రాకపోవడం చూసి పిచ్చెక్కిందంటున్నాడు సూర్య. వీర ధీర శూరన్ సినిమా ప్రమోషన్స్‌లో ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. ఒక సినిమా డైరెక్ట్ చేయడమంటే.. ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. దర్శకత్వం అనేది చాలా కష్టం.
శ్మశానంలో కూర్చున్నట్లు..
మనం ఏదైనా మనసుకు నచ్చినట్లు చేసుకుపోతుంటాం. కానీ డైరెక్షన్ చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఖుషి మూవీ ఇప్పుడు సూపర్ హిట్ అని అంటున్నారు. కానీ ప్రీమియర్ రోజు సినిమావాళ్లంతా ఏదో శ్మశానంలో కూర్చున్నట్లుగా సైలెంట్‌గా సినిమా చూస్తున్నారు. ఎవరి ముఖంలో చిన్న నవ్వు లేదు. నాకు భయమేసింది. అది మాత్రం ఫ్లాప్ అయిందంటే ఈరోజు నేనిక్కడ ఉండేవాడిని కాదు. నాకసలే కొంచెం పిచ్చి. నా సినిమా పోయిందంటే చనిపోయేందుకు కూడా వెనుకాడను.
రెండో రోజు సీన్ మారింది.. లేదంటేనా..
కానీ తర్వాతి రోజు నుంచి థియేటర్ శ్మశానంలా కాకుండా ఐపీఎల్ స్టేడియంలా మారిపోయింది. చప్పట్లు, విజిల్స్.. సంతోషమేసింది. సినిమా వైఫల్యాన్ని తట్టుకోవడం దర్శకుడికి చాలా కష్టం. సినిమా రిలీజ్‌కు ముందు కూడా ఇది బాగుందా? లేదా? అని డైలమాలో పడిపోతాడు. తనపై తాను నమ్మకాన్ని కోల్పోతాడు. డైరెక్షన్ చాలా టఫ్ అని చెప్పుకొచ్చాడు సూర్య. ఈయన డైరెక్షన్‌ను వదిలేసి పదేళ్లవుతోంది. నటుడిగా ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈయన చేతిలో వీర ధీర శూరన్, ఇండియన్ 3, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సర్దార్ 2 చిత్రాలున్నాయి.
చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment