SJ Suryah
-
ఈ కలెక్షన్స్ సరిపోవు ఇంకా పెంచాలి..
-
‘సరిపోదా శనివారం’ మూవీ థాంక్స్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సరిపోదా శనివారం టీమ్‌కు సారీ చెప్పిన ఎస్జే సూర్య.. ఎందుకంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాకు సూపర్ హిట్ అందించిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, డీవీవీ ఎంటర్టైన్మెంట్, తెలుగు ప్రేక్షకులకు నా గుండెల నుంచి ధన్యవాదాలు అంటూ తెలుగులో రాసుకొచ్చారు. అదేవిధంగా సక్సెస్ ప్రెస్ మీట్‌కు హాజరు కాకపోవడంపై సారీ చెప్పారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ వల్లే హాజరు కాలేకపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. Telugu prayakshalaku , dir #VivekAthreya gari ki , Natural star @NameisNani gariki , @DVVMovies dhanaya gariki gundal nunchi Dhanyawadalu 🙏🙏🙏 for this great opportunity & accepting this actor with immense love sjsuryah 🥰🙏 sorry couldn’t attend press meet due to unavoidable…— S J Suryah (@iam_SJSuryah) August 31, 2024 -
నాని ‘సరిపోదా శనివారం’ మూవీ స్టిల్స్
-
సుదర్శన్ థియేటర్లో ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. పేరుకి తగ్గట్లే అప్డేట్స్ అన్నీ ఒక్కో శనివారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విలన్‌గా నటిస్తున్న ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ కానీ టీజర్ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)ప్రతి శనివారం.. హీరో రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్ కాగా.. తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడు. కృూరమైన పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది.నాని-ప్రియాంక శ్రీకృష్ణుడు-సత్యభామగా.. ఎస్జే సూర్య నరకాసురుడు అని చెప్పడం లాంటి రిఫరెన్సులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ కాని టీజర్ అంటూనే ఆసక్తి రేకెత్తించారు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?) -
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్ విడుదల.. టైటిల్ సీక్రెట్ ఇదే
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు. ఆగష్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.. ఇందులో నాని యాంగ్రీమెన్లా కనిపిస్తున్నాడు. ఎస్ జే సూర్య వాయిస్‌తో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. వారం మొత్తంలో శనివారం మాత్రమే హీరో నానిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనినే ఈ గ్లింప్స్‌లో చూపించారు. వారంలో అన్ని రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఈ మూవీ ఉండనుంది. యాక్షన్‌కు.. వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నాని సిగరెట్ తాగే విధానం పాత్రకు చైతన్యాన్ని తెస్తుంది. వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని ఉండగా నాని రిక్షా తొక్కే సన్నివేశం మెచ్చుకోదగినది. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను నాని మెప్పించాడని చెప్పవచ్చు. -
ఎల్ఐసీ మూవీ.. కృతీ శెట్టికి తండ్రిగా నటించేదెవరో తెలుసా?
దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త సినిమా గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విఘ్నేశ్ గత ఏడాది కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఈయన దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎల్ఐసీ అని టైటిల్ ఖరారు చేశారు. ఎల్ఐసీ అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని అర్థం. లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా హీరోయిన్ కృతిశెట్టి నటిస్తుండగా నటుడు ఎస్జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, రవి వర్మన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రేమికుల మధ్య ఏర్పడే ఈగో, విడిపోవడం, మళ్లీ కలవడం వంటి అంశాలతో వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కృతి శెట్టికి తండ్రిగా ఎస్జే సూర్య, హీరోకి మిత్రుడిగా యోగి బాబు నటిస్తున్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ రెండు షెడ్యూల్లో పూర్తి చేసి 2024 సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. చదవండి: రూ.100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్‌కు ఊరట.. ఆ స్కామ్‌లో క్లీన్ చిట్ -
అందుకే ప్రియాభవానీ శంకర్‌తో రెండోసారి: ఎస్జే సూర్య
నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'బొమ్మై'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా చేసింది. ఈ చిత్రానికి రాధామోహన్ కథ అందించి దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్జే సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'దర్శకుడు రాధామోహన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ మూవీ నిర్మించాను. అలా మొదలైన ఈ చిత్రం చాలా సంతృప్తిగా వచ్చింది. 'మాన్స్టర్'లో నాతో కలిసి యాక్ట్ చేసిన ప్రియాభవానీ శంకర్‌నే ఇందులోనూ హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. మా అక్క కూతురికి ఇంచుమించు ప్రియాభవాని ఛాయాలు ఉంటాయి. నటి సిమ్రాన్‌కు, త్రిషకు అలాంటి ఫేస్ కట్ ఉంటుంది. అలా ముఖంలో ఓకే కట్ ఉన్న ఒకరికి, మరొకరికి మధ్య సారుప్యత ఉంటుంది' 'నటుడు షారూక్ ఖాన్‌కు, నటి కాజోల్కు అలాంటిదే ఉంది. కారణం ఏంటనేది చెప్పలేను గానీ నాకు, ప్రియాభవాని శంకర్‌కు ఒక మ్యాథమేటిక్స్ ఫ్యూచర్స్ సెట్ అవుతుంది. ఇది ఒక కారణం కావచ్చు. చాప్టర్‌ను మలరుమ్ పాటలో నేను, సిమ్రాన్ మాదిరిగానే ప్రియాభవాని శంకర్ ఉంది. ఇకపోతే ప్రియాభవాని శంకర్, తాను మాన్స్టర్ చిత్రంలో నటించాం. అది మంచి హిట్ కావడం కూడా ఇందులో మళ్లీ మేమిద్దరం కలిసి నటించడానికి కారణం అయ్యిండొచ్చు' అని ఎస్జే సూర్య చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: హీరో షారుక్ ఖాన్‌కి చేదు అనుభవం.. ఆమె అలా చేసేసరికి!) -
స్పైడర్ విలన్ సూర్య హీరోగా బొమ్మై, రిలీజ్ ఎప్పుడంటే?
స్పైడర్ విలన్, ప్రముఖ నటుడు ఎస్జే సూర్య, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం బొమ్మై. మాన్స్టర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత ఈ జంట కలిసి నటించిన చిత్రమిది. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాధామోహన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏంజెల్ స్టూడియో పతాకంపై వి.మారుడు పాండియన్, డాక్టర్ జాస్మిన్ సంతోష్, డాక్టర్ దీప డి.దురై కలిసి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించారు. ఇందులో నటి చాందిని, డౌట్ సెంథిల్, ఆరోల్ శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ గత ఏడాది విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అదే విధంగా ఇటీవల ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా చేశారు. కాగా రొమాంటిక్, సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు చిత్రం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. బొమ్మై చిత్రం ఈ నెల 16వ తేదిన తెరపైకి రానున్నట్లు నటుడు ఎస్జే సూర్య శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది దర్శకుడు రాధామోహన్ చిత్రం కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చదవండి: నా మాజీ భార్త ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు: నటి -
ఇట్స్ అఫీషియల్.. RC15లో ప్రముఖ నటుడు సూర్య
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా శంకర్ సినిమా అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దీనికి తగినట్లుగానే నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలో ఏమాత్రం రాజీపడరాయన. తాజాగా RC15 కోసం ఓ స్టార్ యాక్టర్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు ఎస్.జే సూర్యను ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సూట్ వేసుకొని చేతిలో ఫైల్ పట్టుకొని స్టైల్‌గా నడుస్తున్నట్లున్నఎస్.జే సూర్య పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. Versatile actor @iam_SJSuryah joins our stellar cast! Welcome on board sir @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @yoursanjali @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official #SVC50 #RC15 pic.twitter.com/Az5CQxIeta — Sri Venkateswara Creations (@SVC_official) September 9, 2022 -
హీరో విశాల్ పాన్ ఇండియా చిత్రం ప్రారంభం
నటుడు విశాల్ కథానాయకుడుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ గురువారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మార్క్ ఆంటోనీ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకుముందు విశాల్ హీరోగా ఎనిమీ చిత్రాన్ని నిర్మించారు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. లాఠీ చిత్రాన్ని పూర్తి చేసిన విశాల్ నటిస్తున్న 33వ చిత్రం ఇది. ఆయనకు జంటగా నటి రీతూ వర్మ, ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, అభినందన్ రామానుజన్ చాయాగ్రహణం అందిస్తున్నాయి. -
రామ్ చరణ్ చిత్రంలో స్పైడర్ విలన్ ?
-
భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న విలన్!
విలన్లు అంటేనే భయపెట్టేవాళ్లు. సినిమాల్లో హీరోహీరోయిన్లను, మంచివాళ్లను భయపెడుతుంటారు. కానీ కొన్ని సినిమాల్లో నటించిన విలన్లు మాత్రం ప్రేక్షకులను సైతం గజగజలాడించారు. వాటిలో 'స్పైడర్' మూవీ ఒకటి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో విలన్ పాత్ర పోషించిన ఎస్జే సూర్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సూర్య నటుడు మాత్రమే కాదు దర్శకుడు, రచియత, నిర్మాత కూడా! తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ నటుడికి ఇటీవలే టాలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫర్ అతడి తలుపు తట్టిందట. కానీ సూర్య తనకు రూ.7 కోట్ల పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పడంతో నిర్మాతు ఖంగు తిన్నట్లు సమాచారం. ఇంతకీ సూర్యకు ఏ మూవీలో ఛాన్స్ వచ్చింది? అతడు ఆ ప్రాజెక్ట్‌కు ఓకే అయ్యాడా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. -
నేను ఆయన పాదాలు తాకాను : అమితాబ్
‘మాస్టర్ శివాజీ గణేషన్ నీడలో ఇద్దరు శిష్యులు.. సూర్య మరియు నేను. తమిళ సినిమా లెజెండ్ శివాజీ ఫొటో గోడపై ఉంది. ఆయనను గౌరవిస్తూ నేను ఆ లెజెండ్ పాదాలు తాకాను’ అంటూ బిగ్ బీ అమితాబ్ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్, నటుడు ఎస్జే సూర్య హీరోగా నటిస్తున్న ‘ఉయర్నద మనిదన్’ సినిమాతో అమితాబ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌వానన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ క్రమంలో ఎస్జే సూర్యతో కలిసి ఉన్న ఫొటోలను అమితాబ్ ట్విటర్లో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయనకు జంటగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనున్నట్టు సమాచారం. ఈ తమిళ సినిమాతో పాటు చిరంజీవి ‘సైరా’ మూవీలోనూ అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాదిలోని ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. T 3141 - Two disciples under the shadow of the MASTER - Shivaji Ganesan .. Surya and self ! Shivaji the Ultimate Iconic Legend of Tamil Cinema .. his picture adorns the wall .. my respect and admiration ,👣 i touch his feet ! அவர் மாஸ்டர் .. நாம் அவருடைய சீடர்கள் pic.twitter.com/u4dGGQE1Bd — Amitabh Bachchan (@SrBachchan) April 3, 2019 -
60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ 23
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి 60 శాతం షూటింగ్ పూర్తయినట్టుగా సమాచారం. ఈ నెల 14 వరకు హైదరాబాద్ పరిసరా ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసి తరువాతి షెడ్యూల్ కోసం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో జరగనున్న భారీ షెడ్యూల్‌తో దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
పవన్ కొత్త సినిమా ఆగిపోయిందా..?
సర్థార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులు క్రితమే తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు పవన్. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో పవన్ సన్నిహితుడు శరత్ మరార్, ఈ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే అనుకోకుండా సూర్య నటుడిగా బిజీగా కావటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎస్ జె సూర్య బదులుగా గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావించాడు పవన్. అయితే సూర్య ప్రీ ప్రొడక్షన్ పనులు మధ్యలోనే ఆపేయటంతో డాలీ మొదటినుంచి కొత్తగా స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం మొదలు పెట్టాడట. దీంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లటానికి మరింత సమయం పట్టేలా ఉంది. కానీ ఇప్పటికే పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు డేట్స్ ఇచ్చాడు. అంటే మరో 5 నెలల్లోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలి. కానీ పవన్ కళ్యాణ్, డాలీల వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్లు మాత్రం ఇంత తక్కువ టైంలో సినిమా పూర్తవ్వటం అసాధ్యం అని ఫీల్ అవుతున్నారు. పవన్ కూడా ఇలాగే ఆలోచించి ఈ ప్రాజెక్ట్‌ను పక్కనే పెట్టేయాలని భావిస్తున్నాడట. -
ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే
చెన్నై: 'ప్రిన్స్' మహేశ్ బాబు తర్వాతి సినిమాలో విలన్ గా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ఖరారయ్యాడు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమాలో ప్రతినాయకుడిగా సూర్య కనిపించనున్నాడు. దీనికోసం ధనుష్ సినిమాను అతడు వదులుకున్నాడు. ధనుష్ తాజా చిత్రం 'ఎనాయ్ నొక్కి పాయుమ్' కోసం సూర్యను సంప్రదించారు. అయితే మహేశ్ సినిమాకు కమిట్ అవడంతో ఈ ఆఫర్ తిరస్కరించాడని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య, ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'ఇరైవి'లో విలన్‌గా చేస్తున్నాడు. మహేశ్-మురుగదాస్ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తమిళనటి సాయి పల్లవి, కీర్తి సురేష్‌లతో పాటు, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా తెరపైకి వచ్చాయి.