ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే | SJ Suryah to play antagonist in Mahesh Babu's next | Sakshi
Sakshi News home page

ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే

Published Thu, Apr 21 2016 2:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే

ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే

చెన్నై: 'ప్రిన్స్' మహేశ్ బాబు తర్వాతి సినిమాలో విలన్ గా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ఖరారయ్యాడు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమాలో ప్రతినాయకుడిగా సూర్య కనిపించనున్నాడు. దీనికోసం ధనుష్ సినిమాను అతడు వదులుకున్నాడు. ధనుష్ తాజా చిత్రం 'ఎనాయ్ నొక్కి పాయుమ్' కోసం సూర్యను సంప్రదించారు. అయితే మహేశ్ సినిమాకు కమిట్ అవడంతో ఈ ఆఫర్ తిరస్కరించాడని చిత్రవర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య, ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'ఇరైవి'లో విలన్గా చేస్తున్నాడు. మహేశ్-మురుగదాస్ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తమిళనటి సాయి పల్లవి, కీర్తి సురేష్లతో పాటు, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా తెరపైకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement