murugadoss
-
వరుస ప్లాపులు అయిన నమ్ముతున్న స్టార్స్..
-
Salman khan: ఫైటింగ్‌కి రెడీ అయిన సల్మాన్ ఖాన్!
మేలో యాక్షన్ స్టార్ట్ చేయనున్నారు సల్మాన్ ఖాన్. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చిత్రీకరణ మేలో ముంబైలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. ముందుగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్. ఈ సినిమాలోఅదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఓ సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల మురుగదాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రం 2025 రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. -
మృణాల్ తమిళ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతో కలిసి
Mrunal Thakur First Tamil Movie: హీరో-హీరోయిన్-డైరెక్టర్.. ఎవరైనా సరే ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ చాలు. కెరీర్ సాలీడ్‌గా సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎన్ని హిట్, ఫ్లాప్స్ వచ్చినా అవి ఆటుపోటు లాంటివే, కొన్నాళ్లకు సర్దుకుంటాయి. నటి మృణాల్ ఠాకూర్ జీవితం ఇంతే. మోడలింగ్ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. పలు యాడ్స్‌లో నటించింది. అనంతరం సినిమాల్లోకి వచ్చింది. పలు మరాఠీ , హిందీ చిత్రాల్లో నటించినా రాని క్రేజ్ 'సీతరామం' అనే ఒక్క తెలుగు చిత్రంతో వచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) ప్రస్తుతం హిందీ, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ మృణాల్ బిజీగా ఉంది. కాగా తెలుగులో నాని 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కొత్త సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా మృణాల్‌ని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు. శివకార్తికేయన్ 'మావీరన్' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో.. కమలహాసన్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఇది పూర్తయిన తర్వాత శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో చిత్రం మొదలు కానుంది. రజనీకాంత్‌తో చేసిన 'దర్బార్' ఫ్లాప్ దెబ్బతో మురుగదాస్ మరో మూవీ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు శివకార్తికేయన్‌తో చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వెళ్లబోతన్న చిత్ర ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
డాటరాఫ్ రజనీకాంత్?
రజనీకాంత్ కొత్త చిత్రం గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమాలో రజనీ కుమార్తెగా నివేదా థామస్ కనిపించనున్నారని టాక్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ„ న్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో సినిమాకి కీలకంగా నిలిచే రజనీకాంత్ కుమార్తె పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం నివేదా థామస్‌ను సంప్రదించారట చిత్రబృందం. ఆల్రెడీ ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’ తమిళ రీమేక్) సినిమాలో కమల్ హాసన్ కుమార్తెగా నివేదా థామస్ కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నివేదాకు పెద్ద ప్లస్ అయింది. మరి రజనీ కుమార్తెగా కూడా నటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రజనీ లుక్ టెస్ట్ జరిగింది. ఆ స్టిల్స్ కొన్ని ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఏప్రిల్ 10న ముంబైలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీత దర్శకుడు. -
ముంబై ప్లాన్!
రజనీకాంత్ హీరోగా నటించిన, ‘కాలా’ చిత్రం మొత్తం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. తాజాగా రజనీ చేయబోయే సినిమాలో కూడా అదే నేపథ్యం ఉంటుందని సమాచారం. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను ముంబైలో ప్లాన్ చేశారట దర్శకుడు. దాంతో కథ ముంబై నేపథ్యంలో ఉంటుందని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఎ.ఆర్. మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ సినిమాకి కూడా ముంబై టచ్ ఉంటుంది. మరి.. తాజా చిత్రకథను పూర్తిగా ముంబైలో నడిపిస్తారా లేక కథలో కీలక సన్నివేశాలు మాత్రమే ఆ మహానగరంలో ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది. త్వరలో చిత్రబృందం ముంబై వెళ్లడానికి రెడీ అవుతోందట. చెన్నైలో ముంబై సెట్ వేసి కూడా కొన్ని సీన్స్ తీయాలనుకుంటున్నారట. ఇందులో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నారని భోగట్టా. రెండు పాత్రల్లో ఒకటి పోలీస్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నయనయనతారను ఓ కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. మరో కథానాయికగా కీర్తీ సురేష్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్ వ్యవహరిస్తారు. -
హాలీవుడ్ సినిమాకు మురుగదాస్ డైలాగ్స్!
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమా సంభాషణలు రాసేందుకు అంగీకరించాడు. తన సినిమాలకు కథ, డైలాగ్స్ తానే రాసుకునే ఈ స్టార్ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాలకు ఇంతవరకు ఎప్పుడూ పనిచేయలేదు. అయితే ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కోరిక మేరకు డైలాగ్స్ రాసేందుకు అంగీకరించారట. సూపర్ హిట్ అడ్వంచర్ మూవీ సిరీస్ అవెంజర్స్ నుంచి కొత్త సినిమా ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ రాబోతోంది. ఈ సినిమాను భారత్‌లోనూ భారీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు డబ్బింగ్ డైలాగ్స్ రాసేందుకు పలువురు ప్రముఖులను సంప్రదించారు. ఈ సినిమా తమిళ వర్షన్‌కు డైలాగ్స్ రాసేందుకు మురుగదాస్ అంగీకరించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉన్న మురుగదాస్ డైలాగ్స్ రాస్తుండటంతో అవెంజర్స్ ఎండ్ గేమ్‌కు సౌత్‌లో మంచి హైప్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
30 ఏళ్ల తరువాత రజనీకాంత్..!
పేట సినిమాతో మరోసారి వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్, తన తదుపరి చిత్రంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం పేట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రజనీ, నెక్ట్స్ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సర్కార్ సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ కోసం మాస్ యాక్షన్ సినిమాను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎక్కువగా డాన్ తరహా పాత్రలు మాత్రమే చేస్తున్న రజనీ దాదాపు 30 ఏళ్ల తరువాత పోలీస్ డ్రెస్‌లో కనిపించనున్నారట. అంతేకాదు ఇది రజనీ చివరి చిత్రం అన్న ప్రచారం కూడా జరుగుతుండటంతో అభిమానులు మురుగదాస్, రజనీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సూపర్ స్టార్ మరో సినిమాకు ఓకె చెప్పాడా..?
2.ఓ సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ 166వ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ హీరోగా సర్కార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్ తోడైతే రజనీ పొలిటికల్ ఎంట్రీకి కూడా ప్లస్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
‘రంగస్థలం’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సర్కార్’
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతూ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించి రికార్డ్ సృష్టించిన సర్కార్ ప్రస్తుతం ఈ ఏడాది సౌత్‌లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకుంది. రెండు వారాల్లో సర్కార్ 225 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2018లో సౌత్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రంగస్థలం పేరిట ఉంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్ రిలీజ్ కు ముందు వరకు టాప్ ప్లేస్‌లో ఉంది. విజయ్ సర్కార్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్ మరిన్ని రికార్డ్‌లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
‘సర్కార్’కి స్టార్స్ మద్దతు
విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన సర్కార్ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం విజయ్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ కావటంతో సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. తమిళనాట అధికార పార్టీ వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయంటూ విమర్శలు వినిపించాయి. అదే సమయంలో దివంగత నేత జయలలిత ను కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదంలో సర్కార్ సినిమాకుకు అండగా స్టార్ హీరోలు మద్ధుతు తెలుపుతున్నారు. సూపర్ రజనీకాంత్ సినిమాపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సెన్సార్ బోర్డ్ అన్ని రకాల క్లియరెన్స్ ఇచ్చిన తరువాతే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా కొన్ని సీన్స్ తొలగించాలంటూ రాద్ధాంతం చేయటం, ప్రదర్శనలు అడ్డుకోవటం చట్ట వ్యతికేరం అన్నారు. మరో టాప్ స్టార్ కమల్ హాసన్ ‘తమిళనాట ఇలాంటి పరిస్థితి కొత్తేం కాదు. రాజకీయ క్రీడలో ఇది ఆనవాయితీగా వస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. మరో స్టార్ విశాల్ కూడా విజయ్ సినిమా మద్దతు పలికారు. ‘దర్శకుడు మురుగదాస్ ఇంట్లో పోలీసులు..? ఎందుకోసం..? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవనే ఆశిస్తున్నా. సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా మంది ప్రజలు సినిమా చూశారు. అయినా ఈ గొడవ, ఏడుపు ఎందుకు’ అంటూ ట్వీట్ చేశారు. தணிக்கைக்குழு தணிக்கை செய்து படத்தை வெளியிட்டபிறகு,அந்தப் படத்திலிருந்து சில காட்சிகளை நீக்கவேண்டும் என்று போராட்டம் நடத்துவதும், திரையிடத் தடுப்பதும்,படத்தின் பேனர்களை சேதப்படுத்துவதும், சட்டத்திற்குப் புறம்பான செயல்கள். இத்தகைய செயல்களை நான் வன்மையாகக் கண்டிக்கிறேன். — Rajinikanth (@rajinikanth) 8 November 2018 முறையாகச்சான்றிதழ் பெற்று வெளியாகியிருக்கும் சர்கார் படத்துக்கு,சட்டவிரோதமான அரசியல் சூழ்ச்சிகள் மூலம் அழுத்தம் கொடுப்பது இவ்வரசுக்கு புதிதல்ல.விமர்சனங்களை ஏற்கத்துணிவில்லாத அரசு தடம் புரளும்.அரசியல் வியாபாரிகள் கூட்டம் விரைவில் ஒழியும்.நாடாளப்போகும் நல்லவர் கூட்டமே வெல்லும். — Kamal Haasan (@ikamalhaasan) 8 November 2018 Police in Dir Murugadoss s home????? For Wat?? Hoping and really hoping that nothin unforeseen happens. Once again. Censor has cleared the film and the content is watched by public.den why all this hue and cry. — Vishal (@VishalKOfficial) 8 November 2018 -
‘సర్కార్’ మూవీ రివ్యూ
టైటిల్ : సర్కార్ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, యోగిబాబు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్ నిర్మాత : కళానిధి మారన్ కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్ తెలుగులో మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సూర్య, విశాల్, కార్తీ లాంటి హీరోలు తెలుగునాట కూడా మంచి మార్కెట్ సాధించినా విజయ్ మాత్రం ఇంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. తుపాకి, అదిరింది లాంటి సినిమాలు టాలీవుడ్లో పరవాలేదనిపించినా విజయ్ స్థాయి సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోయాయి. తాజాగా మరోసారి మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సర్కార్ అందుకుందా..? ఈ సినిమాతో అయినా విజయ్ తెలుగు మార్కెట్లో జెండా పాతాడా..? స్పైడర్ సినిమాతో టాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్, సర్కార్‌తో ఆకట్టుకున్నాడా..? కథ ; సుందర్ రామస్వామి (విజయ్) సంవత్సరానికి 1800 కోట్లు సంపాదించే బిజినెస్‌మేన్. తను ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే కార్పోరేట్ క్రిమినల్. అలాంటి సుందర్ భారత్‌కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఉలిక్కి పడతాయి. కానీ ఇండియా వచ్చిన సుందర్ కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే వచ్చానని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఓటు వేయడానికి వెళ్లిన సుందర్‌కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. దీంతో ఎలక్షన్లను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. తరువాత అధికారి పార్టీ నేతలతో గొడవల కారణంగా సుందర్ స్వయంగా ఎలక్షన్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న సుందర్ ఇక్కడి కరుడు గట్టిన రాజకీయనాయకులతోఎలా పోరాడాడు? పోటికి దిగిన సుందర్‌కు ఎదురైన సమస్యలేంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు ; కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సూపర్బ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్ లో కనిపించిన విజయ్, అభిమానులు తన నుంచి ఆశించే అని అంశాలను తెరపై చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో విజయ్ పర్ఫామెన్స్ సూపర్బ్. మహానటిగా పేరు తెచ్చుకుంటున్న కీర్తి సురేష్‌కు ఈ సినిమాలో ఏమాత్రం ప్రాదాన్యం లేని పాత్రలో కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప కీర్తి సురేష్ ఎక్కడా పెద్దగా కనిపించదు. మరో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ది కూడా చిన్న పాత్రే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుడి పాత్రలో రాధారవి మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సీఎం పుణ్యమూర్తిగా కనిపించిన కరుప్పయ్య కూడా ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు. ఇతర పాత్రల్లో కనిపించిన వారంతా తమిళ వారే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. విశ్లేషణ ; కత్తి, తుపాకి లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి మురుగదాస్, విజయ్‌లు ఆ స్థాయిలో అలరించలేకపోయారు. విజయ్ మార్క్ స్టైల్స్, మాస్ అప్పీల్ కనిపించినా.. మురుగదాస్ గత చిత్రాల్లో కనిపించి వేగం ఈ సినిమాలో లోపించినట్టుగా అనిపిస్తుంది. ఓ కార్పోరేట్ క్రిమినల్, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు అన్న ఇంట్రస్టింగ్ పాయింట్‌ను తీసుకున్న దర్శకుడు కథనాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు. ఫస్ట్‌హాఫ్ యాక్షన్ సీన్స్, పొలిటికల్ పంచ్ డైలాగ్‌లతో ఇంట్రస్టింగ్‌గా నడిపించిన మురుగదాస్.. సెకండ్ హాఫ్‌ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాలో ఏ మాత్రం థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకుండా కథనం సాధాసీదాగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు మరీ లాజిక్ లేకుండా సిల్లీగా అనిపిస్తాయి. అయితే విజయ్ అభిమానులను మాత్రం మురుగదాస్ పూర్తి స్థాయిలో అలరించాడనే చెప్పాలి. హీరో బిల్డప్, యాక్షన్ సీన్స్‌లో విజయ్ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తేశాడు. కానీ తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ కావటం మాత్రం కష్టమే. భారీ బడ్జెట్ సినిమా కావటంతో క్వాలిటీ పరంగా వంక పెట్టడానికి లేదు. ఆర్ట్, సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సీన్స్ నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడతాయి. ఏఆర్ రెహహాన్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా పాటల్లో సాహిత్యం అర్థంకాకపోగా అసలే నెమ్మదిగా సాగుతున్న కథనంలో స్పీడు బ్రేకర్లల మారాయి. పాటలు నిరాశపరిచినా నేపథ్యం సంగీతం మాత్రం అలరిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ నటన యాక్షన్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; లాజిక్ లేని సీన్స్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘సర్కార్’కు షాక్
విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సర్కార్ సినిమాకు మరో చిక్కొచ్చిపడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు తొలిరోజు భారీగా సంఖ్యలో షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలోని పలు థియేరట్లలో 48 గంటల పాటు కంటిన్యూస్‌గా షోస్ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కంటిన్యూస్ షోష్ కాదు.. కనీసం ఎర్లీ మార్నింగ్ షోస్‌కు కూడా అనుమతి ఇవ్వలేదట. దీపావళి పండుగ కావటంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని అదనపు షోలకు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ షోలతోనే విజయ్ తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కేవలం తమిళ రైట్సే 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రాధారవి, ప్రేమ్‌కుమార్, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సర్కార్ కథ బయటకు చెప్పినందుకే’
విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన సినిమా సర్కార్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇటీవల పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. సర్కార్ కథ తనదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి తమిళ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే విషయం అక్కడ పరిష్కారం కాకపోవటంతో కోర్డు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా కీలకంగా వ్యవహరించారు. రెండు కథల మధ్య పోలికలు ఉన్నట్టుగా నిరూపించేందుకు భాగ్యరాజా సర్కార్ సినిమా కథను కూడా బయట పెట్టాల్సి వచ్చింది. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ భాగ్యరాజా రచయితల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కారణమేదైన సినిమా కథను బయటపెట్టడం తప్పే అన్న భాగ్యరాజా ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ను క్షమాపణ కోరినట్టుగా తెలిపాడు. -
సర్కార్ : 80 దేశాల్లో 3000 స్క్రీన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సర్కార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాదాల కారణంగా సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డా అన్ని క్లియర్ చేసుకొని అన్నుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సర్కార్ టీం. ఈ సినిమాను విజయ్ కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేనంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 80 దేశాల్లో 3000లకు పైగా స్క్రీన్స్‌లో సర్కార్ సినిమా విడుదల కానుందని తమిళ సినిమా ఎనలిస్ట్ రమేష్ బాల వెల్లడించారు. తెలుగు నాట కూడా సర్కార్ 600 స్క్రీన్స్‌పై సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా.. విజయ్ కెరీర్ లోనే కాదు, తమిళ సినిమా చరిత్రలోనే బిగెస్ట్రిలీజ్ గా రికార్డ్ సృష్టించనుందన్న టాక్ వినిపిస్తోంది. #Sarkar will release in 3,000 screens world-wide.. 80 countries.. Widest release for a Tamil movie.. pic.twitter.com/G1SkFidXfk — Ramesh Bala (@rameshlaus) October 31, 2018 -
‘సర్కార్’కి అంత వస్తుందా..?
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. దీపావళి కానుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అడ్డంకులన్ని తొలిగిపోయాయి. దీంతో నవంబర్ 6 సినిమా ప్రేక్షకుల ముందుకు రావటం ఖాయం అయ్యింది. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో విజయ్‌కి పెద్దగా మార్కెట్ లేదు. విజయ్ హీరోగా తెరకెక్కిన తుపాకి సినిమా ఒక్కటి తప్ప వేరే ఏ సినిమా కూడా ఇక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సర్కార్‌కి ఉన్న క్రేజ్ దృష్ట తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను దాదాపు 7 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే అంతకు మించి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి విజయ్ సర్కార్‌తో అయినా తెలుగు మార్కెట్లో సత్తా చాటుతాడేమో చూడాలి. ఈ సినిమా తమిళ వర్షన్ రైట్స్ 80 కోట్లకు పైగా అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ ఇటీవల చేసిన సినిమాలన్నీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో 80 కోట్లకు పైగా వసూళ్లు పెద్దగా కష్టమేమి కాదని భావిస్తున్నారు. విజయ్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలోనటించారు. -
సర్కార్ కథ కాపీనే..!
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, స్టార్ హీరో విజయ్ ల కాంబినేషన్లో సర్కార్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా తెరమీదకు వచ్చిన వివాదం సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలిగేలా చేసింది. వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి సర్కార్ కథ నాదే అని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంపై ముందుగా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పిన దర్శకుడు తరువాత మాట మార్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సర్కార్ కథ వరుణ్ రాజేంద్రన్దే అని అంగీకరించటంతో పాటు 30 లక్షల పారితోషికం, సినిమా టైటిల్స్‌లో వరుణ్‌కు క్రెడిట్ ఇచ్చేందుకు మురుగదాస్ అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి : కోర్టులోనే తేల్చుకుంటానన్న మురుగదాస్! -
విజయ్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
పాలించే తమిళుడి కోసం జనవరిలో ముహూర్తం జరుగుతోందన్నది తాజా సమాచారం. అంటే చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. అలాంటి టైటిల్స్‌కు ఇప్పుడు సరైన హీరో విజయ్‌నే అని చెప్పవచ్చు. ఈ స్టార్ హీరో తాజాగా నటించిన చిత్రం సర్కార్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పలు వివాదాల మధ్య దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ సినిమాలో సంచలన నటి వరలక్ష్మీశరత్‌కుమార్ రాజకీయనాయకురాలిగా ముఖ్యపాత్రలో నటించింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. తదుపరి ఆయన్ని దర్శకత్వం చేసే అవకాశం ఎవరికి లభిస్తుంది. ఏ చిత్ర నిర్మాణ సంస్థకు కాల్షీట్స్ ఇవ్వనున్నారు అనే ఆసక్తి చిత్ర పరిశ్రమలో నెలకొంది. విజయ్ తదుపరి చిత్రం గురించి కొన్ని వివరాలు అనధికారికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్ తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది. వారిది హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు తేరి, మెర్సల్ చిత్రాలు వచ్చి సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా విజయ్, అట్లీల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ చిత్ర ప్రారంభానికి వచ్చే ఏడాది జనవరిలో ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఇక అన్నింటికంటే ముఖ్యం దీనికి ఆళపోరాన్ తమిళన్ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ టైటిల్‌ను దర్శకుడు అట్లీ చాలా కాలం క్రితమే రిజిస్టర్ చేశారు. -
దసరా కానుకగా ‘సర్కార్’ టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. షూటింగ్ ప్రారంభమైన రోజే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రయూనట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పక్కా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టుగా ప్రటించారు యూనిట్. విజయదశమి కానుకగా అక్టోబర్ 19న విజయ్ సర్కార్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. #SarkarTeaserOn19th@actorvijay @ARMurugadoss @arrahman @KeerthyOfficial @varusarath pic.twitter.com/je2qdA1g64 — Sun Pictures (@sunpictures) 10 October 2018 -
దీపావళి బరిలో ఇద్దరు టాప్ స్టార్లు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాప్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన తుపాకి, కత్తి చిత్రాలు ఘనవిజయం సాధించటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాతో పోటి పడేందుకు మరో స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే కూడా దీపావళికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావటంతో ఎన్జీకే వాయిదా పడింది. ఇప్పుడు అదే స్థానంలో ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ‘ఎన్నయ్ నొక్కి పాయుమ్ తోట్ట’ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శశికుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ జోడిగా మేగా ఆకాష్ నటిస్తున్నారు. ధనుష్, విజయ్‌లు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో అభిమానులు దీపావళి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
రెహమాన్ స్వరం.. విజయ్ గళం
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాదించటంతో ఈ కాంబినేషన్‌పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరో విజయ్ ఓ పాటను ఆలపించనున్నారు. గతంలో విజయ్ పలు చిత్రాల్లో పాటలు పాడినా.. రెహమాన్ సంగీతదర్శకత్వంలో పాట పాడటం ఇదే తొలిసారి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రేమ్ కుమార్, రాధారవిలు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఈ నటి చాలా లక్కీ అట..!
సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్ ఇళయదళపతి విజయ్‌తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌కు జంటగా నటి కీర్తిసురేశ్ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్‌తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్‌సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్‌తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
సీన్ రివర్స్.. ఛాన్స్ మిస్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్ ఇన్నాళ్లు కూల్‌గానే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టుంది. ఈ అందాల భామకు అదృష్టంతో పాటు అందం కూడా బోలెడంత ఉంది. ఇప్పుడు ఈ భామకు వచ్చిన కష్టం ఏంటని అనుకుంటున్నారా? స్పైడర్ సినిమాతో తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తరువాత కార్తీ సరసన ధీరన్ అధిగరం ఒండ్రు (తెలుగులో ఖాకీ)తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఈ భామకు అవకాశాలు బాగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వచ్చిన అవకాశాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. తెలుగులో మొదటి సినిమా కెరటం నిరాశపరిచినా..రెండో సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. తరువాత చిన్న హీరోలతో నటిస్తూనే...పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. అవి వరుసగా హిట్స్ అవడంతో లక్కి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తన క్యూట్ లుక్స్‌తో, అందాల ఆరబోతతో కుర్రకారుకు మత్తెక్కించింది రకుల్ కూల్‌గా. లౌక్యం, పండుగచేస్కో, కిక్2 , నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ లాంటి వరుస హిట్లతో ఉన్న రకుల్ స్పీడుకి స్పైడర్ అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో చెప్పుదగ్గ సినిమాలేవి లేవు. తమిళంలో వచ్చిన అవకాశాలు సైతం చేజారిపోతున్నాయి. విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో మొదట రకుల్‌ని హీరోయిన్గా అనుకున్నారు. తర్వాత ఆ అవకాశం కీర్తిసురేశ్‌కు దక్కింది. అంతేకాదు సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలోనూ రకుల్‌నే మొదట హీరోయిన్గా అనుకున్నా.. ఆ ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఇలా ర‘కూల్’గా ఉండాల్సింది పోయి ఇప్పుడు టెన్షన్ పడాల్సి వస్తోంది. సౌత్ లో నిరాశపరిచినా. త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో ఉత్తరాదిలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది రకుల్. -
స్టార్ హీరో సరసన మరో ఛాన్స్
టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సంక్రాంతి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి సినిమాతో పాటు కోలీవుడ్‌లో సూర్య సరసన నటించిన గ్యాంగ్ సినిమాలు సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరోసారి కోలీవుడ్ టాప్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కీర్తిసురేష్. ఇలయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో విజయ్ సరసన భైరవ సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సూపర్ స్టార్ స్టామినా : 12 రోజుల్లో 150 కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. తెలుగు నాట పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మంచి రివ్యూస్ వచ్చాయి. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు సాదించిన స్పైడర్ కు ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా అలరించాడు. తమిళనాట ఈ వారం సినిమా రిలీజ్ లు ఆగిపోవటం కూడా స్పైడర్ కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. -
భారీ వసూళ్లతో దుమ్మురేపిన స్పైడర్!
ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'స్పైడర్'. దసరా పండుగ సందర్భంగా గత బుధవారం ఈ సినిమా విడుదలైంది. సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు 'స్పై'గా నటించాడు. దర్శకుడు ఎస్జే సూర్య.. మనుష్యులు ఏడిస్తే చూసి ఆనదించే సైకోగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని వినిపిస్తున్నా.. దసరా సెలవుల్లో రావడం.. మహేశ్‌బాబు-మురుగదాస్ కాంబినేషన్‌పై అంచనాలు ఉండటం ఈ సినిమాకు కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. 'స్పైడర్' వసూళ్లు దుమ్మురేపేలా ఉన్నాయంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. వారం మధ్యలో విడుదలైనప్పటికీ 'స్పైడర్'.. తొలిరోజే కళ్లుచెదిరేరీతిలో రూ. 51 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రెండురోజుల్లో రూ. 72 కోట్లు వసూలుచేసినట్టు చిత్రయూనిట్ శుక్రవారం ధ్రువీకరించింది. తొలి మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసిన.. స్పైడర్ వారాంతంలో రూ. 100 కోట్ల క్లబ్బులో చేరవచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి తొలివారంలోనే ఈ సినిమాకు రూ. 100 కోట్లు ఖాయమనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.