బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్, త్వరలో మరో టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉంది మురుగదాస్ టీం. అంతేకాదు సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేర్చేందుకు ఓ ఇంట్రస్టింగ్ టీజర్ రెడీ చేస్తుందట. దాదాపు 167 ఫ్రేమ్ లతో అద్భుతమైన టీజర్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ మహేష్ బాబు రెండు డైలాగ్లు కూడా ఉంటాయట. సినిమాలో కీలకమైన సీన్కు సంబంధించిన షాట్స్ను టీజర్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ స్పైడర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.