బాలీవుడ్ లో స్పైడర్ రీమేక్..? | Spyder Hindi remake with Mahesh babu | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ లో స్పైడర్ రీమేక్..?

Published Fri, Sep 29 2017 1:18 PM | Last Updated on Fri, Sep 29 2017 4:47 PM

Spyder Hindi remake with Mahesh babu

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ స్పైడర్. తొలి సారిగా ఈ సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అయిన మహేష్, మరోసారి బాక్సాఫీస్ ముందు సత్తా చాటాడు. తొలి రోజు డివైడ్ టాక్ తో స్టార్ట్ అయిన స్పైడర్ ఒక్క రోజులో 51 కోట్ల గ్రాస్ సాధించి మహేష్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సౌత్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటిన మురుగదాస్, స్పైడర్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ముందుగా ఈ సినిమానే డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు బాలీవుడ్ రీమేక్ తో మహేష్ బాబును బాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతను కూడా మురుగదాస్ తీసుకోబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ నాట స్పైడర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మురుగదాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తి కనబరుస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న స్పైడర్ బాలీవుడ్ రీమేక్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement