Spyder
-
తొలిసారి రంగంలోకి ‘స్పైడర్’... పాక్ డ్రోన్ కూల్చివేత
అహ్మదాబాద్: సైనిక నిఘాలో భాగంగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో తిరుగుతున్న పాకిస్థాన్ డ్రోన్‌ను భారత ఆర్మీ మంగళవారం ఉదయం కూల్చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టం ‘స్పైడర్’ సాయంతో పాక్ డ్రోన్‌ను నేలమట్టం చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్‌కు చెందిన డెర్బీ అనే డ్రోన్‌ను వాడారని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ‘స్పైడర్’ను భారత్ వాడటం ఇదే తొలిసారి. ప్రత్యర్థి యుద్ధవిమానాలను ముందస్తుగా గుర్తించి కూల్చడంలో సైన్యానికి ‘స్పైడర్’ అత్యంత కీలకం కానుంది. 2017 నుంచి ‘స్పైడర్’ వ్యవస్థ ఆర్మీకి అందుబాటులోకి వచ్చింది. పూల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పీవోకేలోని ఉగ్రవాద మూకలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరపడంతో ‘స్పైడర్’ ఉపయోగం ప్రాధాన్యం సంతరించుకుంది. -
డిజాస్టర్ రీమేక్‌తో బాలీవుడ్‌కు మహేష్..?
భరత్ అనే నేను సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సూపర్ స్టార్ అభిమానులు అవాక్కయ్యే వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్లలో ఒకటైన స్పైడర్ సినిమా రీమేక్ లో మహేష్ నటించనున్నారట. తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచిన స్పైడర్ తమిళ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మురుగదాస్. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడిన మురుగదా ఈ విషయాన్ని ధృవీకరించారు. స్పైడర్ సినిమా రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించిన మురుగదాస్.. హీరో ఎవరన్నది కన్ఫామ్ చేయలేదు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో మీరోగా నటించిన మహేషే, రీమేక్‌లోనూ నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్ ఎంట్రీపై స్పందించిన మహేష్, మంచి కథ దొరికితే హిందీ సినిమాకు రెడీ అన్నారు. దీంతో స్పైడర్ సినిమాతోనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై మహేష్ స్పందించాల్సి ఉంది. -
పోటీ లేకుండాపోయింది
గతేడాది సెప్టెంబర్ చివరి వారంలో ముగ్గరు పెద్ద హీరోల సినిమాలు ఒకే వారంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయనుకున్నారు. అవే.. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన ‘పైసా వసూల్’, మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘స్పైడర్’, బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేసిన ‘జై లవ కుశ’. అనుకున్నట్లుగా అయితే.. సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’, 27న ‘స్పైడర్’, ‘పైసా వసూల్’ రిలీజ్ కావాల్సింది. కానీ.. చెప్పిన టైమ్కన్నా ముందే ‘పైసా వసూల్’ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘జై లవ కుశ’ స్టెప్టెంబర్ 21న, ‘స్పైడర్’ 27న వచ్చాయి. మొత్తం మీద పోటీ లేకుండాపోయింది. -
మహేష్‌తో మరోసారి..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తనతో కలిసి నటించిన హీరోయిన్లను రిపీట్ చేసిన సందర్బాలు చాలా తక్కువ. ముఖ్యంగా సెంటిమెంట్లను ఫాలో అయ్యే సూపర్ స్టార్ తన ఫ్లాప్ సినిమాల హీరోయిన్లను రిపీట్ చేయటం మరింత అరుదు. కానీ ఓ ఫ్లాప్ సినిమాలో తనకు జోడీగా నటించిన హీరోయిన్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట సూపర్ స్టార్. ‘స్పైడర్’ లాంటి భారీ డిజాస్టర్ లో తనతో జోడి కట్టిన రకుల్ తో మరోసారి స్క్రీన్‌షేర్ చేసుకోవాలని భావిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న మహేష్, తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమాతో అయినా మహేష్, రకుల్ జోడి హిట్ పెయిర్ అనిపించుకుంటుందేమో చూడాలి. -
దంగల్ రికార్డ్ బ్రేక్, స్పైడర్ రికార్డ్ సేఫ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విజయ్ కెరీర్ లోనే తొలిసారిగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన మెర్సల్ ఓవర్సీస్ లో కూడా హవా కొనసాగిస్తోంది. అమెరికాలో 132 చోట్ల రిలీజ్ అయిన మెర్సల్.. దంగల్, రాయిస్ లాంటి బాలీవుడ్ చిత్రాలను రికార్డ్ లను బద్దలు కొట్టినట్టుగా ఫోర్బ్స్ తెలిపింది. మంగళవారం రిలీజ్ అయిన మెర్సల్ తొలిరోజు ఏకంగా 3,57,925 డాలర్ల వసూళ్లు సాధించింది. దీంతో తొలి రోజు 3,28,227 డాలర్లు సాధించిన దంగల్ ను వెనక్కు నెట్టి రికార్డ్ సృష్టించింది మెర్సల్. అయితే ఇటీవల విడుదలైన మహేష్ బాబు స్పైడర్ ను మాత్రం మెర్సల్ బీట్ చేయలోకపోయింది. అమెరికాలో ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజే స్పైడర్ 10 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలేవి బాహుబలి 2 దారిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాహుబలి 2 తొలిరోజు ఓవర్ సీస్ లో 55 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - స్పైడర్
-
భారీ వసూళ్లతో దుమ్మురేపిన స్పైడర్!
ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'స్పైడర్'. దసరా పండుగ సందర్భంగా గత బుధవారం ఈ సినిమా విడుదలైంది. సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు 'స్పై'గా నటించాడు. దర్శకుడు ఎస్జే సూర్య.. మనుష్యులు ఏడిస్తే చూసి ఆనదించే సైకోగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని వినిపిస్తున్నా.. దసరా సెలవుల్లో రావడం.. మహేశ్‌బాబు-మురుగదాస్ కాంబినేషన్‌పై అంచనాలు ఉండటం ఈ సినిమాకు కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. 'స్పైడర్' వసూళ్లు దుమ్మురేపేలా ఉన్నాయంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. వారం మధ్యలో విడుదలైనప్పటికీ 'స్పైడర్'.. తొలిరోజే కళ్లుచెదిరేరీతిలో రూ. 51 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రెండురోజుల్లో రూ. 72 కోట్లు వసూలుచేసినట్టు చిత్రయూనిట్ శుక్రవారం ధ్రువీకరించింది. తొలి మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసిన.. స్పైడర్ వారాంతంలో రూ. 100 కోట్ల క్లబ్బులో చేరవచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి తొలివారంలోనే ఈ సినిమాకు రూ. 100 కోట్లు ఖాయమనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. -
మురుగదాస్ భారీ ప్రాజెక్టు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కించిన మురుగదాస్, తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచినా కోలీవుడ్ లో మాత్రం సత్తా చాటాడు. అయితే త్వరలో ఈ స్టార్ డైరెక్టర్ ఓ భారీ ప్రయోగానికి రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ విజయ్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మురుగదాస్.. మహేష్ బాబు, విజయ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్పైడర్ తమిళ ప్రమోషన్ సందర్భంగా మురుగదాస్ ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు వర్షన్ కోసం మహేష్ బాబు హీరోగా, విజయ్ విలన్ గా నటిస్తే, తమిళ వర్షన్ లో విజయ్ హీరోగా మహేష్ బాబు విలన్ గా నటిస్తారట. మరి ఈ భారీ ప్రయోగం నిజంగానే సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి. -
దసరా బరిలో విజేత ఎవరు..?
ఈ దసరా సీజన్ లో తెలుగు తెరపై భారీ పోటి నెలకొంది. ఇద్దరు టాప్ హీరోలు వారం రోజుల గ్యాప్ లో తలపడటంతో థియేటర్లు కలకలలాడాయి. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు కావటంతో ప్రమోషన్, రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతటి భారీ పోటీలో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో బరిలో దిగాడు శర్వానంద్. మరి ఈ ముగ్గురిలో దసరా విజేత ఎవరు..? దసరా బరిలో ముందుగా థియేటర్లలోకి వచ్చిన హీరో ఎన్టీఆర్. జై లవ కుశ సినిమాతో సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కథలో కొత్తదనం లేకపోవటం లాంటి చిన్న చిన్న మైనస్ లు కనిపించినా.. లాంగ్ వీకెండ్ కలిసి రావటం వారం పాటు పోటి లేకపోవటంతో భారీ వసూళ్లనే సాధించి సత్తా చాటాడు. ఇప్పటికీ జై లవ కుశ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. పర్ఫెక్ట్ దసరా సీజన్ లో సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 120 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన స్పైడర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ రావటం అభిమానులను నిరాశపరిచింది. కానీ టాక్ ప్రభావం కలెక్షన్ల మీద మాత్రం కనిపించటం లేదు. రెండు భాషల్లో కలిపి ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కు చేరువైన స్పైడర్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దసరా సీజన్ లో చివరగా బరిలో దిగిన హీరో శర్వానంద్. పండుగ సీజన్ లో టాప్ స్టార్లతో పోటి పడి మంచి విజయాలు సాధించిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేలాగే ఉన్నాడు. పండుగకు ఒక్క రోజు ముందు థియేటర్లలోకి వచ్చిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రొటీన్ టేకింగ్ తో తెరకెక్కిన సినిమానే అయినా.. కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు మహానుభావుడు. మరి ఈ ముగ్గురిలో ప్రేక్షకులు ఎవరికి విజయాన్ని అందిస్తారో చూడాలి. -
మౌత్ టాక్ బాగుంది... ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు
‘‘హీరో మహేశ్‌గారు, దర్శకుడు మురుగదాస్‌గారితో పాటు మా టీమంతా ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ ‘స్పైడర్’కి పడ్డాం. ప్రేక్షకులకు మంచి సందేశంతో పాటు కొత్త కథను, కొత్తదనంతో కూడిన సినిమాను ఇవ్వాలనుకున్నాం. కొత్తదనమంటే కొంత రిస్క్ తప్పదు. ఆ రిస్క్ తీసుకునే సినిమా చేశాం. ఫస్ట్ రెండు మూడు షోలకు కాస్త మిక్డ్స్ టాక్ వచ్చినా... మెజారిటీ ఆడియన్స్‌కి సినిమా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. మహేశ్‌బాబు హీరోగా ఆయన సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పైడర్’ బుధవారం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ‘స్పైడర్’కి మంచి స్పందన లభిస్తోందంటున్న ‘ఠాగూర్’ మధు చెప్పిన విశేషాలు... ► తమిళంలో మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ వచ్చింది. బహుశా... అక్కడ కొంచెం అంచనాలు తక్కువ ఉండడం కారణమనుకుంటున్నా. కేరళలోనూ మంచి టాక్ వచ్చింది. ‘స్టార్ హీరో అయ్యిండి కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటి సినిమా చేయడం మహేశ్ గొప్పతనం’ అని రజనీకాంత్‌గారు అన్నారు. తెలుగులోనూ పలువురు ప్రముఖులు సినిమా బాగుందని చెప్పారు. దర్శకుడు సురేందర్‌రెడ్డిగారు మొదటి రోజే రెండుసార్లు సినిమా చూశానన్నారు. ‘హీరో ఇమేజ్, స్టార్డమ్ పక్కన పెట్టినప్పుడు ఇటువంటి మంచి కథలొస్తాయి. సినిమా అద్భుతంగా ఉంది’ అని సురేందర్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉన్నారు. 90 శాతం మంచి మౌత్‌టాక్‌ను బట్టి వెళ్తున్నారు. మెజారిటీ ప్రేక్షకులు సినిమా బాగుందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజుల్లో 72 కోట్ల రూపాయలు (గ్రాస్) ‘స్పైడర్’ కలెక్ట్ చేసింది. ► తెలుగు సినిమా పరిధి పెరగాలన్నా, ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నా... భారీ బడ్జెట్‌తో మంచి క్వాలిటీ సినిమాలు తీయక తప్పదు. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. 20, 30 భాషల్లో తెలుగు సినిమాను విడుదల చేయగల కెపాసిటీ ఉంది. తెలుగు సినిమా మార్కెట్ పెంచాలనే ఉద్దేశంతోనే అరబిక్‌లోనూ ‘స్పైడర్’ను రిలీజ్ చేశాం. అక్కడ కూడా మంచి స్పందన వస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రీమియర్ షో కలెక్షన్స్ బాగున్నాయి. -
బాలీవుడ్ లో స్పైడర్ రీమేక్..?
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ స్పైడర్. తొలి సారిగా ఈ సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అయిన మహేష్, మరోసారి బాక్సాఫీస్ ముందు సత్తా చాటాడు. తొలి రోజు డివైడ్ టాక్ తో స్టార్ట్ అయిన స్పైడర్ ఒక్క రోజులో 51 కోట్ల గ్రాస్ సాధించి మహేష్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సౌత్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటిన మురుగదాస్, స్పైడర్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ముందుగా ఈ సినిమానే డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బాలీవుడ్ రీమేక్ తో మహేష్ బాబును బాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతను కూడా మురుగదాస్ తీసుకోబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ నాట స్పైడర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మురుగదాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తి కనబరుస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న స్పైడర్ బాలీవుడ్ రీమేక్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఫ్లెక్సీకి నిప్పు.. మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆందోళన!
సాక్షి, రాజమండ్రి: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లెక్సీకి నిప్పుపెట్టడంతో రాజమండ్రిలో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని నందం గోవిందరాజు సెంటర్లో ఏర్పాటుచేసిన మహేష్ బాబు భారీ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తగలబెట్టారు. ఈ విషయం తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. మహేశ్‌బాబు తాజా సినిమా 'స్పైడర్' సూపర్ హిట్ కావడంతో తట్టుకోలేకనే దుండగులు ఈ పనికి ఒడిగట్టారని, ప్లెక్సీని తగలబెట్టినవారిని గుర్తించి పట్టుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. -
స్పైడర్ కు సూపర్ స్టార్ ప్రశంసలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం స్పైడర్. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తొలిసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మహేష్. మురుగదాస్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాకు తెలుగు నాట డివైడ్ టాక్ వచ్చినా.. కోలీవుడ్ లో మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు స్పైడర్ సినిమాపై పలువురు కోలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పైడర్ చిత్రాన్ని చూసి చిత్రయూనిట్ ని అభినందించినట్టుగా పీఆర్వో బిఏరాజు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'సినిమా చాలా బాగుంది. యాక్షన్ తో పాటు మంచి మేసేజ్ కూడా ఈ సినిమాలో ఉంది. మురుగదాస్ అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేశారు. మహేష్ బాబు ఎక్స్ ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. స్పైడర్ లాంటి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్ సభ్యులందరికీ అభినందలు' అన్నారు రజనీకాంత్. Superstar #Rajinikanth watched #SPYder and praised Superstar @urstrulyMahesh's intense performance & @ARMurugadoss's direction pic.twitter.com/HCoAUGPRYj — BARaju (@baraju_SuperHit) 28 September 2017 -
విశాఖలో స్పైడర్ అభిమానుల సందడి
-
సితార అల్లరిని కంట్రోల్ చేయలేం : మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడిన మహేష్, తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కొడుకు గౌతమ్ పుట్టిన రోజే తన జీవితంలో అత్యంత ఆనందం కలిగిన రోజని చెప్పిన మహేష్, తన కూతురు సితార అల్లరి ఎవరు కంట్రోల్ చేయలేరన్నాడు. ఇక తన సినిమాల ఎంపికలో భార్య నమ్రత, తండ్రి కృష్ణల ప్రమేయం ఏమాత్రం ఉండదని, సినిమాలను తనఇష్టాఇష్టాల మేరకు తానే సెలెక్ట్ చేసుకుంటానని తెలిపారు. అయితే ఆర్థికపరమైన విషాయాలు, యాడ్ ఎండార్స్ మెంట్ల లాంటివి మాత్రం నమ్రతే చూసుకుంటారని తెలిపాడు. ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్స్ కు వెల్లటం ఇష్టమన్న సూపర్ స్టార్ ఎక్కువగా స్విట్జర్లాండ్ లో గడిపేందుకు ఇష్టపడతానని తెలిపారు. -
మహేష్ కు 'స్పైడర్' ఎందుకంత స్పెషల్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా విషయంలో గతంలో ఎన్నడూ లేనంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారిగా తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సూపర్ స్టార్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గతంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని మహేష్, ఇటీవల చాలా మారారు. తన సినిమాలను తానే స్వయంగా ప్రమోట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడిన సూపర్ స్టార్, స్పైడర్ సినిమా తన కెరీర్ కు ఎందుకు స్పెషలో వివరించారు. అంతేకాదు దర్శకుడు మురుగదాస్ తో తన అనుబంధం గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపు పదేళ్లుగా మురుగదాస్ తో పరిచయం ఉందన్న మహేష్, స్పైడర్ కథ చెబుతున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందో అర్థమయ్యిందన్నారు. అందుకే ఈ సినిమా చేసేందుకు అంగీకరించానని తెలిపారు. -
మహేష్ కు 'స్పైడర్' ఎందుకంత స్పెషల్..!
-
రోజాతో రాజకుమారుడు
-
ఆయన దర్శకత్వంలో నటించడం మోస్ట్ మెమొరబుల్
తమిళసినిమా: ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అన్నది నా కెరీర్లోనే మోస్ట్ మెమొరబుల్‌గా భావిస్తున్నానని స్పైడర్ చిత్రంతో నేరుగా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేస్తున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పేర్కొన్నారు. టాగూర్ మధు సమర్పణలో ఎన్వీ.ప్రసాద్ నిర్మించిన భారీ ద్విభాషా చిత్రం స్పైడర్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారీష్‌జయరాజ్ సంగీతం అందించారు. మహేశ్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన ఇందులో ఎస్జే.సూర్య, భరత్ ప్రతినాయకులుగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలో లైకా సంస్థ విడుదల చేయనుంది. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు సంతరించు కున్న స్పైడర్ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం మద్యాహ్నం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మహేశ్‌బాబు సహకారంతోనే.. చిత్ర దర్శకుడు ఏఆర్.మురగదాస్ మాట్లాడుతూ తమిళం, తెలుగు అంటూ ద్విభాషా చిత్రం చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అలాంటిది ఈ చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన పూర్తి సహకారంతో చాలా సులభం చేశారని పేర్కొన్నారు. మరో నాలుగేళ్ల తరువాత కూడా చూసేలా చిత్రం ఉండాలని ఆయన తనతో అన్నారన్నారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారని అన్నారు. 10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది: మహేశ్‌బాబు మాట్లాడుతూ స్పైడర్ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోందని, అయితే ఇప్పటి నుంచే తన గుండె 10 రెట్లు అధికంగా కొట్టుకుంటోందని అన్నారు. తమిళంలో చిత్రం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉందని, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కలిసి స్పైడర్ కథ చెప్పడంతో దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ చేస్తే బాగుంటుందని భావించామని చెప్పా రు. మంచి కథ లభిస్తే మళ్లీ తమిళంలో నటిస్తానని మహేశ్‌బాబు అన్నారు. స్పైడర్ చిత్రం తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అన్నారు. స్పైడర్ చిత్రం మహేశ్‌బాబు కెరీర్లోనే దిబెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత ఎన్వీ.ప్రసాద్ పేర్కొన్నారు. -
తెలుగు సినిమాలను బెంగళూరు ఆదరిస్తుంది
శివాజీనగర (బెంగళూరు): తెలుగు సినిమాలను ఉభయ రాష్ట్రాల తర్వాత బెంగళూరు ప్రజలే ఎక్కువగా ఆదరిస్తారని సినీ హీరో మహేశ్‌బాబు అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా ప్రచారం కోసం ఆదివారం ఆయన బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన ఒక్కడు, అతడు, పోకిరి, శ్రీమంతుడు సినిమాలను బెంగళూరు ప్రేక్షకులు బాగా ఆదరించారని, స్పైడర్‌ను కూడా ఆదరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, నిర్మాత ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నా కెరీర్లోనే మోస్ట్ మెమొరబుల్.. హీరో
చెన్నై: ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అన్నది నా కెరీర్లోనే మోస్ట్ మెమొరబుల్‌గా భావిస్తున్నానని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నారు. స్పైడర్ సినిమాతో నేరుగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్వీ. ప్రసాద్ నిర్మించిన భారీ ద్విభాషా చిత్రం స్పైడర్. ఈ చిత్రానికి హీరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. మహేశ్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటించారు. ఎస్జే. సూర్య, ప్రేమిస్తే నిమా హీరో భరత్ విలన్లుగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలో లైకా సంస్థ విడుదల చేయనుంది. టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో ఈ సినిమా భారీ అంచనాలు సంతరించకుంది. స్పైడర్ మూవీ ఈ నెల 27న(సెప్టెంబర్) విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం మద్యాహ్నం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మహేశ్‌బాబు సహకారంతోనే.. చిత్ర దర్శకుడు ఏఆర్. మురుగదాస్ మాట్లాడుతూ.. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అలాంటిది హీరో మహేశ్‌బాబు తన పూర్తి సహకారంతో చాలా సులభం చేశారని పేర్కొన్నారు. ఈ సినిమా మరో నాలుగేళ్ల తరువాత కూడా చూసేలా ఉండాలని ఆయన తనతో అన్నారన్నారు. హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారని ఆయన అన్నారు. 10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది.. మహేశ్‌బాబు మాట్లాడుతూ.. స్పైడర్ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుందన్నారు. అయితే ఇప్పటి నుంచే తన గుండె 10 రెట్లు అధికంగా కొట్టుకుంటోందని అన్నారు. తమిళంలో చిత్రం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉందని తెలిపారు. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కలిసి స్పైడర కథ చెప్పడంతో దీన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ చేస్తే బాగుంటుందని భావించామని చెప్పారు. మంచి కథ లభిస్తే మళ్లీ తమిళంలో నటిస్తానని మహేశ్‌బాబు అన్నారు. స్పైడర్ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ అన్నారు. స్పైడర్ చిత్రం మహేశ్‌బాబు కెరీర్లోనే దిబెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత ఎన్వీ. ప్రసాద్ పేర్కొన్నారు. -
నటుడిగానే కొనసాగుతా : స్టార్ డైరెక్టర్
దక్షిణాదిలో సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్ జె సూర్య. వాలి, ఖుషి, న్యూ (తెలుగులో నాని) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య, తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. అయితే న్యూ తరువాత దర్శకుడిగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించటంలో విఫలమవుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాల్లోనూ నటిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న మహేష్ బాబు స్పైడర్ తో పాటు విజయ్ మెర్సల్ సినిమాల్లోనూ సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఘన విజయాలు అందించిన ఈ దర్శకుడు ఇక దర్శకత్వం వహించేది లేదని చెప్పేశారు. ఇప్పటికే డైరెక్టర్ గా చాలా సాధించానని, ఇక పై నటుడిగానే కొనసాగుతానని తెలిపారు. తాను సినీ రంగానికి నటుడు కావాలన్న కోరికతోనే వచ్చానని, అనుకోకుండా దర్శకుడిగా మారానని తెలిపారు. -
స్పైడర్ ఎలా ఉందంటే..
‘స్పైడర్’తో సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకుడు, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. స్పైడర్ సినిమా మొత్తంలో బోరింగ్ ఎలిమెంట్లు అస్సలు లేవని, సినిమా బాగా వచ్చిందని, అద్భుతంగా ఉందని తనకు సెన్సార్‌బోర్డ్ సభ్యులు చెప్పారని పేర్కొన్నారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమా మొత్తం ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు. మొత్తానికి ఈ దసరాకు మహేశ్‌బాబు ఓ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని తేల్చిచెప్పేస్తున్నారు. ఇప్పటికే స్పైడర్‌పై భారీ అంచనాలు ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింతగా పెరిగింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. తాజాగా ఉమైర్ సంధు ట్వీట్‌తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో భరత్ మరో విలన్ గా కనిపించనున్నాడు. తమిళ నటుడు ఆర్జే బాలాజీ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సింగిల్ కట్ కూడా లేకుండా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మద్యపాన, ధూమపాన సన్నివేశాలు అస్సలు లేకపోవడంతో సినిమాకు ముందు, ఇంటర్వెల్ సమయంలో వార్నింగ్ యాడ్స్‌కు మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు. As per Censor Board Members, #SPYder has no Dull Moment throughout the film ! A full on Racy Screenplay ! @urstrulyMahesh looking Terrific 👍 pic.twitter.com/mYmPihP2Zi — Umair Sandhu (@sandhumerry) September 18, 2017 -
ఒక్కసారి కమిటైతే ప్రాణం పెట్టి నటిస్తా..
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'స్పైడర్'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నగరంలోని శిల్ప కళావేదికలో అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో విడుదల చేసిన స్పైడర్ చిత్ర అరబిక్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. నాకు డైరెక్టర్లు దేవుళ్లతో సమానం.. 'సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి నటిస్తా.. నాకు డైరెక్టర్లు దేవుళ్లతో సమానం... ఇది నమ్మాను కాబట్టే నాకు ఇంత మంది అభిమానులున్నారు. మీలాంటి అభిమానులు ఏ హీరోకు ఉండరు. నచ్చితేనే సినిమా చూస్తారు. లేకపోతే చూడరు. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. ఈ రోజుకోసం ఏడాదిన్నరగా ఎదురు చూశాం. 10 ఏళ్ల కింద పోకిరి సమయంలో మురుగదాస్‌ను కలిశాను. ఆయనతో కలిసి చేయడం నా అదృష్టం. డబ్బింగ్ చేసేప్పుడు నేనే స్టన్ అయిపోయా. ఒక సినిమాను రెండు సార్లు చేయడం మామూలు విషయం కాదు. ఎంతో ఎనర్జీ ఉన్న డైరక్టర్‌తో మాత్రమే ఇది సాధ్యమౌతుంది. 10 ఏళ్ల కింద ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. స్పైడర్ లాంటి సినిమా తీయాలంటే ఒక ఫ్యాషన్ ఉండాలని నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తారు. చిన్నప్పటి నుంచి కెమెరామెన్ సంతోష్ శివన్‌తో కలిసి పని చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందన్నారు. పీటర్ హెయిన్స్ మాస్టర్ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు' అని మహేశ్ బాబు అన్నారు. కొత్త మహేశ్‌ను చూడబోతున్నారు మహేశ్ బాబు లేక పోతే ఈ సినిమా లేదని స్పైడర్ దర్శకుడు మురుగదాస్ అన్నారు. ఈ చిత్రంలో కొత్త మహేశ్ బాబును చూడబోతున్నారని తెలిపారు. పీటర్హెయిన్స్ యాక్షన్ సీన్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీశారన్నారు. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయబోతోంది మహేశ్ బాబు అభిమానులను స్పైడర్ ఆకట్టుకుంటుందని ప్రముఖ దర్శకుడు, చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించిన ఎస్ జే సూర్య అన్నారు. ఇది ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమని తెలిపారు. ఇండస్ట్రీలో రికార్డులన్నీ స్పైడర్ బ్రేక్ చేయబోతోందన్నారు. ఈ చిత్రాన్ని నేనే నిర్మించాలనుకున్నా ఈ చిత్రాన్ని తానే నిర్మించాలనుకున్నానని, కానీ తన మిత్రులకు ఈ అవకాశం దొరికిందని దిల్ రాజు అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అమీర్ తర్వాత మహేశ్ బాబే.. చెన్నైలో జరిగిన ఫంక్షన్‌కు తాను వెళ్లానని, అక్కడ మురుగదాస్ చెప్పిన విషయాలను దర్శకుడు వంశీ పైడిపల్లి పునరుద్ఘాటించారు. 'ప్రతి దర్శకుడు చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ లేక మరో విషయం గురించో ఆలోచించరు. దర్శకుడికి ప్రతి సినిమా రీలీజ్‌కు ముందు ఒక రకమైన ఆందోళన ఉంటుంది. అయితే కేవలం హీరో మాత్రమే ఆ ఆందోళనను తొలగించగలుగుతాడు. అలా అమీర్ ఖాన్ తర్వాత తనకు మహేశ్ బాబు ధైర్యం చెప్పాడు' అని మురుగదాస్ తమిళనాడులో జరిగిన ఫంక్షన్లో చెప్పిన విషయాలను వంశీ చెప్పారు. మహేశ్ అభిమానులకు క్షమాపణ చెబుతున్నా మహేశ్ బాబు దగ్గరికి వెళ్లిన ఐదు నిమిషాల్లో నాపై నమ్మకంతో ఓకే చెప్పారు. ఇది మహేశ్ బాబు కేరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. వేదికకు బయట చాలా మంది మహేశ్ అభిమానులు ఉన్నారని వారందరికి క్షమాపణలు చెబుతున్నానని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. మిస్సయిన అభిమానులందరిని కలుపుకొని మరో పెద్ద ఫంక్షన్ జరుపుకుందామన్నారు. చిత్రబృందం సభ్యుల పనితీరును వివరించారు. -
'స్పైడర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది'
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైథ్రిల్లర్ మూవీ 'స్పైడర్'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నగరంలోని శిల్ప కళావేదికలో అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్న ఈ వేడుకలో అలనాటి సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. 'మహేశ్ సినిమా సినిమాకు ఇంప్రూమెంట్ చూపిస్తున్నాడు. చాలా అద్భుతంగా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మద్రాస్‌లో ఉన్న మహేశ్ చాలా స్పష్టంగా తమిళ ఆర్టిస్టులాగే మాట్లాడాడు' అని కృష్ణ అన్నారు. గతంలో తమిళం నేర్చుకోలేకపోవడం వల్ల తనకు తమిళ సినిమాలో మొదట అవకాశం వచ్చినా చేయలేకపోయానని గుర్తుచేసుకున్నారు. చాలా గొప్ప దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తమిళంలో మహేశ్ పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ పిక్చర్ డెఫినెట్‌గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలో కృష్ణ, విజయ నిర్మల, మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రత, దర్శకుడు మురగదాస్, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఇతర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
స్పైడర్.. సడన్ సర్ప్రైజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తమిళ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్.. అభిమానులకు ఓ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. టీజర్ ను ముందుగానే ఎనౌన్స్ చేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ చేసిన మూవీ టీం, ట్రైలర్ రిలీజ్ ను మాత్రం కేవలం ఒక గంట ముందే వెల్లడించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్రైలర్ తో పాటు ‘అక్కడ ఉన్నాడు అనే’ మాస్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా గీత మాధురి ఆలపించారు. మహేష్ క్యారెక్టరైజేషన్ తో పాటు సినిమా థీమ్ ను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింతగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. ఇప్పటికే చెన్నైలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించగా ఇవాళ (శుక్రవారం) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మహేష్ బాబు సూపర్ మాస్ సాంగ్
-
స్పైడర్.. సడన్ సర్ప్రైజ్
-
గాల్లో కన్నై గస్తీ కాసే గూఢచారి!
విధ్వంసం సృష్టించడానికి శత్రువులు స్కెచ్ వేశారు. కానీ, ఎగ్జిక్యూట్ చేసే లోపే ఆ స్కెచ్‌ని ఒక స్పై (గూఢచారి) కనిపెట్టి, ప్లాన్‌ని విఫలం చేస్తాడు. ఈసారి శత్రువులు మరొకటి ప్లాన్ చేయాలనుకున్నారు. ఈసారి వాళ్లే విఫలమైపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా... ఈ స్పై ఎలాంటోడో... గాల్లో కన్నై గస్తీ కాస్తాడు. జరిగిన తప్పును, వచ్చే ముప్పును చేధిస్తాడు. అచ్చు ఇలాంటి స్పై రోల్లోనే మహేశ్‌బాబు హీరోగా ఏ.ఆర్. మురగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘స్పైడర్’ చిత్రం రూపొందింది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. హ్యారీశ్ జయరాజ్ స్వరకర్త. ఈ చిత్రంలో ‘బూమ్.. బూమ్...’ పాటను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాటలో ‘గాల్లో కన్నై గస్తీ కాస్తాడు...’ అంటూ హీరో రోల్ ఎంత పవర్ఫుల్లో చెప్పారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను ఈ 15న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరపనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. -
హమ్మయ్య.. స్పైడర్ షూటింగ్ పూర్తయ్యింది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి షాట్ పూర్తయినట్టుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ లో వెల్లడించింది. షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 27న తెలుగు తమిళ భాషల్లో భారీగా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో భరత్ మరో విలన్ గా కనిపించనున్నాడు. తమిళ నటుడు ఆర్జే బాలాజీ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళనాట ఈ రోజు (09-09-2017) ఏర్పాటు చేసిన భారీ ఆడియో రిలీజ్ వేడకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందు హైదరాబాద్ తో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. And a mandatory pic wd d captain himself @ARMurugadoss sir after d last shot. #SPYderOnSeptember27th pic.twitter.com/xdfQypaSh5 — Rakul Preet (@Rakulpreet) 9 September 2017 -
విడుదలకు ముందే రూ.150కోట్ల బిజినెస్!
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోత్సవం సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్పైడర్ చిత్రంతో కాస్తంత దూకుడుగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రంకోసం చివరి గీతాన్ని రోమానియాలో చిత్రీకరిస్తున్నారు. కాగా, ఇప్పుడు చిత్రవర్గాల్లో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే విడుదలకు ముందే రూ.150కోట్ల బిజినెస్ చేసేసిందట. శాటిలైట్ హక్కులు, పంపిణీ హక్కులు కలిపి ఇప్పటికే ఈ సినిమా రూ.150కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. మొత్తానికి ఊహించినదానికంటే ఎక్కువగానే ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోందట. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశతో కూడా ఈ సినిమా పోటీ పడనుంది. -
'స్పైడర్' రెండో పాట విడుదల
సాక్షి, హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'స్పెడర్'. తెలుగు, తమిళ భాషల్లో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట 'బూమ్ బూమ్'కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాలోని రెండవ పాటను చిత్రం యూనిట్ సోమవారం విడుదల చేశారు. 'ఏ పుచ్చకాయ.. పుచ్చకాయ.. నీ పెదవి తీపి నాకిచ్చుకోవే.. ఇచ్చుకోవే.. నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి.. నా గుండెకొచ్చి గుచ్చుకోవే.... హాలీ హాలీ.. ఏ హాలీ హాలీ హాలిబి..' అంటూ సాగే ఈ పాట లిరిక్ వీడియోను విడుదల చేశారు. అంతేకాదు ఈ వీడియోలో పాట మేకింగ్ కూడా ఉంది. ఈచిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులతోపాటు టాలీవుడ్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాపై వున్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
'స్పైడర్' రెండో పాట విడుదల
-
స్పైడర్ సీన్స్ లీక్‌పై క్లారిటీ..!
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు లీక్ అవ్వటం కామన్ అయిపోయింది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ లీక్ అయ్యాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయం పై స్పందించిన చిత్రయూనిట్ అలాంటిదేమి లేదంటూ కొట్టిపారేసింది. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేసిన స్పైడర్ టీం, కొంత మంది కావాలనే ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారని తెలిపింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా అలరించనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. Do NOT believe rumours about ANY leakage of #SPYder footage.Some elements are spreading Fake videos. — Spyder (@SpyderTheMovie) 3 September 2017 -
సెన్సార్ బోర్డ్‌కు 'స్పైడర్' టీం రిక్వెస్ట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతోంది. గత కొంత కాలంగా సెన్సార్ బోర్డ్ ఆదేశాల మేరకు సినిమాల ప్రదర్శనకు ముందే ధూమపానం, మద్యపానానికి సంబంధించిన స్టాట్యూటరీ వీడియోను ప్లే చేస్తున్నారు. ప్రతీ సినిమాలో ఏదో ఒక సందర్భంగా ధూమపానం, మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి గనుక ఈ వీడియో తప్పనిసరి అయ్యింది. అయితే మహేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో ఏ ఒక్క సీన్ లోనూ ధూమపానం, మద్యపానం చేస్తూ ఎవరూ కనిపంచరట. విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య కూడా సినిమా అంతా గ్రీన్ టీ తాగుతూనే కనిపిస్తాడట. బ్యాక్ గ్రౌండ్ లోనూ ఇలాంటి విజువల్స్ లేవు కాబట్టి తమ సినిమాకు స్టాట్యూటరి వార్నింగ్ వీడియో లేకుండా ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ ను కోరుతున్నారు స్పైడర్ యూనిట్. మరి సెన్సార్ బోర్డ్ మురుగదాస్ టీం అభ్యర్థనను ఎంత వరకు మన్నిస్తుందో చూడాలి. -
ప్రభాస్‌తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..!
ప్రస్థుతం మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ త్వరలో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడట. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న మురుగదాస్ భారీ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ పేరు తెచ్చుకున్నాడు. సౌత్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా మురుగదాస్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. స్పైడర్ తరువాత తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మురుగదాస్. అయితే పలు బాలీవుడ్ సంస్థలు మురుగదాస్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభాస్, మురుగదాస్ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి అయితే కాని ఈ కాంబినేషన్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
నా ఉనికికి కారణం తను : మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు ఘట్టమనేని వారసుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు గౌతమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ కూడా తన వారసుడికి ఓ హార్ట్ టచింగ్ ట్వీట్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'నా ఉనికికి కారణం అతనే, నన్ను నడిపించే శక్తి, నా కొడుకు, నా జీవితం, నా సంతోషం. హ్యాపి బర్త్ డే గౌతమ్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్పైడర్ సినిమా షూటింగ్ కోసం రొమానియాలో ఉన్న మహేష్, ఈ షెడ్యూల్ తో స్పైడర్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ తిరిగొచ్చాక ఇప్పటికే ప్రారంభమైన కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న స్పైడర్ సెప్టెంబర్ 27న భారీగా రిలీజ్ కానుంది. He is the reason for my existence.. my driving force.. my son.. my world.. my happiness.. Happy Birthday, Gautam Stay blessed! — Mahesh Babu (@urstrulyMahesh) 31 August 2017 -
బిగ్ బాస్‌లో సూపర్ స్టార్..?
తెలుగు, తమిళ నాట బిగ్ బాస్ హవా కనిపిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహిరస్తున్న బిగ్ బాస్ షోలో స్టార్లు సందడి చేస్తున్నారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ హౌస్ లో దర్శనమిస్తున్నారు. ఇప్పటికే రానా, తాప్సీ, విజయ్ దేవరకొండ లాంటి వారు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. తమిళ నాట కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అయితే త్వరలో తమిళ బిగ్ బాస్ లో సూపర్ స్టార్ మహేష్ సందడి చేయనున్నాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మహేష్, అక్కడ స్పైడర్ ను భారీగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నాడు. త్వరలో ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసేందుకు బిగ్ బాస్ హౌస్ లో సమయం గడపాలన్న నిర్ణయం తీసుకున్నారట. తమిళ వర్షన్ కు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో షోలో పాల్గొనేందుకు మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. కోలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగా మహేష్, బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే అదే బుల్లితెరపై సంచలనమవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
స్పైడర్ : మరో సర్ప్రైజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ స్టార్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. హిందీ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను అరబ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు అరబిక్ లోనూ డబ్ చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటు అరబిక్ లోనూ ఒకేసారి సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. -
ఒకే వేదికపై ఇద్దరు సూపర్ స్టార్లు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ హీరోగా రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా కావటంతో సూపర్ స్టార్ ను కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓ భారీ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీగా ఆడియో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హైప్ తీసుకువచ్చేందుకు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను వేడుకకు ఆహ్వానిస్తున్నారట. రజనీ హీరోగా తెరకెక్కుతున్న 2.0 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ స్పైడర్ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో రజనీ, స్పైడర్ వేడుకలో పాల్గొనటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతినాయకులుగా తమిళ నటులు ఎస్ జె సూర్య, భరత్ లు నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. -
తెలుగు పాట రాసిన తమిళ రచయిత
బాహుబలి సినిమా కోసం ప్రత్యేక కిలికిలి భాషను సృష్టించిన ఘనత తమిళ రచయిత మదన్ కర్కీదే. స్వతహాగా తమిళ గేయ రచయిత అయిన మదన్ బాహుబలి సినిమా కోసం ఓ భాషను తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో రికార్డ్ సృష్టించనున్నాడు ఈ యంగ్ రైటర్. ఇతర భాషల్లో మాట్లాడటమే కష్టం అలాంటి మదన్ ఏకంగా పరాయి భాషలో పాట రాశాడు. మురుగదాస్ దర్శకత్వంతో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాతో తెలుగును గేయ రచయితగా పరిచయం అవుతున్నాడు మదన్ కర్కీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. Penned my first Telugu song for @urstrulyMahesh’s #Spyder. Big thanks to Director @ARMurugadoss & @Jharrisjayaraj for trusting in me. — Madhan Karky (@madhankarky) 18 August 2017 -
అతడు నచ్చితేనే పెళ్లి : టాప్ హీరోయిన్
సాక్షి, చెన్నై: జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి గురించి ప్రతి యువతి కలలు కంటుంది. తను ఎలా ఉండాలనేది కూడా ముందుగానే ఊహించుకుంటుంది. ఇక సినీ కథానాయికలైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అలాంటి ముందు జాగ్రత్తలే తీసుకుంటానంటోంది. కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన నిలదొక్కుకోలేకపోయినా, టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా రకుల్ పట్టం దక్కించుకుంది. ఇక కోలీవుడ్‌నూ పాగా వేసే ప్రయత్నంలోనే ఉంది. ఇందుకోసం ప్రస్తుతం పనిచేస్తున్న రెండు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మహేశ్‌బాబుతో జత కట్టిన ద్విభాషా చిత్రం స్పైడర్‌తో పాటు, తమిళంలో కార్తీకి జంటగా ధీరన్ అధికారం ఒండ్రు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యతో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతోన్న ఈ అందగత్తే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయమై ఒకభేటీలో పేర్కొంటూ, మంచి అందగాడై ఉండాలని కాకుండా మంచి పొడుగైన వాడై ఉండాలనీ చెప్పింది. అంతకంటే ముఖ్యం మంచి వాడై ఉండాలట. ఒక వ్యక్తి మంచి వాడా? చెడ్డవాడా? అని చూసిన వెంటనే చెప్పలేమనీ, అందుకనే చూసి, కలిసి మెలిగి ఆ తరువాత తన ప్రవర్తన మంచి అనిపిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకే పెళ్లికి తొందర పడటం లేదనీ రకుల్ చెప్పుకొచ్చింది. -
మహేష్ కోసం భారీ వేడుక..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇదే తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. దీంతో మహేష్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు నిర్మాతలు కష్టపడుతున్నారు. ఇప్పటివరకు స్పైడర్ సినిమాకు మురుగదాస్ పేరు మీదే కోలీవుడ్ లో బిజినెస్ జరిగింది. అందుకే మహేష్ బాబు కోలీవుడ్ జనాలకు సూపర్ స్టార్ గా ప్రజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం త్వరలో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీ వేడుకతో మహేష్ ను లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. -
ఈ సారి మహేష్, ఎన్టీఆర్‌లతో..!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరోసారి రిస్క్ చేస్తున్నాడు. వరుసగా రెండు సార్లు సంక్రాంతి బరిలో సీనియర్ స్టార్ హీరోలతో పోటిపడ్డ శర్వా.. ఈ సారి దసరా బరిలో అదే ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలను సంక్రాంతి సీజన్ లో ఎదుర్కొన్న ధైర్యంతో దసరా బరిలో మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో తలపడుతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానుభావుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఇప్పటికే దసరా బరిలో జై లవ కుశ, మహేష్ బాబు స్పైడర్ సినిమాలు దసరా బరిలో పోటీ పడుతున్నాయి. ఇంతా భారీ కాంపిటీషన్ లో శర్వా తన సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు. -
రేపే మహేష్ కొత్త సినిమా లాంచ్..!
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. తాజాగా మరో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నాడు సూపర్ స్టార్. తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించాడు మహేష్. దిల్ రాజు, అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రేపు(13-08-2017) పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. భరత్ అను నేను తో పాటు వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మహేష్. తన సినిమాల ఓపెనింగ్ కు మహేష్ హాజరుకాడు. అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఈ 25 సినిమా కూడా మహేష్ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. -
మహేష్ సినిమాతో మంజుల మూవీ ట్రైలర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పెడర్. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరో ఓ చిన్న సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సోదరి, నటి అయిన మంజులు తొలిసారిగా దర్శకత్వ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో జెమినీ కిరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమాతో మంజుల దర్శకురాలిగా పరిచయం అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమైనా దస్తర్, త్రిధా చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు రథన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ స్పైడర్ సినిమా బ్రేక్ లో ప్రదర్శించనున్నారు. -
బర్త్‌డే గిఫ్ట్
మహేశ్‌బాబు బర్త్‌డే నేడు. ఆ విషయం ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లను ఖుషీ చేయాలని ‘స్పైడర్’ టీమ్ ఓ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేసింది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రసమర్పకుడు ‘ఠాగూర్’ మధు, నిర్మాత ఎన్వీ ప్రసాద్, దర్శకుడు మురుగదాస్ ఈ రోజు కొత్త టీజర్‌ను విడుదల చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 23 వరకు పాట షూటింగ్ జరుగుతుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవెపు డబ్బింగ్, రీ–రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాం. దసరా కానుకగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
సూపర్ స్టార్ సినిమా రీమేక్‌లో సూపర్ హీరో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు మురుగదాస్ కు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉండటంతో స్సైడర్ ను అక్కడ కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మాత్రం ఇందుకు అడ్డుపడుతున్నాడట. స్పైడర్ సినిమాను బాహుబలి తరహాలో కరణ్ బాలీవుడ్ లో రిలీజ్ చేస్తారని భావించారు. అయితే తాజాగా కరణ్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయటం కాకుండా రీమేక్ హక్కులు తీసుకొని తిరిగి నిర్మించే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. స్పైడర్ జేమ్స్ బాండ్ తరహా కథ కావటంతో బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తో ఈసినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే స్పైడర్ సినిమా డబ్ చేయకుండా తనకు రీమేక్ హక్కులు ఇవ్వాలని కోరుతున్నాడట. అయితే ప్రస్తుతానికి స్పైడర్ టీం మాత్రం ఈ సినిమాను బాలీవుడ్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగానే ప్రకటించింది. -
ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్ లో ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ఫస్ట్ సాంగ్ ఆడియో రిలీజ్ చేసిన మహేష్, అదే పాటకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ వీడియోనూ పోస్ట్ చేశాడు. మహేష్ కూతురు సితార రెగ్యులర్ సినిమా సెట్స్ లో దర్శనమిస్తుంటుంది. తాజాగా తను కార్ లో వెళ్లూ స్పైడర్ పాటను పాడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మహేష్. 'తను ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్' అని కామెంట్ చేశాడు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి సెప్టెంబర్ 27న స్పైడర్ గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. She keeps listening to it on repeat mode :) her favourite new song 😊😊😊😊😊😊😊 pic.twitter.com/QTKu1pVVO9 — Mahesh Babu (@urstrulyMahesh) 6 August 2017 -
ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన మహేష్
-
రకుల్ ప్రీత్ మళ్లీ రూటు మారుస్తోంది!
చెన్నై: నటి రకుల్‌ప్రీత్ సింగ్ తాజాగా కోలీవుడ్‌పై గురి పెట్టినట్లుంది. ఈ ఉత్తరాది బ్యూటీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక్కడ యంగ్ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, నాగచైతన్య లాంటి హీరోలతో నటించి హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాలతో రానున్న స్పైడర్ చిత్రంలో నటించిన రకుల్.. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ భామకు స్పైడర్ రీ ఎంట్రీ చిత్రం అవుతుంది. నిజానికి తొలుత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రకుల్ 'తడయార తాక్క', పుత్తగం, 'ఎన్నమో ఏదో' మూవీలలో నటించింది. ఏ ఒక్కటీ ఆశించిన విజయాలను అందుకోక పోవడంతో అమ్మడిని పక్కన పెట్టేశారు. దీంతో టాలీవుడ్‌కు జంప్ చేసి వరుస సక్సెస్‌లను అందుకుంది. అయితే తాజాగా కోలీవుడ్‌పై ఆమె కన్నేసినట్లుంది. స్పైడర్‌తో కలిపి కోలీవుడ్‌లో నాలుగు భారీ చిత్రాలు రకుల్ చేతిలో ఉన్నాయి. స్పైడర్ త్వరలో విడుదలకు ముస్తాబవుతుండగా తాజాగా కార్తీకి జంటగా ధీరన్ అధికారం ఒండ్రు, సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సరసన ఒక చిత్రం ఇప్పటికే కమిట్ అయింది. కార్తీతో నటిస్తున్న ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ దశలో ఉండగా, సూర్యతో రొమాన్స్ చేసే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. వీటితో పాటు ఇళయదళపతి విజయ్‌తో జోడీ కట్టే అవకాశాన్ని కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మెర్శల్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. దీంతో కోలీవుడ్‌లో టాప్ పోజిషన్‌కు ఈ భామ గురి పెట్టినట్లు తెలుస్తోంది. -
మైండ్ బ్లోయింగ్ ‘బూమ్ బూమ్’ వచ్చేసింది..
-
మైండ్ బ్లోయింగ్ ‘బూమ్ బూమ్’ వచ్చేసింది..
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ సినిమాలో తొలి సాంగ్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే బుధవారం సాయంత్రం 6 గంటలకు దీన్ని రిలీజ్ చేశారు.. ‘ బూమ్ బూమ్. భూంకపాల.. ఎస్పీవై వచ్చాడోయ్ ...అంటూ మైండ్ బ్లోయింగ్ గా ఉన్న ఈ పాటకు అభిమానులు ఫుల్ ఫిదా. ఈ పాటకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో అభిమానులను సర్ప్రైజ్ అయితే ఇపుడు పూర్తి పాటతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అటు ఈ పాటపై అప్పుడే ట్విట్టర్ లో సందడి మొదలైంది. హాస్య నటుడు వెన్నెల నటుడు అదిరిందంటూ స్పందించగా, వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌వర్మ అభిమానులకు ఇది బూం బూం టైం అంటూ స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘స్పైడర్’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుందని భావిస్తున్నారు. మహేష్ బాబుకు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమాకు హేరిస్ జయరాజ్ సంగీతమందించారు. Can say confidently that #BoomBoom will be the best intro Song of South India's Biggest Star Mahesh, absolute treat for fans. — Ram Gopal Varma (@RGVzoomined) August 2, 2017 -
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘స్పైడర్’. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ అభిమానులకు సర్ప్రైజ్గా ‘బూమ్ బూమ్’ అనే పాట టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే మొత్తం పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలిపారు. మహేష్ కు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. దాదాపు 8 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఓ సీన్ కోసం ఏకంగా 20 కోట్లకు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగడంతో మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరులో మూవీ విడుదల కానుంది. మూవీ మేకింగ్ వీడియో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
-
8 నిమిషాల సీన్ : 20 కోట్ల ఖర్చు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు. ముందుగా 90 కోట్లతోనే సినిమా పూర్తి చేయాలని భావించినా ఇప్పుడు బడ్జెట్ 120 కోట్లు మించిపోయిందన్నా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మురుగదాస్ చిత్రాల్లో సినిమాకే హైలెట్ అనిపించే సీన్ ఒకటి తప్పకుండా ఉంటుంది. తుపాకీలో 12 మంది టెర్రరిస్ట్ లను ఒకేసారి చంపే సీన్, కత్తి సినిమాలో ముసలివాళ్లతో కలిసి సిటీకి వాటర్ సప్లయ్ ని అడ్డుకునే సీన్స్ హైలెట్ అయ్యాయి. తాజాగా స్పైడర్ సినిమాలోనూ ఆ తరహా సీన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 8 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఈ సీన్ కోసం ఏకంగా 20 కోట్లకు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. విలన్ అమాయక ప్రజలను చంపేందుకు చేసే ప్రయత్నాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడన్నదే సీన్. పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్ లతో పాటు భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ సీన్, ఆడియన్స్ కన్నార్పకుండా చూసేలా ఉంటుందట. మరి ఈ వార్తపై అయినా చిత్రయూనిట్ అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి. -
స్పైడర్ టీజర్‌కు కొత్త డేట్..!
బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్‌తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్, త్వరలో మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంత వరకు ప్రచార కార్యక్రమాల్లో మాత్రం ఆ స్పీడు కనిపించటం లేదు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ అంటూ గట్టిగా చెపుతున్నా ఇంతవరకు టీజర్ కూడా రాకపోవటంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇటీవల జూలై 20 సర్ప్రైజ్ అన్న ప్రచారం జరగటంతో టీజర్ వస్తుందని భావించారు. కానీ మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న టీజర్ రిలీజ్ అంటూ ప్రచారం జరగుతోంది. మరి ఈ సారైన మహేష్ అభిమానుల కోరిక తీరుస్తాడేమో చూడాలి. -
కోలీవుడ్‌లో సత్తా చాటిన మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటికే స్పైడర్ తెలుగు రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తుండగా, తాజాగా తమిళ రైట్స్ కూడా అదే స్థాయిలో అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ తొలిసారిగా స్ట్రయిట్ తమిళ సినిమా చేస్తుండం, మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండటంతో స్పైడర్ తమిళ రైట్స్ 23 కోట్లు పలికినట్టుగా వార్తలు వస్తున్నాయి. వందకోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
గురువారం జూలై 20...ఓ సర్ప్రైజ్!
... హెడ్డింగ్ చదవగానే మహేశ్‌బాబు ‘దూకుడు’లోని ‘గురువారం మార్చి ఒకటి.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ... తొలిసారిగా చూశానె నిన్ను...’ పాట గుర్తొస్తోంది కదూ! యూత్ పాడుకునే పాటల్లో ఈ పాట కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోతున్నది గురువారం జూలై 20 గురించి. ఆ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మహేశ్‌బాబు–నమ్రతల ముద్దుల కూతురు సితార బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయాలని ‘స్పైడర్’ యూనిట్ భావిస్తోందట. సితార పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్, ‘ఠాగూర్’ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఆ పాట చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలు వెళ్లనున్నారు. వచ్చే నెల 2న సాంగ్ షూట్ మొదలు కానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో స్పైడర్ రూపంలో ఉన్న రోబో కీలకం అనే సంగతి తెలిసిందే. ఆ రోబోని సృష్టించడానికి బాగా ఖర్చు పెడుతున్నారట. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉంటుందని యూనిట్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇండియాలోనే కాకుండా రష్యా, యూకె.. ఇలా విదేశాల్లో కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ చేయిస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆరు దేశాల్లో స్పైడర్ పనులు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ పనులు ఏకంగా ఆరు దేశాల్లో జరుగుతున్నాయని చిత్ర నిర్మాతలు తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా ఉందట. అందుకే అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసేందుకు ఆరు దేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్స్ సినిమాకు గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అంతేకాదు బాహుబలి రిలీజ్ తరువాత స్పైడర్‌ను మరింత భారీగా రూపొందిస్తున్న చిత్రయూనిట్ మహేష్‌తో మరో షెడ్యూల్ స్పెషల్ గా షూటింగ్ చేశారు. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మరో పాటను వచ్చే నెలలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అది.. పవర్ స్టార్ రేంజ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలను అందించిన కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు త్వరలో పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలని భావిస్తుండటంతో ఇదే పవన్ ఆఖరి సినిమా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పవన్, త్రివిక్రమ్‌ల సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే భారీగా బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా సెట్స్ మీదే ఉన్న సినిమా హక్కులను ఏకంగా 19.5 కోట్లు వెచ్చించి తీసుకున్నారట. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా అన్ని భాషల శాటిలైట్ హక్కులు కలిపి 25 కోట్లకు అమ్ముడవ్వగా.. పవన్ సినిమా తెలుగు హక్కులు మాత్రమే 20 కోట్ల వరకు ధర పలకటం విశేషం. దీంతో 'అది పవర్ స్టార్ స్టామినా అంటే..' అని పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
స్పైడర్ సెట్లో స్పెషల్ గెస్ట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెట్లో ఓ స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో మహేష్ ముద్దుల కూతురు సితార సందడి చేసింది. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడే మహేష్, తరుచూ పిల్లలను సెట్‌కు తీసుకెళుతుంటాడు. శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలోనూ సితార సెట్లో సందడి చేసింది. తాజాగా స్పైడర్ సెట్‌కు సితార వచ్చినప్పటి ఫొటోలను చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. With a most endearing guest pic.twitter.com/8NqosJYALp — SantoshSivanASC. ISC (@santoshsivan) 8 July 2017 -
మరో తెలుగు హీరోతో మురుగదాస్..?
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న మురుగదాస్, త్వరలో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్న కోలీవుడ్ బడానిర్మాతలు. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. ఈ కాంబినేషన్‌పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న రామ్ చరణ్, మురుగదాస్ దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేందుకు ఓకె చెప్తాడని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది. స్పైడర్ పూర్తయిన తరువాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌తో సినిమా చేయనున్నాడు మురుగదాస్. ఆ సినిమా పూర్తయితే గాని రామ్ చరణ్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను రోబో సీక్వల్‌ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తుంది. -
మాస్ ఇమేజ్ కోసం మహేష్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూట్ మారుస్తున్నాడు. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మహేష్, మాస్ ఆడియన్స్‌లో ఆ స్థాయి ఫాలోయింగ్ సాధించలేకపోయాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఫ్లాప్ టాక్‌తో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తుంటే మహేష్ మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. మహేష్ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే భారీ నష్టాలు తప్పటం లేదు. అందుకే మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్‌లో నటిస్తున్న మహేష్, ఆ సినిమాతో పాటు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భరత్ అను నేను అనే పొలిటికల్ డ్రామాలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. అదే సమయంలో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాలతో మాస్కు చేరువయ్యేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. -
మహేష్‌తో సినిమాపై యువ హీరో..!
ప్రస్తుతం తన 23వ సినిమాగా తెరకెక్కుతున్న స్పైడర్ తో పాటు 24వ సినిమా భరత్ అను నేను షూటింగ్ లలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను తన 25వ సినిమాగా చేయనున్నాడు మహేష్. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుణ్ని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పాత్రకు అల్లరి నరేష్ ను సంప్రదించారన్న టాక్ వినిపించగా నరేష్ కూడా ఆ వార్తలను ధృవీకరించాడు. మహేష్ బాబు సినిమా కోసం నన్ను సంప్రదించిన మాట నిజమే, అయితే ఆ సినిమాలో చేస్తున్నది లేనిది ఇంకా నిర్ణయించుకోలేదు. నా అభిప్రాయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు నరేష్. ప్రస్తుతం నరేష్ హీరోగా తెరకెక్కిన మేడ మీద అబ్బాయి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. -
మహేష్ రేంజ్ పడిపోతోందా..?
ఇటీవల రిలీజ్ అయిన మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్, సూపర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చింది. గతంలో ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న మహేష్, ఈ ఏడాది ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2015లో ఆరో స్థానంలో నిలిచిన మహేష్ ఈ ఏడాది మరో ర్యాంక్ వెనక్కి తగ్గాడు. ఈ లిస్ట్‌లో నెంబర్ వన్ గా మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ ఉండగా తరువాత వరుసగా విరాట్ కోహ్లి, హృతిక్ రోషన్, రన్వీర్ సింగ్, ఫవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్నారు. సౌత్ నుంచి నుంచి ప్రభాస్ 22, రానా 24, ధనుష్ 26 రాంక్యులతో సరిపెట్టుకున్నారు. గత ఏడాది బ్రహ్మోత్సవం సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన మహేష్ బాబు, నెక్ట్స్ సినిమా స్పైడర్ రిలీజ్‌కు చాలా టైం తీసుకుంటున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహేష్ మూవీ టీం షాకింగ్ డెసిషన్..!
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ కొత్త సినిమా స్పైడర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్య కావటంతో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు వారం ముందు సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ రిలీజ్ అవుతోంది. దీంతో రెండు సినిమాల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవ కుశపై కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పోటి రసవత్తరంగా మారుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు. -
నిద్రలేని రాత్రులు గడిపా: రకుల్
ఆకలితో అలమటించాను. నిద్రలేమితో కష్టపడ్డాను అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ అమ్మడికి ఈ గతి పట్టిందేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఏదేమైనా రకుల్ చెప్పింది సినిమా కథ మాత్రం కాదు. ఆమె జీవితంలో జరిగిన సత్యం అట. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్గా నటిస్తున్న రకుల్ ఇప్పుడున్న పేరు, పరపతి, వసతులు ఆదిలో లేవట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జంటగా స్పైడర్ చిత్రంలో నటిస్తోంది. కోలివుడ్ లో కార్తీతో ధీరన్, అధికారం ఒండ్రు చిత్రంలోనూ నటిస్తున్న రకుల్ తన తొలి రోజులను గుర్తు చేసుకుంటూ సినిమాకు రాక ముందు చాలా కష్టపడ్డానని చెప్పింది. తినడానికి అన్నం కూడా లేక ఆకలి కడుపుతో, నిద్రలేమితో గడిపానని అంది. సినిమాలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అదే దోహదపడిందని నటి మరోసారి గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఏ సమస్య ఎదురైనా టెన్షన్ పడకుండా తాను ప్రశాంతంగా ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుగొనే పరిణితిని పొందానని చెప్పింది. సినిమా షూటింగులు ఒక్కోసారి అడవుల్లోనూ, కుగ్రామాలోనూ జరుగుతుంటాయని తెలిపింది. అలాంటప్పుడు స్టార్స్, ముఖ్యంగా హీరోయిన్లు తమకు మంచి వసతులు కావాలని మంకు పట్టు పట్టకూడదని ఆమె అంది. తన వరకూ కలిగిన దాంతో తినేసి, కాస్తంత చోటు దొరికితే అక్కడే విశ్రమించేస్తానని చెప్పింది. అయితే రకుల్‌ప్రీతి చెబుతున్నదంతా నిజమేనా? ఇందులో సత్యం ఎంత ఉందనేది ఆమె నటిస్తున్న చిత్ర వర్గాలకే ఎరుక. -
సూపర్ స్టార్‌తో జోడి కడుతోంది..?
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే. తరువాత ముకుంద సినిమాతో టాలీవుడ్‌కు మంచి చేరువైంది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో.. వరుస అవకాశాలను అందుకోలేకపోయింది. అదే సమయంలో బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో తిరిగి టాలీవుడ్ మీద దృష్టిపెట్టిన ఈ బ్యూటి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో చాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హీరోయిన్గా నటించింది పూజ. తొలి రెండు చిత్రాల్లో పద్దతిగా కనిపించిన ఈ భామ, డీజేలో మాత్రం గ్లామర్ లుక్ ఇరగదీసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రస్తుతం మురుగసదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు, ఆ తరువాత సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ తరువాత తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా పూజ హెగ్డేను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ మూవీ హీరోయిన్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా.. పూజ హెగ్డేనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్..!
బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్‌తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్, త్వరలో మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉంది మురుగదాస్ టీం. అంతేకాదు సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేర్చేందుకు ఓ ఇంట్రస్టింగ్ టీజర్ రెడీ చేస్తుందట. దాదాపు 167 ఫ్రేమ్ లతో అద్భుతమైన టీజర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ మహేష్ బాబు రెండు డైలాగ్‌లు కూడా ఉంటాయట. సినిమాలో కీలకమైన సీన్‌కు సంబంధించిన షాట్స్‌ను టీజర్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ స్పైడర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. -
మహేశ్‌బాబుకు బాలయ్య సవాల్!
స్పైడర్‌కు పోటీగా పైసా వసూల్ ఒక్క రోజు తేడాతో విడుదల హైదరాబాద్: వయస్సు మీద పడుతున్నా నందమూరి బాలకృష్ణ ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. యువ హీరోలతో పోటీపడి మరి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ విజయాలు సాధిస్తూనే ఉన్నారు. గత సంక్రాంతి బరిలో జూనియర్ ఎన్టీఆర్ ’నాన్నకు ప్రేమతో’, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలతో పోటీపడి ’లెజండ్’ సినిమాను తీసుకొచ్చారు బాలయ్య. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈసారి కూడా బాలయ్య అలాంటి ప్రయోగమే చేయబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న బాలయ్య తాజా సినిమా ‘పైసా వసూల్’... బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఈ చిత్ర బృందం శనివారం ఫేస్బుక్ లైవ్‌లో ముచ్చటించింది. పోర్చుగీస్ నుంచి సాగిన లైవ్ చిట్‌చాట్‌లో ‘పైసావసూల్’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అంటే మహేశ్‌బాబు సినిమా ‘స్పైడర్’కు గట్టిపోటీగా బాలయ్య ‘పైసా వసూల్’ బాక్సాఫీస్ బరిలో దూకబోతున్నది. మురగదాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మహేష్ సినిమా ‘స్పైడర్’ తెరకెక్కుతున్న సంగతి. విడుదల అప్పుడు-ఇప్పుడు అంటూ ఊరిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అన్ని కుదిరితే ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన రెండోనాడే బాలయ్య ‘పైసా వసూల్’ వస్తుండటంతో ఒక్క రోజు తేడాలో రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. ఈ రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో వస్తున్నాయంటే ఇద్దరు హీరోల అభిమానులకు పండుగేనని సినీ జనాలు అంటున్నారు. -
బాలీవుడ్ బడా నిర్మాత చేతికి స్పైడర్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ స్పైడర్ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాజిటివ్‌గా స్పందించారు. తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తోంది. బాహుబలి సినిమా ఘనవిజయం సాధించటం వెనుక కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. స్పైడర్ సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. స్పైడర్ యూనిట్ కూడా కరణ్ బ్యానర్లో రిలీజ్ అయితే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందని భావిస్తోంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న స్పైడర్ దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. -
స్పైడర్ టీజర్ లాంచ్ వాయిదా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు బాధలో ఉండటంతో టీజర్ రిలీజ్‌ను చిత్రయూనిట్ వాయిదా వేశారు. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సెట్స్ మీద ఉన్న తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్‌ను రిలీజ్ చేస్తుంటారు. అయితే దాసరి మరణంతో కృష్ణ తన పుట్టిన రోజు వేడుకలు చేయవద్దని అభిమానులను కోరారు. అదే సమయంలో మహేష్ కూడా స్పైడర్ టీజర్‌ను ఒక రోజు వాయిదా వేశారు. స్పైడర్ టీజర్ గురువారం(01-06-2017) ఉదయం 10.30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. -
మహేష్ అభిమానులకు మరో షాక్..!
గత ఆరేళ్లుగా మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన లేటెస్ట్ సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న స్పైడర్ సినిమా టీజర్ కూడా ఈ నెల 31న రిలీజ్ అవుతుందని భావించారు ఫ్యాన్స్. అయితే దర్శకుడు మురుగదాస్‌కు మాత్రం టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశం లేదట. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను హడావిడిగా కట్ చేసి రిలీజ్ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువని భావించిన మురుగదాస్, టీజర్ రిలీజ్‌కు టైం తీసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఆరేళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని మురుగదాస్ బ్రేక్ చేయటం పై సూపర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకాలంగా షూటింగ్ జరుగుతున్నా టీజర్‌కు సరిపడా కంటెంట్ లేదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అభిమానుల కోసం టీజర్ రెడీ చేస్తారా..? లేక మరో పోస్టర్‌తో సరిపెడతారా..? తెలియాలంటే బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే. -
మహేష్ 'స్పైడర్' టీజర్ రిలీజ్ డేట్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో స్పెడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో త్వరలో స్పైడర్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లను రిలీజ్ చేయటం మహేష్ బాబుకు అలవాటు. మరోసారి అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఈ నెల 31న స్పైడర్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. టీజర్ రిలీజ్ మాత్రం కన్ఫామ్ అన్న ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
స్పై సెప్టెంబర్!
వెయిటింగ్... వెయిటింగ్... మహేశ్‌బాబు అభిమానులు ఎప్పట్నుంచో ‘స్పైడర్’ను ఎప్పుడు విడుదల చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కి తగ్గట్టు మహేశ్ బర్త్‌డే (ఆగస్టు 9) కానుకగా ఆగస్టు సెకండ్ వీక్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. కట్ చేస్తే... అభిమానులకు చిన్న షాక్! చిత్రనిర్మాతలు ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు ‘స్పైడర్’ను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. కారణం ఏంటంటే... ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీతో క్లైమాక్స్ షెడ్యూల్ ముగుస్తుంది. తర్వాత బ్యాలెన్స్ రెండు సాంగ్స్ షూట్ చేయడం కోసం ఫారిన్ వెళతారు. షూటింగ్ ఫాస్ట్‌గా పూర్తయినా... పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గ్రాఫిక్ వర్క్స్‌కి ఎక్కువ టైమ్ కావాలని దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ అడిగారట! అదీ మేటర్. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
మహేష్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అనుష్క
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యోగా బ్యూటీ అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న భాగమతిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పిల్ల జమిందార్, సుకుమారుడు లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలను తెరకెక్కించిన అశోక్ ఈ సినిమాకు దర్శకుడు. మొదట్లో ఇది హిస్టారికల్ మూవీ అన్న ప్రచారం జరిగినా.. చిత్రయూనిట్ ఆ వార్తలను ఖండించారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ సభ్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే మహేష్ బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను అదే సమయంలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో భాగమతి యూనిట్ ఆలోచనలో పడ్డారు. స్పైడర్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉండటంతో.. మహేష్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన తరువాతే తమ సినిమా రిలీజ్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు. మహేష్ స్పైడర్ వాయిదా పడితే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 11న భాగమతి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు స్పైడర్ రిలీజ్ అయితే రెండు వారాలు ఆలస్యంగా ఆగస్టు 25న భాగమతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. -
బాహుబలి టీం కారణంగానే స్పైడర్ వాయిదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముందుగా జూన్ 23నే రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఆగస్టుకు వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ ఆగస్టులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ లేదట. దసరా కానుకగా అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్పైడర్ ఆలస్యం వెనుక బాహుబలి టీం ఉందన్న టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాహుబలి 2 సంచలనాలు నమోదు చేస్తుండటంతో స్పైడర్ సినిమా విషయంలో కూడా గ్రాఫిక్స్ మీద ఎక్కువ సమయం, బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు యూనిట్. అందుకే కమల్ కణ్నన్ ఆధ్వర్యంలో మకుటతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మకుట, ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావటంలేదు. ఎంత సమయమైనా కేటాయించి క్వాలిటీ గ్రాఫిక్స్‌ను రెడీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని స్పైడర్ టీంకు కూడా చెప్పడంతో చేసేదేమి లేక సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
మహేష్ మరో షాక్ ఇస్తున్నాడా..?
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన మహేష్ బాబు నుంచి.. ఆ ఫ్లాప్‌ను మరిపించే హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మహేష్ కూడా భారీ చిత్రాన్నే చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా స్పైడర్ సినిమాను చేస్తున్నాడు. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంత వరకు పూర్తి కాలేదు. క్లైమాక్స్ విషయంలో దర్శకుడు సంతృప్తిగా లేకపోవటంతో చివరి నిమిషంలో మార్పులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన స్పైడర్ రిలీజ్‌ను మరోసారి వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ముందుగా స్పైడర్ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తరువాత ఆగస్టు 11ను వాయిదా వేశారన్న టాక్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ కోసమే నెలల తరబడి వెయిట్ చేయించిన స్పైడర్ టీం, ఇప్పడు రిలీజ్ విషయంలో కూడా వాయిదాల మీద వాయిదాలతో అభిమానులకు షాక్ ఇస్తున్నారు. -
సూపర్ స్టార్‌కు షాకిస్తున్న అజిత్