నిద్రలేని రాత్రులు గడిపా: రకుల్‌ | Rakulprethi singh action in the movie speder | Sakshi
Sakshi News home page

నిద్రలేని రాత్రులు గడిపా: రకుల్‌

Published Sun, Jun 25 2017 5:12 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

నిద్రలేని రాత్రులు గడిపా: రకుల్‌

నిద్రలేని రాత్రులు గడిపా: రకుల్‌

ఆకలితో అలమటించాను. నిద్రలేమితో కష్టపడ్డాను అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ అమ్మడికి  ఈ గతి పట్టిందేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఏదేమైనా రకుల్‌ చెప్పింది సినిమా కథ మాత్రం కాదు. ఆమె జీవితంలో జరిగిన సత్యం అట. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్‌ ఇప్పుడున్న పేరు, పరపతి, వసతులు ఆదిలో లేవట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జంటగా స్పైడర్ చిత్రంలో నటిస్తోంది.


కోలివుడ్ లో కార్తీతో ధీరన్‌, అధికారం ఒండ్రు చిత్రంలోనూ నటిస్తున్న రకుల్ తన తొలి రోజులను గుర్తు చేసుకుంటూ సినిమాకు రాక ముందు చాలా కష్టపడ్డానని చెప్పింది. తినడానికి అన్నం కూడా లేక ఆకలి కడుపుతో, నిద్రలేమితో గడిపానని అంది. సినిమాలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అదే దోహదపడిందని నటి మరోసారి గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఏ సమస్య ఎదురైనా టెన్షన్‌ పడకుండా తాను ప్రశాంతంగా ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుగొనే పరిణితిని పొందానని చెప్పింది. సినిమా షూటింగులు ఒక్కోసారి అడవుల్లోనూ, కుగ్రామాలోనూ జరుగుతుంటాయని తెలిపింది.

అలాంటప్పుడు స్టార్స్‌, ముఖ్యంగా హీరోయిన్లు తమకు మంచి వసతులు కావాలని మంకు పట్టు పట్టకూడదని ఆమె అంది. తన వరకూ కలిగిన దాంతో తినేసి, కాస్తంత చోటు దొరికితే అక్కడే విశ్రమించేస్తానని చెప్పింది. అయితే రకుల్‌ప్రీతి చెబుతున్నదంతా నిజమేనా? ఇందులో సత్యం ఎంత ఉందనేది ఆమె నటిస్తున్న చిత్ర వర్గాలకే ఎరుక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement