మహేష్‌తో మరోసారి..! | Mahesh Babu and Rakul Team up Again | Sakshi
Sakshi News home page

మహేష్‌తో మరోసారి..!

Published Sun, Oct 29 2017 10:50 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Mahesh Babu and Rakul Team up Again - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తనతో కలిసి నటించిన హీరోయిన్లను రిపీట్‌ చేసిన సందర్బాలు చాలా తక్కువ. ముఖ్యంగా సెంటిమెంట్లను ఫాలో అయ్యే సూపర్‌ స్టార్‌ తన ఫ్లాప్‌ సినిమాల హీరోయిన్లను రిపీట్‌ చేయటం మరింత అరుదు. కానీ ఓ ఫ్లాప్‌ సినిమాలో తనకు జోడీగా నటించిన హీరోయిన్‌ ను రిపీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడట సూపర్‌ స్టార్‌. ‘స్పైడర్‌’ లాంటి భారీ డిజాస్టర్‌ లో తనతో జోడి కట్టిన రకుల్‌ తో మరోసారి స్క్రీన్‌షేర్‌ చేసుకోవాలని భావిస్తున్నాడు మహేష్‌.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అనే నేను’ సినిమాలో నటిస్తున్న మహేష్‌, తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమైన ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా మరోసారి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమాతో అయినా మహేష్‌, రకుల్‌ జోడి హిట్‌ పెయిర్‌ అనిపించుకుంటుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement