రేపే మహేష్ కొత్త సినిమా లాంచ్..! | mahesh vamsi paidipally Movie will be launched on august 13th | Sakshi
Sakshi News home page

రేపే మహేష్ కొత్త సినిమా లాంచ్..!

Published Sun, Aug 13 2017 1:27 PM | Last Updated on Tue, Sep 12 2017 12:00 AM

mahesh vamsi paidipally Movie will be launched on august 13th

ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. తాజాగా మరో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నాడు సూపర్ స్టార్. తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించాడు మహేష్.

దిల్ రాజు, అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రేపు(13-08-2017) పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. భరత్ అను నేను తో పాటు వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మహేష్. తన సినిమాల ఓపెనింగ్ కు మహేష్ హాజరుకాడు. అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఈ 25 సినిమా కూడా మహేష్ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement