Vamsi Paidipally
-
గం గం గణేశా మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది.. దిల్ రాజు
దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లపర్వం సాగిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో థ్యాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. వారిసు సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ హైదరాబాద్‌లో చిత్రం చూసి మంచి సినిమా తీశారని ప్రశంసిస్తూ మెసేజ్ పెట్టారు అని చెప్పుకొచ్చాడు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ నటించిన పూవే ఉనక్కాగా, కాదలక్కు మర్యాదై, తీళ్లాద మనం తుళ్లుమ్.. ఇలా కొన్ని సినిమాలు చాలా ఇష్టం. ఇటీవల ఆయన కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలే చేస్తున్నారని అనిపించింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్న సమయంలో బృందావనం వంటి ఫ్యామిలీ మూవీ చేశాను. అదేవిధంగా ప్రభాస్‌తో మిస్టర్ పర్ఫెక్ట్, మహేశ్‌బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలను చేశాను. అలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ నేపథ్యంలో విజయ్ హీరోగా సినిమా చేస్తే బాగుండు అనుకున్నాను. ఆ కోరిక వల్లే వంశీ పైడిపల్లి చెప్పిన ఈ సినిమా కథను వెంటనే ఓకే చేశాను' అన్నాడు. చదవండి: ప్రియమణి కొటేషన్ గ్యాంగ్ టీజర్ చూశారా? -
తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి
సంక్రాంతి రోజున ఓ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆయన తాజాగా తెరకెక్కించిన మూవీ వారసుడు(తమిళంలో వారీసు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పండుగ రోజున వంశీ తన తల్లి, తండ్రి, భార్యతో కలిసి కుటుంబ సమేతంగా థియేటర్లో వారసుడు మూవీ చూశారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన ఇక ఈ సినిమా చూసిన వంశీ పైడితల్లి తండ్రి సైతం భావోద్వేగానికి గురయ్యారు. పుత్రోత్సాహంతో ఆయనను హుత్తుకుని ఎమోషనల్ అయిన వీడియో వంశీ పైడిపల్లి షేర్ చేశారు. ‘‘నా జీవితంలో అతి పెద్ద విజయం సాధించాను. ‘వారసుడు’ వీక్షించి నా తండ్రి ఎంతగానో ఆనందించారు. ఈరోజు నేను నా జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను. జీవితాంతం ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. నాన్నా.. నువ్వే నా హీరో. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ వంశీ రాసుకొచ్చారు. చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..? ‘మహర్షి’ వంటి కమర్షియల్ విజయం తర్వాత వంశీ తెరకెక్కించిన పూర్తిస్థాయి తమిళ చిత్రం ‘వారీసు’. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించగా.. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో ఈ చిత్రం జనవరి 11న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. My Biggest achievement was today when My " Naanna / Appaa " was overwhelmed watching #Vaarasudu ( #Varisu )... This is the moment I will cherish for lifetime.. " You are my HERO Naannaa ".....Love You to Eternity... ❤️ pic.twitter.com/E5SokU8x8g — Vamshi Paidipally (@directorvamshi) January 14, 2023 -
ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి – ‘దిల్’ రాజు
‘‘వారిసు’ చిత్రంపై తమిళ ప్రేక్షకులు చూపిన స్పందనకి వంశీ పైడిపల్లి, తమన్ ఏడ్చారు. ‘బొమ్మరిల్లు’ సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో నేను కూడా ఏడ్చాను.. మళ్లీ ఇన్నాళ్లకు ‘వారిసు’ చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. మా నమ్మకం నిజం కావడంతో వచ్చిన ఆనందభాష్పాలు అవి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘వారిసు’ (తమిళ్). ‘వారసుడు’ (తెలుగు). ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తమిళ్లో విడుదలైంది. తెలుగులో 14న ‘వారసుడు’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లడుతూ– ‘‘చెన్నైలో ‘వారిసు’ ఆడుతున్న థియేటర్‌కి వెళ్లాను.. క్లైమాక్స్ పూర్తయ్యాక వంశీని అభిమానంతో హత్తుకున్నాను. ప్రేక్షకులు నిలబడి క్లాప్స్ కొట్టడంతో మేం పడ్డ కష్టాలు మర్చిపోయాం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఒక మంచి కథని చెబితే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘వారిసు’ మరోసారి నిరూపించింది. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అల్లు అరవింద్‌గారు ఫోన్‌చేసి ‘వెయ్యి కోట్లు పెట్టినా రాని అనుభూతి ఇది’ అని అభినందించారు’’ అన్నారు. ‘‘తమిళంలోలా తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు నటి జయసుధ. -
సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది.సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వారీసు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మూవీ టీం రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే వారీసు విడుదల అవుతుందని, పుకార్లను నమ్మవద్దంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. Meet THE BOSS’s family in 3 days in theatres near you nanba 🤩#3DaysForVarisu#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @Lyricist_Vivek @7screenstudio @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/RbAsoqrpNS — Sri Venkateswara Creations (@SVC_official) January 8, 2023 -
10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్ మొత్తం షేక్..!
కోలీవుడ్ స్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. టాలీవుడ్లో ఈ చిత్రాన్ని 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'రంజితమే' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్‌ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది. (చదవండి: 'వారీసు' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్) ఈ మాస్ సాంగ్ విడుదలై పది రోజులవుతోన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకు ఈ పాటకు ఆదరణ మరింత పెరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటిదాకా 5 కోట్ల వీక్షణలు, 18 లక్షల లైక్స్ సొంతం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. The sensational #Ranjithame hits 50M views 🔥 📽️ https://t.co/Q56reRe9tc 🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #RanjithameSong #Varisu #VarisuPongal pic.twitter.com/l8ElaoR20h — Sri Venkateswara Creations (@SVC_official) November 16, 2022 -
'వరీసు' నుంచి విజయ్, రష్మికల క్రేజీ పోస్టర్ వచ్చేసింది..
తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో నటిస్తున్న సినిమా వారసుడు. తమిళ వారిసుకు అనువాదంగా వస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రష్మిక, విజయ్‌ల ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. నేడు (శనివారం) సాయంత్రం రంజితమే సాంగ్ రిలీజ్ చేయనున్న సందర్భంగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్‌ను వదిలారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మాస్ షేడ్స్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Let the countdown begin nanba 🔥#RanjithameFromToday 5:30 PM. 🎙️ #Thalapathy @actorvijay sir & @manasimm 🎵 @MusicThaman 🖊️ @Lyricist_Vivek@directorvamshi @iamRashmika @AlwaysJani #BhushanKumar #KrishanKumar #ShivChanana @TSeries #Ranjithame #Varisu #VarisuPongal pic.twitter.com/cQojtDDJFL — Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2022 -
సంక్రాంతి బరిలోకి ‘వారసుడు’
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ నేడు (ఆదివారం) ఆరంభం కానుంది.‘‘రెండు యాక్షన్ సీన్లు, రెండు పాటలు చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుంది. సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని శనివారం చిత్ర యూనిట్ ప్రకటించింది. -
దళపతి విజయ్‌కి విలన్‌గా సమంత?.. ఏ చిత్రమంటే..
నటుడు విజయ్‌తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్‌లో జరుగుతుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న స్టార్డం అంతా ఇంతా కాదు. ఆయన చిత్రాలు జయాపజయాలకు అతీతంగా కలెక్షన్లు కొల్లగొడతాయి. ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న వారీసు(తెలుగులో వారసుడు) చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. మరో విషయం ఏమిటంటే ఇందులో నటి సమంత నటించనున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు తెరి, మెర్సల్, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా నటి సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలా బోల్డ్ పాత్రల్లో నటించడానికి సై అంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె పుష్ప చిత్రం కోసం చేసిన స్పెషల్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టే విషయం తెలిసిందే. ప్రస్తుతం శకుంతలం, యశోద వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. అలాంటిది విజయ్ 66 చిత్రంలో ఆయన్ని ఢీకొనే ప్రతినాయకి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతుంది. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్' హీరోయిన్.. -
బాస్ తిరిగొచ్చేశాడు.. వారసుడు ఫస్ట్ లుక్ చూశారా?
దళపతి విజయ్ ప్రస్తుతం తన 66వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. జూన్ 22న విజయ్ బర్త్‌డే కావడంతో ఒక రోజుముందే దళపతి 66 సినిమా టైటిల్‌ను ప్రకటించారు. విజయ్- వంశీల కలయికలో వస్తున్న చిత్రానికి వరిసు అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. The BOSS Returns as #Varisu#VarisuFirstLook#HBDDearThalapathyVijay Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp#Thalapathy66 pic.twitter.com/x2HXJH3ejq — Sri Venkateswara Creations (@SVC_official) June 21, 2022 'వరిసుగా తిరిగొస్తున్న బాస్' అంటూ విజయ్ ఫస్ట్ లుక్ సైతం వదిలారు. ఇందులో హీరో బిజినెస్‌మెన్‌గా కనిపిస్తున్నాడు. బర్త్‌డే ట్రీట్ ఒకరోజు ముందే ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో #HBDDearThalapathyVijay, #Thalapathy66FirstLook హ్యాష్‌ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రాబోతోంది ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. #Varisu pic.twitter.com/b2bwNNAQP8 — Vijay (@actorvijay) June 21, 2022 #Thalapathy66 is #Vaarasudu in Telugu#VaarasuduFirstLook#VarisuFirstLook#HBDDearThalapathyVijayThalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/2TqlbestWr— Sri Venkateswara Creations (@SVC_official) June 21, 2022 చదవండి: ‘మేజర్’ నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్, ఆకట్టుకుంటున్న అమ్మ పాట పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! -
సంక్రాంతికి వచ్చేస్తున్న విజయ్- రష్మిక
హీరో విజయ్ సంక్రాంతికి సై అంటున్నారు. ఆయన నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ‘దిల్’రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, ప్రభు, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.. అంతేకాదు.. ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. -
విజయ్ సినిమాలో ఛాన్స్ .. గుడ్‌న్యూస్ షేర్ చేసిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. గతేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మిక వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవుతుంది. పుష్ప సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప ది రూల్ సినిమాతో పాటు మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ మూవీలో రష్మిక నటించనుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రష్మిక ఇంతకంటే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుందంటూ ట్వీట్ చేసింది. మంగళవారం(ఏప్రిల్5) రష్మిక బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక స్థానంలో వేరే హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా అవి ఒట్టి పుకార్లేనని అర్థమైపోయింది. What can possibly be a better birthday gift? 🌸@directorvamshi @svc_official @actorvijay#thalapathy66 pic.twitter.com/FvNUkUcgOl — Rashmika Mandanna (@iamRashmika) April 5, 2022 -
అన్‌స్టాపబుల్ స్పెషల్ ప్రోమో: మహేశ్‌పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఫినాలేలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ రేపు(ఫిబ్రవరి 4న) 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా సోషల్ మీడియా ఇది వీపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ రేపు(శుక్రవారం) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన తక్కువ వ్యవధిలో మంచి వ్యూస్‌ను రాబట్టింది ఈ ప్రోమో. ఇందులో బాలయ్య మహేశ్ బాబును ఆటపట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. మహేశ్ సంబంధించిన ఆసక్తికర సీక్రెట్స్‌ను రాబట్టడానికి బాలయ్య చేసిన సందడి బాగా ఆకట్టుకుంటోంది. ఇక నువ్వు చిన్నప్పుడు చాలా నాటీ బాయ్ అంట కదా అనగానే మహేశ్ సిగ్గు పడటం.. దీనికి చేసేవి చేస్తూనే చెప్పాడానికి సిగ్గు పడతావంటూ బాలయ్య వేసిన పంచ్ డైలాగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం నెటజన్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నటసింహం, సూపర్ స్టార్ల అల్లరి చూడాలంటే ఈ ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి. -
వేరే లెవల్.. దిల్‌రాజుకు షాకిచ్చిన విజయ్
Thalapathy Vijay Shocking Remuneration For Vamshi Paidipally Movie: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దాదాపు రూ.100కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. విజయ్‌కి తమిళం తర్వాత తెలుగులోనూ మాంచి మార్కెట్ ఉంది. చివరగా ఆయన నటించిన మాస్టర్ సైతం తెలుగులో సుమారు రూ.15 కోట్లు రాబట్టిందని టాక్. దీంతో తన మేనియాను దృష్టిలో ఉంచుకొని వంద కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. ఇక విజయ్ చేస్తున్న తొలి తెలుగు ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. -
నాకో టైమింగ్ ఉంటుంది.. సితార తాట తీసేస్తది : మహేశ్ బాబు
Unstoppable With Mahesh Babu Grand Finale Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కాండ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్‌ల మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. 'ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతనే మహేశ్'.. అంటూ బాలయ్య తనదైన స్టయిల్లో మహేశ్‌ను ఆహ్వానించారు.ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ ..తాట తీసేస్తది అంటూ మహేశ్ నవ్వులు పూయించాడు.ఓ సారి కేబీఆర్ పార్కుకి వాకింగ్‌కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదంటూ సీక్రెట్ రివీల్ చేశాడు.మొత్తంగా ఆహా అనిపించేలా ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఉండనుంది స్పష్టమవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
యువకులకు రజనీకాంత్ జీవితం ఓ ప్రేరణ: ఉప రాష్ట్రపతి
‘సినిమాల్లో హింస, అశ్లీలతలవంటివి చూపించడాన్ని తగ్గించాలి. సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో బాధ్యత పెంపొందించే విధంగా సినిమాలు ఉండాలి. భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్న అపారమైన నైపుణ్యానికి ఈ అవార్డులు ఓ మచ్చుతునక మాత్రమే. మరింతమంది ఔత్సాహిక యువ దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందిని చిత్రపరిశ్రమ పెద్దలు ప్రోత్సహించాలి. సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటున్న యువకులకు రజనీకాంత్ సినీ జీవితం ప్రేరణాత్మకంగా నిలుస్తుంది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 67వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు పలువురు కళాకారులకు వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపిక కాగా ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్’ రాజు అవార్డులు స్వీకరించారు. తెలుగులో ఉత్తమ సినిమాగా ఎంపి కైన ‘జెర్సీ’ అవార్డును నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అదే సినిమాకుగాను ఎడిటర్ నవీన్ నూలి అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘భోంస్లే’కి మనోజ్ బాజ్‌పాయ్, ‘అసురన్ ’ చిత్రానికి ధనుష్ ఇద్దరూ అందుకున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకుగాను కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. నన్ను నటుడిగా తీర్చిదిద్దిన నా గురువు బాలచందర్‌గారికి ధన్యవాదాలు. నా అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ నా తండ్రిలాంటివారు. గొప్ప విలువలు నేర్పించిన ఆయనకు ధన్యవాదాలు. నా మిత్రుడు, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ సహోద్యోగి రాజ్ బహుదూర్ నాలో నటుడు ఉన్నాడని గుర్తించి, నన్ను ప్రోత్సహించారు. వీరితో పాటు నా సినిమా నిర్మాతలు, దర్శకులు, సహ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, అభిమానులు, తమిళ ప్రజలకి ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను. – రజనీకాంత్ మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని ఈ పురస్కారం గుర్తు చేస్తూ ఉంటుంది. వినోదంతో పాటు సందేశం ఇవ్వడం సినిమాతో సాధ్యమవుతుంది. మహేశ్‌బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసినప్పుడు మరింతమంది చూస్తారు. – వంశీ పైడిపల్లి రైతులకు నగర ప్రజలు ఏ విధంగా సాయం చేయాలనే అంశంతో ‘మహర్షి’ సినిమా తీశాం. మహేశ్ బాబు కమర్షియల్ స్టార్. ఆయనకు తగ్గట్టు సినిమాలో పాటలు, ఫైట్లతో దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కటి సినిమా తీశాడు. – ‘దిల్’ రాజు ‘జెర్సీ’కి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణం హీరో నానీ. – గౌతమ్ తిన్ననూరి – నవీన్ నూలి – సూర్యదేవర నాగవంశీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయి(చినబాబు), డైరెక్టర్‌కు ధన్యవాదాలు. కథను నమ్మి నటించిన నానీకి ప్రత్యేక ధన్యవాదాలు. – సూర్యదేవర నాగవంశీ ఎడిటింగ్‌లో చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ నూలి అవార్డు విజేతల వివరాలు.. ఉత్తమ చిత్రం: ‘మరక్కర్: ది అరేబియన్ కడలింటె సింహం’ (మలయాళం) ఉత్తమ నటుడు: ధనుష్ (‘అసురన్’), మనోజ్ బాజ్‌పాయ్ (‘భోంస్లే’), ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (తమిళ ‘సూపర్ డీలక్స్’) ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’) ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్ (తమిళ చిత్రం – ‘కె.డి’) ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్ ’) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’ ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ) కొరియోగ్రాఫర్: రాజుసుందరం (మహర్షి) ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్ (తమిళ చిత్రం ‘విశ్వాసం’) ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్ (హిందీ ‘కేసరి’) ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’) ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: విక్రమ్ మోర్ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: సిద్ధార్థ్ ప్రియదర్శన్ (మలయాళ ‘మరక్కర్: ది అరేబియన్ ’) ఉత్తమ కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్...’) ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్ ’ ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్’ ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’ ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్’ (మరాఠీ) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (తమిళం) చదవండి: అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్.. వింటేజ్ రజనీ ఆన్ ది వే -
కాబోయే భర్తతో శ్రీవారిని దర్శించుకున్న నయనతార
-
శ్రీవారిని దర్శించుకున్న నయనతార
Nayanathara, Dil Raju, Vamsi Paidipally Visits Tirumala: హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో నయనతారతో పాటు ఆమె కాబోయే భర్త, దర్శకుడు విజ్ఞేష్ శివన్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల నయనతారని చూడటానికి, పోటోలు దిగడానికి భక్తులు అభిమానులు ఉత్సహం చూపారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సరికొత్త వీడియోతో.. రాకింగ్ స్టార్ డాటర్స్..
సాక్షి, హైదరాబాద్: ‘ఏ అండ్ ఎస్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న లిటిల్ రాక్ స్టార్స్ తాజా వీడియోతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నారు. ఇటీవల గోవా హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేసిన ఈ పిడుగులిద్దరూ తమదైన శైలిలో ఒక వీడియోను తీసుకొచ్చారు. ఇంతకీ ఆ పిడుగులు మరెవ్వరో కాదు స్టార్ డాటర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార, స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య. ఈ తాజా వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విటర్లో షేర్ చేశారు. To how it all began! My favourite duo is back.. taking us through Goa this time! Loved the video as always! Rock on my girls 🤗🤗🤗 #AadyaAndSitara pic.twitter.com/XS4MELMEbU — Mahesh Babu (@urstrulyMahesh) August 28, 2021 -
Vijay : విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్
ఇళయదళపతి విజయ్ అభిమానుకు గుడ్ న్యూస్ ఇది. త్వరలోనే ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కన్ఫర్మ్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అటు విజయ్ గానీ ఇటు వంశీ పైడిపల్లి గానీ స్పందించలేదు. దీంతో ఇది కేవలం రూమరే అని అంతా కొట్టిపారేశారు. అయితే తాజాగా విజయ్‌తో తన సినిమా ఉండబోతోందని, ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు వంశీ పైడిపల్లి తెలిపాడు. లాక్డౌన్ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తామని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా విజయ్‌కి టాలీవుడ్లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇక 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో సినిమా తెరకెక్కాల్సి ఉండగా అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే వంశీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. -
స్టార్ హీరో విజయ్‌తో జోడీ కట్టనున్న కీర్తి సురేష్?
కీర్తి సురేష్ ఫ్రస్తుతం దక్షిణాదిన వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారిగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన జత కట్టనుంది. మరోవైపు గుడ్ లక్ సఖి, అన్నాతై సహా మైదానం సినిమాలో కీర్తి నటిస్తుంది. అయితే తాజాగా తెలుగులో మరో క్రేజీ ఆఫర్ వరించిందట. తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్లో స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో నటించనున్న తొలి సినిమాకే విజయ్ ఏకంగా రూ.90 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే, కీర్తి నటించే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. చదవండి : మహేష్‌బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్! మీకు ఏమైంది.. మరీ ఇంత సన్నబడ్డారు..! -
Vijay: తెలుగులో తొలి సినిమాకే దళపతికి అన్ని కోట్లా?
తమిళ హీరో విజయ్ సినిమాలు తెలుగులోనూ బాగానే ఆడతాయి. ఫలితంగా ఆయనకు ఇక్కడ కూడా బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా విజయ్ నటించిన పలు సినిమాలు తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సర్కార్, అదిరింది, విజిల్, మాస్టర్ బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. దీంతో విజయ్ తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త ఫిల్మీదునియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగులో తొలి సినిమాకు ఏకంగా రూ.90 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట, నిజానికి ఇప్పటివరకు విజయ్ తన తమిళ సినిమాలకు దాదాపు రూ.80 కోట్లు తీసుకుంటున్నారట. కానీ తెలుగులో మాత్రం దాన్ని మించిపోయేలా మరో పది కోట్లు అదనంగా తీసుకుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి విజయ్ డేట్స్ కోసం దిల్ రాజే ఈ రేంజ్లో రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడని అంటున్నారు. చదవండి: విజయ్ దేవరకొండను రంగంలోకి దించిన తెలంగాణ సర్కార్ -
స్టేట్ రౌడీ
మహేశ్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎన్నో మాస్ పాత్రల్లో కనిపించారు. అయితే ఇప్పుడు చేయబోతున్నది మాస్ కా బాప్లా ఉంటుందట. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు మహేశ్. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రాజమౌళి సినిమా ప్రారంభించేలోపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట. ఈ సినిమాకి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో మహేశ్ పక్కా మాస్ రౌడీ పాత్రలో కనిపిస్తారట. ఇక ‘స్టేట్ రౌడీ’ అంటే.. గతంలో చిరంజీవి నటించిన ‘స్టేట్ రౌడీ గుర్తుకు రాకమానదు. 1989లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. మరి... మహేశ్‌కి ‘స్టేట్ రౌడీ’ టైటిలే షురూ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
బాలీవుడ్‌కు ‘ఎవడు’?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎవడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. 2014లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో ఎవడు సినిమాను నిర్మించిన దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీ తో కలిసి ఎవడును రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు హేట్‌స్టోరి 4 ఫేం మిలాప్ జవేరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే హీరో హీరోయిన్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది. -
మహర్షి సక్సెస్ మీట్
-
మహర్షి సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేసిన మహేష్
-
కెరీర్ బిగ్గెస్ట్ హిట్: కాలర్ ఎగరేసిన మహేశ్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాలర్ ఎగరేశాడు. మహర్షి మూవీని బ్లాక్‌బస్టర్ హిట్ చేసినందుకు చిత్రబృందంతోపాటు అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. హైదరాబాద్‌లోని నొవాటెల్ హోటల్లో జరిగిన మహర్షి సక్సెస్ మీట్లో మహేష్‌తోపాటు మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత మాట్లాడిన మహేష్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. మూడు భారీ నిర్మాణసంస్థలు కలిసి తన 25 సినిమా నిర్మించడం, అది పెద్ద హిట్ కావడం చాలా సంతోషానిచ్చిందన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కి, నటుడు అల్లరి నరేష్‌కి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాడు. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌ని మహర్షి ఒక వారంలో దాటేయబోతోందన్నమహేష్బాబు.. సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేశాడు. -
‘మహర్షి’ పర్మిషన్ల రగడ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా మీద ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్లాన్‌లో ఉంది చిత్రయూనిట్. ఎక్స్ట్రా షోస్ వేయటంతో పాటు టికెట్ రేట్లు పెంచేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఎక్స్ట్రా షోస్ వేసుకునేందుకు, టికెట్లు రేట్లు పెంచేందుకు అనుమతులు వచ్చినట్టుగా చిత్రయూనిట్ చెపుతోంది. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉదయం 8 గంటల నుంచి షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కానీ కొన్ని థియేటర్లలో ఉదయం 7గంటల 30 నిమిషాల షోకు అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్టుగా చిత్రయూనిట్ చెపుతున్నా పర్మిషన్‌కు సంబంధించిన పత్రాలను బయటపెట్టడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేటు పెంచేందుకు తాము అనుమతిచ్చినట్టుగా వచ్చిన వార్తలను ఖండించింది. మరి ఈ పరిస్థితుల్లో మహర్షి టీం క్లారిటీ ఏమైనా ఇస్తుందేమో చూడాలి. -
పార్టీ టైమ్
టాలీవుడ్‌లోని కొందరు అగ్రతారలు దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి మాలిని బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మహేశ్‌బాబు, ఎన్టీఆర్ తదితర తారలు పొల్గొ న్నారు. ‘‘మై డియర్ ఫ్రెండ్ మాలిని పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. క్లోజ్ ఫ్రెండ్స్’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త బ్రేక్ వచ్చి పదిరోజుల హాలిడే ట్రిప్‌ను ప్లాన్ చేశారట మహేశ్. ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘బృందావనం’ చిత్రానికి వంశీపైడిపల్లే దర్శకుడు అనే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ విధంగా ఎన్టీఆర్‌తోనూ వంశీకి మంచి అనుబంధం ఉంది. ‘మున్నా, ఎవడు, ఊపిరి’ వంశీ దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు. -
స్కూల్ డేస్ గుర్తొచ్చాయి – వంశీ పైడిపల్లి
లక్ష్య, వినయ్ వర్మ, సాహితి, నీరజ్ ప్రధాన పాత్రల్లో అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్’. ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ నిర్మించారు. శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి సహనిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమా సెట్లో విడుదల చేశారు. అనంతరం వంశీ మాట్లాడుతూ– ‘‘టైటిల్ నాకు బాగా నచ్చింది. బాయ్ స్టేజ్‌లో ప్రతి ఒక్కరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. హైస్కూల్ యూనిఫామ్‌లో ఉన్న స్టూడెంట్ కాలేజ్ వైపు చూస్తూ ఉన్న ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అమర్‌కి సినిమా అంటే ప్యాషన్. పోస్టర్ విషయంలోనే ఇంత శ్రద్ధ తీసుకుంటే సినిమా ఇంకా బాగా తీసి ఉంటారని అర్థం అవుతుంది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా చూడాలని ఉంది. టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు. ఇక మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
‘మహర్షి’ మూవీ స్టిల్స్
-
మహేష్ ‘మహర్షి’ ఆలస్యమవుతుందా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఇది మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావటానికి మరింత సమయం పడుతుందన్న ఆలోచనతో విడుదల కొద్ది రోజులు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మహర్షి యూనిట్. ఏప్రిల్ 25న కాకుండా మే 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
చెప్పిన డేట్‌కే వస్తున్నాం
మహేశ్‌బాబు లేటెస్ట్ చిత్రం ‘మహర్షి’ ఆలస్యం అవుతుంది, జూన్‌లో రిలీజ్ కానుంది అని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్ 25నే వస్తున్నాం అని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’రాజు, పీవీపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలకపాత్రలో కనిపిస్తారు. ‘‘చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.మార్చి 15 నాటికి రెండుపాటలు మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముందు ప్రకటించినట్టు ఏప్రిల్ 25నే చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. మహేశ్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: కె.యు. మోహనన్. -
నో హాలిడే
విలన్స్ తాట తీస్తున్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ ఫైట్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. అంటే.. సండే ‘మహర్షి’ యూనిట్‌కి నో హాలిడే అన్నమాట. నెక్ట్స్ హైదరాబాద్‌లోని మరో స్టూడియోలో వేసిన సెట్లో మరో ఫైట్‌ను షూట్ చేస్తారు చిత్రబృందం. ఈ ఫైట్‌ను నాలుగురోజుల పాటు చిత్రీకరిస్తారని సమాచారం. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని ఫారిన్ షెడ్యూల్ కోసం ‘మహర్షి’ టీమ్ ఫ్లైట్ ఎక్కుతుందట. ఇందులో స్టూడెంట్‌గా, బిలియనీర్‌గా కనిపిస్తారు మహేశ్. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో అల్లరి నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారు. ఆల్రెడీ ‘మహర్షి’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
వైరల్ అవుతున్న ‘మహర్షి’ వీడియో
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. పొల్లాచ్చిలో తాజాగా షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీకి ‘మహర్షి’ టీమ్ వెళ్లనుంది. అంతటితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మహర్షి’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. పచ్చని పొలాల్లో మహేష్ మీడియాతో మాట్లాడుతున్నట్టు ఒక పిక్ ఉండగా, షూటింగ్ లొకేషన్స్‌కు సంబంధించిన మరో వీడియో ఉంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
మహా శివరాత్రికి ‘మహర్షి’ గిఫ్ట్!
‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మహా శివరాత్రికి ఈ చిత్రం నుంచి మరో టీజర్ రాబోతోందని.. మహేష్ అభిమానులను సర్ప్రైజ్ చేసేట్టుగా ఈ టీజర్ ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రబృందం.. గ్రామీణ నేపథ్యంలో ఉండే సన్నివేశాలకు సంబంధించిన పార్ట్‌ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ వైరల్ కాగా.. ఈ చిత్రం గురించి మహేష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డె కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. -
‘మహర్షి’ మరింత స్టైలిష్‌గా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయ్యింది. ఈ మూవీ మహేష్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మహేష్ మరో లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సూపర్ స్టార్ ఫ్యామిలీతో కలిసి జర్మనీలో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ అభిమానులతో కలిసి దిగిన ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. సూట్లో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్న మహేష్ లుక్ సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ మూడో వారం నుంచి ఇదే లుక్‌లో అమెరికాలో జరగనున్న షూటింగ్లో పాల్గొననున్నాడు మహేష్. ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
కంపెనీ సీఈఓగా...!
అమెరికాలో ‘మహర్షి’ ప్రయాణం మొదలవ్వడానికి టైమ్ దగ్గర పడుతోంది. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ కనిపిస్తారు. మహేశ్‌కు తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. అమెరికాలో జరగనున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల 15న స్టార్ట్ అవుతుందని సమాచారం. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇందులో మహేశ్‌బాబు స్టూడెంట్‌గా నటిస్తున్నారని ‘మహర్షి’ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కానీ మహేశ్ క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయని... ఒక షేడ్‌లో స్టూడెంట్‌గా కనిపించే మహేశ్ మరో షేడ్‌లో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాలనే అమెరికాలో తీయబోతున్నారట ‘మహర్షి’ టీమ్. అలాగే రెండు సాంగ్స్‌ను కూడా ఈ షెడ్యూల్లోనే కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ‘మహర్షి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హాలిడే కోసం మలేసియాలో ఉన్న సంగతి తెలిసిందే. -
మహేష్ 26.. 150 కోట్ల బడ్జెట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పొట్లూరి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా మహేష్ ఇప్పటికే ప్రకటించాడు. రంగస్థలంతో సూపర్‌హిట్ కొట్టిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ తన తదుపరి చిత్రం చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనుందన్న టాక్ వినిపిస్తోంది. కథా కథనాల పరంగా పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయనున్నారట. అందుకే ఇంతటి భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణలు వివరాలను వెల్లడించనున్నారు. -
మెగా వేడుకల్లో టాలీవుడ్ డైరెక్టర్స్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను అభిమానులులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే చిరంజీవి ఇంటి దగ్గర అభిమానుల సందడి కనిపించింది. బుధవారం ఉదయం నుంచి సినీ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి క్యూ కట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా చిరు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదంతా ఒకెత్తే సాయంత్రం అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ మరో ఎత్తు. అరవింద్ ఇంట్లో జరిగిన వేడుకల్లో మెగా కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. చిరుతో కలిసి దర్శకులు వంశీ పైడిపల్లి, సుకుమార్, పరశురామ్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, వక్కంతం వంశీ, మెహర్ రమేష్, సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో మెగా తనయుడు రామ్ చరణ్‌తో పాటు అల్లువారబ్బాయిలు అల్లు అర్జున్, శిరీష్‌లు కూడా కనిపిస్తున్నారు. -
మహేష్ పుట్టిన రోజున పక్కా..!
భరత్ అనే నేను సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్‌లో కాలేజ్ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రకరణ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. బర్త్‌డే కానుకగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయటం పక్కా అని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను 2019 ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
చాలెంజ్‌ను స్వీకరించిన సూపర్‌స్టార్
రైస్ బకెట్ చాలెంజ్‌తో మొదలైన ఉద్యమం.. ఎన్నో సామాజిక విషయాల్లో చాలెంజ్‌లు విసురుతూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మొన్నామధ్య క్రీడా శాఖా మంత్రి రాజ్యవర్ధన్ విసిరిన హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ చాలెంజ్ ఎంత పాపులర్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ను దాటి టాలివుడ్‌కు ప్రవేశించిన ఈ చాలెంజ్‌ను.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. తాజాగా హరితహారం చాలెంజ్ వైరల్‌గా మారుతోంది. కేటీఆర్, కవిత, సచిన్, రాజమౌళి లాంటి సెలబ్రెటిలు చాలెంజ్‌ను స్వీకరించి ఓ మొక్కను నాటి మరికొంత మందికి ఈ చాలెంజ్‌ను విసిరారు. కేటీఆర్ విసిరిన ఈ చాలెంజ్‌ను తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు స్వీకరించారు. తన కూతురుతో కలిసి ఓ మొక్కను నాటుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. తనను నామినేట్ చేసినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. గౌతమ్, సితారా, వంశీ పైడిపల్లికి చాలెంజ్‌ను విసిరారు. మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. Challenge accepted, @KTRTRS & @RachakondaCop 😊 Thank you for nominating me...👍 #HarithaHaram is a great initiative taken towards a go green environment. I now nominate my daughter Sitara, my son Gautam and my @directorvamshi to take on the challenge. pic.twitter.com/SEhcuM4Dgy — Mahesh Babu (@urstrulyMahesh) July 30, 2018 -
ఫ్యామిలీ డ్రామాకు ఓకె చెప్పిన మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధి డెహ్రడూన్‌లో ఓ మేజర్ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేశారు. మరో షెడ్యూల్ కోసం త్వరలో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు మహేష్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తను తదుపరి చిత్రం చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశాడు. అయితే ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న మహేష్ తరువాత బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు. దీంతో సుకుమార్ కాంబినేషన్లో చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. -
మహేష్.. తారక్... చెర్రీ
టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇంతకాలం రిజర్వ్డ్గా ఉన్న హీరోలు ఒక్కటై పోతున్నారు. మల్టీ స్టారర్లు.. బడా హీరోలు ఒక్కచోట చేరి సందడి చేయటం.. ఒకరి చిత్రాలకు మరొకరు ప్రమోషన్లు చేసుకుంటూ తిరిగి పాత రోజులను గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు తరచూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుండటం చూస్తున్నాం. (మేం మేం బాగానే ఉంటాం. మీరూ మీరే బాగుండాలి) ఆ మధ్య భరత్ అనే నేను బహిరంగ సభ ఈవెంట్ సందర్భంగా జరిగిన పార్టీలో సందడి చేసిన ఈ ముగ్గురు స్టార్స్.. ఇప్పుడు మరోసారి కనులవిందు చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్ డే పార్టీకి హాజరయి ఫోటోలకు ఫోజులిచ్చారు. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దిల్ రాజు, నటి పూజా హెగ్డే తదితర ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. -
ఆ టీజర్‌పై దర్శకుడి ప్రశంసలు
సమ్మోహనంతో క్లాస్ హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చారు సుధీర్ బాబు. సినిమాలోని తన నటనకు ప్రశంసులు దక్కాయి. హీరోగానే కాకుండా..నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెట్టారు సుధీర్ బాబు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌పై ‘నన్ను దోచుకుందువటేవ’ సినిమాను చేస్తున్నారు ఈ యంగ్‌హీరో. తాజాగా నన్ను దోచుకుందువటే సినిమా టీజర్‌ను రిలీజ్చేశారు. ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. సమ్మోహనం సినిమాలానే ఈ మూవీ కూడా విజయవంతం అయ్యేలా కనిపిస్తోంది. ఈ టీజర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్‌పై దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ.. ‘ టీజర్ చాలా బాగుందిరా. సమ్మోహనం సినిమాలానే ఇది కూడా మళ్లీ హిట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. నిర్మాతగా సక్సెస్ సాధించాలి. ఆల్ ది బెస్ట్.’ అంటూ ట్వీట్ చేశారు. -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేష్ 25
భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనిదత్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తుండటం విశేషం. తొలి షెడ్యూల్లో కాలేజ్‌కి సంబంధించిన సన్నివేశాలను డెహ్రడూన్‌లో చిత్రీకరించారు. 24 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ పూర్తయ్యింది. భారీ షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ అండ్ టీం ప్రస్తుతం షార్ట్‌బ్రేక్ తీసుకున్నారు. త్వరలోనే మరో షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లనున్నారు. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
స్క్రీన్ ప్లే 22nd June 2018
-
మహేష్ తండ్రిగా మరోసారి..!
‘భరత్ అనే నేను’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సిల్వర్ జూబ్లీ (25) సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో జరుగుతోంది. తొలిసారిగా మహేష్ ఈ సినిమా కోసం కొత్తలుక్‌ను ట్రై చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమా అంటే ఆ సినిమాలో కచ్చితంగా ప్రకాష్ రాజ్ ఉండాల్సిందే. ఒకటి రెండు సినిమాలు తప్ప మహేష్ హీరోగా నటించిన అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు. ఇప్పుడు మహేష్ 25వ సినిమాలోనూ ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మహేష్ బాబు తండ్రిపాత్రలో నటిస్తున్నాడు. గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వీరిద్దరు తండ్రి కొడుకులుగా నటించారు. అందుకే సెంటిమెంట్ పరంగానూ ఈ కాంబినేషన్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎక్కువ భాగం ఫారిన్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
గడ్డంతో మహేష్ లుక్..వీడియో వైరల్
-
మస్తీ.. మస్తీ...
ఎఫ్ ఫర్ ఫ్రెండ్షిప్. ఎఫ్ ఫర్ ఫన్... ఎఫ్ ఫర్ ఫుడ్. ఎఫ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్లంతా కలసికట్టుగా ఉంటే చూడ్డానికి బాగుంటుంది. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని స్పష్టం చేస్తుంది. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే డైరెక్టర్స్ మధ్య ఆ అట్మాస్పియర్ ఉన్నట్లనిపిస్తోంది కదూ. వీళ్లందరూ ఎఫ్ అండ్ ఎఫ్ (ఫన్ అండ్ ఫుడ్)తో మస్తీ చేశారు. సీనియర్ డైరెక్టర్ రాజమౌళి (ఫొటోలో ఉన్న డైరెక్టర్స్ అందరిలోకల్లా రాజమౌళి ముందు (2001) డైరెక్టర్ అయిన విషయం తెలిసిందే) టు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి... మొత్తం తొమ్మిది మంది దర్శకులు సోమవారం సాయంత్రం కలిశారు. ఈ గెట్ టు గెదర్‌కి వేదిక డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇల్లు. ఈ పార్టీ ప్లాన్ వంశీ పైడిపల్లి, సుకుమార్‌లది. అప్పుడప్పుడూ ఇలా కలిస్తే, ఒకరి థాట్స్ మరొకరు షేర్ చేసుకోవడంతో పాటు సాన్నిహిత్యం కూడా పెరుగుతుందన్న ఆలోచనతో ఈ పార్టీని ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి అతిథి మర్యాదలు చేయడంలో బెస్ట్ అని ఆయన ఆతిథ్యం తీసుకున్నవాళ్లు అంటుంటారు. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారట. ‘‘నేను హలీమ్‌ని ఎంజాయ్ చేశాను. జనరల్‌గా నేను తక్కువ మాట్లాడతా. పార్టీలో కూడా అంతే. బట్.. అందర్నీ కలుసుకోవడం, వాళ్ల అనుభవాలు వినడం చాలా బాగా అనిపించింది’’ అని నాగ్ అశ్విన్ అన్నారు. కొంతమంది దర్శకులు సోషల్ మీడియా ద్వారా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. నాన్‌స్టాప్ నవ్వులు – రాజమౌళి ‘‘వంశీ (వంశీ పైడిపల్లి), సుక్కు(సుకుమార్) కలిసి ఇనిషియేట్ తీసుకున్నారు. వంశీ ఇంట్లో అందరం కలిశాం. బాగా ఎంజాయ్ చేశాం. శివ (కొరటాల శివ), హరీష్ శంకర్ చెప్పిన స్టోరీలను మర్చిపోలేను. అలాగే వన్ లైనర్స్ కూడా. సోమవారం రాత్రి కలిసిన అందరం నెక్ట్స్ డే మార్నింగ్ (మంగళవారం) నాలుగు గంటల వరకు నవ్వుతూనే ఉన్నాం’’ అన్నారు రాజమౌళి. ‘‘మీరు (రాజమౌళిని ఉద్దేశించి) మాతో ఉండటం మాకు హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది వండ్రఫుల్ ఈవెనింగ్. కాదు. కాదు. నిజానికి మార్నింగ్’’ అన్నారు హరీష్ శంకర్. ఈ డైరెక్టర్స్ మీట్ గురించి అల్లు అర్జున్ అభిప్రాయం ఇలా ఉంది. ‘‘సుకుమార్, వంశీ లవ్లీ ఇనిషియేట్ తీసుకున్నారు. బిగ్ డైరెక్టర్స్ అందర్నీ ఒక ఫ్రేమ్‌లో చూడటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లిని, ఇతర దర్శకులను అడపా దడపా కలిసిన ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి ఈ మీట్ ద్వారానే తొలిసారి రాజమౌళిని కలిశారట. దర్శకులందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారట. -
టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒకేచోట...
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో సోమవారం రాత్రి పార్టీని నిర్వహించగా, అగ్ర దర్శకులంతా హాజరయ్యారు. రాజమౌళి, సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీశ్ శంకర్లతోపాటు అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ వంగవీటి, వంశీ పైడిపల్లి ఇలా అంతా ఒక్కచోట చేరారు. వీరంతా కలిసి ఓ ఫోటో దిగగా, ‘అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను’ అంటూ వంశీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం చెర్రీ-తారక్‌ల మల్టీస్టారర్ కోసం కథ సిద్ధం చేస్తుండగా, సుకుమార్ మహేష్ కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్, వంశీ పైడిపల్లి మహేష్ బాబు 25వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్ ఎఫ్ 2 రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధం అయ్యాడు. కొరటాల, సందీప్, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్లు తమ తర్వాతి ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకుంటున్నారు. A memorable evening with these Amazing people at home... Thank You @ssrajamouli Sir, @aryasukku, @sivakoratala , @harish2you, @DirKrish, @AnilRavipudi , #SandeepReddyVanga, #NagAshwin for making this evening happen.. :) pic.twitter.com/9qxHoCA2xo — Vamshi Paidipally (@directorvamshi) 4 June 2018 'FUN'tastic..😀😀....it's great evening...thanks for hosting this amazing meet ..Vamshi Anna.... https://t.co/h6OBG80qhY — Anil Ravipudi (@AnilRavipudi) 4 June 2018 -
అందుకే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశా
తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు సుధీర్‌బాబు. ఇప్పుడు ఆయన ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘తన సమర్థత మీద ప్రయాణించే మంచి మనసున్న వ్యక్తి సు«ధీర్బాబు. ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను’’అన్నారు. ‘‘సుధీర్‌బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్ నిర్మాతగా సుధీర్‌బాబు పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను’’అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘ ఏదో ఒకరోజు నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసే స్టేజ్‌లో ఉంటే కొత్తవాళ్లను తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అలాగే స్టార్ట్ చేశా. కృష్ణగారు, మహేశ్ వాళ్లను వాడేసుకుని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. సొంతంగా ఎదగాలని కోరుకుంటాను. అందులో ఒక తృప్తి ఉంటుంది. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్. మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు చేయాలన్నదే నా విజన్. ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు. అయ్యా. దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. బయటి ప్రొడక్షన్లో కూడా నటిస్తాను. మా బ్యానర్లో రాబోతున్న తొలి సినిమా షూటింగ్ ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో తుదిదశకు చేరుకుంది. మంచి సందర్భం చూసుకుని ఇలాగే గ్రాండ్‌గా ఈ సినిమా గురించి ప్రకటిస్తాం. ఇప్పుడు ఏ విషయం ఎనౌన్స్ చేయడం లేదు. ఎందుకంటే నేను హీరోగా చేసిన ‘సమ్మోహనం’ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకే ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేద్దామనుకోవడం లేదు. అందుకే బ్యానర్ లాంచ్ వరకు మాత్రమే పెట్టాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సందీప్ కిషన్, దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకరలతోపాటు చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ఆది కొత్త సినిమా ఓపెనింగ్
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ఆదివారం ప్రారంభమైంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ శౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ పాల్గొన్నారు. హీరో ఆది మాట్లాడుతూ... డైరెక్టర్ నాకు 3 గంటలు నెరేషన్ ఇచ్చారు. ఫ్యూర్ లవ్ స్టొరీ ఇది. మంచి ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. త్వరలో హీరోయిన్ పేరు ప్రకటిస్తాము. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాను. నాకు కెరీర్ లో ఇది మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నానన్నారు. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ... మంచి లవ్ స్టొరీ తో వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా చెయ్యడానికి మాకు సహకరిస్తున్న సాయి కుమార్ గారికి, హీరో ఆదికి, నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు సంభందించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాము. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నానన్నారు. -
మీసకట్టుతో మహేష్..?
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. మహేష్ 25వ గా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ మీసకట్టుతో కనిపించనున్నాడట. భరత్ అనే నేను ప్రమోషన్ సమయంలో తదుపరి చిత్రంలో కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టుగా వెల్లడించారు మహేష్. అయితే సినిమా అంతా మహేష్ మీసంతోనే కనిపిస్తాడా..? లేక కొద్దిసేపే అలా కనిపిస్తారా..? అన విషయం తెలియాల్సి ఉంది. -
మహేష్ 25.. ఆమె హీరోయిన్ కాదు!
భరత్ అనే నేను చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది. దాదాపుగా విదేశాల్లోనే ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డేను అల్రెడీ తీసేసుకోగా.. ఇప్పుడు మరో హీరోయిన్‌కు ఛాన్స్ దక్కినట్లు వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేను ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం మేకర్లు సంప్రదించగా.. ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదని.. ఓ కీలక పాత్ర మాత్రమేనని చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. దిల్ రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అల్లరి నరేష్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. భరత్ అనే నేను చిత్రం విడుదల తర్వాత మహేష్.. కాస్త గ్యాప్ తీసుకుని 25వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. -
జోడి కుదిరింది
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన సిల్వర్ జూబ్లీ సినిమాను చేయనున్నాడు. ప్రముఖ నిర్మాతలు అశ్వనిదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. మహేష్ బాబు నెక్ట్స్ సినిమాలో తాను హీరోయిన్గా నటించబోతున్నట్టుగా పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లిలతో కలిసి నటించనున్నందుకు ఆనందంగా ఉంది. అందరం కలిసి ఓ అందమైన సినిమా మీకందించేందుకు ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు పూజ. పూజ హెగ్డే ట్వీట్‌పై స్పందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తనతో కలిసి వర్క్ చేయటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. Glad to announce my next Telugu film with @urstrulyMahesh and @directorvamshi 😊 Looking forward to get together and create a beautiful film for you’ll to watch ❤️ Excited 🤞🤞 — Pooja Hegde (@hegdepooja) 31 January 2018 Glad to have You on board Pooja... Best Wishes... :)👍 https://t.co/qVWGt9qzgE — Vamshi Paidipally (@directorvamshi) 31 January 2018 -
ఏప్రిల్ నుంచి సూపర్ స్టార్ కొత్త సినిమా
ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశపరచటంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. స్పైడర్ రిలీజ్ తరువాత వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరున ‘భరత్ అనే నేను’ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘భరత్ అనే నేను’ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే తన 25వ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు మహేష్. ఇప్పటికే ప్రకటించినట్టుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నాడు. ప్రముఖ నిర్మాతలు అశ్వనిదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
మహేష్ రెండు సినిమాలు ఒకే ఏడాదిలో..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని నటిస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ చేయబోయే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇప్పుడే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అశ్వనిదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
సూపర్ స్టార్ సినిమా కోసం న్యూ లుక్
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమా తరువాత వంశీ పైడీపల్లి దర్శకత్వంలో మరో తన 25వ సినిమా చేయనున్నాడు మహేష్. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ న్యూ లుక్ లో దర్శనమివ్వనున్నాడట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న నరేష్ కాస్త బొద్దుగా కనిపించాడు. దీంతో ఈ లుక్ మహేష్ సినిమా కోసమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మేడ మీద అబ్బాయి సినిమాతో మరోసారి నిరాశపరిచిన నరేష్, కెరీర్ ను మలుపు తిప్పే ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. -
కథ కుదరాలంతే!
అవును... కథ కుదిరితే, అంతా కుదిరితే తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రావడం కొత్తేమీ కాదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ లాంటి సినిమాలు వచ్చాయి. త్వరలో నాగార్జున, నాని కలసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. ఈ లిస్ట్‌లో మహేశ్‌బాబు–సాయిధరమ్ తేజ్ చేరనున్నారని సమాచారం. ‘సీతమ్మ వాకిట్లో...’తో ఈ తరంలో మల్టీస్టారర్ మూవీస్‌కి నాంది పలికిన వెంకీ–మహేశ్ కథ కుదిరితే ఎవరి కాంబినేషన్లో చేయడానికైనా రెడీ అని పలు సందర్భాల్లో చెప్పారు. ఆల్రెడీ వెంకీ ఓ మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పైన వార్త చదివితే తెలుస్తుంది. రెండు రోజుల క్రితం నిర్మాత ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ బర్త్‌డే ఫంక్షన్‌కు కొందరు స్టార్స్ హాజరైన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్లో సాయిధరమ్ తేజ్‌తో మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఓకేనా? అని మహేశ్‌బాబును వంశీపైడిపల్లి అడగ్గా... ‘‘కథ కుదరాలంతే. నేను రెడీనే’’ అన్నారట. ఇటు సాయిధరమ్ కూడా రెడీ అట. ఆల్రెడీ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి ‘ఊపిరి’ వంటి మల్టీస్టారర్ హిట్ సినిమా తీశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయన్నారు. అంటే... అది మల్టీస్టారరా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
మాస్ స్పెషలిస్ట్‌తో మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూట్ మారుస్తున్నాడు. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మహేష్, మాస్ ఆడియన్స్‌లో ఆ స్థాయి ఫాలోయింగ్ సాధించలేకపోయాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఫ్లాప్ టాక్‌తో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తుంటే మహేష్ మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. మహేష్ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే భారీ నష్టాలు తప్పటం లేదు. ఇటీవల రిలీజ్ అయిన స్పైడర్ విజయంలోనూ అదే జరిగింది. అందుకే మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న భరత్ అను నేను అనే పొలిటికల్ డ్రామాలోనూ నటిస్తున్న మహేష్, ఆసినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అదే సమయంలో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాలతో మాస్కు చేరువయ్యేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే బోయపాటి మహేష్ కోసం ఓ కథ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాను గతంలో మహేష్‌తో వరుస సినిమాలు నిర్మించిన 14 రీల్స్సంస్థ నిర్మించే ప్లాన్‌లో ఉంది. -
మహేష్‌తో మరోసారి..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తనతో కలిసి నటించిన హీరోయిన్లను రిపీట్ చేసిన సందర్బాలు చాలా తక్కువ. ముఖ్యంగా సెంటిమెంట్లను ఫాలో అయ్యే సూపర్ స్టార్ తన ఫ్లాప్ సినిమాల హీరోయిన్లను రిపీట్ చేయటం మరింత అరుదు. కానీ ఓ ఫ్లాప్ సినిమాలో తనకు జోడీగా నటించిన హీరోయిన్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట సూపర్ స్టార్. ‘స్పైడర్’ లాంటి భారీ డిజాస్టర్ లో తనతో జోడి కట్టిన రకుల్ తో మరోసారి స్క్రీన్‌షేర్ చేసుకోవాలని భావిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న మహేష్, తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమాతో అయినా మహేష్, రకుల్ జోడి హిట్ పెయిర్ అనిపించుకుంటుందేమో చూడాలి. -
మహేష్ 25 టైటిల్‌పై డైరెక్టర్ క్లారిటీ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నట్టుగా చాలా కాలం కిందటే ప్రకటించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ 24వ సినిమాలో నటిస్తుండగా వంశీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్లో విదేశాల్లో సంగీత చర్చల్లో ఉన్నారు. దిల్ రాజు, అశ్వనిదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్స్ ఇవే అంటూ కొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయి. కొద్ది రోజులుగా మహేష్25 టైటిల్స్ అంటూ ‘కృష్ణా ముకుందా మురారీ’, ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపించాయి. ఈ టైటిల్స్ మహేష్ బాబు ఇమేజ్‌కు దిల్‌రాజు బ్యానర్ కు తగ్గట్టుగా ఉండటంతో దాదాపు ఈ టైటిల్స్ ఒకటి ఫిక్స్ చేస్తారని భావించారు. అయితే ఈ విషయంపై స్పందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ 25కి ఇంతవరకు టైటిల్ ఫిక్స్ చేయలేదని ప్రకటించారు. టైటిల్ నిర్ణయించిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. Title for #MAHESH25 hasn't been decided as yet.. It is neither "Krishna Mukunda Murari" nor "Hare Rama Hare Krishna"... will keep you all posted once we decide on an apt title... :) — Vamshi Paidipally (@directorvamshi) 27 October 2017 -
దేవీ శ్రీ ప్రశ్నకు అఖిల్ జవాబు
ట్విట్టర్ వేదికగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పోస్ట్ చేసిన ఓ పజిల్ కు అఖిల్ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు 25వ సినిమాకు సంగీతమందించే పనుల్లో బిజీగా ఉన్న దేవీ శ్రీ, విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు. తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన దేవీ.. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ఎవరు..? ఎక్కడున్నారు..? అక్కడ ఏం జరుగుతోంది అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన అక్కినేని యంగ్ హీరో అఖిల్, 'కుడి వైపు ఉన్న వ్యక్తి వంశీ, మరో వ్యక్తి నువ్వే' అంటూ ట్వీట్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ బాబు 25వ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈసినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా యూనిట్ సభ్యులు ఫారిన్ లో మకాం వేశారు. ఈ ఫోటో సంగీత చర్చలు జరుగుతున్న సమయంలో తీసినప్పటిదే అయి ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. The one on the right is Vamshi and left is you — Akhil Akkineni (@AkhilAkkineni8) 26 October 2017 -
మరోసారి మురారిగా మహేష్..!
స్పైడర్ సినిమాతో ఆకట్టుకున్న మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. ఇది మహేష్ హీరోగా తెరకెక్కుతున్న 25వ సినిమా కావటంలో దిల్ రాజు, అశ్వనీదత్ లు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు కృష్ణ ముకుందా మురారి, హరే రామ హరే కృష్ణ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్స్ సినిమా కథతో పాటు మహేష్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మహేష్‌కు జోడిగా రీ ఎంట్రీ..?
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకొని తరువాత బాలీవుడ్ చెక్కేసిన ముద్దుగుమ్మ ఇలియానాకు ఇంకా బ్యాడ్ టైం కొనసాగుతూనే ఉంది. భారీ ఆశలతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామకు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో సౌత్ వైపు చూస్తోంది. సౌత్‌లో కొత్త తారలు పాతుకుపోవటంతో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు. ఇటీవల ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలతో పరవాలేదనిపించినా.. వరుస ఆఫర్లు మాత్రం పలకరించలేదు. అయితే తాజాగా ఈ గోవా బ్యూటీకి సౌత్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అయిన పోకిరి కాంబినేషన్ లో కావటం విశేషం. ప్రస్తుతం స్పైడర్, భరత్ అనే నేను సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న మహేష్, ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడ్రక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఇలియానాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. పోకిరి సినిమాతో బాక్సాఫీస్ దుమ్ము దిలిపిన ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిన ఇలియానాతో జోడి కట్టేందుకు మహేష్ ఓకె చెప్తాడో.. లేదో చూడాలి. -
రేపే మహేష్ కొత్త సినిమా లాంచ్..!
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. తాజాగా మరో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నాడు సూపర్ స్టార్. తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించాడు మహేష్. దిల్ రాజు, అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రేపు(13-08-2017) పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. భరత్ అను నేను తో పాటు వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మహేష్. తన సినిమాల ఓపెనింగ్ కు మహేష్ హాజరుకాడు. అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఈ 25 సినిమా కూడా మహేష్ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. -
అవును... మహేశ్‌తో అల్లరి నిజమే!
ఫిల్మ్‌నగర్‌లో ఈ వారం జోరుగా హుషారుగా దూసుకెళుతోన్న వార్తల్లో మహేశ్‌బాబు–‘అల్లరి’ నరేశ్‌ల కాంబినేషన్ గురించిన వార్త ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించనున్న చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ కూడా నటించనున్నారనేది ఆ వార్త సారాంశం. ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొట్టే వార్తల్లో దాదాపు నిజమైనవే ఉంటాయి. ఈ కాంబినేషన్ నిజమేనని చిత్రసన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరి.. ‘అల్లరి’ నరేశ్ కూడా ఓ హీరోగా చేస్తారా? స్పెషల్ క్యారెక్టరా? అనేది తెలియాల్సి ఉంది. పాత్ర ఏదైనా బాగానే ఉండి ఉంటుంది. అందుకే అల్లరోడు అంగీకరించి ఉంటారని ఊహించవచ్చు. అక్టోబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..?
-
మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..?
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ బైలింగ్యువల్ సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే చేయనున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. గతంలో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పీవీపీ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుందని ప్రకటించారు. ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పొస్టర్పై మహేష్ స్పందించలేదు. పీవీపీ సంస్థ మాత్రం మహేష్‌తో తమకు రెండు సినిమాల ఒప్పందం జరిగిందని, బ్రహ్మోత్సవం తరువాత మరో సినిమా చేయాల్సి ఉందని ప్రకటించింది. తాజాగా పీవీపీ సంస్థ మహేష్‌తో నిర్మించాల్సిన సినిమా మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మహేష్ బాబు హీరోగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బిగ్ హిట్ అందించిన దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం మహేష్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్న దర్శకుడు, వంశీ పైడిపల్లి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
వంశీతో మహేష్ సినిమా ఎప్పుడంటే..?
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగాం పీవీపీ బ్యానర్ మహేష్ మరో సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత మహేష్ నుంచి గాని, పీవీపీ సంస్ధ నుంచి గాని ఈ సినిమాపై ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో వంశీ, మహేష్‌ల కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపించింది. అదే సమయంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేయటంతో ఇక వంశీ, మహేష్‌ల సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ.., ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబుతో తమ నెక్ట్స్ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈ సినిమా ఉంటుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో కింగ్ నాగార్జునతోనూ ఓ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ చేయనునున్నట్టుగా తెలిపారు. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారిగది సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. -
సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్నాడు. బ్రహ్మోత్సవం షాక్ నుంచి వెంటనే కోలుకున్న ప్రిన్స్, అభిమానుల కోసం వరుస సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను ప్రారంభించాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డ్లను తిరగరాయటం కాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ సినిమా బ్యానర్లో సినిమాకు ఓకె చెప్పేశాడు. ఊపిరి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన వంశీ, మహేష్ కోసం స్టైలిష్ ఎంటర్టైనర్ను రెడీ చేశాడు. ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల శివ దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. తనకు శ్రీమంతుడు లాంటి కెరీర్ బెస్ట్ అందించిన కొరటాలతో మరో సినిమా చేస్తే తన ఇమేజ్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. -
చలో అమెరికా!
మహేశ్‌బాబు తొలిసారి అమెరికా వెళ్తున్నారు. కాదు.. కాదు.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయన్ని అమెరికా తీసుకు వెళ్తున్నారు. ఏంటి మీరు చెప్పేది? ఇప్పటివరకూ మహేశ్ అమెరికా వెళ్లలేదా? వంశీ పైడిపల్లి తీసుకు వెళ్తున్నారా.. అనుకుంటున్నారా! మహేశ్, వంశీలు అమెరికా వెళ్లేది సినిమా కోసం. ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ సినిమాలతో కమర్షియల్ స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి ఇటీవల మహేశ్‌బాబుకి ఓ కథ వినిపించారట. అమెరికా నేపథ్యంలో సాగే ఆ కథకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి ఈ సినిమాను నిర్మించనున్నారట. వంశీ పైడిపల్లి గత చిత్రం ‘ఊపిరి’ నిర్మించిందీయనే. ఇప్పటివరకూ మహేశ్‌బాబు 22 సినిమాల్లో నటించగా... అమెరికా నేపథ్యంలో కథ సాగిన సినిమా ఒక్కటీ లేదు. అసలాయన సినిమాల్లో ఫారిన్ నేపథ్యంలో సాగిన వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. హాలీవుడ్ హీరోలా కనిపించే మహేశ్‌ను అంతే స్టైలిష్‌గా చూపించడానికి వంశీ పైడిపల్లి రెడీ అవుతున్నారట. ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్ నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. -
‘తిక్క’ ఆడియో రిలీజ్
-
ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యా
‘‘ఒక భయంతో తేజూ కెరీర్ మొదలుపెట్టాడు. ఇంత సక్సెస్ఫుల్ అయినా ఆ భయం అలాగే ఉంది. దాన్ని ఆలాగే పెట్టుకో తేజ్. ఆ భయం ఉన్నంతకాలం ఎప్పుడూ ఇలా కష్టపడుతూ ఉంటావ్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నీ ప్రతిభకి, కష్టపడే తత్వానికి ఇంకా ఎత్తుకు వెళ్తావ్. ఎన్ని తిక్కలకు ఓ లెక్క ఉంటుందో తెలీదు గానీ, ఈ తిక్కకు మాత్రం తప్పకుండా ఓ లెక్క ఉంటుందని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా నటీనటులుగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘తిక్క’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వంశీ పైడిపల్లి ఆవిష్కరించి, సాయిధరమ్ తేజ్‌కి అందించారు. జానారెడ్డి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఆశీర్వాదాలతోనే మీ అందరి (అభిమానులు) ప్రేమను పొందగలుగుతున్నాను. వాళ్లు లేకుండా నేను లేను. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ ఉంటుంది. మనకు ఎప్పుడూ ఉండేది బ్రేకప్ (నవ్వుతూ) కాబట్టి ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎక్కడా రాజీ పడకుండా రోహిణ్ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ బాగా తీశారు. తమన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఫ్లాప్ దర్శకుణ్ణి అయినా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజూ, నిర్మాత రోహిణ్లకు థ్యాంక్స్’’ అని సునీల్ రెడ్డి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘చిన్నప్పట్నుంచి మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. తేజూతో ఈ చిత్రం తీస్తుంటే నా బ్రదర్‌తో వర్క్ చేసినట్టు అనిపించింది. మా చిత్రంలో పాటలు పాడిన ధనుష్, శింబులకు థ్యాంక్స్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్, మాగంటి గోపీనాథ్, కె.ఎస్.రామారావు, ‘దిల్’ రాజు, నందినీ రెడ్డి, తమన్ తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. -
ఆ సంస్థకు మాటిచ్చిన మహేష్ బాబు
బ్రహ్మోత్సవం సినిమాలో నిరాశ పరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌ను ఆదుకునేందుకు మరో సినిమాను చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం మురుగదాస్ సినిమాకు రెడీ అవుతున్న మహేష్, ఆ తరువాత పీవీపీ బ్యానర్లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. మహేష్ లాంటి స్టార్ హీరో మాట ఇవ్వటమే ఆలస్యం కథ వేటలో పడ్డారు పీవీపీ టీం. ఇటీవల అదే బ్యానర్లో ఊపిరి సినిమాతో భారీ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ హీరోగా సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. వంశీ చెప్పిన లైన్ మహేష్‌కు కూడా నచ్చటంతో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా మహేష్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయాల్సి ఉంది. మరి ముందుగా వంశీ సినిమా సెట్స్ మీదకు తీసుకు వస్తాడా..? లేక పూరి సినిమా తరువాతే ఈ సినిమా ఉంటుందా..? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
అఖిల్ సినిమా రేసులో మరో దర్శకుడు
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అఖిల్ సినిమా అక్కినేని అభిమానులను అలరించలేకపోయింది. దీంతో తన రెండో సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఈ యువ హీరో. ఇప్పటికే అఖిల్ రెండో సినిమా రేసులో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా నాగార్జునకు ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుదన్న టాక్ బలంగా వినిపించింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఏ జవానీ హై దివానీ' సినిమాను తెలుగు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. ఈ సినిమాను వంశీ దర్శకత్వంలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. తాజాగా అఖిల్ సినిమా రేసులో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న హను రాఘవపూడి, అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ప్రస్తుతానికి వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టి హను సినిమానే ముందుగా సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి హనురాఘవపూడి సినిమా అయినా సెట్స్ మీదకు వస్తుందో..? లేక.. మరోసారి అవన్ని గాసిప్స్ అంటూ అక్కినేని హీరోలు కొట్టిపారేస్తారో...? చూడాలి. -
ఇమేజ్ అంటూ ఎంత కాలం సినిమాలు చేస్తాను! - నాగార్జున
‘ఊపిరి’ సినిమాను నేను, అమల, అఖిల్, నాగచైతన్య కలిసి చూశాం. సినిమా అయ్యేంతవరకు అమల నా వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఇక సినిమా అయ్యాక మాత్రం అందరూ నన్ను రెండు నిమిషాల పాటు హత్తుకున్నారు. అంతకు మించిన ప్రశంస లేదనిపించింది’’ అని హీరో నాగార్జున అన్నారు. పీవీపి పతాకంపై నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్య తారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు ప్రశంసలు లభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో మీకన్నా కార్తీ పాత్రకే స్పాన్ ఎక్కువ ఉందని చాలా మంది అన్నారు. అయినా అలా ఫీలవ్వడానికి కార్తీ ఎవరో కాదు. నా తమ్ముడే కదా. నిజంగా మా ఇద్దరి మధ్యా అలాంటి అనుబంధం ఉంది కాబట్టే సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ఎప్పుడూ ఇమేజ్ను నమ్ముకుంటే ఒకే రకమైన కథలే వస్తాయి. కొత్తవి పుట్టవు. రొటీన్ సినిమాల్లో నన్ను నేను చూసుకుంటే నాకే బోర్ కొట్టేస్తోంది. పైగా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాల కారణంగా చెంపదెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతకాలం ఇమేజ్ను పట్టుకుని వేలాడతాం. ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాల జాబితాలో ‘ఊపిరి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మా వదిన (జ్యోతిక) ఇంతకు ముందే ఫోన్ చేసి, నన్ను అభినందించారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆమె అన్నారు’’ అని కార్తీ చెప్పారు. ‘‘ఇప్పుడు నన్నందరూ బాలచందర్‌గారితో పోలుస్తున్నారు. ఆయనతో పోల్చుకునేంత అర్హత నాకైతే లేదు. మొదటి నుంచి ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ముందు ఈ కథ నాగార్జునగారితో చెప్పడానికి భయపడ్డాను. కానీ తర్వాత ఆ భయం పోయింది’’ అని వంశీ పైడిపల్లి అన్నారు. ‘‘విజయా వాహిని సంస్థకు ‘మాయాబజార్’, జగపతి సంస్థకు ‘దసరా బుల్లోడు’ ఎలానో మీ సంస్థకు ‘ఊపిరి’ అలా అని ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశారు. అది మాకు దక్కిన గొప్ప ప్రశంసగా భావిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచీ ‘సెన్సేషనల్ ఫిలిమ్’ అని రెస్పాన్స్ వస్తోంది. ఈ విషయాన్ని నాగార్జునగారు రెండేళ్ల క్రితమే చెప్పారు’’ అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. -
'నేను తప్పని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్'
నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊపిరి సినిమాకు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఊపిరి చిత్రయూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇంటచబుల్స్ ఒకటి. నిజంగా చెప్పాలంటే.. ఈ సినిమాకు వంశీ న్యాయం చేయగలడని నేను నమ్మలేదు. థ్యాంక్స్ వంశీ.. నేను తప్పని నిరూపించినందుకు. భారతీయులకు తగ్గట్టుగా ఈ సినిమాను నువ్వు మార్చిన తీరు సినిమా స్థాయిని పెంచింది. కార్తీ చాలా బాగా చేశాడు. నాగార్జున గారు నిజమైన పాత్ బ్రేకర్. నిర్మాత పివి గారికి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు. ఊపిరి మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడే నిజమైన ఎంటర్టైనర్. డోంట్ మిస్ ఇట్' అంటూ ట్వీట్ చేశారు. ఫ్రెంచ్ మూవీ ద ఇంటచబుల్స్కు రీమేక్‌గా రూపొందిన ఊపిరి సినిమాలో నాగ్, కార్తీ ప్రధాన పాత్రలో నటించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. భారీ చిత్రాల నిర్మాణ సంస్ధ పివిపి సినిమా 60 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊపిరి సినిమాకు మంచి స్పందన వస్తోంది. హీరో నితిన్ కూడా సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. Intouchables is one of my favourites. Frankly I didn't think Vamsi would be able to handle it. Thanks Vamsi for proving me wrong. — rajamouli ss (@ssrajamouli) March 25, 2016 The scenes you indianised made it a better film. Karthi is so good. Nagarjuna garu is a true path breaker. — rajamouli ss (@ssrajamouli) March 25, 2016 Congratulations to PV garu and the whole team. Oopiri is A true entertainer that stays with you for a long time. Don't miss it... — rajamouli ss (@ssrajamouli) March 25, 2016 This summer starts off with a bang!! Oopiri hearin grt things bout d film..congrats nag sir n to the entire team of oopiri — nithiin (@actor_nithiin) March 25, 2016 -
నా ఊపిరి వాళ్లే!
‘‘నేను చేసే ప్రతి సినిమా నాకు ప్రత్యేకమే. ఈ ‘ఊపిరి’ ఇంకా ప్రత్యేకం. ఒక వ్యక్తిగా నాలో చాలా మార్పులు తెచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రం నాకో వరం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా వంశీ పైడిపల్లి చెప్పిన విశేషాలు... హాలీవుడ్ చిత్రం ‘ఇన్‌టచబుల్స్’ చూసి, కదిలిపోయాను. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనిపించింది. పీవీపీగారిని కలిస్తే, చేద్దామన్నారు. వీల్ ఛైర్‌కి పరిమితమయ్యే పాత్రను నాగార్జునగారు చేస్తేనే, ఈ సినిమా చేయాలనుకున్నాను. లేకపోతే మానేయాలనుకున్నాను. అలాగే, కార్తీ పాత్రకు చిన్న ఎన్టీఆర్‌ను అనుకున్నాను. కానీ, ఇప్పట్లో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని ఎన్టీఆర్ అనడంతో కార్తీని తీసుకున్నాను. అయితే ఎన్టీఆరే స్వయంగా నాగార్జునగారికి ఫోన్ చేసి, ‘వంశీ ఒక కథ చెబుతాడు. తిట్టొద్దు’ అన్నాడు. నేనెళ్లి కథ చెప్పగానే, ఆయన ఒప్పేసుకున్నారు. వాస్తవానికి సెకండాఫ్‌లో నాగార్జున గారికి తగ్గట్టు కొంత మార్చాను. కానీ, అలాంటిదేమీ వద్దని ఆయన అన్నారు. ఇప్పటివరకూ వచ్చిన హాలీవుడ్ చిత్రాల్లో ‘టాప్ 25’లో ‘ఇన్‌టచబుల్స్’ ఒకటి. ఆ సినిమాకి రీమేకే ‘ఊపిరి’ అని తెలిసి, ప్యారిస్‌లో లొకేషన్స్ చాలా ఈజీగా ఇచ్చేశారు. ఆ చిత్రానికి ఉన్న గౌరవం అలాంటిది. మంచి ఎమోషనల్ మూవీ. తెలుగుకు అనుగుణంగా కొన్ని మార్పులు, తమిళ వెర్షన్‌కు కొన్ని మార్పులు చేసి ఈ సినిమా తీశాం. మాతృక కన్నా తెలుగు, తమిళ చిత్రాలు బాగుంటాయి. నా ఊపిరి ఎవరు? అంటే.. నా కూతురు, భార్య, మా అమ్మ... ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. వ్యక్తి గతంగా నన్ను టచ్ చేసిన చిత్రం ఇది. థియేటర్ నుంచి బయటి కొచ్చేటప్పుడు ప్రేక్షకులు ఒకింత భావోద్వేగంతో వస్తారు. అఖిల్ హీరోగా ఓ చిత్రం చేయడానికి చర్చ జరుగుతోంది. అంతా ఫైనలైజ్ అయిన తర్వాత నా తదుపరి చిత్రం గురించి చెబుతా. -
ఆ రెండు విషయాలతో ఎవరూ పోరాడలేరు!
‘‘నంబర్ గేమ్స్‌ను నమ్మను. మనసుకి నచ్చిన సినిమాలు చేస్తూ వెళ్లిపోతా. పరిస్థితులు ఏవైనా తలకిందులు అయితే తప్ప నాకు జీవితాంతం నటించాలనే ఉంది’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ‘ఊపిరి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో పంచుకున్న విశేషాలు... ♦ ఫ్రెంచ్ మూవీ ‘ఇన్టచ్బుల్స్’ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి ‘ఊపిరి’ చేశాం. ఇందులో నేను క్వాడ్రాప్లీజిక్ పేషంట్‌గా వీల్‌చైర్‌కు పరిమితమయ్యే పాత్రలో కనిపిస్తాను. అఖిల్, నాగచైతన్య ఈ కథ విని, చేయొద్దన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అమల కేన్సర్ పేషంట్ అంటే నేనూ మొదట ఒప్పుకోలేదు. కానీ ‘ఊపిరి’ మనసుకి నచ్చి చేశాను. ♦ వాస్తవానికి నా అభిమానులు నేను చేసే వెరైటీస్కి అలవాటు పడిపోయారు. మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో నేను చేసిన ప్యూర్ లవ్‌స్టోరి ‘గీతాంజలి’ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘అన్నమయ్య’ చేస్తానంటే ‘కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంటే ఇలాంటి సినిమా చేయడం ఏంటి?’’ అన్నవాళ్లూ ఉన్నారు. కానీ ‘అన్నమయ్య’ చూసి, వాళ్లే నా దగ్గరకొచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ♦ జనరల్‌గా మనం ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు చేతులు ఆడిస్తాం. కానీ, ఈ పాత్రకు కుదరదు. నా చేతులను, కాళ్లను కట్టిపడేసినట్లుగా చేయాల్సి వచ్చింది. నా కదలికలను చూడటానికే ఇద్దరు అసిస్టెంట్లను పెట్టారు. మామూలుగా ఎవరైనా షాట్ గ్యాప్‌లో హాయిగా కూర్చొని, రిలాక్స్ అవుతారు. నేను మాత్రం కట్ అని చెప్పగానే హాయిగా సెట్ అంతా తిరిగేసేవాణ్ణి. ♦ కార్తీ చేసిన పాత్ర కోసం ఎన్టీఆర్‌ను అనుకున్న మాట నిజమే. అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక ఎన్టీఆర్ తప్పుకోవడంతో, కార్తీని ఎప్రోచ్ అయ్యాం. కార్తీ సలహా ఇవ్వడంవల్లే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పాను. ♦ మల్టీస్టారర్ అంటే స్టార్‌డమ్‌ను పక్కన పెట్టేసి, మన పాత్రకు పరిమితమైపోవాలి. ఇప్పుడు ‘క్షణం’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వస్తే కచ్చితంగా చేస్తా. అయితే అలాంటి సినిమా 4 నుంచి 5 కోట్ల బడ్జెట్లోనే చేయాలి. నాతో చేస్తున్నారు కదా అని రూ. 20 కోట్లు పెడితే ఆ సినిమా గల్లంతే. ♦ సూపర్స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా విభిన్న తరహా సినిమాలు చేసేవాళ్లు చాలా కొంతమందే ఉన్నారు. అందులో కమల్‌హాసన్ ఒకరు. ఆయన అన్నీ ట్రై చేశారు. చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్‌ని తీసుకుంటే, ఆయన ఇమేజ్‌కి భిన్నంగా సినిమా చేస్తే, అభిమానులు హర్ట్ అవుతారు. అందుకే ఇమేజ్ చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంతెందుకు... ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌లో చాలా మంది ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి, బయటకు రాలేకపోతున్నారు. అవే పంచ్ డైలాగులు, అవే ఫైట్లు... ఈ పరిస్థితి మారాలి. మళ్లీ తెలుగు సినిమాకు కొత్త రోజులు రావాలి. నా మటుకు నేను వెరైటీలు ట్రై చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఇప్పుడూ అంతే. ♦ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశ’ అనే సినిమా చేయనున్నా. ‘సోగ్గాడే...’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతోంది. ‘ఓం నమో వెంకటేశ’ మొదలు కావడానికి ఇంకా టైమ్ పడుతుంది. అలాగే అఖిల్ తదుపరి చిత్రకథపై దృష్టి పెట్టాను. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు నాకు సంతృప్తికరంగా ఉన్నాయి. రిటైర్మెంట్ ఆలోచనే లేదు. అయితే ఎప్పుడూ హీరోగా చేయలేను కదా. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తాను. వయసుతో, సమయంతో ఎవరూ ఎక్కువ కాలం పోరాడలేరు. ♦ గతేడాది ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చూశాను. బాగా నచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి తెలుగు సినిమా కళకళలాడుతోంది. ఇది మంచి పరిణామం. కానీ, నా అభిప్రాయం ఏంటంటే సినిమాల సంఖ్య తగ్గాలి. వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ జనవరి నుంచి మార్చి వరకే దాదాపు 50 వర కూ విడుదలై ఉంటాయి. అయినా ప్రేక్షకులు ఎన్ని సినిమాలని చూస్తారు. క్వాలిటీ ఔట్పుట్ మీద దర్శక, నిర్మాతలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని సినిమాలకు నిజమైన విజయం లభించిందనేది నా ప్రశ్న. పెట్టిన ఖర్చు వెనక్కి రావాలి. వస్తేనే కదా మళ్లీ ఇంకో సినిమా తీయొచ్చు. ♦ త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను, అల్లు అర్జున్ హీరోలుగా నటించనున్నామనే వార్త ప్రచారమవుతోంది. ఈ వార్త ఎక్కణ్ణుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ‘దిల్’ రాజు నిర్మించాలనుకుంటున్న సినిమా కథ కూడా ఇంకా వినలేదు. -
నాన్న ఇంకా యంగ్ అయిపోతున్నారనిపిస్తోంది!
-నాగ చైతన్య '‘రెండేళ్ల క్రితం ‘ఊపిరి’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు నాన్న సినిమా అంతా కూర్చొని ఉంటారని తెలియగానే ముందు వద్దనే చెప్పాం. కానీ ఈ ట్రైలర్ చూసి ఎమోషనల్ అయిపోయా. రెండేళ్ల కష్టం, శ్రమ ఈ ట్రైలర్లో కనిపించింది’’ అని హీరో అఖిల్ అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగ చైతన్య, అఖిల్ గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాక నాన్నే మా ఊపిరి అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ నాన్నతో చేసినందుకు పీవీపి, వంశీగార్లకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా జర్నీలో అందరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తెలుసు. ముఖ్యంగా నాన్నకు కార్తీ అంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. యూనిట్ సభ్యులందరి మధ్య అనుబంధాలు అల్లుకుం టేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి’’ అని అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ, ‘‘మామూలుగా మా సినిమాకు సంబంధించి ట్రైలర్స్ నాన్నతో రిలీజ్ చేయిస్తాం. అలాంటిది నాన్న సినిమా ప్రచార చిత్రాన్ని కొత్తగా మాతో విడుదల చేయించి పీవీపి గారు కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. నాకిలాంటప్పుడే ‘నాన్న ముందు మనం ఓల్డ్ అయిపోయి, ఆయన రోజురోజుకీ యంగ్ అయిపోతున్నారా?’ అన్న సందేహం కలుగుతోంది. ట్రైలర్ చూశాక మాటలు రాలేదు. చాలా బాగుంది. ఇంత మంచి సబ్జెక్ట్ ఎంచుకున్న వంశీ ఒకే జానర్‌కు ఫిక్స్ కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు’’ అని అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ‘‘నేను గతంలో చేసిన సినిమాల కన్నా ఇది విభిన్నంగా ఉంటుంది. నాగార్జున గారు, కార్తీగారు, పీవీపి గార్ల నమ్మకమే ఈ సినిమా. తన తమ్ముడు సినిమా తీస్తే ఎలా నిర్మిస్తారో అలా నన్ను ప్రోత్సహించారు. చాలా సినిమాలు చేస్తాం. కానీ ‘ఊపిరి’ జర్నీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాకు ఇది చాలా స్పెషల్. ముఖ్యంగా ప్యారిస్‌లో ఏ లొకేషన్‌నూ వదల్లేదు. 12 రోజుల పాటు అక్కడే చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘సరిగ్గా 2014 మార్చి 14న ఈ చిత్రం స్టార్ట్ అయింది. రెండేళ్లపాటు కష్టపడి తీశాం. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ చిత్రానికి 60 కోట్లు ఖర్చయింది’’ అని నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి (పి.వి.పి) తెలిపారు. ఈ వేడుకలో రచయితలు అబ్బూరి రవి, హరి పాల్గొన్నారు. -
అఖిల్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్..?
అక్కినేని మూడో తరం వారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అఖిల్. తొలి సినిమా అఖిల్‌తోనే సంచలనాలు నమోదు చేస్తాడని భావించిన ఆ సినిమా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అఖిల్ ఆకట్టుకున్నా.., సినిమా రిజల్ట్ మాత్రం బెడిసికొట్టడంతో అక్కినేని ఫ్యామిలీ ఆలోచనలో పడింది. దీంతో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించిన అక్కినేటి టీం, ఫైనల్‌గా వంశీ పైడిపల్లికే ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో ఊపిరి సినిమా తెరకెక్కుతోంది. దీంతో వంశీ పైడిపల్లి వర్కింగ్ స్టైల్ మీద నమ్మకంతో అఖిల్ రెండో సినిమా అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇప్పటికే రెండో సినిమాకు సంబంధించి అఖిల్ లుక్‌పై ఫోటో సెషన్ కూడా పూర్తి చేశారట. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
సూర్య చిత్రం వస్తుందంటే భయపడతారు
సూర్య చిత్రం వస్తుందంటే తెలుగు నిర్మాతలు భయపడతారని ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున వ్యాఖ్యానించారు.నాగార్జున చాలా కాలం తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం తోళా.తెలుగులో ఊపిరి పేరుతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా కార్తీ నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.పీవీపీ సినిమా సంస్థ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక శాంథోమ్ రోడ్డులోని శాంథోమ్ సెయింట్స్ పీట్స్ పాఠశాలో జరిగింది.కుట్టి హెలీకాప్టర్‌లో వేదిక పైగా వచ్చిన ఆడియో సీడీ పెట్టి నటుడు సూర్య అందుకుని ఆడియోను ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోల్లో ఒకరైన నాగార్జున మాట్లాడుతూ తానూ చెన్నై వాడినేనన్నారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు.ఇందులో నటించిన తరువాత తాను కార్తీ మంచి సన్నిహితులం అయ్యాం అన్నారు. సూర్యకు ఆంధ్రాలో అభిమానులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అభిమానులు తమిళనాడులోని ఆయన అభిమానులకు దీటుగా ఉంటారన్నారు.సూర్య నటించిన చిత్రాలు తెలుగులోకి అనువాదమై విడుదలవుతున్నాయంటే తెలుగు నిర్మాతలు భయపడి వారి చిత్రాల విడుదలను వాయిదా వేసుకుంటారని తెలిపారు.ఈ తోళా చిత్రంలో నాగార్జున,కార్తీలతో కలిసి నటించడం చాలా సంతోషకరమైన విషయం అని నటి తమన్నా పేర్కొన్నారు. దేవదాసు దుమ్మురేపింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీయర్ నటుడు శివకుమార్ మాట్లాడుతూ 1940లో విడుదలైన దేవదాసు చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించి వాడ వాడలా మారుమోగిందన్నారు.ఆ చిత్ర కథానాయకుడు నాగేశ్వరరావు అని ఆయన అభిమానిని తాననీ పేర్కొన్నారు.ఆ నాగేశ్వరరావు కొడుకే ఇక్కడ మన మధ్య ఉన్న నాగార్జున అని చెప్పారు.ఈ చిత్రం నాగార్జున అభిమానిగా కార్తీ నటించడం తనకు గర్వం అని శివకుమార్ పేర్కోన్నారు. -
'ఊపిరి' విడుదల ఎప్పుడు..?
కింగ్ నాగార్జున, కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ హీరోలుగా తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మల్టీ స్టారర్ మూవీ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలి.. అనే అంశంపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు నిర్మాతలు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే జనవరిలో నాగ్ హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా రిలీజ్ అవుతుండటంతో వెంటనే మరో సినిమాను రిలీజ్ చేయటం కరెక్ట్ కాదని ఆ సినిమాను వాయిదా వేయాలని కోరారట. దీంతో ఊపిరి సినిమాను వేసవి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అయితే అక్కడే మొదలైంది అసలు సమస్య బైలింగ్యువల్ సినిమా కావటంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే కోలీవుడ్‌లో సమ్మర్ బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతుండటంతో 'ఊపిరి' సినిమాను ఆ సమయంలో రిలీజ్ చేయోదంటూ కోరుతున్నాడు కార్తీ. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలీతో పాటు అజిత్ కొత్త సినిమాలు సమ్మర్లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అంత కాంపిటీషన్లో తన సినిమా రిలీజ్ అయితే కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుందని భయపడుతున్నాడు కార్తీ. మరి ఫైనల్‌గా చిత్రయూనిట్ ఏ డేట్‌కు ఫిక్స్ అవుతారో చూడాలి. -
నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్
మన్మథుడు నాగార్జున, తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో రూపొందించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫ్రెంచ్ మూవీ ఇన్టచబుల్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాలా భాగం నాగ్ వీల్ చైర్ లోనే కనిపించనున్నాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా అనుష్క గెస్ట్ రోల్ లో అలరించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అనుష్క ఓకే అంది !
హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున - కార్తీ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో టాలీవుడ్ జేజమ్మ, అందాల నటి అనుష్క అతిథి పాత్రలో నటించనుందని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు అతిథ పాత్రలో ఒదిగిపోయే నటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అందులోభాగంగా పలువురు హీరోయిన్లు ఆయన దృష్టికి వచ్చారు. ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేయాలంటే అనుష్క అయితేనే కరెక్ట్ అని ఆయన భావించారు. అనుకున్నదే తడువుగా వంశీ పైడిపల్లి ఇటీవల అనుష్కను కలిశారు. తన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ చిత్రంలో అతిథి పాత్ర ఉంది... అందులో మీరైతే ఒదిగిపోతారని భావిస్తున్నాను.. అంటూ అతిథి పాత్రకు సంబంధించిన విశేషాలు ఆమెను వివరించి...మీరు నటించేందుకు సిద్ధమేనా అని వంశీ అనడం... నాకు ఓకే అంటూ అనుష్క చెప్పడం చకచకా జరిగిపోయాయి. నాగార్జున, కార్తీ, తమన్నా, శ్రుతీ హసన్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో మెరిసిపోనుంది. 2011లో ఫ్రెంచ్ కామెడీ, డ్రామాల సమాహరం 'ద ఇన్టచబుల్' చిత్రానికి రీమేకే ఈ మల్టీస్టారర్ చిత్రం. అయితే ఈ చిత్రంలో నాగార్జున చక్రాల కుర్చీకే పరిమితమే పాత్రలో నటించనున్నారని సమాచారం. -
సుకుమార్ నిర్మాతగా 'కుమారి 21F' ప్రారంభం
-
ముచ్చటగా మూడో మల్టీస్టారర్
త్వరలో ఓ క్రేజీ మల్టీస్టారర్‌లో సమంత నటించబోతున్నారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్టిట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఒక గ్రేట్ మల్టీస్టారర్‌లో నటించే అవకాశం తలుపుతట్టింది. పైగా ఆ కథ నాకు విపరీతంగా నచ్చేసింది. అయితే.. ఆ సినిమాకు అధికారికంగా ‘ఓకే’ చెప్పలేదు. అన్నీ కుదిరితే... ఆ సినిమాకు పచ్చజెండా ఊపేస్తాను. ఆ తర్వాత మిగిలిన వివరాలు చెబుతా’’ అని సమంత ట్వీట్ చేశారు. ఇంతకీ సమంతకు అంతగా నచ్చిన ఆ మల్టీస్టారర్... తెలుగు చిత్రమా? లేక తమిళ చిత్రమా అనేది ఇటు తెలుగు చిత్రపరిశ్రమలో, అటు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా... సమంతకు మల్టీస్టారర్లు మాత్రం బాగా కలిసొచ్చాయి. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంత కథానాయిక. ఈ మధ్య... విడుదలైన అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’లో కూడా సమంతే కథానాయిక. అంటే త్వరలో ‘ఓకే’ చేయబోయే ఈ సినిమా ముచ్చటగా సమంత నటించబోయే మూడో మల్టీస్టారర్ అన్నమాట. ఇంతకీ ఆ మల్టీస్టారర్ ఏంటి? నాగార్జున, ఎన్టీఆర్‌లతో పైడిపల్లి వంశీ చేయబోయే సినిమానా? లేక... మీడియాలో హల్చల్ చేస్తున్న వెంకటేశ్, రవితేజాల సినిమానా? లేక తమిళంలో ఏదైనా సినిమానా? దానికి సమాధానం సమంతే చెప్పాలి. -
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం
‘ఎవడు’ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు రాజమండ్రి :‘ఎవడు’ సినిమా నిర్మాణ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజులు తెలిపారు. ఎవడు విజయవంతంతో రాజమండ్రి వచ్చిన ఆ చిత్ర యూనిట్, నటులు సాయికుమార్, ఎల్బీ శ్రీరాం స్థానిక ఆనంద్రీజె న్సీలో శనివారం విలేకరులతో మాట్లాడారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ తాము పడ్డ కష్టమంతా ఒక్క మార్నింగ్ షోతో మర్చిపోయామన్నారు. ఒకే తెరపై ఇద్దరు అగ్రహీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లను చూపడం సామాన్య విషయం కాదని, దానికి చాలా కష్టపడ్డామన్నారు. తెలంగాణపై ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ తెలుగు ప్రజలు ఉన్నంతవరకు తెలుగు సినిమా బతికే ఉంటుందన్నారు. దిల్‌రాజు.. రెండు సంవత్సరాల కష్టం ఈ సినిమా విజయంతో తెలియడం లేదు. సినిమా నిర్మాణం పూర్తయ్యాక విడుదల కోసం ఆరు నెలలు ఆగాల్సివచ్చింది. సినిమాలో విషయం ఉంటే ఎంత ఆలస్యమైనా ప్రేక్షకులు ఆదరిస్తాని ఎవడు సినిమా నిజం చేసింది. మా బ్యానర్లో మొత్తం 16 సినిమాలు తీస్తే వాటిలో 12 సినిమాలు మంచి విజయం సాధించాయి. సాయికుమార్ పోలీస్‌స్టోరీలో నేను ధరించిన అగ్ని పాత్ర ఇంకా జనం మర్చిపోలేదు. దానికి పోటీగా ఈ సినిమాలో నేను చేసిన ధర్మ పాత్ర నిలుస్తుంది. దీంతో నాకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 2014 శుభారంభంగా ఉంది. ప్రతీ పాత్రను నటీనటులు ఇందులో ఒక అద్భుతంగా చేశారు. ఎల్బీ శ్రీరాం.. మాది అమలాపురం సమీపంలోని నేదునూరు గ్రామం. పగలు ఉద్యోగం చేసుకుంటూ రాత్రుళ్లు కథలు రాసుకునే వాడిని. సుమారు 40 చిత్రాలకు పైగా కథలు రాశాను. ఈవీవీ తీసిన ‘చాలా బాగుంది’ సినిమాతో నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘అమ్మో ఒకటో తారీఖు’తో నటుడిగా స్థిరపడ్డాను. ఎవడు సినిమాలో నా పాత్ర చాలా కీలకం. థియేటర్లో సందడి... ‘ఎవడు’ చిత్ర యూనిట్ అప్సరా థియేటర్‌కు వెళ్లి సందడి చేసింది. యూనిట్ రాకతో కొంతసేపు చిత్ర ప్రదర్శన నిలిపివేశారు. నటుడు సాయికుమార్ ధర్మ పాత్ర డైలాగులను చెప్పేసరికి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేశారు. సహాయ నటులు శశాంక్, సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా, కెమెరామెన్ హరి, నృత్య దర్శకుడు జానీ మాట్లాడుతూ ఈ సినిమాకు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గీతా ఫిల్మ్డిస్ట్రిబ్యూటర్స మేనేజర్ సీవీ రామ శాస్త్రి యూనిట్కుఅభినందనలు తెలియజేశారు. -
'ఎవడు' సినిమా స్టిల్స్
-
ఎవడు రెడీ
ఇంతకూ ఇతను ‘ఎవడు’? కథ రీత్యా ఇందులో ప్రతినాయకునికి ఈ ప్రశ్నే అడుగడుగునా వెంటాడుతుందట. చూస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా ఈ ప్రశ్నే కలవరపెడతుందట. అంతటి పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. రామ్‌చరణ్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రంలో బన్నీ ఓ ప్రత్యేక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో బన్నీ, చరణ్‌ల పాత్రల మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. హాలీవుడ్ సినిమాను తలపించేలా దర్శకుడు పైడిపల్లి వంశీ ఈ చిత్రాన్ని మలిచారని తెలిసింది. డిసెంబర్ 19న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘దిల్’రాజు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ‘‘మెగా అభిమానులకు ఈ సినిమా విందుభోజనం లాంటిది. రామ్‌చరణ్ నటన, శ్రుతిహాసన్, అమీజాక్సన్ అందచందాలు, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. పైడిపల్లి వంశీ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచాడు. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. మరో ప్రత్యేక పాత్రలో కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ: పైడిపల్లి వంశీ, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్ : ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, సమర్పణ: శ్రీమతి అనిత.