నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్ | Nag, Karthi new movie Oopiri motion poster | Sakshi
Sakshi News home page

నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్

Published Fri, Sep 18 2015 1:39 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్ - Sakshi

నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్

మన్మథుడు నాగార్జున, తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో రూపొందించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఫ్రెంచ్ మూవీ ఇన్టచబుల్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాలా భాగం నాగ్ వీల్ చైర్ లోనే కనిపించనున్నాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా అనుష్క గెస్ట్ రోల్ లో అలరించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement