'ఊపిరి' విడుదల ఎప్పుడు..? | dilemma on nagarjuna, karthi oopiri release date | Sakshi
Sakshi News home page

'ఊపిరి' విడుదల ఎప్పుడు..?

Published Sun, Dec 20 2015 4:24 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

'ఊపిరి' విడుదల ఎప్పుడు..? - Sakshi

'ఊపిరి' విడుదల ఎప్పుడు..?

కింగ్ నాగార్జున, కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ హీరోలుగా తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మల్టీ స్టారర్ మూవీ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలి.. అనే అంశంపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు నిర్మాతలు.

ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే జనవరిలో నాగ్ హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా రిలీజ్ అవుతుండటంతో వెంటనే మరో సినిమాను రిలీజ్ చేయటం కరెక్ట్ కాదని ఆ సినిమాను వాయిదా వేయాలని కోరారట. దీంతో ఊపిరి సినిమాను వేసవి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అయితే అక్కడే మొదలైంది అసలు సమస్య బైలింగ్యువల్ సినిమా కావటంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

అయితే కోలీవుడ్లో సమ్మర్ బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతుండటంతో 'ఊపిరి' సినిమాను ఆ సమయంలో రిలీజ్ చేయోదంటూ కోరుతున్నాడు కార్తీ. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలీతో పాటు అజిత్ కొత్త సినిమాలు సమ్మర్లో రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అంత కాంపిటీషన్లో తన సినిమా రిలీజ్ అయితే కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుందని భయపడుతున్నాడు కార్తీ. మరి ఫైనల్గా చిత్రయూనిట్ ఏ డేట్కు ఫిక్స్ అవుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement