Oopiri
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
అలా ఆలోచించడం అమానుషం!
పదిహేనేళ్లు.... ఈ రోజుల్లో ఓ హీరోయిన్ ఇంత సుదీర్ఘంగా కెరీర్ కొనసాగించడం గొప్ప విషయమే. ‘ఇష్టం’తో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీయా శరణ్ ఇప్పటివరకూ హీరోయిన్‌గానే కొనసాగుతున్నారు. తాజాగా ‘ఊపిరి’లో నాగ్‌కు జోడీగా కనిపించారు. హీరోయిన్ కెరీర్ వయసు చాలా తక్కువని అనుకునే చాలా మంది నమ్మకాన్ని వమ్ము చేశారామె. ఈ లాంగ్ ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘హీరోయిన్ అంటే జస్ట్ ఐదేళ్లు సినిమాలు చేయాలి.. ఆ తర్వాత వెళ్లిపోవాలి అనే ఆలోచన సరి కాదు. అలా అనుకోవడం అమానుషం. కాలం మారుతోంది. ఒకప్పటిలా ఇప్పుడు కథానాయిక పాత్రలకూ ప్రాధాన్యం పెరుగుతోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ పెరిగాక ఆర్ట్ సినిమాకూ, కమర్షియల్ సినిమాకూ వ్యత్యాసం తగ్గిపోయింది. ‘లంచ్‌బాక్స్’, ‘కహానీ’ తరహా చిత్రాలు రావడానికి కారణం కూడా ఇదే. హీరోయిన్గా ఎక్కువ కాలం కొనసాగాలను కునేవాళ్లకిఇది కరెక్ట్ టైమ్’’ అని చెప్పారు. -
ఊపిరి రీమేక్‌లో మెగాస్టార్..?
సౌత్ ఇండస్ట్రీలో సంచలనాలు నమోదు చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ ఊపిరి. నాగార్జున, కార్తీ హీరోలుగా తెరకెక్కిన ఈ బైలింగ్యువల్ సినిమా, భారీ వసూళ్లను సాధించటంతో పాటు విశ్లేషకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ మొత్తానికి ఊపిరి రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ రీమేక్‌లో లీడ్ రోల్స్ నటించే నటీనటులపై చర్చ మొదలైంది. ముందుగా సల్మాన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్కనుందంటూ ప్రచారం జరిగినా చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో ఈ సినిమాను రీమేక్ చేయనున్నారన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో సందడి చేస్తోంది. నాగార్జున నటించిన పాత్రలో అమితాబ్ నటిస్తే సినిమా స్థాయి పెరుగుతుందని భావిస్తున్నారు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అమితాబ్, ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అయితే కార్తీ కనిపించిన పాత్రలో యంగ్ హీరో వరుణ్ ధావన్ అయితే పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారట. ఇప్పటి వరకు చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
నేనైతే నాగ్ కు అవార్డిస్తా! -దాసరి
‘‘ ‘సోగ్గాడే చిన్నినాయనా’లో గంతులేసి , ‘ఊపిరి’లో కుర్చీలో కూర్చొని నటించారు. నేనైతే జ్యూరీలో ఉంటే ఉత్తమ నటుడు అవార్డిచ్చేస్తా’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా థ్యాంక్స్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన దాసరి మాట్లాడుతూ-‘‘మన తెలుగు వాళ్లు హిందీ, తమిళ సినిమాలతో పోటీపడి కొత్తగా సినిమాలు తీయడం లేదని చాలా మంది అంటూంటే మా లాంటి వాళ్లకు బాధగా అనిపించేది. కానీ ‘ఊపిరి’ చూశాక ఆ బాధ పోయింది. ‘బొమ్మరిల్లు’ తర్వాత నేను చూసిన గొప్ప సినిమా ఇది’’ అన్నారు. గీత రచయిత సీతారామశాస్త్రి మాట్లాడుతూ-‘‘పాటలు కాని పాటలు రాసే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఎందుకంటే తెలుగు సినిమా పాటలంటే డ్యాన్స్, స్టెప్ట్స్ ఓ పద్ధతి ఉంది. వాటిని పక్కనబెట్టి ఈ సినిమా కొత్త సంవిధానాన్ని తెచ్చింది. కొత్తదనం, రసజ్ఞత, మనసుపెట్టి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరించే రసహృదయం ఉందనడానికి ఓ ఉదాహరణ.. ‘ఇన్టచ్బుల్స్’కి ఇది రీమేకైనా, మన భాషకి, మన ప్రాంతానికీ, మన మధ్య ఉన్న వైయక్తికమైన మానవీయ అనుబంధాలకు తగ్గట్టు మలచడంలో నిజమైన కథను ఆవిష్కరించారు’’ అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘‘ఊపిరి’ తర్వాత కుటుంబ సభ్యులు కొత్తగా కనిపిస్తున్నారు’’ అన్నారు. ఈ వేడుకలో తమన్నా, పి.వి.పి, కోన వెంకట్, నిర్మాతలు నాగసుశీల, ‘దిల్’ రాజు, భోగవల్లి ప్రసాద్ పాల్గొన్నారు. -
ఊపిరి థ్యాంక్స్ మీట్
-
వంద కోట్ల క్లబ్లో ఊపిరి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జోష్‌లో ఉన్న సీనియర్ హీరో నాగార్జున.. మరో అరుదైన రికార్డ్‌కు చేరువలో ఉన్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో సత్తా చాటిన నాగ్, ఇప్పుడు ఊపిరి సినిమాతో యంగ్ హీరోలకు కూడా షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమాగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన సినిమా ఊపిరి. భారీ బడ్జెట్‌తో పీవీపీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఓవర్ సీస్లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్న ఊపిరి, సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే 80 కోట్లకు చేరువలో ఉన్న ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఊపిరికి ఈ రికార్డ్ దక్కే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సర్థార్ గబ్బర్‌సింగ్ రిలీజ్ తరువాత కూడా ఊపిరి మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో పాటు, ఈ వారం వరుసగా నాలుగు రోజులు పాటు సెలవులు ఉండటం ఊపిరి యూనిట్‌కు కలిసొచ్చే అంశం. అయితే గురువారం రిలీజ్ అవుతున్న ఈడోరకం ఆడోరకం, శుక్రవారం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న పోలీసుడు సినిమాల ఎఫెక్ట్ పడకపోతే ఈ వారాంతానికి ఊపిరి వందకోట్ల మార్క్‌ను ఈజీగా రీచ్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి నాగార్జున ఈ హ్యాట్రిక్ సినిమాతో కుర్రహీరోలకు కూడా షాక్ ఇచ్చే కలెక్షన్ రికార్డ్ లు నమోదు చేస్తాడేమో చూడాలి. -
మరో మల్టీ స్టారర్లో కింగ్
యంగ్ హీరోలు కూడా సక్సెస్ కోసం కష్టాలు పడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన నాగ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా కొత్త దనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ తన మార్క్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మరోసారి భక్తిరస ఛారిత్రక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తిరుమల వెంకటేశ్వరుడి పరమ భక్తుడైన హాథీరాం బాబాగా మరోసారి భక్తుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమా తరువాత సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బంగార్రాజు టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా మల్టీ స్టారర్‌గా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా సినిమా చేస్తున్న కళ్యాణ్, ఆ సినిమా పూర్తవ్వగానే నాగార్జునతో తెరకెక్కించబోయే సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. -
యూఎస్‌లో ఊపిరికి భారీ కలెక్షన్లు
అక్కినేని నాగార్జున విభిన్న పాత్రలో నటించిన ఊపిరి చిత్రం అమెరికాలో భారీ కలెక్షన్లు సాధించింది. రెండు వారాల్లో 9.5 కోట్ల రూపాయల మార్క్‌ను దాటినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. గత నెల 25న విడుదలైన ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ కలెక్షన్లు వచ్చాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో నాగ్ మొత్తం వీల్ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో కనిపించాడు. Telugu film #Oopiri crosses ₹ 9.50 cr mark in USA... 2-week total [till 7 April]: $ 1,432,505 [₹ 9.53 cr]. SUPERB! @Rentrak — taran adarsh (@taran_adarsh) 8 April 2016 -
అఖిల్ ప్రకటన వచ్చేస్తోంది..?
భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన అక్కినేని నట వారసుడు అఖిల్, తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన 'అఖిల్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో రెండో సినిమా విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా, ఫైనల్‌గా నాగార్జున లీడ్ రోల్లో ఊపిరి సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ హీరోగా హిందీ సూపర్ హిట్ సినిమా 'ఏ జవానీ హై దివానీ'ని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం రీమేక్ కన్నా కొత్త కథతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే ఊపిరి సినిమాను రీమేక్‌గా తెరకెక్కించిన వంశీ, మరో సినిమా కూడా రీమేక్ చేస్తే తన మీద రీమేక్ డైరెక్టర్ అన్న ముద్ర పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడట. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న అఖిల్ సినిమా ప్రకటన వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా అఖిల్ ప్రకటిస్తాడో లేదో చూడాలి. -
గౌరవాన్ని పెంచే చిత్రాలు అరుదే
గౌరవాన్ని పెంచే చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున పేర్కొన్నారు. తోళా సినిమాకు మరోసారి ఊపిరి నిచ్చిన చిత్రం ఇది. దీనికి శ్వాసగా నిలిచింది నటుడు నాగార్జున, కార్తీ, దర్శకుడు వంశీ పైడిపల్లి. నటి తమన్నా అందం పక్కా బలంగా నిలిచింది పీవీపీ సినిమా.జయసుధ,ప్రకాశ్‌రాజ్‌ల అభినయం అదనపు మెరుగులు దిద్దింది. గోపీ సుందర్ సంగీతం ఆహ్లాదాన్ని పెంచింది. మైమరపించిన పీఎస్.వినోద్ చాయాగ్రహణం, వినోదంతో పాటు చక్కని సందేశంతో కూడిన కథ వెరసి చాలా కాలం తరువాత కుటుంబ సమేతంగా చూసి ఆనందించే ఒక మంచి చిత్రంగా తెరపై ఆవిషృతమైన చిత్రం తోళా. తెలుగులో ఊపిరిగా రూపొందిన ఈ ద్విభాషా చిత్రం సకల ప్రేక్షకాదరణతో విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం ఉదయం చెన్నైలో ధన్యవాద సమావేశాన్ని నిర్వహించింది. పునరుత్తేజాన్నిచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుల్లో ఒకరైన నాగార్జున మాట్లాడుతూ సూపర్‌హిట్, బ్లాక్‌బస్టర్ చిత్రాలు చాలా వస్తుంటాయి.అయితే బాక్సాఫీస్ వద్ద గౌరవాన్ని పెంచే చిత్రాలు మాత్రం అరుదుగానే ఉంటాయని అన్నారు.అలాంటి చిత్రాలను తనలాంటి యాక్టర్లు, ఫిలిం మేకర్లు కావాలని ఆశిస్తుంటారన్నారు. అలా తనలోని కాన్ఫిడెంట్‌ను మరింత పెంచిన చిత్రం తోళా అని పేర్కొన్నారు. ఇలాంటి మంచి చిత్రాలను మరిన్ని చేయాలనే ఆకాంక్షను పెంచిన చిత్రం ఇదని అన్నారు. గుడ్ చిత్రాలంటే ఆర్ట్ ఫిలింస్ అని భావించరాదన్నారు. 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నానని, కొన్నిసార్లు నిర్లిప్తతకు, నిరాసక్తికి కూడా గురైన సందర్భాలు ఉన్నాయన్నారు. తోళా చిత్రంలో నటిస్తున్నప్పుడు నటుడు కార్తీ సినీ ఫ్యాషన్ చూసిన తరువాత తనలోని ఎనర్జీ పెరిగిందన్నారు. తమిళంలో తన పాత్రకు తననే డబ్బింగ్ చెప్పమని కార్తీ కోరడంతో టెన్సన్ మొదలైందన్నారు.అలాంటిది తన డబ్బింగ్‌ను ఆదరించిన తమిళ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. తన తదుపరి చిత్రం చాలా మంచి చిత్రం అవుతుందని నాగార్జున పేర్కొన్నారు. అమ్మ ఆనందించారు తోళా చిత్రం చూసిన తరువాత మీడియా మిత్రులందరూ చాలా బాగుందని ఆప్యాయంగా కౌగిలించుకుని చెబుతుంటే తన తొలి చిత్రం పరుత్తివీరన్కు లభించిన ప్రశంసలు గుర్తుకొచ్చాయని నటుడు కార్తీ పేర్కొన్నారు.తోళా చిత్రం చూసి తన తల్లి చాలా సంతోషించారన్నారు. నాలుగేళ్లుగా తన కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రాలు చూసి ఎంతగానో బాధ పడ్డానని తోళా చిత్రంలో తన అభినయాన్ని చూసి చాలా సంతోషించానని తన తల్లి అన్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు,మిత్రులు చిత్రం చూసి అభినందించడం మరపురాని అనుభూతి అని అన్నారు.ఆర్థిక సమస్యలు,ఇతరత్రా వత్తిళ్లతో జీవితాన్ని చాలా కోల్పోయామని తోళా చిత్రం చూసి తెలుసుకున్నామని చాలా మంది ఫోన్ చేసి చెబుతున్నారని అన్నారు.జీవితపు విలువల్ని చెప్పిన చిత్రం తోళా అని ప్రశంసిస్తున్నారని అన్నారు.విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ తోళా చిత్ర రెండో భాగంలో నటించడానికి తాను రెడీ అనీ అన్నారు.చిన్న షరతుతో నాగ్ సార్ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని, అదేమిటంటే ఆయన్ని వీల్ చైర్‌కే పరిమితం చేయకుండా ఊటీ లాంటి ప్రాంతాల్లో డ్యూయెట్లు పాడేలా పాత్ర ఉండాలనీ కార్తీ సరదాగా అన్నారు. తోళా చిత్రాన్ని ఆదరిస్తున్న తమిళ ప్రేక్షకులకు దర్శకుడు వంశీ పైడిపల్లి థ్యాంక్స్ తెలిపారు. -
'ఊపిరి'కి ఫ్రెంచ్ నిర్మాతల ప్రశంసలు
నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఊపిరి. నాగ్ లాంటి స్టార్ హీరో వీల్ చైర్లోనే కనిపించే పాత్రలో నటించిన ఈ సినిమా, విడుదలైన దగ్గరనుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఊపిరి ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సినిమా సక్సెస్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెంచ్ మూవీ 'ద ఇంటచబుల్స్'కు రీమేక్‌గా రూపొందిన ఊపిరి సినిమాపై ఒరిజినల్ సినిమా నిర్మాతలు ప్రశంసల జల్లు కురిపించారు. ఒరిజినల్ వర్షన్‌ను మించే స్ధాయిలో ఊపిరి సినిమా తెరకెక్కిందంటూ ద ఇంటచబుల్స్ నిర్మాణ సంస్థ గౌమాంట్, ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్రెంచ్ సినీ చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసిన తమ సినిమా, భారత్‌లో కూడా సంచలనం సృష్టిస్తుండటం పై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఊపిరి టీంకు అభినందనలు తెలియజేశారు. -
నడుస్తోంది నడిపిస్తోంది
మొన్న ‘ఊపిరి’ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఆ పేరెందుకు పెట్టారు? ఎందుకంటే ఆ కథ మార్పుకు ఊపిరి. వికలాంగులను చూసే దృక్పథంలో... వారిని పునరావిష్కృతం చేసే మార్గంలో మార్పుకు సాయి పద్మ ఒక ఊపిరి. మార్పు చలనానికి సందేశం. చిన్నప్పట్నుంచీ ఆ చలనానికి నోచుకోకపోయినా మార్పుకి ప్రయత్నిస్తూనే ఉంది. ఇతరుల కోసం తన సంస్థ నడుస్తోంది. తను ఇతరులను నడిపిస్తోంది. కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి వైకల్యాన్నయినా జయించవచ్చని నిరూపించారు సాయిపద్మ. బాల్యం నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె ఎప్పుడూ ఓడిపోలేదు. నైరాశ్యం పొందలేదు. తను కదల్లేకపోయినా తన ఆశను, ఆకాంక్షను కదిలిస్తూనే ఉన్నారు. తన జీవితం గురించి ఆమె మాటల్లోనే.. ‘నాన్న బీఎస్ఆర్ మూర్తి, అమ్మ ఆదిశేషు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో డాక్టర్లు. నా తమ్ముడు, చెల్లెలు కూడా వైద్యులే. 1971లో మా స్వస్థలం విజయనగరం జిల్లా గజపతినగరంలో పుట్టాను. నాకు పోలియో రాకుండా ముందుజాగ్రత్తతో వ్యాక్సిన్ తెచ్చి ఉంచారు అమ్మానాన్న. కానీ నెలన్నరకే పోలియో సోకింది. అప్పటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన ప్రకారం 90 రోజులు నిండిన వారికే ఈ వ్యాక్సిన్ వేయాలి. అందువల్ల అందుబాటులో వ్యాక్సిన్ ఉన్నా నాకు వేయలేని పరిస్థితి. ఇలా విశాఖ కేజీహెచ్‌లో తొలి పోలియో కేసు నాదే. పోలియోతో నా కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గొంతు మూగబోయింది. 52 షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఎట్టకేలకు కాళ్లు తప్ప మిగిలిన అవయవాలు పనిచేయడం మొదలెట్టాయి. పన్నెండేళ్లు వచ్చేవరకు నన్ను ఎత్తుకునే వారు. అవయవాలు బలం పుంజుకోవడానికి ఒంటికి ‘పులి’కొవ్వు రాసేవారట. బీచ్‌లో ఇసుకలో మెడ వరకు పాతిపెట్టి ఉంచేవారట. నా వెన్నెముక ‘ఎస్’ ఆకారంలో వంగిపోతే పక్కటెముకలను కట్ చేసి సరిచేశారు. సెలవులకు పిల్లలందరూ అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు వెళ్తే నన్ను విశాఖలోని అమెరికన్ ఆస్పత్రికి తీసుకెళ్లేవారు శస్త్రచికిత్సల కోసం. అలా నా శరీరానికి 18 సర్జరీలు జరిగాయి. మెడిసిన్ చదవడానికి నా శరీరం సహకరించదని అసలు ఆ ఆలోచన చేయలేదు నేను. నేను నలుగురికి ఉపయోగపడాలి అన్నిరకాల ఆసరా ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి ఆసరా లేని వికలాంగుల పరిస్థితి ఏమిటన్నది నా ఆవేదన.. ఆలోచన. సీఏ చదివి, డబ్బు సంపాదించి నాలాంటి వారికి ఉపయోగపడేలా ఓ సంస్థను స్థాపించాలన్నది కోరిక. ఎంకాం పూర్తి చేసి మంచి కాలేజీలో ఎంబీఏ చేయాలని, ఉన్నత ఉద్యోగం చేయాలని అనుకునేదాన్ని. వెలుగు పథకంలో ప్రాజెక్టు డెరైక్టర్‌గా పోస్టు వచ్చినా చేరలేదు. బీఎల్ చేసి న్యాయవాదిగా పనిచేస్తూ జూనియర్ సివిల్ జడ్జి ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాను. రెండున్నర గంటల సమయం ఉండే ఫైనల్ ఎగ్జామ్‌ను రాయలేను. స్క్రైబ్‌ను అడిగితే టెన్త్, ఇంటర్ వారినే ఇస్తామన్నారు. అందువల్ల నాకు న్యాయం జరగదని దీనిపై కోర్టులో ఫైట్ చేస్తున్నా. కౌన్సెలింగ్.. ఉచిత న్యాయ సలహా మాలాంటి వారి హక్కుల గురించి ఎవరూ అడగరు. మామూలు వారికంటే మాకే ఎక్కువ అవసరాలుంటాయి. మాలాంటి వారి కోసం ఉచితంగా కోర్టులో కేసులు వాదిస్తున్నా. వికలాంగులకే కాదు.. ఇతరుల దాంపత్య జీవితాల్లో తలె త్తే వివాదాలపై కౌన్సెలింగ్ ఇస్తుంటాను. ఇప్పటిదాకా వంద డిజేబుల్డ్ ఫ్యామిలీలకు కౌన్సెలింగ్ ఇచ్చాను. వీటిలో 75 శాతం సక్సెస్ అయ్యాయంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. అనురాగ బంధం సాయి పద్మ జీవితంలోకి ఆనంద్ ప్రవేశం విచిత్రంగానే జరిగింది. 2005-06లో ప్రజ్ఞానంద్ ఓ స్వచ్ఛంద సంస్థకు కన్సల్టెంట్‌గా పనిచేసేవారు. వికలాంగులకు చేయూతనివ్వడంలో భాగంగా వివిధ సంస్థలతో సాయిపద్మ మెయిల్ ద్వారా సంప్రదింపులు చేసేవారు. అలాంటి ఒక సందర్భంలోనే ప్రజ్ఞానంద్‌తో ఆమెకు పరిచయమేర్పడింది. ఆయన 2006లో విజయనగరం వచ్చినప్పుడు తొలిసారిగా ఒకరికొకరు చూసుకున్నారు. ప్రజ్ఞానంద్ చిన్నాన్న, సాయిపద్మ తండ్రి ఆంధ్ర మెడికల్ కళాశాలలో సహచరులని పరిచయాల ద్వారా తెలిసింది. దీంతో పద్మ బంధువులు ప్రజ్ఞానంద్‌తో పెళ్లి ప్రతిపాదన చేశారు. సామాజిక సేవ కోసం తపిస్తున్న పద్మతో పరిణయానికి సుముఖత వ్యక్తం చేశారు ప్రజ్ఞానంద్. అలా 2008లో వాళ్ల పెళ్లి జరిగింది. ఇప్పుడామె కాళ్లకు చక్రాలు, కాలిపర్సులు ఆయనే. కాళ్లకు బ్రేసెస్ వేయించుకుని ఇప్పుడిప్పుడే నడ‘కల’ను నెరవేర్చుకుంటోంది పద్మ. మరణానంతరం తమ శరీరాలను దానమివ్వడానికి అంగీకారపత్రాన్ని రాసిచ్చి మరో ఆదర్శానికి అంకురార్పణ చేశారీ దంపతులు! మంచంపై ఉన్నప్పుడూ.. ఆపరేషన్లు జరిగినప్పుడు రెండేళ్ల పాటు మంచంపైనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లిష్‌లో ‘లైఫ్’ అనే కవితల పుస్తకాన్ని రాశాను. తెలుగులో 15 కథలు, ట్రావెలాగ్, తమ్మిమొగ్గలు (కలువ మొగ్గలు) వంటి పుస్తకాలు రాశాను. ఇలా నా బాధను కాస్త మరిచిపోయే మార్గం ఎంచుకున్నాను. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కథల పోటీల్లో నా కథకు ప్రథమ బహుమతి వచ్చింది. సంగీతంపై ఆసక్తితో ఏయూ నుంచి మ్యూజిక్‌లో డిప్లొమా చేశాను. 2007లో అమెరికాలో నేను పాడిన ‘వైష్ణవజనతో’ పాటకు ఏడు నిమిషాల్లో రూ.20 లక్షలు సమకూరింది. ఆ సొమ్ము వికలాంగుల సర్జరీల కోసం ఇచ్చేశాను. నాకన్నా ఆమె గొప్పది నాకన్నా ఆమే చాలా టాలెంటెడ్. కొన్ని నేను చేయలేను. ఆమె చేయలేనిది నేను చేస్తాను. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వల్ల హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మా ఇద్దరికీ సామాజిక సేవా ధృక్పథం ఉంది. దాంతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. -ప్రజ్ఞానంద్, సాయి పద్మ భర్త గ్లోబల్ ఎయిడ్ ద్వారా.. నాలాంటి వారికి ఏదైనా సాయం చేయడం కోసం అమెరికా వెళ్లి అధ్యయనం చేశాను. ఆ తర్వాత ఎనిమిదేళ్ల్ల కిందట గ్లోబల్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. దీని ద్వారా వికలాంగులకు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు విద్య, వైద్య సాయం, వీల్చైర్లు, కాలిపర్స్ల పంపిణీ వంటివి చేపడుతున్నాం. గజపతినగరంలో వికలాంగులు, పేదల కోసం హాస్టల్ నడుపుతున్నార.. నిరుద్యోగ వికలాంగులకు ఉద్యోగావకాశాలకు తోడ్పాటునందిస్తున్నాం. కార్లకు మోడిఫికేషన్ చేయించి వికలాంగులు స్వయంగా నడిపేలా ఒక నిపుణుడికి పూణేలో శిక్షణ ఇప్పించాం. ఇలా ఇప్పుడు నగరంలో సుమారు 80 మంది వికలాంగులు తమ కార్లను మోడిఫికేషన్ చేయించుకుని తిరుగుతున్నారు. స్పోర్ట్స్‌లోనూ వికలాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నా. నేనూ పారా షూటింగ్ నేర్చుకున్నాను. భవిష్యత్తులో.. వికలాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి స్పోర్ట్సుపై ఆసక్తి పెంచుతాం. మావద్దకు వచ్చే పేద, అనాథ పిల్లలను హీల్ ఇండియా నడుపుతున్న విద్యాలయానికి పంపుతాం. అక్కడ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతుంది. కాలిపర్స్‌ని ఇండియాలో అవసరమైన వారికి అందుబాటులోకి తేవాలన్నది నా ప్రయత్నం. దీనిపై అమెరికాలోని డైనమిక్ బ్రేసింగ్ సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదిరింది. వారే ఇక్కడకు వచ్చి తయారు చేసిస్తారు. దీంతో సగం ధరకే వాటిని పొందే వీలుంది. వీటితో చిన్నారుల్లో వైకల్య తీవ్రతను తగ్గించవచ్చు. వికలాంగుల కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. జీవితంలోకి ‘ఆనంద’ం నాకు లేని కాళ్లు నా భర్త ప్రజ్ఞానంద్. నేను ఆలోచించలేని పరిధి ఆయన. అన్నీ బాగున్నా ఆడపిల్ల పుట్టిందని పుట్టింటికి పంపేసే భర్తలున్న రోజులివి. అలాంటిది ఉన్నత విద్యావంతుడైన (నాలుగు ఎంఏలు, ఎంఫిల్) ఆయన వైకల్యం ఉన్న నన్ను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఓ యోగితో జీవితాన్ని పంచుకున్న అదృష్ట్టవంతురాలిని. ప్రేమకన్నా గొప్పది నమ్మకం. ఆ నమ్మకమే జీవితం. నాకది ఆనంద్ రూపంలో దొరికింది. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం, ఫొటోలు: ఎమ్.డి.నవాజ్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
తమన్నాకు తెలుగు నేర్పించింది మనోడే!
‘ఊపిరి’తో సొంత డబ్బింగ్‌కు శ్రీకారం మూలస్థానం కుర్రోడిదే కీలకపాత్ర ఆలమూరు : ముంబయికి చెందిన ప్రముఖ హీరోయిన్ తమన్నా ఇటీవల విడుదలైన ‘ఊపిరి’ చిత్రంలో సొంత గొంతుకతో తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదూ! అయితే ఆ మాటల వెనుక మన జిల్లాకు చెందిన కుర్రాడే ఉండటం విశేషం. ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారానికి చెందిన ఉప్పులూరి నాగ సుబ్రహ్మణ్యం (పండు) ఐదేళ్లుగా తమన్నా వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం షూటింగ్ సమయంలోను, బయట కూడా సహాయకుడిగా ఉంటున్నాడు. అయితే తమన్నా తెలుగు నేర్చుకోవాలనే తపనకు ఈపండు అంకితభావం ఎంతో దోహదపడింది. సినిమా రంగంపై ఉన్న మోజుతో.. సినిమా రంగంపై ఉన్న మోజుతో పండు సుమారు పదేళ్ల క్రితం ఇల్లు విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనేక కష్ట నష్టాలకోర్చి తొలుత హీరోయిన్ మమతా మోహన్‌దాసు వద్ద సహాయకుడిగా పనిచేసి రోజుకు రూ.రెండు వందలు జీతం తీసుకునేవాడు. అతని ప్రతిభను, వాక్చాతుర్యాన్ని గమనించిన హీరో రవితేజ తన సహాయకుడిగా నియమించకున్నాడు. నాలుగేళ్లు ఆయన వద్ద పనిచేసిన పండు ఆ తరువాత తమన్నా వద్ద సహాయకుడిగా చేరాడు. తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్‌లకు తమన్నా ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట పండు ఉంటాడు. విద్యాభ్యాసాన్ని ఏడవ తరగతిలోనే ముగించినప్పటికీ కార్యదీక్షతో ప్రముఖ సినీ హీరో, హీరోయిన్ల వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న సమయంలో వారితో పాటు చాలా దేశాలను తిరిగివచ్చాడు. అందం కాపాడటంలో.. సినిమాల్లోని నటీనటులు అందంగా ఉండటానికి మేకప్ మ్యాన్లు విశేషంగా కృషి చేస్తుంటారు. అయితే ఆ మేకప్ చెరిగిపోకుండా కాపాడేది ఈ సహాయకులే. షూటింగ్ సమయంలో క్లాప్ కొట్టే చివరి క్షణం వరకూ ఆ నటుల అందానికి భంగం కలుగకుండా వీరు గొడుగు పడుతూ ఉంటారు. తమన్నా, రవితేజతో పాటు అల్లు అర్జున్ తదితరులకు సహాయకుడిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకుని పండు అందరి మన్ననలను అందుకుంటున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం, ఇంగ్లిషు భాషల్లో పరిజ్ఞానం సాధించడంతో అతనికి అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తమన్నాకు షూటింగ్‌లు లేని సమయంలో ఇతర హీరో హీరోయిన్లు కూడా విదేశీ షూటింగ్‌లకు పండును తీసుకువెళ్లడం అతనిలో ఉన్న ప్రతిభను సూచిస్తుంది. ఎన్నడూ పనివాడుగా చూడలేదు హీరోయిన్ తమన్నా అనతి కాలంలోనే సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తనను ఎప్పుడు పనివాడుగా చూడలేదని పండు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. తనను ఇంట్లో వ్యక్తిగానే పరిగణిస్తూ క్రమం తప్పకుండా యోగక్షేమాలను చూసుకుంటారన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో ముఖ్యంగా మన జిల్లా యాసను నేర్చుకునేందుకు ఆమె ఎంతో శ్రమ పడ్డారన్నారు. తెలుగు పదాలు, అర్థాలు తన ద్వారానే నేర్చుకుని ప్రస్తుతం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం తనకు మరుపురాని అనుభూతిని మిగిల్చిందన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన జాతీయ ఉత్తమ చిత్రం బాహుబలి షూటింగ్ సమయంలో తాను తమన్నాకు సహాయకుడిగా పనిచేశానని, ఆ చిత్ర నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉండటం ఎన్నటికీ మరువలేనని చెప్పారు. -
బాలీవుడ్లో ఊపిరి
కింగ్ నాగార్జున, తమిళ యంగ్ హీరో కార్తీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా ఊపిరి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఫిలిం 'ద ఇంటచబుల్స్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవటంతో ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా రీమేక్ మీద దృష్టిపెట్టారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఊపిరి రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఊపిరి సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతుండటంపై హీరో నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. ఊపిరి బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తారా అన్న ప్రశ్నకు.., అది కరణ్ ఇష్టం, ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో నటించానని, ఈ పాత్ర తనకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు నాగ్. మరి కరణ్ జోహర్ ఈ సినిమాలో నాగ్ చేసిన పాత్రకు ఏ స్టార్ హీరోను ఒప్పిస్తాడో చూడాలి. -
సెలబ్రేషన్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘ఊపిరి’, తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాశ్‌రాజ్, జయసుధ, గ్యాబ్రియెల్లా డెమెట్రియాడిస్, స్వర్గీయ కల్పన, అతిథి పాత్రల్లో అనూష్క, శ్రీయ, అడివి శేష్, మాటలు: అబ్బూరి రవి, పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, కెమేరా: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: మధు, సంగీతం: గోపీ సుందర్, నిర్మాతలు: పరవ్ు వి.పొట్లూరి, కెవిన్ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి ఏ కళారూపమైనా మారాలంటే కళాభిమానుల ఆలోచన, అభిరుచి మారాలి. కానీ అభిరుచిని మార్చాలంటే, మళ్ళీ కొత్త అభిరుచిని కల్పించేం దుకు తగ్గ కళారూపమే రావాలి. ఉపరితలంలో స్వతంత్రంగా అనిపించినా, పరస్పర ఆధారిత మైన రెండు అభిన్నమైన విషయాలివి. దర్శక, నిర్మాతలు తీసేవే చూడాలా? జనానికి చూపించా ల్సినవి వాళ్ళు తీయాలా? అనే కోణంలో ఈ చర్చ మన తెలుగు సినిమాకూ వర్తిస్తుంది. మరి, ఇవాళ తెలుగు సినిమాలో ఎలాంటి కథలు కావాలి? ఎలాంటి సినిమాలు రావాలి? రొడ్డకొట్టుడు రొటీన్ సినిమాల నుంచి బయటపడాలంటే దర్శక - నిర్మాతలైనా, ప్రేక్షకులైనా ఎవరేం చేయాలి? ఆలోచించాల్సిన ఈ అర్థవంతమైన చర్చకు దోహదంగా ఇటీవల కొన్ని కొత్త పంథా చిత్రాలు వస్తున్నాయి. వాటికి తాజా చేర్పు - ‘ఊపిరి’. విక్రమ్ ఆదిత్య (నాగార్జున) పెద్ద కోటీశ్వ రుడు. కార్ల రేసింగ్, పారా గ్లైడింగ్ లాంటి ఎడ్వెం చర్లతో జీవితంలో వేగాన్ని ఇష్టపడే సాహసికుడు. అలాంటివాడు అయిదేళ్ళ క్రితం ఓ అనూహ్య ప్రమాదంతో వెన్నెముక దెబ్బతిని, పేరాప్లెజిక్గా మారిపోతాడు. మెడ కింద నుంచి ఏ భాగమూ పనిచేయని పరిస్థితుల్లో మిగిలిపోతాడు. అతని బాగోగులు చూసుకొనేందుకు తాజాగా ఒక కేర్ టేకర్ కోసం చూస్తుంటారు. సరిగ్గా అదే టైవ్‌ులో జైలులో నుంచి పెరోల్ మీద విడుదలవుతాడు చిల్లర దొంగతనాలు చేసే శీను (కార్తీ). చిరుద్యోగి అయిన అమ్మ (జయసుధ), ప్రేమలో పడ్డ చెల్లెలు, పనికిమాలిన రౌడీలతో తిరిగే తమ్ముడు - అతని మధ్యతరగతి కుటుంబసభ్యులు. జైలు నుంచి వచ్చిన అతణ్ణి, అమ్మ ఛీపొమ్మంటుంది. సత్ప్రవర్తనతో ఉంటే నాలుగునెలల్లో శిక్ష రద్దు చేయించుకోవచ్చని ఈ కోటీశ్వరుడి దగ్గర ఉద్యోగానికొస్తాడు. కదలలేని కోటీశ్వ రుడికి పి.ఎ. అయిన కీర్తి (తమన్నా)ను తొలిచూపులోనే ఇష్టపడతాడు. డబ్బు అన్ని సమస్యలకూ పరిష్కారమను కున్న శీనుకు క్రమంగా మానవ బంధాల రుచి తెలుస్తుంది. శీను ఉత్సాహంతో కోటీశ్వరుడిలో కొత్త దశ మొదలవు తుంది. కానీ, కుర్చీకే పరిమితమైన ఆ కోటీశ్వరుడి జీవితంలోనూ ప్యారిస్‌కు ముడిపడి ఒక రహస్యం ఉంటుంది. అలాగే, తరచూ వచ్చే పర్సనల్ లెట ర్సతో మరో అనుబంధం ఉంటుంది. ఆ రహస్యా లేమిటి?జీవితం పట్ల నిరుత్సాహం పేరుకున్న ఆ కోటీశ్వరుడిలో మార్పు వచ్చిందా? మరి, ఇంటికి దూరమైన హీరో చివరకు అమ్మతో అనుబంధం పంచుకున్నాడా? లాంటివన్నీ మిగతా సినిమా. ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’గా దర్శక, నిర్మాతలు పేర్కొన్న ఈ చిత్రం ‘బతకడానికి డబ్బక్కర్లేదు... ఒక తోడుంటే చాలు’ అని చెబుతుంది. ‘మున్నా’, ‘బృందావనం’, ‘ఎవడు’తో పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లికి ఇది కొత్త అనుభవం. ఫ్రెంచ్ సినిమా ‘ఇన్‌టచబుల్స్’ను అధికారికంగా రైట్స్ కొని మరీ చేసిన ఈ రీమేక్‌లో టైటిల్స్ దగ్గర నుంచి చాలావరకు అనుకరించారు. నేటివిటికి తగ్గట్లు మార్పుచేర్పులూ చేశారు. ఇప్పటి దాకా హీరో పాత్రలకే పరిమితమైన నాగ్ వయసుకీ, కాలానికీ తగ్గట్లు విలక్షణ క్యారె క్టర్ల వైపు మొగ్గుతున్నారనడానికి మరో ఉదాహ రణ కోటీశ్వరుడి పాత్ర. ఆయనది సరైన నిర్ణయ మని సిన్మా చూశాక ఒప్పుకుంటారు. అయితే, ఇదీ ఒక రకంగా నాగార్జున నవ మన్మథుడి ఇమేజ్‌కు తగ్గట్లుగానే ఉంది. ఆయన పాత్రకు సినిమాలో ఒకటికి మూడు ప్రేమలుంటాయి. ఒకటి - క్లైమాక్స్‌లో శుభం కార్డుకు ఉపయోగపడే లెటర్స్ ప్రేమ. మరొకటి - అతని జీవితంలో ఎదురైన విషాదభరిత ప్రమాదానికి ముందు నడిచిన జీవితప్రేమ. వేరొకటి - మధ్యలో కార్తీతో పందెం వేసి, నడిపిన డేటింగ్ ప్రేమ. మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో సహాయ కుడిగా మొదలై, తమిళంలో హీరోగా పేరు తెచ్చు కున్న కార్తీ తన తొలి నేరు తెలుగు సినిమాలోనే ఫుల్ మార్కులు కొట్టేశారు. శీను పాత్రలో ఆయన నటించకుండా, సహజంగా ప్రవర్తించారు. నాగ్‌కు సెక్రటరీగా తమన్నా చేసిన పాత్రలో అభినయం కన్నా అందం ఉంది. కథలో సెంటిమెంట్ టచ్ - కార్తీ కుటుంబ కథ. తల్లి పాత్రధారిణి జయ సుధల చుట్టూ నడుస్తుంది. కార్తీ ఫోన్ సీన్, అలాగే బైక్ మీద కార్తీ తనను కూర్చోబెట్టుకొని తీసుకువెళుతున్న ప్పుడు తలపెకైత్తి నాగ్ ఆకాశం వైపు చూసే ఘట్టం లాంటివి గుండెను తడి చేస్తాయి. నాగ్ భావప్రకటన బాగుంది. అయితే, ఒక ఆవారాను తన కేర్‌టేకర్‌గా కోటీశ్వరుడు పెట్టుకోవడం, అంత కోటీశ్వరుడి పక్కన నర్సయినా లేకపోవడం లాంటివి ఇలాంటి కథల్లోనే చూస్తాం. వాటికి కన్విన్స్ అవడమా, కాక పోవడమా అన్నది ప్రేక్షకుల ఇష్టం. కానీ, ‘ఈ రోజుకి, ఈ నిమిషానికి ఇలాంటివాడే నాకు కరెక్ట్’ అనే డైలాగ్‌తో ఆ పాయింట్‌ను ఒప్పిస్తారు. ఇక, సెకండాఫ్‌తో పోలిస్తే, ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్ మెంట్ పాలెక్కువ. కథను ముగించాల్సిన సెకం డాఫ్‌లో అది ఆశించడం అత్యాశే. ద్వితీయార్ధంలో ప్యారిస్‌లోని అందమైన ప్రదేశాల్ని చూపెట్టే ఎపి సోడ్ ఫీలింగ్‌తో పాటు నిడివిపరంగానూ అంత దూరం ప్రయాణించినట్లనిపిస్తుంది. అదీ మంద గమనంతో! పెయింటింగ్, సితార్ వాదన లాంటి కళలపై జోక్‌లు నవ్వు తెప్పిస్తాయి. కానీ, అవి సబ్‌కాన్షస్‌గా మన కళల గురించి మన ఆలోచనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అలాగే, ఒవర్ స్పీడింగ్ను ఫ్యాంటసైజ్ చేసి చూపడం కూడా! థీవ్‌ు మ్యూజిక్, రీరికార్డింగ్ బాగున్న ఈ చిత్రంలో గోపీ సుందర్ సంగీతంలో ‘ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్’, ‘నువ్వేమిచ్చావో నీకైనా తెలుసునా’, ‘పోదాం ఎగిరెగిరి పోదాం’ లాంటి పాటలు, సీతారామశాస్త్రి చొప్పించిన జీవనసారం భేష్. కొండంత భావాన్ని కొద్ది మాటల్లో చెప్పడా నికి అబ్బూరి రవి ప్రయత్నం అక్కడక్కడ మెరు స్తుంది. ‘దేవుడు ఎవరినీ సంతోషంగా ఉండని వ్వడు... బ్యాడ్‌బాయ్’ (నాగ్‌తో కార్తీ) లాంటివి ఉదాహరణ. కెమేరావర్క్, పుష్కల నిర్మాణ విలువలతో ఈ సిన్మా కాస్ట్లీలుక్ కనువిందే. సెకం డాఫ్ పట్టుగా అల్లుకొంటే, చర్విత చర్వణాలు తగ్గితే ఇంకా బాగుండేది. ఏమైనా, ఊపిరి అంటే ప్రాణంతో ఉండడం కాదు. జీవితాన్ని ఆనం దంగా గడపడమని ఈ సిన్మా చెబుతుంది. తర్వాతేం జరుగుతుందో ఊహించగలిగినా, కొన్నిచోట్ల అసహజమనిపించినా, ఆద్యంతం ఫీల్‌గుడ్ అవుతుంది. అందుకే, ఊపిరి సలపని మసాలా సిన్మాల మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ, కాస్తంత గాలి కోరుకుంటున్న వారికి ఈ సిన్మా రిలీఫ్! కొత్త తరహా చిత్రాలకు మళ్ళీ ఊపిరి!! కాళ్ళూ చేతులూ చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైన పాత్రను ఇమేజ్ ఉన్న ఒక పెద్ద హీరో పోషించడం తెలుగు సినిమాలో ఊహించగలమా? పక్కా తమిళ నటుడు తెలు గులో పూర్తిస్థాయి హీరో పాత్రతో తెరంగేట్రం చేసి, తన గొంతుతోనే తెలుగు డైలాగులు చెప్పు కోవడం విని, చూసి ఎన్నాళ్ళయింది? తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్న ఉత్తరాది అమ్మాయి కథానాయిక పాత్రధారణతో పాటు కష్టపడి గాత్రధారణ కూడా చేసి ఇంకెన్ని రోజులైంది? ఇటీవల ఎన్నడూ చూడని ఇలాంటి విచిత్రాలు అన్నీ జరిగిన సినిమా - ‘ఊపిరి’. - రెంటాల జయదేవ -
'ఊపిరి' మూవీ రివ్యూ
టైటిల్ : ఊపిరి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్ సంగీతం : గోపీ సుందర్ మాటలు : అబ్బూరి రవి దర్శకత్వం : వంశీ పైడిపల్లి నిర్మాత : ప్రసాద్ వి పొట్లూరి మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత కింగ్ నాగార్జున నటించిన సినిమా ఊపిరి. ఫ్రెంచ్ మూవీ 'ద ఇంటచబుల్స్' సినిమాకు అధికారిక రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో నాగ్ సినిమా మొత్తం వీల్ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో కనిపించాడు. మన్మథుడి ఇమేజ్ ఉన్న నాగ్ వీల్ చైర్లోనే ఉండే పాత్రలో కనిపిస్తుండటం, తొలిసారిగా తమిళ హీరో కార్తీ స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తుండటంతో ఊపిరి సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి సోగ్గాడిగా మాస్ ఆడియన్స్‌ను ఊర్రుతలూగించిన నాగ్, వీల్ చైర్లో కూర్చొని ఎంత వరకు ఎంటర్టైన్ చేశాడు..? తొలిసారిగా తెలుగు సినిమా చేసిన కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించాడు..? దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్రెంచ్ కథతో తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించాడు..? కథ : శీను (కార్తీ) అల్లరి చిల్లరగా తిరుగుతూ డబ్బు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అలా దొంగతనం చేస్తున్న సమయంలో పోలీసులకు పట్టుపడి జైలుకెళ్తాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన శీనుని తల్లి (జయసుథ) ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వాడిగా చూపించుకొని కేసునుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తాడు శీను. అందుకోసం అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పని చేయడానికి ప్రయత్నించినా అది కుదరదు. దీంతో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య (నాగార్జున)కు కేర్ టేకర్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూకు వెళతాడు. అక్కడ విక్రమాదిత్య.. సెక్రటరీ కీర్తి(తమన్నా)ని చూసి ఎలాగైనా అక్కడే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. విక్రమాదిత్య.., ఎన్నో బిజినెస్‌లు ఉన్న ఓ భారీ వ్యాపారవేత్త. పారిస్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ యాక్సిడెంట్లో మెడ కింద నుంచి శరీరమంతా పనిచేయకుండా పోతుంది. దీంతో ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. తనకు తోడుగా ఫ్రెండ్ ప్రసాద్ (ప్రకాష్ రాజ్), సెక్రటరీ కీర్తి ఉన్నా ఇంకా ఏదో మిస్ అవుతుంటాడు విక్రమాదిత్య. అలాంటి సమయంలో తనను ప్రేమగా చూసుకునే వ్యక్తి కోసం ఇంటర్వ్యూ ఏర్పాటుచేస్తాడు. అనుకోకుండా అక్కడకు వచ్చిన శీను మాట తీరు నచ్చి అతన్నే తన కేర్ టేకర్‌గా తీసుకుంటాడు. ఎలాంటి బాధ్యత తెలియని శీను, విక్రమాదిత్య మనోవేదనను ఎలా పోగొట్టాడు? అదే సమయంలో కీర్తి ప్రేమను గెలుచుకోవడానికి శీను ఎలాంటి ప్రయాత్నాలు చేశాడు..? శీను జీవితంలోని సమస్యలను విక్రమాదిత్య ఎలా పరిష్కరించాడు అన్నదే మిగతా కథ..? నటీనటులు : తెలుగు సినీ రంగంలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని సాహసం చేసిన నాగ్ మరోసారి బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి మాస్ ఎంటర్టైనర్ తరువాత ఊపిరి సినిమా చేసిన నాగ్, తన నమ్మకం వమ్ముకాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాంటి బాడీలాంగ్వేజ్ లేకపోయినా కేవలం హావాభావాలతోనే అద్భుతమైన ఎమోషన్స్ పండిచాడు. ఇక తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కార్తీ తెలుగబ్బాయే అనేంతగా ఆకట్టుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్ రెండు వేరియషన్స్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్, స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది తమన్నా. నాగార్జున ఫ్రెండ్‌గా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో మెప్పించాడు. అలీ, జయసుథ, గ్యాబ్రియల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక అతిథి పాత్రల్లో అలరించిన అనుష్క, శ్రియ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేశారు. సాంకేతిక నిపుణులు: ఫ్రెంచ్ సినిమా మన సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా దాన్ని మలచటంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా నాగార్జునను విక్రమాదిత్య పాత్రకు ఒప్పించటమే వంశీ సాధించిన విజయం. ఎక్కడా ఓ రీమేక్ సినిమా చూస్తున్న భావన కలగకుండా అద్భుతమైన ఎమోషన్స్‌తో సినిమాను నడిపించాడు. కంటతడి పెట్టించే సెంటిమెంట్ సీన్స్ ఉన్నా.. ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఓ కామెడీ డైలాగ్‌తో అలరించాడు. అబ్బూరి రవి అందించిన సంభాషణలు బాగున్నాయి. కామెడీ టైమింగ్‌తో పాటు, సెంటిమెంట్ సీన్స్‌లో కూడా డైలాగ్ ఆకట్టుకున్నాయి. గోపీసుందర్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా.., నేపథ్య సంగీతం బాగుంది. పివిపి సంస్థ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. ప్లస్ పాయింట్స్ : కథ నాగర్జున, కార్తీ డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : పాటలు సెకండ్ హాఫ్ లెంగ్త్ ఓవరాల్‌గా ఊపిరి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే మంచి సినిమా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నా ఊపిరి వాళ్లే!
‘‘నేను చేసే ప్రతి సినిమా నాకు ప్రత్యేకమే. ఈ ‘ఊపిరి’ ఇంకా ప్రత్యేకం. ఒక వ్యక్తిగా నాలో చాలా మార్పులు తెచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రం నాకో వరం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా వంశీ పైడిపల్లి చెప్పిన విశేషాలు... హాలీవుడ్ చిత్రం ‘ఇన్‌టచబుల్స్’ చూసి, కదిలిపోయాను. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనిపించింది. పీవీపీగారిని కలిస్తే, చేద్దామన్నారు. వీల్ ఛైర్‌కి పరిమితమయ్యే పాత్రను నాగార్జునగారు చేస్తేనే, ఈ సినిమా చేయాలనుకున్నాను. లేకపోతే మానేయాలనుకున్నాను. అలాగే, కార్తీ పాత్రకు చిన్న ఎన్టీఆర్‌ను అనుకున్నాను. కానీ, ఇప్పట్లో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని ఎన్టీఆర్ అనడంతో కార్తీని తీసుకున్నాను. అయితే ఎన్టీఆరే స్వయంగా నాగార్జునగారికి ఫోన్ చేసి, ‘వంశీ ఒక కథ చెబుతాడు. తిట్టొద్దు’ అన్నాడు. నేనెళ్లి కథ చెప్పగానే, ఆయన ఒప్పేసుకున్నారు. వాస్తవానికి సెకండాఫ్‌లో నాగార్జున గారికి తగ్గట్టు కొంత మార్చాను. కానీ, అలాంటిదేమీ వద్దని ఆయన అన్నారు. ఇప్పటివరకూ వచ్చిన హాలీవుడ్ చిత్రాల్లో ‘టాప్ 25’లో ‘ఇన్‌టచబుల్స్’ ఒకటి. ఆ సినిమాకి రీమేకే ‘ఊపిరి’ అని తెలిసి, ప్యారిస్‌లో లొకేషన్స్ చాలా ఈజీగా ఇచ్చేశారు. ఆ చిత్రానికి ఉన్న గౌరవం అలాంటిది. మంచి ఎమోషనల్ మూవీ. తెలుగుకు అనుగుణంగా కొన్ని మార్పులు, తమిళ వెర్షన్‌కు కొన్ని మార్పులు చేసి ఈ సినిమా తీశాం. మాతృక కన్నా తెలుగు, తమిళ చిత్రాలు బాగుంటాయి. నా ఊపిరి ఎవరు? అంటే.. నా కూతురు, భార్య, మా అమ్మ... ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. వ్యక్తి గతంగా నన్ను టచ్ చేసిన చిత్రం ఇది. థియేటర్ నుంచి బయటి కొచ్చేటప్పుడు ప్రేక్షకులు ఒకింత భావోద్వేగంతో వస్తారు. అఖిల్ హీరోగా ఓ చిత్రం చేయడానికి చర్చ జరుగుతోంది. అంతా ఫైనలైజ్ అయిన తర్వాత నా తదుపరి చిత్రం గురించి చెబుతా. -
ఆ కుర్చీ ఖరీదు 25 లక్షలు
ప్రయోగాలకు పట్టం కడుతూ వరుస విజయాలు సాధిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున, ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరో ఎక్స్పరిమెంటల్ మూవీ ఊపిరి. ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కేవలం వీల్ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు నాగ్. దీంతో ఈ సినిమాలో నాగ్ కూర్చునే వీల్ చైర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చిత్రయూనిట్. దాదాపు 25 లక్షల రూపాయల ఖర్చుతో ఈ చైర్‌ను ప్రత్యేకంగా తయారు చేయించారు. ద ఇంటచబుల్స్ సినిమాకు చైర్ తయారు చేసిన స్వీడన్ కంపెనీనే ఈ సినిమా కోసం కూడా, నాగ్ కొలతలను తీసుకొని చైర్ రూపొందించారు. సినిమా అంతా నాగ్ చైర్ లోనే ఉండాల్సి ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని తయారుచేశారు. నాగ్ ఈ తరహా పాత్ర చేస్తుండటంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఆసక్తి నెలకొంది. నాగ్‌తో పాటు కార్తీ మరో హీరోగా నటిస్తుండగా తమన్నా కార్తీకి జోడీగా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా 60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. ప్రకాష్ రాజ్, జయసుథ, అలీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి మార్చి 25న రిలీజ్ అవుతోంది. -
ఇకపై... నా ప్రతి సినిమా సిక్సరే!
‘‘రానున్న ‘ఊపిరి’ సినిమా నా కెరీర్లో కొత్త అధ్యాయం. మొన్న సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నాకు కిరీటం పెడితే, ఈ సినిమా ఆ కిరీటానికి అందం పెంచే నెమలి పింఛం లాంటిది. ఒక్క మాటలో ఇది నా కెరీర్లో మైలురాయి కాదు... ఏకంగా జీవితాన్నే మార్చే సినిమా. ఇక నుంచి యువరాజ్ సింగ్లా చేసే ప్రతి సినిమాతో సిక్సర్ కొడతా’’ అన్నారు హీరో నాగార్జున. ఆయనతో పాటు కార్తీ, తమన్నాలతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘ఊపిరి’(తమిళంలో ‘తోళా’) ఈ 25న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముచ్చటించింది. నాగ్ మాట్లాడుతూ, ‘‘ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచబుల్స్’కి ఇది అధి కారిక రీమేక్. హక్కులు కొని మరీ నిర్మాత పి.వి.పి. ఈ సినిమా తీశారు. ఇది ఇద్దరు మనుషుల యథార్థ కథ. ఇప్పటికీ వారు బతికే ఉన్నారు’’ అని చెప్పారు. ‘‘మారుతున్న పరిస్థితుల్లో రొటీన్‌కు భిన్నంగా తెలుగు ప్రేక్షకులు ఎలాంటి చిత్రం కోరుకుంటారో వంశీ అదే విధంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. నేను తమిళ డైలాగులు సరిగ్గా చెప్పలేకపోయేవాడిని. కార్తీకి తెలుగు రాకపోయినా, నేర్చుకుని మరీ పేజీన్నర డైలాగులు చెప్పేవాడు. ఆ విషయంలో కార్తీని చూస్తే నాకు సిగ్గుగా అనిపించేది’’ అని అన్నారు. మరో హీరో కార్తి మాట్లాడుతూ, ‘‘ఫస్ట్టైవ్ు తెలుగులో స్ట్రెయిట్ చిత్రంలో నటించా. ఇది ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. నాగార్జునగారు మెచ్యూర్డ్ క్యారెక్టర్లో నటించారు. ఈ చిత్రం జర్నీలో ఆయనతో మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. చెన్నైలో మా ఇంటి పక్కనే నటుడు నూతన్‌ప్రసాద్ గారిల్లు. అందుకని ఆ మాటలు, పాటలు విని తెలుగు బాగానే ఒంటబట్టింది’’ అని అన్నారు. ‘‘ఆదివారం నాడు ఈ సినిమా ఫస్ట్‌కాపీని చూసిన వెంటనే నాగార్జునగారు, పీవీపీ గారు నన్ను హగ్ చేసుకున్నారు. ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ ఊపిరి ఈ చిత్రం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. నిర్మాత పొట్లూరి వి. ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘రెండేళ్లుగా అందరం కలిసి, ఇష్టపడి చేసిన చిత్రమిది. క్వాలిటీ సినిమాలు తెలుగులోనూ వస్తాయని దీంతో మరోసారి నిరూపిస్తున్నాం. అమెరికాలో 90 హాళ్లలో రిలీజవుతోంది. తమన్నా తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పారు’’ అని తెలిపారు. ‘‘నాగార్జున సార్, కార్తీ తమ పాత్రల్లో నటించలేదు, జీవించారు. వారిద్దరూ లేని ‘ఊపిరి’ అస్సలు ఊహించలేం. ‘హ్యాపీడేస్’, ‘బాహుబలి’, ఇప్పుడీ ‘ఊపిరి’- ఇలా నేను గర్వించేవన్నీ తెలుగు ఫిల్మ్సే. ‘ఊపిరి’ చూసి అంతా గర్విస్తారు’’ అని తమన్నా అన్నారు. -
ఆ రెండు విషయాలతో ఎవరూ పోరాడలేరు!
‘‘నంబర్ గేమ్స్‌ను నమ్మను. మనసుకి నచ్చిన సినిమాలు చేస్తూ వెళ్లిపోతా. పరిస్థితులు ఏవైనా తలకిందులు అయితే తప్ప నాకు జీవితాంతం నటించాలనే ఉంది’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ‘ఊపిరి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో పంచుకున్న విశేషాలు... ♦ ఫ్రెంచ్ మూవీ ‘ఇన్టచ్బుల్స్’ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి ‘ఊపిరి’ చేశాం. ఇందులో నేను క్వాడ్రాప్లీజిక్ పేషంట్‌గా వీల్‌చైర్‌కు పరిమితమయ్యే పాత్రలో కనిపిస్తాను. అఖిల్, నాగచైతన్య ఈ కథ విని, చేయొద్దన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అమల కేన్సర్ పేషంట్ అంటే నేనూ మొదట ఒప్పుకోలేదు. కానీ ‘ఊపిరి’ మనసుకి నచ్చి చేశాను. ♦ వాస్తవానికి నా అభిమానులు నేను చేసే వెరైటీస్కి అలవాటు పడిపోయారు. మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో నేను చేసిన ప్యూర్ లవ్‌స్టోరి ‘గీతాంజలి’ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘అన్నమయ్య’ చేస్తానంటే ‘కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంటే ఇలాంటి సినిమా చేయడం ఏంటి?’’ అన్నవాళ్లూ ఉన్నారు. కానీ ‘అన్నమయ్య’ చూసి, వాళ్లే నా దగ్గరకొచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ♦ జనరల్‌గా మనం ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు చేతులు ఆడిస్తాం. కానీ, ఈ పాత్రకు కుదరదు. నా చేతులను, కాళ్లను కట్టిపడేసినట్లుగా చేయాల్సి వచ్చింది. నా కదలికలను చూడటానికే ఇద్దరు అసిస్టెంట్లను పెట్టారు. మామూలుగా ఎవరైనా షాట్ గ్యాప్‌లో హాయిగా కూర్చొని, రిలాక్స్ అవుతారు. నేను మాత్రం కట్ అని చెప్పగానే హాయిగా సెట్ అంతా తిరిగేసేవాణ్ణి. ♦ కార్తీ చేసిన పాత్ర కోసం ఎన్టీఆర్‌ను అనుకున్న మాట నిజమే. అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక ఎన్టీఆర్ తప్పుకోవడంతో, కార్తీని ఎప్రోచ్ అయ్యాం. కార్తీ సలహా ఇవ్వడంవల్లే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పాను. ♦ మల్టీస్టారర్ అంటే స్టార్‌డమ్‌ను పక్కన పెట్టేసి, మన పాత్రకు పరిమితమైపోవాలి. ఇప్పుడు ‘క్షణం’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వస్తే కచ్చితంగా చేస్తా. అయితే అలాంటి సినిమా 4 నుంచి 5 కోట్ల బడ్జెట్లోనే చేయాలి. నాతో చేస్తున్నారు కదా అని రూ. 20 కోట్లు పెడితే ఆ సినిమా గల్లంతే. ♦ సూపర్స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా విభిన్న తరహా సినిమాలు చేసేవాళ్లు చాలా కొంతమందే ఉన్నారు. అందులో కమల్‌హాసన్ ఒకరు. ఆయన అన్నీ ట్రై చేశారు. చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్‌ని తీసుకుంటే, ఆయన ఇమేజ్‌కి భిన్నంగా సినిమా చేస్తే, అభిమానులు హర్ట్ అవుతారు. అందుకే ఇమేజ్ చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంతెందుకు... ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌లో చాలా మంది ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి, బయటకు రాలేకపోతున్నారు. అవే పంచ్ డైలాగులు, అవే ఫైట్లు... ఈ పరిస్థితి మారాలి. మళ్లీ తెలుగు సినిమాకు కొత్త రోజులు రావాలి. నా మటుకు నేను వెరైటీలు ట్రై చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఇప్పుడూ అంతే. ♦ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశ’ అనే సినిమా చేయనున్నా. ‘సోగ్గాడే...’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతోంది. ‘ఓం నమో వెంకటేశ’ మొదలు కావడానికి ఇంకా టైమ్ పడుతుంది. అలాగే అఖిల్ తదుపరి చిత్రకథపై దృష్టి పెట్టాను. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు నాకు సంతృప్తికరంగా ఉన్నాయి. రిటైర్మెంట్ ఆలోచనే లేదు. అయితే ఎప్పుడూ హీరోగా చేయలేను కదా. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తాను. వయసుతో, సమయంతో ఎవరూ ఎక్కువ కాలం పోరాడలేరు. ♦ గతేడాది ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చూశాను. బాగా నచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి తెలుగు సినిమా కళకళలాడుతోంది. ఇది మంచి పరిణామం. కానీ, నా అభిప్రాయం ఏంటంటే సినిమాల సంఖ్య తగ్గాలి. వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ జనవరి నుంచి మార్చి వరకే దాదాపు 50 వర కూ విడుదలై ఉంటాయి. అయినా ప్రేక్షకులు ఎన్ని సినిమాలని చూస్తారు. క్వాలిటీ ఔట్పుట్ మీద దర్శక, నిర్మాతలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని సినిమాలకు నిజమైన విజయం లభించిందనేది నా ప్రశ్న. పెట్టిన ఖర్చు వెనక్కి రావాలి. వస్తేనే కదా మళ్లీ ఇంకో సినిమా తీయొచ్చు. ♦ త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను, అల్లు అర్జున్ హీరోలుగా నటించనున్నామనే వార్త ప్రచారమవుతోంది. ఈ వార్త ఎక్కణ్ణుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ‘దిల్’ రాజు నిర్మించాలనుకుంటున్న సినిమా కథ కూడా ఇంకా వినలేదు. -
అలాంటివారిలో తారక్ ఒకడు- నాగ్
'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ హిట్ అవ్వడంతో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 'ఊపిరి' తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊపిరి సినిమా గురించి మాట్లాడుతూ నాగార్జున.. యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్తీ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యామని, అతడు కూడా ఊపిరిలో నటించేందుకు ఆసక్తి చూపించారని చెప్పారు. కానీ డేట్స్ సర్దుబాటు అవ్వక తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలిపారు. అయితే తారక్ ను ఆ పాత్రకు ఎంచుకోవడం పూర్తిగా తన నిర్ణయమేనని నాగ్ చెప్పారు. ఇంకా మట్లాడుతూ.. 'నేనెప్పుడూ మా పిల్లలకు కూడా సలహా ఇస్తుంటాను.. మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటే అవే స్టార్ డమ్ ను తీసుకొచ్చిపెడతాయని. అయినా 30 ఏళ్ల లోపు స్టార్ డమ్ అందుకున్న నటులు చాలా అరుదు, అలాంటివారిలో తారక్ ఒకడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు కూడా 30 ఏళ్ల తర్వాతే స్టార్ డమ్‌ను చవిచూశారు' అంటూ తారక్ మీదున్న ప్రత్యేక అభిమానాన్ని బయటపెట్టారు కింగ్ నాగార్జున. అలాగే నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ లతో గుండమ్మ కథ 'రీమేక్' ఆలోచనలు కూడా నాగార్జునకు ఉన్నట్లు టాక్. -
స్టార్ హీరోలు కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలి!
‘‘నాగ చైతన్యతో రెండు సినిమాలు చేశా. ఇప్పుడు నాగార్జునగారితో ‘ఊపిరి’ చేశా. ఇద్దరూ డౌన్ టు ఎర్త్. రెండున్నర గంటల పాటు వీల్ చైర్‌కు పరిమితమయ్యే బిలియనీర్ పాత్రను నాగార్జునగారు చేయడం నిజంగా సాహసమే. ఈ సినిమాతో ప్రేక్షకులు కూడా విభిన్నమైన కథాంశాలను ఆదరిస్తారని ప్రూవ్ అవుతుంది. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం ఉంది’’ అని తమన్నా అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో పరమ్. వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ‘ఊపిరి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమన్నా చెప్పిన ముచ్చట్లు... ♦ అందరూ అనుకుంటున్నట్టు ఇది ఫ్రెంచ్ మూవీ ‘ఇన్టచ్ బుల్స్’కి రీమేక్ కాదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన సినిమా. నవ్విస్తూనే, మనసును తడిపే సన్నివేశాలూ ఉన్నాయి. జీవితమంటే డబ్బు అనుకునే ఓ వ్యక్తి, ఓ బిలియనీర్‌కు కేర్ టేకర్ గా చేరిన తర్వాత వాళ్లిద్దరి మధ్య స్నేహం ఎలా అల్లుకున్నదనేదే ఈ కథ. బిలియనీర్‌కు పీఏగా నటించాను. ముందు వంశీ నా లుక్ మారిస్తే 50 శాతం పని అయిపోతుందన్నారు. ఇక దుస్తులైతే చాలా టైట్‌గా ఉండేవి ఇచ్చారు. వాటితోనే నాకు ఊపిరి ఆడనంత పనైంది. కార్తీతో నాకిది మూడో సినిమా. ‘ఆవారా’, తమిళంలో ‘సిరుతెతై సినిమాలు చేశాను. కార్తీతో నటించడం అంటే రిలాక్స్ అయిపోతాను. అందుకే ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. నాగార్జునగారు తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పారు. అందరూ అనుకున్నట్లు ఈ సినిమా తమిళ వెర్షన్‌కు నేను డబ్బింగ్ చెప్పలేదు. కేవలం తెలుగులో మాత్రమే చెప్పాను. వందశాతం సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ♦ ప్రత్యేక పాటల గురించి ఎదురు చూడ ను. నచ్చితే గ్యారెంటీగా చేస్తాను. అయినా స్టార్ హీరోయిన్సే కాదు, స్టార్ హీరోలు కూడా ప్రత్యేక పాటలకు డ్యాన్స్ చేయచ్చు. ఎందుకంటే మన దక్షిణాదిలో కూడా మంచి డ్యాన్సర్లు ఉన్నారు కదా. స్టార్ హీరోలు ప్రత్యేక పాటలకు కాలు కదిపితే అమ్మాయిలకు పండగే (నవ్వుతూ). -
‘ఊపిరి’ ట్రైలర్ ను లాంచ్ చేసిన చైతన్య, అఖిల్
-
నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..?
సీనియర్ హీరోలలో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న స్టార్ కింగ్ నాగార్జున. వరుస సూపర్ హిట్స్‌తో మంచి జోరు మీద ఉన్న ఈ మన్మథుడు, కమర్షియల్ జానర్‌కు భిన్నంగా కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ హిట్స్ అందుకున్న నాగార్జున 'ఊపిరి' సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 25న పెద్ద ఎత్తున విడుదలకు సిద్థం అవుతోంది. ఊపిరి తరువాత నాగార్జున మరోసారి భక్తి రస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అన్నమయ్య, రామదాసు చిత్రాల్లో భక్తునిగా శిరిడి సాయి సినిమాలో భగవంతునిగా అలరించిన నాగ్, ఈ సారి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అపర భక్తుడు హాథీరాం బాబాగా నటించబోతున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఓం నమో వెంకటేశా' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. నాగార్జున హీరోగా శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించిన మహేష్ రెడ్డి మరోసారి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చేవారం నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించి, జూన్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. -
మనసుతో చూడాల్సిన సినిమా ఇది : ప్రకాశ్‌రాజ్
‘‘నాగార్జున, కార్తీ, తమన్నా, వంశీ వీళ్లందరిని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. ‘ఊపిరి’ సినిమా ఎంచుకోవడంలో వాళ్ల వ్యక్తిత్వాలు క నిపిస్తున్నాయి. మన మనసుతో చూడాల్సిన సినిమా ఇది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. నాగార్జున, కార్తీ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం - ‘ఊపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి పతాకంపై పెరల్ వి. పొట్లూరి సమర్పణలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం పాటల విడుదల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. గోపీసుందర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నాగార్జున సతీమణి అమల అక్కినేని ఆవిష్కరించారు. ప్రకాశ్‌రాజ్ ఇంకా మాట్లాడుతూ, ‘‘నాగ్‌లో తాను ఎదగడమే కాక, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తారు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన అంశం. ఇక, మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన కార్తీ ఆ రోజుల నుంచీ నాకు తెలుసు. అతను సినిమాలు ఎంచుకొనే విధానం బాగుంటుంది. కమర్షియల్ పంథా చిత్రాలూ తీస్తూ వచ్చిన దర్శకుడు వంశీ ఇలాంటి సినిమాతో కొత్తగా కనిపిస్తాడు. ప్రతి మనిషీ నేర్చుకుంటూ ఉండాలి. ఈ సినిమాతో వంశీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. మన పరిశ్రమకు ఇలాంటి దర్శకులు కావాలి’’ అని పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ-‘‘మీరందరూ (ప్రేక్షకులను ఉద్దేశించి) నా ఊపిరి . మా అబ్బాయి నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. దాని పేరు ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఆ టైటిల్ నాకు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇష్టం. చాలామంది నిరుత్సాహపరిచినా, ఆ సాహసంతోనే ‘గీతాంజలి’, ‘శివ’, ‘అన్నమయ్య’ చేశా. ఇప్పుడీ సినిమా. నేను, అమల చాలాకాలం క్రితం ఈ చిత్రం ఒరిజినల్ చూశాం. ఇది ఎవరైనా చేస్తే బాగుంటుందనుకున్నాం. అలా అనుకున్న మూడేళ్ల తర్వాత నాకీ సినిమా కథ చెప్పాడు వంశీ. వెంటనే ఓకే చెప్పా. నేనేదో వీల్‌చైర్‌లో కూర్కొన్నానని అనుకోవద్దు. కాళ్లూ, చేతులు పడిపోయినా పరిగె త్తుతూనే ఉంటాను. మనిషికి కావాల్సింది తోడు. కష్టాల్లో, నవ్వుల్లో తోడు కావాలనిపిస్తుంది. ఎంత సంపాదించుకున్నా తోడు లేకపోతే ఆ డబ్బునంతా నెత్తికేసి కొట్టుకోవాల్సిందే. నాకు ఈ సినిమాలో తోడు కార్తీ. అతణ్ణి మంచి నటుడనే కన్నా, నా ఫ్రెండ్ అని చెబుతాను. ఈ సినిమాతో నాకొక ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా వద్దని చెప్పడానికి నాకు రీజన్స్ దొరకలేదు. ఓ హాలీవుడ్ క్లాసిక్‌కు వంశీ మన నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడు. ప్రతి సన్నివేశంలో ఏడుస్తాం, మళ్లీ వెంటనే నవ్వుతాం. అలా రాయడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచి నాకు నాగార్జున గారంటే చాలా ఇష్టం. మా అమ్మగారు నాగ్ గారికి ఫ్యాన్. జీవితంలోని ప్రతి సెకనూ ఎంత విలువైనదో చెప్పాం. ప్రత్యేకంగా ఓ సన్నివేశంలో నాగార్జున ఏడిపించారు. చూస్తున్నవాళ్లం మేమూ ఏడ్చేశాం’’ అని కార్తీ చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ- ‘‘రెండేళ్ల జర్నీలో నన్ను నేను అన్వేషించుకుంటున్న సమయంలో వీళ్లకు ‘ఇన్టచ్బుల్స్’ కథ చెప్పాను. చాలా భయం భయంగా చెప్పాను. నాగార్జున, కార్తీ, పీవీపీ నన్ను నమ్మారు. వీళ్లు ప్రతి క్షణం నాకిస్తున్న సపోర్ట్‌కు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను! ఈ సినిమా చేస్తున్నందుకు కాదు. ముందు వీళ్ళ నమ్మకానికే భయపడ్డాను. మనం జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వీల్ చెయిర్లో కూర్చుంటాం. అలాంటి టైమ్‌లోనే మనకు ఫ్రెండ్, అమ్మ, నాన్న, ఎవరో ఒకరు తోడుగా నిలుస్తారు. అదే ఈ సినిమా. ప్రకాశ్ రాజ్‌గారి పాత్ర ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటుంది. ఆయన మన సినీ పరిశ్రమకు ఓ వరం. మా యూనిట్ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్’’ అని అన్నారు.ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ అంతా నాకు తెలుసు. ఈ వేసవిలో ఇది సూపర్ హిట్ అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో దర్శకులు రాఘవేంద్రరావు, దశరథ్, అశ్వనీదత్, హీరోలు సుమంత్, సుశాంత్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.