సెలబ్రేషన్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా | oopiri moive review | Sakshi
Sakshi News home page

సెలబ్రేషన్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా

Published Sat, Mar 26 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

సెలబ్రేషన్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా

సెలబ్రేషన్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా

కొత్త సినిమా గురూ!
 చిత్రం: ‘ఊపిరి’, తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాశ్‌రాజ్, జయసుధ, గ్యాబ్రియెల్లా డెమెట్రియాడిస్, స్వర్గీయ కల్పన, అతిథి పాత్రల్లో అనూష్క, శ్రీయ, అడివి శేష్, మాటలు: అబ్బూరి రవి, పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, కెమేరా: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: మధు, సంగీతం: గోపీ సుందర్, నిర్మాతలు: పరవ్‌ు వి.పొట్లూరి, కెవిన్ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి

 ఏ కళారూపమైనా మారాలంటే కళాభిమానుల ఆలోచన, అభిరుచి మారాలి. కానీ అభిరుచిని మార్చాలంటే, మళ్ళీ కొత్త అభిరుచిని కల్పించేం దుకు తగ్గ కళారూపమే రావాలి. ఉపరితలంలో స్వతంత్రంగా అనిపించినా, పరస్పర ఆధారిత మైన రెండు అభిన్నమైన విషయాలివి. దర్శక, నిర్మాతలు తీసేవే చూడాలా? జనానికి చూపించా ల్సినవి వాళ్ళు తీయాలా? అనే కోణంలో ఈ చర్చ మన తెలుగు సినిమాకూ వర్తిస్తుంది. మరి, ఇవాళ తెలుగు సినిమాలో ఎలాంటి కథలు కావాలి? ఎలాంటి సినిమాలు రావాలి? రొడ్డకొట్టుడు రొటీన్ సినిమాల నుంచి బయటపడాలంటే దర్శక - నిర్మాతలైనా, ప్రేక్షకులైనా ఎవరేం చేయాలి? ఆలోచించాల్సిన ఈ అర్థవంతమైన చర్చకు దోహదంగా ఇటీవల కొన్ని కొత్త పంథా చిత్రాలు వస్తున్నాయి. వాటికి తాజా చేర్పు - ‘ఊపిరి’.
 
 విక్రమ్ ఆదిత్య (నాగార్జున) పెద్ద కోటీశ్వ రుడు. కార్ల రేసింగ్, పారా గ్లైడింగ్ లాంటి ఎడ్వెం చర్లతో జీవితంలో వేగాన్ని ఇష్టపడే సాహసికుడు. అలాంటివాడు అయిదేళ్ళ క్రితం ఓ అనూహ్య ప్రమాదంతో వెన్నెముక దెబ్బతిని, పేరాప్లెజిక్‌గా మారిపోతాడు. మెడ కింద నుంచి ఏ భాగమూ పనిచేయని పరిస్థితుల్లో మిగిలిపోతాడు. అతని బాగోగులు చూసుకొనేందుకు తాజాగా ఒక కేర్ టేకర్ కోసం చూస్తుంటారు. సరిగ్గా అదే టైవ్‌ులో జైలులో నుంచి పెరోల్ మీద విడుదలవుతాడు చిల్లర దొంగతనాలు చేసే శీను (కార్తీ). చిరుద్యోగి అయిన అమ్మ (జయసుధ), ప్రేమలో పడ్డ చెల్లెలు, పనికిమాలిన రౌడీలతో తిరిగే తమ్ముడు - అతని మధ్యతరగతి కుటుంబసభ్యులు. జైలు నుంచి వచ్చిన అతణ్ణి, అమ్మ ఛీపొమ్మంటుంది.
 
 సత్ప్రవర్తనతో ఉంటే నాలుగునెలల్లో శిక్ష రద్దు చేయించుకోవచ్చని ఈ కోటీశ్వరుడి దగ్గర ఉద్యోగానికొస్తాడు. కదలలేని కోటీశ్వ రుడికి పి.ఎ. అయిన కీర్తి (తమన్నా)ను తొలిచూపులోనే ఇష్టపడతాడు. డబ్బు అన్ని సమస్యలకూ పరిష్కారమను కున్న శీనుకు క్రమంగా మానవ బంధాల రుచి తెలుస్తుంది. శీను ఉత్సాహంతో కోటీశ్వరుడిలో కొత్త దశ మొదలవు తుంది. కానీ, కుర్చీకే పరిమితమైన ఆ కోటీశ్వరుడి జీవితంలోనూ ప్యారిస్‌కు ముడిపడి ఒక రహస్యం ఉంటుంది. అలాగే, తరచూ వచ్చే పర్సనల్ లెట ర్‌‌సతో మరో అనుబంధం ఉంటుంది. ఆ రహస్యా లేమిటి?జీవితం పట్ల నిరుత్సాహం పేరుకున్న ఆ కోటీశ్వరుడిలో మార్పు వచ్చిందా? మరి, ఇంటికి దూరమైన హీరో చివరకు అమ్మతో అనుబంధం పంచుకున్నాడా? లాంటివన్నీ మిగతా సినిమా.
 
 ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’గా దర్శక, నిర్మాతలు పేర్కొన్న ఈ చిత్రం ‘బతకడానికి డబ్బక్కర్లేదు... ఒక తోడుంటే చాలు’ అని చెబుతుంది. ‘మున్నా’, ‘బృందావనం’, ‘ఎవడు’తో పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లికి ఇది కొత్త అనుభవం. ఫ్రెంచ్ సినిమా ‘ఇన్‌టచబుల్స్’ను అధికారికంగా రైట్స్ కొని మరీ చేసిన ఈ రీమేక్‌లో టైటిల్స్ దగ్గర నుంచి చాలావరకు అనుకరించారు. నేటివిటికి తగ్గట్లు మార్పుచేర్పులూ చేశారు. ఇప్పటి దాకా హీరో పాత్రలకే పరిమితమైన నాగ్ వయసుకీ, కాలానికీ తగ్గట్లు విలక్షణ క్యారె క్టర్ల వైపు మొగ్గుతున్నారనడానికి మరో ఉదాహ రణ కోటీశ్వరుడి పాత్ర. ఆయనది సరైన నిర్ణయ మని సిన్మా చూశాక ఒప్పుకుంటారు. అయితే, ఇదీ ఒక రకంగా నాగార్జున నవ మన్మథుడి ఇమేజ్‌కు తగ్గట్లుగానే ఉంది.
 
 ఆయన పాత్రకు సినిమాలో ఒకటికి మూడు ప్రేమలుంటాయి. ఒకటి - క్లైమాక్స్‌లో శుభం కార్డుకు ఉపయోగపడే లెటర్స్ ప్రేమ. మరొకటి - అతని జీవితంలో ఎదురైన విషాదభరిత ప్రమాదానికి ముందు నడిచిన జీవితప్రేమ. వేరొకటి - మధ్యలో కార్తీతో పందెం వేసి, నడిపిన డేటింగ్ ప్రేమ. మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో సహాయ కుడిగా మొదలై, తమిళంలో హీరోగా పేరు తెచ్చు కున్న కార్తీ తన తొలి నేరు తెలుగు సినిమాలోనే ఫుల్ మార్కులు కొట్టేశారు. శీను పాత్రలో ఆయన నటించకుండా, సహజంగా ప్రవర్తించారు. నాగ్‌కు సెక్రటరీగా తమన్నా చేసిన పాత్రలో అభినయం కన్నా అందం ఉంది.
 
  కథలో సెంటిమెంట్ టచ్ - కార్తీ కుటుంబ కథ. తల్లి పాత్రధారిణి జయ సుధల చుట్టూ నడుస్తుంది. కార్తీ ఫోన్ సీన్, అలాగే బైక్ మీద కార్తీ తనను కూర్చోబెట్టుకొని తీసుకువెళుతున్న ప్పుడు తలపెకైత్తి నాగ్ ఆకాశం వైపు చూసే ఘట్టం లాంటివి గుండెను తడి చేస్తాయి. నాగ్ భావప్రకటన బాగుంది. అయితే, ఒక ఆవారాను తన కేర్‌టేకర్‌గా కోటీశ్వరుడు పెట్టుకోవడం, అంత కోటీశ్వరుడి పక్కన నర్సయినా లేకపోవడం లాంటివి ఇలాంటి కథల్లోనే చూస్తాం. వాటికి కన్విన్స్ అవడమా, కాక పోవడమా అన్నది ప్రేక్షకుల ఇష్టం. కానీ, ‘ఈ రోజుకి, ఈ నిమిషానికి ఇలాంటివాడే నాకు కరెక్ట్’ అనే డైలాగ్‌తో ఆ పాయింట్‌ను ఒప్పిస్తారు.
 
  ఇక, సెకండాఫ్‌తో పోలిస్తే, ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్ మెంట్ పాలెక్కువ. కథను ముగించాల్సిన సెకం డాఫ్‌లో అది ఆశించడం అత్యాశే. ద్వితీయార్ధంలో ప్యారిస్‌లోని అందమైన ప్రదేశాల్ని చూపెట్టే ఎపి సోడ్ ఫీలింగ్‌తో పాటు నిడివిపరంగానూ అంత దూరం ప్రయాణించినట్లనిపిస్తుంది. అదీ మంద గమనంతో! పెయింటింగ్, సితార్ వాదన లాంటి కళలపై జోక్‌లు నవ్వు తెప్పిస్తాయి. కానీ, అవి సబ్‌కాన్షస్‌గా మన కళల గురించి మన ఆలోచనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అలాగే, ఒవర్ స్పీడింగ్‌ను ఫ్యాంటసైజ్ చేసి చూపడం కూడా!  థీవ్‌ు మ్యూజిక్, రీరికార్డింగ్ బాగున్న ఈ చిత్రంలో గోపీ సుందర్ సంగీతంలో ‘ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్’, ‘నువ్వేమిచ్చావో నీకైనా తెలుసునా’, ‘పోదాం ఎగిరెగిరి పోదాం’ లాంటి పాటలు, సీతారామశాస్త్రి చొప్పించిన జీవనసారం భేష్.
 
  కొండంత భావాన్ని కొద్ది మాటల్లో చెప్పడా నికి అబ్బూరి రవి ప్రయత్నం అక్కడక్కడ మెరు స్తుంది. ‘దేవుడు ఎవరినీ సంతోషంగా ఉండని వ్వడు... బ్యాడ్‌బాయ్’ (నాగ్‌తో కార్తీ) లాంటివి ఉదాహరణ. కెమేరావర్క్, పుష్కల నిర్మాణ విలువలతో ఈ సిన్మా కాస్ట్లీలుక్ కనువిందే. సెకం డాఫ్ పట్టుగా అల్లుకొంటే, చర్విత చర్వణాలు తగ్గితే ఇంకా బాగుండేది. ఏమైనా, ఊపిరి అంటే ప్రాణంతో ఉండడం కాదు. జీవితాన్ని ఆనం దంగా గడపడమని ఈ సిన్మా చెబుతుంది. తర్వాతేం జరుగుతుందో ఊహించగలిగినా, కొన్నిచోట్ల అసహజమనిపించినా, ఆద్యంతం ఫీల్‌గుడ్ అవుతుంది. అందుకే, ఊపిరి సలపని మసాలా సిన్మాల మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ, కాస్తంత గాలి కోరుకుంటున్న వారికి ఈ సిన్మా రిలీఫ్! కొత్త తరహా చిత్రాలకు మళ్ళీ ఊపిరి!!
 
 కాళ్ళూ చేతులూ చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైన పాత్రను ఇమేజ్ ఉన్న ఒక పెద్ద హీరో పోషించడం తెలుగు సినిమాలో ఊహించగలమా? పక్కా తమిళ నటుడు తెలు గులో పూర్తిస్థాయి హీరో పాత్రతో తెరంగేట్రం చేసి, తన గొంతుతోనే తెలుగు డైలాగులు చెప్పు కోవడం విని, చూసి ఎన్నాళ్ళయింది? తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్న ఉత్తరాది అమ్మాయి కథానాయిక పాత్రధారణతో పాటు కష్టపడి గాత్రధారణ కూడా చేసి ఇంకెన్ని రోజులైంది? ఇటీవల ఎన్నడూ చూడని ఇలాంటి విచిత్రాలు అన్నీ జరిగిన సినిమా - ‘ఊపిరి’.
 
 - రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement