మనసుతో చూడాల్సిన సినిమా ఇది : ప్రకాశ్‌రాజ్ | Oopiri Movie Audio Released | Sakshi
Sakshi News home page

మనసుతో చూడాల్సిన సినిమా ఇది : ప్రకాశ్‌రాజ్

Published Wed, Mar 2 2016 1:14 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

మనసుతో చూడాల్సిన సినిమా ఇది : ప్రకాశ్‌రాజ్ - Sakshi

మనసుతో చూడాల్సిన సినిమా ఇది : ప్రకాశ్‌రాజ్

 ‘‘నాగార్జున, కార్తీ, తమన్నా, వంశీ వీళ్లందరిని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. ‘ఊపిరి’ సినిమా ఎంచుకోవడంలో వాళ్ల వ్యక్తిత్వాలు క నిపిస్తున్నాయి. మన మనసుతో చూడాల్సిన సినిమా ఇది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో మల్టీస్టారర్  చిత్రంగా తెరకెక్కిన చిత్రం - ‘ఊపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి పతాకంపై పెరల్ వి. పొట్లూరి సమర్పణలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం పాటల విడుదల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. గోపీసుందర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను  నాగార్జున సతీమణి అమల అక్కినేని ఆవిష్కరించారు.
 
 ప్రకాశ్‌రాజ్ ఇంకా మాట్లాడుతూ, ‘‘నాగ్‌లో తాను ఎదగడమే కాక, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తారు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన అంశం. ఇక, మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన కార్తీ ఆ రోజుల నుంచీ నాకు తెలుసు. అతను సినిమాలు ఎంచుకొనే విధానం బాగుంటుంది. కమర్షియల్ పంథా చిత్రాలూ తీస్తూ వచ్చిన దర్శకుడు వంశీ ఇలాంటి సినిమాతో కొత్తగా కనిపిస్తాడు. ప్రతి మనిషీ నేర్చుకుంటూ ఉండాలి. ఈ సినిమాతో వంశీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. మన పరిశ్రమకు ఇలాంటి దర్శకులు కావాలి’’ అని పేర్కొన్నారు.
 
 నాగార్జున  మాట్లాడుతూ-‘‘మీరందరూ (ప్రేక్షకులను ఉద్దేశించి) నా ఊపిరి . మా అబ్బాయి నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. దాని పేరు ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఆ టైటిల్ నాకు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇష్టం. చాలామంది నిరుత్సాహపరిచినా, ఆ సాహసంతోనే ‘గీతాంజలి’, ‘శివ’, ‘అన్నమయ్య’ చేశా. ఇప్పుడీ సినిమా. నేను, అమల చాలాకాలం క్రితం ఈ చిత్రం ఒరిజినల్ చూశాం. ఇది ఎవరైనా చేస్తే బాగుంటుందనుకున్నాం. అలా అనుకున్న మూడేళ్ల తర్వాత  నాకీ సినిమా కథ చెప్పాడు వంశీ.
 
  వెంటనే ఓకే చెప్పా.  నేనేదో వీల్‌చైర్‌లో కూర్కొన్నానని అనుకోవద్దు. కాళ్లూ, చేతులు పడిపోయినా పరిగె త్తుతూనే ఉంటాను. మనిషికి కావాల్సింది తోడు. కష్టాల్లో, నవ్వుల్లో తోడు కావాలనిపిస్తుంది. ఎంత సంపాదించుకున్నా  తోడు లేకపోతే ఆ డబ్బునంతా నెత్తికేసి కొట్టుకోవాల్సిందే. నాకు ఈ సినిమాలో తోడు కార్తీ. అతణ్ణి మంచి నటుడనే కన్నా, నా ఫ్రెండ్ అని చెబుతాను. ఈ సినిమాతో నాకొక ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు’’ అన్నారు.
 
 ‘‘ఈ సినిమా వద్దని చెప్పడానికి నాకు రీజన్స్ దొరకలేదు. ఓ హాలీవుడ్ క్లాసిక్‌కు వంశీ మన నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడు. ప్రతి సన్నివేశంలో ఏడుస్తాం, మళ్లీ వెంటనే నవ్వుతాం. అలా రాయడం చాలా కష్టం.  చిన్నప్పటి నుంచి నాకు నాగార్జున గారంటే చాలా ఇష్టం. మా అమ్మగారు నాగ్ గారికి ఫ్యాన్. జీవితంలోని ప్రతి సెకనూ ఎంత  విలువైనదో చెప్పాం. ప్రత్యేకంగా ఓ సన్నివేశంలో నాగార్జున ఏడిపించారు. చూస్తున్నవాళ్లం మేమూ ఏడ్చేశాం’’ అని కార్తీ చెప్పారు.
 
 దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ- ‘‘రెండేళ్ల  జర్నీలో నన్ను నేను అన్వేషించుకుంటున్న సమయంలో వీళ్లకు ‘ఇన్‌టచ్‌బుల్స్’ కథ చెప్పాను. చాలా భయం భయంగా చెప్పాను. నాగార్జున, కార్తీ, పీవీపీ నన్ను నమ్మారు. వీళ్లు ప్రతి క్షణం నాకిస్తున్న సపోర్ట్‌కు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను! ఈ సినిమా చేస్తున్నందుకు కాదు. ముందు వీళ్ళ నమ్మకానికే భయపడ్డాను. మనం జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వీల్ చెయిర్‌లో కూర్చుంటాం. అలాంటి టైమ్‌లోనే మనకు ఫ్రెండ్, అమ్మ, నాన్న, ఎవరో ఒకరు తోడుగా నిలుస్తారు.
 
  అదే ఈ సినిమా. ప్రకాశ్ రాజ్‌గారి పాత్ర ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటుంది. ఆయన మన సినీ పరిశ్రమకు ఓ వరం. మా యూనిట్ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్’’ అని అన్నారు.ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ అంతా నాకు తెలుసు. ఈ వేసవిలో ఇది సూపర్ హిట్ అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో దర్శకులు  రాఘవేంద్రరావు, దశరథ్, అశ్వనీదత్, హీరోలు సుమంత్, సుశాంత్, హీరోయిన్  కాజల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement