అందాలారబోత నా అభిమతం కాదు | Tamannah to replace Sruthi in Nagarajuna, Karthi Starrer | Sakshi
Sakshi News home page

అందాలారబోత నా అభిమతం కాదు

Published Thu, Apr 30 2015 2:45 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అందాలారబోత నా అభిమతం కాదు - Sakshi

అందాలారబోత నా అభిమతం కాదు

 అందాలారబోతన్నది తన అభిమతం కాదంటున్నారు నటి తమన్న. మోతాదుకు మించి తడిపొడి అందాలతో కనువిందు చేసే హీరోయిన్ల జాబితాలో ముందుండే నటి తమన్న అన్న విషయాన్ని పైయ్యా లాంటి చిత్రాలు చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీరం లాంటి చిత్రాల్లో సంప్రదాయబద్ధ నటనను ప్రదర్శించి మెప్పించగల సత్తా ఆమెలో ఉంది. చిన్న గ్యాప్ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసిన ఈ గుజరాతీ బ్యూటీ ప్రస్తుతం ఆర్య సరసన వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగ చిత్రంలో నటిస్తున్నారు.
 
 దీంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రంలో కార్తీతో మూడవసారి ముచ్చటగా డ్యూయెట్స్ పాడుతున్నారు. ఈ చిత్రంలో మరో హీరోగా టాలీవుడ్ నటుడు నాగార్జున నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ వైదొలగిన పాత్రలో తమన్న నటిస్తున్నారన్నది గమనార్హం. ఈ రెండు చిత్రాల్లో కోలీవుడ్‌లో మరో రౌండ్ కొట్టాలని ఆశపడుతున్న తమన్న తనకు నంబర్‌వన్ స్థానంపై నమ్మకం లేదంటున్నారు.
 
  ఆమె మాట్లాడుతూ తన భాషలో నటించినా ఆ భాష నేర్చుకోవాలని ఆశిస్తానన్నారు.  నిజం చెప్పాలంటే అందాలారబోయాలన్నది తన అభిమతం కాదన్నారు. దర్శకుల ఆకాంక్షలు మేరకు అలా నటిస్తున్నానని అన్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే గ్లామర్‌ను పక్కన పెట్టి నటించడానికి తాను సిద్ధం అన్నారు.   ఇక నంబర్‌వన్ స్థానం ఇప్పుడు వారానికొకరిదిగా మారిపోతోంది. అలాంటి దానిపై తనకు నమ్మకం లేదని తమన్న స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement