దేవుడిచ్చిన అవకాశం తోళా | I was their only hope: Nagarjuna on 'Oopiri' | Sakshi
Sakshi News home page

దేవుడిచ్చిన అవకాశం తోళా

Published Sun, Mar 20 2016 2:28 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

దేవుడిచ్చిన అవకాశం తోళా - Sakshi

దేవుడిచ్చిన అవకాశం తోళా

తోళా చిత్రంలో నటించడం దేవుడిచ్చిన అవకాశంగా టాలీవుడ్ టాప్ స్టార్ నాగార్జున వ్యాఖ్యానించారు. ఈయన కోలీవుడ్ యువ స్టార్ కార్తీతో కలిసి నటించిన మల్టీస్టారర్ ద్విభాషా చిత్రం తోళా.తెలుగులో ఊపిరిగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి తమన్నా కథానాయకిగా నటించారు. ఈ భారీ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన తోళా చిత్రం 25న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్తీ మాట్లాడుతూ ఇది ఒక అందమైన కథా చిత్రంగా పేర్కొన్నారు.రెండు ప్రధాన పాత్రల మధ్య జరిగే చిత్రం తోళా అని తెలిపారు. తోళా చిత్రంలో నటించడం ఒక అందమైన జర్నీగా పేర్కొన్నారు. ఈ చిత్ర తమిళ్ వెర్షన్‌కు కుకూ చిత్ర దర్శకుడు రాజమురుగన్ సంభాషణలు పక్కాబలంగా ఉంటాయన్నారు.

 స్నేహం అంటే?
తోళా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చెన్నైకి వచ్చిన నాగార్జున మాట్లాడుతూ ఇది ఫ్రెంచ్ చిత్రం ఇన్‌టచ్చబుల్‌కు రీమేక్‌గా కాకుండా యడాఫ్టడ్ చిత్రంగా రూపొందించిన చిత్రం అని తెలిపారు.చిత్రం చాలా పాజిటీవ్‌గా ఉంటుందన్నారు. 6 నెలలుగా చిత్ర కథపై సుధీర్ఘ చర్చలు జరిపి సెట్‌పైకి వెళ్లామని చెప్పారు. ఇందులో నటించడం తన అదృష్టం అనీ, ఇది దేవుడిచ్చిన అవకాశంగా పేర్కొన్నారు.ఇందులో నటించవద్దని తన భార్య అమల, తన పిల్లలు వారించారన్నారు. చిత్రం చూసిన తరువాత మీరే గర్వంగా ఫీల్ అవుతారని వారితో అన్నానన్నారు. ఇకపై యాక్షన్ చేస్తారా?అన్న ప్రశ్నకు తాను ఇప్పటికి 90 చిత్రాలకు రీచ్ అవుతున్నానని, వాటిలో అన్ని రకాల పాత్రలు చేశానని తెలిపారు. దర్శకుడు వంశీపైడపల్లి, గీతరచయిత మదన్‌కార్గీ, ఎడిటర్ ప్రవీణ్, నటుడు వివేక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement