Tamanna
-
పింక్ శారీలో ఆహా అనేలా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ లుక్ (ఫోటోలు)
-
బ్లూ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్.. ప్రణీత అలాంటి పోజులు
బ్లూ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్..బ్లాక్ డ్రెస్‌లో అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత..అనన్య నాగళ్ల గ్లామరస్ లుక్స్..2024 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న తమన్నా..కాశీ యాత్రలో నటి రేణు దేశాయ్.. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ స్త్రీ-2(Stree 2 Movie). గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రానికి స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే ఈ మూవీ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆజ్ కీ రాత్ అంటూ అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
ప్రియుడితో కలిసి వీకెండ్ పార్టీలో మిల్కీ బ్యూటీ..!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. ఈ ఏడాది దక్షిణాదిలో కేవలం జైలర్ మూవీలో మాత్రమే కనిపించింది. రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ-2 మూవీలో ఆజ్ కి రాత్ అంటూ ఐటమ్ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది ముద్దుగుమ్మ.అయితే తాజాగా వీకెండ్ పార్టీలో కనిపించింది మిల్కీ బ్యూటీ. అయితే తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఈ పార్టీకి హాజరైంది. ఇందులో పలువురు బాలీవుడ్ తారలు సైతం పాల్గొన్నారు. విక్రాంత్ మాస్సే, శీతల్ ఠాకూర్, ప్రగ్యా కపూర్, జీతేంద్ర, శోభా కపూర్, సోనాలి బింద్రే లాంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రగ్యా కపూర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్లో ఉన్నారు. గతంలో చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారని చాలామంది భావించారు. అయితే తమ కెరీర్లో సినిమాలతో బిజీగా ఉన్నందువల్ల ఈ జంట పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనైనా తమన్నా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతుందేమో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Pragya Kapoor (@pragyakapoor_) -
జిమ్‌లో సెల్ఫీతో నభా నటేశ్.. దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్‌ఫిట్!
వేకేషన్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ..జిమ్‌లో నభా నటేశ్ సెల్ఫీ కసరత్తులు..బంగారంలా మెరిసిపోతున్న అక్కినేనివారి కోడలు శోభిత..మరింత హాట్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా లుక్స్..దుబాయ్‌లో ప్రియమణి ఫోటోషూట్..మతిపొగొట్టే అవుట్‌ఫిట్‌లో దేవర భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే!
సినిమా సూపర్‌డూపర్ హిట్టయితే సెలబ్రిటీలకు ఓపక్క సంతోషంతోపాటు మరోపక్క ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ విజయాన్ని అలాగే కంటిన్యూ చేయాలని, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని కష్టపడుతుంటారు. అయితే బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా ఏం చేయాలో అర్థం కాలేదంటోంది హీరోయిన్ తమన్నా భాటియా.సక్సెస్ అందుకున్నా, కానీ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ... వయసులో నాకంటే పెద్దవారితో కలిసి పనిచేయడం, భాష తెలియని చోట పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు తెలుగు, తమిళం రెండూ వచ్చు. నేను కమర్షియల్ సక్సెస్ అందుకున్నాను కానీ నటిగా ఇంకా విభిన్న పాత్రలు చేయాలన్న ఆకలి మాత్రం ఇంకా ఉంది.బాహుబలి గేమ్ ఛేంజర్నిజానికి కమర్షియల్‌గా సక్సెస్ అయిన తర్వాత ఛాలెంజింగ్ పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకుల్ని అలరించాలని ఉంది. బాహుబలి విషయానికి వస్తే పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా ఇది. అందరికీ ఓ గేమ్‌ఛేంజర్ వంటిది. అయితే ఈ సినిమా చేశాక నాకు ఓ విషయం అర్థం కాలేదు.అర్థం కాని పరిస్థితినెక్స్ట్ ఏం చేయాలి? బాహుబలి కంటే పెద్ద సినిమా చేయాలా? ఇంతకంటే పెద్దది ఎలా చేస్తా? పోనీ నన్ను నేను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకోవాలా? అన్న ప్రశ్నలతో సతమతమయ్యాను అని చెప్పుకొచ్చింది. కాగా తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కా ముఖద్దర్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.చదవండి: హీరోయిన్ సమంత కుటుంబంలో విషాదం -
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ.. గ్రీన్ శారీలో సంయుక్త మీనన్!
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..బుల్లితెర బ్యూటీ జ్యోతి కిల్లింగ్ లుక్స్...బ్లాక్ బ్యూటీలా మారిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా..గ్రీన్ శారీలో సంయుక్త మీనన్ హోయలు..బుట్టబొమ్మ పూజా హేగ్డే క్రేజీ లుక్స్... View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
ఫ్యామిలీ ట్రిప్‌లో హన్సిక.. ఫ్రెండ్స్‌తో మిల్కీ బ్యూటీ ఎంజాయ్!
ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న హన్సిక..ఫ్రెండ్స్‌తో సండే పార్టీ ఎంజాయ్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ తమన్నా...దుబాయ్‌లో బుల్లితెర భామ మౌనీరాయ్ చిల్..గోవా ఈవెంట్లో ఊర్వశి రౌతేలా సందడి.. శివం భజే జ్ఞాపకాల్లో దిగాంగన సూర్యవన్షిన్యూ లుక్‌లో ఆదితిరావు హైదరీ View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
శారీలో నభా నటేశ్.. టర్కీలో చిల్ అవుతోన్న బలగం బ్యూటీ!
టర్కీలో చిల్ అవుతోన్న బలగం బ్యూటీ..శారీలో నభా నటేశ్ అదిరిపోయే లుక్స్...టోక్యోలో ఎంజాయ్ చేస్తోన్న సీనియర్ హీరోయిన్ మీనా..బ్లాక్ డ్రెస్‌లో తమన్నా పోజులు..ఆ సాంగ్ వింటూ నా సామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తోన్న మిల్కీ బ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ ముంబయికి షిఫ్ట్ అయింది. దక్షిణాదిలో కేవలం ప్రత్యేక సాంగ్స్‌లో మాత్రమే కనిపిస్తోంది. గతేడాది జైలర్ మూవీ ఐటమ్ సాంగ్‌లో మెరిసిన తమన్నా.. ఇటీవల స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌తో అదరగొట్టింది.తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కించిన చిత్రం 'సికందక్ కా ముఖద్దర్'. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.నవంబర్ 29 నుంచి సికందర్ కా ముఖద్దర్ స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, రాజీవ్ మెహతా, దివ్య దత్తా, జోయా అఫ్రోజ్ కీలక పాత్రల్లో నటించారు.సికందర్ కా ముకద్దర్ కథేంటంటే..స్పెషల్ 26, బేబీ, 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' వంటి చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ నీరజ్ పాండే ఈ క్రైమ్ థిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ఈ కథలో రూ.60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు? దాన్ని వెతకడంతో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరికి ఏమైంది? ఆ కేసును పరిష్కరిస్తున్న పోలీసు ఆఫీసర్ చివరికి సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నదే అసలు కథ. Teen aaropi, lekin kaun apradhi? Case jald hi khulega. Watch Sikandar ka Muqaddar, out 29 November, only on Netflix!#SikandarKaMuqaddarOnNetflix pic.twitter.com/apoIyTTe8p— Netflix India (@NetflixIndia) November 7, 2024 -
తమన్నా ఐటమ్ సాంగ్.. ఫుల్ వర్షన్ వచ్చేసింది!
టాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. జైలర్ మూవీలో తనదైన గ్లామర్, డ్యాన్స్‌తో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్త్రీ-2 చిత్రంలోనూ మెరిసింది. అజ్ కీ రాత్ అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. శ్రద్దాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ఈ పాట విడుదల చేయగా.. రెండు నెలల్లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం కట్ చేసిన సీన్స్‌ను కలిపి తాజాగా ఈ పాటను రీ రిలీజ్ చేశారు. అజ్ కీ రాత్ ఫుల్ సాంగ్ అక్టోబర్ 24న యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చింది.కాగా.. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొచ్చారు. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. -
ఇదో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్
‘ఓ 13 ఏళ్ల అమ్మాయి అద్భుతంగా పాడుతుంటే వినడం కాదు నేర్చుకోవడం కూడా మా వంతు అవుతోంది. ఇలా కూడా పాడవచ్చు అని కొందరు సింగర్స్ మాకు తెలియజెబుతున్నారు. ఇదో గొప్ప లెర్నింగ్ ఎక్స్పీరియన్స్’ అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న తమన్.. 3వ ఎడిషన్ పూర్తయిన సందర్భంగా సాక్షితో ముచ్చటిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... పాట వింటున్నా.. ప్రోత్సహిస్తున్నా.. పాటల పోటీల్లో ప్రతిభావంతుల్ని విభిన్న రకాలుగా ప్రోత్సహిస్తున్నాం. ఆ క్రమంలోనే ఓజీ సినిమాలో భరత్, నజీరుద్దీన్లతో కలిసి పనిచేశాను. గేమ్ ఛేంజర్‌లో కూడా అవకాశం ఇవ్వబోతున్నాం. బహుశా కీర్తి, కీర్తన కూడా నా సినిమాలో పాడవచ్చు.. నేను ఇవ్వడం మాత్రమే కాకుండా తెలిసిన రచయితలు, సంగీత దర్శకులకు కూడా న్యూ టాలెంట్‌ని పరిచయం చేస్తున్నాం. నొప్పింపక తానొవ్వక.. గత 3 సీజన్స్‌గా కొత్త గాత్రాలను జడ్జి చేస్తున్నాను. ఇది కొంచెం సంక్లిష్టమైన పనే అయితే.. 9 ఏళ్ల వయసులో అడుగుపెట్టి పాతికేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఔత్సాహికుల గురించి తెలుసు కాబట్టి ఎవరి మనోభావాలనూ దెబ్బతీయకుండా జడ్జి చేయగలుగుతున్నాను.విదేశాల నుంచి.. పల్లెల వరకూ.. ఆ్రస్టేలియా, అమెరికా లాంటి విదేశాల నుంచి మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెటూర్ల నుంచి కూడా గాయకులు రావడం, ఎంతో టాలెంట్ చూపిస్తుండడం చూస్తుంటే ఇక భవిష్యత్తులో గాయకుల కొరత అనే మాటే వినపడదనే నమ్మకం బలపడింది. ఒత్తిడికి చెక్.. ‘సంగీతం ఒత్తిడి నుంచి విముక్తం చేయడంలో సహాయపడుతుంది. అందుకే సంగీత కళాకారులు ఎక్కువ కాలం జీవిస్తారనుకుంటున్నాను. నా జీవితంలోనూ సంగీతం చాలా ముఖ్యమైన భాగమైపోయింది. అది లేని జీవితాన్ని నేనూహించుకోలేను. -
హీరోయిన్ తమన్నా కేసు వాయిదా
సినీ నటి తమన్నా కేసును చైన్నె హైకోర్టు వాయిదా వేసింది. నటి తమన్నా సినిమాల్లో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటన ప్రసారం గడువు పూర్తి అయినా సదరు సంస్థ ఆ ప్రకటనను ఉపయోగించడంతో తమన్నా దాన్ని వ్యతిరేకిస్తూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను ఒక ప్రముఖ వాణిజ్య సంస్థకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించానని, అయితే ఒప్పందం గడువు పూర్తి అయినా ప్రకటనను వాడుతుండటంతో తాను కోర్టును ఆశ్రయించానని, తన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఆ ప్రకటనపై నిషేధం విధించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ సంస్థ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ తాను నటించిన ప్రకటనను ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కేసు న్యాయమూర్తులు సెంథిల్ కుమార్, రామమూర్తిల డివిజన్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. దీంతో ఆ వాణిజ్య సంస్థ తరుపున హాజరైన న్యాయవాది ఆర్.కృష్ణ కుమార్ వాదిస్తూ నటి తమన్నా నటించిన తమ వాణిట్య ప్రకటన ప్రసారాన్ని తాము నిలిపి వేశామని, అయితే ప్రైవేట్ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వాడుతుంటే తాము ఎలా బాధ్యులమవుతామని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయ మూర్తులు తదుపరి విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. కాగా ఒక సబ్బు ప్రకటన సంస్థపై కూడా తమన్నా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. -
అలా నిర్ణయించడం కరెక్ట్ కాదు.. ఆ హీరో సినిమాపై తమన్నా కామెంట్స్!
మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామ తమన్నా. ఇటీవల స్ట్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఆజ్ కీ రాత్ అనే ఐటమ్ పాటలో ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా తమన్నా వేదా చిత్రంలో నటిస్తోంది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ముంబయిలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు తమన్నా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఓ సంఘటన గురించి తమన్నా స్పందించారు. కేవలం పోస్టర్లు చూసి సినిమాపై ఓ అంచనాకు రావొద్దని ట్వీట్ చేశారు. తమన్నా తన ట్వీట్లో రాస్తూ..'కేవలం ట్రైలర్, పోస్టర్స్ చూసి వేదా సినిమాను అంచనా వేయకండి. నేను చెప్పేది కాస్తా వినండి. ఇది యాక్షన్ ఫిల్మ్‌కు మించి ఉంటుంది. మన దేశంలో గొప్ప యాక్షన్ హీరోల్లో జాన్ అబ్రహం ఒకరు. అతడు ఈ జానర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ నేపథ్యంతో పాటు భిన్నమైన కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే, దర్శకుడు నిఖిల్ దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. శార్వరీ నటన ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. యాక్షన్ చిత్రాలకు ఈ సినిమా సరికొత్త నిర్వచనంగా నిలుస్తుంది. జాన్, నిఖిల్ సర్, శర్వరి, అభిషేక్ బెనర్జీతో నటిస్తుందుకు చాలా సంతోషంగా ఉంది' పోస్ట్ చేశారు.అయితే 'వేద' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో జాన్ అబ్రహం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ సినీ జర్నలిస్ట్ మీరెప్పుడు యాక్షన్ చిత్రాలే చేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో మీరు సినిమా చూశారా? అంటూ అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రశ్నకు మిమ్మల్ని మూర్ఖులు అని పిలవొచ్చా? అని అబ్రహం మండిపడ్డారు. కాగా.. నిఖిల్ నిక్కిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో అభిషేక్ బెనర్జీ విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో తమన్నా భాటియా, మౌని రాయ్ కూడా అతిథి పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కానుంది. Don't judge Vedaa by its cover - Trust me when I say, it's more than just an action film!My friend @TheJohnAbraham , one of the nation’s favorite action heroes is bringing his incredible influence to a genre he's totally mastered. This time, he's telling a different kind of… pic.twitter.com/TYhN9ra2Xc— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 2, 2024 -
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్‌ను అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
మళ్లీ అదే డైరెక్టర్‌తో తమన్నాకు సినిమా ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు సుందర్.సీ చిత్రాలు కచ్చితంగా కమర్శియల్ అంశాలతో నిండి ఉంటాయి. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా అని చెప్పవ చ్చు. ఇకపోతే హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈయన చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. ఇటీవల తమన్నా, రాశీ ఖన్నాలతో కలిసి సుందర్.సీ నటించి దర్శకత్వం వహించిన అరణ్మణై – 4 చిత్రం (తెలుగులో బాకు) మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. తాజాగా మరోసారి దర్శకుడు సుందర్.సీ- తమన్నా కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. దర్శకుడు శివ శిష్యుడు భూపాలన్ నటి తమన్నాకు ఒక కథ చెప్పారనీ, అది నచ్చడంతో ఆమె అందులో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అయితే ఆ చిత్రాన్ని నిర్మించతలపెట్టిన సంస్థ ఆ కథను మాత్రం తీసుకుని సుందర్.సీ దర్శకత్వంలో నిర్మించాలని భావించగా, కథ నచ్చడంతో సుందర్.సీ కూడా దర్శకత్వం వహించడానికి సమ్మతించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో సుందర్.సీ, తమన్నాల హిట్ కాంబినేషన్ రీపీట్ కానుందన్నమాట. ఇకపోతే సుందర్.సీ ప్రస్తుతం తాను ఇంతకు ముందు రూపొందించిన కలగలప్పు చిత్రానికి సీక్కెల్‌ను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేన్ని ముందుగా చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మైనై-4. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. సుందర్ సి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. గత నెల మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రంగా నిలిచింది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.Oru semma Family entertainer!Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024 -
మా డేటింగ్ మొదలైంది అప్పుడే!
‘నువ్వు కావాలయ్యా...’ అంటూ ‘జైలర్’లోని ప్రత్యేక పాటలో తమన్నా చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పాటల్లో ఇదొకటి. కాగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అయితే తమన్నాతో దాదాపు ఇలానే అన్నారట. ‘నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అని చెప్పారట విజయ్. గత ఏడాది కొత్త సంవత్సరం పార్టీలో విజయ్, తమన్నా చాలా క్లోజ్‌గా కనిపించడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా సినిమాల్లో కూడా చేయనంతగా విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ముద్దు సన్నివేశాల్లో నటించారు తమన్నా. ఆ సిరీస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్ వర్మ, ఆ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్ స్టోరీస్ 2’ అప్పుడు మేం డేటింగ్లో లేము. ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్అప్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్‌ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. సో.. ప్రపోజ్ చేసిన 25 రోజులకు విజయ్, తమన్నాల డేటింగ్ మొదలైందన్న మాట. ఇక ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో ఒకరంటే మరొకరికి బాగా ఇష్టమన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. -
తమన్నాతో డేటింగ్.. అప్పుడే మొదలైందన్న బాయ్‌ఫ్రెండ్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. అంతే కాకుండా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో అలరించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. అరణ్మణై- 4 అనే తమిళ చిత్రంతో పాటు స్ట్రీ-2 అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మను అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నాతో డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. విజయ్ వర్మ మాట్లాడుతూ..' తమన్నా, నేను డేటింగ్ ప్రారంభించింది లస్ట్ స్టోరీస్-2 షూటింగ్లో కాదు. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సింది. కానీ కుదరలేదు. మేమే నలుగురం కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజే తమన్నాకు అసలు విషయం చెప్పాను. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పా. ఆ తర్వాత మేం కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరు జంటగా నటించిన లస్ట్ స్టోరీస్-2 చిత్రంలో కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆ మూవీ సమయంలోనే డేటింగ్ ప్రారంభించారని ఫ్యాన్స్ భావించారు. కానీ తాజాగా ఈ విషయంపై విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చారు. కాగా.. కొన్ని రోజుల క్రితమే విజయ్ వర్మ, తమన్నా భాటియా జంటగా ఓ పార్టీకి వెళ్తూ కనిపించారు. కాగా.. కొత్త ఏడాదిలో విజయ్ వర్మ మర్డర్ ముబారక్ సినిమాతో అలరించాడు. గతేడాది జానే జాన్, దాహాద్, లస్ట్ స్టోరీస్-2 చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఉల్ జలూల్ ఇష్క్‌లో విజయ్ వర్మ కథానాయకుడిగా కనిపించనున్నారు. వీరిద్దరు డేటింగ్ గురించి తెలిసినప్పటీ నుంచి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాదిలోనైనా వివాహాబంధంలోకి అడుగుపెడతారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. ఇటీవలే పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను తన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. -
షాపింగ్‌లో మంగళవారం బ్యూటీ.. ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్!
బ్లూ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ హోయలు.. షాపింగ్‌తో బిజీగా ఉన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్... ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్.. అలాంటి డ్రెస్‌లో ఈషా రెబ్బా స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్‌లో రితికా సింగ్ బోల్డ్ లుక్స్.. గ్రీన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఆ డెరెక్టర్పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్‌గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్‌పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్‌ను సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కించిన రచ్చ బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. Thankyou for your kind words @IamSampathNandi , it means a lot✨ I have always strongly believed that filmmaking is a collaborative effort. Even if it begins with one person’s vision, it’s the fusion of each team member’s perspective that matters and Sampath truly understands… https://t.co/SVcRFRMt6O — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 10, 2024 -
మిల్కీ బ్యూటీపై అలాంటి పోస్ట్.. మొత్తానికి రియాక్ట్ అయిందిగా!
తమన్నా పేరు కంటే.. మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. జైలర్ సూపర్ హిట్ కావడంతో పారితోషికం అమాంతం పెంచేసిందంటూ టాక్ కూడా వినిపించింది. దీంతో బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. ఇందులో తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇదలా ఉంచితే తమన్నా 2005లోనే తన కెరీర్ ప్రారంభించింది. ఓకే ఏడాదిలో తెలుగు, హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, బద్రినాథ్, 100% లవ్, రచ్చ, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని తమన్నా సినిమాల్లో చేసిన పాత్రలతో ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన తమన్నా అభిమాని ట్వీట్‌కు స్పందించింది. తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక అభిమాని ట్వీట్‌కు తమన్నా రిప్లై ఇవ్వడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Thank you 🫶🏻 Many more to come 💕 https://t.co/TNMr1ChANd — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024 -
'విజయ్' సినిమాను ఏకి పారేసిన తమన్నా
చిత్రాల జయాపజయాలను ఎవరు ఊహించలేరు. తమ చిత్రాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. అయితే ఫలితం మాత్రం ప్రేక్షకులు ఇచ్చే తీర్పు పైనే ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను వారు ఆదరిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఒక్కోసారి మంచి కథ అనుకున్న చిత్రాలు కూడా ఆదరణకు దూరం అవుతుంటాయి. కర్ణుడి చావుకు కారణాలు పదివేలు అన్న చందంగా చిత్రాల జయాపజయాలకు కారణాలు చాలానే ఉంటాయి. అలానే నటుడు విజయ్ నటించిన సురా చిత్రం విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నటి తమన్నా కథానాయకిగా నటించారు. అందులో విజయ్ సరసన నటించే అవకాశం రావడంతో చంకలు గుద్దుకున్న ఈ బ్యూటీ చిత్రం పరాజయం పొందడంతో చాలా రోజుల తర్వాత దానిపై విమర్శలు గుప్పించారు. అదొక చిత్రమా అంటూ హేళనగా మాట్లాడారు. ఆ చిత్రంలో నటించి తాను పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సురా చిత్రం వర్కౌట్ కాదన్న విషయాన్ని తాను ముందే గ్రహించానని చెప్పారు. అయినా అందులో నటించాల్సిన పరిస్థితి అని తమన్నా అన్నారు. దక్షిణాదిలో టాప్ మోస్ట్ హీరోయిన్గా వెలిగిపోయిన తమన్నా ఇక్కడ విజయ్, అజిత్, సూర్య, ధనుష్, కార్తీ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. ఇక ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి జైలర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా నువ్వు కావాలయ్యా అన్న ఒక్కపాటతో ఆ చిత్రాన్ని కమ్మేశారు. అయినా ఆ తర్వాత తమన్నాకు ఇక్కడ అవకాశాలు దక్కకపోవడం గమనార్హం. -
సినిమాలు తగ్గినా.. ఆదాయంలో మాత్రం తగ్గేదేలే అంటోన్న బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. ఈ ఏడాదిలో భోళాశంకర్, జైలర్ సినిమాలతో అలరించిన 33 ఏళ్ల భామ గ్లామర్‌తో ఇప్పటికీ కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక గీతాలకు ఈమె డ్యాన్స్‌కు ఆడియన్స్ ఫిదా కావాల్సిందే. మొదట బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతా మాధురి) అయితే ఇటీవల ఆమె నటించిన చిత్రాలు ప్లాప్ అయ్యాయేమో గాని.. తమన్నా మాత్రం నటిగా ఎప్పుడు అభిమానుల్ని నిరాశ పరచలేదు. తన అందంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తమన్నా నటించిన తెలుగు చిత్రం భోళా శంకర్ నిరాశ పరిచినా.. తమిళంలో రజనీకాంత్‌తో నటించిన చిత్రం జైలర్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో నువ్వు కావాలయ్యా అనే పాట ఓ ఊపు ఊపేసింది. అయితే ఆ చిత్రం తర్వాత తమన్నాకు కొత్తగా అవకాశాలు ఏమీ లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తను మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం తమిళంలో అరణ్మణై- 4 చిత్రంతో పాటు మలయాళం, హిందీలోనూ చిత్రాలు చేస్తోంది. ఈ మిల్కీ బ్యూటీకి అవకాశాలు తగ్గాయేమో గాని తమన్నా ఆదాయం ఆర్జించడంలో ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపారంగంలో దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డాన్స్ చేస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తోంది. కాగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఏ ఒక్కటి అయినా మంచి విజయం సాధిస్తే తమన్నాకు మళ్లీ అవకాశాలు రావడం ఖాయం. మరోపక్క ఈమె తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. -
శారీలో నమ్రతా శిరోద్కర్.. దేవకన్యలా దివి.. నదిలో మాళవిక!
►శారీలో నమ్రతా శిరోద్కర్ హోయలు ►వైట్ డ్రెస్సులో దేవకన్యలా దిగొచ్చిన దివి ►నదిలో చిల్ అవుతోన్న మాళవిక మోహనన్ ►గ్రీన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా పోజులు ►సంప్రదాయంగా ముస్తాబైన అత్తారింటికీ దారేది భామ ►ది కేరళ స్టోరీ భామ ఆదా శర్మ అదిరిపోయే లుక్స్ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు ఇటీవలే నటిగా 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నట జీవితం చాలా సంతృప్తిగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఒక్క పాట, రెండు సన్నివేశాల్లో నటించి చిత్రానంతా ఆక్రమించేసిందనే చెప్పాలి. దీంతో కెరీర్ గ్రాఫ్ పడిపోతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో జైలర్ చిత్రంలోని నువ్వు కావాలయ్యా.. పాట తమన్నాను ఒక్కసారిగా మళ్లీ ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!) అయితే పెళ్లిని కూడా వాయిదా వేసుకునే పరిస్థితికి తీసుకెళ్లిందనే భావన తమన్నా మాటల్లో వ్యక్తం అవుతోంది. ఈమె బాలీవుడ్ నటుడు విజయ వర్మ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగానే వెల్లడించింది. వీరిద్దరూ ఇప్పటికే చెట్టా, పట్టాలేసుకొని తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లి ఎప్పుడు అని ఓ ఒక ఇంటర్వ్యూలో తమన్నాకు ప్రశ్న ఎదురైంది. దీనిపై మాట్లాడుతూ..' వివాహ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. ఒక దశలో వివాహం చేసుకోవాలని భావించా. అయితే ప్రస్తుతం అలాంటి మానసిక స్థితి లేదు. నటన జీవితం ప్రస్తుతం బాగా సాగుతోంది. దీంతో దానిపై మాత్రమే దృష్టి సారించా. వైవిధ్య భరిత కథలో నటించే అవకాశాలు వస్తున్నాయని అలాంటి వాటిని ఆనందంగా అంగీకరిస్తున్నా. షూటింగ్ స్పాటే ప్రస్తుతం తనకు ఆనందాన్ని ఇచ్చే ప్రాంతం'. అని తెలిపింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని కాబట్టి.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని నటి తమన్న స్పష్టం చేసింది. (ఇది చదవండి: 1980ల్లో స్టార్ హీరోయిన్.. మద్యానికి బానిసై కెరీర్ నాశనం!) -
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్‌లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్‌జోన్ దాటి చాలా ఎమోషన్స్‌తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించగా.. ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఏకంగా రూ.52 కోట్లు రాబట్టింది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో రిలీజ్ రోజే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా.. తాజాగా మరో కంపెనీ ముందడుగేసింది. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి!) తాజాగా ర్యాపిడో సంస్థ రజినీకాంత్‌పై తమ అభిమానాన్ని చాటుకుంది. ముఖ్యమైన నగరాల్లో బైక్, ఆటో ట్యాక్సీ సేవలు అందించే ర్యాపిడో సంస్థ తమ డ్రైవర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ర్యాపిడో ఆటో ట్యాక్సీ సేవలు అందించే కెప్టెన్స్ కోసం జైలర్ ప్రత్యేక షో వేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ర్యాపిడో సంస్థ స్వయంగా ప్రకటించింది. చెన్నైలో ఆగస్టు 12న కృష్ణవేణి థియేటర్లో కేవలం వారి కోసమే ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిపింది. సంస్థ నిర్ణయంతో 500కు పైగా ర్యాపిడో ఆటో డ్రైవర్లకు తమ అభిమాన హీరో తలైవా జైలర్ చిత్రాన్ని చూసే అవకాశం దక్కింది. సంస్థ నిర్ణయం పట్ల ర్యాపిడో కెప్టెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వారి సేవలను కొనియాడారు. కాగా.. జైలర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ భారీగా బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాపిడో సంస్థ వారి కోసం ప్రత్యేక షో వేయనుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: జైలర్ కోసం జపాన్ నుంచి అభిమానులు) -
వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది.. కానీ: హీరోయిన్‌పై మెగాస్టార్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీ అయిపోయింది చిత్రబృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మెగాస్టార్.. తమన్నా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. అదేంటో ఓసారి తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి ) చిరంజీవి మాట్లాడుతూ..'భోళా శంకర్‌లో మిల్కీబ్యూటీ అనే సాంగ్ ఉంది. ఇది స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించాం.దాదాపు రెండు వారాలు షూటింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో తమన్నా ఫాదర్‌కు సర్జరీ జరిగిందని విన్నా. ఆ సమయంలో కూడా తమన్నా వెళ్లలేదు. కెమెరా ముందుకు వచ్చి డాన్స్ వేయడం.. అంతలోనే కెమెరా వెనక్కి వెళ్లి ఫోన్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని సూచించింది. తనకి బాధను దిగమింగుకుని డాన్స్ చేస్తుంటే సినిమాపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.' అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సైతం తమన్నాను అభినందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి మహతి స్వర సాగర సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?) -
తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రస్తుతం ఆమె నటించిన భోళాశంకర్, జైలర్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ కావాలయ్యా అంటూ అభిమానలను ఓ రేంజ్లో ఊపేస్తోంది ముద్దుగుమ్మ. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సావానికి వెళ్లిన భామకు అభిమానుల తాకిడి ఎదురైంది. (ఇది చదవండి: థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!) కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లగా తమన్నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉండగా.. వారందరినీ తప్పించుకుని ఏకంగా తమన్నా చేయిని పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై అతన్ని పక్కకు లాగేశారు. అయితే అభిమాని అత్యుత్సాహాన్ని గమనించిన మిల్కీ బ్యూటీ బౌన్సర్లకు నచ్చజెప్పి.. అభిమానితో నవ్వుతూ సెల్పీ దిగింది. మరీ మిల్కీ బ్యూటీ అభిమానులంటే ఆ మాత్రం ఉంటది అంటున్నారు నెటిజన్స్. కాగా.. రజినీకాంత్ సరసన తమన్నా నటించిన జైలర్ ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే మెగాస్టార్ భోళాశంకర్ సైతం ఈనెల 11వ తేదీన రిలీజ్ కానుంది. (ఇది చదవండి: మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా) Bouncers try to stop fan from getting near #Tamannaah but she says #Kaavaalaa and gracefully poses for a selfie sending the fan to cloud nine #KaavaalaaStorms100MViews Get ready to witness @tamannaahspeaks magic on big screens #JailerFromAugust10th 😍😍pic.twitter.com/cnt4N9ZFsh — moviememesmedia (@moviememesmedi1) August 6, 2023 -
'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సునీల్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, జాకీష్రాప్, శాండల్‌వుడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, యోగిబాబు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ట్రైలర్ చూస్తే జైలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే కాల్పులు, బాంబు మోతలతో దద్దరిల్లింది. 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే' అనే రజినీకాంత్ డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా జైలర్ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఇకపోతే సాధారణంగా చిత్రాల్లో హీరోలకు ఇంట్రో సాంగ్ ఉంటుంది. అయితే జైలర్ చిత్రంలో నటి తమన్న ఇంట్రో సాంగ్‌లో మెరవబోతుండటం విశేషం. తమన్నా సాంగ్ కచ్చితంగా జైలర్ చిత్రానికి ప్రత్యేక తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (ఇది చదవండి: 'జైలర్'పై నో బజ్.. వ్యాపారం కూడా అలానే!) -
'ఇంకా లేటెందుకు.. త్వరగా పెళ్లి చేసుకోండి'.. మిల్కీ బ్యూటీకి నెటిజన్స్ సలహా!
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ కలిసి నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ జంట పీకల్లోతు ప్రేమలో ఉన్నట్ తెలుస్తోంది. ఇటీవలే విజయ్ సైతం బహిరంగంగానే చెప్పాడు. తామిద్దరూ డేటింగ్లో ఉన్నామని ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందన్నాడు. (ఇది చదవండి: ఇది నాకు మరో జన్మ.. అస్సలు భయపడను: సుస్మితా సేన్) అయితే తాజాగా ఈ ప్రేమజంట ముంబయిలో తళుక్కున మెరిశారు. ఈ లవ్‌బర్డ్స్‌ను ఒకరినొకరు చేతులు పట్టుకుని కెమెరాల కంటికి చిక్కారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట కారులో వెళ్తూ చాలా ఉత్సాహంగా అభిమానులను పలకరించారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ జంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఒక అభిమాని రాస్తూ.. "మీ జంట చాలా ఫర్ఫెక్ట్గా కనిపిస్తోంది. దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి అని రాయగా.. మరొకరు వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్స్ రాస్తూ ఈ జంట చాలా అందంగా కనిపిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. గత కొంతకాలంగా డేటింగ్లో ఈ జంట తొలిసారిగా లస్ట్ స్టోరీస్- 2లో కలిసి నటించారు. కాగా.. ఇటీవలే ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ.. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నానని తమన్నాతో రిలేషన్‌షిప్‌పై మాట్లాడారు. ఆమె రాకతో తన జీవితంలో విలన్ దశ ముగిసిపోవడమే కాకుండా రొమాంటిక్ దశ మొదలైందని చెప్పాడు. తమన్నా భాటియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలపై విజయ్ వర్మ పలు విషయాలు వెల్లడించాడు. (ఇది చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి ) కాగా.. సినిమాల విషయానికొస్తే.. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం జైలర్‌లో రజనీకాంత్ సరసన నటిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణన్, యోగి బాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ వర్మ ఇటీవలే శ్వేతా త్రిపాఠి శర్మ సరసన కల్కూట్లో కనిపించాడు. సుమిత్ సక్సేనా దర్శకత్వం వహించిన కాల్‌కూట్‌లో యశ్పాల్ శర్మ, గోపాల్ దత్, సీమా బిస్వాస్ కూడా నటించారు. ఆ తర్వాత సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్‌లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by HT City (@htcity) View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా
బాలీవుడ్ వరుస వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ తమన్నా ఓటీటీని షేక్ చేస్తోంది. అత్యంత శృంగార సన్నివేశాల్లో నటిస్తూ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రిలీజైన జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2లో తమన్నా తన రొమాంటిక్ సీన్లతో ఓ రేంజ్లో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్‌లో నటిస్తోన్న భామ.. వెబ్ సిరీస్‌ల్లో మరింత బోల్డ్ కనిపించింది. దీంతో తమన్నాపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ ఎందుకు చేస్తున్నారంటూ మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే గతంలో ఎంసీఏ విలన్ విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సమయంలోనే తాము ప్రేమలో పడ్డామని తెలిపింది. ఇటీవల ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!) తమన్నా మాట్లాడుతూ.. 'విజయ్ వర్మకు స్త్రీలంటే చాలా గౌరవం. అతను నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే నేను అతన్ని ప్రేమించా. తన కుటుంబ సభ్యులపై ప్రేమాభిమానులు ఎక్కువే. ఇంట్లో వాళ్లను గౌరవించేవారు.. బయటి వారితో అలాగే ఉంటారని నమ్ముతా. ఇతరులను గౌరవించడం నేటి యువత నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీపడాలనే భావనను అంగీకరించను.' అని అన్నారు. అయితే తన వెబ్ సిరీస్‌లపై వస్తున్న విమర్శలపై తమన్నా స్పందించారు. తమన్నా మాట్లాడుతూ.. 'ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తారనుకోలేదు. ఇలా విమర్శలు చేస్తారని ఊహించలేదు. హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ప్రశంసిస్తారు. వారిని ఏమి అనరు. కానీ హీరోయిన్స్ నటిస్తే మాత్రం విమర్శలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం నాకర్థం కావడం లేదు. కెరీర్లో ఎదగాలంటే మన నిర్ణయాలను మార్చుకోవాలి. అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. (ఇది చదవండి: ప్రముఖ యూట్యూబర్‌కు ప్రాణాంతక వ్యాధి.. ఇంతకీ ఏమైందంటే?) -
వైట్ శారీలో కాబోయే మెగా కోడలు.. మిల్కీ బ్యూటీ హాట్ పోజులు!
►వైట్ శారీలో కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి లుక్స్! ►లస్ట్ స్టోరీస్-2 భామ తమన్నా హాట్ పోజులు! ►గురు పౌర్ణమి వేడుకల్లో పూనమ్ బజ్వా ►లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సీనియర్ నటి మధుబాల View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Madhoo Shah (@madhoo_rockstar) -
'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)
టైటిల్: లస్ట్ స్టోరీస్ 2 నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ ఎడిటర్: సన్యుక్త కజా ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీ: 29 జూన్ 2023 ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) కథేంటి? ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది. మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు. 'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు. (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) 'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. 'టిల్చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరెలా చేశారు? మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
'అలాంటి సీన్స్ చేస్తున్నందుకు సిగ్గు పడుతున్నాం'.. తమన్నాపై నెటిజన్స్ ఫైర్!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే 'జీ కర్దా' సిరీస్‌తో ఫుల్ రొమాంటిక్ సీన్స్‌తో నటించిన ముద్దుగుమ్మ.. మరోసారి లస్ట్ స్టోరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా.. తమన్నా ఈసారి మరింత బోల్డ్ సీన్స్‌లో నటించినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోను రిలీజ్ చేసింది తమన్నా. అందులో తమన్నా మాట్లాడుతూ.. ఇందులో అమ్మ, నాన్నతో పాటు అందరి ప్రేమ ఉంది. లస్ట్ స్టోరీస్ జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌కు రాబోతోంది' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రోమో ప్రారంభంలోనే తమన్నా.. విజయ్‌తో బోల్ట్ సీన్‌ను చూపించారు. అందులో తమన్నా ముద్దుపెడుతున్న సీన్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇప్పటి వరకు తమన్నా ఇలాంటి సీన్స్ చూడలేదని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో మీరు 'భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు' అంటూ కామెంట్స్ చేశారు. 'నిన్ను ఇలా చూస్తున్నందుకు సిగ్గు పడుతున్నాం' అంటూ పోస్ట్ చేశాడు. మీరు సీ గ్రేడ్ నటులతో ఇలాంటి సీన్స్ ఎలా చేస్తారంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. మరొకరు రాస్తూ.. 'తమన్నా దయచేసి కోలీవుడ్, టాలీవుడ్‌కి తిరిగి వచ్చేయండి' విజ్ఞప్తి చేయగా.. ఇలాంటి వాటితో మీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతోందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కాగా.. లస్ట్ స్టోరీస్-2 ఈనెల 29న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. (ఇది చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు విజయ వర్మతో ప్రేమ వ్యవహారం నిజమేనని తను ఎప్పుడైతే ఒప్పుకుందో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. విజయ్ వర్మ విషయంలో తన నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నా మరికొందరు తనకు సపోర్టుగా నిలుస్తాన్నారు. దీంతో తమన్నాకు ఎక్కడికెళ్లిన అభిమానుల తాకిడి ఎక్కువైంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఒక అభిమానితో తమన్నా చాలా క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయ్యింది. (ఇదీ చదవండి: మొబైల్‌తో ఇబ్బంది పడుతున్నాను.. ఆషూ రెడ్డి వీడియో విడుదల) దీంతో ఆ అభిమాని భావోద్వేగానికి గురయ్యారు. తమన్నాను కలిసిన తర్వాత ఆ వ్యక్తి ఆమె పాదాలను తాకారు. అనంతరం ఒక బొకేతో పాటు లేఖను కూడా మిల్కీ బ్యూటీకి ఇచ్చారు. అపై తన చేతిపై పచ్చబొట్టు కూడా చూపించడంతో తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. టాటూలో 'లవ్ యు ది తమన్నా' అనే పదంతో పాటు తమ్ము ఫోటోను అభిమానంతో వేపించుకున్నారు. అనంతరం ఆ అభిమానిని తమన్నా కౌగిలించుకుని చాలాసార్లు 'ధన్యవాదాలు' అని చెప్తూనే కారులోకి వెళ్లింది. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు) అభిమానుల స్పందన అయ్యో ఈ వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది. అభిమానుల పట్ల తమన్నా చూపించే ప్రేమ ఎలా ఉంటుందో.. ఈ వీడియో చూస్తే చాలంటూ ఒక ఫ్యాన్ కామెంట్ చేశాడు. తను బంగారం లాంటి వ్యక్తి 13 ఏళ్లుగా తెలుసు.. అభిమానులను చాలా గౌరవంగా భావింస్తుంది అంటూ తమన్నాను పలు అభినందనీయమైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఫస్ట్ డే షూట్ రద్దు.. విజయ్ ఇంకేదో అనుకున్నాడు: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ జంటగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ జంట సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తమన్నా, విజయ్ వర్మ రొమాంటిక్ సీన్స్ మరింత బోల్డ్‌గా ఉన్నాయంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. (ఇది చదవండి: హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!) ప్రస్తుతం లస్ట్ స్టోరీస్-2 ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సిరీస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా లస్ట్ స్టోరీస్-2 లో మొదటి రోజు షూటింగ్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో తమన్నా భాటియా వెల్లడించింది. అంతే కాకుండా విజయ్ వర్మ ఫస్ట్ ఇంప్రేషన్పై నోరు విప్పింది. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో షూటింగ్‌కి హాజరు కాలేకపోయానని తమన్నా తెలిపింది. అయితే విజయ్ వర్మ మాత్రం తాను ఈ సిరీస్ పట్ల భయంగా ఉన్నట్లు భావించాడని పేర్కొంది. తమన్నా మాట్లాడుతూ.. 'తాను ఏడెనిమిది రోజులు షూట్ చేశా. కానీ ఇది చాలా కఠినంగా అనిపించింది. మొదటి రోజు షూట్‌ను రద్దు చేసుకున్నప్పుడు ఈ సిరీస్ పట్ల తాను భయంగా, పిరికితనంగా ఉన్నట్లు విజయ్ భావించాడు. కానీ నేను ఓ పవర్ఫుల్ నటుడితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని భావించా. అంతే కాదు విజయ్ కూడా ఓ ఊసరవెల్లి. తనకు నిర్ధిష్టమైన పాత్ర కోసం ఎలాగైనా మారతాడు. నేను అతని పనిని గతంలో కూడా చూశా. .' అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, అమృత శుభాష్, అంగద్ బేడీ, కుముద్ మిశ్రా, తిల్లోతమా షోమే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్‌ను కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, అమిత్ రవీందర్నాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఈనెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సిరీస్‌లోనే తమన్నా, విజయ్ ప్రేమలో పడ్డారు. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు) -
తమన్నా ఫోటోకు నెటిజన్ రిప్లై.. స్పందించిన విజయ్ వర్మ!
మిల్కీ బ్యూటీ తమన్నా, విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో గోవాలో కనిపించిన జంట.. ఆ తర్వాత చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా.. విజయ్‌తో ఉన్న బంధం గురించి తొలిసారి నోరు విప్పారు. విజయ్‌తో లవ్‌లో ఉన్నానని తమన్నా ప్రకటించారు. ఆ తర్వాత విజయ్ వర్మ సైతం తమన్నాతో రిలేషన్ నిజమేనని వెల్లడించారు. (ఇది చదవండి: Video: డెలివరీ డేట్ ఫిక్స్...ఆసుపత్రికి ఉపాసన!) తాజాగా వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఫోటోషూట్ నిర్వహించారు. ఆ ఫొటోలను తమన్నా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరలయ్యాయి. ఇవీ చూసిన ఓ నెటిజన్ ' అన్నీ తమన్నానే.. విజయ్ కేవలం ఓ నటుడు' మాత్రమే అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన విజయ్ వర్మ.. 'మీ మాటలను అంగీకరిస్తున్నా.. నాకు అన్నీ తమన్నానే' అంటూ రిప్లై ఇచ్చారు. విజయ్ ట్వీట్ చూసిన తమన్నా కూడా రిప్లై ఇస్తూ ఎమోజీలను జత చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్2 జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. దీని ప్రమోషన్స్ కోసం ఈ ప్రేమజంట ప్రత్యేక ఫొటోషూట్ చేసింది. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) I kinda agree https://t.co/4SsbMUuJEl — Vijay Varma (@MrVijayVarma) June 19, 2023 -
ఎంతో కష్టపడ్డా.. అయినా బాహుబలితో అంత గుర్తింపు రాలేదు
పాన్ ఇండియా సినిమాలో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇటువంటి సినిమాలు క్లిక్ అయితే కథానాయకులు పాన్ ఇండియా హీరోలైపోతారు. మరి హీరోయిన్స్? వారికి కూడా పేరొస్తుంది కానీ హీరోకు వచ్చినంత గుర్తింపు మాత్రం రాదు. ఇదే విషయాన్ని కుండ బద్ధలు కొట్టి చెప్తోంది తమన్నా భాటియా. 'యాక్షన్ చిత్రాల్లో క్రెడిట్ అంతా హీరోలకే ఇస్తారు. బాహుబలి సినిమా క్రెడిట్ అంతా ప్రభాస్, రానాల ఖాతాలోకే వెళ్లిపోయింది. వాళ్లు కష్టపడ్డారు కాబట్టి ఆ క్రెడిట్ వారికి దక్కడం నాకు సమంజసంగానే అనిపించింది. ఈ సినిమా కోసం నేనెంతో కష్టపడ్డాను. కానీ నాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇందులో నా రోల్ అతిథి పాత్రలాగే ఉండిపోయింది' అని చెప్పుకొచ్చింది తమన్నా. కాగా బాహుబలి చిత్రంలో తమన్నా అవంతిక పాత్రలో మెరిసింది. మొదటి భాగంలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ రెండో భాగంలో మాత్రం తక్కువ నిడివికే పరిమితమైంది. ఇదిలా ఉంటే తన లవ్ లైఫ్‌పై మిల్కీ బ్యూటీ నోరు విప్పిన సంగతి తెలిసిందే! నటుడు విజయ్ వర్మతో లవ్‌లో ఉన్నట్లు ఒప్పేసుకుంది. 'విజయ్ వర్మతో నా బంధం చాలా సహజంగా మొదలైంది, ఇలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురుచూశాను. జీవిత భాగస్వామిని పొందాలంటే అతను ఉన్న చోటుకి వెళ్లాలి.. లేదా అతన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మసులుకోవాలి. కానీ నేను నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నేనేం చేయకుండానే ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి (విజయ్ వర్మను ఉద్దేశించి) దొరికాడు. అతడు చాలా కేర్ తీసుకునే వ్యక్తి. అతను ఉన్న చోటు నాకు ఆనందంగా ఉంటుంది' అని పేర్కొంది. విజయ్, తమన్నా లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. ఈ ఆంథాలజీ షూటింగ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడి ఉండొచ్చని తెలుస్తోంది. చదవండి: రెండుసార్లు పెళ్లి, విడాకులు.. ముచ్చటగా మూడోసారి లవ్‌లో పడ్డ బిగ్‌బాస్ బ్యూటీ -
తమన్నా ఏంటీ ఇలా?.. డబ్బుల కోసమే అలాంటి సీన్స్ చేస్తోందా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోశాశంకర్లో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపించనుంది. జీ కర్ధా, లస్ట్ స్టోరీస్-2 సిరీస్‌ల్లో నటించింది. వీటితో పాటు రజనీకాంత్‌తో కలిసి నటించిన జైలర్, అరణ్మణై–4, మలయాళం చిత్రం బాంద్రా, హిందీ చిత్రం బోల్ చుడియన్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. అయితే తమన్నా నటించిన వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) ఇటీవల రిలీజైన జీ కర్దా వెబ్ సిరీస్ ట్రైలర్లో తమన్నా మీతిమీరిన రొమాంటిక్ సీన్స్‌లో నటించడంపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్లో బెడ్ రూమ్ సీన్లలో నటించిందా అంటూ షాకవుతున్నారు. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న లస్ట్ స్టోరీస్-2 వెబ్ సీరిస్‌లోనూ బోల్డ్ సీన్స్‌లో నటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ అడల్ట్ సీరిస్‌ల్లో నటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా తమన్నా ఆర్థికంగా దివాళా తీసిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ తారలపై ఎప్పుడు విమర్శలు విరుచుకుపడుతూ.. తనకు తానుగా సినీ క్రిటిక్‌గా ఫీలయ్యే ఉమైర్ సంధు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సన్నిలియోన్ స్థానాన్ని తమన్నా భర్తీ చేస్తోందంటూ వివాదస్పద ట్వీట్ చేశారు. 40 ఏళ్ల వయసులో గుర్తింపు కోసమే అన్ని హద్దులు చేరిపేసిందంటూ ఉమైర్ సంధు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: రామాలయానికి 100 టిక్కెట్లు ఉచితం) #TamannaahBhatia is the New “ Sunny Leone ” in India 🇮🇳 now. She is the Most Trending “ Naked Actress ” in Last 2 days. In her 40 age, She is crossing all limits to back in Position. As per insiders, she became bankrupt in Covid ! pic.twitter.com/aVOt2RmY87 — Umair Sandhu (@UmairSandu) June 9, 2023 View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
ఆవారా సీక్వెల్ లో నటిస్తున్న కార్తీ
-
అట్టహాసంగా ఐపీఎల్.. స్టేడియాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్
ఐపీఎల్-2023 సందడి గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఆరంభ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా వేదికపై మెరిశారు. టాలీవుడ్ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ స్టేడియాన్ని ఊర్రూతలూగించారు. 'ఊ అంటావా మావ' అంటోన్న తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా ఐపీఎల్ వేదికపై అదరగొట్టింది. పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ స్టేడియాన్ని హోరెత్తించింది. ఈ పాటకు అభిమానులు మొత్త స్టేడియంలో పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయారు. 𝘿𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧!@tamannaahspeaks sets the stage on 🔥🔥 with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C — IndianPremierLeague (@IPL) March 31, 2023 నాటు నాటు సాంగ్‌తో రష్మిక మందన్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఐపీఎల్ వేదికపై దుమ్మురేపింది. పుష్ప సినిమాలోని 'సామి సామి', శ్రీవల్లి పాటలతో సహా.. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు అంటూ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్-2023 వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. Sound 🔛@iamRashmika gets the crowd going with an energetic performance 💥 Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony 👇 pic.twitter.com/EY9yVAnSMN — IndianPremierLeague (@IPL) March 31, 2023 -
మెగా ఫ్యాన్స్‌కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!
Bhola Shankar Movie Release Date: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. భోళాశంకర్ మూవీని ఆగస్టు 11, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. తెలుగు నూతన ఏడాది సందర్భంగా మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. This Telugu NEW YEAR Begins in Advance with a MEGA upDATE 😎 Mega🌟@KChiruTweets #BholaaShankar 🔱 Releasing WorldWide In Theatres on AUG 11th 2023 ❤️🔥#HappyUgadi @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanth @AKentsOfficial @adityamusic pic.twitter.com/ksqeqldaiA — AK Entertainments (@AKentsOfficial) March 21, 2023 -
అప్పటి నుంచే నాపై రూమర్స్.. డేటింగ్‌పై నోరు విప్పిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. ఇటీవల జరిగిన లక్మీ ఫ్యాషన్ షోలో తళుక్కున మెరిసింది. పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్న ఈ షోలో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ పరంగా తన అభిరుచులను అభిమానులతో పంచుకుంది. తన ఫ్యాషన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది మిల్కీ బ్యూటీ. అలాగే డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది తమన్నా. అలా ఉండేందుకు ఇష్టపడతా తమన్నా మాట్లాడుతూ.. 'ఎప్పుడూ క్యాజువల్ దుస్తుల్లో ఉండడానికి ఇష్టపడతా. తనకు కంఫర్ట్‌గా ఉండే దుస్తులే ధరిస్తా. నా జుట్టు అంటే చాలా ఇష్టం. దాని కోసం ఎక్కువ కాస్మోటిక్స్ వాడను. ఎప్పుడూ సహజంగా ఉండేలా చూసుకుంటా. అందుకోసం ఉల్లిపాయ రసాన్ని వాడతాను.' అంటూ మిల్కీ బ్యూటీ తన అందం సీక్రెట్ చెప్పేసింది. విజయ్ వర్మతో డేటింగ్ అయితే గతంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో పెద్దఎత్తున గాసిప్స్ గుప్పుమన్నాయి. విజయ్ వర్మతో రిలేషన్‌పై కాస్త ఘాటుగానే స్పందించింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో విజయ్ వర్మకు తమన్నా ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. డేటింగ్ వార్తలపై తమన్నా మాట్లాడుతూ.. 'మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. అప్పటి నుంచే మాపై రూమర్స్ తీసుకొచ్చారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది తమన్నా. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్‌లో కనిపించనుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి జైలర్‌లో నటిస్తోంది. -
మేమిద్దరం కలిసి ఓ సినిమా చేశాం, మా పెళ్లి చేశారు!: తమన్నా
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది తమన్నా. 'మేమిద్దరం(విజయ్ను ఉద్దేశిస్తూ..) కలిసి ఓ సినిమా చేశాం. అప్పటినుంచి మా రిలేషన్షిప్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఈ అంశంపై నేను ఇంతకుమించి చెప్పాల్సిన విషయాలు కూడా ఏమీ లేవు. అయినా హీరోయిన్స్ గురించి ఇలాంటి అవాస్తవాలు ఎలా తెరపైకి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ నుంచి బిజినెస్మెన్ వరకు నాకు తెలియకుండానే కొందరు ఇప్పటికే నా పెళ్లి చాలాసార్లు చేశారు(వ్యంగ్యంగా)' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా రజనీకాంత్ జైలర్, చిరంజీవి భోళా శంకర్ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే! -
Lakme Fashion Week 2023: తారల తళుకులు.. ర్యాంప్‌పై ఫ్యాషన్ మెరుపులు (ఫొటోలు)
-
నాటి బుజ్జి పాపాయిలే.. నేటి స్టార్ హీరోయిన్లు (ఫొటోలు)
-
విజయనగరంలో మిల్కీబ్యూటీ సందడి (ఫొటోలు)
-
గతేడాది మూడు ఫ్లాపులు.. అయినా తమన్నాకు బంపరాఫర్!
ఊహించని మంచి సంఘటనలు జరిగినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు హీరోయిన్ తమన్నా అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. అతి తక్కువ మంది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఈ మిల్కీబ్యూటీ ఒకరు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న తమన్నా త్వరలో పెళ్లి ముచ్చట్లు చెప్పడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వయా టాలీవుడ్ అంటూ నట ప్రయాణాన్ని సాగిస్తున్న ఈ బ్యూటీ నటిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. గత ఏడాది తమన్నా నటించిన నాలుగు చిత్రాల్లో మూడు నిరాశ పరిచినా, ఈమెపై ఆ ఎఫెక్ట్ పడకపోవడం విశేషం. ప్రస్తుతం భాషకో చిత్రం చేస్తూ బిజీగానే ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అందులో రెండు చిత్రాలు సూపర్‌స్టార్స్‌తో నటించడం. అవును తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళ చిత్రం వేదాళంకు రీమేక్. తమిళంలో రజనీకాంత్‌కు జంటగా జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే ఆమెను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్న విషయం. చిరంజీవితో ఇంతకు ముందే సైరా చిత్రంలో నటించారు. దీంతో భోళాశంకర్ చిత్రంలో రెండో సారి నటిస్తున్నారు కాబట్టి పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. కానీ రజనీకాంత్‌తో తొలిసారిగా నటించే అవకాశం రావడంతో ఆనంద సాగరంలో తేలిపోతున్నారు. దీని గురించి తమన్నా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ రజనీకాంత్ సరసన నటిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తనలాంటి ఎందరో నటీమణులు రజనీకాంత్‌కు జంటగా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుండగా జైలర్ చిత్రంలో ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు లభించిందన్నారు. షూటింగ్లో రజనీకాంత్‌తో కలిసి నటించే సమయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. తలచుకుంటుంటేనే చాలా గర్వంగా ఉందన్నారు. అలాగే రెండోసారి చిరంజీవితో నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. వీటితో పాటు హిందీలో బోల్ చుడియా, మలయాళంలో పాందిరా చిత్రాల్లో నటిస్తున్నారు. మరి ఈ ఏడాదైనా తమన్నాకు కలిసొస్తుందేమో చూడాలి. చదవండి: ఎన్టీఆర్ సినిమాతో జాన్వీకపూర్ ఎంట్రీ! -
మనసు మార్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా
-
ఆధ్మాత్మిక సేవలో తరిస్తున్న తమన్నా, వీడియో..
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి తమన్నా భాటియా. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందింది. ఇటీవల బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాలు చేసింది. వాటిలో పేరు వచ్చినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. దక్షిణాదిలోనూ ఒకటీ, అర చిత్రాల్లో నటిస్తున్నా అదే పరిస్థితి. ఇటీవల తనకూ ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ అతనితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లోకి ఎక్కింది. ఈమెకు ఇప్పుడు పెళ్లిపై దృష్టి మళ్లినట్లు కనిపిస్తోంది. కారణం ఇటీవల ఎక్కువగా ఆలయాలు తిరుగుతూ.. పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక బాట పట్టింది. షూటింగ్‌లు లేని సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటోంది. కొన్ని నెలల క్రితం హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ధి చెందిన వైష్ణవి దేవి ఆలయంలో విశేష పూజలు నిర్వహించింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా ఈశా యోగా ప్రాంగణానికి కాషాయ దుస్తుల్లో వెళ్లి అక్కడ లింగభైరవి దేవిని దర్శించుకుంది. దీని గురించి ఆమె ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఈశా యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడంతో ఎంతో సంతోషానికి గురయ్యారని చెప్పింది. లింగ భైరవి దేవిని దర్శించుకోవడం ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించిందని పేర్కొంది. అంతేకాకుండా జీవితంలో భయం, అపజయాల గురించి ఆందోళన దూరమవుతోందని చెప్పింది. లింగభైరవి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తానని పేర్కొంది. అక్కడి పరిసరాలు, లింగ భైరవి మూర్తీభం చూడగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్లు పేర్కొంది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్, తమిళంలో రజనీకాంత్ సరసన జైలర్ చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: ఫుల్ ఖుషీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ -
తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. న్యూ ఇయర్ ఈవెంట్లో నటుడు విజయ వర్మను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన వీడియో బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సింగిల్‌గా ఉంటూ ఇప్పటివరకు రూమర్లకు దూరంగా ఉన్న తమన్నా తాజాగా విజయ్ వర్మతో డేటింగ్ గాసిప్స్‌తో వార్తల్లోకెక్కింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. ఈ వార్తల్లో నిజమెంతుంది, తమన్నా నిజంగానే విజయ్ వర్మతో రిలేషన్లో ఉందా? అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో తమన్నాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటిగా ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. దశాబ్ద కాలంపైనే సినీ రంగంలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె 2007లో హ్యాపీడేస్ మూవీతో తొలి సక్సెస్‌ను అందుకుంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. ఇటివల ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దానికి విలువ దాదాపు రూ. 16 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆమె పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన విషయం తెలిసిందే. పలు శారీ షోరూంలతో పాటు ఫాంటా, ఫ్రూటీ, సెల్కాన్ వంటి పలు బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తుంది. ఈ ప్రకటనల ద్వారా ఆమె ఏడాది మొత్తం రూ. 12 కోట్లు అర్జీస్తుందట. ఈ లెక్కన నెలకు తమన్నా ఒక కోటి సంపాదిస్తుందన్నమాట. ఇలా ఇప్పటి వరకు తమన్నా సంపాదించిన మొత్తం ఆస్తి విలువ రూ. 110 కోట్లుపైనే ఉంటుందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఒక్క చిత్రానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇక స్పెషల్ సాంగ్స్‌కు అయితే రూ. 50 లక్షలు నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తుందట. ఇదిలా ఉంటే తమన్నా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది. 2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక డైమండ్ జువెల్లరి బ్రాండ్‌ను ప్రారంభించింది. అలాగే తమన్నా వద్ద రూ. 2 కోట్లు విలువ చేసిన అరుదైన వజ్రం ఉందట. దానిని మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సైరా నరసింహా రెడ్డి మూవీ సమయంలో తమన్నాకు బహుమతిగా ఇచ్చింది. అది ప్రపంచంలోనే 5వ అతి పెద్ద డైమండ్ అని వినికిడి. దీని బరువు సుమారుగా 62.4 గ్రాములు ఉంటుందట. వీటితో పాటు ఆమె గ్యారేజిలో విలువైన కార్ల కలెక్షన్స్ కూడా ఉన్నాయట. అందులో లాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్‌డబ్య్లూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఇక తమన్నా వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 3 లక్షలు పైచిలుకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా తమన్నా భారీగానే ఆస్తులు వెనకేసుకుంది. చదవండి: నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్ -
నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా
తన సినీ ప్రయాణం అందుకే అంత సంతోషంగా ఉందని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై తెలుగు, తమిళంలో అడుగుపెట్టిన ఆమె కెరీర్ మొదట్లో ఆశించిన విధంగా సాగలేదు. తెలుగులో తొలి చిత్రం శ్రీ, తమిళంలో నటించిన మొదటి చిత్రం కేడీ నిరాశపరిచాయి. ఆ తర్వాత తెలుగులో హ్యాపీ డేస్, కోలీవుడ్‌లో కల్లూరి చిత్రాలు తమన్నా సక్సెస్‌కు బాటలు వేశాయి. ఆ తర్వాత ఈ అమ్మడు అంచెలంచెలుగా ఎదిగి టాప్ హీరోయిన్లు ఒకరుగా రాణించారు. అయితే ఈ బ్యూటీ గ్లామర్‌నే నమ్ముకుంది. అదే వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాతనే నటిగా నిరూపించుకునే అవకాశాలు రావడం మొదలెట్టాయి. ముఖ్యంగా బాహుబలి, సైరా వంటి చిత్రాల్లో తమన్నా తన నటనా సత్తాను చాటుకునే అవకాశం కలిగింది. అయితే ప్రస్తుతం అంత క్రేజ్ లేకపోయినా అవకాశాలు మాత్రం వరిస్తూనే ఉన్నాయి. 2022లో ఈ అమ్మడు నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి అనే రెండు హిందీ చిత్రాలు, ఎఫ్ 3, గుర్తుందా సీతాకాలం అనే రెండు తెలుగు చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా తమన్నా తన సినీ ప్రయాణం గురించి ఒక భేటీలో పేర్కొంటూ ఏ రంగంలోనైనా మనం అనుకున్నది వెంటనే జరిగిపోదని, ఆ టైం వచ్చే వరకు ఎదురు చూడాలని పేర్కొంది. తనకు కూడా ప్రారంభ దశలో ఆశించిన అవకాశాలు లభించలేదని చెప్పింది. అయితే వచ్చిన అవకాశాలతోనే తన ప్రతిభను చాటుకునే దిశగా ప్రయత్నించానని చెప్పింది. అలా సక్సెస్ అందుకున్నానని చెప్పింది. తాను ఏం కావాలని భావించానో దాన్ని సాధించానంది. ఇప్పుడు తన సినీ పయనం చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని పేర్కొంది. అయితే ఈ అమ్మడు అంతకు ముందు సినీ రంగంలో మహిళలకు మర్యాదే లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. తను మాటలను పట్టించుకోరని, హీరోల కంటే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువేనని చెప్పింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోతే ఏవేవో కారణాలు చెబుతారని అదే హీరోయిన్లు అయితే విమర్శలు గుప్పిస్తారని పేర్కొంది. ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం విజయవర్మ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: దళపతి విజయ్‌పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు స్టేజ్‌పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్, వీడియో వైరల్ -
రొమాంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది. రీసెంట్గా గుర్తుందా శీతాకాలం మూవీతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా తమన్నా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటింది. ఈ సందర్భంగా రొమాంటిక్ సీన్లతో హీరోల బిహెవియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు హీరోలు బాగా ఎంజాయ్ చేస్తారని అందరు అనుకుంటారు. కానీ అది తప్పు. చాలామంది హీరోలు ఈ సీన్స్ చేసేందుకు ఇష్టపడరు. షూటింగ్ సమయంలో హీరోయిన్లు ఏం అనుకుంటారోనని చాలా టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా మోహమాటం ఎక్కువగా ఉన్న హీరోలు, స్టార్ హీరోలు అయితే ఈ సీన్స్ చేసేటప్పుడు కనీసం మాట్లాడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. మూవీ షూటింగ్ మొత్తంలో హీరోలు ఇబ్బంది పడేది సన్నిహిత సీన్లలోనే. అసలు చాలామంది హీరోలు.. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉండే సన్నివేశాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవి భోళా శంకర్ మూవీతో బిజీగా ఉంది. చదవండి: సూర్య ఇన్ని పాత్రల్లో నటిస్తున్నారా?.. ఇది పెద్ద రికార్డే..! ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. -
సుమ ఫెంటాస్టిక్ వీక్, పూజ రాక్ అండ్ రోల్, అనసూయ హుయలు
► ప్రేమలో పడ్డానంటున్న మేజర్ మూవీ బ్యూటీ ► ఫ్యాన్స్‌లో కోసం చీరలో దర్శనమిచ్చిన కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ► బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఫరియా హాట్ లుక్ ► పొట్టి డ్రెస్‌లో కవ్విస్తున్న ఇషా ► పూజా హెగ్డే రాక్ అండ్ రోల్ లుక్ ► పట్టు చీరలో ఆకట్టుకుంటున్న అను ఇమ్మాన్యూయేల్ ► హల్దీ వేడుకల ఫొటోలు షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Nikki Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు
హీరోయిన్ తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్వరలో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా ఇదేనంటూ కథనాలు అల్లుతున్నారు. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది తమన్నా. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది! దీంతో అది చూసి నెటిజన్లంత ఖంగుతిన్నారు. కొద్ది రోజులుగా వస్తున్న తన పెళ్లి రూమర్స్‌పై ఆమె స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ‘నా భర్తను పరిచయం చేస్తున్నా.. ఆ వ్యాపారవేత్త ఇతనే’ అంటూ వీడియోను పంచుకుంది. అయితే అందులో ఉన్నది తమన్నా అని తెలిసి అంతా షాకయ్యారు. కాగా గతంలో తమన్నా మగాడి వేషంలో చేసిన ఓ రీల్‌కు సంబంధించిన వీడియో ఇది. ‘ఎఫ్ 3’ మూవీ సమయంలో తీసుకున్న వీడియో ఇది. ఈ చిత్రంలో తమన్నా పలు సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమన్నా తీసుకున్న వీడియో క్లిప్‌ను ఇప్పుడు షేర్ చేసి తన పెళ్లి వార్తలను ఖండించింది. కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. -
తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో
‘డార్లింగ్’ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యుల్‌లో కూడా తిరిగ్గా ‘మిల్కీ బ్యూటీ’ తమన్నాతో కలిసి ప్రభాస్ చెస్ ఆడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఎంటాని ఆరా తీస్తున్నారు. చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’ మరోవైపు తమన్నా కూడా భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ చిత్రం షూటింగ్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి చెస్ ఆడటమేంటని అంతా షాక్ అవుతున్నారు. అయితే అది ఇప్పటి వీడియో కాదు. ప్రభాస్-తమన్నా జంటగా రెబల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో వీరిద్దరు సరదాగా చదరంగా ఆడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ చదరంగంలో ఎత్తులు ఎలా వేయాలో తమన్నాకు వివరిస్తూ కనిపించాడు. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? అంతేకాదు తన ఆటతో పాటు తమన్నా ఆటను కూడా తానే ఆడుతూ ఆమెకు చెస్ నేర్పిస్తున్న ఈ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ప్యాన్ ఒకరు బిహైండ్ ది సీన్స్ అంటూ ఈ త్రోబ్యాక్ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2012ay లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్-తమన్నా హీరోహీరోయిన్లుగా రెబల్ మూవీ తెరకెక్కింది. ఇందులో దివంగత నటుడు, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ప్రధాన పాత్ర పోషించారు. I also wanna learn chess ♟️ From .#Prabhas garu😁 Darling teaching .@tamannaahspeaks chess Rebel BTS rare unseen 🤩 pic.twitter.com/wJKzbYw5Tf — Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) November 2, 2022 -
ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో తమన్నా ఫ్యాన్స్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి ముఖ్య అతిథికి హాజరైన తమన్నా అక్కడ అభిమానులతో మాస్ స్టెప్పులేసింది. చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష! ఇటీవల చెన్నైలో ‘మెటా క్రియేటర్స్ డే’ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయిన తమన్నా.. తళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో ‘వాతీ కమింగ్’ సాంగ్ కి మాస్ స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ వేడుకకు హాజరైన ఓ నెటిజన్.. తమన్నా డ్యాన్స్ వీడియోని ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవల బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ చిత్రాలతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె నటించిన గుర్తుందా సీతాకాలం మూవీ విడుదల కావాల్సి ఉంది. చదవండి: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్ షాకింగ్ రియాక్షన్ .@tamannaahspeaks Vibes for #vaathicoming at #Metacreatorday event at Chennai. pic.twitter.com/lPuZn7ON4F — Abєєѕ (@AbeesVJ) October 27, 2022 -
‘జైలర్’లో తమన్నా పాత్ర అలా ఉంటుంది!
ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట జైలర్. అన్నాత్తే తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో జైలర్ చిత్రం రజనీకాంత్ అభిమానులను కాస్త సంకటంలో పడేయటానికి కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ అయితే తలైవా ఈసారి పక్కా మాస్ చూపించబోతున్నారని, చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసిన తరువాత ఆ నమ్మకం కలుగుతోందని అభిమానులు చెబుతున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పుడే మొదలైంది. చిత్రంలో రజనీకాంత్‌తో పాటు ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్, శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయన రెండు పాత్రలను దర్శకుడు కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ లేకపోతే ఇందులో రజనీకాంత్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. చిత్రంలో తమన్నా నటిస్తున్న పాత్ర చిన్న పాత్రేనని తాజా సమాచారం. ఇంకా చెప్పాలంటే పేట చిత్రంలో త్రిష పాత్ర మాదిరి జైలర్ చిత్రంలో తమన్నా అప్పుడప్పుడు వచ్చి కనిపించి మెరిపిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన నటిని చూడబోతున్నామని సంబరం పడే తమన్నా అభిమానులకు మాత్రం ఇది నిరాశపరిచే అంశం అవుతుంది. -
స్టేజ్‌పై తమన్నా తీరుకు సౌత్ ఫ్యాన్స్ ఫిదా, ఏం చేసిందంటే..
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఓ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో స్టేజ్‌పై తమన్నా వ్యవహించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. రీసెంట్గా ఆస్ట్రేలియాలోని జరిగిన ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్) అవార్డు కార్యక్రమానికి తమన్నా ముఖ్య అతిథిగా హాజరైంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదవండి: ఆమె అంటే క్రష్, ఆ స్టార్ హీరోయిన్‌తో నటించాలని ఉంది: నాగ చైతన్య ఈ క్రమంలో ఈవెంట్ నిర్వాహకులు ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరోయిన్లు తమన్నా, తాప్సీ పన్ను సైతం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తాప్సీ చెప్పులు ధరించే జ్యోతి ప్రజ్వలన చేయగా.. తమన్నా మాత్రం దక్షిణాది సంస్కృతి ఉట్టిపడేలా వ్యవహరించి, సౌత్ ప్రజలు ఔరా అనేలా చేసింది. జ్యోతి ప్రజ్వలన చేసే ముందు చెప్పులు పక్కకు విడిచి దీపం వెలిగించింది. ఆ పక్కనే ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్ తమన్నాను.. ఇలా ఎందుకు చేశారు అని అడ్గగా.. ఇది దక్షిణాది సంస్కృతి అని బదులులిచ్చింది. చదవండి: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్ పంపించాడు: విజయ్‌పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇందుకు సంబంధించిన వీడియోను తమన్నా ఫ్యాన్ ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ అంత తమన్నాకు ఫిదా అవుతున్నారు. ‘తమన్నాకు దక్షిణాది నేర్పించింది ఇదే’ ,‘సంస్కృతిని గౌరవించడమంటే ఇదే కదా’, ‘చిన్న చిన్న విషయాలే గొప్పగా నిలబెడతాయి’, ‘భారతదేశ గొప్ప వారసత్వ సంస్కృతిని తమన్నా చూపించింది’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Karthick_Speaks ✳️🏅 (@suriya_tamannaah) View this post on Instagram A post shared by Karthick_Speaks ✳️🏅 (@suriya_tamannaah) -
కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా..
తమిళసినిమా: అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ తమన్నా. ఈ మాటను ఎవరైనా చెబుతారు. అయితే తనలో అద్భుతమైన నటి ఉందన్న విషయాన్ని బాహుబలి చిత్రంతో ఈ మిల్కీబ్యూటీ నిరూపించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా నటించిన ఈమె ఇప్పటికీ మోస్ట్ బ్యాచిలర్ నటిగానే కొనసాగుతున్నారు. అయితే పూజా హెగ్డే, రష్మిక వంటి నటీమణులు దూసుకు రావడంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయని చెప్పాలి. అదే విధంగా నయనతార, అనుష్క, త్రిష, తాప్సీ వంటి నటీమణుల తరహాలో తమన్నా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కాగా తాజాగా ఈమె నటించిన హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్ మధు బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఒక కోటీశ్వరునికి లేడీ డాన్సర్‌గా నియమితురాలైన యువతి కథ బబ్లీ బౌన్సర్. ఇది కామెడీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టంబర్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని తెలిపారు. -
ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చింది: తమన్నా
హీరోయిన్లు ఒక స్థాయికి చేరుకున్న తరువాత పెళ్లి, ఇతర విషయాలపై దృష్టి పెడుతారు. దానికోసం వారు దేవాలయాలు సందర్శిస్తూ ఆధ్యాత్మిక బాట పడుతుంటారు. దీనికి సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఉదాహరణ. పెళ్లికి ముందు నయన్ గుళ్లు గోపురాలు తిరిగి పూజలు నిర్వహించారు. తాజాగా నయన్ బాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆధ్యాత్మిక చింతన బాట పట్టారని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన ఈ అమ్మడు టాప్ హీరోయిన్గా ఎదిగారు. ఇంతవరకు పెళ్లి ఊసెత్తని ఈ గుజరాతి భామ షూటింగ్ విరామ సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల హిమాలయ ప్రాంతాలను కూడా చుట్టివచ్చారు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే! ప్రసిద్ధి చెందిన వైష్ణవీ దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక పయనం తనకు మంచి అనుభూతి, ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పారు. దీనితో పాటు ఆమె ఈశా యోగా మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఈశ యోగి మైదానంలో తాను గడిపిన మూడు రోజులు జీవితంలో మధురమైనవని పేర్కొన్నారు. ఆరోగ్య పరంగానూ పలు మంచి విష యాలు జరిగాయని, ప్రపంచం ఎంతో ఆశీర్వకరమైన దంటూ అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు. -
మూడోవారం కూడా డబ్బులొస్తున్నాయి, సక్సెస్ అంటే ఇదే: హీరో
‘‘ఎఫ్ 3’లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్స్‌తో ‘దిల్’ రాజు తీసిన ‘ఎఫ్ 3’ పాన్ ఇండియా సినిమా కింద లెక్క. ఓ హీరోకి రేచీకటి, మరో హీరోకి నత్తి, హీరోయిన్స్‌కు డబ్బు పిచ్చి. ‘ఎఫ్ 3’లో ఇలాంటివి పెట్టి సినిమాను హిట్ చేయడం అనిల్‌కే సాధ్యం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలైంది. సోమవారం జరిగిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాఘవేంద్రరావు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండటం కంటే మించిన ఆనందం ఓ యాక్టర్‌కు ఏదీ ఉండదు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘సక్సెస్ అంటే ఈ కరోనా పరిస్థితుల్లోనూ మూడో వారంలో ఇంకా రెవెన్యూ రావడమే. సక్సెస్ అంటే ఇదే. ‘ఎఫ్ 3’కి అందరూ హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇప్పుడు సినిమాకి ప్యారలల్‌గా ఓటీటీ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘ఎఫ్ 3’ని ఆదరిస్తున్నారంటే ఇది రియల్ సక్సెస్’’ అన్నారు అనిల్ రావిపూడి. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ప్రదానం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమన్నాతో గొడవ నిజమే, రెండు రోజులు..: అనిల్ రావిపూడి
పటాస్‌తో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు అనిల్ రావిపూడి. ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూనే వచ్చింది. అపజయం అనేదే తెలియని ఈ డైరెక్టర్ ఇటీవలే ఎఫ్ 3తో మరో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనిల్‌కు, హీరోయిన్ తమన్నాకు మధ్య గొడవలు జరిగాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకే తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్‌కు కూడా రాలేదని వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై అనిల్ స్పందిస్తూ.. 'ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. తమన్నాది పెద్ద గొడవేం కాదు. ఒకరోజు రాత్రి షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. దానికామె పొద్దున్నే జిమ్ చేసుకోవాలి, టైం లేదు, వెళ్లిపోవాలి అని మాట్లాడింది. అలా రెండురోజులు మా మధ్య కొంత హీట్ నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుకున్నాం. వేరే సినిమా షూటింగ్స్‌లో ఉండటం వల్ల తను ప్రమోషన్స్‌కు రాలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. కొంత సమయం తీసుకున్నా సరే ఎఫ్ 4 చేస్తానన్నాడు అనిల్ రావిపూడి. కాగా మే 27న రిలీజైన ఎఫ్ 3 సినిమా 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. చదవండి: అల్లు అర్జున్‌కి మహేశ్ బాబు థ్యాంక్స్.. చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్ అమ్మ ముందే అలా చేశాడు, వర్జినిటీ కోల్పోయా: నటి -
లబ్ డబ్.. డబ్బు
‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ‘ఎఫ్ 3’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మొదటి పాట ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు..’ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ కనిపించనున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్:మిల్కీ బ్యూటీ 'తమన్నా
-
Tamannaah Bhatia Birthday Special: హ్యాపీ బర్త్‌డే మిల్కీ బ్యూటీ
-
స్పెషల్ సాంగ్స్‌తో కనువిందు చేయబోతోన్న బ్యూటీలు..
కొంత లవ్వు.. కాస్త నవ్వు.. కాసింత సెంటిమెంట్... మధ్య మధ్యలో ఫైట్స్.. సినిమా ఇలా సాగిపోతుంటుంది. మధ్యలో జిల్.. జిల్.. జిగేల్మనే స్పెషల్ సాంగ్ వస్తే... ప్రేక్షకులకు ఐ ఫీస్ట్... ఇయర్ ఫీస్ట్... ఇప్పటికే ఇలాంటి ప్రత్యేక పాటలు చాలానే చూశాం. రానున్న రోజుల్లో కనువిందు చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. చదవండి: 'జగపతిబాబును గుర్తుపట్టలేదు, బాలకృష్ణ మనిషేనా?' సేమ్ టు సేమ్ సమంతలానే హీరోయిన్ రెజీనా తన కెరీర్లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’లోనే రెజీనా స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఇది రెగ్యులర్ స్పెషల్ సాంగ్లానో, ఐటమ్ సాంగ్లానో ఉండదని తెలిసింది. చిరంజీవి–రెజీనా పాల్గొనగా ఓ గుడిలో ఈ పాట ఉంటుందని సమాచారం. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేసిన ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్‌లోకి రానుంది. ఇంకోవైపు బుల్లితెర ఫేమస్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ‘బోళా శంకర్’ చిత్రంలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక సమంత, రెజీనా, రష్మీ గౌతమ్‌ల లెక్క ఫస్ట్ టైమ్ కాకుండా... ఇప్పటికే తమన్నా అరడజను (అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కేజీఎఫ్: చాప్టర్ 1, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు) స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులు వేశారు. చదవండి: RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది.. తాజాగా ‘గని’ కోసం మరోసారి స్పెషల్‌గా మాస్ స్టెప్పులేశారని తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (‘జాతి రత్నాలు’ ఫేమ్) ‘బంగార్రాజు’ చిత్రంలో నాగార్జునతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాగచైతన్య, కృతీశెట్టి ఓ జంటగా నటిస్తున్నారు. ఇంతేనా? రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ సాంగ్స్‌లో కొందరు తారలను చూసే అవకాశం ఉంది. -
ఏదో మిస్సవుతోంది!
నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్ట్రో’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘కళ్లు కనబడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు. కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’, ‘బట్ సమ్‌థింగ్ ఈజ్ మిస్సింగ్’ (ఏదో మిస్సవుతోంది)’ అనే సంభాషణలు ట్రైలర్లో ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
రెయిన్ బో స్టడీ చేస్తున్న తమన్నా.. రెండే ఆప్షన్లు ఉన్నాయన్న నాని
మనకు రెండే ఆప్షన్లు ఉన్నాయంటున్నాడు హీరో నాని. 1. వ్యాక్సిన్ వేయించుకుని.. క్షేమంగా ఉందాం. 2. మన క్షేమం కోసం వ్యాక్సిన్ వేయించుకుందాం అంటూ టీకా వేయించుకున్న ఫోటోని షేర్ చేశాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌నీల్ తన ముద్దుల కూతురుకు ముద్దుపెడుతున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు హరివిల్లుని అధ్యయనం చేస్తున్నానంటూ ఓ అందమైన ఫోటోని షేర్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ హ్యాపీ మూడ్‌లోనే ఉండలేమంటూ సీరియస్ లుక్ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు అల్లువారి అబ్బాయి శిరీష్. View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Prashanth Neel (@prashanthneel) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
పండుగవేళ తమన్నాతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఫ్యాట్ తగ్గించుకోవడానికి తమన్నా తిప్పలు.. వీడియో వైరల్
‘ఐయామ్ బ్యాక్’ అంటు న్నారు తమన్నా. ఆ మధ్య తమన్నా కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో కాస్త బరువు పెరిగారామె. కోవిడ్ ముందు ఎంత బరువున్నానో ఆ బరువుకి వచ్చేశానోచ్ అంటున్నారామె. రెగ్యులర్ వర్కౌట్స్ వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను పంచుకుని ఇలా అన్నారు తమన్నా. ‘‘ఏదైనా సరే అతిగా చేయక్కర్లేదు. చేసే పనిలో స్థిరత్వం ఉంటే ఏదైనా సాధించొచ్చు. రెండు నెలల పాటు ఎంతో క్రమశిక్షణతో వర్కౌట్స్ చేశాను. కోవిడ్ రాకముందు ఎలా ఉన్నానో అలా మారిపోయాను. వర్కౌట్స్ చేయకపోవడానికి వంకలు వెతక్కండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి’’ అన్నారు తమన్నా. ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, గుర్తుందా శీతాకాలం’ సినిమాలు చేస్తున్నారామె. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
వినోదం మూడింతలు
కోబ్రా అంటే పాము అని మనకు తెలుసు. అయితే ‘ఎఫ్2’లో కోబ్రా అంటే కో–బ్రదర్స్ (తోడల్లుళ్లు). వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా ఈ సినిమాలో చేసిన కామెడీ మామూలుగా ఉండదు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు వినోదం మూడింతలు అంటూ వెంకీ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ‘ఎఫ్ 3’ని ప్రకటించారు. తొలి భాగంలో హీరోలు భార్యల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతారు. సీక్వెల్లో ఇద్దరూ డబ్బు కారణంగా ఇబ్బందుల పాలవుతుంటారు. ఆ విషయాన్ని సూచిస్తూ, వెంకీ, వరుణ్ ట్రాలీలో డబ్బుల కట్టలు పట్టుకుపోతున్న పోస్టర్ని విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌లే కథానాయికలు. అదనంగా మరో ముగ్గురు నాయికలు ఉంటారని సమాచారం. ఇద్దరు వెంకీ సరసన, ఇద్దరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారట. మరో హీరో అతిథి పాత్రలో కనిపిస్తారని వినికిడి. బహుశా ఆ హీరోకి జోడీగా ఐదో హీరోయిన్ ఉంటుందేమో! -
శీతాకాలానికి అతిథి
‘‘బొంబాటుగుందిరా పోరి...’’ అని పాడుతూ మేఘా ఆకాశ్‌ని ’లై’ సినిమాలో ఆటపట్టించారు నితిన్. తెలుగులో మేఘా ఆకాశ్‌కి ఇది తొలి సినిమా. ఆ పాట చాలా ఫేమస్. ఈ సినిమా ద్వారా మేఘాకి బాగానే పేరొచ్చింది. ఆ తర్వాత ’చల్ మోహనరంగ’ సినిమాలో నటించారామె. రజనీకాంత్ ’పేటా’లో కూడా మంచి పాత్ర చేశారీ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’లో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారు. సత్యదేవ్, తమన్నా జంటగా రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగశేఖర్, భావనా రవి నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. నేటినుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనుంది. హీరో సత్యదేవ్ పాత్రతో మేఘా పాత్ర ట్రావెల్ అవుతుందట. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ చింతల. -
సంక్రాంతికి సీటీమార్?
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవన్షీ కీలక పాత్రలో నటిస్తున్నారు. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ పాత్రల్లో కనిపించనున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతానికి పైగా పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్స్‌లో తీసుకురావాలన్నది ప్లాన్ అని తెలిసింది. -
క్రేజీ రీమేక్‌కి సై
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హిందీలో ఘన విజయం సాధించిన క్రేజీ చిత్రం ‘అంధాధూన్’కి ఇది తెలుగు రీమేక్. ‘ఠాగూర్’ మధు సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ . సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘అంధాధూన్’లో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను తెలుగులో తమన్నా, రాధికా ఆప్టే పాత్రను నభా నటేష్ చేయనున్నారు. ‘అంధాధూ¯Œ ’లో టబు నటనకు ప్రశంసలు దక్కాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను చేసే సవాలును స్వీకరించారు తమన్నా. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో నటించే అవకాశం లభించినందుకు నభా నటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: హరి కె. వేదాంత్. -
తమన్నా తల్లిదండ్రులకు కరోనా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం అమ్మానాన్న చికిత్స తీసుకుంటున్నారు. దేవుడి దయ, మీ అందరి ప్రార్థనలతో వాళ్లు తొందరగా కోలుకుంటారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మీ తల్లిదండ్రులు త్వరగా కోలుకుంటారు’’ అని పలువురు సెలబ్రిటీలు, అభిమానులు తమన్నాకు ధైర్యం చెబుతూ ట్వీట్ చేశారు. -
ప్రేమను పంచండి
‘‘ప్రస్తుతం మనందరం ఓ పెద్ద సమస్యను (కరోనా) ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ప్రేమని పంచాలి కానీ ద్వేషాన్ని కాదు’’ అంటున్నారు తమన్నా. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగటివిటీ ఎక్కువ అవుతోందని, అందరూ పాజిటివ్ గా ఆలోచించాలని తమన్నా పేర్కొన్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘మనమెప్పుడూ చూడని ఓ విపత్తు ఇప్పుడు మన ముందు ఉంది. ఇలాంటి సమయంలో మనందరం పాజిటివ్ గానే ఉండాలి. సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా అంటే చాలా ద్వేషం కనిపిస్తోంది. అది చాలా మందిని ఇబ్బందికి గురిచేసేలా ఉంది. మరీ ముఖ్యంగా ట్రోలింగ్ ఎక్కువైంది. కానీ ఇలాంటి సమయంలో కావాల్సింది ద్వేషం కాదు.. ప్రేమ. ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. సోషల్ మీడియా అనేది ఒకరికొకరం కనెక్ట్ అవ్వడానికి. దాన్ని సరిగ్గా వినియోగించుకుందాం. ఒకప్పుడు సోషల్ మీడియాలో ‘మంచి’ కనిపించేది. మళ్లీ ఇంతకు ముందులాగానే సోషల్ మీడియాలోనూ పాజిటివిటీనే పంచుదాం’’ అన్నారు. -
హీరోయిన్ తమన్నా అదిరే స్టిల్స్
-
తమన్నా ఆహా
తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్నారు తమన్నా. కేవలం కథానాయికగానే కాదు.. అతిథి పాత్రల్లో, ప్రత్యేక పాటల్లోనూ మెరుస్తున్నారీ మిల్కీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్ స్టోరీ’ అనే తమిళ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో తమన్నా మెరవనున్నారట. ‘ఆహా’లో ఓ స్పెషల్ టాక్ షోను ప్లాన్ చేశారని, ఆ షోకి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. -
ఆకలితో ఎవరూ బాధపడ కూడదు
ఈ కరోనా కష్టకాలంలో వలస కార్మికులు, దినసరి కూలీల కష్టాలను తీర్చేందుకు మన వంతు సాయం చేయాలంటున్నారు తమన్నా. తన వంతుగా ముంబై మురికివాడల్లోని దాదాపు పదివేల మంది వలస కార్మికులు, దినసరి కూలీలకు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆహారాన్ని అందిస్తున్నట్లుగా చెబుతున్నారు తమన్నా. ‘‘ఈ కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది జీవితాలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి. వ్యాక్సిన్ దొరికే వరకు సామాజిక దూరం, దేశవ్యాప్త లాక్డౌన్ విధివిధానాలను పాటించడమే కరోనా నిర్మూలనకు సరైన మార్గాలు. ప్రస్తుతం మనందరి జీవితాలపై కరోనా ప్రభావం చాలా ఉంది. తిరిగి మనందరి జీవితాలు సరైన మార్గంలోకి రావడానికి వారాలు లేదా కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలు ఈ కష్టకాలంలో జీవనపోరాటం చేస్తున్నారు. వారిని వారు పోషించుకోవడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. అలాంటివారు ఆకలితో బాధ పడకూడదని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి నా వంతుగా నేను సాయం చేస్తున్నాను. మనందరం ఆ కష్టజీవులకు అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసినా సైరా (సైరా నరసింహారెడ్డి) ఫీవర్ సందడి చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ బిగ్గెస్ట్ మూవీ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. ఈ విజయాన్ని చిత్ర యూనిట్‌తోపాటు సైరా నిర్మాత రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంతో తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తున్నారు. తాజాగా తమన్నాకు తనదైన శైలిలో అభినందనలు తెలిపారు ఉపాసన . అద్భుతంగా నటించి మెప్పించిన తమన్నాకు ఆమె ప్రత్యేక బహుమతి అందజేశారు. ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మరోవైపు `సైరా` విజయం మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కొత్త ఊపిరినిచ్చింది. సినిమాలో నర్సింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా అద్భుత నటనతో సైరా లక్ష్మిగా నిలిచిపోనుందంటూ తమన్నాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా `సైరా` అంటూ సాగే పాటలో తమన్నా హావభావాలు అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. A gift for the super @tamannaahspeaks from Mrs Producer 😉❤️🥳 Missing u already. Catch up soon. #SyeraaNarashimaReddy pic.twitter.com/rmVmdwWNAd — Upasana Konidela (@upasanakonidela) October 3, 2019 -
‘సైరా నరసింహారెడ్డి’ థ్యాంక్యూ మీట్
-
యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం
-
తమన్నా.. తళుక్కు..
-
‘రాజుగారి గది 3’ మూవీ ప్రారంభం
-
సూపర్ హీరో ఎవరు?
ప్రతి హీరో (HERO) లోను హర్ (HER) ఉందంటూ లేటెస్ట్ హాలీవుడ్ సూపర్ హీరోయిన్ ఫిల్మ్ ‘కెప్టెన్ మార్వెల్’ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చారు సౌత్ సూపర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్. మార్వెల్ సంస్థ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్ మార్వెల్’. సూపర్ హీరో సినిమాల పాపులారిటీ ఇండియన్ మార్కెట్లో ఎలా పెరుగుతుందో తెలిసిన విషయమే. ఈ చిత్రం తమిళ వెర్షన్ ప్రమోషన్లో ఈ నలుగురు భామలు పాల్గొన్నారు. అక్కడ ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇండియన్ వెర్షన్ ‘ఐరన్ మేన్’కి హీరోగా ఎవరైతే బావుంటారని అడగ్గా రకుల్, సమంతలు వెంటనే ‘సూర్య’ అన్నారు. కాజల్ ఏమో విజయ్ పేరు చెప్పారు. సూపర్ హీరో ‘థోర్’ పాత్రకు ఎవరు బాగుంటారన్న ప్రశ్నకు అజిత్ పేరు చెప్పారు తమన్నా -
మిల్కీ బ్యూటీకి మరో భారీ చాన్స్
సాక్షి, తమిళసినిమా : బాహుబలి చిత్రంలో అవంతికగా విజృంభించిన మిల్కీ బ్యూటీ తమన్నాకు.. ఆ తరువాత కోలీవుడ్‌లో సరైన అవకాశాలు రాలేదు. ఇక, శింబుతో రొమాన్స్ చేసిన ‘అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా శీనూరామస్వామి దర్శకత్వంలో కన్నె కలైమానే చిత్రంలో నటించినా.. అది ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగులకు సై అంటోందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో తమన్నా చెప్పే వెర్షన్ వేరేవిధంగా ఉంది. డాన్స్ అంటే తనకు ఇష్టమని, అందుకే ఐటమ్ సాంగ్స్ అవకాశాలను వదులుకోవడం లేదన్నది ఆమె అంటోంది. ఏదేమైనా కోలీవుడ్‌లో తమన్నా పనైపోయిందనే ప్రచారం సాగింది. అలాంటి తరుణంలో ఈ మిల్కీబ్యూటీని భారీ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఈ భామకు నటించే అవకాశం దక్కింది. శింబు హీరోగా పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ని సుందర్ ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు. ఇందులో శింబుకు జంటగా మేఘా ఆకాశ్ నటించనుంది. ఈ చిత్రం తరువాత సుందర్ విశాల్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో విశాల్‌తో జోడీ కట్టే అవకాశం తమన్నాకు దక్కింది. ఈ విషయమై తమన్నా స్పందిస్తూ.. మొదటినుంచి సుందర్ సీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ కథాచిత్రమని, ఇందులో తన పాత్ర కూడా యాక్షన్ సీన్లలో నటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇంతకుముందు ఈ అమ్మడు ‘కత్తిసండై’ చిత్రంలో విశాల్‌తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తోంది. -
డ్యాన్స్ ఛాలెంజ్ నెగ్గిన తమన్నా
-
తమన్నా ఆశ నెరవేరేనా.?
సాక్షి, సినిమా: దక్షిణాది చిత్రసీమలో గుర్తుండిపోయే నటీమణుల్లో తమాన్నా పేరు కచ్చితంగా చోటుచేసుకుంటుంది. దశాబ్దంన్నర దాటినా నాయకిగా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో మిల్కీబ్యూటీ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్లో మెగాస్టార్‌తో తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నారు. ఇదే చిత్రంలో నయనతార కూడా నాయకిగా నటించడం విశేషం. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ‘కన్నె కలమానే’చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఇప్పుడు సినీ పరిశ్రమలో బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందనే చెప్పొచ్చు. అయితే ఇక అతిలోక సుందరిగా భారతీయ సినీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటి శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనీకపూర్ డాక్యుమెంటరీగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం. ఈ పరిస్థితుల్లో నటి తమాన్నా శ్రీదేవి పాత్రలో నటించాలన్న కోరికను వ్యక్తం చేయడం విశేషం. ఇటీవల ఆమె ఒక భేటీలో నటి శ్రీదేవి, సానియా మిర్జాల పాత్రల్లో నటించాలని ఆశగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఆ అమ్మడు మాట్లాడుతూ.. సమీప కాలంలో బయోపిక్‌లు అధికంగా తయారవుతున్నాయని, ఆ చిత్రాలకు మంచి ప్రజాదరణ లభిస్తోందని ఆమె అన్నారు. అందుకే తానూ అలాంటి బయోపిక్‌లో నటించాలని ఆశపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆశపడవచ్చు...అత్యాశపడకూడదు. మరి తమాన్నాది ఆశ అవుతుందా? అత్యాశే అవుతుందా? అన్నది వేచి చూడాలి. ఇప్పటివరకు మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్ర హిందిలో తెరకెక్కి ఘనవిజయం సాధించింది. ఆదే విధంగా నటి సిల్క్‌స్మిత బయోపిక్ నటి విద్యాబాలన్‌కు ఏకంగా జాతీయ అవార్డునే అందించింది. క్రికెట్ క్రీడాకారుడు ధోని జీవిత చరిత్ర సినిమాగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఎంజీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతోంది. ఇక మహానటి సావిత్రి జీవితం ఇటీవలే వెండితెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందులో సావిత్రిగా జీవించిన యువనటి కీర్తీసురేశ్‌కు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
వెనకపడ్డ మాట నిజమే!
తమిళసినిమా: నేను వెనకపడ్డ మాట నిజమేనని నటి తమన్నా అంగీకరించారు. తమన్నా భాటియా ఈ పేరు ఒకప్పుడు గ్లామర్‌కు అడ్రస్. ఇప్పుడు అభినయానికి అడ్డా. తమన్నా వయసు 28 ఏళ్లు అయితే అందులో సగంపైనే ఆమె నట వయసు. ఇప్పటికీ అగ్రకథానాయకిగా రాణిస్తున్నారు. ఇది అరుదైన విషయమే. మధ్యలో ఈ ముద్దుగుమ్మ మార్కెట్ కాస్త తడబడినా మళ్లీ నిలదొక్కుకుని స్టార్ హీరోల నుంచి వర్థమాన హీరోల వరకూ నటించేస్తున్నారు. ఈ మిల్కీబ్యూటీలో నటితో పాటు మంచి డాన్సర్ ఉన్నారు. ఈమె కచ్చితమైన కొలతల మేనందాలకు ఇదీ ఇక కారణంగా భావించవచ్చు. బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో తమన్నా నటనను మరువలేం. తన నట జీవితంలోనూ ఎత్తుపల్లాలను చవిచూసిన తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళంలో భాషల్లో చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా తన దశాబ్దన్నర నట జీవితాన్ని ఒక్కసారి నెమరువేసుకున్నారు. ఆ సంగతులేంటో చూసేస్తేపోలా! నేను సినిమాలోకి రంగప్రవేశం చేసి 15 ఏళ్లు అయ్యిందని ఎవరైనా చెబితేనే గుర్తుకొస్తుంది. అంతగా కాలం పరుగులు పెడుతోంది. 2005లో నేను నటించిన తొలి తెలుగు చిత్రం విడుదలైంది. అప్పుటి నుంచి ఇప్పటి వరకూ కథానాయకిగా కొనసాగుతుండడం సంతోషంగానూ, మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లోనూ నటిస్తున్నాను. అన్నీ చిత్రాలు ఏదో రకంగా పేరు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా చెప్పాలంటే నాకు దక్షిణాది సినిమానే అధికంగా ఆదరించింది. ఇంకా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్ది కాలమే కథానాయకిగా రాణించడం సాధ్యం. ఆ తరువాత పక్కన పెట్టేస్తారు. అలాంటిది నటి సౌందర్య తరువాత అనుష్క, కాజల్‌అగర్వాల్, నేను ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగడం సంతోషకరమైన విషయం. విశ్రాంతి లేకుండా నటిస్తూనే ఉన్నాను. మంచి విభిన్న కథలు, నా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలనే అంగీకరిస్తున్నాను. తెలుగులో సక్సెస్‌లు లేని కాలంలో తమిళంలో సురా, తిల్లాలంగడి, చిరుతై, వీరం వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఇకపోతే సీనియర్ నటులతోనూ, వర్థమాన నటులతోనూ నటించడం వల్లే నాకు అవకాశాలు తగ్గాయా అన్న ప్రశ్న తలెత్తినా, ఆ వెనుకబడడం అన్నది తాత్కాలికమే. -
తళుక్కుమన్న తమన్నా..
ప్రొద్దుటూరు : సినీనటి తమన్నా ప్రొద్దుటూరులో హల్చల్ చేశారు. స్థానిక మైదుకూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బీన్యూ మొబైల్స్ 53వ షోరూంను శనివారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు వచ్చారు.అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి ఆమె అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తాను నటిస్తున్న సినిమాల గురించి చెప్పడంతో అభిమానులు ఈలలు, కేకలు వేశారు. ఆమె స్వయంగా సెల్ఫీ స్టిక్‌తో ఫొటోలు తీయడం, ఆటో గ్రాఫ్‌లు ఇవ్వడం అభిమానుల్లో ఆనందం నింపాయి. సాంకేతిక సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి సాంకేతిక సేవలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని తమన్నా పేర్కొన్నారు. బీ న్యూ మొబైల్స్ షోరూం ప్రారంభం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఇక్కడ తనకు ఇంత మంది అభిమానులు ఉండటం గర్వంగా ఉందన్నారు. నటిగా రాణించడం తన అదృష్టమని, ఆ కారణంగానే తనకు ఇంత మంది అభిమానులు ఏర్పడ్డారన్నారు. బీన్యూ మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలు అంటే తనకెంతో ఇష్టమని, ఆ కారణంగానే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తమ షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదోని, కదిరి ప్రాంతాల్లో సైతం షోరూంలు ఏర్పాటు చేశామని, లక్ష జనాభా ప్రతిపదికన షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. ఏడాది ఆఖరు నాటికి నవ్యాంధ్రలో వంద, తెలంగాణాలో వంద షోరూంలు ఏర్పాటు చేసి రూ.500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో రాయల్ రెసిడెన్సీ ఓనర్ రాఘవరెడ్డి, బీ న్యూ మొబైల్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
తళుక్కుమన్న తమన్నా
-
డ్యాన్స్ అండ్ డ్యాన్స్!
ముంబై: ఐపీఎల్ అంటే క్రికెట్ వినోదానికి చిరునామా. అయితే ప్రతీ ఏటా మ్యాచ్‌లకు ముందు ఆరంభ వేడుకలు కూడా అంతే స్థాయిలో అభిమానులను అలరిస్తూ వచ్చాయి. ఈసారి కూడా లీగ్ ప్రారంభోత్సవం అదిరిపోతుందని బీసీసీఐ హామీ ఇస్తోంది. గతంతో పోలిస్తే ఒక రోజు ముందు కాకుండా తొలి మ్యాచ్ రోజే ప్రారంభోత్సవం జరుగుతుండటం ఒక్కటే మారింది. ఇది మినహా వినోదంలో ఏమాత్రం లోటు ఉండదనేది నిర్వాహకులు మాట. బాలీవుడ్లో అత్యుత్తమ డ్యాన్సింగ్ హీరోలుగా గుర్తింపు ఉన్న హృతిక్ రోషన్, వరుణ్ ధావన్ తమ ప్రదర్శనతో అలరించేందుకు సిద్ధమయ్యారు. డ్యాన్స్‌కే అడుగులు నేర్పించగల ప్రభుదేవా కూడా వీరితో జత కలిస్తే ఇక ఫ్లోర్ అదిరిపోవడం ఖాయం! ఆటపాటల్లో గ్లామర్‌కు కూడా లోటు లేకుండా ఉండేందుకు మరో ఇద్దరు హీరోయిన్లతో స్పెషల్ షో ఈ వేడుకల్లో మరో ఆకర్షణ. సూపర్ హిట్ పాటలపై అదరగొట్టే స్టెప్పులు వేసేందుకు తమన్నా భాటియా, జాక్లిన్ ఫెర్నాండెజ్ రెడీ. పాపులర్ సింగర్ మికా సింగ్ కూడా తన గొంతు సవరించుకొని పంజాబీ–హిందీ పాటలతో అలరించనున్నాడు. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు టాస్ వేసే సమయం 7.30 వరకు కొనసాగుతాయి. -
సినీనటి తమన్నా సందడి
-
నేను చెప్పనివి మీరు చెప్పకండి
‘‘ఆర్టిస్ట్‌ల గురించి ఏదైనా రాసేముందు ఒకటికి రెండుసార్లు ఎందుకు సరి చూసుకోరు?’’ అని మండిపడ్డారు తమన్నా. సెన్సేషన్ కోసం ఏది పడితే అది రాసే ఆర్టికల్స్‌ను చూసి ఆమె ఈ విధంగా స్పందించారు. ‘‘అజ్ఞానమే మహానందం అంటుంటారు. కానీ వీళ్ల (ఎల్లో జర్నలిజమ్) విషయంలో చాలా డిస్ట్రబింగ్‌గా ఉంది. నాకో సందేహం కలుగుతుంటుంది. రాసింది పబ్లిష్ చేసే ముందు వాళ్లు హోమ్‌వర్క్ చేయకుండా ఎలా ఉంటారా? అని. ఆ సమాచారం సరైనదా? కాదా? అని ఆలోచించకుండా ప్రచురించడం సరికాదు. పబ్లిష్ చేసేముందు సంబంధిత వ్యక్తులను ఒక మాట అడిగితే ఏం పోతుంది? కల్పిత వార్తలు రాసి, సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకోవడం సబబు కాదు. ఈసారి నా గురించి ఏదైనా రాసేముందు కొంచెం రెస్పాన్సిబుల్‌గా నన్ను సంప్రదించి, నా అభిప్రాయం ఏంటో కనుక్కోండి. నేను ఇవ్వని ఇంటర్వ్యూల్ని, అలాగే పాత ఇంటర్వ్యూలోని సమాచారాన్ని సంబంధం లేని చోట వాడకండి. దయచేసి నేను చెప్పని విషయాలను మీరు చెప్పకండి’’ అని ఘాటుగా పేర్కొన్నారు తమన్నా. ఇంతకీ తమన్నా గురించి రాసింది ఎవరు? ఏం రాశారు? అనే ప్రశ్నలకు సమాధానం ఎదురు చూడొద్దు. ఎందుకంటే తమన్నా ఆ విషయాలేవీ ప్రస్తావించలేదు. -
శాండిల్‌వుడ్‌పై కన్నేసిన మిల్కీబ్యూటీ
సాక్షి, సినిమా : నటి తమన్నా భాటియా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లను చుట్టేస్తున్నారు. ఈ ముంబై బ్యూటీకి ఇప్పుడు టాలీవుడ్లో చేతి నిండా అవకాశాలు ఉన్నా, కోలీవుడ్‌లో తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ఇక్కడ కన్కే కలై మానే అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా హిందీలో ఒకటి, మరాఠిలో ఒకటి చేస్తున్న తమన్నా ఇంత వరకూ శాండిల్‌వుడ్, మాలీవుడ్లను టచ్ చేయలేదు. ఆ కొరిక మనసులో ఉన్నట్లుంది. ఆ ఆశను చెప్పకనే చెప్పేసింది. అసలు విషయం ఏమిటంటే ఈ మిల్కీబ్యూటీ ఇటీవల కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది. ఆ ప్రకటనలో పునీత్ రాజ్‌కుమార్‌తో నటించడం సంతోషంగా ఉందని విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పింది. దీంతో ఒక విలేకరి కన్నడ చిత్రాల్లో నటించే ఆలోచన లేదా అని ప్రశ్నించడంతో అలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్న తమన్నా కన్నడ చిత్రంలో నటించాలని తనకూ ఉందని, అయితే అందుకు ఒక నిబంధన ఉంటుందని అంది. ఏమిటా నిబంధన అన్న ప్రశ్నకు తాను పునీత్ రాజ్‌కుమార్‌తోనే నటిస్తానని చెప్పింది. దీంతో పక్కనే ఉన్న పునీత్ రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలోకి రండి అని ఆహ్వానించారు. మొత్తం మీద తన ఎత్తుగడ పని చేసినందుకు తమన్నా చిరునవ్వులు చిందించింది. త్వరలోనే ఈ బ్యూటీ పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి ఒక కన్నడ చిత్రంలో నటించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. -
తమన్నాపైకి బూటు విసిరిన యువకుడు
-
ఆ వార్తల్లో నిజం లేదు
...అంటున్నారు మిల్కీ బూటీ తమన్నా. ఇంతకీ ఆ వార్త ఏంటనేగా మీ డౌట్. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ హిందీ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ‘క్వీన్’ పేరుతో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ చేస్తుండగా నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ‘క్వీన్’ చిత్రీకరణ లో నీలకంఠకూ, తమన్నాకు మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, దాంతో నీలకంఠ ఆ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్చల్ చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ఈ వార్తలు అటూ ఇటూ తిరిగి తెలుగు క్వీన్ చెవిన పడ్డట్టున్నాయి. అందుకే కాబోలు తాజాగా తమన్నా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘నీలకంఠ సార్ అంటే నాకు చాలా గౌరవం. నేను ఆయనతో గొడవ పడ్డానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవు. సినిమా నిర్మాణం విషయంలో నాకు, నా టీమ్‌కి కానీ ఎటువంటి అధికారం లేదు. పూర్తి అధికారం నిర్మాత మను కుమారన్‌దే. నాలుగు భాషల్లో ఏక కాలంలో రానున్న ‘క్వీన్’ మా అందరికీ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. అందుకోసం యూనిట్ అంతా కష్టపడి పనిచేస్తోంది’’ అని సెలవిచ్చారు తమన్నా. అయితే.. ప్రస్తుతం ‘క్వీన్’ షూటింగ్ జరుగుతోందా? ఆగిపోయిందా? అనే క్లారిటీ ఇవ్వలేదు మిల్కీ బ్యూటీ. -
కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' టీజర్ విడుదల
-
గుంటూరులో సందడి చేసిన నాగచైతన్య, తమన్నా
-
క్రైమ్‌కి ఓకే!
అవును... తమన్నా నేరంతో నేస్తం చేయబోతున్నారట. ఆ నేరం పేరు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆ మధ్య విడుదలైన ‘మామ్’లో డిటెక్టివ్‌గా నటించిన నవాజూద్దీన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్’గా బాలీవుడ్లో దూసుకెళుతోన్నారు. ఈయనతో తమన్నా ఎందుకు చేతులు కలిపారంటే? ఓ హిందీ సినిమా కోసం. నవాజుద్దీన్ ముఖ్య పాత్రలో ఓ క్రైమ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో తమన్నా నటించనున్నారని బీ–టౌన్ టాక్. కథ వినగానే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి తమన్నా ఓకే అన్నారట. అయితే ఆమె నటించనున్నది నవాజుద్దీన్ సరసన కాదు. ఓ కీలక పాత్ర అట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఏడేళ్ల క్రితం వివేక్ ఒబెరాయ్‌తో ‘ప్రిన్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన కూకీ వి. గులాటీ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి దర్శకుడు. ప్రస్తుతం హిందీ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. ఇన్సెట్లో ఇసుక మీద హాయిగా సేద తీరుతున్న తమన్నా ఫొటో అక్కడిదే. ఈ ఫొటో చూసి... సముద్ర తీరంలో తమన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు. బాగా ఎక్సర్సైజ్ చేసి, అలసిపోయారు. మామూలుగా ఇక్కడ ఉంటే ఇన్‌డోర్‌లో జిమ్‌లో వర్కవుట్స్ చేసేవారు. ఫ్రాన్స్‌లో మాత్రం అవుట్డోర్ వర్కవుట్స్ చేశారట. అలసిపోయే రేంజ్లో వ్యాయామాలు చేసి, ఇదిగో ఇలా ఇసుక మీద సేద తీరుతున్నారు. ‘‘అవుట్డోర్ ట్రైనింగ్ చాలా బాగుంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా పేర్కొన్నారు. -
మేకప్‌తో మరింత అందం
-
నలుగురు రాణులు.. నలభై రోజులు... ఒకటే కహానీ!
కథొక్కటే... కథానాయికలు మాత్రం వేర్వేరు! కంట్రీ ఒక్కటే... కెమెరాలు కదిలే ప్రదేశాలు మాత్రం వేర్వేరు! నిర్మాత ఒక్కరే... దర్శకులు మాత్రం వేర్వేరు! కానీ, అందరూ స్నేహితులే! చిత్రీకరణ పూరై్తన తర్వాత కలిసే చోటు ఒక్కటే! సిన్మా కథ కాదిది... అంతకు మించిన కహానీ! ‘ఒక్క కథ... ఇద్దరు దర్శకులు... నలుగురు రాణులు!’ కథేంటో మీరూ లుక్కేయండి! హిందీ హిట్ ‘క్వీన్’లో కంగనా రనౌత్ కుమ్మేశారు. ఇప్పుడీ సిన్మాను దక్షిణాది భాషల్లో మెడియంటే ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ మలయాళ దర్శకుడు కె.పి. కుమారన్ తనయుడు, నిర్మాత మనుకుమారన్ రీమేక్ చేస్తున్నారు. సారీ... రీమేక్ కాదు, రీమేక్స్! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో! ఇందులో తెలుగు–మలయాళ వెర్షన్స్‌కు ‘షో, మిస్సమ్మ’ సిన్మాల ఫేమ్ నీలకంఠ, తమిళ–కన్నడ వెర్షన్స్‌కు నటుడు రమేశ్ అరవింద్ దర్శకులు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ నాయికలుగా నటిస్తున్నారు. అంటే... కంగనా రనౌత్ పాత్రను ఈ నలుగురూ చేస్తున్నారు. తెలుగులో ‘క్వీన్’గా నటిస్తున్న తమన్నా తమిళ ప్రేక్షకులకు, తమిళ ‘క్వీన్’గా నటిస్తున్న కాజల్ తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమాయే మలయాళ ‘క్వీన్’. తమిళ సినిమాలు కొన్నిటిలో ఆమె నటించారు. కన్నడ ‘క్వీన్’ పరుల్ యాదవ్ ‘కిల్లింగ్ వీరప్పన్’తో తెలుగు–తమిళ ప్రేక్షకులకు తెలుసు. మలయాళ సినిమాలూ చేశారామె. అందువల్ల, ఎవరెలా చేస్తారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది! ఈ ఆసక్తిని పెంచుతూ... ప్యారిస్‌లో మన నలుగురు ‘క్వీన్స్’ ఈ రోజు కంగనా రనౌత్ షూస్‌లో అడుగులేశారు. నాలుగు సినిమాల షూటింగులు నేడు ప్యారిస్‌లో మొదలయ్యాయి. దాదాపు 40 రోజుల పాటు అక్కడే జరుగుతాయి. అయితే... లొకేషన్లు వేర్వేరులెండి! కానీ, షూటింగ్ తర్వాత అందరూ ఉండేది ఓ హోటల్లోనే. ‘ఓ ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అని ఓ సామెత. ఇక్కడ రెండు కాదు... నాలుగు! అదేనండి.. కత్తిలాంటి కథానాయికలు నలుగురున్నారు. ఒకే సినిమాలో నటించకపోయినా ఒకే చోట, ఒకే లొకేషన్లో ఉంటారు కాబట్టి, నలుగురికీ గొడవలు వస్తాయేమో? అనే డౌట్ చాలామందికి ఉంది. నో... అటువంటి చాన్సే లేదంటున్నారు తమన్నా. యాక్చువల్లీ... చిత్రీకరణ ప్రారంభానికి ముందే తమన్నా, కాజల్, మంజిమ, పరుల్ కలసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. అందులో సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ‘‘నలుగురు హీరోయిన్లు సేమ్ స్టోరీలో, సేమ్ క్యారెక్టర్లో, సేమ్ కంట్రీలో, సేమ్ టైమ్‌లో నటించడం అరుదైన విషయం కదా! నాకీ సంగతి చెప్పగానే... ఎగ్జయిటయ్యాను. ప్యారిస్‌లో మేం నలుగురమూ ఏమేం చేయాలనే అంశాలను వాట్సాప్ గ్రూప్‌లో డిస్కస్ చేసుకున్నాం’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇక, కాజల్ అయితే... ‘‘తమన్నా, నేను ఆల్మోస్ట్ సేమ్ టైమ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాం. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరు. అయితే సేమ్ లొకేషన్లో షూట్ చేయడం ఫస్ట్ టైమ్. సరదాగా ఉంటుంది’’ అన్నారు. పరుల్ యాదవ్, మంజిమా మోహన్... ఇద్దరూ తమన్నా, కాజల్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి, సరదా సంగతులు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నామన్నారు. ఇదండీ... క్వీన్స్ కహానీ!! క్వీన్ కథ... వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది రాణీ మెహ్రా (కంగనా రనౌత్). విజయ్ (రాజ్‌కుమార్ రావ్) తో ఆమె పెళ్లి కుదురుతుంది. హనీమూన్‌కి టికెట్స్ కూడా బుక్ చేస్తారు. అయితే రేపు వివాహం అనగా.. ‘‘నేను ఫారిన్లో పెరిగాను. నా కల్చర్ వేరు. నువ్వు నాకు సరి కాదు’’ అంటాడు విజయ్. పెళ్లాగిపోతుంది. రాణీ కట్టుకున్న కలల మేడ కూలిపోతుంది. చివరికి వేరొకరి కారణంగా తను బాధపడకూడదని నిర్ణయించుకుంటుంది. హనీమూన్ కోసం బుక్ చేసిన టిక్కెట్లతో ఒంటరిగా ప్యారిస్ వెళుతుంది. కొత్త దేశం.. కొత్త మనుషులు కావడంతో కంగారు పడుతుంది. కష్టాల్లో ఉన్న రాణీని వరలక్ష్మీ (లీసా హెడన్) ఆదుకుంటుంది. మెల్లగా రాణీ ఫారిన్ కల్చర్‌కి అలవాటు పడుతుంది. అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటుంది. ఆమె జీవితంలోకి వచ్చిన కొత్త స్నేహితులు ఆమె ఎదుగుదలకు మరింత సహాయం చేస్తారు. రాణీ తనలో ఉన్న టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటుంది. ఓ సందర్భంలో రాణీ ఫొటోను విజయ్ చూస్తాడు. ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. ప్యాకప్ అనుకున్న మన రిలేషన్‌షిప్‌ను ప్యాచప్ చేసి, కంటిన్యూ చేద్దాం అంటాడు. ఆ తర్వాత కథేంటి? అనేది వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘క్వీన్’ చూసినవారికి తెలిసే ఉంటుంది. -
ఎవరీ బ్యూటీ రోబో?
తమిళసినిమా: రోబో గెటప్‌లో ఉన్న బ్యూటీ ఎవరో కని పెట్టారా? కొంచెం కష్టమేనంటారా? అయితే మేమే రివీల్ చేస్తున్నాం.ఈ బ్యూటీ రోబో ఎవరో కాదు మిల్కీబ్యూటీ తమన్నా. ఏమిటీ గెటప్, కొంపదీసి రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రంలో అతిథిగా ఈ గెటప్‌లో మెరవనుందా? అన్న సందేహం కలు గుతోందా? మీ లాగా చాలా కొందరు అలాంటి అపోహనే పడ్డారు. శుక్రవారం దుబాయిలో రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఆడి పాడడానికే మిల్కీ బ్యూటీ రోబో గెటప్‌కు రెడీ అయ్యిందనే ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి జరిగింది వేరే. ఒక టీవీ ప్రొగ్రాం కోసం నటి తమన్నా రోబోలా మారింది. స్టార్‌ప్లస్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారుడు ఇఫ్రాన్ బదాన్తో కలిసి తమన్నా ఇలా మెరిసింది. ప్రముఖ నృత్యదర్శకురాలు ఫరాఖాన్ సమకూర్చిన నృత్యరీతుల్లో తమన్నా ఇఫ్రాన్ బాదాన్తో కలిసి ఆడి పాడింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమకు ఇష్టమయిన నటుడి గెటప్‌లో కనిపించవచ్చునట. దీంతో తనకు ఇష్టమైన నటుడు రజనీకాంత్ కావడంతో తమన్నా ప్రస్తుతం ఆయన నటిస్తున్న 2.ఓ చిత్రంలోని గెటప్‌నకు మారిందట. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ చిన్నతనం నుంచి నటిగా తనకు స్ఫూర్తి రజనీకాంత్నేనని, అందుకే ఆ గెటప్‌ను ఆయనకు సమర్పిస్తున్నానని చెప్పింది. తన అభిమానాన్ని ఇలా కూడా చూపించవచ్చునని ఈ ముద్దుగుమ్మ నిరూపించిందన్నమాట. -
చారిత్రాత్మక చిత్రంలో రెజీనా!
తమిళసినిమా: నటి రెజీనా కోలీవుడ్‌లో మళ్లీ పుంజుకుంటున్నారనే చెప్పాలి. ఇంతకు ముందు తమిళం, తెలుగు అంటూ విజయాలకోసం పరుగులు తీసిన ఈ బ్యూటీకి మానగరం వంటి అనూహ్య విజయం సాధించిన చిత్రంతో ఈ అమ్మడికి ఇక్కడ ఆశాజనక పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒక చారిత్రాత్మక కథా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిని సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న భారీ చిత్రంలో రెజీనా ఒక కీలక పాత్రను పోషించనున్నారన్నది తాజా సమాచారం. ఇందులో సుభాష్‌చంద్రబోస్‌తో పాటు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడు అజాద్ హింద్ ఫౌజ్ పాత్రను నటుడు రానా పోషించనున్నారు. బాహుబలి చిత్రం తరువాత ఆయన నటించనున్న మరో చారిత్రక కథా చిత్రం ఇది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 1945 కాల ఘట్టంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కనున్న మరో గొప్ప కళాఖండంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో రానాను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించబడ్డ యువతిగా రెజీనా నటించనున్నారట. ఇందులో ఈమె చాలా తక్కువ మేకప్‌తో విభిన్న గెటప్‌లో కనిపించనున్నారట. బాహుబలి చిత్రంతో అనుష్క, తమన్నా ఎంత పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. మరి ఈ చరిత్ర కథా చిత్రం రెజీనాకు ఏ మాత్రం పేరు తీసుకొస్తుందో వేచి చూడాలి. -
తెల్లగా ఉన్నావని పొగరా?
...తమన్నాను ట్విట్టర్లో ప్రశ్నించాడో నెటిజన్. ప్రేమాభిమానాలు, పొగడ్తలతో పాటు అప్పుడప్పుడూ తిట్లు, ఛీత్కారాలూ వస్తుంటాయి ట్విట్టర్ వంటి సోషల్ మీడియా పోర్టల్స్‌లో! కొందరు నెటిజన్ల పట్ల ఘాటుగా స్పందిస్తారు. మరికొందరు కూల్‌గా జవాబిస్తారు. తమన్నా రెండో కేటగిరిలోకి వస్తారు. ‘తెల్లగా ఉన్నావని పొగరా? నాకు రిప్లై ఇవ్వడం లేదు?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తికి కూల్‌గా రిప్లై ఇచ్చారు. ‘అయ్యో... పొగరు కాదండి. మీకు నా నమస్కారాలు. జీవితంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అన్నారు తమన్నా. మొన్నీ మధ్య ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో కాసేపు సరదాగా చాట్ చేశారీ బ్యూటీ. ఆమెకు డ్రీమ్ రోల్ ఏదో కూడా చెప్పారు. ‘‘సిన్మాలు లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను. డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే సిన్మాలో నటించాలనేది నా డ్రీమ్’’ అని పేర్కొన్నారు తమన్నా. -
ప్రభుదేవాతో మరోసారి..
తమిళసినిమా: మార్కెట్ పడిపోయింది. అవకాశాలు లేవు. ఇక మూటాముల్లు సర్దుకోవలసిందే అనే టాక్ స్ప్రెడ్ అయినప్పుడల్లా నటి తమన్నాకు అవకాశాలు తలుపుతడుతూ ఆ ప్రచారం తప్పని సమాధానాన్ని ఇస్తున్నాయి. బాహుబలి–2 చిత్రంలో తమన్నా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు కదా, ఆ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. అదే సమయంలో శింబుతో రొమాన్స్ చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ తీవ్రంగా నిరాశపరచింది. దీంతో విక్రమ్‌తో నటిస్తున్న స్కెచ్ పైనే ఆశలు పెట్టుకున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా మరో అవకాశం వచ్చింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం తమన్నా తలుపు తట్టింది. ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందనుందని, అందులోనూ తమన్నా, ప్రభుదేవాతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయితే అంతకు ముందే ఈ క్రేజీ జంట మరో చిత్రంలో నటించడానికి రెడీ అయిపోతున్నారన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. రజనీకాంత్ 2.ఓ, విక్రమ్ సామి–2, సుందర్.సీ కలగలప్పు–2 చిత్రాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా విశ్వనటుడు కమలహాసన్ ఇండియన్–2కు రెడీ అవుతున్నారు. ఇలా మరి కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న తరుణంలో చార్లీచాప్లిన్ చిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 2002లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం చార్లీచాప్లిన్. ప్రభుదేవా,ప్రభు, అభిరామి,గాయత్రి రఘురామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. దీనికిప్పుడు సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో ప్రభుదేవాకు జంటగా నటి తమన్నా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
టాలీవుడ్ 'క్వీన్' తమన్నా
-
అందాల సంతకం
-
విక్రమ్ పాటకు భారీగా స్కెచ్
తమిళసినిమా: సియాన్ విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి స్కెచ్. ఇందులో ఆయన మిల్కీబ్యూటీ తమన్నాతో రొమాన్స్ చేస్తున్నారు. నటుడు సూరి, ఆర్కే.సురేశ్, అరుళ్దాస్, మలయాళం నటుడు హరీష్, శ్రీమాన్, విశ్వంత్, బాబురాజ్, వినోద్, వేల్ రామమూర్తి, సారిక ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఒక కీలక పాత్రలో ప్రియాంక నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కలైపులి ఎస్.«థాను వి.క్రియేషన్స్ సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను విజయ్‌చందర్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో బ్రహ్మండమైన పాటను చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇందుకోసం భారీ ఎత్తున సెట్‌ను వేసినట్లు చెప్పారు. ఇందులో విక్రమ్‌తో పాటు 150 మంది నృత్యకళాకారులు, .1,500 మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని తెలిపారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నామని, అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం వెల్లడించారు. ఈ స్కెచ్ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. -
ట్రింగ్..ట్రింగ్... ట్రింగ్!!!
మూడు బెల్లులు బాగానే మోగేటట్లున్నాయి.సినిమాకి స్టార్టింగ్ బెల్... ఇంటర్వెల్ బెల్...అయిపోయిందన్న బెల్. కథకి విలన్ బెల్... హీరో బెల్...ఎంటర్టైన్మెంట్ బెల్. ఫ్యాన్ల బెల్... ప్రొడ్యూసర్ల బెల్... డిస్ట్రిబ్యూటర్స్బెల్... అన్నీ మోగేలానే ఉన్నాయి.మంచి కాన్ఫిడెన్స్‌లో ఉన్న చిన్న ఎన్టీఆర్ ఇంటర్వ్యూ అంతా బెల్లులు మోగిస్తూనే ఉన్నాడు! రెండు రోజులు ఆగితే ఈలలు మోగాలి, చప్పట్లు మోగాలి, వసూళ్లు మోగాలనే నమ్మకంతో ఉన్నారు. ► మూడు పాత్రలు చేయాలని ఈ సినిమా మొదలుపెట్టలేదు. చేద్దామని మొదలుపెడితే కాదు కూడా! కథ రాసేవాళ్లు ఉండాలి. కథ రాసుకునే కెపాసిటీ నాకుంటే?.. నేనే కథ రాసుకుని, డైరెక్షన్ చేసేవాణ్ణి. అప్పుడు ఎవరూ ఏమీ అనరు కదా! బహుశా... ఎన్టీఆరే కథ రాశాడు, డైరెక్షన్ చేస్తున్నాడనే ఫోకస్ ఎక్కువ ఉండేదేమో! ఏకేయడానికో... పొగడడానికో... అందరూ రెడీగా ఉండేవాళ్లు. అంత ప్రతిభే ఉండుంటే... ఎప్పుడో దర్శకుణ్ణి, రచయితను అయ్యేవాణ్ణి. త్రిపాత్రాభినయం చేయాలనే కోరిక ఎప్పుడూ మనసులో లేదు. ఏ సినిమా చేయాలనే మీమాంశలో కథలు వింటునప్పుడు బాబీ ఈ కథతో వచ్చాడు. తను నాకు కథ చెప్పినప్పుడే... తన మైండ్‌లో ‘జై లవకుశ’ టైటిల్ ఉంది. కథలో మూడు పాత్రలున్నాయి. ► ఎప్పట్నుంచో కల్యాణ్ అన్న, నేనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. యాదృశ్చికమో? మరొకటో? అన్నదమ్ములు కలసి చేస్తున్న సినిమాకు అన్నదమ్ముల కథే దొరికింది. మా అదృష్టమది. బయట సంస్థకి, అన్నయ్య సంస్థలో చేస్తున్న సినిమాకు తేడా ఏంటంటే... ఈ సిన్మాను మా పేరెంట్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. అందువల్ల, మాపై ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడి వల్లే ఏమో? నేనూ, అన్నయ్య, మా టీమ్ ఎక్కువ కష్టపడ్డాం. మా ఫ్యామిలీకి ఇంకా సినిమా చూపించలేదు. మీరంతా (ప్రేక్షకులు) సినిమా విడుదలైన రోజే, ఉదయమే చూస్తారు. మేం 20వ తేదీ రాత్రి చూస్తాం లేదా 21 రాత్రి చూస్తాం! ► మూడు పాత్రలు తీసి పక్కన పడేస్తే... బాబీ చెప్పిన కథే నాకు నచ్చింది. అమ్మప్రేమను చెప్పే సినిమాలు ఎన్నో చూశాం. నాన్న గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. నేనే ఓ సినిమా (నాన్నకు ప్రేమతో) చేశా. కానీ, ఎక్కడా అన్నదమ్ముల అనుబంధం గురించి పెద్దగా రాలేదు. తాతగారు చేసిన ‘భలే తమ్ముడు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో మాత్రమే అరుదుగా చూశాం. ఎప్పుడైతే అలాంటి సినిమా చేసే ఛాన్స్ నాకు వచ్చిందో? వెంటనే ఒప్పేసుకున్నా. బహుశా... నేను మా అన్నయ్యకు (కల్యాణ్‌రామ్)కు ఎక్కువ ఎటాచ్ కావడం ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం. ► ముగురిలో ‘జై’ విలన్, ‘లవ’ హీరో, ‘కుశ’ కమెడియన్ అనుకుంటే... ఈ ‘జై లవకుశ’ చిత్రకథ చెడుపై మంచి గెలవడమో? మంచిపై చెడు గెలవడమో? కాదు. ఓ తల్లి కడుపున ముగ్గురు కవలలు పుట్టారు. తల్లి కోరికకు పూర్తి విరుద్ధంగా వాళ్ల జీవితాలు తయారవుతాయి. బయట పరిస్థితుల ప్రభావం వల్ల ఓ తల్లి కన్నటువంటి కల చెదురుతుంది. ఆ తల్లి కల నిజమవుతుందా? రావణ రామ లక్ష్మణులు మళ్లీ రామ లక్ష్మణ భరతులు అవుతారా? అనేది కథ. ఇదొక ఎమోషనల్ డ్రామా. అమ్మగా పవిత్రా లోకేష్ బాగా చేశారు. ► మీకు నచ్చిన పాత్ర ఏది? అని ఎన్టీఆర్‌ను అడిగితే... ‘‘ఒక పాత్ర పేరు చెబితే పక్షపాతం అవుతుంది. దేని గురించైనా మనం ఎక్కువ కష్టపడితే.. దానిపై ఇష్టం పెరుగుతుందని చెబుతారు. ‘జై’ కోసం ఎక్కువ కష్టపడ్డా కాబట్టి ఆ పాత్రంటే నాకిష్టం! కానీ, మూడు పాత్రల్లో ఏ ఒక్కటి తీసేసినా కథకు పరిపూర్ణత ఉండదు. ‘కుశ’ పాత్ర ఎక్కడో ‘యమదొంగ’లో నేనే చేసినట్టు, ‘లవ’ పాత్ర ‘నాన్నకు ప్రేమతో’లో నేనే చేసినట్టుంటుంది. ఆ రెండు పాత్రలకు రిఫరెన్సులున్నాయి. ‘జై’ పాత్రకు లేదు. పైగా ఇది నెగటివ్ షేడ్ క్యారెక్టర్. దాంతో నా కష్టం ఎక్కువైంది. విలన్‌గా చేయడం నచ్చింది. ► మెంటల్లీ, ఫిజికల్లీ బాగా ఎక్కువ కష్టపెట్టిన చిత్రమిది. టెక్నాలజీ ఎంత పెరిగినా నటించాల్సింది నేనే కదా! నటనలో టెక్నాలజీ లేదు కదా! నటీనటులు ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్‌ను ఫాలో కావల్సిందే. అందుకే, నా హోమ్‌వర్క్ నేను చేశా. ఒక్కోరోజు మూడు పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా ‘జై’ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమే పట్టింది. అదృష్టవశాత్తూ... నాకు ‘బిగ్ బాస్’ కొంచెం హెల్ప్ చేసింది. వీకెండ్లో ‘బిగ్ బాస్’కి వెళ్లినప్పుడు నాలా నేను ఉండేవాణ్ణి. ఈ సినిమా ఎంత ఇబ్బంది పెట్టినా... ఇలాంటి అవకాశం ఇంకెవరికి వస్తుందనే ఆశతో చేశా. నేనేంటో నిరూపించుకోవాలనుకున్నా. అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి. ► నాకు తాతగారి (ఎన్టీఆర్) ‘భలే తమ్ముడు’ సినిమా బాగా ఇష్టం. అందులో ఆయన విలన్ని కూడా హీరోలా ప్రజెంట్ చేయగలిగారు. ఆయన ఆహార్యంతో, రూపురేఖలతో, నటనతో! రామారావుగారు రెండు వేషాలు వేస్తే మనం ఇంకెవర్నీ చూడం. ఆయన్నే చూస్తుంటాం. ఎక్కడో నా మనసులో దాగున్న ఈ విషయాలన్నీ ‘జై లవ కుశ’ చేసేలా చేశాయి. ‘దానవీరశూరకర్ణ’ మాకు స్ఫూర్తే. కానీ, కథ ప్రకారం కాదు. కృష్ణుడి నుంచి దుర్యోధనుడికి, దుర్యోధనుడి నుంచి కర్ణుడి పాత్రకు ఎలా షిఫ్ట్ అయ్యారు? పాత్రల మధ్య ఎలాంటి డిఫరెన్స్ చూపించారు? ఎలా బ్యాలెన్స్ చేశారు? అనేవి మాకు స్ఫూర్తిగా నిలిచాయి. ► ‘జై’ పాత్ర కోసం నత్తితో మాట్లాడడానికి కోచింగ్ తీసుకున్నారా? అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా... ‘‘నథింగ్! కోచింగ్ సిస్టమ్‌ను నమ్మను. నత్తి అంటే ఏంటి? మనం ఏం మాట్లాడాలో మన మైండ్‌కి తెలుసు. కానీ, మైండ్ మనల్ని బ్లాక్ చేస్తుంది. ఓ పదాన్ని పూర్తిగా పలకనివ్వకుండా బ్లాక్ చేస్తుంది. సాధారణంగా నత్తిగా మాట్లాడాలంటే ‘ద్ద... ద్ద... ధైర్యం’ అనాలి. అలా కాకుండా ధైర్యంలో ‘ద’ను మింగేసి ‘ద్ధ... ద్ధ... ఐర్యం’ అని పలికా’’ అన్నారు. ► భవిష్యత్తుల్లో రాజకీయాల్లోకి నేను రావొచ్చు. రాకపోవచ్చు. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడం ఇష్టం లేదు. ఒకవేళ మాట్లాడితే తొందరపాటు అవుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి వెళ్తున్న దారిలోంచి కొంచెం పక్కకు వెళ్తాడు. నేనూ వెళ్లాను (రాజకీయాలను ఉద్దేశించి). అయితే మళ్లీ సరైన దారిలోకి రావడం నా అదృష్టం. నా ఫ్యాన్స్ వల్ల, దర్శకుల వల్ల నేను వెనక్కి రాగలిగా. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నా. ► తాతగారి లెగస్సీని సినిమాల్లో ముందుకు తీసుకువెళ్తున్నానని అనుకుంటారా? అని ఎన్టీఆర్‌ని అడగ్గా... ‘‘ముందు నేను లెగస్సీని నమ్మను. వారసత్వం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నేను హీరోనని... రేపు కచ్చితంగా నా కొడుకు (అభయ్‌రామ్) హీరో కావాలంటే కుదరదు. సినిమా వాతావరణంలో పెరగడం వల్ల తను సహజంగా ఈ రంగం పట్ల ఆకర్షితుడు కావొచ్చు. అంతే తప్ప... నేను మాత్రం అభయ్‌ను ఫోర్స్ చేయను. మా నాన్నగారు, అమ్మగారు నన్ను హీరో అవ్వమని ఫోర్స్ చేయలేదు. హీరో అవ్వాలని నాకు అనిపించింది. అయ్యాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 25 నుంచి 30 మంది హీరోలున్నారు. అందరికీ వారసత్వం ఉందా? ప్రతిభే ఇక్కడ మాట్లాడుతుంది. నేను దాన్నే నమ్ముతా’’ అని చెప్పారు. అభయ్‌కి జై నచ్చాడు! ‘మా అబ్బాయి అభయ్‌కి ‘జై’ బాగా నచ్చేశాడు. ‘జై జై రావణా...’ అని పాడుతున్నాడు. మా అమ్మగారు ఇప్పట్నుంచి వాడికి రామాయణ, మహాభారత ఇతిహాసలను వివరించి చెబుతున్నారు. దాంతో అభయ్‌కి కొంచెం కొంచెం అవగాహన ఏర్పడుతోంది. ఒక్క మాస్క్ కూడా వాడలేదు! ఇందులో మూడు పాత్రలు చేశా. ఒక్కో ఫ్రేమ్‌లో మూడు లేయర్స్ ఉంటాయి. ఫోకస్ లేయర్ ఒకటి. నాన్ ఫోకస్ లేయర్స్ రెండు. మూడుసార్లు షూటింగ్ చేయడం ఎందుకు? నాన్ ఫోకస్ లేయర్స్‌కి మాస్కులు వేయొచ్చు కదా అనే ఆలోచనతో హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్‌వెల్‌ని పిలిచాం. ప్రోస్థెటిక్ మేకప్ మాస్కులను రెడీ చేయించాం. కానీ, చివరకు ఒక్క మాస్క్ కూడా వాడలేదు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ రెండుంటే రెండు, మూడుంటే మూడు పాత్రలను నేనే చేశా. డూప్‌లను పెట్టి మేనేజ్ చేయలేదు. బాబీ సత్తా ఉన్న దర్శకుడు! రచయితగా బాబీ ఎన్నో సినిమాలు రాశాడు. తనకు కొత్తగా అర్హతలు ఏవీ అవసరం లేదు. దర్శకుడిగా తను తీసిన రెండు సిన్మాల్లోనూ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెంటాస్టిక్. హిట్టూఫ్లాపులు పక్కన పెడితే... దర్శకుడిగా తనలో సత్తా ఉంది. నిరూపించుకున్నాడు కూడా. ఎక్కడా అతన్ని ప్రశ్నించే ఇది లేదు. కానీ, తనకు కావల్సిన సపోర్ట్‌ని ఇవ్వడంలో మాత్రం కల్యాణ్ అన్న ఫెంటాస్టిక్! మూడు పాత్రలను డీల్ చేయాలి కాబట్టి... మంచి టెక్నీషియన్లను కల్యాణ్ అన్న సినిమాకు తీసుకున్నారు. ఇది బాబీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. నటుడిగా నాకు, నిర్మాతగా అన్నయ్యకు కూడా! నేను బాక్సాఫీస్ రిజల్ట్స్ గురించి, కలెక్షన్స్ గురించి మాట్లాడడం లేదు. మాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొస్తుందనే అంశం గురించే చెబుతున్నా! నేను టీచర్ని కాదు! ‘మీరు ఇంత బాగా నటిస్తారు కదా! టిప్స్ చెప్పండి’ అని నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు. నేను టీచర్ని కాదు, ఇంకా లెర్నర్నే. ఎవరికైనా ఎలా నటించాలో మనం ఎలా చెప్పలగం? అసలు, ‘ఎవరైనా మొదటిసారి ఎప్పుడు నటించుంటారో తెలుసా?’ ఒక్కసారి ఆలోచించండి. తల్లితండ్రులకు అబద్ధం చెప్పినప్పుడు. ‘లేటుగా వచ్చావేంటి?’ అని ఇంట్లో అడగ్గానే... ఈ సిట్యువేషన్ లోంచి ఎలాగైనా బయటపడాలని అబద్ధాన్ని ఎంతో అందంగా చెబుతాం కదా. నటనంటే అదేనని నా ఫీలింగ్. నో ఫైనాన్షియల్ డిస్కషన్స్! ఇప్పటివరకూ కల్యాణ్‌రామ్ నిర్మించిన సినిమాలు ఆయనకు నష్టాల్నే మిగిల్చాయి. ‘జై లవకుశ’తో ఆయన గట్టెక్కేశారు! అనే వార్తలపై ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా... ‘‘కల్యాణ్ అన్న కష్టాల్లో ఉన్నారు! నాతో సినిమా చేసి ఆయనకు సుఖం వచ్చేసింది’ అనుకోవడం లేదు. అలాంటి చర్చ గురించి కామెంట్ చేయాల్సిన అవసరమూ లేదనుకుంటున్నా. అన్నయ్య కష్టాల్లో ఉంటే ఇన్ని సినిమాలు ఎలా నిర్మిస్తాడు? ‘జై లవకుశ’ ఎలా తీస్తాడు? సింపుల్ లాజిక్... ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ లేవనుకోండి! నాకు మూడు సూపర్‌హిట్స్ ఉండవు. అయినా సినిమాలు చేస్తా కదా! ఆయనేంటో నాకు తెలుసు’’ అన్నారు. ‘కల్యాణ్‌రామ్‌కి, మీకు మధ్య ఫైనాన్షియల్ డిస్కషన్స్ జరగలేదా?’ అనడిగితే ‘‘ఏ సినిమాకీ దర్శక–నిర్మాతలతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేయను. వేరే నిర్మాతలతోనే డిస్కస్ చేయనప్పుడు అన్నయ్యతో ఎందుకు చేస్తా’’ అన్నారు. దర్శకుడి సలహాతోనే... తమన్నా ముందు నుంచి స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తున్నారు. ‘ఊసరవెల్లి’ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆమెతో నేను వర్క్ చేశా. అయితే... ఈసారి స్పెషల్ సాంగ్ చేశా. ‘జనతా గ్యారేజ్’లో కాజల్‌తో కలసి స్టెప్పులేశా. ఈసారి తమన్నాతో చేస్తే బాగుంటుందని దర్శకుడు సలహా ఇవ్వడంతో ఆమెను తీసుకున్నాం! పాట కూడా బాగా వచ్చింది. హీరోయిన్లుగా నటించిన రాశీఖన్నా, నివేథా థామస్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే... ఒక్కో రోజు మూడు పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు నేనెప్పుడైనా డల్ అయితే వాళ్లు ఎంతో ఉత్సాహపరిచేవారు. -
స్క్రీన్ టెస్ట్
► ఈ హీరో అసలు పేరు నవీన్ బాబు గంటా. అతనెవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) రవితేజ బి) నిఖిల్ సి) నాని డి) శర్వానంద్ ► ఈ కింది వారిలో ట్విట్టర్ ఐడీ లేని ప్రముఖ హీరో ఎవరు? ఎ) రానా బి) వెంకటేశ్ సి) పవన్‌కల్యాణ్ డి) ఎన్టీఆర్ ► బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ మధ్య మందబుద్ధి కలిగిన వ్యక్తిగా నటించిన చిత్రం ఏది? ఎ) సుల్తాన్ బి) భజరంగీ భాయ్జాన్సి) ట్యూబ్‌లైట్ డి) కిక్ ► ఇక్కడున్న 4 సినిమాల్లో బాలకృష్ణ ఏ చిత్రంలో డ్యూయల్ రోల్ చేయలేదు? ఎ) సుల్తాన్ బి) ఆదిత్య 369 సి) ఒక్కమగాడు డి) టాప్ హీరో ► హీరో రామ్‌చరణ్ ఫస్ట్ మూవీ ‘చిరుత’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) తమన్ సి) కీరవాణి డి) మణిశర్మ ► సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య’ చిత్రాన్ని ముందు వేరే హీరోతో తీద్దాం అనుకున్నారు. ఆ హీరో పేరు చెప్పగలరా? ఎ) రామ్ బి) నితిన్సి) సిద్ధార్థ్ డి) ఉదయ్‌కిరణ్ ► హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆమె చివరిసారిగా తెలుగులో హీరోయిన్గా యాక్ట్ చేసిన చిత్రానికి దర్శకుడు ఎవరు? ఎ) పూరి జగన్నాథ్ బి) త్రివిక్రమ్ సి) మెహర్ రమేశ్ డి) సురేందర్‌రెడ్డి ► శ్రీదేవి 300వ చిత్రం ‘మామ్’ దర్శకుడు ఎవరు? ఎ) సంజయ్ లీలా భన్సాలీ బి) కబీర్ ఖాన్ సి) రవి ఉడయార్ డి) రాజ్‌కుమార్ హిరాణి ► పైన ఉన్న నలుగురు నాయికల్లో సావిత్రిగా ‘మహానటి’లో నటిస్తున్నదెవరు? ఎ) కీర్తీ సురేశ్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) సాయిపల్లవి డి) త్రిష ► ప్రస్తుతం ఈ నాలుగు హీరోయిన్లలో ఒకరు ఓ ఫొటోగ్రాఫర్‌తో లవ్‌లో ఉన్నారు? ఎ) ఇలియానా బి) తమన్నాసి) నిత్యామీనన్ డి) కార్తీక ► ఎన్టీఆర్ నటించిన ‘బాద్షా’ చిత్రంలో కామెడీ పండించిన బ్రహ్మానందం క్యారెక్టర్ పేరు గుర్తుందా? ఎ) పిల్లి రాధాకృష్ణ సింహా బి)పిల్లిగోపీకృష్ణ సింహా సి) పిల్లి రామకృష్ణసింహా డి) పిల్లి పద్మనాభసింహా ► ‘ట్రస్ట్ నో వన్. కిల్ ఎనీ వన్. బీ ఓన్లీ వన్’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఏ చిత్రంలోనిది? ఎ) మున్నా బి) బిల్లా సి) యోగి డి) రెబల్ ► ‘పచ్చని చిలకలు తోడుంటే కూసే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు...’ అనే పాట కమల్‌హాసన్ నటించిన ఏ చిత్రంలోనిది? ఎ) నాయకుడు బి) దశావతారం సి) భారతీయుడు డి) ఇంద్రుడు చంద్రుడు ► ఎవర్ గ్రీన్ మూవీ‘మాయా బజార్’ దర్శకుడుకె.వి. రెడ్డి పూర్తి పేరు తెలుసా? ఎ) కటారి వెంకట్‌రెడ్డి బి) కదిరి వెంకటరెడ్డి సి) కోవటిగంటి వీరరెడ్డి డి) కట్లూరి వెంకట్‌రెడ్డి ► ఈ నలుగురిలో ఒక బ్యూటీ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్. చాలా ఈజీగా చెప్పేస్తారు కదూ? ఎ) అనీషా ఆంబ్రోస్ బి) సమంత సి) అనుష్కా డి) మమతా మోహన్‌దాస్ ► ‘కర్తవ్యం’ సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ నటుడు ఆ తర్వాత 1999వ సంవత్సరంలో వచ్చిన ఓ సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. ఆ నటుడెవరు? ఎ) రవితేజ బి) బ్రహ్మజీ సి) సాయికుమార్ డి) వినోద్‌కుమార్ ► జూనియర్ ఎన్టీఆర్‌కి ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఒకరున్నారు. ఆ హీరోయిన్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా ఆమెతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమేనని చెబుతుంటారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రమ్యకృష్ణ బి) శ్రీదేవి సి) రాధ డి) జయప్రద ► ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) ఆరాధన బి) సంసారం సి) తాండ్ర పాపారాయుడు డి) ఆత్మబలం ► ఈ ఫొటోలో ముద్దు ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్. చిన్న క్లూ... ఈమె మలయాళ కుట్టి ఎ) సాయి పల్లవి బి) అనుపమా పరమేశ్వరన్ సి) మడోన్నా డి) నివేదా థామస్ ► ‘చలిచలిగా అల్లింది...’ ఈ పాట పాడిన బాలీవుడ్సింగర్ ఎవరు? ఎ) లతా మంగేష్కర్ బి) ఆశా భోంస్లే సి) శ్రేయా ఘోషల్డి) అలిషా చినాయ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) సి 4) డి 5) డి 6) బి 7) ఎ 8) సి 9) ఎ 10) ఎ 11) డి 12) బి 13) సి 14) బి 15) బి 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) సి -
తెలుగు రాణీ తమన్నాయే
ప్రతి మెతుకుపై తినేవాళ్ల పేరు రాసుంటుందని ఓ సామెత. ఏయే పాత్రల్లో ఎవరెవరు నటించాలనేది కూడా దేవుడు రాసుంటాడనుకోవాలేమో! ఎందుకంటే... హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో మెయిన్ లీడ్‌గా ముందు తమన్నా పేరే వినిపించింది. కొన్నాళ్లకు తెలుగులోనూ ఆమె నటిస్తారన్నారు. ఏమైందో ఏమో... తమిళ రీమేక్‌లో ‘క్వీన్’గా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు. కానీ, తెలుగులో రాణీగా తమన్నానే కన్ఫర్మ్ చేశారు దర్శక–నిర్మాతలు. తెలుగు వెర్షన్‌కి ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కార గ్రహీత, ‘షో, మిస్సమ్మ’ సినిమాల ఫేమ్ నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ముంబై వ్యాపారవేత్త మను కుమారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘క్వీన్’ సౌత్ రీమేక్స్ అన్నిటికీ ఆయనే నిర్మాత. ‘‘ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తమన్నా మెయిన్ లీడ్‌గా నీలకంఠ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తాం. త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయాలనేది మా ప్లాన్’’ అని మను కుమారన్ తెలిపారు. బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఇందులో సెకండ్ లీడ్‌గా నటించనున్నారు. -
షో డైరెక్టర్‌తో క్వీన్..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు కేవలం కన్నడ రీమేక్ మాత్రమే మొదలైంది. తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా క్వీన్ రీమేక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. షో, మిస్సమ్మ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడట. తమన్నా లేదా కాజల్ లలో ఒకరు లీడ్ రోల్ లో నటించే అవకాశం ఉంది. అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తారా..? లేక కేవలం తెలుగు వర్షన్ మాత్రమే రూపొందిస్తారన్న అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారన్న టాక్ వినిపిస్తోంది. -
మాట మార్చిన మిల్కీబ్యూటీ
సాక్షి, చెన్నై: సమయానికి తగు మాటలాడే అన్న పదం ఊరికే వాడుకలోకి రాలేదు. ఇవాళ మాటకు కట్టుబడే వారిని వెతికి పట్టుకోవలసిని పరిస్థితి. ఇక సినీ రంగంలో అయితే సరే సరి. అదే కథానాయికల్లో అయితే మరీనూ. బహు భాషా తారలు అవసరాన్ని బట్టి మాట్లాడేసి ఆ తరువాత వివాదాస్పదంగా మారడంతో తూచ్ తానలా అనలేదు అని మాట మార్చేయడం మామూలైపోయింది. ఆ మధ్య నటి తమన్నా బాహుబలి చిత్రంతో వెలిగిపోయింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి– 2 చిత్రంలో మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడం ఆమెను చాలా నిరాశపరచింది. ఆ తరువాత దక్షిణాదిలో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో బాలీవుడ్లో మకాం పెట్టాలని ఆశతో అక్కడ ఇకపై హిందీ చిత్రాల్లోనే నటిస్తానని, దక్షిణాదిలో అవకాశాలు వస్తే ఆలోచిస్తానని అనేసింది. ఇలాంటి లూజ్ టాక్ తమన్నాను వివాదాల్లోకి లాగింది. ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా వెనక్కి పోయాయట. దీంతో చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డ ఈ అమ్మడు దక్షిణాదిలో అవకాశాలు రావడం లేదని, బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తానని తానెప్పుడూ అనలేదని ప్లేట్ ఫిరాయించింది. తమన్నా మాట మార్చినా అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుందని సమాచారం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్‌తో ఐటమ్ సాంగ్‌లో లెగ్ షేక్ చేయడానికి తమన్నా రెడీ అవుతోంది. ఇందుకు భారీ పారితోషికాన్నే పుచ్చుకుంటోందన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. తమిళంలో మాత్రం విక్రమ్‌కు జంటగా స్కెచ్ అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో నయనతార నటిస్తున్న కొలైయూర్ కాలం హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తోంది. -
జై.. లవ.. కుశతో స్పెషల్ సాంగ్‌లో?
‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్’ చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో దుమ్ము రేపారు మిల్కీ బ్యూటీ తమన్నా. తాజాగా ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జై లవకుశ’ సినిమాలోనూ ఆమె ఓ ప్రత్యేక పాట చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ తొలిసారి మూడు పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రంలో ఉన్న ఓ ప్రత్యేక పాటను తమన్నాతో చేయిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. తమన్నాని సంప్రదించగా, నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కాగా, ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో ‘పక్కా లోకల్’ పాట తమన్నా చేస్తారంటూ వార్తలొచ్చినా, కాజల్ చేశారు. అప్పుడు మిస్ అయిన అవకాశం ‘జై లవకుశ’తో మిల్కీ బ్యూటీకి దక్కిందని బోగట్టా. -
కల్యాణ్‌రామ్‌తో కొత్త లుక్‌లో...
‘బాహుబలి–2’ తర్వాత తెలుగులో పలు అవకాశాలొచ్చినా తమన్నా అంగీకరించలేదు. జస్ట్... గాళ్ నెక్ట్స్ డోర్, బబ్లీ గ్లామరస్ రోల్స్ కాకుండా కొత్తగా, నటనకు అవకాశమున్న క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నానని ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇప్పుడు అటువంటి అవకాశమే వచ్చినట్టుంది. వెంటనే ఓకే చెప్పేశారు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి నిర్మిస్తున్న ఈ సిన్మాలో హీరోయిన్గా ముందు ఐశ్వర్యలక్ష్మిని ఎంపిక చేశారు. ఏమైందో ఏమో ఇప్పుడామె స్థానంలో తమన్నా వచ్చి చేరారు. ‘‘యస్... కల్యాణ్‌రామ్‌కు జోడీగా తమన్నాను ఎంపిక చేశాం. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్త లుక్‌లో కనిపిస్తారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్ మొదలవుతుంది. సెప్టెంబర్ నెలాఖరుకు 50 శాతం టాకీ పూర్తవుతుంది’’ అని చిత్రసమర్పకుడు మహేశ్ కోనేరు తెలిపారు. ఈ సినిమాకు తమన్నా కోటీ అరవై లక్షలు పారితోషికం అందుకుంటున్నట్లు సమా చారం!! -
త్వరలో స్కెచ్ ఆడియో
తమిళసినిమా: వైవిధ్యం కోసం తపించే నటుల్లో విక్రమ్ ఒకరని చెప్పవచ్చు. పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంతకైనా రెడీ అనే నటజీవి విక్రమ్. తనకు తొలి విజయాన్ని అందించి నటుడిగా జీవితాన్నిచ్చిన సేతు చిత్రం నుంచి ఈ మధ్య తెరపైకి వచ్చి విజయం సాధించిన ఇరుముగన్ వరకూ జయాపజయాలను పక్కన పెడితే విక్రమ్ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని చెప్పవచ్చు. అయితే ‘ఐ’ వంటి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు విక్రమ్ శ్రమకు తగిన ఫలితాన్ని అందించలేదు. దీంతో చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్న విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి స్కెచ్. రెండవది ధృవనక్షత్రం. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవనక్షత్రం చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దీంతో ముందుగా స్కెచ్ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి తమన్నా తొలిసారిగా నటిస్తోంది. విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఎస్ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సంగీతదర్శకుడు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం తరువాత విక్రమ్ ధృవనక్షత్రం చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. ఆ తరువాత హరి దర్శకత్వంలో సామి–2 చిత్రానికి రెడీ అవుతారని సమాచారం. -
డాక్టర్ తమన్నా
తమన్నా డాక్టర్ అయ్యారు. అంటే.. యాక్టర్‌గా రిటైర్ అయ్యారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. తమన్నా రియల్ డాక్టర్ కాదు. సినిమా రంగంలో కష్టపడి పైకి రావడం, మంచి పేరు తెచ్చుకోవడాన్ని అభినందిస్తూ, గుజరాత్‌కు చెందిన ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమిషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టరేట్ అందుకున్నారు. ‘శ్రీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు ‘హ్యాపీడేస్’తో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ, దూసుకెళుతున్నారు. దాదాపు పదేళ్ల కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. దక్షిణాది సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్కిగాను గౌరవ డాక్టరేట్ దక్కిందామెకు. ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందనీ, తన బాధ్యతను మరింత పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని ‘డాక్టర్ తమన్నా’ అన్నారు. -
‘హీరోపై మిల్కీ బ్యూటీ పొగడ్తల వర్షం’
చెన్నై: సినీ హీరో ప్రభాస్‌ను మిల్కీబ్యూటీ తమన్నా పొగడ్తల్లో ముంచేస్తోంది. బాహుబలి చిత్రంలో ఆయన్ని ముద్దుల్లో ముంచెత్తి మైరపించిన తమన్నా ఆ చిత్ర సీక్వెల్లో మాత్రం పెద్దగా కనిపించలేదు. ఆ బాధను కనిపించిన వారందరితో చెప్పుకుని తెగ ఇదైపోయిన ఈ అమ్మడు మార్కెట్ మళ్లీ డౌన్ అయిపోయింది. ప్రస్తుతం చేతిలో పెద్దగా చిత్రాలు లేవు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోంది. దీంతో ఎలాగైనా మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలని మిల్కీబ్యూటీ కంకణం కట్టుకున్నట్టుంది. అది బాహుబలి పెయిర్ రిపీట్ అయితే బాగుండని భావించిన తమన్న అలాంటి అవకాశం సంపాదించుకునే పనిలో ముమ్మరంగా పడ్డట్టుంది. ఇందులో భాగంగా ఒక భేటీలో నటుడు ప్రభాస్ అద్భుతమైన నటుడు, అంతేకాకుండా తనకు మంచి ఫ్రెండ్ అంటూ తెగ పొగిడేసింది. మళ్లీ ప్రభాస్‌తో కలిసి నటిస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని పేర్కొంది. అయితే మంచి కథ అయితేనే తామిద్దరం కలిసి నటించే అవకాశం ఉంటుందనీ చెప్పుకొచ్చింది. తనపై ప్రేమాభిమానాలు ఉన్న వారే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. వారు బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రంలో నటించే అవకాశాన్ని అందిస్తారనే నమ్మకం తనకుందనే ఆశాభావాన్ని తమన్న వ్యక్తం చేసింది. -
సరైనోడు ఎక్కడున్నాడో?
తమిళసినిమా: నటి తమన్నాకు భర్త కావాలట. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి తమన్నా. ఇప్పటివరకూ గ్లామరస్ పాత్రలో అందాలను ఆరబోసిన ఈ అమ్మడు బాహుబలి చిత్రంలో తనదైన నటనతో అలరించింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న తమన్నా సినీ జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అని చెప్పుకునే రీతిలో ఆ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుంది.కాగా ఇటీవల శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరోసారి గ్లామర్ పరంగా దుమ్మురేపిందనే చెప్పాలి. అయినా ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరచింది. కాగా ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా స్కెచ్ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రూ.కోటిన్నరకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్న తమన్నా నటనతో పాటు తన తండ్రి నగల వ్యాపారంలో సాయంగా ఉంటున్నారు. షూటింగ్ లేని సమయాల్లో నగల డిజైన్లు చేస్తుంటారట. కాగా ఇటీవలే తన సోదరుడి వివాహనిశ్చితార్ధం వేడుకలో అంతా తానై హడావుడి చేసిన భామకు కూడా పెళ్లి చేసేసి తమ బాధ్యతను దించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగానే ఆమె తల్లిదండ్రులు తమన్నాకు వరుడి వేటలో ముమ్మరంగా ఉన్నారట. మరి తమన్నాకు సరైనోడు ఎక్కడున్నాడో? ఎప్పుడోస్తాడో? తమన్నా కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉందట. -
పాపం తమన్నా చెల్లెలు!
క్రైమ్ పేరెంటింగ్ హిందీలో ‘తమన్నా’ అంటే ఆశ.. కోరిక.. కాంక్ష. ఏదో కావాలన్న ఆశ. ఏదో అయిపోవాలన్న కోరిక. ఒక్క ఛాన్స్ వస్తే.. స్టార్ అవ్వాలన్న కాంక్ష. ఇవన్నీ లేకపోతే.. అమ్మాయిలు హీరోయిన్లు ఎలా అవుతారు? కష్టం ఉండాలి.. నష్టం ఉండాలి.. దీక్ష ఉండాలి.. ప్రతిభ ఉండాలి. వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా ఉంటోంది! అమాయకత్వం! ‘అచ్చు.. తమన్నా చెల్లెల్లా ఉన్నావు’ అని ఎవరైనా అంటే... మన అమ్మాయికి ఆశ కలగదా? కోరిక పుట్టదా? కాంక్ష.. పెడదారి పట్టదా?! ‘‘పిల్ల ఏం చేస్తోంది? ఏమాలోచిస్తోంది– అని ఒక్కసారైనా పట్టించుకున్నావా?’’ కోపంతో అరిచాడు సురేష్ భార్య మీద.‘‘దాని మనసులో ఇలాంటి ఆశలున్నాయని నేను మాత్రం కలగన్నానా?’’ కళ్లల్లో తిరిగిన నీళ్లను పమిటచెంగుతో తుడుచుకుంటూ అంది రత్న.‘ముందునుంచీ చెప్తున్నా.. పిల్లలు చెప్పినట్టు ఆడొద్దు.. ఏది కావాలంటే అది ఇప్పించొద్దు అని?’.. అదే పిచ్‌లో అన్నాడు సురేశ్.‘‘తప్పు నా ఒక్కదానిదేనా? మీకు లేదా బాధ్యత? ఎప్పుడూ ఆఫీస్, క్యాంప్‌లు అని తప్ప ఇంట్లోవాళ్ల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా?’’ ఒక్కసారిగా ఏడ్చేసింది రత్న. పరిస్థితి తీవ్రం అవుతోందని గ్రహించి రత్న తల్లిదండ్రులు, సురేష్ తల్లిదండ్రులు.. మధ్యలో కల్పించుకున్నారు. ‘‘ఇది తప్పొప్పులు ఎంచుకునే టైమ్ కాదు. ముందు పిల్ల జాడ వెదికే ప్రయత్నం చేయండి’’ అన్నాడు సురేష్ తండ్రి. ‘‘బావగారూ... రశ్మి ఇంటిలోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్ కంప్లయింట్ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు. బేలగా చూశాడు సురేష్. అక్కడున్న అందరూ అవునన్నట్టు కళ్లతోనే చెప్పారు. తప్పదన్నట్లుగా రశ్మీ ఫోటో, వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి రాసిన ఉత్తరం.. తీసుకొని బావమరిదిని వెంటబెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు సురేష్. హైదరాబాద్.. యూసుఫ్‌గూడ ‘‘అబ్బ.. సేమ్ టు సేమ్ తమన్నా!’’ అన్నాడు మధు. బ్లూజీన్స్, బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వచ్చిన రశ్మిని చూసి ముగ్ధుడైనట్టు. ‘‘అంత కలర్ ఉన్నానా?’’ ఆ కితాబుకు కొంచెం సిగ్గు పడుతూ అంది రశ్మి. ‘‘అంతకన్నా ఎక్కువే ఉన్నావ్! అయినా నీకేం తక్కువరా.. మంచి కలర్, మాంచి ఫిగర్.. నువ్వు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక నిన్ను చూసి తమన్నా కుళ్లుకోకపోతే అడుగు!’’ సవాలు విసురుతున్నట్టుగా అన్నాడు మధు. ‘‘తెలుగులో కాదు.. హిందీలో చాన్సెస్ కావాలి.. రాజమండ్రిలో నన్నంతా ‘బాలీవుడ్ భామలాగుంటావే’ అనేవాళ్లు’’ అంది అద్దం ముందు అటూ ఇటూ రకరకాల భంగిమల్లో కదులుతూ. ‘‘అబ్బో..’’ అని సణుక్కున్నాడు. ‘‘ఏమన్నావ్?’’ అంది కాస్త మొహం ఎర్రగా చేసుకుంటూ.. ‘‘అబ్బా.. అన్నాను మెచ్చుకుంటూ’’ సవరించుకున్నాడు మధు. రశ్మి మొహం వెలిగిపోయింది.‘‘నీకు తెలుసా.. నేను లాంగ్ టాప్.. నీలెంగ్త్ లెగ్గింగ్ వేసుకుంటే...’’ అని రశ్మీ చెప్తుంటే ‘బాబోయ్ మొదలెట్టిందిరా మళ్లీ’ అన్నట్టుగా చూపులను నేలకు దించి.. తనలో తనే మెల్లగా గొణుక్కున్నాడు. ‘‘ఏయ్.. మధూ..’’– వింటున్నావా లేదా అన్నట్టుగా గద్దించింది.‘‘అదే.. రశ్మీ.. వింటున్నా... నీలెంగ్త్ లెగ్గింగ్, లాంగ్ టాప్ వేసుకొని వెళితే నీ ఫ్రెండ్స్ అంతా ‘దీపికా పడుకోన్లా ఉన్నావే’ అని కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు అవునా...’’ ఎన్నిసార్లు చెప్తావ్ అనే ధ్వని మధు మాటలో.‘‘దీపికా కాదు.. కత్రినా..’’ సరిదిద్దింది.‘‘అదేలే.. జీన్స్ వేసుకుంటే దీపికాలా .. హెయిర్ లీవ్ చేస్తే అనుష్కలా.. లాంగ్‌స్కర్ట్ వేసుకుంటే ఆలియాలా.. పటియాలా వేసుకుంటే కరీనాలా.. కదా..’’ అన్నాడు మధు.. కరెక్ట్‌గా గుర్తుంది అన్నట్టుగా!‘‘ఊ.. అవును’’ మళ్లీ సిగ్గుపడింది.‘‘రశ్మీ.. ఈరోజు మా ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు రూమ్‌కి. మనం ఖాళీ చేసేయ్యాలి’’ అన్నాడు. ‘‘ఎలా మరి?’’ అంది కంగారుగా.‘‘నువ్వేమో ‘బాలీవుడ్ చాన్స్‌లే కావాలి’ అంటున్నావ్. ముంబైలో మా ఫ్రెండ్‌కి రాత్రి కాల్ చేస్తే.. ‘ముందు మోడలింగ్‌కి ట్రై చేయాల్రా.... తర్వాతే సినిమాల్లోకి’ అన్నాడు. వాడికి నీ ఫోటో కూడా పంపా..’’ చెప్పాడు.‘‘ఏమన్నాడు..’’ రశ్మీ గొంతులో ఆత్రం, కళ్లల్లో మెరుపుతో అడిగింది.‘మోడలింగ్‌లో ఈజీగా చాన్స్ దొరుకుతుందిరా ఆ ఆమ్మాయికి అన్నాడు. కాని.. ’ అంటూ ఆగాడు మధు.‘‘కాని ఏంటీ?’’ ఆందోళనగా అంది ఆమె.‘‘మనం ముంబై వెళ్లడం అంత ఈజీకాదు. నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ఇక్కడలా కాదు. రూమ్‌లో షేర్ చేసుకోవడానిక్కూడా ఇష్టపడరు. ముందు కనీసం వారం రోజులైనా హోటల్లో ఉండాలి.. ఆ తర్వాత రూమ్ వెదుక్కోవాలి. నా దగ్గర అంత డబ్బు లేదు’ ’అన్నాడు బాధపడ్తున్నట్టు.‘‘నా దగ్గర ఉంది కదా..’’ అంటూ గబగబా తన హ్యాండ్ బ్యాగ్ తీసి ఐదు వందల నోట్లతో ఉన్న యాభైవేల రూపాయల కట్ట తీసింది ‘‘ఇవిగో... ‘ఇంకా మా అమ్మమ్మ నా కోసం చేయించిన చైన్, బ్రేస్లెట్, ఇయర్రింగ్స్, రెండు రింగ్స్ కూడా తెచ్చా.. ఏదో ఒక చాన్స్ దొరికేదాకా పనికొస్తాయి కదా..’’ అంది భరోసా ఇస్తున్నట్టు. ఈసారి మెరుపు మధు కళ్లల్లో.‘‘రేపటికి రిజర్వేషన్ చేయించనా ముంబైకి’’ అన్నాడు మధు. ‘‘డన్’’ అంది రశ్మి. కుడిచేయి పిడికిలి బిగించి బొటన వేలును మాత్రం పైకి చూపిస్తూ! ‘‘బావగారూ... రశ్మి ఇంట్లోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్ కంప్లయింట్ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు. రాజమండ్రి పోలీస్‌స్టేషన్ ‘‘చదువు చదువు అని ఏమన్నా ఇబ్బంది పెట్టారా?’’ అడిగాడు ఎస్ఐ.‘‘లేదు సర్. ఒక్కానొక్క కూతురు. తననెప్పుడూ ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టరు మా అక్క, బావ’’ ఆన్సర్ చేశాడు సురేష్ బావమరిది.‘‘మరి.. బాయ్‌ఫ్రెండ్...’’ ఆగాడు ఎస్ఐ.‘‘అబ్బే .. చిన్నపిల్లండి. మొన్ననే టెన్త్ అయిపోయింది. అలాంటిదేం లేదు సర్’ అన్నాడు నొచ్చుకున్నట్టుగా సురేష్.‘ఆరోజు కోప్పడ్డం కాని... కొట్టడం కాని ఏమన్నా చేశారా..’’ ఎస్ఐ కూపీలాగుతుండగానే రశ్మీ రాసిన లెటర్ తీసిచ్చాడు సురేష్. చదవడం పూర్తి చేస్తూ ‘సినిమా పిచ్చి అన్నమాట’ అన్నాడు లెటర్‌ను పేపర్‌వెయిట్ కింద పెడుతూ ఎస్ఐ. ఏం మాట్లాడాలో తెలియక మొహమొహాలు చూసుకున్నారు బావ, బావమరుదులు.‘‘వెళ్తూ వెళ్తూ ఏమన్నా తీసుకెళ్లిందా?’’ ఎస్ఐ. ‘‘యాభై వేలు, కొంచెం బంగారం’’ చెప్పాడు బావమరిది.‘ఊ...’ నిట్టూరుస్తూ కానిస్టేబుల్ని పిలిచాడు ఎస్ఐ.. అమ్మాయి ఫోటో తీసుకొని వివరాలు రాసుకొమ్మని పురమాయించాడు.‘‘సర్.. కొంచెం త్వరగా..’’ రిక్వెస్ట్ చేశాడు సురేష్. ‘ట్రై చేస్తాం లెండి. అయినా మూడు రోజుల క్రితం అమ్మాయి కనిపించకుండా పోతే ఇప్పుడా చెప్పడం’’ అని చీవాట్లు కూడా వేశాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ‘‘ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లావ్? అటే వెళ్లి పోయావ్?’’ తనను అంతసేపు వెయిట్ చేయించాడనే కోపంతో అంది రశ్మీ.‘‘సారీ! కాస్త లేట్ అయింది’’ అని ఆమెకు సమాధానమిచ్చి తన పక్కనే ఉన్న వ్యక్తిని చూపిస్తూ ‘‘రశ్మీ.. ఇతని పేరు సతీష్. నా ఫ్రెండ్’’ అని పరిచయం చేశాడు.‘‘హాయ్’’ అంది రశ్మి. కళ్లతోనే పలకరించాడు ఆ వ్యక్తి.కాస్త దూరంగా వీళ్ల ముగ్గురినే గమనిస్తూ ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు నిలబడున్నారు.మధు అటూ ఇటూ చూసి రశ్మీకి దగ్గరగా వస్తూ కాస్త చిన్నగా.. ‘‘సారీ.. నాకు ముంబై రావడం కుదరట్లేదు. ఇక్కడ షూటింగ్ పనిపడింది అర్జెంట్‌గా. మూడు రోజుల్లో వస్తాను. సతీష్ నాకు చాలా క్లోజ్. బాగా బతిమాలితే నిన్ను తీసుకెళ్తానన్నాడు. అక్కడ నీకు ఆనంద్‌ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బు ఆనంద్ అకౌంట్లో వేశా. నీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు. గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకున్న ఎమౌంట్ సతీష్ దగ్గర ఉంది. ఖర్చులకు కావాలి కదా.. ’ నచ్చజెప్పాడు. ‘‘అయ్యో నువ్వు రావట్లేదా? మరి అతనికి అన్నీ తెలుసా?’’ అడిగింది రశ్మి.‘‘అన్నీ తెలుసు. నీ స్క్రీన్ టెస్ట్ కల్లా నేను అక్కడ ఉంటాగా’’ భరోసా ఇచ్చాడు. స్క్రీన్ టెస్ట్ అనగానే మొహం చేటంతయింది రశ్మీకి. సతీష్‌కు కళ్లతోనే ఏదో సైగ చేస్తూ... ‘‘వస్తా మరి’’ అని అక్కడ నుంచి కదులుతుండగా... నలుగురు మనుషులు వేగంగా వచ్చి ఈ ముగ్గురినీ పట్టేసుకున్నారు ‘‘ఎక్కడికిరా వచ్చేది’’ అంటూ! వాళ్లు పోలీసులు. రశ్మి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ‘మీ అమ్మాయి దొరికింది’ అని. పేరెంట్స్‌కీ కౌన్సెలింగ్ మధుది అమలాపురం. హైదరాబాద్‌లో బ్రోకర్ పనులు చేసేవాడు. ముఖ్యంగా అమ్మాయిల ట్రాఫికింగ్‌లో మధుకి క్రైమ్రికార్డ్ ఉంది.కొన్నాళ్లు హైదరాబాద్ జైల్లో కూడా ఉన్నాడు. కౌన్సెలింగ్ ఇచ్చి మరీ విడుదల చేశారు పోలీసులు. అప్పుడే రాజమండ్రికి వెళ్లాడు వాళ్ల అక్క దగ్గరకు. అక్కడే రశ్మి పరిచయం అయింది. మెల్లగా తనతో స్నేహం చేశాడు. ఆమెకు మోడలింగ్ అంటే మోహమని, సినిమా అంటే పిచ్చి అని అర్థమైంది. దాన్ని క్యాష్ చేసుకుందా మనుకున్నాడు. తనకు హైదరాబాద్, ముంబైలలో చాలామంది సినిమా ఫ్రెండ్స్ ఉన్నారని... ఈజీగా చాన్స్లిప్పిస్తానని, ఓవర్‌నైట్‌లో హీరోయిన్ను చేసేస్తానని రశ్మీని మాయలోపెట్టాడు. గుడ్డిగా నమ్మింది ఆ పదహారేళ్ల పిల్ల. ఒకరోజు మధుతో ట్రైన్ ఎక్కింది. ఇప్పుడిలా పోలీసుల చేతికి దొరికింది. ‘చూడమ్మాయ్.. వాడు నిన్ను ముంబై తీసుకెళ్తోంది నీకు సినిమా చాన్స్లిప్పించడానిక్కాదు. అక్కడ రెడ్‌లైట్ ఏరియాకు పంపించడానికి. నీ దగ్గరున్న డబ్బు లాక్కొని నిన్ను ఆ సతీష్ అనే వాడికి అమ్మేశాడు తెలుసా... ’ అన్నాడు ఎస్ఐ. అవాక్కయింది రశ్మీ.‘‘చూడ్డానికి బాగుండగానే సినిమాలో చాన్స్‌లు దొరకవు. ఒకవేళ ఆ కెరీర్ కావాలనుకుంటే దానికి వేరే మార్గం ఉంటుంది. ఇలా ఎవరు పడితే వాళ్లు సినిమా చాన్స్లిస్తామంటే నమ్మకూడదు. వెంట వెళ్లకూడదు. ముందు బాగా చదువుకో. లోకజ్ఞానం పెంచుకో. అర్థమైందా?’’ అని చెప్పి రాజమండ్రి పంపించారు. అక్కడ ఆమె తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు..‘‘టీన్స్‌లో ఉన్న అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి వాళ్లు ఎవరైనా ‘మీ అమ్మాయికేం. చందమామ తునక.. నాకు ఫలానా ప్రొడ్యూసర్ తెలుసు.. కెమెరామన్ తెలుసు.. డైరెక్టర్ తెలుసు.. చాన్స్‌లు ఇప్పిస్తా. డబ్బే డబ్బు’ అంటారు. అలాంటి వాళ్లను దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. ఒక్క సినిమా చాన్సే కాదు... సిటీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, బోలెడు డబ్బని.. ఆడవాళ్లు, మగవాళ్లు, ఎవరు చెప్పినా నమ్మి పిల్లలను వాళ్ల వెంట పంపొద్దు’’ అని. రశ్మి అమ్మా నాన్నా ఊపిరి పీల్చుకున్నారు. – శరాది -
తమన్నా అలాంటి ఆలోచనతోనే ఉందట!
చెన్నై: నటి తమన్నాకు మొగుడు కావాలట. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి తమన్న. ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రలో అందాలను ఆరబోసిన ఈ మిల్కీబ్యూటీ బాహుబలి చిత్రంలో తనదైన నటనతో అలరించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమన్నా సినీ జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అని చెప్పుకునే రీతిలో ఆ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుంది. కాగా ఇటీవల శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరోసారి గ్లామర్ పరంగా దుమ్మురేపిందనే చెప్పాలి. అయినా ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరచింది. ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా స్కెచ్ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం కోటిన్నరకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్న తమన్నా నటనతో పాటు తన తండ్రి నగల వ్యాపారంలో సాయంగా ఉంటున్నారు. షూటింగ్ లేని సమయాల్లో నగల డిజైన్లు చేస్తుంటారు. ఇటీవలే తన సోదరుడి వివాహనిశ్చితార్ధం వేడుకలో అంతా తానై హడావిడి చేసిన ఈ భామకు కూడా పెళ్లి చేసేసి తమ బాధ్యతను దించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగానే ఆమె తల్లిదండ్రులు తమన్నాకు వరుడి వేటలో ముమ్మరంగా ఉన్నారట. మరి తమన్నాకు సరైనోడు ఎక్కడున్నాడో? ఎప్పుడొస్తాడో? తమన్న కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉందని సమాచారం. -
తమన్నా ఇంట పెళ్లి సందడి
హెడ్డింగ్ చూసి, తమన్నా పెళ్లి కుదిరిందని కొందరు ఊహించుకునే అవకాశం ఉంది. తమన్నాను ఆరాధించే కుర్రాళ్లు మాత్రం అప్పుడే తమన్నాకి పెళ్లా? అని షాకవుతారు. అయితే ఎవరూ షాకవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే పెళ్లి తమన్నాది కాదు.. ఆమె సోదరుడు ఆనంద్ భాటియాది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ దాదాపు మోడ్రన్ దుస్తుల్లో కనిపించే తమన్నా చేతి నిండా మెహందీ.. సంప్రదాయ దుస్తులు.. మెడనిండా నగలు ధరించి సోదరుడి పెళ్లి కోసం గ్రాండ్‌గా తయారయ్యారు. పెళ్లి వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా వివాహాన్ని తమన్నా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ పెళ్లి కోసం తమన్నా షూటింగ్‌కి సెలవు పెట్టారు. అందంగా ముస్తాబై, తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘నా బ్రదర్ పెళ్లిలో..’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మరి, తమ్మూ పెళ్లిపీటలు ఎక్కే ఘడియలు ఎప్పుడొస్తాయో? వెయిట్ అండ్ సీ. -
తమన్నా ఇంట పెళ్లి సందడి
తమిళసినిమా: పెద్దలు ఇల్లు కట్టి చూడు.పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు. అందులో భారం ఉన్నా.అంతకు మించిన ఆనందం ఉంటుంది. అలాంటి సంతోషం నటి తమన్నా ఇంట ఇటీవల వెల్లివిరిసింది. ఆగండాగండి. ఏమిటీ తమన్నా ఇంట పెళ్లి సందడి అనగానే ఏదేదో ఊహించేసుకుంటున్నారా? అంతలేదు.తమన్నా అభిమానులు నిరుత్సాహపడనవసరం లేదు.తమన్నా ఇంట పెళ్లి సందడి అన్నామే గానీ ఆమె వివాహం అని చెప్పలేదుగా. అయితే తమన్నా మాత్రం తన పెళ్లి కంటే ఎక్కువగా సంబరపడిపోయిందట. బాహుబలి, తమిళంలో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాల్లో చాలా బిజీగా నటించిన తమన్నా ఇటీవల నటనకు చిన్న బ్రేక్ ఇచ్చి తన వ్యక్తిగత పనుల్లో మునిగిపోయారు.ఇంతకీ ఈ బ్యూటీకి అంతగా వ్యక్తిగత పనులేంటబ్బా అనేగా మీ ప్రశ్న. తమన్నాకు ఆనంద్ భాటియా అనే ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయనకు పెళ్లి నిశ్చయం అయ్యిందట. ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని తమన్నా కుటుంబం ఆడంబరంగానే నిర్వహించిందట. ఆ వేడుకలో బాగా ఎంజాయ్ చేసిన తమన్నా ఆ ఫొటోలను, తను ఎంతగా సందడి చేసిందే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది.ఆ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఫన్... ఫుడ్... ప్లే!
ఈ రేంజ్లో తింటుందీ అమ్మాయి. అయినా సరే... అంత స్లిమ్ముగా ఎలా ఉంటుందబ్బా? – సందీప్ కిషన్ కొత్త సినిమా షూటింగులో తమన్నా తిండి చూసినోళ్లంతా ఇలానే అనుకుంటున్నారట! సందీప్, తమన్నా జంటగా హిందీ దర్శకుడు కునాల్ కోహ్లి తీస్తున్న తెలుగు సినిమా షూటింగ్ మొన్నామధ్య వరకు లండన్‌లో జరిగింది. షూటింగులో హీరో హీరోయిన్ల మధ్య ఫైటింగులు, బ్రేక్‌లో ఫన్నీ ప్రాంక్స్, ఫ్రీ టైమ్‌లో ఫుడ్డు... ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశామని ఇండియాకి తిరిగొచ్చిన యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సిన్మా కావడంతో సరదాగా షూటింగ్ జరిగిందట! ఇంతకీ, తమన్నా అంత స్లిమ్ముగా ఉండడానికి సీక్రెట్ ఏంటంటే.. ఫుడ్డు ఫుడ్డే, రిమ్ జిమ్ అంటూ జిమ్ములో వర్కౌట్లు వర్కౌట్లే. ఫుడ్డు కూడా న్యూట్రీషియనిస్ట్ చెప్పినట్లు తీసుకుంటున్నారట! -
బాలీవుడ్‌కి అతిథిగా!
ప్రభాస్ రేంజ్ ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టు మారిపోయింది. ఈ చిత్రంతో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆయనతో సినిమాలు తీసేందుకు టాలీవుడ్ దర్శక–నిర్మాతలే కాదు... బాలీవుడ్ దర్శక–నిర్మాతలు సైతం ఇప్పుడు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్‌తో స్ట్రైట్ ఫిల్మ్ తీసేందుకు దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి కూడా. ఆ వార్తల సంగతెలా ఉన్నా.. ప్రభాస్ హిందీ తెరపై ఓ స్ట్రైట్ సినిమాలో హీరోగా కనిపించే ముందు గెస్ట్ రోల్లో అలరించనున్నారని భోగట్టా. హిందీ చిత్రం ‘ఖామోషీ’లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయను న్నారనే వార్త షికారు చేస్తోంది. ప్రభుదేవా, తమన్నా జంటగా దర్శకుడు చక్రి తోలేటì ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ ‘కొలైయుదిర్ కాలమ్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘పౌర్ణమి’లో హీరోగానూ, దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యాక్షన్ జాక్సన్’లోనూ ప్రభాస్ ఓ సాంగ్‌లో కనిపించారు. ఇక, తమన్నాతోనూ ప్రభాస్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కోసం గెస్ట్ రోల్‌కి ఒప్పుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. -
లండన్ నుంచి బాధగా...
సినిమా కంప్లీట్ అయిన తర్వాత యాక్టర్స్ చివరి రోజున ఎమోషన్ అవ్వడం సహజమే. నెలల తరబడి కలిసి పని చేస్తారు కాబట్టి, ‘టాటా’ చెప్పేటప్పుడు అలా అయిపోతుంటారు. తమన్నా కూడా ఇలా ఎమోషన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు జస్ట్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినందుకే ఫీలవుతున్నారామె. అంతగా చిత్రబృందంతో కలిసిపోయినట్లున్నారు. కునాల్ కోహ్లీ డైరెక్షన్లో సందీప్ కిషన్, తమన్నా జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను మే 28న లండన్‌లో స్టార్ట్ చేశారు. ఇందులో నవదీప్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ‘‘లండన్‌లో సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. యూనిట్ మెంబర్స్‌ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. వీళ్లందరితో ఈ సినిమా షూటింగ్ చాలా జాయ్‌ఫుల్‌గా, సూపర్‌గా జరిగింది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తమన్నా. -
పాపా... ఏ క్లాస్ చదువుతున్నావ్?
రియల్ లైఫ్‌లో స్టూడెంట్ లైఫ్‌ను సరిగా ఎంజాయ్ చేయలేదని తమన్నా పలు సందర్భాల్లో చెప్పారు. 15 ఏళ్ల వయసులో హీరోయిన్గా పరిచయం కావడంతో ఆమె కాలేజీకి వెళ్లిందే లేదు. అప్పుడు మిస్ అయిన స్టూడెంట్ లైఫ్‌ను ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సందీప్ కిషన్, తమన్నా జంటగా హిందీ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ సిన్మా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా స్కూల్ గాళ్‌గా నటిస్తున్నారు. ఆమె ఏ క్లాస్ చదువుతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్! దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరితో కలసి నటుడు–నిర్మాత సచిన్ జోషి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఇందులో హీరో నవదీప్ కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం. లండన్‌లోని ఈ సినిమా షూటింగ్ స్పాట్లో ఆయన ఎక్కువ కనిపిస్తున్నారని చూసినోళ్లు చెబుతున్నారు. -
...ఫ్రమ్ బాలీవుడ్!
‘వెరీ గుడ్’ – ఇలాంటి కాంప్లిమెంట్స్ కమ్ తమ టాలెంట్ కేవలం టాలీవుడ్డుకు మాత్రమే పరిమితమైతే ఎలా? బాలీవుడ్డులో కూడా ‘వెరీ గుడ్డు’ అన్పించుకోవాలనే స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ బోల్డంత మంది మనకు కన్పిస్తారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఓ బాలీవుడ్ డైరెక్టర్ టాలీవుడ్డుకు వస్తున్నారు. ఆయనే కునాల్ కోహ్లి. ఆమిర్‌ఖాన్ ‘ఫనా’, సైఫ్ అలీఖాన్ ‘హమ్ తుమ్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిందీయనే. ఇప్పుడు తెలుగులో సందీప్ కిషన్, తమన్నా జంటగా ఓ రొమాంటిక్ కామెడీను తెరకెక్కించాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్, తమన్నాలు స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ జూన్ మొదటివారంలో మొదలవుతుందని సమాచారం. -
తమన్నాతో విదేశాల్లో విక్రమ్
విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్కెచ్. ఇరుముగన్ చిత్రం సంచలన విజయం సాధించిన తరువాత ఆయన నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. విక్రమ్‌తో మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారిగా రొమాన్స్ చేస్తున్న చిత్రం స్కెచ్. ఇంతకు ముందు శింబు హీరోగా వాలు చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. పులి, ఇరుముగన్ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శిబుతమీన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం స్కెచ్. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో విక్రమ్, తమన్నాల రొమాంటిక్ లవ్ సన్నివేశాలను పాండిచ్చేరిలో చిత్రీకరించారట. ఇక విక్రమ్ నటించే మాస్ సాంగ్ కోసం చెన్నైలోని బిన్నీమిల్లులో వేసిన భారీ సెట్లో చిత్రీకరించనున్నారట. అలాగే విక్రమ్, తమన్నాల డ్యూయెట్ సాంగ్‌ను విదేశాల్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇందులో విక్రమ్ బైక్‌ల దొంగగా నటిస్తుండగా ఆయనకు ప్రేయసిగా మిల్కీబ్యూటీ నటిస్తున్నారట. ఇంతకు ముందు చిత్రాల్లో తెగ అందాలను ఆరబోసిన ఈ అమ్మడు స్కెచ్‌లో హోమ్లీ పాత్రలో చూడవచ్చునంటున్నాయి చిత్ర వర్గాలు. చూద్దాం ఈ తరహా పాత్రలో తమన్నా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో. -
విక్రమ్, తమన్నాతో విదేశాలకు ‘స్కెచ్’
చెన్నై: విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్కెచ్. ఇరుముగన్ చిత్రం తరువాత ఆయన నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొన్నాయి. విక్రమ్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా నటిస్తున్న చిత్రం ఇది. శింబు హీరోగా వాలు చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌చందర్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పులి, ఇరుముగన్ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శిబుతమీన్స్ దీనికీ నిర్మాతగా ఉన్నారు. కాగా, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ ఇందులోని విక్రమ్, తమన్నాల రొమాంటిక్ సన్నివేశాలను పాండిచ్ఛేరిలో చిత్రీకరించారు. ఇక విక్రమ్ నటించే మాస్ సాంగ్‌ను చెన్నైలోని బిన్నీ మిల్లులో వేసిన భారీ సెట్లో చిత్రీకరించనున్నారని కోలీవుడ్ టాక్. ఇక విక్రమ్, తమన్నాల డ్యూయెట్ సాంగ్‌ను విదేశాలలో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ వేసినట్లు సమాచారం. విక్రమ్ భైక్ల దొంగగా నటిస్తుండగా ఆయనకు ప్రేయసిగా మిల్కీ బ్యూటీ నటిస్తున్నారు. ఈచిత్రంలో తమన్నాని హోమ్లీ పాత్రలో చూడవచ్చునంటున్నాయి చిత్ర వర్గాలు. -
ష్... ఎవరికీ చెప్పకు తమ్మూ!!
ఎవరు స్కెచ్ వేశారు? హూ ఈజ్ దిస్? అని తమన్నా అడుగుతుంటే ‘ష్... ఎవరికీ చెప్పకు తమ్మూ’ అన్నట్టు ముక్కు మీద వేలేసుకుని చిన్న పిల్లాడిలా ‘చియాన్’ విక్రమ్ ఎలా ఫేస్ పెట్టాడో చూడండి. అక్కడితో ఆగలేదు. షూటింగ్ స్పాట్లో ఉన్న జనాలందర్నీ తమన్నా దగ్గరకు తీసుకొచ్చి... ‘ఇతను కావొచ్చు, ఇతను కావొచ్చు, వీళ్లలో ఎవరైనా కావొచ్చు’ అంటూ హడావుడి చేశారు. మేటర్ ఏంటంటే? విక్రమ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘స్కెచ్’. టైటిల్ డిఫరెంట్‌గా ఉంది కదూ! సినిమా కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుందట. ‘స్కెచ్’ చుట్టూ కథ తిరుగుతుంది. మరి, ఆ స్కెచ్ ఎవరు? మనిషా? మరొకటి ఏదైనానా? తమన్నా ఎక్కడ చెప్పేస్తుందోనని విక్రమ్‌లో చిన్నపాటి భయం. బయటకు ఏం రివీల్ చెయ్యొద్దని ఇన్‌డైరెక్ట్‌గా ఇలా చెప్పారన్న మాట! ఎందు కంటే... తమన్నా నిన్నటితో తన టాకీ పార్ట్ షూటింగ్‌ను కంప్లీట్ చేసేశారు. -
సవాల్ లాంటి రోల్!
మిల్కీ బ్యూటీ తమన్నా మేకప్ అవసరం లేనంత అందంగా ఉంటారు. కానీ, సినిమా కోసం లైట్‌గా అయినా మేకప్ చేసుకోవాల్సిందే. ఒక్కోసారి ఆ అవసరం కూడా లేని పాత్రలు వస్తుంటాయ్. అప్పుడు మాత్రం నాకు భలే ఆనందంగా ఉంటుందని తమన్నా అంటుంటారు. ఆల్రెడీ తమిళ చిత్రం ‘ధర్మదురై’లో ఈ బ్యూటీ మేకప్ లేకుండా చేశారు. ‘బాహుబలి’లో డీ–గ్లామరైజ్డ్గా కనిపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రభుదేవా సరసన చేయనున్న సినిమాలోనూ డీ–గ్లామరైజ్డ్గా కనిపించనున్నారని టాక్. ఇందులో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటించనున్నారు. ఇది సవాల్ లాంటి పాత్ర. తమన్నా ఇలాంటి సవాళ్లను సునాయాసంగా జయించేస్తారని చెప్పొచ్చు. కథానాయికగా దాదాపు పదేళ్ల ఎక్స్పీరియన్స్ తమన్నాకి ఉంది. ఆ అనుభవంతో ఈ పాత్రలో జీవించేస్తారని ఊహించవచ్చు. -
రాజమౌళిపై మిల్కీబ్యూటీ గుస్సా
మిల్కీబ్యూటీ తమన్నా చాలా అసహనానికి గురవుతున్నారట. సాధారణంగా విజయాలు ఆనందాన్ని పోగేసుకొస్తాయి. అలాంటి విజయం తమన్నాకు మాత్రం చికాకు కలిగించడం విశేషం. కొన్ని రోజుల ముందు వరకూ బాహుబలి చిత్రం తన కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ చిత్రాన్ని జీవితంలో మరచిపోలేను అంటూ ఎంతో ఉత్సాహంతో తెగ ఇంటర్వూ్యలు ఇచ్చేసిన ఈ జాణ తాజాగా బాహుబలి–2 చిత్రంతో డీలా పడిపోయింది. బాహుబలి–2 భారతీయ సినిమా రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే, అదే సినిమా తమన్నాను మాత్రం టెన్షన్‌కు గురి చేస్తోందట. విషయం ఏమిటంటే బాహుబలి చిత్రంలో వీరనారిగా విజృంభించిన తమన్నాకు రెండో భాగంలో కనిపించీ కనిపించకుండా పోయిన పరిస్థితి. అంతా అనుష్క హవానే కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ లైట్‌గా తీసుకున్నా, అమ్మడి అభిమానులు, సన్నిహితులు ఫోన్లు చేసి మీరు చాలా తక్కువ సన్నివేశాల్లోనే కనిపించారు. అందులో సంభాషణలే లేవు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దర్శకుడు కావాలనే మీ సన్నివేశాలను కట్ చేశారని పేర్కొంటూ యూనిట్ వర్గాలు తమన్నాను టెన్షన్‌కు గురి చేస్తున్నారట. అలాంటి వారందరికీ బదులు చెప్పలేక ఈ ముద్దుగుమ్మ తీవ్ర అసహనానికి గురవుతోందట. అంతే కాదు దర్శకుడు రాజమౌళిపై గుస్సాగా ఉందట. పాపం తమన్నా.. ఇలాంటి పరిస్థితి ఏ నటికైనా సంకటంగానే ఉంటుంది మరి. -
జీవీతో ఓకే అంటుందా?
జీవీ ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించడానికి మిల్కీబ్యూటీ తమన్నా ఓకే అంటుందా? బాహుబలి, తోళా, దేవి వంటి భారీ చిత్రాల్లో నటించి వరుస విజయాలతో మంచి జోరుమీదున్న తమన్నా ప్రస్తుతం శింబుకు జంటగా అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తోంది. మరోసారి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ బ్యూటీ తెలుగులో నాగచైతన్యతో జత కట్టిన 100% లవ్ చిత్రం అక్కడ పెద్ద విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా కోలీవుడ్‌లో రీమేక్ కానుంది. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ తమిళ వెర్షన్‌కు నిర్మాతగా మారారు. ఎం.ఎం. చంద్రమౌళి అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈయన హాలీవుడ్ ప్రముఖ ఛాయాగ్రహకుడు ఫ్రైడ్మాబీ శిష్యుడన్నది గమనార్హం. కాగా, ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభమయ్యింది. త్వరలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. ఇందులో జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో నటించిన తమన్నానే తమిళంలోనూ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ బ్యూటీ జీవీతో నటించడానికి సై అంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ 100% లవ్ చిత్రంలో క«థానాయకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగు చిత్రంలో నటించిన తమన్నాకు మంచి పేరు వచ్చింది. ఇది హీరోహీరోయిన్ల మధ్య చిన్న ఈగోతో కూడిన ప్యూర్ లవ్ స్టోరీ అన్నది గమనార్హం. -
బాహుబలి 2లో తమన్నా సీన్స్ ఏమయ్యాయ్..?
బాహుబలి తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన తమన్నా, సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని షాట్స్ కే పరిమితమైంది. బాహబలి 2 రిలీజ్ కు ముందు పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా తన పాత్రో సెకండ్ పార్ట్ లోనూ చాలా సీన్స్ లో కనిపిస్తుందని తెలిపింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే సరికి సీన్ మారిపోయింది. రెండు మూడు షాట్స్ తప్ప తమన్నకు సెకండ్ పార్ట్‌లో పెద్దగా స్కోప్ లేదు. అయితే ముందుగా చెప్పినట్టుగా తమన్నాతో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించాడట దర్శకుడు రాజమౌళి, కానీ ఆ సీన్స్‌లో గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో చివరి నిమిషంలో ఆ సీన్స్‌ను తొలగించి సినిమా రిలీజ్ చేశారు. ఏ రకంగా సినిమా క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో సెకండ్ పార్ట్‌లో తమన్నా క్యారెక్టర్ మెరుపుతీగలా అలా కనిపించి ఇలా వెళ్లిపోయింది. -
బాలీవుడ్లో బిజీ బిజీగా..
ముంబై ముద్దుగుమ్మ తమన్నా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటిస్తూనే మాతృ భాష హిందీలో కూడా పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోంది. అయినప్పటికీ అమ్మడు హిందీలో నటించిన హింసక్కల్, హిమత్వాలా వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో తమన్నాకు పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అందువల్ల దక్షిణాది సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ అమ్మడుకు ప్రభుదేవాతో తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో నటించిన ‘దేవి’ చిత్రం హిందీలో విజయాన్ని అదించింది. దీంతో ఈ అమ్మడికి రెండు కొత్త సినిమాల్లో మంచి అవకాశాలు లభించాయి. అంతేకాకుండా తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైయుదిర్‌కాలం’ చిత్రం హిందీలో నయన పాత్రలో తమన్నా నటిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హిందీ సినిమాల్లో కూడా కలల రాణిగా మారడానికి తమన్నా అక్కడే మకాం వేసి కథలు వింటోంది. అదే సమయంలో అందచందాల ప్రదర్శనను పక్కన పెట్టి, నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలను పసిగట్టే పనిలో పడింది తమన్నా. ఈ అమ్మడు అనుకున్నది నెరవేరాలని ఆశిద్దాం. -
ఫోకస్ మారిందా?
తమన్నా ఫోకస్ మారిందా? రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ ఒప్పుకుంటున్న సినిమాలను పరిశీలిస్తే ఫోకస్ మారిందనే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. విషయం ఏంటంటే.. నయనతార చేసిన తమిళ లేడీ ఓరియంటెడ్ ‘కొలై ఉదిర్కాలమ్’ హిందీ రీమేక్‌లో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇది కాకుండా తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ అంగీకరించారని సమాచారం. హిందీ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి, తెలుగులో డబ్ చేయాలనే ఆలోచన దర్శకుడికి లేదట. తమన్నాతో నేరుగా తెలుగులోనే ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కునాల్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే మిల్కీ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని భోగట్టా. ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మడికట్టు అమ్మీగా మిల్కీబ్యూటీ
బాహుబలి చిత్రంలో పోరుకు కాలు దువ్విన వీరనారి అవంతికగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోసిన మిల్కీబ్యూటీ తమన్నా అందరి మన్ననలను పొందిన విషయం తెలిసిందే. ఆ చిత్రం అమ్మడికి రీఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి.అంతకు ముందు వరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన తమన్నా దశ, దిశను బాహుబలి చిత్రం మార్చేసిందనే చెప్పొచ్చు. ఆ తరువాత వరుసగా నటనకు అవకాశం ఉన్న పాత్రలే ఆ ముద్దుగుమ్మను వరిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న తమన్నా తాజాగా మడికట్టు అమ్మీ అవతారమెత్తింది. ఒక పక్క సంచలన నటుడు శింబుతో అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈ బ్యూటీ మరో పక్క సియాన్ విక్రమ్‌తో స్కెచ్ చిత్రంలో డ్యూయెట్లు పాడుతోంది. ఇది ఉత్తరచెన్నై నేపథ్యంలో సాగే పక్తు కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందట. సాధారణంగా ఉత్తర చెన్నై నేపథ్యంలో చిత్రాలనగానే హీరో సహా ఇతర పాత్రలన్నీ నల్లముఖాలతో, తలకు నూనె కూడా రాయకుండా చింపిరి జుత్తుతో కనిపించేలా చూపిస్తుంటారు. స్కెచ్ చిత్రంలో దాదా అయిన విక్రమ్ కూడా కొన్ని సన్నివేశాల్లో అలాంటి గెటప్‌లోనే కనిసిస్తారట. ఆ తరువాత కొత్త గెటప్‌నకు మారతాడట. ఒక ఆయనకు జంటగా నటిస్తున్న మిల్కీబ్యూటీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి పాత్రలో దర్శనమిస్తుందట. ఇందులో పాఠాలు చెప్పే టీచరమ్మగా నటిస్తున్న తమన్నా కొన్ని సన్నివేశాల్లో మడికట్టు అమ్మీగా మెరవనుందట.స్కెచ్ చిత్రంలో ఈ అమ్మడి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.ఈ భామ విక్రమ్‌తో తొలిసారిగా జత కడుతున్న చిత్రం ఇదన్నది గమనార్హం. -
నటి బికినీ వేసుకోవలసిందేనా?
ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేయాలంటే బికినీ వేసుకోవలసిందేనా? స్కిన్ షో తప్పనిసరా? అనడిగితే... ‘‘స్కిన్ షోకి ప్రేక్షకులు ఎట్రాక్ట్ అవుతారనేది అపోహే. నేను నమ్మను’’ అంటున్నారు తమన్నా. హీరోయిన్గా మీకు మీరు ఏవైనా పరిమితులు పెట్టుకున్నారా? అని తమన్నాను ప్రశ్నిస్తే... ‘‘యస్. కొన్ని ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మా అమ్మానాన్నలకు కొన్ని ప్రామిస్‌లు చేశా. నాకు కంఫర్ట్‌బుల్‌గా లేని బట్టలను నేను వేసుకోను. అయినా వేసుకునే డ్రెస్సులు మనకు పాపులారిటీ తీసుకురావు. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడానికి నేను బికినీ వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. నేనెప్పుడూ అలా చేయను’’ అని సమాధానం ఇచ్చారు. ఈ శుక్రవారం వస్తోన్న ‘బాహుబలి–2’ మినహా... ప్రస్తుతం తమన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఓ మూడున్నాయి. హిందీలో ప్రభుదేవాతో కలసి చేస్తున్న సినిమాలో చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తున్నారు. ప్రతి వారం రెండు మూడు సినిమాలు తమన్నా తలుపు తడుతున్నాయట. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయట. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పుకొచ్చారు. -
ఉత్తర చెన్నై నేపథ్యంగా స్కెచ్
ఉత్తర చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా స్కెచ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌చందర్ అంటున్నారు. వీ క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం స్కెచ్. సియాన్ విక్రమ్, మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారిగా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి, ఆర్కే.సురేశ్, అరుళ్దాస్, మలయాళ నటుడు హరీశ్, శ్రీమాన్, రవికిషన్,విశ్వంత్, మాలి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో ప్రియాంక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్ఎస్.థమన్ సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను విజయ్‌చందర్ నిర్వహిస్తున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు. ఉత్తర చెన్నై అనగానే ఇప్పటి వరకూ చదవులేని వారు, ఆర్థికంగా ఎదగని వారి గురించే చిత్రాల్లో చూపించారన్నారు. అయితే అక్కడ విద్యాధికులు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారని చెప్పే స్టైలిష్ చిత్రంగా స్కెచ్ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. చిత్రంలో భారీ పోరాట దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే చెన్నైలో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులకు పైగా చిత్రంలోని పలు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం నటుడు విక్రమ్ కణవే కణవే..పుదుకణవే అనే పాటను పాడడం విశేషంగా పేర్కొన్నారు. -
ఇక్కడ అనుకున్నదేదీ జరగదు
సినిమాలో అనుకున్నదేదీ జరగదని నటి తమన్నా పేర్కొంది. ఈ అమ్మడికి కోలీవుడ్, టాలీవుడ్ ఒక సీజన్‌లా తయారయ్యాయని చెప్పాలి. ఆ మధ్య తెలుగులో వరుసగా చిత్రాలు చేసుకుంటూ వచ్చిన ఈ మిల్కీబ్యూటీకి ఇటీవల తమిళంలో ఎక్కువ చిత్రాలు వరిస్తున్నాయి. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన ధర్మదురై మంచి విజయం సాధించింది. అంతకు ముందు తోళా ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల కత్తిసండై చిత్రం నిరాశపరచినా, ప్రస్తుతం శింబు సరసన అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంతో పాటు విక్రమ్‌కు జంటగా స్కెచ్ చిత్రంలో నటిస్తోంది. తమన్నా నటించిన భారీ చిత్రం బాహుబలి–2 ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఇలా తన హవా కొనసాగిస్తున్న తమన్నా తన విజయ రహస్యాన్ని తెలుపుతూ తానీ రంగంలోకి ప్రవేశించినప్పుడే ఎలాంటి పాత్రల్లో అయినా నటించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నానని చెప్పింది. నచ్చిన పాత్ర, నచ్చని పాత్ర అన్న తారతమ్యాలు చూపకుండా నటిస్తానని పేర్కొంది. నటి అయిన తరువాత ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించే ప్రతిభ కలిగి ఉండాలని చెప్పింది. కొందరు తారలు నాకు సరైన అవకాశాలు అమరలేదని అపవాదు చేస్తుంటారని, అది కరెక్ట్ కాదన్నది తన భావన అని పేర్కొంది. వచ్చిన అవకాశాన్ని నచ్చిన విధంగా మార్చుకోవాలని తమన్నా చెబుతోంది. దర్శకుడు కథ చెప్పినప్పుడు తాను తన పాత్రలో లీనం అయ్యిపోతానని, నటించేటప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి శ్రమిస్తానని చెప్పింది. సినిమాలో అనుకున్నదేదీ జరగదు, చిత్రం, తరువాతి చిత్రానికి మార్కెట్ పరిస్థితి మారి పోతుంది. టాప్‌లో ఉన్నవారు డౌన్ అవ్యడం, డౌన్లో ఉన్న వాళ్లు టాప్‌లోకి రావడం సహజం. అందిన అవకాశాన్ని పొంది జీవితంలో సాగిపోవడమే మంచిది. ఒక వేళ అవకాశాలు రాకపోయినా బాధ పడకూడదు. దర్శకుడు చెప్పిన దానికంటే బాగా నటించాలని తాను తపిస్తానంది ఈ మిల్కీబ్యూటీ. తనకు దర్శకులు వరుసగా అవకాశాలు కల్పించడానికి ఇదీ ఇక కారణం కావొచ్చని అంది. తాను మంచి నటిగా పేరు తెచ్చుకున్నానని, ఇకపోతే ఇతర నటీమణులను చూసి తాను అసూయ పడనని, వారికి లభించిన అవకాశాలు తనకు రాలేదని చింతించనని చెప్పింది. అదే విధంగా తనకు రావలసిన అవకాశాలను ఎవరూ అడ్డుకోలేరనే ధీమా తమన్నా వ్యక్తం చేసింది. -
విక్రమ్‌తో మిల్కీబ్యూటీ రొమాన్స్
మిల్కీబ్యూటీ తమన్నా సియాన్ విక్రమ్‌తో పాండిచ్చేరిలో రొమాన్స్ చేస్తోంది. నటుడు విక్రమ్ ఏక కాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ధ్రువనక్షత్రం. ఆ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక రెండో చిత్రం స్కెచ్ (ఈ టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు). వాలు చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో విక్రమ్‌కు జంటగా నటి తమన్నా తొలిసారిగా జత కడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ స్థానిక పెరంబూర్ సమీపంలోని బిన్నివిుల్లులో ప్రత్యేకంగా వేసిన సెట్లో నెల రోజుల పాటు జరుపుకుంది. ఈ సెట్లో విక్రమ్‌కు సంబంధించిన ముఖ్య సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ నెల ఒకటవ తేదీన చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో మకాం పెట్టింది. అక్కడ విక్రమ్, తమన్నాలకు సంబంధించిన రొమాన్స్ సన్నివేశాలను సముద్రతీరంలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. పాండిచ్చేరిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత విక్రమ్, తమన్నా ఆడి పాడే పాట చిత్రీకరణ కోసం బ్యాంకాంగ్ పయనానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్ర కథ ఉత్తర చెన్నై నేపథ్యంలో జరుగుతుందట. జెమిని చిత్రంలోని మాస్ పాట తరహాలో విక్రమ్ ఈ చిత్రంలోనూ దుమ్మురేపనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసి హరి దర్శకత్వంలో సామి–2కు విక్రమ్ రెడీ అవుతున్నారన్నది గమనార్హం. ఇందులో ఆయనతో మరో సారి చెన్నై చిన్నది త్రిష జత కట్టనున్నారు. -
పుల్లకూర ఆవకాయ ఢీ!
ఢీ... ఢీ... ఢీ... డిమాండ్. మన ఆవకాయలాగా ఇప్పుడు తెలుగు సినిమాను కూడా లొట్టలేసుకుని రీమేక్ చేస్తున్నారు. ఇంతకు ముందు పొరుగింటి పుల్లకూర తెచ్చుకుని మనం ఎన్నోసార్లు పప్పులో కాలేశాం. రీమేకులు అబౌట్ టర్న్ కొట్టాయి. వాళ్ల సినిమాలను మనం తీయడం కాదు... మన సినిమాలను ఇప్పుడు వాళ్లందరూ తీస్తున్నారు. నానా పటేకర్ బిర్యాని వడ్డిస్తారు నాటుకోడి పలావ్... ఎండుచేప వేపుడు.. పులస ఇగురు... హైదరాబాదీ దమ్ బిర్యాని... ఒక్కొక్కరికి ఒక్కో ఐటమ్ నచ్చుతుంది. ఎవరి టేస్ట్ వాళ్లది. దర్శకుడిగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ది డిఫరెంట్ టేస్ట్. ‘ధోని’, ‘ఉలవచారు బిర్యాని’, ‘మన ఊరి రామాయణం’ సినిమాల్లో ప్రకాశ్‌రాజ్ టేస్ట్ తెలుస్తుంది. ఈ టేస్ట్ హిందీ నటుడు నానా పటేకర్‌కు నచ్చినట్టుంది. ఉత్తరాది ప్రేక్షకులకు రుచి చూపించాలని ‘ఉలవచారు బిర్యాని’ని హిందీలో ‘తడ్కా’గా రీమేక్ చేస్తున్నారు. నానా పటేకర్‌కు అంతగా నచ్చిన ఈ సినిమాలో ఏముందని అడిగితే 45 ఏళ్ల లేటు వయసులో ఓ వ్యక్తి ఫోనులో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ, వయసును సాకుగా చూపించి, ఆ అమ్మాయి ఎక్కడ వదిలేస్తుందోననే భయంతో నేరుగా కలవాల్సిన టైమ్ వచ్చినప్పుడు మేనల్లుణ్ణి పంపిస్తాడు. ఆ అమ్మాయికీ వయసు ఎక్కువే. దాంతో స్నేహితురాల్ని పంపిస్తుంది. వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ, నలుగురిలో తప్పు చేస్తున్నామనే ఫీలింగ్. దాంతో రెండు ప్రేమ జంటల మధ్య దూరం పెరుగుతుంది. తర్వాత వాళ్లు ఎలా కలిశారు? అనేది సినిమా. ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రలో నటించడంతో పాటు ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్‌లో ప్రకాశ్‌రాజ్ పాత్రను నానా పటేకర్, స్నేహ పాత్రను శ్రియ, సంయుక్త పాత్రను తాప్సీ చేస్తున్నారు. ‘తడ్కా’కు ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే మలయాళ హిట్ ‘సాల్ట్ అండ్ పెప్పర్’కు ‘ఉలవచారు బిర్యాని’ రీమేక్. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చాలా మార్పులు చేశారు. సంజయ్ దత్ ‘ప్రస్థానం’ దేవా కట్టా తీసిన ‘ప్రస్థానం’లో కథతో పాటు నడిచే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు ఉండదు. ఈ కథలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ రాజకీయ నాయకుడు ‘నేను చనిపోతే నా పిల్లలకు (కొడుకు, కుమార్తె) తండ్రిగా, నా తండ్రికి కొడుకుగా, ఊరి నాయకుడిగా నా స్థానంలో నిలబడతావా?’ అని అనుచరుణ్ణి అడుగుతాడు. నాయకుడు కావాలనే ఆశతో ఉన్న అనుచరుడు అలాగే అని అంగీకరించి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉన్నా అతణ్ణి చంపేస్తాడు. నాయకుడి భార్యను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి అవుతాడు. నాయకుడిగా ఎదుగుతాడు. కొన్నేళ్ల తర్వాత సవతి కొడుకుల మధ్య నాయకత్వ పోరు మొదలవుతుంది. అప్పుడు తండ్రిగా అతను ఏం చేశాడు? కన్న కొడుకును ఎక్కువగా చూసుకున్నాడా? కన్న కొడుకులా పెంచిన నాయకుడి బిడ్డను ఎక్కువగా చూసుకున్నాడా? అనేది మహాభారతాన్ని తలపిస్తుంది. సాయికుమార్, శర్వానంద్‌ల నటన, వాళ్లిద్దరి మధ్య సీన్స్, కథ ప్రేక్షకులను కదిలించాయి. ఆ ప్రేక్షకుల్లో బాలీవుడ్ ‘ఖల్ నాయక్’ సంజయ్‌దత్ కూడా ఉన్నారు. అందుకే, ఈ సినిమా హిందీ రీమేక్‌లో నటించి, నిర్మించడానికి ముందుకొచ్చారు. హిందీ వెర్షన్‌కూ దేవా కట్టా దర్శకత్వం వహిస్తారు. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారట! సాయికుమార్ పాత్రను హిందీలో సంజయ్ చేయనున్నారు. తెలుగులో విడుదలైన ఐదేళ్ల తర్వాత హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారంటే కథలో ఎంత దమ్ముందో అర్థం చేసుకోవచ్చు. ‘‘తెలుగులో మంచి కథలు వస్తున్నాయి. చిన్నోళ్ల దగ్గర్నుంచి పెద్దోళ్ల వరకూ హీరోలందరూ మారుతున్నారు. స్క్రీన్‌ప్లే బేస్డ్, క్యారెక్టర్ బేస్డ్, స్టోరీ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమాలు టీవీ, ఇంటర్నెట్ వల్ల పల్లెటూరి వరకూ చేరుతున్నాయి. అవి చూసిన ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. అందుకు తగ్గట్టు మన దర్శక–రచయితలు కొత్త కథలతో వస్తున్నారు’’ – దేవా కట్టా చెన్నైలో ‘పెళ్లి చూపులు’ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతుంది. ఆయన సినిమాలకు తెలుగులో బోలెడంత మంది అభిమానులున్నారు. కానీ, ఓ చిన్న తెలుగు సినిమా చూసిన గౌతమ్ మీనన్ ఆ సినిమాకు అభిమాని అయ్యారు. ఆయన అభిమానం ఎంతంటే... తానే నిర్మాతగా తమిళంలో రీమేక్ చేసేంత. గౌతమ్ మనసు దోచుకున్న ఆ సినిమా ‘పెళ్లి చూపులు’. ఇందులో ఏముందని అడిగితే... ఏం లేదు. పెళ్లి చూపులకు ఓ ఇంటికి వెళ్లబోయిన ఓ యువకుడు, మరో అమ్మాయి ఇంటికి వెళతాడు. ఇది తెలిసి వచ్చేద్దామంటే.. రూమ్ లాక్ పడుతుంది. ఈలోపు ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుంటారు. బద్ధకస్తుడైన అబ్బాయి షెఫ్ కావాలనుకుంటాడు. అమ్మాయి ఫుడ్ ట్రక్ బిజినెస్ చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేస్తారు. ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నప్పుడు ఇద్దరి దారులు వేరవుతాయి. మళ్లీ ఎలా కలిశారు? అనేది కథ. చెప్పుకోవడానికి చాలా సింపుల్ కథే. కానీ, దర్శకుడు తరుణ్ భాస్కర్ సహజత్వానికి దగ్గరగా... యువతీయువకులు తమ కథే అనుకునేలా తీశారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ అద్భుతంగా నటించారు. ‘పెళ్లిచూపులు’ తమిళ రీమేక్ ‘పొన్ ఒండ్రు కండేన్’లో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. రణవీర్‌తో దయాగాడి దండయాత్ర ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర’ – ‘టెంపర్’లో ఈ డైలాగూ, సినిమా... రెండూ సూపర్‌హిట్టే. ఈ సినిమా కథేంటంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్ లాంటోడు ఇన్స్పెక్టర్ దయా. ఎదుటోడు ఎంత పెద్ద దారుణం చేసినా లంచం అందుకుని వదిలేస్తాడు. అలాంటోడు అనూహ్యంగా నిజాయితీపరుడిగా ఎలా మారిపోతాడనేది సినిమా. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ సినిమా తీశారు. రేప్ చేసినోళ్లలో నేనూ ఒకణ్ణి అని క్లైమాక్స్‌లో హీరో ఉరిశిక్షకు సిద్ధపడే సీన్‌ను ఎన్టీఆర్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో అంగీకరించడం ఓ సాహసమే. హీరోని నెగిటివ్ షేడ్స్‌లో చూపిస్తూ హీరోయిజమ్‌ను ముందుకు తీసుకువెళ్లిన దర్శకుడు పూరి జగన్నాథ్ గట్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. నటనతో ఎన్టీఆర్... సూపర్ టేకింగ్, బుల్లెట్స్ లాంటి డైలాగులతో దర్శకుడు పూరి చేసిన ఈ దండయాత్రకు బాక్సాఫీస్ బద్దలయింది. కమర్షియల్ సినిమాకు కావల్సిన సరుకులన్నీ ఇందులో ఉన్నాయి. సౌత్ సినిమాలను బాగా ఇష్టపడే హిందీ దర్శకుడు రోహిత్ శెట్టి ఇప్పుడీ సరుకును ముంబై తీసుకువెళ్తున్నారు. రణవీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్‌నే హిందీ ‘టెంపర్’లో హీరోయిన్గా ఎంపిక చేశారట! రోహిత్‌శెట్టి తీసిన ‘బోల్ బచ్చన్’ తెలుగులో ‘మసాలా’గా రీమేక్ అయింది. ఇప్పుడాయన ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఇది మనకు గర్వకారణమే. ‘అభిషేక్ బచ్చన్ హీరోగా ‘టెంపర్’ను హిందీలో రీమేక్ చేయాలనుకున్నా. ‘ఎన్టీఆర్‌లా నేను నటించలేను’ అన్నారు అభిషేక్. ఇప్పుడు రణవీర్ సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి రీమేక్ చేస్తున్నారు. ముంబయ్ వెళ్లి హిందీ సినిమా తీయడం పెద్ద కష్టం కాదు. హిందీ హీరోలు మనతో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. సౌత్ కథలను ఇష్టపడుతున్నారు. కానీ ఓ సినిమా పట్టాలు ఎక్కడానికి మూణ్ణాలుగు నెలలు టైమ్ పడుతుంది. ఆల్రెడీ నాకు ఇక్కడ ఉన్న కమిట్మెంట్స్ వల్ల కుదరడం లేదు’ – పూరి జగన్నాథ్. లిస్టులో మరికొన్ని.... ►నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడైన హీరో ఉపేంద్ర కన్నడంలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ‘మన్మథుడు’, ‘కృష్ణ’ వంటి పలు తెలుగు సినిమాలను ఆయన కన్నడంలో రీమేక్ చేశారు. ►ఎన్టీఆర్–పూరి జగన్నాథ్‌ల ‘టెంపర్’ తమిళంలో కూడా రీమేక్ అవుతోంది. ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో విశాల్ హీరోగా నటించనున్నారు. ►నిఖిల్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. పెద్ద నోట్లు రద్దయిన టైమ్‌లో విడుదలై మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా హిందీలో రీమేక్ చేయడానికి వీఐ ఆనంద్ ప్రయత్నిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ కానుంది. ►నందమూరి కల్యాణ్‌రామ్ ‘పటాస్’ను తమిళంలో రాఘవా లారెన్స్ హీరోగా ‘మొట్ట శివ కెట్ట శివ’ పేరుతో సూపర్‌గుడ్ ఫిల్మ్స్ రీమేక్ చేసింది. ఈ నెల 9న ఈ సినిమా విడుదలైంది. ►ఇవే కాదు... మరికొన్ని సూపర్‌హిట్ తెలుగు సినిమాలను ఇతర భాషల హీరోలు, దర్శక–నిర్మాతలు రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు! -
వేల మంది భుజాలపై మేం నిలబడ్డాం: రాజమౌళి
‘‘డార్లింగ్ ఫ్యాన్స్... మీకు ప్రభాస్ (రోప్ సహాయంతో గాల్లోంచి కిందకు, వేదికపైకి ప్రభాస్ దిగారు) ఎంట్రీ ఓకేనా? ఇప్పుడు మీరు చూసింది చాలా చాలా తక్కువ. సినిమాలో ఇంకా ఎక్కువ... చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్నేళ్లు ఇంత కష్టపడి సినిమా చేసి ఈ వేదికపై ఇంతమంది ఉన్నామంటే... కారణం మేము కాదు. ఈ చిత్రానికి పనిచేసిన ఎన్నో వేల మంది. వాళ్లందరి భుజాలపై మేం నిలబడి ఉన్నాం’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన సినిమా ‘బాహుబలి: ద కంక్లూజన్’. అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘బాహుబలి: ద బిగినింగ్’కి కొనసాగింపుగా తీసిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో ఎవరెవరు ఏమన్నారంటే... తప్పని తేలింది... తల తెగింది!: ప్రభాస్ ‘‘రెండున్నరేళ్లు ఓ సినిమా, రెండేళ్లు ఓ సినిమా కోసం ఎదురు చూసిన డార్లింగ్స్ (ఫ్యాన్స్) అందరికీ థ్యాంక్స్. మీ కోసమైనా ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ట్రై చేస్తా. మా ‘బాహుబలి’ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, నిర్మాతలు... అందరికీ థ్యాంక్స్. హిందీలో సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి నిర్మాతలు కరణ్ జోహార్, అనిల్ తడాని చాలా హెల్ప్ చేశారు. హిందీ ప్రేక్షకులు చాలామందికి మా ముఖాలు తెలీదు. కరణ్ జోహార్ సమర్పణ అనే పేరు వల్ల ఉత్తరాదిలో పెద్ద హిట్టయింది’’ అంటూ ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’, ‘వాడిది తప్పు అని తేలింది... తల తెగింది’ అనే డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను అలరించారు. రాజమౌళితో సినిమా జోక్ కాదు: నిర్మాత ప్రసాద్ దేవినేని శోభు, నేనూ ‘బాహుబలి’కి నిర్మాతలమైనా... నాలుగేళ్ల శోభు హార్డ్‌వర్క్, ప్యాషన్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. రాజమౌళితో సినిమా తీయడం జోక్ కాదు. అంత ఈజీ అసలు కాదు. హి ఈజ్ టోటల్లీ హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ అబౌట్ ద ఫిల్మ్. నిర్మాత కూడా అతనితో సమానంగా హార్డ్‌వర్క్ చేయాలి. శోభు అంత హార్డ్ వర్క్ చేశాడు. ‘బాహుబలి’ ఓ విచిత్రమైన సినిమా!: రాజమౌళి ఎన్నో వేలమంది కష్టం ‘బాహుబలి’ సినిమా. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణంరాజుగారి దీవెనలు మాకెప్పుడూ ఉంటాయి. మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తారు. ఆయన ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా కోరిక. మా గురువుగారు రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్. ‘బాహుబలి’ ఎంత విచిత్రమైన సినిమా అంటే... ఫైట్స్‌కి ఫైట్ మాస్టర్ ఉండడు. డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. డ్యాన్సులకు ఫైట్ మాస్టర్ కావాలి. సీన్స్‌కి ఫైట్ మాస్టర్ కావాలి. ప్రతి సీన్లోనూ ఏదొకటి కదులుతుంది. అన్నిటికీ రిగ్గింగ్ కావల్సిందే. కింగ్ సాల్మన్ మాస్టర్ ఈ ఐదేళ్లూ మాతోనే ఉండి పనిచేశారు. ప్రపంచంలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ రిగ్గర్. మా ఆవిడ (రమా రాజమౌళి) కాస్ట్యూమ్స్ గురించి చెప్పడం లేదు. ఆవిడ గురించి ఏవీ (ఆడియో విజువల్) ప్లే చేశాం. మరీ ఎక్కువ పొగిడేస్తే మాట వినదు. స్టైల్‌గా ఈ మాట అనేసినా మళ్లీ భయం వేస్తోంది. నేనూ మనిషినే కాబట్టి హిట్స్ వచ్చినప్పుడు పొగరు, గర్వం పెరుగుతాయి. అలాంటప్పుడు ఓ మొట్టికాయ వేసి నన్ను నేలకు దించుతూ, ఫ్యామిలీ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పిస్తున్న నా భార్యకి థ్యాంక్స్. మరో స్టైలిష్ట్ ప్రశాంతికీ థ్యాంక్స్. మా అబ్బాయి కార్తికేయ నిర్మాత కావాలనుకుంటు న్నాడు. వాడికి దర్శకత్వమంటే ఆసక్తి లేకపోయినా ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంచి నిర్మాత అవుతాడు. ఎందుకంటే... వాడికి ప్రతి రూపాయి లెక్కే. కార్తికేయ ఇచ్చిన ఐడియాతో ‘బాహుబలి–2’ ట్రైలర్ కట్ చేశాం. మకుట టీమ్ నా హోమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో వంటిది. పీట్ అండ్ టీమ్‌కి థాంక్యూ. డీఓపీ సెంథిల్ కుమార్, ఎడిటర్ తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మా కల్యాణ్ (కోడూరి) అన్న, ‘బాహుబలి’ చిత్ర బృందం అందరికీ థ్యాంక్స్. ఆయన, నేనూ కొట్టుకున్నంత : రాజమౌళి మా సినిమా వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన్, నేనూ కొట్టుకున్నంత ఎవరూ కొట్టుకోరు. మేమిద్దరం స్పెండ్ చేసినంత టైమ్ ఎవరూ స్పెండ్ చేయరు. విజువల్ ఎఫెక్ట్స్‌పై నాకు చాలా గ్రిప్ ఉందని ప్రశంసిస్తుంటారు. వీఎఫ్ఎక్స్కి సంబంధించినంత వరకూ కమల్ కణ్ణన్‌గారు నా టీచర్. ఓ రోజు వీఎఫ్ఎక్స్ వర్క్‌ని బాగుందని చెప్పిన నేను ఆ తర్వాత రెండు రోజులకు అందులో చిన్న సమస్య ఉంది. మళ్లీ వర్క్ చేయొచ్చా? అనడుగుతా. తిట్టుకుంటూనే పని చేసిన కమల్ కణ్ణన్‌కి థాంక్స్. ఇది ‘బాహుబలి’ నామ సంవత్సరం: కె. రాఘవేంద్రరావు ఏప్రిల్ 28న ఉగాది అని విన్నాను. ఈ ఏడాదిని బాహుబలి నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు. అందరూ గొప్పగా యాక్ట్ చేశారు. తీశారు. గ్రాఫిక్స్, ఫిక్సెల్స్ నాకు తెలీవు. సినిమా గురించి చెప్పమంటే ఏమని చెప్పను? నిర్మాతలు శోభు, ప్రసాద్‌ల ధైర్యమని చెప్పనా? ప్రభాస్–రానాల యుద్ధమని చెప్పనా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పనా? నన్ను సెట్‌కు రమ్మని రాజమౌళి చాలా సార్లు పిలిచినా... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సి వస్తుందేమోనని వెళ్ళలేదు. బహుశా ‘బాహుబలి 3’ తీస్తే వెళ్లాలని ఉంది. నేను తీసినవాటిలో ‘అడవి రాముడు’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమాలు ఉన్నాయి. ‘అడవిరాముడు’లో ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని’ పాట ఉంది. ఇప్పుడైతే ఈ సాంగ్‌ను ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు. తరతరాలకు తరగని బాహుబలులవుతారు’ అని రాయించేవాణ్ణి. ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు ‘బొబ్బిలి బాహుబలి’ అని పేరు పెట్టేవాణ్ణి. కొందరు అవార్డుల గురించి మాట్లాడతారు. నాకైతే ఇప్పుడు ‘బాహుబలి’ అని బిరుదు ఇస్తే తీసుకోవాలని ఉంది. ఇస్తే హ్యాపీగా ఫీలవుతాను. జేమ్స్ కామెరూన్ సరసన చేరే సత్తా రాజమౌళికి ఉంది: కరణ్ జోహార్ ఇండియన్ మూవీని మరోమెట్టు ఎక్కించే వేదికపై ఉన్నానన్న భావన కలుగు తోంది. ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ గర్వకారణం. రాజమౌళికి ఇండియన్ ఫీల్మ్ మేకర్‌గానే కాదు, గ్లోబర్ ఫిల్మ్ మేకర్‌గా పేరు సంపాదించగల టాలెంట్ ఉంది. నిజానికి ఇది ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ కాదు. ఎందరో ఫిల్మ్ మేకర్స్‌కు బిగినింగ్‌గా చెప్పవచ్చు. జేమ్స్ కామెరూన్ వంటి ప్రపంచ స్థాయి డైరెక్టర్ల సరసన చేరగల సత్తా రాజమౌళికి ఉంది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ల ధైర్యానికి మెచ్చుకోవాలి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కా యాక్టింగ్ రియల్లీ అమేజింగ్. ఏప్రిల్ 28 కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రభాస్ మిగతా హీరోల్లా కాదు: కీరవాణి రాజమౌళి ఇలా హిట్ సినిమాలు తీస్తూ ఎంతో పైకి రావాలి. ఇంతటి గొప్ప సినిమాలో పాటలు పాడటమే కాదు.. రాసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రభాస్‌కు గర్వంలేదు. తనకు దైవ బలం, మంచి మనసు ఉన్నాయి. మిగతా హీరోల్లా ఉండటం ప్రభాస్‌కు చేత కాదు. ప్రతి క్షణం గుర్తుండిపోతుంది: రానా ‘కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే.. ‘బాహుబలి’ చిత్రం కలకాలం నిలబడే శాశ్వత శిల్పం’ అని రెండేళ్ల క్రితం చెప్పాను. నా మాటను నిజం చేసిన ప్రేక్షకులకు, ‘బాహుబలి’ అభిమానులకూ ధన్యవాదాలు. ఇప్పుడు మాహిష్మతికి తిరిగి వెళ్లలేనా? తిరిగి చూడలేనా? అన్న చిన్న బాధ ఉంది. అప్పుడప్పుడు కన్నీరు కూడా వచ్చింది. మాహిష్మతి రాజ్యంలో గడిపిన ప్రతిక్షణం నా జీవితంలో గుర్తుండిపోతుంది. ప్రభాస్ మంచి కోస్టార్. ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణగారైతే బయట వల్లిగారు. రాజమౌళిగారికి థ్యాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరితో తిరిగి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు: నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి’ ఓ నేషనల్ బ్రాండ్‌గా నిలిచినందుకు హ్యాపీగా ఉంది. రెండో పార్ట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుండటం ఆనందంగా ఉంది. వేలమంది టెక్నిషియన్లు ఐదేళ్లు పని చేయకపోతే ఈ అద్భుత ఘనత మాకు దక్కేది కాదు. టాలెంట్, హార్డ్ వర్కింగ్ల కాంబినేషన్ రాజమౌళి. ఈ సినిమా కోసం పని చేసిన ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు. కెరీర్ పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు ఓ సినిమా కోసం ఎవ్వరూ నాలుగేళ్లు ఇవ్వరు. ప్రభాస్ ఇచ్చాడు. ఈ వేడుకలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క తదితరులు పాల్గొన్నారు. ముంబయ్ మీడియా అరిచినప్పుడు గర్వపడ్డా – రాజమౌళి నేను కమర్షియల్ సినిమాలు చేస్తూ, కమర్షియల్ హీరోయిజమ్‌ను ఎలివేట్ చేస్తూ, నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చాను. హీరోయిజమ్ ఎలా ఉండాలని ఎప్పటికప్పుడు ఆలోచించు కుంటూ, తర్వాత స్థాయికి తీసుకు వెళ్తూ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ప్రతి సినిమాలో ప్రతి హీరోకి ఒక ఎలివేషన్ ఇచ్చాను. ‘బాహుబలి’లో ప్రభాస్‌కి ఏం ఇచ్చానని నన్ను నేను ప్రశ్నించుకు న్నప్పుడు... తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ గురించి, నా గురించి అందరికీ తెలుసు. మొన్న ట్రైలర్ లాంచ్‌కి ముంబయ్ వెళ్లాం. ఓన్లీ మీడియాను మాత్రమే ఆహ్వానించాం. అక్కడికి వెళ్లగానే... ఇప్పుడు మీరు (ప్రేక్షకులు) ఎలా అరుస్తున్నారో? అలా అరిచారు. ఎవరు అరుస్తున్నారని చూస్తే... ముంబయ్‌లో మీడియా జనాలు. ప్రభాస్ ఎంట్రీకి విపరీతంగా అరిచారు. అప్పుడు దర్శకుడిగా గర్వపడ్డా. కంట తడిపెట్టిన రాజమౌళి! వేదికపైన చిత్రబృందం ఒక్కొక్కరి ఆడియో విజువల్ ప్రదర్శించిన సమయంలో వారి కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన పాటను వినిపించారు. రాజమౌళి కోసం రాసిన పాటను కీరవాణి పాడగా.. వేదికపైనే ఉన్న రాజమౌళి కంట తడిపెట్టారు. ఆ పాట ఏంటంటే... ఎవ్వడంటా... ఎవ్వడంటా...? బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది.. ఎవ్వరూ కనంది. ఎక్కడా వినంది. శివుని ఆన అయ్యిందేమో.... హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. పెంచింది రాజ నందిని.. కొండంత ప్రేమతో... ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా చిరుయువై యశస్సుతో.. ఇలాగే సాగిపొమ్మని పెద్దన్న నోటి దీవెన.. శివుణ్ణి కోరు ప్రార్థన. -
విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులు
నటి తమన్నా యువ నటుడు విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోంది. ఏమిటీ నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండీ బాబు.అయితే రియల్‌గా కాదులెండి. రీల్లో ఆ తంతంగానికి మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. టాలీవుడ్లో చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం పెళ్లిచూపులు. విజయ్‌దేవరకొండ, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తరుణ్‌భాస్కర్ తెరకెక్కించారు. రెండు కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ పెళ్లిచూపులు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ సినీపండితుల్ని ఆశ్చర్యానికిలోను చేసింది. దీన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రరాష్ట్రం అంతటా విడుదల చేసింది. అలాంటి పెళ్లిచూపులు చిత్ర తమిళ రీమేక్ హక్కులను దర్శకుడు గౌతమ్‌మీనన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకిగా ఇప్పటికే నటి తమన్నాను ఎంపిక చేశారు. కథానాయకుడి కోసం చర్చలు జరపగా యువనటుడు ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్ పేర్లు పరిశీలనకు రాగా చివరికి విష్ణువిశాల్నే అవకాశం వరించింది. దీనికి గౌతమ్‌మీనన్ తన శిష్యుడు సెంథిల్ వీరాస్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత సంస్థలో నిర్మించనున్నారు. పొణ్ ఒండ్రు కండేన్ అనే టైటిల్‌ను నిర్ణయించిన ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అలా తమన్నా.. విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోందన్నమాట. ఇప్పటికే ఈ భామ శింబుతో అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ప్రపంచ సినిమానే ఎదురుచూస్తున్న మోస్ట్ వాంటెడ్ చిత్రం బాహుబలి–2 చిత్రం ఏప్రిల్ 28న వెండితెరపైకి రానుంది. -
ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది
ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుందంటున్నారు నటుడు శింబు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి వయసు మళ్లిన పాత్ర కాగా మరో రెండు యువ పాత్రలని ప్రచారం జరుగుతోంది.ఆయనకు జంటగా నటి తమన్నా, శ్రియ నటిస్తున్నారు.వయసు మళ్లిన పాత్రకు జంటగా శ్రియ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పాత్రతో నటి తమన్నా ఉన్న ఫొటోలే విడుదలవ్వడం గమనార్హం. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మాత మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్న అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై విశేష ఆదరణను పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శింబు స్పందిస్తూ ఈ చిత్రంలో తాను మూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నానన్నారు.అందుకే అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావించి ఆ పేరును నిర్ణయించినట్లు తెలిపారు. టీజర్ చూసి ఈ చిత్రం ఇలా ఉంటుందని ఊహించరాదన్నారు. తాము ఒక వైవిధ్య కథతో చేస్తున్న చిత్రం ఇదని తెలిపారు.ఇంకా చెప్పాలంటే ఒక ప్రయోగం చేస్తున్నామని చెప్పవచ్చునన్నారు. అయితే ఇందులో తనవి మూడు పాత్రలు కాదని, నాలుగు పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయం గురించి తాను చెప్పినందుకు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కోపగించుకోవచ్చునని, ఇది సరైన సమయంగా భావించి నాలుగో పాత్ర గురించి వెల్ల డించానని అన్నారు. ఈ పాత్ర చిత్రంలో సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పారు.