
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. ఈ ఏడాదిలో భోళాశంకర్, జైలర్ సినిమాలతో అలరించిన 33 ఏళ్ల భామ గ్లామర్‌తో ఇప్పటికీ కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక గీతాలకు ఈమె డ్యాన్స్‌కు ఆడియన్స్ ఫిదా కావాల్సిందే. మొదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
(ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతా మాధురి)
అయితే ఇటీవల ఆమె నటించిన చిత్రాలు ప్లాప్ అయ్యాయేమో గాని.. తమన్నా మాత్రం నటిగా ఎప్పుడు అభిమానుల్ని నిరాశ పరచలేదు. తన అందంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తమన్నా నటించిన తెలుగు చిత్రం భోళా శంకర్ నిరాశ పరిచినా.. తమిళంలో రజనీకాంత్‌తో నటించిన చిత్రం జైలర్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో నువ్వు కావాలయ్యా అనే పాట ఓ ఊపు ఊపేసింది.
అయితే ఆ చిత్రం తర్వాత తమన్నాకు కొత్తగా అవకాశాలు ఏమీ లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తను మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం తమిళంలో అరణ్మణై- 4 చిత్రంతో పాటు మలయాళం, హిందీలోనూ చిత్రాలు చేస్తోంది.
ఈ మిల్కీ బ్యూటీకి అవకాశాలు తగ్గాయేమో గాని తమన్నా ఆదాయం ఆర్జించడంలో ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపారంగంలో దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డాన్స్ చేస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తోంది. కాగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఏ ఒక్కటి అయినా మంచి విజయం సాధిస్తే తమన్నాకు మళ్లీ అవకాశాలు రావడం ఖాయం. మరోపక్క ఈమె తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment