
ఎప్పటికప్పుడు ఆమె కెరీర్ అయిపోయిందని అనుకునే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, కమ్‌బ్యాక్ అవుతోంది తమన్నా భాటియా(Tamannaah Bhatia). తాజాగా ఓదెల2 చిత్రం ద్వారా శివశక్తిగా తన నటనతో దుమ్మురేపారు. తమన్నా ఒక ప్రాజెక్ట్‌లో ఉంటే మినిమమ్ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. చిత్రపరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమె గురించిన కొన్ని విషయాలు.
తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే , ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ‘జై లవకుశ’, ‘జైలర్’ ఇలా ఐటమ్ సాంగ్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్! ఈ మధ్య ‘స్త్రీ 2’లో కూడా ‘ఆజ్ కీ రాత్ హై’ అని చేసిన సాంగ్ సినిమా ఘన విజయానికి చాలా హెల్ప్ అయింది. జాట్‌లో కూడా ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేశారు.
తమన్నా క్రేజ్ చూసి ‘రైడ్ –2’లోనూ ఛాన్స్ ఇచ్చారు. ఇందులో ఓ పాట కోసం తమన్నాకు ఏకంగా రెండు కోట్లు ఇచ్చారని టాక్. బాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల చాలా ఎక్కువ అమౌంట్ కోట్ చేసినా, అడిగినంత నిర్మాతలు ఇచ్చారని సమాచారం. పైగా వయసు 35 ఏళ్లు దాటేయడంతో, వచ్చిన ప్రతి చాన్స్‌ను కమర్షియల్‌గా వాడుకుంటోంది తమన్నా.
తమన్నాకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు మొదట్లో మేనేజర్లు డీల్ చేసినా, ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ మేటర్లు అన్నీ తమన్నా తండ్రి సంతోష్ భాటియా స్వయంగా చూసుకుంటున్నారు. పారితోషికం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. వరుస విజయాలతో రష్మిక మందన్నా 5 కోట్లు డిమాండ్ చేస్తుంటే, తమన్నా నాలుగున్నర కోట్లకి తగ్గడం లేదని ఫిలిమ్ ఇండస్ట్రీ టాక్! తెలుగులో కొన్ని సినిమాలు రెమ్యూనరేషన్ తేడాలతోనే వదులుకుందని తెలుస్తోంది.
ఎందరో అగ్ర హీరోలతో కలిసి నటించినా, ఎవరితోనూ ప్రేమలో పడని తమన్నా– విజయ్ వర్మ అనే కోఆర్టిస్టుతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసింది. ఇద్దరూ కలిసి కొన్ని వెబ్ సిరీస్‌లలో బోల్డ్‌గా నటించారు. ప్రస్తుతం విజయ్ వర్మతో బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి. తమన్నా మాత్రం ఆ రూమర్స్‌ని ఖండించడం లేదు, అవును అనడం లేదు. అయితే, రిలేషన్‌షిప్‌లో లేనప్పుడే ఆనందంగా ఉన్నాను అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో
చెప్పింది తమన్నా.12వ ఏటనే యాక్టింగ్‌లో ట్రైనింగ్ మొదలు పెట్టిన తమన్నా ఇంత వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో ఎక్కువ నటించిన తమన్నా మలయాళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. దిలీప్ హీరోగా నటించిన ‘బాంద్రా’ సినిమా డిజాస్టర్ అయింది.
ఆ మధ్య కర్ణాటకలో ఏడవ తరగతి పాఠ్యాపుస్తకాల్లో తమన్నా మీద ఓ పాఠం పెట్టారు. విమర్శలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఆ పాఠ్యాంశాన్ని తొలగించింది. పాఠం పెట్టినప్పుడు ఆశ్చర్యపోయినా, తీసేసినప్పుడు మాత్రం బాధ పడలేదని చెప్పింది తమన్నా.
ఓ ప్రైవేట్ స్కూల్ వాళ్లు సింధీ కమ్యూనిటీ గురించి చెబుతూ, అందులో తమన్నా జీవిత చరిత్ర రాశారు. అయితే పిల్లల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓ సినిమా హీరోయిన్‌ని రోల్ మోడల్‌గా చెప్పడం– పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తుందని తల్లిదండ్రులు అనడంతో ఆ పాఠాన్ని తొలగించారు.
సంపత్ నంది నిర్మించిన ‘ఓదేల–2’ తన కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని తమన్నా బలంగా నమ్ముతోంది. ఈ సినిమాలో తను అసలు మేకప్ వేసుకోలేదట. తను పోషించిన అఘోరా పాత్ర ‘అఖండ’లాగే అందరి ఆదరణ పొందుతుందని ఆశ పడుతోంది తమన్నా.