Odela 2 Movie
-
‘భయం’తో బాక్సాఫీస్‌పై దాడి.. కాసుల వర్షం కురిసేనా?
హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.రాజా డీలక్స్ థియేటర్లో రాజా సాబ్ ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్‌ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలోనూ... నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్‌వర్మ దండు ఆడియన్స్‌ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కొరియన్ కనకరాజు లవ్‌స్టోరీ, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు. చీకటి–వెలుగుల మధ్యలో...! చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్‌లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. రహస్యాలను కనిపెట్టే యువతిగా∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్‌ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్‌బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్‌తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు. మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. - ముసిమి శివాంజనేయులు -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్కెచ్ వేసిన నాని
-
ఓదెల మల్లన్న క్షేత్రంలో...
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన హిట్ మూవీ ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలో జరుగుతోంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. కాశీలో ప్రారంభమైన ఈ సీక్వెల్ చిత్రీకరణ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. ఓదెల మల్లన్న ఆలయంతో పాటు గ్రామంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ తదితరులు షూట్లో పాల్గొంటున్నారు. తన కెరీర్లో తొలిసారిగా తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది. -
Tamannaah Bhatia: ఇప్పుడే ఏమీ చెప్పలేను..
సాక్షి, సిటీబ్యూరో: మిల్కీ బ్యూటీ, ప్రముఖ సినీతార తమన్నా భాటియా మంగళవారం నగరంలో తళుక్కున మెరిశారు. నగరంలో ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరై తమన్నా ఈ సందర్భంగా మాట్లాడారు.. చాలా రోజుల తరువాత హైదరాబాద్ వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఓదెల –2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నానని, ఆ సినిమాకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇక సినిమాకు సంబంధించి చిన్న పార్ట్ మాత్రమే పెండింగ్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎప్పటి నుంచో తన పెళ్లి విషయమై ఊరిస్తున్న తమన్నా, ఈ సారి కూడా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు.., ‘పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడే ఏం చెప్పలేనని’ దాటవేశారు. అయితే ఈ సందర్భంగా తమన్నా ప్రత్యేకంగా డిజైనింగ్ చేయించుకుని ధరించిన నీలి రంగు డ్రెస్ విశేషంగా ఆకట్టుకుంది. -
బోనాల పండగలో...
బోనాల పండగ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్నా కూడా బోనం ఎత్తారు. అయితే ఆమె పండగ చేసుకుంటున్నది ‘ఓదెల 2’ చిత్రం కోసం. తమన్నా లీడ్ రోల్లో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. దర్శకుడు సంపత్ నంది సూపర్విజన్లో ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021) సినిమాకి సీక్వెల్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.భారీ మల్లన్న టెంపుల్ సెట్లో క్లైమాక్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతోపాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్లోపాల్గొంటున్నారు. బోనాల సంబరాల నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ఇది. ఈ సన్నివేశాల్లోని తమన్నా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలోనిపాత్ర కోసం తమన్నా శిక్షణ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను ఆమె అద్భు తంగా చేస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్‌రాజన్. -
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్‌ను అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
చెడుపై గెలుపు
అహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తన ప్రజలను రక్షించడానికి దేవుడు ప్రతి యుగంలో చెడుని ఎలా గెలుస్తాడో చూపించే కథాంశంతో ఈ మూవీ ఉంటుంది.హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరుపుతున్న రెండో షెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది. -
‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్ స్టార్స్
భక్తి కలిసిన చిత్రాల్లో స్టార్స్ కనిపించడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. డివోషన్ ప్లస్ కమర్షియల్ మిక్స్ అయిన కథలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో ‘శివుడు’ నేపథ్యంలో సాగే కథలు, శివుడి ప్రస్తావన కాసేపు ఉండే కథలు ఉన్నాయి. ‘శివ... శివా...’ అంటూ శివుడి నేపథ్యంలో భక్తి భావంతో రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. కన్నప్ప విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ‘కన్నప్ప’ ద్వారా వెండితెరకు తీసుకొస్తు్తన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఈ వార్తలు ఆ మధ్య హల్ చల్ చేయగా ‘హర హర మహాదేవా’ అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్ ఇచ్చారు విష్ణు మంచు. ఈ విషయం గురించి మేలో అధికారిక ప్రకటన రావొచ్చని కూడా తాజాగా విష్ణు మంచు స్పందించారు. దీంతో ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్‌గా నటించిన ప్రభాస్ ఇటీవలే ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా కనిపించారు. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో అంటూ ఏఐ టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ఉన ్న ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి, నెట్టింట షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నయనతార కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కన్నప్ప’ విడుదల కానుంది. కుబేర ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ లుక్ మాత్రం టైటిల్‌కు భిన్నంగా ఉండటంతో పాటు ఆశ్చర్యపరిచేలా ఉంది. కుబేరుడు డబ్బులు ప్రసాదించే దేవుడు. కాగా ఫస్ట్ లుక్‌లో ధనుష్ సరైన కాస్ట్యూమ్ లేని పేదవాడిలా కనిపిస్తారు, ఆహార దేవత అన్నపూర్ణాదేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో కూడా పోస్టర్లో ఉంది. అంటే ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందనుకోవచ్చు. హరోం హర ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సుధీర్ బాబు. తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ సినిమా కథనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో సాగుతుంది. పైగా ఈ మూవీలో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యమే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘హరోం హర’ టైటిల్ ఫిక్స్ చేశారంటే శివుడి నేపథ్యం ఎంతో కొంత ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే.. పరమశివుడి తనయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుత్రుడి కథ చెప్పే క్రమంలో తండ్రి కథని టచ్ చేసుంటారనుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’లో సుధీర్ బాబు చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓదెల 2 తమన్నా పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ గుర్తొస్తారు. తన నటన.. ప్రత్యేకించి తన అద్భుతమైన డ్యాన్సుతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె శివుడి నేపథ్యంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కాశీలో మొదలైంది. ఈ చిత్రంలో శివశక్తిగా తమన్నా నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగసాధువు వేషంలో కనిపించారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
Odela 2: నాగ సాధువుగా తమన్నా!
తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి. మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో కనిపించారు తమన్నా. ‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అత్యధిక బడ్జెట్‌తో బహు భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. శివ శక్తి పాత్ర కోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూ΄ాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.