
‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ (Odela 2)తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా, హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా టీజర్(Odela 2 Teaser)ని మహాకుంబమేళాలో విడుదల చేశారు మేకర్స్. నాగసాధు పాత్రలో తమన్నా నటన అదిరిపోయింది. ఉత్కంఠ రేకెత్తించే సీన్లలో టీజర్‌ని కట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment