sampath nandhi
-
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా అప్డేట్
-
కొత్త సినిమాలపై సాయితేజ్ ఫోకస్.. మాస్ మసాలా మూవీతో రీఎంట్రీ!
బైక్ యాక్సిడెంట్ తర్వాత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఈ ఏడాది సుప్రీమ్ నటించిన ఏకైక చిత్రం రిపబ్లిక్ అక్టోబర్1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదలై అక్కడ మంచి ఆదరణ అందుకుంది. అందుకే నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అందు కోసం పర్ఫెక్ట్ డైరెక్టర్స్ ను సెట్ చేసుకుంటున్నాడు. త్వరలోనే కార్తిక్ దండు దర్శకత్వంలో నటించాల్సిన సినిమాను పట్టాలెక్కించనున్నాడు సాయి తేజ్. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. (చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు) ఈ సినిమాతో పాటు కోలీవుడ్ సూపర్ హిట్ మానాడు తెలుగు రీమేక్ లోనూ ఈ సుప్రీమ్ హీరో నటించాలనుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. తాజాగా సాయితేజ్ లిస్టులోకి సంపత్ నంది వచ్చాడు. ఇప్పుడు ఈ దర్శకుడితో మూవీ చేయాలనుకుంటున్నాడట సాయి ధరమ్ తేజ్. మైత్రీ మూవీ మేకర్స్ వీరిద్దరి కాంబినేషన్ లో మాస్ మూవీ ప్లాన్ చేస్తోందట.కొన్నేళ్లుగా ఫీల్ గుడ్ మూవీస్ లో కనిపిస్తూ వస్తున్నాడు తేజ్.అందుకే ఈసారి మాస్ మసాలా మూవీతో తిరిగి రావాలనుకుంటున్నాడట. -
పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది
‘‘హీరో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యే సినిమాను తీస్తే ఓ దర్శకుడు గర్వపడతాడు. ప్రస్తుతం నేను ఆ ఫీలింగ్‌లోనే ఉన్నాను. పదేళ్లుగా నాకీ స్థాయిలో హిట్ మూవీ రాలేదు. ‘సీటీమార్’ విజయంతో ఇటు గోపీచంద్ అభిమానుల దాహం కూడా తీరింది’’ అన్నారు సంపత్ నంది. గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేట్రికల్ రిలీజ్లో పెద్ద హిట్ అని మా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇది ప్రేక్షకుల విజయం. ఈ సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు ఆందోళనకు గురయ్యాను. ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? వస్తే వారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? థియేట్రికల్ రిలీజ్ అంటూ రిస్క్ తీసుకుంటున్నామా? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ మూడు రోజుల్లో... ప్రతిరోజూ నేను గంట కూడా నిద్రపోలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, నార్త్ ఇండియాలో కూడా షోలు పడ్డాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్క నెగటివ్ కామెంట్ కూడా వినపడలేదు. మార్నింగ్ షో కాస్త నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత కలెక్షన్స్ బాగా పుంజుకున్నాయి. (చదవండి: ‘సీటీమార్’మూవీ రివ్యూ) కబడ్డీ అనేది మాస్ గేమ్. ఈ గేమ్‌కు కమర్షియల్ అంశాలు జోడించి చెబితే ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నాను. వాళ్లకు నచ్చింది. ఎమోషనల్గానూ కనెక్ట్ అయ్యారు. అందుకే ‘సీటీమార్’ది ప్రేక్షకుల విజయం. గతంలో గోపీచంద్‌తో నేను చేసిన ‘గౌతమ్ నంద’ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే డబ్బులు రాకపోయినా పేరొచ్చింది. ఇప్పుడు ‘సీటీమార్’కు పేరు, డబ్బులు వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లా డుతూ– ‘‘రచయితగా ‘బ్లాక్ రోజ్’, ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాలకు కథలు అందించాను. కథల పరంగా నాకు పదేళ్ల వరకూ కంగారు లేదు. నా దగ్గర అన్ని కథలున్నాయి. నా డైరెక్షన్‌లోని తర్వాతి సినిమాను త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు. -
గోపిచంద్ ‘కూత’ మొదలైంది
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘సీటీమార్’. ఈ చిత్రంలో గోపిచంద్ హీరోగా నటిస్తున్నాడు. కథానాయికిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ కోచ్‌గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఇంతక ముందే గోపిచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతమ్ నంద’గా నటించి ప్రేక్షకులకు మంచి క్లాస్ యాక్షన్ సినిమాను అందించారు. మాస్ యాక్షన్, క్లాస్ పాత్రల్లో డబుల్ యాక్షన్‌తో మెప్పించాడు. ఇక తమన్నా ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మరో కథనాయికగా దిగంగన నటిస్తోంది. పచ్చని పల్లెటూరులో ఉంటూ గోపిచంద్‌ని ప్రేమించే పాత్రలో అందాల దిగంగన ఓదిగిపోయిందని చిత్రబృందం చెబుతోంది. 2010లో ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా సంపత్ నంది తెలుగు చిత్రసీమకు పరిచియమయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో రచ్చ సినిమా చేశాడు. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా చూపించి ప్రేక్షకుల నుంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా విజయాలు లేక వెనుకబడిన సంపత్ నంది ఇప్పుడు సీటీమార్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 📢📢📢 Aftr a longggg warm up solid stretches n powerpacked practice Everyone’s set..fit..fab n back to do wat we love the most 🎥 wid xtra care n zeal. Wait is over! కూత మొదలు..Nov 23 నుండి... ఇక non-stop కబడ్డి..కబడ్డి..కబడ్డి!!!💥#Seetimaarr @bhumikachawlat #HappyDiwali pic.twitter.com/8WYlbXuoaQ — Sampath Nandi (@IamSampathNandi) November 14, 2020 -
గోపీచంద్ సినిమా ఆరంభం
గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఓ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ గత నెలలో లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభమై నెల దాటినా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ మూవీపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ను చిత్ర బృందం అభిమానులకు తెలియజేసింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శనివారం నుంచి ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ షెడ్యూల్లో గోపీచంద్ కూడా పాల్గొన్నాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఈ మిల్క్ బ్యూటీ కబడ్డీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గోపీచంద్ పాత్ర మాత్రం చాలా సస్పెన్స్‌గా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. కాగా, ‘చాణక్య’ మూవీ ఫలితం తర్వాత గోపీచంద్ సినిమాలకు కాస్త విరామం ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విరామ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే దర్శకుడు తేజతో గోపీచంద్ సినిమా తీయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తనకు ‘గౌతమ్ నంద’ వంటి ఫ్లాప్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నందికి మరోసారి గోపీచంద్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘బెంగాల్ టైగర్’, ‘రచ్చ’ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. సంపత్ నంది-తమన్న కాంబోలో ఇది మూడో చిత్రం. అటు గోపీచంద్ తో మాత్రం తమన్నాకు ఇదే ఫస్ట్ మూవీ. ఇక గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరోనాయిక దిగంగన సూర్యవంశిని తీసుకోవాలని మూవీ యూనిట్ భావిస్తున్నారట. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
గోపీచంద్ అభిమానులు గర్వపడతారు
‘‘శ్రీనివాస్, పవన్‌గార్లు నాకు చాలాకాలంగా తెలిసినా, వారితో తొలిసారి పని చేస్తున్నాను. మంచి సినిమా చేయాలనే తపన ఉన్న నిర్మాతలతో మంచి కథతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని గోపీచంద్ అన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కనున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘యు టర్న్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ ఇచ్చారు. గోపీ చంద్ మాట్లాడుతూ– ‘‘గౌతమ్ నంద’ తర్వాత సంపత్ మంచి స్క్రిప్ట్‌తో వచ్చారు. తమన్నాతో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. తనది కూడా మంచి పాత్ర’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాను. ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీగారు, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్, పవన్, శ్రీనివాస్‌గార్ల బేనర్లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గోపీచంద్‌గారి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సంపత్‌గారితో నా మూడో సినిమా ఇది. గోపీచంద్‌గారితో సినిమా చేయాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. నాది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర’’ అన్నారు తమన్నా. ‘‘అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. నవంబర్‌లో షూటింగ్ ఆరంభించి, ఏప్రిల్‌లో సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. ఈ కార్యక్రమంలో చిత్రసమర్పకులు పవన్ కుమార్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, కె.కె. రాధామోహన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, కెమెరామేన్ సౌందర్ రాజన్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
యమ జోరు
హీరో గోపీచంద్ యమ జోరు మీద ఉన్నారు. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్లో స్పీడ్ పెంచారు. ఇటీవలే బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకడిగా పరిచయమవుతున్న సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలియజేసిన గోపీచంద్ తాజాగా మరో కొత్త సినిమాకు సై అన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. గోపీచంద్ కెరీర్లో ఇది 28వ చిత్రం. ‘‘హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మరో వైపు గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’ ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు తిరు దర్శకుడు. -
ట్రైలర్, సినిమా చూసి బాగుందన్నా
‘‘బన్ని ఓ సారి ‘పేపర్ బాయ్’ ట్రైలర్ పంపి చూడమన్నాడు. చూసి చాలా బాగుందన్నా. తర్వాత మెహర్ రమేశ్ వచ్చి ఈ సినిమా చూడమంటే చూసి, చాలా బాగుంది అన్నాను. మీరు ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? అన్నాడు మెహర్ రమేశ్. ఇండస్ట్రీనే నమ్ముకున్న సంపత్‌నందిలాంటి వ్యక్తి ఓ కథ రాసుకుని మరో డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చి, మంచి సినిమా చేసినప్పుడు మా సంస్థ ద్వారా విడుదలైతే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘పేపర్ బాయ్’ హక్కులను అల్లు అరవింద్‌గారు తీసుకున్నారని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్ అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌పై నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సినిమా’’ అన్నారు. ‘‘చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు.‘ పేపర్ బాయ్’ లాంటి చిన్న సినిమాకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్ దొరికింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘అరవింద్‌గారు రిలీజ్ చేస్తున్నారనగానే ఇదొక మంచి సినిమా అనే గుర్తింపు వచ్చింది. ఆయనకు మా సినిమా గురించి చెప్పిన మెహర్ రమేశ్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు సంపత్ నంది. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిగా కష్టపడుతున్నాం. గీతా ఆర్ట్స్‌వారు మా సినిమాను తీసుకోవడం వల్ల ఈ కష్టం మరచిపోయాం’’ అన్నారు జయశంకర్. దర్శకులు మెహర్ రమేశ్, కల్యాణ్ కృష్ణ, సంతోష్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుల్ పాజిటివ్
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది కథను అందిస్తూ, రాములు, వెంకట్, నరసింహులతో కలిసి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్, ‘బన్నీ’ వాసు, దర్శకుడు మెహర్ రమేశ్‌లకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు చిత్రబృందం. ‘‘సినిమా నచ్చిన వెంటనే అల్లు అరవింద్‌గారు రిలీజ్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్ వైబ్ ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్ రాజన్. -
‘పేపర్ బాయ్’ ట్రైలర్
-
ఫార్ములా టైగర్ రోరింగ్
తారాగణం: రవితేజ, తమన్నా, రాశీఖన్నా, బొమన్ ఇరానీ కెమేరా : ఎస్. సౌందరరాజన్ ఎడిటింగ్: గౌతంరాజు సంగీతం: భీమ్స్ సిసిరోలియో నిర్మాత: కె.కె. రాధామోహన్ కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది ‘‘డబ్బున్నవాడితో పెట్టుకోవచ్చు, పవరున్న వాడితో పెట్టుకోవచ్చు.. కానీ తెలివైనవాడితో పెట్టుకోకూడదు.’’ తాజా ‘బెంగాల్ టైగర్’లో డైలాగ్ ఇది. అలాంటి తెలి వైన హీరో పాత్ర, పాత్రచిత్రణ - మనకు కొత్తేమీ కాదు. కాకపోతే దాన్నెలా ప్యాకేజ్ చేసి, తెరపై చెప్పారన్నదే కీలకం. ఆ ఫార్ములా అరువు తెచ్చుకొని, కొత్త రేపర్లో ప్యాక్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’. గోదావరి జిల్లాలోని గ్రామంలో ఆకాశ్ నారాయణ్ (రవితేజ) కుటుంబం. అతనికి అమ్మ (ప్రభ), ఇద్దర న్నలు - వదినలు, అమ్మమ్మ (రమాప్రభ). ఒకసారి పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతురు (అక్ష) పాపులరైనవాణ్ణే పెళ్ళి చేసుకుంటాననడంతో హీరో కంగు తింటాడు. పేపర్లో పేరు, ఫోటో వచ్చేలా పాపులరయ్యేందుకు ప్రయత్నం మొదలుపెడతాడు. మంత్రి సాంబ (సాయాజీ షిండే)ను పబ్లిక్ మీటింగ్‌లో రాయి పెట్టి కొట్టి, పాపులరైపోతాడు. రక్తం కారేలా గాయమైన మంత్రి తీరా హీరో గారి మాట తీరు, ధైర్యం నచ్చి, తన దగ్గరే పనికి పెట్టుకుంటాడు. అలా అక్కడ జీతానికి పని చేస్తూనే హోమ్ మంత్రి నాగప్ప (రావు రమేశ్) కూతురు శ్రద్ధ (రాశీఖన్నా)ను ఫ్యాక్షనిస్ట్ ప్రత్యర్థుల బారి నుంచి కాపాడతాడు. అలా హోమ్ మంత్రి మనసునూ చూర గొంటాడు. ఆయన నాలుగింతల జీతామిస్తాననే సరికి, మొదటి మంత్రిని నడిరోడ్డుపై వదిలేసి, హోమ్ మంత్రి దగ్గర ప్రత్యేక అధికారిగా హీరో చేరతాడు. మరింత ఫేమస్ అవుతాడు. పెళ్ళి ఫిక్సయిన శ్రద్ధను సైతం ప్రేమలో పడేస్తాడు. తీరా ఆమెనిచ్చి పెళ్ళి చేయడానికి సిద్ధపడితే, ముఖ్యమంత్రి గజపతి (బొమన్ ఇరానీ) సాక్షిగా హీరో ప్లేటు తిప్పేస్తాడు. తాను ఇప్పటికే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానీ, కాకపోతే తనది వన్‌సైడ్ లవ్ అనీ చెబుతాడు. ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్ళి చేస్తా మని ముఖ్యమంత్రే హామీ ఇచ్చాక, హీరో ఆ అమ్మాయె వరో చెబుతాడు. అందరూ షాకవుతారు. ఆ అమ్మాయి - మీరా (తమన్నా). ఆ షాక్ దగ్గర ఇంటర్వెల్ కార్డు. తీరా అది కూడా హీరో ఆడిన నాటకమేనని తెలిసీ తెలియగానే, అతని తెలివికి ఆ పెద్దింటి అమ్మాయి ఫ్లాటైపోతుంది. ‘ఐ లవ్ యు’ చెప్పేస్తుంది. అది నచ్చని సి.ఎం. ఈ హీరో బ్యాక్‌గ్రౌండ్ ఎంక్వైరీ చేయిస్తాడు. ఆత్రేయపురంలో అందరి బాగు కోసం పనిచేసిన స్వర్గీయ జయనారాయణ్ (నాగినీడు) కొడుకే హీరో అని తెలిసి, షాకవుతాడు. రౌడీలతో హీరోను వేటాడతాడు. వాళ్ళ నుంచి తప్పించుకొని, సి.ఎం.తో 24 గంటల పందెం గెల్చిన హీరో- చివరకి రూ. 500 కోట్ల బేరానికి ప్రేమను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. అతనలా ఎందుకు చేశాడు? ఇంతకీ హీరో తండ్రి ఎవరు? ఈ సి.ఎం.కూ, చనిపోయిన ఆయనకూ సంబంధం ఏమిటి? ఇలా ఒక్కొక్కరినీ మెట్లుగా చేసుకుంటూ సి.ఎం. కూతురి దాకా వెళ్ళిన హీరో అసలు లక్ష్యం ఏమిటన్నది సెకండాఫ్ చివరలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్, ఆ తరువాత జరిగే క్లైమాక్స్ ఫైట్, సీన్. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, చిన్నా పెద్దా కలిపి ముగ్గురు విలన్లు, నలుగురైదుగురు కమెడియన్లు, ఒక సెంటిమెంటల్ తండ్రి పాత్రధారి - ఇలా చాలామంది తెరపై వచ్చి పోతుంటారు. కానీ, హీరో పాత్ర చుట్టూ, అతని భుజాల మీద మొత్తం నడుస్తుంది. ప్రత్యర్థిని తెలివిగా పడేసే తరహా పాత్రచిత్రణ రవితేజకు అలవాటే. అందుకే, ఆయన అనాయాసంగా చేశారు. ఇటు నిర్మాణ విలువలు, అటు కెమేరా పనితనం, డి.ఐ. వర్క్ స్పెషల్‌గా ఉన్న ఈ సినిమాలో మొన్నటి ‘కిక్2’లా కాకుండా, రవితేజ తెరపై పుంజుకున్నట్లనిపిస్తారు. నిడివిపరంగా చూస్తే రాశీఖన్నా ఎక్కువ, తమన్నా తక్కువ అన్న మాటే కానీ, నటన, పరిధి ప్రకారం చూస్తే ఈ పాత్రలు రెండూ రెండే! మంత్రుల మొదలు సి.ఎం. దాకా ప్రతి ఒక్కరూ హీరో చేతిలో బకరాలే కాబట్టి, విలనిజమ్‌ను మరీ అతిగా ఆశించకూడదు. అప్పటికీ, (మాజీ) సి.ఎం. పాత్ర రౌడీలతో కలసి ఆఖరులో గొడ్డలి కూడా పట్టి, హీరోతో పోరాడుతుంది. బురదలో కూరుకున్న రౌడీల దేహాల మీద నుంచి హీరో వెళ్ళే థ్రిల్లింగ్ విజువల్‌తో మొదలయ్యే ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే సినిమాటిక్‌గా, కథాగమనానికి కన్వీనియంట్‌గా నడిచిపోతాయి. రైతే వెన్నెముకంటూ ‘వ్యవసాయంలో సాయం ఉంది. అగ్రికల్చర్లో కల్చర్ ఉంది. అసలు ప్రపంచానికి సేవ చేసే గుణం రైతుకే ఉంది’ (సాయాజీ షిండే), ‘ఆస్తులు, వాస్తుల్ని కాదు.. దోస్తుల్ని నమ్ముతా’ (రవితేజ) లాంటి మంచి మాటలు చాలానే ఉన్నాయి. మెగాఫ్యామిలీ, పవర్‌స్టార్ ప్రస్తావ నలు, త్రివిక్రమ్ మార్కు హిట్ డైలాగ్‌లకు పేరడీలు సరేసరి. భీమ్స్ బాణీల్లో మాస్ పాటలున్నా, మెలొడీ ‘చూపులతో దీపాలా’ చాలాకాలం గుర్తుంటుంది. చిన్నా నేపథ్య సంగీతం, పదేపదే వచ్చే థీమ్ మ్యూజిక్ హాల్ నుంచి బయటకొచ్చాకా చెవుల్లో రింగుమంటాయి. ఈ సినిమాకు, ముఖ్యంగా ఎక్కువ శాతం మంది మెచ్చే ఫస్టాఫ్‌కు వినోదం బలం. పురోహితుడు ‘సెల బ్రిటీ శాస్త్రి’గా పోసాని కొంత, హీరో కావాలని తపించే ‘ఫ్యూచర్‌స్టార్ సిద్ధప్ప’గా పృథ్వి చాలావరకు సినిమాను నిలబెట్టారు. రిపోర్టర్ అమలాపురం పాల్ అలియాస్ అమలాపాల్‌గా బ్రహ్మానందం కనిపిస్తారు. కామెడీతో ఫస్టాఫ్ వినోదాత్మకంగా ఉందనిపిస్తుంది. హీరో ప్రవ ర్తనకు కారణం చెప్పే సెకండాఫ్‌కొచ్చేసరికి పాత్రలకు క్లారిటీ వస్తుంది. ప్రేక్షకులకూ సినిమాపై స్పష్టతొస్తుంది. గడచిన హిట్ ‘రచ్చ’ను దర్శకుడు ఈసారీ కొంత అనుసరించినట్లు కనిపిస్తుంది. శంకర్ ‘ఒకే ఒక్కడు’ నుంచి పాపులరైన సి.ఎం (చీఫ్ మినిస్టర్) వర్సెస్ సి.ఎం (కామన్‌మ్యాన్) ఫార్ములా వినడానికెప్పుడూ బాగుం టుంది. లాజిక్‌లందకపోయినా, గేవ్‌ునెంత తెలివిగా అల్లుకుంటే అంత కిక్. ఆ క్రమంలో సెకండాఫ్ కొంత బిగువైతే, రెండున్నర గంటల ‘బెంగాల్ టైగర్’ మన తెలివికి పనిపెట్టని మాస్ కామెడీ. ఒకరికి ఇద్దరు హీరో యిన్ల గ్లామరస్ ఎంటర్టైనర్. - రెంటాల జయదేవ -
వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా..?
మెగా అంచనాల మధ్య హీరోగా పరిచయం అయిన వరుణ్‌తేజ్ రెండో సినిమాతోనే రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ముకుంద సినిమాతో కూల్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్, తన రెండో సినిమాగా గమ్యం ఫేమ్ క్రిష్ డైరెక్షన్లో కంచె సినిమాలో నటిస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు వరుణ్. ఇప్పటికే షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తచేసుకున్న ఈ సినిమాను గాంధీజయంతి కానుకగా రిలీజ్ చేయాలని తొలుత భావించారు. పులి, శివం లాంటి సినిమాల రిలీజ్లు ఉండటం, తరువాత వారాల్లో కూడా వరుసగా బ్రూస్ లీ, అఖిల్ సినిమాల రిలీజ్లు ఉండటంతో నవంబర్‌కు వాయిదా వేశారు. దీపావళి కానుకగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తన బెంగాల్ టైగర్ దీపావళి బరిలో దూకుతోందని ప్రకటించాడు మాస్ మహరాజ్ రవితేజ. కిక్ 2 ఫెయిల్యూర్‌తో కష్టాల్లో ఉన్న రవితేజ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి ఫాంలోకి రావాలని చూస్తుండగా, గబ్బర్‌సింగ్ 2 కోసం ఎదురుచూసి చాలా సమయం వృథా చేసుకున్న దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. పెద్దగా ప్రభావం చూపని విజయ్, రామ్ లతో పోటీ కాదని రవితేజతో పోటీ పడుతుండటంతో వరుణ్ కంచె ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. మరి దీపావళి బరిలో వరుణ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో చూడాలి.