గోపిచంద్‌ ‘కూత’ మొదలైంది | Movie : Gopi Chandadh Movie Starts | Sakshi
Sakshi News home page

పునఃప్రారంభమైన ‘సీటీమార్‌’ షూటింగ్‌

Published Tue, Nov 24 2020 4:14 PM | Last Updated on Tue, Nov 24 2020 4:48 PM

Movie : Gopi Chandadh Movie Starts - Sakshi

సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘సీటీమార్‌’. ఈ చిత్రంలో  గోపిచంద్‌ హీరోగా నటిస్తున్నాడు. కథానాయికిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్‌ ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ జట్టు కోచ్‌ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ కోచ్‌గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ సోమవారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఇంతక ముందే గోపిచంద్‌, సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గౌతమ్‌ నంద’గా నటించి ప్రేక్షకులకు మంచి క్లాస్‌ యాక్షన్‌ సినిమాను అందించారు. మాస్‌ యాక్షన్‌, క్లాస్‌ పాత్రల్లో డబుల్‌ యాక్షన్‌తో మెప్పించాడు. ఇక తమన్నా ఇప్పటికే సంపత్‌ నంది దర్శకత్వం వహించిన బెంగాల్‌ టైగర్‌ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద విజయం సాధించింది.

ఈ సినిమాలో గోపిచంద్‌ సరసన మరో కథనాయికగా దిగంగన నటిస్తోంది. పచ్చని పల్లెటూరులో ఉంటూ గోపిచంద్‌ని ప్రేమించే పాత్రలో అందాల దిగంగన ఓదిగిపోయిందని చిత్రబృందం చెబుతోంది. 2010లో ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా సంపత్‌ నంది తెలుగు చిత్రసీమకు పరిచియమయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌తో రచ్చ సినిమా చేశాడు. రవితేజను ‘బెంగాల్‌ టైగర్‌’గా చూపించి ప్రేక్షకుల నుంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా విజయాలు లేక వెనుకబడిన సంపత్‌ నంది ఇప్పుడు సీటీమార్‌ చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement