Gopi Chand
-
మీ మద్దతు.. మీరే నా బలం: గోపిచంద్ ఎమోషనల్ పోస్ట్
గతేడాది రామబాణం మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం ఆయన విశ్వం చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనువైట్ల డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియో బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.అయితే గోపిచంద్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ కెరీర్లో సహకరించిన నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. మీరే నా బలం అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేదని గుర్తు చేసుకున్నారు. మీ మద్దతు నాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం సినిమాతో మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 2001 తొలివలపు మూవీతో గోపించంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జయం మూవీతో విలన్‌గా మెప్పించి.. హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 🙏❤️ pic.twitter.com/9XQhJYx7wV— Gopichand (@YoursGopichand) August 3, 2024 -
విజయవాడ వ్యక్తి సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి గోపీచంద్
సాక్షి, ఢిల్లీ: విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా గోపీచంద్ వెళ్లనున్నారు. విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్‌గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్‌కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్‌పోర్టే ఉంది. ఆరుగురు వ్యక్తులు వీరే.. అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే ఎన్ఎస్-25 మిషన్‌కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. ఇస్రో సైతం.. మరోవైపు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఈ జాబితాలో ఉన్నారు. మన దేశం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
వాళ్లకు చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పుకోలేదు.. కారణం ఇదే: గోపీచంద్
విలన్ పాత్రలతో ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు గోపీచంద్. పరాజయాలు ఎదరురైనా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో చెరగని ముద్ర వేశారు. ఆయన నుంచి సినిమా విడుదల అవుతుంది అంటూ మినిమమ్ గ్యారెంటీగా ఉంటుందని ఇండిస్ట్రీలో టాక్ ఉంది. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో 'భీమా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గోపీ చంద్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా గోపీ ముందుంటారు. కానీ ఆయన చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పుకోరు. అందుకు కారణాన్ని ఆయన ఇలా చెప్పారు. 'ఇష్టంతో చేసే పనిని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముంది..? నాకు ఉన్న శక్తి మేరకు కొంతమందిని చదివించాను.. వారిలో కొందరు ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. నా నుంచి సాయం పొందిన వారిలో కొంతమందికి నా పేరు కూడా తెలియదు. (ఇదీ చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్ అంబానీ బరువుపై హీరోయిన్ కామెంట్లు) బాగా చదువుకోవాలనే తపన ఉండి.. అలాంటి వారికి డబ్బే అడ్డు అయితే.. తప్పకుండా సాయం చేస్తాను. ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడటానికి చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే నేను చదువుకునే పిల్లలకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా చిన్నతనంలో ఒంగోలులో మాకు స్కూల్ ఉండేది. దానిని నాన్నగారే చూసుకునే వారు ఆయన మరణం తర్వాత మేము దాన్ని కొనసాగించలేకపోయాం. ఆ బాధ ఇప్పటికీ ఉంది. ఒక మంచి స్కూల్ పెట్టి విద్యను అందించాలని నాన్న అనుకునే వారు.' అని ఆయన అన్నారు. ఇక సినిమా విషయానికొస్తే భీమాలో అందరూ అఘోరాలు ఉన్నారని 'అఖండ'తో పోల్చుతున్నారు. కానీ ఈ చిత్రం అలా ఉండదని ఆయన గోపీ చంద్ చెప్పారు. పరశురామ క్షేత్రాన్ని బ్యాక్‌డ్రాప్‌లో తీసుకుని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఇది కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్‌గా ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతారని అభిప్రాయపడ్డారు. -
జయం సినిమాకి నన్ను విలన్ గా ఎందుకు తీసుకున్నారు..
-
మీమర్స్ తో రచ్చ చేసిన గోపిచంద్,దింపులే హయాతి...
-
హీరో గోపీచంద్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
ప్రభాస్,బాల కృష్ణ వల్ల రామబాణం దూసుకుపోతుంది
-
నాకు ప్రభాస్ కి ఇలాగే ఉంటుంది బాలయ్యకు స్పెషల్ థాంక్స్
-
మన దాకా వస్తే కానీ ఎన్టీర్,సాయి ధరమ్ తేజ్,చెపింది అర్ధం కాదు
-
రామబాణంలో సీన్ లీక్ చేసి నవ్వులు పూయించిన అలీ
-
రామబాణం బడ్జెట్ రుమౌర్స్ ఫై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్
-
రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిది: గోపీచంద్
కర్నూలు(టౌన్): రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిదని సినీ హీరో గోపీచంద్ అన్నారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో శుక్రవారం రాత్రి రామబాణం సినిమాలోని ‘దరువెయ్యరా’ పాట లాంచింగ్ ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ తన 30వ సినిమాగా రామబాణం విడుదల కానుందన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. -
గోపీచంద్ “రామబాణం” నుంచి ధరువెయ్ రా సాంగ్ విడుదల
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుంది. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటకే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడదే జోష్‌తో ధరువెయ్ రా సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. జగపతిబాబు, ఖుష్బు ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్నారు. -
డిరైక్టర్ శ్రీవాస్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
సమ్మర్లో వస్తానంటున్న గోపీచంద్.. పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్ చిత్రాల డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా రామబాణం. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా,జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. #Ramabanam hitting Theatres on May 5th!!@DirectorSriwass @vishwaprasadtg @DimpleHayathi @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/0sX11TXvc1 — Gopichand (@YoursGopichand) March 4, 2023 -
బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
బాలయ్య హోస్ట్‌గా ఎన్బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్టుగా హాజరవడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్లకు తప్పా బయట ఎక్కడా అంతగా కనిపించరు. అలాంటిది బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ షోకు ప్రభాస్ తన స్నేహితుడు, హీరో గోపీచంద్‌తో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ మరో హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా బ్లాక్ షర్ట్‌లో కనిపించే ప్రభాస్ ఎన్బీకే షోలో మాత్రం కలర్ఫుల్గా కనిపించారు. దీంతో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? దాని ధరెంత అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్ ఉంటుందట. అంటే అక్షరాలా ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11,618/. ఏది ఏమైనా ప్రభాస్ ఈ షర్ట్‌లో మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారని, ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
హీరో గోపీచంద్ చిన్నకొడుకును చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో..
మ్యాచో హీరో గోపీచంద్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరన్న సంగతి తెలిసిందే. సినిమాలు తప్ప ఆయన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా గోపీచంద్ తన చిన్న కొడుకు వియాన్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సులో కనిపించారు. ఫోటోలకు ఫోజులిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వియన్ క్యూట్ లుక్స్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో లౌక్యం, లక్ష్యం చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఆయన నాకెప్పటికీ హీరోలా కనిపిస్తారు
‘‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అందర్నీ అలరిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఫుల్ మీల్స్‌లాంటి సినిమా.. ఎంజాయ్ చేయండి. మళ్లీ థియేటర్లు కళకళలాడాలి’’ అన్నారు చిరంజీవి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ అద్భుతమైన దర్శకుడు. కళాశాలలో నా సీనియర్ అయిన ఆయన నాలోని భయాన్ని పోగొట్టి ప్రోత్సహించారు.. అందుకే నాకెప్పుడూ ఒక హీరోలాగా కనిపిస్తుంటారాయన. ఆయన లేకున్నా ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్ ద్వారా కురుపిస్తున్నారాయన. గోపీచంద్ సినిమాల్లో నాకు ‘సాహసం’ బాగా నచ్చింది. ‘ఒక్కడున్నాడు, చాణక్య’ వంటి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. మారుతి సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాలు నాకు బాగా నచ్చాయి. అన్ని హంగులున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా తన గత సినిమాలను మించి ఆడాలని కోరుకుంటున్నాను. మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో వంశీ, విక్కీలతో సినిమా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ తీసిన ‘ప్రతిఘటన’ చూసి చిరంజీవిగారితో మా బ్యానర్లో ఓ సినిమా చేయమని అడిగాను.. దురదృష్టవశాత్తు ఆయన మనతో లేరు. ఆ తర్వాత ఇన్నేళ్లకు గోపీచంద్‌తో మా బ్యానర్లో ఓ మంచి సినిమా చేయడం హ్యాపీ. ప్రేక్షకులను నవ్వించే శక్తి ఈవీవీ సత్యనారాయణగారికి ఉండేది.. ఇప్పుడు మారుతికి ఉంది’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి మహావృక్షంలా నిలబడ్డారంటే ఆయన పట్టుదల వల్లే. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఇప్పటికీ ఇండస్ట్రీకి వస్తుండటం గ్రేట్. మారుతికి మంచి ప్రతిభ ఉంది. ‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత తను మరింత మంచి స్థాయికి ఎదుగుతాడు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహనిర్మాత ఎస్కేఎన్, యూవీ క్రియేషన్స్ వంశీ, విక్కీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట
‘పక్కా కమర్షియల్’ సినిమా కోసం జననం... మరణం గురించి దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన పాట ఫిబ్రవరి 2న విడుదల కానుంది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘సిరివెన్నెలగారు రాసిన చివరి పాట ఇది. ఈ స్ఫూర్తిదాయకమైన పాట భావోద్వేగంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘మరణం గురించి ముందే తెలిసినట్లు సిరివెన్నెలగారు కొన్ని పదాలను ఈ పాటలో సమకూర్చారు’’ అన్నారు మారుతి. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్లా, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు. -
‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..
Aaradugula Bullet Movie Trailer Is Out: గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కామెడితో పాటు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.'పరిచయం అయితే నేను మర్చిపోను. పంగా అయితే నువ్వు మర్చిపోలేవు, ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా?' వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
Aaradugula Bullet Movie: బుల్లెట్ వస్తోంది
‘బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర’.. వంటి పలు హిట్ చిత్రాలు తీసిన బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. గోపీచంద్–నయనతార జంటగా నటించారు. తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్లలోకి దూసుకురానుంది. ఈ సందర్భంగా తాండ్ర రమేష్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్, నయనతార నటన, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నేనే సొంతంగా విడుదల చేస్తున్నాను’’ అన్నారు. -
Book Review: తేనెటీగ కాదది విషపు తేలు
‘తేనెటీగ కాదది విషపుతేలు’ పుస్తక సంపాదకులు ఈదర గోపీచంద్ అంకిత భావం గల గాంధేయవాది. 1988 అక్టోబర్‌లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో మల్లాది వెంకటకష్ణమూర్తి మందారమకరందాన్ని మించిన సెక్సైటింగ్ నవల ప్రచారంతో ‘తేనెటీగ’ను సీరియల్‌గా ప్రచురించడం ప్రారంభించాడు. అందులో బూతుజోకులు, అసభ్యరేఖాచిత్రాలు పాఠకులపై విషం చిలకరిస్తున్న డర్టీ సీరియల్‌ను గోపీచంద్ చదివి అశ్లీల ప్రతిఘటనా వేదిక ద్వారా సీరియల్ ప్రచురణ ఆపించేందుకు మూడేళ్లపాటు (1989–91) అవిరళపోరాటం చేశాడు. ఒక సామాన్యకార్యకర్తగా ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ప్రముఖ రచయితలు, 16 అభ్యుదయసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, స్వాతంత్య్రసమరయోధులు, మహిళలు, విద్యార్థినులను భాగస్వాములుగా చేసి మహోన్నత సాంఘికపోరాటంగా మలచి విజయం సాధించాడు. ఈ నవలను తర్వాత సినిమా తీసేటప్పుడు అశ్లీల ప్రతిఘటనా వేదిక తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. రచయిత మల్లాది ఆంధ్ర భూమి దినపత్రికలో తన వాదాన్ని, సమర్ధించుకుంటూ ‘రచయితలకు స్వేచ్ఛ లేదా? అనే వ్యాసాన్ని రాశాడు. ప్రముఖ పాత్రికేయులు, అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు డా. ఎ.బి.కె. ప్రసాదు ‘అక్షరం’ శీర్షికలో చర్చావేదిక ప్రారంభించారు. ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ మల్లాది వాదాన్ని ఖండిస్తూ సుదీర్ఘమైన వ్యాసం రాశారు. నిఖిలేశ్వర్, పాపినేని శివశంకర్, విరసం కృష్ణాబాయి, కొత్తపల్లి రవిబాబు, బీరం సుందరరావు, రావి రంగారావు వంటి రచయితలు మల్లాదిపై ఎదురు దాడి చేసి రచయిత స్వేచ్ఛకు హద్దులుండాలనీ, బాధ్యతలుండాలనీ సూచించారు. ప్రజాసాహితి, అరుణతార వంటి పత్రికలు ఈ చర్చను కొనసాగించాయి. ఎందరో రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా రాశారు. ఈ పోరాట ఫలితంగా గోపీచంద్ విజయం సాధించినట్టే సంపాదకుడు ఈ పుస్తకాన్ని 11 అధ్యాయాలుగా వర్గీకరించి విశ్లేషణాత్మకంగా సమగ్ర సమాచారంతో రూపొందించాడు. ప్రతి అధ్యాయం ఆరంభంలో ప్రధానమతాల నుంచీ లేదా మహా పురుషుల రచనల నుంచి నైతిక విలువలను బోధించే సూత్రాలతో ప్రచురించడం ఔచిత్యంగావుంది. మొదట అధ్యాయం నాందిలో ఈ ఉద్యమానికి ప్రేరకులు న్యాయవాది కాంతారావు గారి సహకారాన్ని వివరించారు. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రభూమి ‘అక్షరం’ శీర్షికలో వచ్చిన ప్రముఖ రచయితల వ్యాసాలు, పాఠకుల, ప్రేక్షకుల స్పందనలను చేర్చారు. అనుబంధంతో కేంద్రమంత్రి ఉపేంద్రగారితో ఉత్తర ప్రత్యుత్తరాలను తేనెటీగ కన్నడ అనువాదం ‘భ్రమరం’ ఆపాలన్న డిమాండ్ వంటివి చేర్చారు. గోపీచంద్ పోరాట ఫలితంగా మూడు దశాబ్దాలకు (2020) రచయిత మల్లాది పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ గోపీచంద్ నిజాయితీని ప్రశంసించారు. చెత్త నవలలను పునర్ ముద్రించనని ప్రతిజ్ఞ చేశాడు. అశ్లీల ప్రతిఘటనా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరాడు. సామాజిక పోరాటస్పూర్తితో, పాత్రికేయ అనుభవంతో సంపాదకులు ఈ గ్రంధాన్ని సముచితంగా కూర్పు చేశారు. పాత్రికేయ, సాహితీ, నైతిక, సామాజిక, అభ్యుదయ ప్రగతి భావుకులు విధిగా చదవదగిన గ్రంధం ‘తేనె టీగ కాదది విషపు తేలు’. – డా. పి.వి. సుబ్బారావు తేనె టీగ కాదది విషపు తేలు వెల 120/రూ.; పేజీలు 196. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం. వివరాలకు: ఈదర గోపీచంద్ 9440345494 -
'వేశ్య'గా యాంకర్ అనసూయ!
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో అనసూయ నటించనుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని మూవీ టీం వెల్లడించింది. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశి ఖన్నా, ఈషా రెబ్బా కథానాయుకలుగా నటించున్నట్లు సమాచారం. చదవండి : (అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!) (వైరల్ అవుతున్న దీపికా పదుకొనె డ్యాన్స్ వీడియో) -
గోపీచంద్- మారుతి సినిమా టైటిల్ ఇదే
మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫిబ్రవరి 14) ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. Bless us my next with Macho star @YoursGopichand garu#PakkaCommercial It is..👌#AlluAravind #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/SsAM9brNJ3 — Director Maruthi (@DirectorMaruthi) February 14, 2021 -
మారుతి కొత్త సినిమా ప్రకటన.. హ్యూమరస్ వీడియో
‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్లీ మారుతి దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్–బన్నీ వాసు నిర్మించనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్ హీరో. ‘‘సూపర్ డూపర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కించడానికి మారుతి రంగం సిద్ధం చేశారు. గోపీచంద్–మారుతి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే ప్రకటన కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేశాం. ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మారుతి చేయబోయే సినిమాపై వచ్చిన పుకార్లకు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్లో ఓ హ్యూమరస్ వీడియోను విడుదల చేశాం. ఈ వీడియోకి రావు రమేశ్‌గారి వాయిస్ ఓవర్ బాగా కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గోపిచంద్ ‘కూత’ మొదలైంది
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘సీటీమార్’. ఈ చిత్రంలో గోపిచంద్ హీరోగా నటిస్తున్నాడు. కథానాయికిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ కోచ్‌గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఇంతక ముందే గోపిచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతమ్ నంద’గా నటించి ప్రేక్షకులకు మంచి క్లాస్ యాక్షన్ సినిమాను అందించారు. మాస్ యాక్షన్, క్లాస్ పాత్రల్లో డబుల్ యాక్షన్‌తో మెప్పించాడు. ఇక తమన్నా ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మరో కథనాయికగా దిగంగన నటిస్తోంది. పచ్చని పల్లెటూరులో ఉంటూ గోపిచంద్‌ని ప్రేమించే పాత్రలో అందాల దిగంగన ఓదిగిపోయిందని చిత్రబృందం చెబుతోంది. 2010లో ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా సంపత్ నంది తెలుగు చిత్రసీమకు పరిచియమయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో రచ్చ సినిమా చేశాడు. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా చూపించి ప్రేక్షకుల నుంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా విజయాలు లేక వెనుకబడిన సంపత్ నంది ఇప్పుడు సీటీమార్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 📢📢📢 Aftr a longggg warm up solid stretches n powerpacked practice Everyone’s set..fit..fab n back to do wat we love the most 🎥 wid xtra care n zeal. Wait is over! కూత మొదలు..Nov 23 నుండి... ఇక non-stop కబడ్డి..కబడ్డి..కబడ్డి!!!💥#Seetimaarr @bhumikachawlat #HappyDiwali pic.twitter.com/8WYlbXuoaQ — Sampath Nandi (@IamSampathNandi) November 14, 2020 -
ఓటీటీలో గోపీచంద్-నయన్ చిత్రం?
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా విరామం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. అయితే థియేటర్లు తెరుచుకునే విషయంలో ఇప్పటికీ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఓటీటీ (ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్)లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా విడుదల అయ్యాయి. అమృతరామమ్‌తో పాటు కీర్తి సురేష్, జ్యోతిక, అమితాబ్‌ల చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని పలు కారణాలతో విడుదలకు నోచుకోని చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. (ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ) తాజాగా గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం కూడా డిజిటల్ బాట పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల క్రితం గోపీచంద్, నయనతార జంటగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. షూటింగ్ పూర్తయినా.. చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు మొదలు పెట్టారంటా. గోపిచంద్ క్రేజ్, నయనతరా గ్లామర్, గోపాల్ ఇమేజ్ కలగలపి ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ నిర్వాహకులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓటీటీలో విడుదల అవుతున్న గోపీచంద్-నయనతార చిత్రం ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
ఏ టైటిల్ ఎవరిది?
శనివారం తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను దర్శకత్వం వహించబోయే రెండు సినిమాలను ప్రకటించారు. ఒకటి గోపీచంద్‌తో, మరొకటి రానాతో. ఈ హీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించి, ‘రాక్షసరాజు–రావణాసురుడు’, ‘అలివేలు మంగా– వెంకటరమణ’ అని రెండు టైటిల్స్ కూడా చెప్పారు. అయితే ఈ టైటిల్స్‌లో గోపీచంద్ సినిమా ఏది? రానా సినిమా ఏది? అనే క్లారిటీ ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘అలివేలు మంగా–వెంకటరమణ’ గోపీచంద్ సినిమా టైటిల్ అని తెలిసింది. ఇక గోపీచంద్–తేజ, రానా–తేజల కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. గోపీచంద్‌ను ‘జయం’ చిత్రం ద్వారా విలన్‌గా పరిచయం చేసి, పెద్ద హిట్ ఇచ్చారు తేజ. అలాగే రానాకు ‘నేనే రాజు– నేనే మంత్రి’ వంటి చక్కటి విజయాన్ని అందించారు. -
సీటీమార్ ఖరార్
గోపీచంద్ విజిల్ వేస్తున్నారు. సీటీ మార్ సీటీ మార్ అంటూ సందడి చేస్తున్నారు. ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల్లో హుషారు నింపనున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించనంత ఎనర్జిటిక్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సినిమా టైటిల్ ‘సీటీ మార్’. ‘యు టర్న్’లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది దర్శకుడు. గోపీచంద్ సరసన తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సీటీమార్’ టైటిల్‌ని ఖరారు చేసిన విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్, రాజమండ్రిలోæభారీ షెడ్యూల్ పూర్తి చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభించిన షెడ్యూల్‌ను నాన్‌స్టాప్‌గా జరుపుతాం. సమ్మర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్ కుమార్. -
స్పోర్ట్స్ స్టార్స్
‘ఆట గదరా శివా’... అని జీవుడు దేవుడు గురించి అనుకోవచ్చు. హీరో హీరోయిన్లు ఆటాడుకుందాంరా అని డైరెక్టర్‌తో అంటున్నారు. కొందరు కబడ్డీ ఆడుతున్నారు..కొందరు బాక్సింగ్ గ్లవ్స్ తొడుక్కుంటున్నారు..కొందరు ట్రాక్ మీద బుల్లెట్ సౌండ్ వినగానే పరుగు తీయడానికి రెడీ అవుతున్నారు..మరికొందరు కుస్తీ గోదాలో తొడగొడుతున్నారు. కథలిప్పుడు ఆట ఆటగా ఉన్నాయి. ప్రేక్షకుల చేత కలెక్షన్లనే పాయింట్లు కోరుతున్నాయి. గెలిచిన వారికే సక్సెస్ కప్! టాలీవుడ్‌ను స్పోర్ట్స్ ఫీవర్ పట్టుకున్నట్లుంది. బాక్సింగ్, రన్నింగ్, హాకీ... ఇలా ఏ ఆటలో మంచి కథ దొరికితే ఆ క్రీడాకారులుగా మారిపోయి మైదానంలోకి అడుగుపెడుతున్నారు నటీనటులు. ఇండస్ట్రీ గ్రౌండ్లో వెండితెర వేదికపై సూపర్ హిట్ కప్పు కొట్టాలనే కసితో ఆటకు రెడీ అయ్యారు. స్టోర్స్ స్టార్స్‌గా ప్రేక్షకుల నుంచి రికార్డు వసూళ్లు అందుకోవాలనే సంకల్పంతో టాలీవుడ్ బాక్సాఫీస్ టోర్నీకి సిద్ధమవుతున్న సినిమా స్టార్స్ గురించి తెలుసుకుందాం. స్వారీకి సై ‘గురు’ సినిమాలో బాక్సర్‌గా బాక్సాఫీస్‌కు ఫటా ఫట్ పంచ్‌లు ఇచ్చిన వెంకటేశ్ మరో స్పోర్ట్స్ మూవీ కోసం గుర్రపు స్వారీకి సై అన్నారని సమాచారం. ఈ స్పోర్ట్స్ సినిమాకు ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ తరుణ్‌భాస్కర్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట రేస్ క్లబ్ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారట తరుణ్ భాస్కర్. కబడ్డీ... కబడ్డీ.. కబడ్డీలాంటి ఆటలకు గోపీచంద్‌లాంటి కటౌట్ ఉన్న హీరోలు బాగా సూట్ అవుతారు. త్వరలో గోపీచంద్ కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టనున్నారు. కానీ ఆటగాడిగా కాదు.. కోచ్‌గా. కోర్టులోకి దిగి తన జట్టు సభ్యులకు శిక్షణ ఇచ్చి గెలుపు మంత్రం చెప్పబోతున్నారు. ఆంధ్రా కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్ నటించనున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. ఈ చిత్రంలో తెలంగాణ జట్టు కబడ్డీ కోచ్‌గా తమన్నా నటిస్తారు. గెలుపు గోల్ మ్యాచ్‌లో తన సహచర ఆటగాడు అందించిన పాస్ అందుకుని హాకీ స్టిక్‌తో బంతిని ఎక్స్‌ప్రెస్ వేగంతో గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్నారు సందీప్ కిషన్. మ్యాచ్‌ని మలుపు తిప్పే ఓ గోల్ కోసం గోల్‌పోస్ట్‌లోకి షాట్ కొట్టారు. ఆ నెక్ట్స్ ఏమైందో ఇప్పుడే చెబితే ఎలా? ఆటను, ఆ షాట్‌ను వెండితెరపై చూస్తేనే కదా అసలు మజా. ప్రేక్షకులకు ఆ కిక్‌ను అందించడానికే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో హాకీ ప్లేయర్ అవతారం ఎత్తారు సందీప్ కిషన్. డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. కలల పరుగు 400 మీటర్స్ స్ప్రింటర్‌గా సరికొత్త ట్రాక్ రికార్డును క్రియేట్ చేయాలనుకునే కలలవైపు పరుగులు పెడుతున్నారు ఆది పినిశెట్టి. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘క్లాప్’. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఆకాంక్షా సింగ్ హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తారు. అథ్లెట్ విష్ణు పాత్రలో నటిస్తున్నారు ఆది పినిశెట్టి. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. గురి పెట్టాడు బాణం చేతపట్టి హిట్ మూవీపై గురి పెట్టారు నాగశౌర్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ స్పోర్ట్స్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు ఆర్చరీ (విలు విద్య)లో ప్రత్యేక్ష శిక్షణ తీసుకునే పనిలో బిజీగా ఉంటారట నాగశౌర్య. డబుల్ ధమాకా బాక్సర్‌గా... రేసర్‌గా.. ఒకేసారి రెండు ఆటలు ఆడటానికి రెడీ అవుతున్నారట విజయ్ దేవరకొండ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రం కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందని, విజయ్ బాక్సర్‌గా నటిస్తారని టాక్. మరోవైపు ‘హీరో’ చిత్రం కోసం రేసర్‌గా ట్రాక్‌లో పడ్డారు విజయ్. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆనంద్ అన్నామళై దర్శకుడు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా విజయ్ దేవరకొండ కనిపించిన సంగతి తెలిసిందే. మరికొన్ని... ఆల్రెడీ కొంతమంది హీరోలు క్రీడాకారులుగా సాధన మొదలుపెట్టేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరకెక్కనుంది. ఇందులో గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటించనున్నారు. సుధీర్‌బాబు ఆల్రెడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తారు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత చేయబోతున్న చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇక ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్‌లో రానా నటిస్తారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రధారిగా నగేష్ కుకునూరు దర్శకత్వంలో స్పోర్ట్స్ కామెడీ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘కౌశల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’ సినిమాలో క్రికెటర్‌గా కనిపించిన ఐశ్వర్యా రాజేష్ ‘మిస్ మ్యాచ్’ సినిమాలో రెజ్లర్‌గా నటించారు. ఎన్.వి. నిర్మల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉదయ్ శంకర్ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. – ముసిమి శివాంజనేయులు -
మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా
‘‘నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో అవన్నీ ‘చాణక్య’ సినిమాలో ఉన్నాయి. ఓ హీరోను ఎలా చూపించాలో తిరుగారు అలా చూపించారు’’ అని హీరో గోపీచంద్ అన్నారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా, బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘అనిల్ సుంకరగారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్.. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. అబ్బూరి రవిగారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతం అందించారు. మీ ప్రేమను ఈనెల 5న తిరిగి ఇచ్చేస్తా’’ అన్నారు. ‘‘చాణక్య’ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఎంపీ, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ. డైరెక్టర్ తిరు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌గారు సరికొత్త పాత్రలో, చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఆయన ఇష్టమైన సినిమాల లిస్టులో మా సినిమా కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘గోపీచంద్‌గారిని సరికొత్త కోణంలో చూపిస్తున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. నటుడు రాజేష్ కతార్. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర, కెమెరా: వెట్రి పళనిస్వామి. -
యమ జోరు
హీరో గోపీచంద్ యమ జోరు మీద ఉన్నారు. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్లో స్పీడ్ పెంచారు. ఇటీవలే బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకడిగా పరిచయమవుతున్న సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలియజేసిన గోపీచంద్ తాజాగా మరో కొత్త సినిమాకు సై అన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. గోపీచంద్ కెరీర్లో ఇది 28వ చిత్రం. ‘‘హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మరో వైపు గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’ ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు తిరు దర్శకుడు. -
సింధు సన్నాహాలకు సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వపరంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బుధవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిశారు. తనకు వచ్చిన గోల్డ్ మెడల్‌ను కేసీఆర్‌కు సింధు చూపించింది. రెండు రాకెట్లను కూడా సీఎంకు బహూకరించింది. ఈ సందర్భంగా సింధుకు సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసింది. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యంకాదు’ అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ సహా సింధు భవిష్యత్తులో పాల్గొనే టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. టోక్యోలో స్వర్ణం ఖాయం: గవర్నర్ నరసింహన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన మానసి జోషిలను బుధవారం గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ‘పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని సింధు, మానసి నిరూపించారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి మళ్లీ రాజ్‌భవన్‌కు రావాలని కోరుకుంటున్నా’ అని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాము నెగ్గిన స్వర్ణ పతకాలను గవర్నర్‌కు చూపిస్తున్న మానసి, సింధు -
ఏజెంట్ చాణక్య
‘చాణక్య’ ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడు. దేన్నైయినా విశ్లేషించగలుగుతాడు. అతను పరిశోధన మొదలుపడితే ఏ కేస్ అయినా పరిష్కారం కావాల్సిందే. మరి.. చాణక్య ఎలాంటి ప్లాన్లు వేశాడు? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారని తెలిసింది. తాజాగా ఈ సినిమాలో గోపీచంద్ కొత్త లుక్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పాటలను విదేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలను కుంటున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి. -
జై సేన విజయం సాధించాలి
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జై సేన’. వి. విజయలక్ష్మీ సమర్పణలో వి. సాయి అరుణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. శ్రీకాంత్‌గారితో పాటు కొంతమంది కుర్రాళ్లు నటించారు. సునీల్‌ది స్పెషల్ రోల్. ఈ సినిమా విజయం సాధించాలి. సముద్ర ఇంకా మంచి సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, సునీల్ పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నలుగురు యువహీరోలు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు సముద్ర. ‘‘త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ–నిర్మాత పి. శిరీష్ రెడ్డి. -
యాక్షన్ ప్లాన్ రెడీ
విలన్ల పని పట్టడానికి రెడీ అవుతున్నారు గోపీచంద్. అందుకు ఆయన ఓ ప్లాన్ వేశారట. ఆ ప్లాన్‌ని వెండితెరపై చూడాల్సిందే. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ఆ మధ్య రాజస్తాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్ సీన్లో భాగంగా గోపీచంద్ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్ పడిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల 6న హైదరాబాద్‌లో స్టార్ట్ కానున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం. ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. -
వన్స్ మోర్
యాక్షన్ మోడ్ నుంచి రొమాంటిక్ మోడ్‌లోకి మారిపోయారు గోపీచంద్. ఇండియా పాకిస్థాన్ బోర్డర్లో విలన్స్‌తో ఫైటింగ్ చేసిన ఆయన ప్రస్తుతం హీరోయిన్స్‌తో డ్యూయెట్స్ పాడటానికి సిద్ధమయ్యారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో గూఢచారి (స్పై) పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారు. స్పైగా పాకిస్థాన్ బార్డర్లో 45 రోజులు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ గూఢచారికి జోడీ కుదిరింది. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘ఎఫ్ 2’ తర్వాత మెహరీన్ చేయబోతున్న తెలుగు సినిమా ఇదే. ఆల్రెడీ ‘పంతం’ సినిమాలో గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలకానుందట. -
బ్యాక్ టు యాక్షన్
....అని అంటున్నారు హీరో గోపీచంద్. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను రాజస్తాన్‌లో మొదలుపెట్టారు. అయితే... ఓ యాక్షన్ సీన్లో భాగంగా గోపీచంద్ గాయపడటంతో ఈ షెడ్యూల్ ఆగిపోయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న గోపీచంద్ కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో సెట్లో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. ‘‘నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాం’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు దర్శకుడు తిరు. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ భామను హీరోయిన్గా అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
కొత్త జోడీ
ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా కెరీర్లో కాజల్ అగర్వాల్ జోరు, క్రేజు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆల్రెడీ కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు కాజల్. ఇటీవల రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కనకదుర్గ’ (వర్కింగ్ టైటిల్ అని తెలిసింది) సినిమాలో కాజల్ ఒక కథానాయికగా ఎంపిక అయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ సరసన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. గోపీచంద్ హీరోగా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో కథానాయికగా కాజల్‌ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇప్పటివరకూ గోపీచంద్. కాజల్ కలసి నటించలేదు. మరి ఈ కొత్త జోడీ షురూ అయిందా అనేది తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇక హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, అలాగే తేజ దర్శకత్వంలో రూపొందిన ‘సీత’ కాజల్ అగర్వాల్ నెక్ట్స్ రిలీజ్లు. ‘సీత’లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించారు. -
అంతకు మించి...
గోపీచంద్ హీరోగా, భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ‘సాహసం’ చిత్రం ఘనవిజయం సాధించింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తోంది. ఇప్పుడు మరోసారి గోపీచంద్–బీవీఎస్.ఎన్. ప్రసాద్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ఓ సినిమా ఆరంభమైంది. సంతోష్ శివన్, ‘జయం’ రాజాల వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బీవీఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సాహసం’ తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బిను సుబ్రమణ్యం చెప్పిన కథ చాలా బాగుంది. ‘సాహసం’ చిత్రం ట్రెజర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచరస్‌గా ఉంటుందో.. ఈ సినిమా దాన్ని మించి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. రాజీపడకుండా ఈ చిత్రం నిర్మిస్తాం. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సతీష్.కె ఛాయాగ్రాహకుడు. -
మరో సినిమా లైన్లో పెట్టిన మాస్ హీరో
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నా.. కమర్షియల్ సక్సెస్‌లు సాదించటంలో ఫెయిల్ అవుతున్న నటుడు గోపిచంద్. యాక్షన్ చిత్రాల హీరోలకు ఆకట్టుకున్న గోపిచంద్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా చేస్తున్న గోపిచంద్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. తనతో గౌతమ్ నంద లాంటి స్టైలిష్ సినిమాను తెరకెక్కించిన కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు గోపిచంద్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
స్పైతో సై
గోపీచంద్ గూఢచారిగా మారి భారతదేశం బోర్డర్లో సాహసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గూఢచారికి జోడీ ఫిక్స్ అయ్యారని సమాచారం. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్ జానర్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ బోర్డర్లో జరుగుతోంది. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్గా తమన్నా పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. గోపీచంద్‌తో తమన్నా హీరోయిన్గా యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆల్రెడీ ఈ సినిమాలో మరో కథనాయికగా బాలీవుడ్ భామ జరైన్ ఖాన్‌ను ఎంపిక చేశారు. సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. -
నా కెరీర్లో పంతం బెస్ట్
‘‘పంతం’ వంటి మంచి సినిమా చేశానని అందరూ అభినందిస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు అభినందనలు అని చాలా మంది ఫోన్ చేశారు’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఎ కాస్’ అన్నది ఉప శీర్షిక. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చక్రి చెప్పింది చెప్పినట్లుగా ఈ సినిమా తెరకెక్కించారు. నా కెరీర్లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. రాధామోహన్‌గారు మంచి అవుట్‌పుట్ రావాలని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మరిన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి’’ అన్నారు. ‘‘కథ వినగానే గోపీచంద్‌గారైతే సరిపోతారని ఆయనకు కథ చెప్పాం. ఆయన కోసమే ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం. చక్రి కొత్తవాడైనా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా తెరకెక్కించారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమిది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి’’ అన్నారు కె.కె.రాధామోహన్. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గోపీచంద్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అన్నారు మెహరీన్. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాధామోహన్‌గారికి థాంక్స్. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కె.చక్రవర్తి. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, పాటల రచయిత భాస్కరభట్ల, రైటర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోపిచంద్ ’పంతం’ ట్రైలర్ విడుదల
-
హంసానందిని పంతం
యాక్షన్ హీరో గోపీచంద్‌తో హంసానందిని ‘పంతం’ పట్టారు. గోపితో ఆమె పంతం పట్టాల్సినంత వైరం ఏంటి? అనేగా మీ డౌట్. ఇక్కడ పంతం అన్నది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో అన్నమాట. ఇంకా అర్థం కాలేదా?. గోపీచంద్, మెహరీన్ జంటగా చక్రి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. గోపి కెరీర్లో ఇది 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో హంసానందిని ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. గతంలో ‘లౌక్యం’ సినిమాలో గోపీచంద్‌తో ఐటమ్ సాంగ్ చేశారీ బ్యూటీ. అయితే.. ‘పంతం’ సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్, అతిథి పాత్రలాంటివి కావట. హంసా కెరీర్లో బాగా గుర్తింపు తెచ్చేలా ఈ పాత్ర ఉంటుందట. ‘‘చక్రి చెప్పిన కథ బాగా నచ్చింది. బాగా డబ్బున్న అమ్మాయిగా క్లాసీ లుక్‌లో కనిపిస్తా. నటిగా నన్ను నేను కొత్తగా చూసుకునే పాత్ర ఇది. చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశా ’’ అన్నారు హంసానందిని. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో విడు దల కానుంది. -
బాగున్నా బాగా లేదనడం న్యాయం కాదు
‘‘ సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయింది. సినిమా షో కంప్లీట్ అయ్యే లోపే సినిమా రిజల్ట్‌ను తేల్చేస్తున్నారు. పాత రోజుల్లో సినిమా రివ్యూలను వారం లేదా పది రోజుల తర్వాత రాసేవారు. ఇప్పుడు షో తర్వాతే రేటింగ్‌లు ఇచ్చేస్తున్నారు. బాగాలేని సినిమాని బాగుందని రాయమని అడగం. కానీ, బాగున్న సినిమాని బాగాలేదని రాయడం న్యాయం కాదు. ఇది నా సొంత అభిప్రాయం’’ అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎస్. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. గురువారం విడుదల అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏ.ఎం. రత్నం విలేకర్లతో చెప్పిన విశేషాలు... ► కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఉన్న సినిమా ‘ఆక్సిజన్’. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మౌత్ టాక్ బాగుంది. కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ప్రజెంట్ డేస్‌లో సందేశాత్మక చిత్రాలకు ప్రేక్షకాదరణ తగ్గింది. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు ఎంటర్టైన్ చేస్తూనే ప్రేక్షకులకు మంచి మేసేజ్ ఇచ్చాయి. సినిమాలు చూసి ప్రజలు సడన్‌గా మారతారని అనుకోను. వారు ఆలోచిస్తే చాలు అన్నదే మా ప్రయత్నం. అప్పట్లో ‘కర్తవ్యం’ సినిమా చాలామంది మహిళలను ఇన్స్పైర్ చేసింది. ► ‘ఆక్సిజన్’ ఏ లాంగ్వేజ్‌లో అయినా బాగుంటుంది. ‘హిందీలో తీద్దాం. అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు చూపిద్దాం’ అని నా ఫ్రెండ్ అన్నాడు. సినిమా రిలీజ్ కాకముందు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌కు చూపిద్దామనుకున్నా. తమిళ రీమేక్ ఆలోచన ఉంది. పవన్ కల్యాణ్‌తో ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్ అంటే.. అది ఆయనే డిసైడ్ చేస్తారు. ఇకపై తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నాను. -
అలా అంటే ఒప్పుకోను.!
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో బాలీవుడ్ నటులతోనే క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను ఒప్పుకోనని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేశారు. నగరంలో జరగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం ‘క్రీడా రంగంలో వ్యాపార విజయం’ అంశంపై మాస్టర్‌క్లాస్ సెషన్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి సమన్వయకర్తగా హర్షబోగ్లే వ్యవహరించగా.. టెన్నిస్ స్టార్ సానియ మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, వన్ చాంపియన్‌షిప్ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్‌లు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుల ప్రచారంతో క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను సానియా మీర్జా తప్పుబట్టారు. క్రీడాకారులు రాణించడం వల్లనే ఆదరణ లభిస్తోందని స్పష్టంచేశారు. క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నారని, టెన్నిస్ క్రికెట్ లాంటి క్రీడల్లో మహిళలను మరింత ప్రోత్సాహించాలన్నారు. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని, పట్టుదల, కృషి ఎంతో అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని, కొత్త క్రీడాకారులకు ప్రోత్సాహకం అందజేయాలని సానియా సూచించారు. ఆర్థికంగా బాగా ఉన్నవారే క్రీడలవైపు వస్తున్నారని, చాలా మంది గ్రామీణ క్రీడాకారులు వసతులు, ఆర్థిక లేమితో అక్కడే ఉండిపోతున్నారని మిథాలీ రాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడా నైపుణ్యాలున్న వారున్నారని వారందరికీ చేయుతనివ్వాలని మిథాలీ సూచించారు. దేశ ప్రజలు క్రికెట్ నుంచి అన్ని క్రీడలవైపు మొగ్గు చూపుతున్నారని కోచ్ గోపిచంద్ అభిప్రాయపడ్డారు. టెన్నిస్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ ఇలా అన్ని క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారని, ముఖ్యంగా క్రీడల్లోకి రావడానికి మహిళలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. బ్యాడ్మింటన్‌లో క్రీడాకారులు బాగా రాణిస్తున్నారు. క్రీడాకారుడి నుంచి కామెంటేటర్ వరకు క్రీడారంగంలో చాలా అవకాశాలున్నాయని గోపిచంద్ పేర్కొన్నారు. -
అక్టోబర్ 27న గోపీచంద్ 'ఆక్సిజన్'
మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. 'హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే స్పెషల్ మూవీ అవుతుంది. హీరో డెడికేషన్, సపోర్ట్ కారణంగా సినిమాను పూర్తి చేయగలిగాం. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమాను అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజన్ చిత్రాన్ని రూపొందించాం. జగపతిబాబుగారు సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆయన నటనకు సినిమాకు పెద్ద ప్లస అవుతుంది. సీజీ వర్క్స్ అద్భుతంగా వచ్చాయి. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను అక్టోబర్ మొదటివారంలో విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అన్నారు. -
తిరుమలలో ‘గౌతమ్ నంద’ చిత్ర యూనిట్
-
'గౌతమ్‌నంద' మూవీ రివ్యూ
టైటిల్ : గౌతమ్‌నంద జానర్ : యాక్షన్ మూవీ తారాగణం : గోపిచంద్, హన్సిక, కేథరిన్ థెరిస్సా, సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషి సంగీతం : తమన్ దర్శకత్వం : సంపత్ నంది నిర్మాత : జె. భగవాన్, జె. పుల్లారావు చాలా కాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ హీరో గోపిచంద్, తన స్టైల్, బాడీలాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకొని చేసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గౌతమ్‌నంద. మాస్ హీరోయిజాన్ని సూపర్బ్ గా ఎలివేట్ చేసే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్ ఆశించిన విజయాన్ని అందించిందా..? సంపత్ కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడా...? కథ : ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్), ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించిన తెలుగు బిలియనీర్ విష్ణు ప్రసాద్ ఘట్టమనేని( సచిన్ కేడ్కర్) వారసుడు. ఆకలి, కష్టం, బాధ, కన్నీళ్లులతో పాటు ప్రేమ అంటే ఎంటో కూడా తెలియకుండా పెరిగిన కుర్రాడు. ఎప్పుడు పార్టీలు పబ్ లు అంటూ తిరిగే గౌతమ్ కు ఒక సంఘటన మూలంగా.. తను ఎవరు..? విష్ణు ప్రసాద్ కొడుకుగా కాక తనకంటూ వ్యక్తిగతంగా ఉన్న గుర్తింపు ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతుంది..? ఆ ఆలోచనలోనే గమ్యం తెలియకుండా ప్రయాణిస్తున్న గౌతమ్ కు, అచ్చు గుద్దినట్టు తనలాగే ఉండే మరో వ్యక్తి నంద కిశోర్ ఎదురుపడతాడు. డబ్బు తప్ప వేరే ఏ ఎమోషన్ తెలియని గౌతమ్, డబ్బుంటే చాలు ఏదైనా చేసేయోచ్చు అనే నంద, తమ స్థానాలు మార్చుకొని ఒకరి ఇంటికి ఒకరు వెళతారు. నందు ఇంటికి వెళ్లిన గౌతమ్, వారి ప్రేమతో జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఆ కుటుంబ కష్టాలు తీర్చడానికి చిన్న ఉద్యోగంలో చేరతాడు. కానీ వరుసగా నందు కుటుంబానికి ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో తన ఆస్తి మీద కన్నేసిన విష్ణు ప్రసాద్ స్నేహితుడు ముద్ర (ముఖేష్ రుషి) మీద గౌతమ్ కు అనుమానం వస్తుంది. మరి నిజంగా ముద్రానే నందు కుటుంబాన్ని ఎటాక్ చేశాడా..? ఆ ప్రమాదాల నుంచి నందు ఫ్యామిలీని గౌతమ్ ఎలా కాపాడాడు..? చివరకు నందు, గౌతమ్ లు ఎవరి స్థానాల్లోకి వారు వచ్చారా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మాస్ యాక్షన్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న గోపిచంద్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. మేకోవర్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా వేరియేషన్ చూపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్న గోపిచంద్, రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ తో మెప్పించాడు. హీరోయిన్ కేథరిన్ నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా.. గ్లామర్ షోతో అదరగొట్టింది. హన్సిక స్క్రీన్ టైం కూడా తక్కువ కావటంతో ఉన్నంతలో పరవాలేదనిపించింది. విలన్లుగా ముఖేష్ రుషి, నికితిన్ ధీర్ లు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో సచిన్ కేడ్కర్, చంద్రమోహన్, సీత తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : వరుసగా కమర్షియల్ హిట్స్ సాధిస్తున్న దర్శకుడు సంపత్ నంది రెండేళ్ల విరామం తరువాత తెరకెక్కించిన సినిమా గౌతమ్‌నంద. మాస్ హీరో గోపి చంద్ ను స్టైలిష్ గా ప్రజెంట్ చేయాలనుకున్న సంపత్ నంది మంచి విజయం సాధించాడు. గోపిచంద్ మేకోవర్ తో పాటు సినిమాను స్టైలిష్ గా ప్రజెంట్ చేయటం లో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాకు ప్లస్ అయ్యింది. డ్యూయల్ రోల్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే కథనే తనదైన టైకింగ్ తో కొత్తగా ప్రజెంట్ చేశాడు సంపత్. ఫస్ట్ హాఫ్ క్లాస్ గా నడిపించిన సంపత్ నంది, సెకండాఫ్ లో తన మార్క్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించాడు. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను పక్కగా యాడ్ చేసిన దర్శకుడు మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ సుందర్ రాజన్ సినిమాటోగ్రఫి. డ్యూయల్ రోల్ సీన్స్ చాలా నేచురల్ గా కనిపించాయి. లావిష్ గా కనిపించే గౌతమ్ ఇంటిని ఎంతో బాగా ప్రజెంట్ చేశాడో.. బోరబండ స్లమ్ ఏరియాను అంతే నేచురల్ గా చూపించాడు. తమన్ పాటలు పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. నిర్మాతలు సినిమా కోసం పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : గోపిచంద్ నటన నిర్మాణ విలువలు యాక్షన్ ఎపిసోడ్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
సొంత గొంతు వినిపిస్తున్న మలయాళీ బ్యూటీ
ఇద్దరమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కేథరిన్ థెరిస్సా. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి స్టార్ ఇమేజ్ను మాత్రం అందుకోలేకపోయింది. మాలయాళ ముద్దుగుమ్మలందరూ టాలీవుడ్లో దూసుకుపోతుంటే, అక్కడి నుంచే వచ్చిన కేథరిన్ మాత్రం రేసులో వెనకపడింది. తాజాగా గోపిచంద్ సరసన హీరోయిన్గా నటిస్తున్న గౌతమ్ నందతో స్టార్ స్టేటస్ అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ, గౌతమనంద సినిమాలో మరో టాలెంట్‌ను చూపిస్తోంది. ఇప్పటి వరకు తన పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయం తీసుకున్న ఈ బ్యూటీ, గౌతమ్ నంద సినిమాలో సొంత గొంతుతో అలరించనుంది. టాలీవుడ్లో దూసుకుపోతున్న మలయాళ బ్యూటీస్ అందరూ ఇప్పటికే ఓన్ డబ్బింగ్‌తో ఆకట్టుకుంటుండటంతో కేథరిన్ కూడా అదే బాటలో నడిచేందుకు ఫిక్స్ అయ్యింది. యాక్షన్ హీరో గోపిచంద్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న గౌతమ్ నంద సినిమాకు మాస్ స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకుడు. ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సాతో పాటు హన్సిక మరో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
మేలో 'ఆరడుగుల బుల్లెట్'
గోపిచంద్ హీరోగా సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆరడుగుల బుల్లెట్. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఎట్టకేలకు మేలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ కథ అందించాడు. జయ బాలాజీ రీల్ మీడియా బ్యానర్‌పై తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. -
దుబాయ్ వెళ్తోన్న 'గౌతమ్‌నంద'
మాస్ హీరో గోపిచంద్ లోని స్టైలిష్ యాంగిల్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా గౌతమ్‌నంద. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం గౌతమ్‌నంద యూనిట్ సాంగ్స్ షూట్ కోసం దుబాయ్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్లో రాజు సుందరం కొరియోగ్రఫిలో గోపిచంద్ ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు మరో పాటను చిత్రీకరించనున్నారు. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత హైదరాబాద్‌లో మిగిలిన పాటలను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో.. తెర మీద గోపిచంద్‌ను మరింత స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మేలో గౌతమ్నందను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
జి ఫర్ గౌతమ్‌నంద
లుక్.. లుక్... గోపీచంద్ కొత్త లుక్ ఇదేనండీ. కొత్త హెయిర్ స్టైలు.. రఫ్‌గా పెంచిన గడ్డం.. ఓ చేతిలో కోటు.. మాంచి స్టైలిషగా ఉన్నారు కదూ. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రంలోని లుక్ ఇది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్,జె. పుల్లారావులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గౌతమ్‌నంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామూలుగా ‘జి’ ఫర్ గోపీచంద్.. కానీ, ఇప్పుడు మాత్రం ‘జి’ ఫర్ గౌతమ్‌నంద అనాలి. శనివారం గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ అనౌన్స్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో చివరి టాకీ షెడ్యూల్ మొదలవుతుంది. అది పూర్తయిన తర్వాత విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. మార్చిలో పాటల్ని, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్–లక్ష్మణ్, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎస్. సౌందర్‌రాజన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
గోపీచంద్ టైటిల్ బలం కాదు బుల్లెట్..?
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ జనరేషన్ యాక్షన్ హీరో గోపీచంద్. ఇటీవల స్టైలిష్ క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్న ఈ మ్యాన్లీ స్టార్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న స్టైలిష్ ఎంటర్టైనర్తో పాటు, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బి గోపాల్ చిత్రాన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో రమేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్ టైటిల్ వేటలో బిజీగా ఉంది. ముందుగా బలం అనే టైటిల్ ఫిక్స్ చేసినా.. ప్రస్తుతం బుల్లెట్ లేదా ఆరడుగుల బుల్లెట్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే టైటిల్‌ను ఫైనల్ చేసి దీపావళికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
'ఆక్సిజన్' ఆగిపోయిందా..?
ఇటీవల యాక్షన్ హీరో గోపిచంద్ సినిమాలు వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కెరీర్‌కు కీలకమైన ఈ సమయంలో సినిమాలు ఆలస్యం కావటం, వివాదాలు తలెత్తుతుండటంతో గోపిచంద్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ప్రారంభమైన సినిమా సగం షూటింగ్ పూర్తయిన తరువాత చాలా కాలం ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమాను తిరిగి ప్రారంభించి డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో గోపిచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మాతగా ఆయన తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆక్సిజన్ సినిమా విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవటంతో రిలీజ్ ఆలస్యమవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైన యూనిట్ సభ్యులు స్పందించి షూటింగ్ అప్డేట్స్పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. -
గోపిచంద్, నయన్‌ల 'బలం'
కమర్షియల్ స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గోపిచంద్, వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఏఎమ్ రత్నం నిర్మాతగా ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గోపి. యాక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆక్సిజన్ సినిమాతో పాటు చాలా రోజులుగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న మరో సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు గోపిచంద్. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. నయనతార హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తయిన దశలో ఆగిపోయింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ప్యాచ్ వర్క్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ డిసెంబర్లో సినిమారు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు బలం అనే టైటిల్‌ను నిర్ణయించారు. -
లైలా ఖాతాలో మరో రెండు సినిమాలు
నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటి, అను ఇమ్మన్యూల్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటి మరో రెండు సినిమాలతో ఆడియన్స్ ముందకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటి సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టివ్‌గా ఉంటోంది. మజ్ను సినిమాతో పాటు గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమాను పూర్తి చేసిన అను.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తోంది.., అను ఇమ్మన్యూల్. వీటితో మరిన్ని సినిమాలు డిస్కషన్స్ దశలో ఉండటంతో త్వరలోనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది ఈ లైలా. -
నాలుగు భాషల్లో గోపిచంద్ బయోపిక్
బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న బయోపిక్‌ల ఫీవర్ ఇప్పుడు సౌత్‌లో కూడా కనిపిస్తోంది. ఇటీవల ఒలిపింక్ మెడల్‌తో సత్తా చాటిన పివి సింధూ కోచ్, గోపిచంద్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయినా.. వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా గోపిచంద్‌కు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడటంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు చిత్రయూనిట్. అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన యంగ్ హీరో సుధీర్ బాబు గోపిచంద్ పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటి రేవతి గోపిచంద్ తల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే ప్లాన్ చేసిన ప్రస్తుతం గోపి క్రేజ్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోకి డబ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇలా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోపిచంద్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మూడు సినిమాలు ఒప్పేసుకుంది
టాలీవుడ్లో హీరోయిన్ల కొరత కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భామలకు కలిసొస్తుంది. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు కొత్త భామలు వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. అయితే ఓ మళయాలి ముద్దుగుమ్మ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే వరుస సినిమాలకు సైన్ చేసేస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది అను. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకె చెప్పేసింది ఈ బ్యూటి. ఇప్పటికే నాని హీరోగా తెరకెక్కబోయే సినిమాకు సైన్ చేసిన అను, మరో యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి నటించేందుకు అంగీకరించింది. దొంగాట ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మిస్తున్న సినిమాలో రాజ్ తరుణ్‌తో కలిసి ఆడిపాడేందుకు ఓకె చెప్పింది. మళయాల సినిమా 'యాక్షన్ హీరో బిజు'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయల్, ఇప్పుడు టాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. -
గోపిచంద్ నెక్ట్స్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్
బెంగాళ్ టైగర్ సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న దర్శకుడు సంపత్ నంది, మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎదురుచూసిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పట్లో చెర్రీ డేట్స్ దొరికే అవకాశం లేకపోవటంతో మరో హీరోతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇన్నాళ్లు చరణ్ తో చోటా మేస్త్రీ అనే మాస్ ఎంటర్ టైనర్ చేయాలని భావించినా అది వర్క్ అవుట్ కాకపోవటంతో గోపిచంద్ హీరోగా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య మూవీస్ అధినేత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు గోపి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. దీంతో త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. -
సంపత్ నందితో గోపిచంద్
బెంగాళ్ టైగర్ సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న దర్శకుడు సంపత్ నంది, మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎదురుచూసిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పట్లో చెర్రీ డేట్స్ దొరికే అవకాశం లేకపోవటంతో మరో హీరోతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇన్నాళ్లు చరణ్ తో చోటా మేస్త్రీ అనే మాస్ ఎంటర్ టైనర్ చేయాలని భావించినా అది వర్క్ అవుట్ కాకపోవటంతో గోపిచంద్ హీరోగా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య మూవీస్ అధినేత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు గోపి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. దీంతో త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. -
గోపి, రాశి జిల్ జిల్
-
సైనా జట్టుకు రూ.40 లక్షలు
కోచ్ గోపీచంద్‌కు రూ. 10 లక్షలు ఉబెర్ కప్‌లో కాంస్యానికి ‘బాయ్’ నజరానా న్యూఢిల్లీ: ఉబెర్ కప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ.40 లక్షల నజరానా ప్రకటించింది. ఈ టోర్నీలో తొలిసారిగా సైనా బృందం కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. ‘గత వారం ఉబెర్ కప్‌లో మహిళల జట్టు మా అందరినీ గర్వపడేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్లేయర్లకు ‘బాయ్’ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. నగదు బహుమతి అనేది ఆటగాళ్లపై మాకున్న కమిట్మెంట్కు నిదర్శనం. అలాగే ఇలాంటి రివార్డులతో వర్ధమాన క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుం ది’ అని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు తలా ఐదు లక్షలు అందుకోనుండగా మిగతా మొత్తం ఇతర క్రీడాకారిణులకు, సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. అలాగే కేంద్రం నుంచి ఇటీవల పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు గుప్తా ప్రకటించారు. -
బ్యాడ్మింటన్ అకాడమీకి అవార్డు
సాక్షి, హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, కశ్యప్‌లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేసిన ‘పుల్లెల గోపీచంద్-నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ’కి ప్రతిష్టాత్మక ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డు ప్రైవేట్ అకాడమీకి రావడం ఇదే తొలిసారి. ఈ అకాడమీ బ్యాడ్మింటన్‌కు చేస్తున్న కృషికి మెచ్చి కేంద్ర క్రీడా శాఖ ఈ పురస్కారానికి ప్రతిపాదన చేసింది. ‘ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ విభాగం కింద ఈ అవార్డును ప్రకటించారు. సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఆర్థిక సహాయం), పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమం), అలహాబాద్‌లోని యూకే మిశ్రా జాతీయ స్పోర్ట్స్ అకాడమీ (కమ్యూనిటీ క్రీడల గుర్తింపు, యువ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం)లకు ఈ అవార్డు దక్కింది. ఈనెల 31న జరిగే కార్యక్రమంలో ఈ నాలుగు అకాడమీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తారు. ప్రతిష్టాత్మక ఈ పురస్కారం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని జాతీయ చీఫ్ కోచ్, పీజీబీఏ యజమాని గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మనం పడుతున్న శ్రమను ప్రభుత్వం గుర్తిస్తే చాలా ఆనందం కలుగుతుంది. మంచి పని చేయడానికి ఇది మరింత ప్రోత్సాహన్ని ఇస్తుంది. మా కోచ్‌లు, సహాయక సిబ్బంది, అకాడమీ ఉద్యోగులు కనబరుస్తున్న సమష్టి కృషికి లభించిన గుర్తింపు ఇది’ అని గోపీ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్ సహకారంతోనే... ఈ రోజు దేశంలో అగ్రశ్రేణి షట్లర్లను తయారు చేస్తున్న బ్యాడ్మింటన్ అకాడమీకి అంకురార్పణ 2006లో జరిగింది. ఆల్‌ఇంగ్లండ్ టోర్నీ గెలిచిన గోపీచంద్‌కు ప్రభుత్వం స్థలం ఇచ్చినా... అకాడమీ నిర్మాణానికి ఆర్థిక వనరులు లేవు. దీంతో గచ్చిబౌలిలోని స్టేడియంను శాప్ దగ్గర అద్దెకు తీసుకుని అకాడమీ ప్రారంభించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్... చొరవ తీసుకుని అకాడమీ నిర్మాణం చేయించారు. 2007 కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో అకాడమీ సిద్ధమైంది. నాడు ప్రసాద్, గోపీచంద్‌ల చొరవ వల్ల నేడు దేశంలో బ్యాడ్మింటన్‌కు భాగ్యనగరం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. -
శ్రీవారిని దర్శించుకున్న పుల్లెల గోపిచంద్