సొంత గొంతు వినిపిస్తున్న మలయాళీ బ్యూటీ | Catherine Tresa Dubbing For Gautham Nanda | Sakshi

సొంత గొంతు వినిపిస్తున్న మలయాళీ బ్యూటీ

Published Tue, May 9 2017 10:11 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

సొంత గొంతు వినిపిస్తున్న మలయాళీ బ్యూటీ

సొంత గొంతు వినిపిస్తున్న మలయాళీ బ్యూటీ

ఇద్దరమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కేథరిన్ థెరిస్సా. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి స్టార్ ఇమేజ్ను మాత్రం అందుకోలేకపోయింది. మాలయాళ ముద్దుగుమ్మలందరూ టాలీవుడ్లో దూసుకుపోతుంటే, అక్కడి నుంచే వచ్చిన కేథరిన్ మాత్రం రేసులో వెనకపడింది. తాజాగా గోపిచంద్ సరసన హీరోయిన్గా నటిస్తున్న గౌతమ్ నందతో స్టార్ స్టేటస్ అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ, గౌతమనంద సినిమాలో మరో టాలెంట్ను చూపిస్తోంది. ఇప్పటి వరకు తన పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయం తీసుకున్న ఈ బ్యూటీ, గౌతమ్ నంద సినిమాలో సొంత గొంతుతో అలరించనుంది. టాలీవుడ్లో దూసుకుపోతున్న మలయాళ బ్యూటీస్ అందరూ  ఇప్పటికే ఓన్ డబ్బింగ్తో ఆకట్టుకుంటుండటంతో కేథరిన్ కూడా అదే బాటలో నడిచేందుకు ఫిక్స్ అయ్యింది.

యాక్షన్ హీరో గోపిచంద్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్న గౌతమ్ నంద సినిమాకు మాస్ స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకుడు. ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సాతో పాటు హన్సిక మరో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement