
– కేథరిన్
హీరోయిన్ కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో, మహేశ్ శ్రీరామ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫణి’. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, ఏయూ అండ్ ఐ స్టూడియోల సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రెస్‌మీట్‌కు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, ‘ఫణి’ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వీఎన్ ఆదిత్య కొత్త వాళ్లతోనూ సినిమా చేయగలడు, స్టార్స్‌తోనూ సినిమా చేయగలడు. ‘ఫణి’ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘నాకు పాములంటే భయం. దీంతో పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని ఆదిత్యగారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అయితే షూటింగ్ చివర్లో పాము కాంబినేషన్‌లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. మేలో మా ‘ఫణి’ మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు కేథరిన్.
‘‘యూఎస్ వెళ్లినప్పుడు నా సోదరి మీనాక్షి–బావ శాస్త్రిగారి ఇంట్లో ఉంటాను. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తామన్నప్పుడు నాకు భయం వేసింది. ‘ఫణి’ చిత్రాన్ని చిన్నగా మొదలు పెట్టాం. ఆ తర్వాత కేథరిన్‌గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’’ అన్నారు వీఎన్ ఆదిత్య. ‘‘ఫణి’ మూవీతో కేథరిన్‌గారికి జాతీయ అవార్డు వస్తుంది’’ అని తెలిపారు నిర్మాత, సంగీత దర్శకురాలు డా. మీనాక్షి అనిపిండి. ‘‘హాలీవుడ్‌లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించడంతో సొంత ఇంటికి వచ్చినట్లుంది’’ అన్నారు మహేశ్ శ్రీరామ్. ఈ చిత్రసమర్పకుడు పద్మనాభరెడ్డి, సహ–నిర్మాత శాస్త్రి అనిపిండి, రైటర్ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడారు.