K. Raghavendra Rao
-
నటుడిగా అలరించి హీరో అవుతాను
‘‘నేను హీరో కావాలనుకుంటే కాలేను. ఓ మంచి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తే, వారి నమ్మకాన్ని గెల్చుకుంటే అప్పుడు హీరో అవుతాను. మా అమ్మగారు (సునీత) స్టార్ సింగర్. ఆమె స్థాయిని ఇండస్ట్రీలో కొనసాగించాలనే విషయాన్ని నేను ఒత్తిడిగా ఫీల్ కావడం లేదు. నన్ను నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా, ఓ బాధ్యతగా అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో నా గురించి స్టార్ కిడ్ అనే మాట వినిపించినప్పటికీ నా నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుని, సక్సెస్ కావాల్సిన బాధ్యత నాపైనే ఉంటుంది’’ అని ఆకాశ్ అన్నారు. ఆకాశ్, భావన జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ‘సర్కారు నౌకరి’. దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా 1990 నేపథ్యంలో సాగుతుంది. ఆ సమయంలో దేశంలో ఎయిడ్స్ అనే ఓ మహమ్మారి వచ్చింది. ముఖ్యంగా గ్రామాలు చాలా ప్రభావితం అయ్యాయి. ఈ వ్యాధి నివారణ, చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ప్రభుత్వోద్యోగులు. అలా ఓ గ్రామంలో వారు చేసిన ప్రయత్నాలను ఓ వ్యక్తి చేసినట్లుగా, వన్ మ్యాన్ షోలా ఈ సినిమాను తీశాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వోద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది ‘సర్కారు నౌకరి’ సినిమా కథాంశం. వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. వినోదంతో పాటు ఓ చిన్నపాటి సందేశం కూడా ఉంది. నేను గిటారిస్ట్‌ని కూడా. భవిష్యత్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొని, సినిమా పాటలను ఎలా కం΄ోజ్ చేస్తారనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. -
టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్‌పేట పరిధిలో రెండెకరాల భూకేటాయింపుపై సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కె. కృష్ణమోహన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు తాజాగా రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాయితీ ధరతో ప్రభుత్వం భూమి కేటాయిస్తే.. వారు దాన్ని షరతులకు విరుద్ధంగా వాడుతున్నారని ఆయన పిల్ దాఖలు చేశాడు. ఆ భూమిలో పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పిల్లో బాల కిషన్ పేర్కొన్నాడు. దీనిపై విచారించిన హైకోర్టు రాఘవేంద్రర్ రావుతో పాటు కృష్ణ మోహన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ విచారించింది. -
మిస్టర్ ఇడియట్ వస్తున్నాడు
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిస్టర్ ఇడియట్’లోని మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్ ఇడియట్’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్ రవిచంద్. -
కొత్త చిత్రం షురూ
గోపీచంద్ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్‌గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
రవితేజ పెద్ద మాస్ హీరో అవుతాడని అప్పుడే ఊహించాను: రాఘవేంద్రరావు
‘‘నేను దర్శకత్వం వహించిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలోని ఆర్కెస్ట్రా గ్రూపులో రవితేజ ఒకడు. ఆ టీమ్‌లో రవితేజ డ్రమ్స్ వాయించాడు. తను భవిష్యత్‌లో పెద్ద మాస్ హీరో అవుతాడని అప్పుడే ఊహించాను. ఇక ‘పెళ్ళి సందడి’(2021) సినిమాలో ఫ్లూటు వాయించి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు శ్రీలీల. వీరిద్దరితో ‘ధమాకా’కి కనకవర్షం కురవాలి’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు అన్నారు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ధమాకా’ సినిమా పెద్ద హిట్ కావాలి. త్వరలో రవితేజ కొడుకు కూడా హీరో కాబోతున్నాడు’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ విజయంపై టీమ్ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం. త్రినాథరావు, రైటర్ ప్రసన్న, శ్రీలీల, భీమ్స్ నెక్ట్స్ లెవల్‌కి వెళతారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల మంచి పాజిటివ్ నిర్మాతలు. ఏ విషయంలోనూ రాజీపడని నిర్మాత అభిషేక్ అగర్వాల్’’ అన్నారు. ‘‘నేనూ రవితేజగారి అభిమానినే. ‘ధమాకా’ సక్సెస్ అవుతుంది’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘సినిమా ఇండస్ట్రీలో స్టార్ అవ్వడానికి ఉన్న ప్రతి మెట్టు ఎక్కి వచ్చిన హీరో ఒక్క రవితేజగారే’’ అన్నారు రైటర్ ప్రసన్న కుమార్. ‘‘భీమ్స్ అవుట్‌డేట్ అయిపోయాడని చాలామంది అనుకున్నారు. ‘ధమాకా’ తో నన్ను మళ్లీ నిలబెట్టిన రవితేజగారికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘‘ధమాకా’ పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల. ‘‘ధమాకా’కు ప్రేక్షకులు అద్భుత విజయం చేకూర్చాలి’’ అన్నారు శ్రీలీల. ఈ వేడుకలో డైరెక్టర్స్ నందినీ రెడ్డి, బీవీఎస్ రవి, మారుతి, శ్రీవాస్, సుధీర్ వర్మ, కృష్ణచైతన్య, వంశీ, వై.విజయ్, విజయ్ కనకమేడల, దర్శక–నటులు శ్రీనివాస్ అవసరాల, సముద్రఖని, నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఫైట్‌మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి సందD చిత్రం బాగుంటుంది: రాఘవేంద్రరావు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు, నటి సుమలత, పెళ్లి సందడి చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితోపాటు హీరో రోషన్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కర్ణాటక హీరో దర్శన్ కూడా ఉన్నారు. అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. పెళ్లి సందడి చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయిందని తెలిపారు. చిత్రం చాలా బాగుంటుందని, శ్రీకాంత్ తనయుడితో మరోసారి పెళ్లి సందడి చిత్రం చేస్తున్నామన్నారు. రెండు సంవత్సరాల అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని సీనియర్ నటి సుమలత అన్నారు. శ్రీవారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పెళ్లి సందడి చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తి అయిందని హీరో రోషన్ అన్నారు. అందుకే స్వామివారి దర్శనం యూనిట్ సభ్యులు దర్శనం చేసుకున్నామన్నారు.పెళ్లి సందడి చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా నిన్న(ఆదివారం) స్వామివారిని 20,446 మంది భక్తులు సందర్శించుకోగా.. స్వామివారికి 8,610 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 2.50 కోట్లు వచ్చింది. -
వాళ్ల పెళ్లిలా ఇదీ హిట్టే!
‘‘రాజీవ్, సుమ నేను తీసిన ఓ యాడ్‌లో నటించారు. ఇద్దర్నీ వేర్వేరుగా రమ్మంటే... నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చారు. ఇప్పుడు ఇదీ (జుజుబీ టీవీ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ నిర్మించడం) నాకు చెప్పకుండా స్టార్ట్ చేశారు. సో, హిట్టే. ‘సుమ రాజీవ్ క్రియేషన్స్’ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ప్రవీణ్ యండమూరి, శ్రీముఖి మేకల జంటగా సందీప్ మెండి దర్శకత్వంలో ప్రపూర్ణ ప్రొడక్షన్ హౌస్ తో కలసి సుమరాజీవ్ క్రియేషన్స్ నిర్మించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘అలనాటి రామచంద్రుడు’. త్వరలో ‘జుజుబీ టీవీ’ (యూట్యూబ్ ఛానల్)లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ట్రైలర్‌ను రాఘవేంద్రరావు, పాటల సీడీలను వరా ముళ్లపూడి, ‘జుజుబీ టీవీ’ ప్రోమోను కొరటాల శివ విడుదల చేశారు. ‘‘మా ఆత్మను తృప్తిపరిచే చిత్రాలు తీస్తూ, యువతను ప్రోత్సహించడానికి ‘జుజుబీ టీవీ’ స్టార్ట్ చేశాం’’ అన్నారు రాజీవ్ కనకాల. -
నన్ను మన్నించండి!
‘‘ఆయన టాలీవుడ్లో ప్రముఖ డైరెక్టర్. శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన డైరెక్షన్ చేసిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతోనే నేను తెలుగుకి పరిచయమయ్యాను. వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించారాయన. తన సినిమాల్లోని పాటల్లో కథనాయికల నడుము మీద పండ్లు, పువ్వులు వేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు’’ అని ఇటీవల ఓ హిందీ కామెడీ షోలో దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గురించి తాప్సీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తొలి సినిమాకి అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర రావు గురించి తాప్సీ ఇలా మాట్లాడటాన్ని కొంతమంది విమర్శించారు. దీని గురించి తాప్సీ స్పందిస్తూ– ‘‘నటిగా రాణించుగలుగుతున్నానంటే రాఘవేంద్రరావుగారే కారణం. ఆ విషయాన్ని నా లైఫ్‌లో మరచిపోను. ఆయన్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశానని కొందరు నిందిస్తున్నారు. ఎవరినీ తక్కువ చేసేలా నేను మాట్లాడలేదు. ఒకవేళ నా మాటలు ఎవర్నైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. అవి నాపై నేను జోక్ వేసుకుని నవ్వించాలని చేసిన వ్యాఖ్యలే తప్ప, ఇతరుల మనోభావాలను దెబ్బ తీయాలని కాదు. నా మాటలు తప్పనిపిస్తే మన్నించండి’’ అన్నారు. -
నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ఇది : నాగార్జున
‘‘కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చెయ్యొచ్చు. అటువంటి సినిమాలు సుమారు 90 చేశా. కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక, భక్తిరస సినిమాల్లో నటించే ఛాన్సులు అందరికీ దక్కవు. నాకు ఈ ఛాన్సులు రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు అక్కినేని నాగార్జున. వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్ బాబాగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘దేవుణ్ణి చూడాలనుకున్న ఓ వ్యక్తి తిరుమల చేరుకున్న తర్వాత ఎలాంటి ఆధ్యాత్మిక భావనకు లోనయ్యా డనేది ఈ సినిమా. ఎంత వసూలు చేస్తుంది? ఎప్పుడు విడుదలవుతుంది? వంటి టెన్షన్లు లేకుండా హ్యాపీగా నటించాను. అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అనేది పక్కన పెడితే... ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఓ క్రమశిక్షణ వస్తుంది. రాఘవేంద్రరావుగారి దర్శకత్వం, కీరవాణి సంగీతం, జేకే భారవి రచన, సాహిత్యం... అన్నీ నన్నో భక్తిభావంలోకి తీసుకువెళ్లాయి. రిలీజ్ తర్వాత వీళ్లందరికీ థ్యాంక్స్ చెప్పడం కుదరదు. అందుకే, ఇప్పుడు చెబుతున్నా. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ సంతోషంతో ఓ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు. కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నాగార్జున కళ్లతోనే నటించాడు. ‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక..’ పాటలో అయితే నాగ్ నటన అద్భుతం. కృష్ణమ్మగా నటించిన అనుష్కతో పాటు చిత్ర బృందమంతా భక్తి భావంతో పనిచేశారు. సినిమా చూస్తుంటే.. రెండున్నర గంటలు ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్టే ఉంటుంది. విడుదల తర్వాత థియేటర్లన్నీ దైవక్షేత్రాలుగా మారతాయి’’ అన్నారు. నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది. మేమంతా ఓ కుటుంబంలా కలసి పనిచేశాం. శ్రీనివాసుడే మా అందర్నీ కలిపాడనుకుంటున్నా. భగవంతుడు, భక్తుడు కలసి ఆడే ఆటే ఈ సినిమా. చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా నాగార్జున గడ్డం తీయలేదు. ఒకవేళ ఏవైనా సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించాలంటే ఇబ్బంది అవుతుందని అలాగే ఉన్నారు. రాఘవేంద్రరావుగారు ఈ వయసులోనూ రోజుకి 14 గంటలు పనిచేశారు. శ్రీనివాసుడి భక్తులకు, నాగార్జున అభిమానులకు ఈ సినిమా ఓ అద్భుతమైన బహుమతిగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు విమలా రామన్, అస్మిత, సౌరభ్ జైన్, రచయిత జేకే భారవి, పాటల రచయితలు వేదవ్యాస, అనంత శ్రీరామ్, కళా దర్శకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కట్ చెప్పడం మరచిపోయా.. కన్నీటితో ఆనందపడ్డా!
‘‘ఒక కథ విన్నప్పుడు ఎప్పుడెప్పుడు చిత్రీకరణ మొదలుపెట్టాలా? అనే ఉద్వేగం కలగాలి. నేను తీసే సినిమాలన్నింటికీ దాదాపు ఇలానే జరుగుతుంది. హాథీరామ్ బాబా గురించి భారవి చెప్పినప్పుడు వెంటనే షూటింగ్ మొదలుపెట్టేయాలన్నంత ఎగై్జట్‌మెంట్ కలిగింది’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. నాగార్జున టైటిల్ రోల్లో ఆయన దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ‘ఓం నమో వేంకటేశాయ’ ఈ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె. రాఘవేంద్రరావు చెప్పిన విశేషాలు.. ► టీటీడీ బోర్డ్ మెంబర్‌గా, ఈ సినిమా కారణంగా దాదాపు రెండేళ్లుగా ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఉన్నాను. నిర్మాత మహేశ్‌రెడ్డి సంకల్ప బలం వల్లే ‘నమో వేంకటేశాయ’ సాధ్యమైంది. నాతో ఆయన ‘శిరిడిసాయి’ తీసిన తర్వాత, ‘మళ్లీ మీరు నాగార్జునతో ఆధ్యాత్మిక సినిమా చేయాలంటే నాకే చెప్పండి’ అన్నారు. అప్పుడే.. అంటే నాలుగైదేళ్ల క్రితమే జేకే భారవి ఈ హాథీరామ్ బాబా గురించి చెప్పారు. ఇప్పటివరకూ ఈ పాయింట్‌ని ఎవరూ టచ్ చేయలేదు. ఎన్టీ రామారావుగారు ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’లో చిన్న సీన్లో హాథీరామ్ బాబా గురించి చెప్పారు. నేటి తరానికి, భవిష్యత్ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ తీశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా అందుకే తీశాం. ► 600 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రతో ఈ సినిమా తీశాం. అప్పట్లో తిరుమల ఎలా ఉండేది? అని ఊహించి, సెట్స్ వేశాం. కొంత గ్రాఫిక్స్ వర్క్ చేశాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన కొన్ని మహిమల గురించి చెబితే, ఆశ్చర్యపోతారు. మేం సెట్స్ వేసిన ప్రదేశానికి కొంత దూరంలో భారీగా వర్షం కురిసేది. మా దగ్గర మాత్రం ఉండేది కాదు. వింతగా అనిపించేది. బ్రహ్మోత్సవాల సీన్స్ తీసేటప్పుడే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. అలాగే, అనుష్క చేసిన దుర్గా దేవి సీన్స్ చిత్రీకరణ అప్పుడు దుర్గాష్టమి పండగ. ఇవన్నీ చూసి, నాస్తికులు కూడా ఉంటే ఆస్థికులుగా మారిపోతారేమో అనిపించింది. ► భక్తి సినిమా తీసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మొత్తం యూనిట్ అంతా చాలా నిష్టగా ఉండేవాళ్లం. ఉదయం ప్రసాదం తిన్న తర్వాతే టిఫిన్ తినేవాళ్లం. సాయంత్రం ప్యాకప్ చెప్పగానే.. ఏడుకొండలవాడా.. గోవిందా.. గోవిందా అని అందరూ అంటుంటే, తిరుమల క్షేత్రంలో ఉన్న భావన కలిగేది. ► ‘అన్నమయ్య’ కన్నా గొప్ప సినిమా రాదని చెప్పిన నాగార్జున కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ చిత్రానికి ఓకే చెప్పారు. ఇక, నటన అంటారా? అద్భుతం. ఎమోషనల్ సన్నివేశాల్లో గ్లిజరిన్ అవసరం లేకుండా ఆయనకు కన్నీళ్లు వచ్చేసేవి. అంతగా లీనమైపోయారు. ఒక్కోసారి కెమేరామేన్ ఎస్. గోపాల్‌రెడ్డి కెమేరా ఆన్‌లోనే ఉంచి.. అలా చూస్తుండిపోయేవారు. నేను ‘కట్’ చెప్పడం మరచిపోయేవాణ్ణి. అంత ఉద్వేగానికి గురయ్యేవాణ్ణి. కన్నీటితో ఆనందపడేవాణ్ణి. వెంకటేశ్వరుని పాత్ర చేసిన సౌరభ్ జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ గెటప్‌లో తనని చూస్తే, నిజమైన తిరుమలేశుడేమో అనిపిస్తుంది. అలాగే, ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో జగపతిబాబు కాసేపే కనిపించినా, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చిత్రానికి ‘సోల్’ కీరవాణి పాటలు, భారవి రచన. ► ఏడు కొండలు అంటాం కానీ, వాటి ప్రాశస్త్యం గురించి చాలామందికి తెలియదు. అది ఈ సినిమాలో చెప్పాం. ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు చాలా చెప్పాం. ఇప్పటివరకూ తిరుమల వెళ్లినవాళ్లు ఈ సినిమా చూశాక వెళితే అక్కడి పరిసర ప్రాంతాలను వేరే దృక్పథంతో చూస్తారు. ‘ఇక్కడ ఇలా జరిగిందా? ఇలా ఉండేదా?’ అని ఆసక్తిగా చూస్తారు. అలాగే, దేవుణ్ణి చూసే విధానంలో కూడా మార్పొస్తుంది. భక్తి సినిమాలను యూత్ కూడా చూస్తున్నారు. తిరుమలకు కాలి నడకన వెళ్లేవాళ్లల్లో యూత్ ఎక్కువగా ఉన్నారు. ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనో, ఉద్యోగం రావాలనో... స్వామివారిని దర్శించుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా యూత్ ఎంత ముందున్నా.. చరిత్ర కూడా తెలుసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి సినిమాల వల్ల అవి తెలుస్తాయి. ► భక్తి సినిమాలంటే రాఘవేంద్రరావుగారే తీయాలంటుంటారు. ఆ మాటతో ఏకీభవించను. నేటి తరం దర్శకులూ తీయగలరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు వాళ్లు ఏడాదికి ఈ తరహా సినిమా ఒకటి తీస్తే యూత్‌కు మన మూలాల గురించి చెప్పినట్టవుతుంది. పురాణాలకు సంబంధించిన పుస్తకాల్లో పది పేజీలు చదివినా చాలు.. భక్తి సినిమాలు తీసే అవగాహన వచ్చేస్తుంది. ► ఈ మధ్య కొరటాల శివ తీసిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ నచ్చాయి. ఒక కమర్షియల్ సినిమాలో సమాజానికి ఉపయోగపడే విషయం చెప్పాడు. తీసే సినిమాలో ప్రయోజనాత్మక అంశం ఉంటే బాగుంటుందంటున్నా. ► ‘ఇదే నా చివరి సినిమా’ అనడం లేదు. ముందు చెప్పినట్లు కథ వినగానే ఎగై్జట్ అయితే చేసేయడమే. భక్తి సినిమా అనే కాదు.. ఏ సినిమా అయినా చేస్తాను. ‘రావణ’ మోహన్‌బాబు మాత్రమే చేయగలరు మోహన్‌బాబు టైటిల్ రోల్లో ‘రావణ’ ప్లాన్ చేసింది నిజమే. ఆయన ఎప్పుడంటే అప్పుడు చేయడానికి నేను రెడీ. ఒక్క మోహన్‌బాబు మాత్రమే చేయగల సినిమా అది. ఆ రెండు సినిమాలు చేయలేదని బాధ! దాదాపు 40 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ, రెండు సినిమాలు చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఒకటి ‘గాంధీ’, మరొకటి ‘భాగ్ మిల్కా భాగ్’. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ జీవిత చరిత్రను మనం తీయలేదు. దర్శకుడు రిచర్డ్ అటన్‌బరో ఇంగ్లిష్‌లో తీశారు. ‘మనల్ని బానిసలను చేసినవాళ్లే అంత బాగా తీస్తే మనం ఎందుకు తీయలేదు’ అని బాధపడ్డాను. అలాగే, మిల్కా సింగ్ జీవిత చరిత్రతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చూసి, ‘మనం ఎందుకు చేయలేకపోయాం’ అని ఆలోచించాను. ప్లాన్ చేసి తీసేవాణ్ణి నేను బాపు, విశ్వనాథ్గార్లకన్నా గొప్ప దర్శకుణ్ణి అనను. అయితే వాళ్లందరికీ రాని ఛాన్స్ నాకు ‘అన్నమయ్య’ రూపంలో వచ్చింది. భక్తిరసాత్మక చిత్రాలు తీయడం మాటల్లో చెప్పలేని తృప్తినిస్తుంది. 40 ఏళ్ల కెరీర్లో మొదట్లో ఓ ప్లానింగ్ ప్రకారం సినిమాలు తీసేవాణ్ణి. ఎన్టీఆర్‌తో ‘అడవిరాముడు’ వంటి సూపర్ హిట్ తీశాక, మళ్లీ అదే జానర్ అంటే ప్రేక్షకులు ఎక్కువ ఆశిస్తారు కాబట్టి, ‘జ్యోతి’ తీశా. చిరంజీవితో ‘జగదేక వీరుడు–అతిలోక సుందరి’ తీశాక, మోహన్‌బాబు హీరోగా ‘అల్లుడుగారు’ తీశాను. కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు వచ్చారు. ఆ సినిమా నాన్నగారు చూడలేదని ఫీలయ్యా! ‘అన్నమయ్య’ సినిమా ప్రారంభించినప్పుడు మా నాన్నగారు (దర్శకుడు కేయస్ ప్రకాశ్‌రావు) ఉన్నారు. పూర్తయ్యేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ సినిమా చూసి, ‘మా అబ్బాయి మంచి భక్తి సినిమా తీశాడు’ అని నాన్నగారు మెచ్చుకోవాలన్నది నా కోరిక. కానీ, అది నెరవేరలేదు. -
బ్రహ్మాండ నాయకునికి భక్తితో..
‘‘వెంకన్న కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా... ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుడి సాక్షిగా, పదివేల పడగల బుస బుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను’’ అంటున్నారు నాగార్జున. వెంకన్న భక్తుడు హాథీరామ్ బాబాగా ఆయన నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ.మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. టీజర్‌లోని ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా..’ పాట, పైన చెప్పిన డైలాగ్‌లకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘హాథీరామ్ బాబాగా నాగార్జున, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్‌జైన్, కృష్ణమ్మగా అనుష్క, కీలక పాత్రధారి ప్రజ్ఞా జైస్వాల్‌ల లుక్స్ విడుదల చేశాం. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. ఫిబ్రవరి 10న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. జగపతిబాబు, విమలా రామన్, రావు రమేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాకర్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జేకే భారవి, కూర్పు: గౌతమ్‌రాజు, కెమేరా: ఎస్. గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం. కీరవాణి. -
రూల్ ఈజ్ రూల్!
ప్రతి ఒక్కరి నుదుటన నిలువు బొట్టు.. ఒంటిపై తెల్లటి కుర్తా.. ఒకరినొకరు ‘గోవిందా..!’ అని సంబోధించుకోవడం... సెల్‌ఫోన్‌కు సెలవు చెప్పడం.. పాదరక్షలను పక్కన పడెయ్యడం... ఇక్కడి ఫొటోలు చూస్తుంటే చెబుతున్నది ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం గురించే అని అర్థమవుతోంది కదూ! దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తిరుమలేశుని భక్తుడు హాథీరామ్ బాబాగా నాగార్జున నటిస్తున్నారు. ఈ భక్తిరసాత్మక చిత్రం షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాలలో ప్రత్యేకంగా వేసిన టెంపుల్ సెట్లో జరుగుతోంది. ‘రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్’ అన్నట్లు స్టార్ హీరో నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకూ... స్టార్ టెక్నీషియన్ నుంచి లైట్ బాయ్ వరకూ ప్రతి ఒక్కరూ పైన చెప్పిన రూల్స్ పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పని చేస్తున్నారు. చిత్రబృందం సెట్ బయటే చెప్పులను, సెల్ఫోన్లను విడిచి పెడుతున్నారు. ఆహార్యంలోనూ, ఆచరణలోనూ, అన్నింటా ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. -
2 నుంచి హథీరామ్ బాబాగా...
‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న మూడో భక్తిరసాత్మక చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో ఈ చిత్రం కోసం తిరుమల దేవస్థానం సెట్ వేశారు. జూలై 2 నుంచి ఆ సెట్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో భక్తుడి పాత్రను నాగార్జున చేస్తున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున
తిరుమలలో శ్రీవారిని సినీ నటుడు నాగార్జున దంపతులతోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం నాగార్జున, అమల దంపతులతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన వారిని గమనించిన అభిమానులు పెద్దసంఖ్యలో గుమికూడారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో కోసం వచ్చినట్లు ప్రముఖ నటుడునాగార్జున తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన నాగార్జున మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓంనమో వేంకటేశాయ’ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతోందని వెల్లడించారు. అందుకే ముందుగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఈ సినిమాలో తనది హథీరాంబాబా పాత్ర అని తెలిపారు. ఆయనతోపాటు సినిమా ప్రొడ్యూసర్ మహేష్‌రెడ్డి, వెంకటేశ్వరుని పాత్రధారి సౌరవ్‌జైన్ కూడా ఉన్నారు. -
నాగ్ సరసన
ధూపాటి హరిబాబు మనసు దోచుకున్న సీతగా ‘కంచె’లో ప్రేక్షకులను అలరించారు కథానాయిక ప్రగ్యా జైశ్వాల్. తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఆఫర్ వరించిందని సమాచారం. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడి సాయి’ వంటి భక్తి రస ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించిన కె. రాఘవేంద్రరావు మరోసారి అదే తరహాలో వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో టైటిల్ రోల్‌ను నాగార్జున చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా ఎంపికయ్యారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించనున్నారట. -
దసరా బుల్లోడు ఏయన్నార్ గుర్తొస్తున్నారు
- కె. రాఘవేంద్రరావు ‘‘నాగార్జునను పంచెకట్టులో చూస్తుంటే, ‘దసరా బుల్లోడు’ సినిమాలో ఏయన్నార్‌గారు గుర్తొస్తున్నారు. ఆ సినిమాకన్నా ఈ చిత్రం రెట్టింపు విజయం సాధించాలి. నాగార్జున ఒక చేతిలో కర్ర, మరో చేతిలో రమ్యకృష్ణ, లావణ్య, హంసా నందినితో స్టిల్ చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమాకి తిరుగు లేదనిపిస్తోంది’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి నాయకా నాయికలుగా రూపొందిన చిత్రం ‘సొగ్గాడే చిన్ని నాయనా’. నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ, హంసా నందిని తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని రాఘవేంద్రరావు ఆవిష్కరించి, నాగార్జునకు ఇచ్చారు. ఆడియో వేడుక చాలా విభిన్నంగా జరిగింది. ఈ సినిమా ట్రైలర్లో ఉన్నట్లుగా లైవ్‌గా నాగ్, లావణ్య, అనసూయ, హంసా నందిని వేదికపై పెర్ఫార్మ్ చేశారు. పంచెకట్టులో నాగ్ చేసిన మాస్ డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ - ‘‘నాన్నగారు, నేను, చైతూ చేసిన ‘మనం’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారు అభిమానులకు బాగా దగ్గరవ్వడానికి కారణం ఆయన చిత్రాల్లో ఉండే ఆప్యాయతానురాగాలు, అనుబంధాలు. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ కథ ఎంచుకున్నాను. నాకు, అభిమానులకు ఫేవరెట్ మూవీ ‘హలో బ్రదర్’. ఆ చిత్రంలో ఉన్నంత వినోదం ఇందులో ఉంటుంది. అలాగే, ఈ సినిమాలోని ఆట, పాట, మాట.. ప్రతి సన్నివేశం పసందుగా అనిపిస్తాయి. సాధారణంగా సంక్రాంతిని పచ్చని పల్లెలో తియ్యగా జరుపుకోవాలనుకుంటాం. ఆ పచ్చదనం, తియ్యదనం ఈ చిత్రంలో ఉంటాయి. అనూప్ రూబెన్స్ ఆణిముత్యాల్లాంటి పాటలిచ్చాడు. జనవరి 15కి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. రామ్మోహన్ ఇచ్చిన రెండు పేజీల కథను దర్శకుడు కల్యాణ్ కృష్ణ డెవలప్ చేసి, ఈ సినిమా చేశాడు. ఇలా కొత్తవాళ్లెవరు వచ్చినా అవకాశం ఇస్తాను’’ అని చెప్పారు. అందరికీ దేవుడు ఒక్కో అవతారంలో కనిపిస్తే, తనకు నాగార్జున రూపంలో కనిపించాడని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు. ‘హలో బ్రదర్’ టైమ్‌లో నాగ్ ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ఈ వేడుకలో నాగచైతన్య, అఖిల్, నాగసుశీల, అమల, మహేశ్‌రెడ్డి, పి. కిరణ్, సునీల్ నారంగ్, అనూప్ రూబెన్స్, సుమంత్, సుశాంత్, లావణ్యా త్రిపాఠీ, అనసూయ, హంసా నందిని తదితరులు పాల్గొన్నారు. -
బాపు, రమణల గీత, రాత కనిపిస్తాయి
- కె. రాఘవేంద్రరావు ‘‘ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని సీనియర్ దర్శకుడు కె. విశ్వనాథ్ ఆకాంక్షించారు. సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, చాందినీ చౌదరి ముఖ్యతారలుగా కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ నిర్మించిన చిత్రం ‘కుందనపు బొమ్మ’. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కీరవాణి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘బాపు గారి గీత, రమణ గారి రాత ఈ చిత్రంలో కనిపిస్తాయి. అచ్చమైన తెలుగు టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ - ‘‘నేను రాఘవేంద్రరావు గారి దగ్గర సహాయ దర్శకునిగా చేరినప్పుడు వరా గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే, వెంటనే సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. వరా ముళ్లపూడి మాట్లాడుతూ - ‘‘ఈ స్క్రిప్ట్ రాయడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. కీరవాణి గారైతే కథ వినకుండా కేవలం సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో రచయితలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, దర్శకులు బి. గోపాల్, ప్రవీణ్ సత్తారు తదితరులు పాల్గొన్నారు. -
నేను ఎందుకు కాదంటాను: నాగార్జున
సాక్షి, తిరుమల: ‘‘ఆ వేంకటేశ్వర స్వామి టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తే స్వీకరిస్తా’’ అని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ..‘ టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం వస్తే మీరు స్వీకరిస్తారా?’’అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నాగార్జున నవ్వుతూ పైవిధంగా బదులిచ్చారు. ‘నేను ఎందుకు కాదంటాను.. తప్పకుండా స్వీకరిస్తా’’అన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి విశ్వాసాలు కలిగిన రాఘవేంద్రరావుకు టీటీడీ ధర్మకర్తల మండలిలో మరోసారి అవకాశం రావటం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాఘవేంద్రరావు చాలా చక్కగా మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావును నాగార్జున కరచాలనంతో అభినందించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన నాగార్జునను తిరుమల ఆలయం వద్ద నాగార్జునను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ మహిళ నాగార్జున చేయిపట్టుకుని ముద్దుపెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
రెండు భాషల్లో...సైజ్ జీరో...
బొద్దుగుమ్మ అనుష్క ఏంటి?... సైజ్ జీరో ఏంటి? అనుకుంటున్నారు కదూ! అయితే ఆ వివరాలు సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడినే అడగాలి. చాలా విరామం తర్వాత ప్రకాశ్ ‘సైజ్ జీరో’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో అనుష్క, ఆర్య ప్రధాన తారలు. శ్రుతీహాసన్ అతిథి పాత్ర ధారిణి. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రం ముహూర్తం జరిగింది. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి సతీమణి ఝాన్సీ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు ప్రకాశ్ భార్య కణికా థిల్లాన్ క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రసాద్ పొట్లూరి తెలిపారు. భరత్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: నీరవ్‌షా, ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణికా థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
'లౌక్యం' అర్ధశతదినోత్స వేడుక
-
'కరెంట్ తీగ' విజయోత్సవ వేడుక
-
మనోజ్‌లో ఫుల్ కరెంట్ ఉంది : కె. రాఘవేంద్రరావు
‘‘ఈ సినిమా ఫుల్ రన్‌తో ముందుకెళుతోంది. ఇలాగే ముందుకు సాగుతూ ఫుల్ కలక్షన్స్ సాధించాలి. మనోజ్‌లో ఫుల్ కరెంట్ ఉంది. ఈ విజయానికి ప్రధాన కారణం అదే. విజయాన్ని అందుకున్న యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. ఈ చిత్రం విజయోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడారు. అతిథుల్లో ఒకరైన కృష్ణంరాజు మాట్లాడుతూ- ‘‘మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్న మంచి నిర్మాతలనిపించుకున్నారు. మనోజ్ కూడా సినిమా తీస్తే.. ‘ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ’ అవుతుంది. ‘కరెంట్ తీగ’ విజయం సాధించినందుకు చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. రచయిత పరుచూరి గోపాకృష్ణ మాట్లాడుతూ- ‘‘కరెంట్ తీగ శత్రువులకు షాక్.. లోకానికి వెలుగునిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు వెలుగు ఇచ్చింది’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. కానీ, ఇందులో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ కోసం మనోజ్ తీసుకున్న రిస్క్ గురించి విని, బాధపడ్డాను. అప్పట్లో మేం కూడా డూప్ లేకుండా ఫైట్స్ చేశాం కానీ.. ఇలాంటి రిస్కులు తీసుకోలేదు. నా బిడ్డ అనే కాదు.. ఏ హీరో కూడా రిస్క్ తీసుకోకూడదు. ‘కరెంట్ తీగ’ మంచి కామెడీ చిత్రం అనో, పాటలు, ఫైట్స్ ఉన్నాయనో, సన్నీ లియోన్ ఉందనో కాదు.. ఈ చిత్రంలో ఉన్న నీతి కోసం చూడాలి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ముఖ్యంగా గత నాలుగేళ్లల్లో మేం నిర్మించిన చిత్రాల్లో ఆడియో పరంగా బాగా సేల్ అయిన చిత్రమిది. మనోజ్ పాడిన పాట నాకు బాగా నచ్చింది. మామూలుగా డైలాగులు చెప్పేవాళ్లు పాటలు అంతగా పాడలేరు. కానీ, మనోజ్ బాగా పాడాడు... బాగా ఫైట్స్ చేశాడు.. ఒక నటుడు ఇలా అన్నీ బాగా చేశాడంటే ఆ ఘనత దర్శకుడికి దక్కుతుంది. డెరైక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని నమ్మే వ్యక్తిని నేను. నాకు తెలిసి సినిమా పరిశ్రమలో రెండు కులాలే ఉన్నాయి.. ఒకటి.. నటకులం.. రెండోది సాంకేతిక నిపుణుల కులం. అంతే’’ అన్నారు. ‘‘ఏడాది పాటు రెండు వందల కుటుంబాలు కష్టపడి పని చేస్తే రెండు గంటల సినిమాని చూడగలుగుతున్నాం. అలాంటి చిత్రాన్ని పైరసీతో నాశనం చేస్తున్నారు. దొంగ సీడీలు అమ్మడమే కాదు.. కొనడం కూడా నేరమే’’ అని మనోజ్ అన్నారు. ‘కరెంట్ తీగ’కు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారాయన. చిత్రం విజయం సాధించడం పట్ల నాగేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ వేడుకలో జయసుధ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, తనీష్, నవీన్ చంద్ర తదితర అతిథులతో పాటు చిత్రబృందం పాల్గొన్నారు. -
'మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యా'
చెన్నై: దర్శకుడు కె.రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిర్మాత కె.మురారీ క్షమాపణ చెప్పాలని సీనియర్ నిర్మాత, జి.ఆర్.పి ఆర్ట్స్ అధినేత ఆర్.వి. గురుపాదం డిమాండ్ చేశారు. ఇటీవల గీత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టర్ బిరుదును అందుకున్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆ బిరుదుకు అర్హుడు కాదంటూ నిర్మాత మురారీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్.వి.గురుపాదం మురారీ చర్యల్ని తీవ్రంగా ఖండించారు. ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యానన్నారు. తెలుగు సినిమా గర్వించ దగ్గ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి బాబా వంటి గొప్ప భక్తిరస కథా చిత్రాలను తెరపై ఆవిష్కరించిన ఖ్యాతి రాఘవేంద్రరావుదన్నారు. ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, వి.బి.రాజేంద్ర ప్రసాద్, కె.ఎస్.ఆర్ దాసు దాసరి నారాయణ రావు లాంటి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రను తిరిగి రాసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరన్నారు. కమర్షియల్ దర్శకుడిగా తనదైన ముద్రవేసుకున్న రాఘవేంద్రరావుది నేటి స్టార్ హీరోలు వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటివారిని తెరకు పరిచయం చేసిన ఘనత అన్నారు. ఎన్టీ రామారావు, అక్కనేని నాగేశ్వరరావు, చంద్రబాబులాంటి వారికి అత్యంత సన్నిహితులైన రాఘవేంద్రరావును చాలా కొన్ని చిత్రాలు నిర్మించిన మురారీ విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తిని బహిరంగంగా విమర్శించడం హర్షనీయం కాదన్నారు. ఈ వ్యవహారంలోకి మురారీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో వ్యవహారం చాలా వరకు వెళుతుందని హెచ్చరించారు. కె.మురారీ అంశాన్ని హైదరాబాద్‌లోని చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని శాఖల ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్.వి.గురుపాదం వెల్లడించారు. -
పరిశోధనలకు ప్రాణం పోయండి
వర్సిటీలకు డీఆర్డీవో డీజీ అవినాష్ చందర్ సూచన ఘనంగా ‘గీతం’ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం విశాఖపట్నం: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ఆవిష్కరణలపైనే ఒక దేశం శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉన్నాయని రక్షణ శాఖ శాస్త్ర సలహాదారు, రక్షణ పరిశోధన-అభివృద్ధి (డీఆర్డీవో) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాష్ చందర్ పేర్కొన్నారు. దేశంలోని యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం పెంచాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు బోధనతోపాటు ఇంధన వనరులు, వాతావరణ మార్పు లు, రక్షిత మంచినీరు లాంటి అంశాలపై పరిశోధనలు జరపాలన్నారు. శనివారం విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. శాస్త్రసాంకేతి రంగంలో భారత్ ప్రపంచంలోనే మేటి శక్తిగా ఎదుగుతోందన్నారు. గీతం ఛాన్సలర్ ప్రొఫెసర్ కోనేరురామకృష్ణారావు ఈ సందర్భంగా అవి నాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కె.రాఘవేంద్రరావు, సుద్దాల అశోక్‌తేజ, శైలజా కిరణ్‌లు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 1,220 మంది విద్యార్థులకు పట్టాలను అందచేశారు. వీరిలో పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసిన వారు 24 ఉన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 56 మందికి స్వర్ణ పతకాలను ఇచ్చారు. -
కే.రాఘవేంద్రరావు డాక్టరేట్‌కు అనర్హుడు:నిర్మాత కే.మురారీ
తమిళ సినిమా : ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుపై మరో ప్రముఖ నిర్మాత కే.మురారి నిప్పులు చెరిగారు. రాఘవేంద్రరావు సంస్కారంలేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి గౌరవ డాక్టరేట్ బిరుదు అందుకునే అర్హత లేదని మండిపడ్డారు. గోరింటాకు, నారినారి నడుమమురారి, త్రిశూలం, సీతారాముడు తదితర చిత్రాల నిర్మాత మురారి. అదేవిధంగా శతాధిక చిత్రాల దర్శకుడు కే.రాఘవేంద్రరావు. కాగా కే.రాఘవేంద్రరావుతోపాటు మరో ఇద్దరు ప్రముఖులకు వైజాగ్‌లోని గీతం యూ నివర్సిటీ గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించింది. ఈ నేపథ్యంలో దర్శకు డు కే.రాఘవేంద్రరావు డాక్టరేట్ అవార్డు నందుకోనుండటాన్ని నిర్మాత కే.మురారి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన శుక్రవారం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాఘవేంద్రరావుపై ధ్వజమెత్తారు. రాఘవేంద్రరావు కుసంస్కారి అని అన్నారు. ఒకసారి ఆయన చెన్నైలో మాయాజాల్ సినీథియేటర్కు సినిమా చూడటానికొచ్చారని, విషయం తెలిసి తానాయాన్ని ఇంటికి ఆహ్వానించానని చెప్పారు. తన ఇంటిని పరీక్షిస్తున్న రాఘవేంద్రరావుకు తన తల్లి ఫొటోను చూపించగా అంతఅసహ్యంగా ఉందేంటంటూ ఫొటోను కిందపడేసిన కుసంస్కారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను నిర్మించిన త్రిశూలం చిత్రం హిందీ రీమేక్ హక్కులపై తనకు రావాల్సిన మూడు లక్షల రూపాయలను ఇప్పటికీ తనకివ్వలేదని ఆరోపించారు. అసలు ఆయనేమి సాధించాడని ఆయనకీ గౌరవ డాక్టరేట్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనేమ్మన్నా సామాజిక సేవ చేశాడా..? అంటూ విమర్శించారు. రాఘవేంద్రరావు సొంత కథలతో తెరకెక్కించిన చిత్రాలన్ని ప్లాఫ్లేనని అన్నారు. రాఘవేంద్రరావుకు డాక్టరేట్ అనగానే ఇప్పటి వరకూ ఆ బిరుదుపై ఉన్న గౌవరం పోయిందని కే.మురారి అన్నారు.