శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున | Nagarjina visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున

Published Thu, Jun 23 2016 9:12 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున

తిరుమలలో శ్రీవారిని సినీ నటుడు నాగార్జున దంపతులతోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం నాగార్జున, అమల దంపతులతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన వారిని గమనించిన అభిమానులు పెద్దసంఖ్యలో గుమికూడారు.

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో కోసం వచ్చినట్లు ప్రముఖ నటుడునాగార్జున తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన నాగార్జున మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓంనమో వేంకటేశాయ’ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతోందని వెల్లడించారు. అందుకే ముందుగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఈ సినిమాలో తనది హథీరాంబాబా పాత్ర అని తెలిపారు. ఆయనతోపాటు సినిమా ప్రొడ్యూసర్ మహేష్‌రెడ్డి, వెంకటేశ్వరుని పాత్రధారి సౌరవ్‌జైన్ కూడా ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement