amala
-
ఆరేళ్ల వయసు నుంచే ఆ పని చేస్తున్నా: అమల
ఆరేళ్ల వయసు నుంచి జంతువుల సంక్షేమంలో నా ప్రయాణం ప్రారంభమైందని జంతు ప్రేమికురాలు, సినీ నటి అమల (Amala Akkineni) పేర్కొన్నారు. యానిమల్ ఛారిటీ హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా మిషన్ పేరును హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్గా మార్చారు. దీనికి సంబంధించిన కొత్త పేరు, లోగోలను నగరంలోని ఓ హోటల్లో శనివారం ఆమె ఆవిష్కరించారు. అదే లక్ష్యంగా పని చేస్తున్నా..అనంతరం అమల మాట్లాడుతూ.. జంతువుల బాధలను అంతం చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానన్నారు. విద్యార్థులు సైతం మాతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. సర్కస్‌లో వన్యప్రాణులను నిలుపుదల చేయడం నుంచి జంతువులపై ప్రయోగాలు నిర్వహించే ప్రయోగశాలల వరకు అందరితో మాట్లాడామన్నారు. నా జీవితానికి విలువ లేదుప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులంతా కలిసి చేసే పనులు, తీసుకు వస్తున్న మార్పులే లేకుంటే నా జీవితానికి విలువ లేదన్నారు. జంతువులు, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ మనల్ని ఒకచోటకు చేరుస్తుందని పేర్కొన్నారు. అన్ని రకాల జంతువుల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల మానవత్వం చూపే సంప్రదాయం రావాలని ఆకాంక్షించారు.హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ సంస్థ చేస్తున్న అద్భుతమైన కృషికి ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ అధ్యక్షులు, సీఈవో కిట్టి బ్లాక్, పలువురు సంస్థ ప్రతినిధులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. చదవండి: 48 ఏళ్ల వయసులో నటుడి రెండో పెళ్లి.. వయసుతో సంబంధం లేదంటూ -
పోలింగ్ బూత్ లో సందడి చేసిన అక్కినేని ఫ్యామిలీ
-
తల్లి మందలించిందని.. విద్యార్థిని తీవ్ర నిర్ణయం!
సంగారెడ్డి: తల్లి మందలించిందని బీ పారసీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండల పరిధిలోని రామునిపట్లలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కల్లెం సుజాత రెండో కుమార్తె అమల (18) కొండపాక మండలం దుద్దెడలోని కళాశాలలో బీ పార్మసీ చదువుతోంది. గత 5న ఆమె హాస్పిటల్‌కు వెళుతున్నానని చెప్పి తిరిగి ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అమల తల్లి పనిచేసే హోటల్ వద్దకు వెళ్లి సమీపంలోని పొలం వద్ద ఉన్న పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోవడంతో గమనించిన తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో అమలను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె మేనమామ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినకట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ జాబితాలో నాగార్జున- అమల జోడీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన శివతో పాటు చాలా చిత్రాల్లో జంటగా నటించారు. అయితే ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా అమ్మ పాత్రలో కనిపించింది. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించింది. ఇలా కేవలం కొన్ని సెలెక్టివ్‌గా సినిమాలు మాత్రమే చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే సెప్టెంబర్ 12న ఆమె బర్త్ డే సందర్భంగా అమల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. (ఇది చదవండి: మరి ఇంత బోల్డ్ గానా?.. హీరోయిన్ పోస్ట్‌పై దారుణ కామెంట్స్!) అమల కుటుంబం అమల అక్కినేని తెలుగు సినిమాల్లో నటించడమే కాదు.. జంతు సంక్షేమ కార్యకర్త కూడా పనిచేస్తున్నారు. ఆమె అసలు పేరు అమల ముఖర్జీ కాగా.. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు కాగా.. తండ్రి బెంగాళీకి చెందినవారు. అమల పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశారు. అమల హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్, జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. అమల సినీ కెరీర్ అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ చిత్రంలో నటించింది . ఆ మూవీ సూపర్‌హిట్ కావడంతో 1987 లో విడుదలైన పుష్పక విమానంలో కమల్ హాసన్ సరసన అమల కీలక పాత్ర పోషించింది . అంతే కాకుండా 1991 మలయాళ చిత్రం ఉలడక్కమ్లో తన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. చినబాబుతో టాలీవుడ్ ఎంట్రీ తెలుగులో అమల నటించిన తొలి చిత్రం చినబాబు. డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి జూన్ 11, 1992న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 1994లో అక్కినేని అఖిల్ జన్మించారు. అయితే నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత అమల నటనకు స్వస్తి పలికింది. చాలా ఏళ్ల తర్వాత 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుగు సినిమాలో కనిపించింది. (ఇది చదవండి: పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!) కోల్‌కతాలోని ఝాలాలో జన్మించిన అమల ఇవాళ 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అమల 1986 నుంచి 1992 వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో చినబాబు, పుష్పక విమానం, శివ, ప్రేమ యుద్ధం, ఘర్షణ, నిర్ణయం, రాజా విక్రమార్క(చిరంజీవి), మనం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హై ప్రీస్టెస్ 2019 (వెబ్ సిరీస్), ఒకే ఒక జీవితంలో నటించారు. View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
ఆ విషయం తెలిశాక అమ్మ ఎమోషనల్ అయ్యింది : అఖిల్
‘‘30 ఏళ్లకు పైగా మా నాన్నగారు (నాగార్జున) ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి గ్రిప్ ఉంది. నాకేమైనా సందేహాలు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అయితే ఫలానా స్క్రిప్ట్ ఓకే చేయలా? వద్దా అని అడగను. అలా చేస్తే నా కెరీర్ తాలూకు ఒత్తిడిని నాన్నపై పెట్టినట్లు ఉంటుంది. ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంటే ఓ వ్యక్తిగా నేను ఎదగలేకపోవచ్చు. అందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ కారణంగానే ‘ఏజెంట్’ స్క్రిప్ట్‌ను నాన్నతో షేర్ చేయలేదు’’ అన్నారు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటింన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మింన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు. ఆ ఒక్క సెంటిమెంట్ ఫాలో అవుతున్నా! ♦ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టైమ్‌లో సూరిగారు (సురేందర్ రెడ్డి) ‘ఏజెంట్’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్ చేశాం. అయితే స్క్రిప్ట్ పూర్తి కావడానికి, నా లుక్ మార్చుకోవడం, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ♦ ‘ఏజెంట్’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్ ట్యూన్ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్‌గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్‌లో వచ్చే టార్చర్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. ♦సాధారణంగా నేను సెంటిమెంట్స్‌ను నమ్మను. అయితే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్ సినివలు విడుదలైన ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్‌ను మాత్రం ఫాలో అవుతున్నాను. ♦నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్ అయ్యారు. -
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇది
శర్వానంద్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా అమల ప్రధాన పాత్రలో శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం టీజర్ బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కథ చెప్పగానే అమలగారు చేస్తున్నారా? అని అడిగాను. ఎందుకంటే ఈ సినిమాకు ఆత్మ అమలగారి పాత్ర. ఈ సినిమాలోని అమ్మ పాటను ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు 9 నెలలు రాశారు. ఆయన మన మధ్య లేరు కానీ పాటల రూపంలో జీవించే ఉంటారు. ‘ఒకే ఒక జీవితం’ నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా’’ అన్నారు శర్వానంద్. ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు ఇందులోని అమ్మ పాత్రను నేనే చేయాలనుకున్నాను’’ అన్నారు అమల. ‘‘ముందు ఓ కథ అనుకున్నాను. కానీ అందులో ఎమోషన్ కనిపించలేదు. దురదృష్టవశాత్తు అదే సమయంలో మా అమ్మగారు చనిపోయారు. అమ్మను మళ్లీ చూడాలనిపించి రాసుకున్న ఒక సీన్ తర్వాత ‘ఒకే ఒక జీవితం’గా మారింది. శర్వా పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. శర్వా కచ్చితంగా ఏడిపిస్తాడు’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘ఈ సినిమాను ఓ కుటుంబంలా పూర్తి చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తల్లీ కొడుకు
వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్న అమల ‘మనం’ (2014) సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా కంటే ముందు 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో అమల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించారామె. కథ, పాత్ర నచ్చడంతో తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో ఎస్. ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు ఓ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించనున్నారు అమల. తండ్రి పాత్రలో సంగీతదర్శకుడు అనిరు«ద్ రవిచంద్రన్ తండ్రి, నటుడు రవి రాఘవేంద్ర నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, అమల, రవి పాత్రలపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ‘‘స్నేహం, ప్రేమల మధ్య విడదీయరాని బంధాన్ని తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
లవ్లీ డేట్!
కొత్త సినిమా స్టోరీ డిస్కషన్స్‌తో అఖిల్ బిజీబిజీ. వెబ్ సిరీస్ ప్రమోషన్‌తో అమల బిజీబిజీ. ఈ బిజీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త రిలీఫ్ కోసం తల్లీకొడుకులు సరదాగా డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ‘‘ఈ మధ్య కాలంలో నేను, అమ్మ బయటకు వెళ్లి చాలా రోజులైంది. అందుకే సరదాగా డిన్నర్ డేట్‌కు వెళ్లాం. ఎప్పటిలానే నా బెస్ట్ డిన్నర్ ఇది. థ్యాంక్యూ అమ్మ. లవ్ యూ’ అంటూ క్యాప్షన్ చేసి ఈ ఫొటోను షేర్ చేశారు అఖిల్. -
అక్కినేని హలిడే టూర్
ఫుల్‌గా పని చెయ్. ఆ తర్వాత తప్పకుండా హాలీడే చెయ్. ఇదే మా మంత్రం అంటున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. నాగచైతన్య, సమంతల ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రిలీజ్ కావడం, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్‌కి గ్యాప్ దొరకడంతో సేద తీరడానికి హాలీడే వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ‘దేవదాస్’ రిలీజ్ చూసుకొని అమలతో కలసి నాగార్జున కూడా వాళ్లతో జాయిన్ అయ్యారు. ఇలా కుటుంబమంతా సరదాగా హాలీడే మూడ్‌లోకి వెళ్లారు. ‘‘సక్సెస్ కూడా యాడ్ అయినప్పుడు హాలీడే ఇంకా అద్భుతంగా మారుతుంది’’ అని నాగార్జున ఈ ఫొటోను షేర్ చేశారు. -
అందరికీ ధన్యవాదాలు
ప్రస్తుతం అక్కినేని కుటుంబం హాలీడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి సమంత విదేశాలు వెళ్లారు. ఇద్దరు మాత్రమే కాదు.. వీళ్ల వెంట అఖిల్ కూడా స్పెయిన్ తీరప్రాంతంలోని ఇబిసా ప్రాంతానికి వెళ్లారు. అంతే కాదండోయ్.. నాగార్జున, ఆయన సతీమణి అమల కూడా ఈ సరదా ట్రిప్‌లో జాయిన్ అయ్యారు. ఈ హాలిడే ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. వీటిపై నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు. ముఖ్యంగా సమంత వస్త్రధారణను విమర్శిస్తున్నారు. ఇలాంటి దుస్తుల ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్? అంటూ విమర్శించారు. ఈ విమర్శలకు సమంత ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ మేసేజ్ ఉంచారు. ‘‘నా పెళ్లి తర్వాత నేనెలా ఉండాలో చెబుతున్న వారందరికీ అంటూ... ఓ అసభ్యకరమైన సింబల్‌ని పోస్ట్ చేసి, ధన్యవాదాలు’’ అంటూ ముగించారు. అంటే.. పరోక్షంగా సమంత నా జీవితం.. నా ఇష్టం అనేలా చెబుతున్నట్లు ఉంది కదూ. ఇప్పుడు వీటిపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లి రోజు దగ్గర పడుతున్న (అక్టోబర్ 6) సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత చేయబోతున్న చిత్రం ఆ రోజు ప్రారంభం అవుతుందట. దీనికి ‘మజిలీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇక నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే -
హలో... గెస్ట్స్!
హలో అవినాష్ అని పలకరించడానికి నాగార్జున, అమల, సమంత రెడీ అయ్యారని సమాచారం. అవినాష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖిల్ అక్కినేని పేరే అవినాష్. ‘హలో’లో తను చేస్తోన్న క్యారెక్టర్ పేరిది. సినిమాలో అవినాష్‌కి నాగ్, అమల, సామ్ హలో చెబుతారట. అంటే.. గెస్టులుగా కనిపిస్తారని సమాచారం. ఆల్రెడీ ‘మనం’ అక్కినేని ఫ్యాన్స్‌కు మంచి పండగ. ‘హలో’లో గెస్ట్ రోల్స్ నిజమైతే ఫ్యాన్స్‌కు మరోసారి ఐ–ఫీస్ట్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి కథానాయికగా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి, టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
సెప్టెంబర్‌లో ఒరు కనవు పోల
తమిళసినిమా: ఒరు కనవు పోల చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇరైవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై సీ.సెల్వకుమార్ నిర్మించిన చిత్రం ఒరు కనవు పోల. రామకృష్ణన్, సౌందర్‌రాజా కథానాయకులుగా నటించిన ఇందులో అమల అనే నూతన నటి కథానాయకిగా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో అరుళ్దాస్, చార్లీ,మియిల్‌సామి, వెట్ట్రివేల్‌రాజా, కవి పెరియతంబి, విన్నర్ రామచంద్రన్, శ్రీలత, బాలాంభిక తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.కాగా ఒక ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు మధుపాల్ నటించారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత అన్నది గమనార్హం. ఎన్.అళగప్పన్ ఛాయాగ్రహణను, ఇఎస్.రామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి కథ,కథనం, దర్శకత్వం బాధ్యతలను వీసీ.విజయశంకర్ నిర్వహించారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ మంచి కథా బలం,వైవిధ్యభరిత కథనాలతో కూడిన చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణ బాహుబలి 2, విక్రమ్‌వేదా, మీసైమురుక్కు లాంటి చిత్రాలని పేర్కొన్నారు. ఆ వరుసలో విభిన్న కథనంతో తెరకెక్కించిన చిత్రం ఒరు కనవు పోల అని అన్నారు. ఈతరం యువత స్నేహం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఒరు కనవు బోల చిత్రం ఉంటుందన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్ నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
నాగ్, అమల ప్రేమపెళ్లికి 25 ఏళ్లు...
హైదరాబాద్ : నవ మన్మధుడు అక్కినేని నాగార్జున, అమల తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వీరిద్దరి వివాహం జరిగి పాతిక సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నాగార్జున ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. నాగార్జున తన పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ‘నేటితో 25 ఏళ్ళు పూర్తైంది. ఈ కపుల్ కి యానివర్సరీ విషెస్ తెలపండి’ అంటూ కామెంట్ పెట్టారు. అలాగే అమలతో పాటు, తమపై ప్రేమ, అభిమానం చూపిన అందరికి కృతజ్ఞతలు అని నాగ్ తెలిపారు. 1992లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అక్కినేని అఖిల్ కూడా అమ్మా,నాన్నలతో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. కాగా ప్రస్తుతం నాగ్... రాజుగారి గది-2లో నటిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత చాలాఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమల... శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. మలయాళ చిత్రం ‘కేరాఫ్ సైరాభాను’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. -
మలయాళం మనసిలాగునుండో!...కేరాఫ్ మాలీవుడ్!
నేంద్రమ్‌పళమ్ చిప్స్.. సూపర్ ఉళున్ను వడ.. అబ్బో దడదడ అవియల్... అదరహో కేరళ కుట్టి... కేక అర్థం కావడంలేదు కదూ.. నేంద్రమ్‌పళమ్ అంటే అరటికాయ చిప్స్.. ఉళ్లున్ను వడ అంటే మినప గారెలు.. అవియల్ అంటే కొన్ని రకాల కూరగాయలతో చేసే కూర.. కేరళ కుట్టి అంటే అర్థమయ్యే ఉంటుంది.. కేరళ అమ్మాయి అని. ఇప్పటివరకూ చాలామంది కేరళ కుట్టీలు తెలుగు తెరకు వచ్చారు. ఇప్పుడు సీన్ రివర్శ్. తెలుగులో ఇరగదీస్తున్న కుట్టీలు కేరళ వెళుతున్నారు. అది మాత్రమే కాదండోయ్... మన నటులు కూడా వెళుతున్నారు. మరి.. వీళ్లందరికీ ‘మలయాళం మనసిలాగునుండో’? అదేనండి.. మలయాళం అర్థమవుతుందా అని. మనసిలవకపోతే ఏంటి? అయితే ఏంటి? కళాకారులకు భాషతో పనేంటి? ఇక్కడివాళ్లు అక్కడ.. అక్కడివాళ్లు ఇక్కడ... మనం ఆర్టికల్ చదువుతూ ఇక్కడ... యువరానర్... షి ఈజ్ ద లాయర్! పుట్టింది కలకత్తాలో... పేరొచ్చింది తెలుగు సినిమాల్లో. అమల తల్లిది ఐర్లాండ్.. తండ్రిది బెంగాల్. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన మరుక్షణమే... చక్కటి చీరకట్టు, బొట్టు, చెరగని చిరునవ్వుతో తెలుగింటి కోడలు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అనేట్టు నిలిచారు. నాగార్జునతో పెళ్లి తర్వాత అమల నటనకు ఫుల్స్టాప్ పెట్టేశారు. మళ్లీ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే... ఈ ఇన్నింగ్స్‌లో భాషతో సంబంధం లేకుండా భావోద్వేగభరిత కథలకు ఓటేస్తున్నారు. ఇప్పుడామె ‘కేరాఫ్ సైరాభాను’ అనే మలయాళ సినిమా చేస్తున్నారు. సుమారు ఇరవైయేళ్ల తర్వాత అమల నటిస్తున్న మలయాళ చిత్రమిది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అమల అక్కినేని లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అమల పాత్ర ఆమెతో సమానంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. గతంలో అమల రెండు మలయాళ సినిమాలు చేశారు. రెండూ హిట్టే. ‘కేరాఫ్ సైరాభాను’తో ముచ్చటగా మూడో హిట్ అందుకోవాలని ఆశిద్దాం. కమాండర్... బియాండ్ ద లాంగ్వేజ్! అల్లు అర్జున్ స్ట్రయిట్ మలయాళ సినిమా ఒక్కటీ చేయలేదు. కానీ, అక్కడి స్టార్ హీరోలతో సమానంగా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. ఈ సై్టలిష్ స్టార్ ప్రతి సినిమా మలయాళంలో డబ్బింగ్ కావడం కామన్. ఎప్పట్నుంచో బన్నీ ఓ మలయాళ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అన్నయ్య కంటే ముందు తమ్ముడు అల్లు శిరీష్ మలయాళ సినిమా చేస్తున్నారు. మోహన్‌లాల్ హీరోగా చేస్తున్న ‘1971: బియాండ్ బోర్డర్స్’లో ఇండియన్ ఆర్మీ ట్యాంక్ కమాండర్‌గా అల్లు శిరీష్ నటిస్తున్నారు. ఇందులో శిరీష్‌పై ఓ పాట కూడా చిత్రీకరించారు. సినిమా విడుదలకు ముందే కేరళలో ఎక్కడికి వెళ్లినా.. అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్‌ను గుర్తుపడుతున్నారట! దాంతో అన్నయ్య అర్జున్‌లా నాకూ మలయాళంలో మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు శిరీష్. ‘‘అన్నయ్య (అల్లు అర్జున్)పై కేరళ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత చూసి, మలయాళ సినిమాలు, ఆ కల్చర్‌తో నేను ప్రేమలో పడ్డాను. అందుకే, మలయాళ సినిమా ఛాన్స్ రాగానే అంగీకరించా. ‘1971: బియాండ్ బోర్డర్స్’ వంటి దేశభక్తి సినిమా చేసే ఛాన్స్ మళ్లీ వస్తుందనుకోవడం లేదు. మా యూనిట్లో తెలుగు ఆర్టిస్ట్‌ని నేనొక్కడినే. అందరూ ఫ్రెండ్లీగా చూసుకుంటున్నారు. మనతో పోలిస్తే వాళ్ల యాక్టింగ్ సై్టల్ డిఫరెంట్‌గా ఉంటుంది. మోహన్‌లాల్‌గారు మొదలుకుని మలయాళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మన తెలుగులోకి వస్తున్నారు. నేను మలయాళ సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు అల్లు శిరీష్. స్నేహ.. ద గ్రేట్ మామ్! తెలుగమ్మాయి స్నేహ కూడా ఇప్పుడో మలయాళ సినిమా చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఆ సినిమా పేరు ‘ద గ్రేట్ ఫాదర్’. ఇందులో హీరో వైఫ్‌గా, ఓ అమ్మాయికి తల్లి పాత్రలో స్నేహ నటిస్తున్నారట! ఆల్రెడీ స్నేహ పలు మలయాళ సినిమాలు చేశారు. గతంలో మమ్ముట్టితో రెండుసార్లు కలసి నటించారు. మరి, ఈ ‘గ్రేట్ ఫాదర్’ ప్రత్యేకత ఏంటంటే... తల్లైన తర్వాత స్నేహ చేస్తున్న తొలి చిత్రమిది. సినిమాలోనూ ఆమె తల్లిగానే నటిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత స్నేహ నటిస్తున్న సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. ఇందులో స్నేహ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట! ‘ద గ్రేట్ ఫాదర్’ విడుదల తర్వాత స్నేహ కెరీర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎదురు చూడాలి. తమిళ హీరో ప్రసన్నతో వివాహానంతరం స్నేహ చెన్నైలో సెటిల్ అయ్యారు. ‘‘విహాన్ (స్నేహ కుమారుడు) జన్మించిన తర్వాత యాక్టింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. మధ్యలో కొన్ని మంచి అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. దర్శకుడు హనీఫ్ ‘ద గ్రేట్ ఫాదర్’ స్క్రిప్ట్ వినిపించిన తర్వాత నో చెప్పలేకపోయాను. చాలా పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్. ఓ తల్లిగా, ఈ సినిమాలో ప్రస్తావిస్తున్న సమస్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించా. ఈ మలయాళ సినిమాతో పాటు ఓ తమిళ సినిమా కూడా చేస్తున్నా. మంచి ఛాన్సులొస్తే తెలుగులోనూ నటిస్తా’’ అన్నారు స్నేహ. 125 నాటౌట్... న్యూ ఇన్నింగ్స్! సెంచరీ ఎప్పుడో కొట్టేశారు శ్రీకాంత్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 125కు పైగా సినిమాల్లో నటించారాయన. తెలుగు ఇండస్ట్రీతో పాతికేళ్ల అనుభవం ఆయనది. ఇప్పుడు నటుడిగా మళ్లీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించనున్న సినిమాతో శ్రీకాంత్ మలయాళ తెరకు పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్‌తో పాటు తమిళంలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి విశాల్‌ను కూడా కీలక పాత్రకు ఎంపిక చేశారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా శ్రీకాంత్, విశాల్... ఇద్దరికీ మలయాళంలో మొదటిది. ఈ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ రాశీఖన్నా. తెలుగులో హీరోయిన్గా మంచి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ఢిల్లీ డాల్, మోహన్‌లాల్ సినిమా కావడంతో ఓకే చెప్పారట. ఇందులోనే విశాల్‌కి జోడీగా హన్సిక నటించనున్నారని సమాచారం. ఒక్క సినిమాతో ఇంతమంది పరభాషా నటీనటులను మలయాళ తెరకు పరిచయం చేస్తున్న మోహన్‌లాల్‌పై అక్కడ సరదాగా జోకులు వేస్తున్నారు. ‘‘సినిమాలో ఆయా పాత్రలకు ప్రాముఖ్యత ఉంది కాబట్టే... తెలుగు, తమిళ స్టార్స్ శ్రీకాంత్, విశాల్ మా సినిమాలో నటించడానికి అంగీకరించారు. వాళ్ల స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువే ఉంటుంది. అంతే కానీ, రెండు మూడు భాషల్లో సినిమా తీసే ఆలోచన మాకు లేదు. ఇది మల్టీ–లింగ్వల్ సినిమా కాదు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే తీస్తున్నాం. ఇతర భాషల్లో డబ్బింగ్ చెయ్యొచ్చా? లేదా? అనే నిర్ణయం తర్వాత తీసుకుంటాం’’ అని చెప్పారు చిత్ర దర్శకుడు బి. ఉన్నికృష్ణన్. గత ఏడాదే ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ఫ్యామిలీ జానర్ కథానాయకునిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు విలన్‌గా జగపతిబాబు వీర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఆయన కేరళ తెరకు పరిచయమయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘పులి మురుగన్’లో జగపతిబాబు విలన్‌గా నటించారు. ఆయన పాత్ర పేరు ‘డాడీ గిరిజ’. తెలుగులో ‘మన్యంపులి’గా విడుదలై ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ‘పులి మురుగన్’ విడుదల తర్వాత జగపతిబాబు కేరళ వెళ్లినప్పుడు ఆయన పేరుతో కాకుండా ‘డాడీ గిరిజ’ అని పిలిచారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ‘‘పొరుగు రాష్ట్రంలో అభిమానులను సంపాదించుకోవడం చాలా హ్యాపీగా ఉంది’’ అని జేబీ అన్నారు. మాలీవుడ్ నుంచి ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయట. – సత్య పులగం -
నాపై అమలకు ఎంత ప్రేమో అర్థమైంది
‘‘సినిమా చూసి ఇంటికి వెళ్లిన తర్వాత అమల గంటసేపు ఏడుస్తూనే ఉంది. తన మనసులో నాపై ఎంత ప్రేమ ఉందనేది అప్పుడు అర్థమైంది. నన్ను పట్టుకుని అలా నిలబడింది. ఆ మెమరబుల్ మూమెంట్స్‌ని ఎప్పటికీ మరచిపోలేను. నాకు అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు నాగార్జున. శ్రీవారి భక్తుడు హాథీరామ్ బావాజీగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు కూడా సినిమా చూసి కళ్లు చెమర్చాయని చెప్పారు. బాగా చేశావని మెచ్చుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు కలిగిన అనుభవాలను ఆయనతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పంచుకోబోతున్నాను. ఓ చక్కటి సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. రాఘవేంద్రరావుగారు, జేకే భారవిలు మూడు నాలుగేళ్లు కష్టపడి ఈ కథ తయారుచేశారు. టీమ్ అంతా కష్టపడి పనిచేశారు. అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. ('ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ) రెండు కళ్లూ చాలవు: కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నేను ఏం ఆశించి ఈ సినిమా తీశానో, ఈ రోజు అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జన్మ ధన్యమైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అందులో రెండు ఫోన్ కాల్స్ మరచిపోలేను. ‘ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది. ఇంత అద్భుతమైన సినిమా తీసిన మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా’ అన్నారొకరు. ఇంకొకరు ‘వెండితెరపై తిరుపతి పుణ్య క్షేత్రాన్ని ఆవిష్కరించిన మీకు జన్మంతా ఋణపడి ఉంటాం’ అన్నారు. భగవంతుడి విశ్వరూపం చూడడానికి రెండు కళ్లూ చాలవు. అదే విధంగా ఈ సినిమాలో కళ్లతోనే నటించిన నాగార్జున నటన చూడడానికీ రెండు కళ్లూ చాలవు. ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి కారణమైన మా నిర్మాత మహేశ్‌రెడ్డి, చిత్రబృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ చిత్రంతో నా జన్మ ధన్యమైంది. దీనికి కారకులైన నాగార్జున, రాఘవేంద్రరావులకు జీవితాంతం రుణపడి ఉంటాను. శుక్రవారం నుంచి బోలెడంత మంది అభినందిస్తున్నారు. ఈ అనుభూతిని మరచిపోలేను. రాఘవేంద్రరావు గారి దర్శకత్వం చూస్తుంటే ఆ స్వామివారితో నేను గడిపినట్టు అనిపిస్తోంది. ఏడు కొండల వెంకన్న సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. క్లైమాక్స్‌లో నలభై నిమిషాల పాటు నా కళ్లవెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. యువతరం నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కర్ని సినిమా అలరిస్తుంది. రాఘవేంద్రరావుగారు ఓ టీటీడీ బోర్డు సభ్యునిగా భక్తుల ఇబ్బందులను చూసి, చలించి ఈ సినిమా తీశారనిపించింది. అంత అద్భుతంగా ఉందీ సినిమా. కీరవాణి సంగీతం, భారవి రచన, అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ల నటన.. అన్నీ ఆణిముత్యాలే’’ అన్నారు. ‘‘శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే నాకు ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో మూడు సినిమాలు వచ్చాయి. ఇదంతా స్వామివారి మహిమే. నాగార్జున, రాఘవేంద్రరావులకు నేను పెద్ద ఫ్యాన్. వాళ్ల కాంబినేషన్లో చేసిన ఈ సినిమా హిట్ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రగ్యా జైశ్వాల్. -
బ్యూటిఫుల్ ముగ్గు వేశారు: నాగార్జున
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నటీనటులు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు పండుగ విషెష్ చెబుతున్నారు. ప్రముఖ హీరో నాగార్జున... సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా, తన నివాసంలో వేసిన ముగ్గు దగ్గర సతీమణి అమలతో పాటు దిగిన ఫోటోను ట్విట్ చేశారు. తమవాళ్లు ఇంటిముందు అందమైన సంక్రాంతి ముగ్గు వేశారంటూ ఆయన అభినందించారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు ... మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ, మంచు మనోజ్, వెన్నెల కిషోర్, ప్రియమణి, కల్యాణ్ రామ్, దర్శకుడు హరీశ్ శంకర్ తదితరులు ట్విట్ చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున
తిరుమలలో శ్రీవారిని సినీ నటుడు నాగార్జున దంపతులతోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం నాగార్జున, అమల దంపతులతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన వారిని గమనించిన అభిమానులు పెద్దసంఖ్యలో గుమికూడారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో కోసం వచ్చినట్లు ప్రముఖ నటుడునాగార్జున తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన నాగార్జున మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓంనమో వేంకటేశాయ’ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతోందని వెల్లడించారు. అందుకే ముందుగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఈ సినిమాలో తనది హథీరాంబాబా పాత్ర అని తెలిపారు. ఆయనతోపాటు సినిమా ప్రొడ్యూసర్ మహేష్‌రెడ్డి, వెంకటేశ్వరుని పాత్రధారి సౌరవ్‌జైన్ కూడా ఉన్నారు. -
'అమ్మా నాన్న ఆట' ఆగిపోయింది
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయింది. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల తరువాత సూపర్ ఫాంలో కనిపించిన కమల్, అదే స్పీడులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అమల హీరోయిన్గా అమ్మా నాన్న ఆట అనే సినిమాను ప్రారంభించిన కమల్, తాజాగా ఆ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటించాడు. అయితే ఎందుకు ఆగిపోయింది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. టికె రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోవటంతో ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు. కొత్త సినిమాలో రమ్యకృష్ణ, కమల్‌కు జోడిగా నటిస్తుండగా కమల్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కమల్ కూతురి పాత్రలో కనిపించనుంది. ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించిన కమల్ హాసన్ త్వరలోనే నెక్ట్స్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నాడు. -
కమల్ తో నీలాంబరి
బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించడానికి రెడీ అవుతోంది. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న కమల్ హాసన్ సరసన నటించేందుకు అంగీకరించింది రమ్యకృష్ణ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కమల్ ప్రస్తుతం 'అమ్మా నాన్న ఆట' సినిమాలో నటిస్తున్నాడు. టికె రాజీవ్ దర్శకత్వంలో, అమల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత రాజీవ్ దర్శకత్వంలోనే మరో సినిమాకు ఓకె చెప్పాడు కమల్ హాసన్. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా రమ్యకృష్ణను ఎంపిక చేశారు. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కూతురు పాత్రలో నటిస్తుండగా, శృతి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
పిడుగురాళ్ల(గుంటూరు): ప్రేమించుకుంటున్న యువతీయువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన షేక్ మౌలాలి (24), ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమల(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం మౌలాలి బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయాడు. ఇతను ఓ ప్రై వేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. మౌలాలికి ఇటీవలే వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన అమల పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. -
ఆయన అడిగితే కాదంటానా!
కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో 1990 ప్రాంతంలో నటించి ప్రముఖ కథానాయకిగా వెలుగొందిన నటి అమల. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ప్రముఖ కథానాయకులతో నటించిన అమల నాగార్జునను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపట్టారు. ఆ తరువాత పలువురు దర్శక నిర్మాతలు అమలను మళ్ల నటింపజేయాలని ప్రయత్నించినా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. రెండు దశాబ్దాల తరువాత ఆ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంలో మెరిశారు. అమల లాంటి ప్రతిభావంతురాలు రీఎంట్రీ అయితే ఇక మన దర్శక నిర్మాతలు చూస్తూ ఊరుకుంటారా? అంత వరకూ ఎందుకు విశ్వ నటుడు కమలహాసనే అమలను తన చిత్రంలో నటించమని కోరారు. అంతటి గొప్ప నటుడు అడిగితే అమల ఎలా కాదనగలరు. కథ, తన పాత్ర బాగుంటే. ఆమె త్వరలో కమలహసన్‌తో కలిసి అప్పా అమ్మా విళైయాట్టు చిత్రంలో నటించనున్నారు. దీనిగురించి అమల ఏమంటున్నారో చూద్దాం. 'మళ్లీ కమలహాసన్‌తో కలిసి నటిస్తానని ఊహించలేదు. ఒక కార్యక్రమంలో కలిసిన ఆయన తనతో నటిస్తారా అని అడిగారు. నేనూ ఓకే అన్నాను. అంతే దర్శకుడు రాజీవ్‌కుమార్ పంపి కథ వినిపించారు. కథ బాగుంది. పాత్ర తనకు తగినట్లు ఉంది. చిత్ర షూటింగ్ అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఇందులో నేను కమల్‌కు భార్యగా నటించనున్నాను. షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బహూశా ఫిబ్రవరిలో ప్రారంభం కావచ్చు. అయితే నేను ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాను. పనులు చాలా ఉన్నాయి. అందువల్ల కమలహాసన్‌కు జంటగా ప్రత్యేక పాత్రలోనే నటించనున్నాను. ఎక్కువ రోజులు కాల్షీట్స్ కేటాయించలేను. సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. అయితే నాకు తగిన పాత్ర అయితేనే అంగీకరిస్తాను' అని అమల పేర్కొన్నారు. ఈ చిత్రంలోనే నటి శ్రుతిహాసన్ నటించనున్నారు. -
కమల్, అమలల 'అమ్మ నాన్న ఆట'
కుర్ర హీరోలు కూడా ఆచితూచి సినిమాలు చేస్తుంటే లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. పాపనాశం, చీకటి రాజ్యం సినిమాలను గ్యాప్ లేకుండా రిలీజ్ చేసిన కమల్, ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో అమల లీడ్ రోల్లోనటించనుండటంతో సినిమా మీద మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం చీకటిరాజ్యం సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న కమల్ వీలైనంత త్వరగా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. చాలా కాలం క్రితం కమల్ హీరోగా చాణక్యన్ సినిమాను తెరకెక్కిన రాజీవ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అచ్చమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమ్మ నాన్న ఆట అనే టైటిల్‌ను నిర్ణయించారు. -
సకలం... అఖిలం
చిత్రం: ‘అఖిల్... ది పవర్ ఆఫ్ జువా’; కథ: వెలుగొండ శ్రీనివాస్; మాటలు: కోన వెంకట్; సంగీతం: తమన్, అనూప్; ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాశ్; కెమేరా: అమోల్ రాథోడ్; యాక్షన్: కె. రవివర్మ; ఎడిటింగ్: గౌతంరాజు; నిర్మాతలు: ఎన్. సుధాకరరెడ్డి, నితిన్, దర్శకత్వం: వి.వి. వినాయక్; నిడివి: 130 ని॥ అఖిల్ ఎవరో సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్క ర్లేదు. కానీ, లాంఛనంగా చెప్పాలి కాబట్టి... అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన కొత్త వారసుడు. నాగార్జున, అమల దంపతుల కుమారుడు. తన పేరే టైటిల్‌గా తయారైన సినిమాతో తొలిసారిగా పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకొ చ్చాడు. దసరాకు రావాల్సి ఉన్నా, ‘‘గేమ్ ఎప్పుడైనా గెలుపు నాదే’’ అంటూ, దీపావళికొచ్చాడు. ఇప్పటికే తాత, తండ్రి, అన్నలతో పరిచయమున్న సినీ ప్రియులకు తెరపై కొత్త బాణసంచా అఖిల్. హీరోగా అతను ఎంచుకున్న కథ, సినిమా కూడా అచ్చమైన దీపావళి టపాకాయ. కథగా చెప్పాలంటే... అఖిల్ (అఖిల్) అమ్మానాన్న లేని కుర్రాడు. ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా తిరుగుతూ, ఫైటింగ్ పోటీల్లో పాల్గొని గెలుస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. దివ్య (సాయేషా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. బాగా చదువుకొన్న దివ్యకు మూగ జీవాలంటే మహా ప్రేమ. ఎంత ప్రేమంటే, తన దగ్గరున్న కుందేలుకు గుండెలో రంధ్రముందని తెలిసి, బాగు చేయాలనుకొనేంత ప్రేమ. వెంటనే హీరో కేంబ్రిడ్జ్‌లో చదువుకొన్న వెటర్నరీ డాక్టర్‌నని నాటకమాడతాడు. నిజానికి హీరోయిన్ ఒక పెద్ద మాఫియా వ్యాపారి (మహేశ్ మంజ్రేకర్) కూతురు. అప్పటికే ఆమెకు మరొకరి (‘వెన్నెల’ కిశోర్)తో పెళ్ళి నిశ్చయమవుతుంది. ఆ పెళ్ళిని తెలివిగా చెడగొడతాడు హీరో. పారిపోయి, వేరే ప్రేమ వివాహం చేసుకున్న ఆ పెళ్ళికొడుకునూ, పెళ్ళి చెడగొట్టిన అతని ఫ్రెండ్‌నూ వెతుక్కుంటూ, పగ తీర్చుకొనే పనిలో పడుతుంది హీరోయిన్. చదువుకుంటానని పైకి చెబుతూ, పగ తీర్చుకోవడానికి యూరప్ వెళుతుంది. హీరోయిన్నీ, ఆమె నుంచి ప్రేమనూ పొందడానికి హీరో రెండు లక్షలతో యూరప్‌కి చేరతాడు. అక్కడ అనుకోకుండా, ఒక ఆఫ్రికన్ కుర్రాడి బుల్లెట్ గాయానికి చికిత్స చేస్తుంది హీరోయిన్. గూండాల వేటలో ఆ కుర్రాడు చనిపోతాడు. అప్పటి దాకా ఆ ఆఫ్రికన్ కుర్రాడి కోసం, అతను దాచిన రహస్యం కోసం వెతుకుతున్న గూండాలు విషయాలన్నీ హీరోయిన్‌కు తెలుసని ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆఫ్రికా పట్టుకుపోతారు. ఈ ఆఫ్రికా ట్విస్ట్ వెనుక అసలు కథ మరొకటి ఉంటుంది. అదేమిటంటే, సూర్యతాపం నుంచి ప్రపంచ వినాశం జరగకుండా కాపాడే సూర్యకవచం ఆఫ్రికాలో ఒక తెగ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతి సూర్యగ్రహణం నాడూ గ్రహణం విడిచిన వెంటనే సూర్యుడి తొలి కిరణాలు దాని మీద పడాలి. లేకపోతే ప్రపంచ నాశనం తప్పదు. స్థానిక ఆఫ్రికన్లు తమ భాషలో ఆ కవచాన్ని ‘జువా’ (అంటే సూర్యుడని అర్థం) అంటూ ఉంటారు. దాన్ని ఎలాగైనా చేజిక్కించుకొని, ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ఒక రష్యన్ శాస్త్రవేత్త ప్రయత్నిస్తుంటాడు. ఆ ‘జువా’ను తెచ్చి ఇవ్వడానికి మాఫియా వ్యాపారి అయిన హీరోయిన్ నాన్న (మహేశ్ మంజ్రేకర్) ఒప్పుకుంటాడు. గూండాల సాయం తీసుకుంటాడు. వాళ్ళకు అది దొరకకుండా చేస్తాడు ఆ ఆఫ్రికా కుర్రాడు. ఆ జువాను ఒకచోట దాస్తాడు. తీరా గూండాల చేతిలో చనిపోయాడన్న మాట. హీరోయిన్ను వెతుకుతూ ఆఫ్రికా వెళ్ళిన హీరోకు ఈ కథంతా తెలుస్తుంది. హీరోయిన్ని కాపాడి, ఆ జువాను తీసుకురావడానికి తానే బయల్దేరతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఎవరైనా ఊహించుకోగలిగినదే. కాకపోతే, అఖిల్ ఆ పనెలా చేశాడు, ఏ జీవాన్నైనా పీక్కు తినే కిల్లర్ ఫిష్‌లతో నిండిన ఆ కొలనులో ఏమైంది, జీపుతో గాలిలోకి ఎగిరి మరీ నడుస్తున్న విమానాన్ని హీరో ఎలా అందుకున్నాడు, ఆ మంటల్లో నుంచి ఎలా బయటపడ్డాడు, చివరికి ఆ సూర్యగ్రహణానికి ఏమైందన్నది వి.వి. వినాయక్ మార్కు ‘అఖిల్’లో తెరపై చూసి తీరాలి. అమృతతుల్యమైనవీ, ప్రపంచ నాశనం నుంచి కాపాడేవీ అయిన ఆత్మలింగం (చిరంజీవి ‘అంజి’), మహాశక్తి (వెంకటేశ్ ‘దేవీపుత్రుడు’), శక్తి (చిన్న ఎన్టీయార్ ‘శక్తి’) లాంటివి గతంలో చూశాం. ఈసారి సూర్యకవచం తెర మీదకొచ్చింది. కొన్నేళ్ళ క్రితం నాగార్జునకు ‘డమరుకం’ సినిమా కథ ఇచ్చిన రచయితే దీనికీ కథారచన. కోన వెంకట్ మార్కు డైలాగ్స్ అదనం. హీరోగా తొలి సినిమా అనిపించకుండా అఖిల్ ఈజ్ చూపారు. ఫైట్స్, డాన్స, కాస్ట్యూమ్స్‌లో మార్కులు కొట్టేస్తారు. రూపురేఖల్లో అచ్చం బాలీవుడ్ నటుడనిపిస్తారు. కొత్తమ్మాయి సాయేషా (దిలీప్‌కుమార్, సైరాబాను దంపతులకు మనవరాలి వరస) కూడా డిటో డిటో. ‘వెన్నెల’ కిశోర్, జాన్సన్ అండ్ జాన్సన్‌గా సెకండాఫ్‌లో బ్రహ్మానందం, ఒక్క సీన్ ‘పోతే బాబూరావు’గా సప్తగిరి.. ఉన్న కథలోనే కామిక్ రిలీఫ్. కథలో కాసేపటి తర్వాత కనిపిం చని రాజేంద్రప్రసాద్ బృందమూ అంతే. మిస్సవకుండా మొదటి నుంచీ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే, టైటిల్స్ పడుతున్నప్పుడే ‘జువా’ అంటే ఏమిటో, అదెందుకు కీలకమో - మొత్తం చెప్పేస్తారు. ఫారిన్ షూటింగ్‌లు, పాటల చిత్రీకరణల్లో నిర్మాణ విలువలు కనిపించే ఈ సినిమాలో కెమేరా వర్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆఫ్రికా గూడెం మొత్తం ఇక్కడ మన ఆర్ట్ డెరైక్టర్ ప్రతిభేనంటే నమ్మబుద్ధి కాదు. రవి వర్మ యాక్షన్ కంపోజింగ్ బాగుంది. ఇన్నీ ఉన్నా, ఒక్క ముక్కలో ఈ సినిమా ‘ఫర్ ది అఖిల్... బై ది అఖిల్... అండ్ టు ది అఖిల్’. మొత్తం ఆ హీరో భుజాల మీద, ఆ పాత్ర చేతుల మీదుగా నడుస్తుంది. ఏ హీరో అయినా తన తొలి సినిమాకు అంతకు మించి ఏం కోరుకుంటాడు! ప్రేక్షకులు ఇంకేం ఆశిస్తారు! అఖిల్‌కు సన్నిహిత మిత్రుడైన మరో సినీ హీరో నితిన్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవా నికి హీరో హీరోయిన్లని పరిచయం చేశారు.స్పెయిన్ లాంటి చోట్ల భారీ షెడ్యూల్స్ చేశారు. ఫైట్లు తీశారు. ఈ సినిమాకు మ్యూజిక్ డెరైక్టర్‌గా అనూప్‌ను తీసుకున్నారు. తరువాత తమన్ కూడా మ్యూజిక్బాధ్యతలు పంచుకున్నారు. ‘అక్కినేని...’ అంటూ సినిమా చివరలో వచ్చే పాటలో నాగార్జున కూడా స్పెషల్ అప్పీయరెన్‌స ఇచ్చారు. కుమారుడు అఖిల్ కోసం కలసి, స్టెప్పులు వేశారు. -రెంటాల జయదేవ -
పవన్ కల్యాణ్, అమల అంటే ఇష్టం
'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో హీరోయిన్ రెజీనా ఫుల్ ఖుషీగా ఉంది. 2011లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తాను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించినట్లు చెప్పింది. తమిళనాడుకు చెందిన తాను కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ షార్ట్‌ఫిల్మ్‌లో నటించినట్లు చెప్పింది. కడినాల్ మొదల్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయినా... తనకు తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు వచ్చియని తెలిపింది. సినీ నటిని అవుతానని తానెప్పుడూ ఊహించలేదంది. ఇక నటనాపరంగా అమల, పవన్ కల్యాణ్ అంటే అభిమానమని రెజీనా వెల్లడించింది. అమ్మానాన్న, ఇద్దరు చిన్నమ్మలు తన ఎదుగుదలకు ప్రోత్సహించారని, సినిమా అంటే ప్యాషన్ అని... చిత్రరంగాన్ని ఎన్నటికీ వదులుకోలేనని తెలిపింది. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలు తనకు ఇష్టమని, నటనకు సంబంధించి ఓ లక్ష్యమంటూ ఏమీ లేదని, ఎంత వరకూ వెళ్లగలిగితే అంతవరకూ నటిస్తూనే ఉంటానని తెలిపింది. -
సేంద్రీయ పోషకాహార కేంద్రం ప్రారంభం
-
సీఎస్‌తో అమల భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి అమల మంగళవారం ఉదయం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. సీఎస్‌ను కలిసి బయటకు వచ్చిన అమల విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. సీఎంను కలిశారా? సీఎస్‌ను కలిశారా? అని ప్రశ్నించగా సీఎస్‌ను కలిసినట్లు పేర్కొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి కారెక్కి వెళ్లిపోయారు. -
అమల క్లాప్, నాగ్ స్విచ్ఛాన్..అఖిల్ ఎంట్రీ..
హైదరాబాద్ : తెలుగు చిత్రసీమకు మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అఖిల్ సోలో హీరోగా ఎంట్రీ ఎప్పుడా అని గతకొద్ది రోజులుగా అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే . 'సిసింద్రీ'గా... ప్రేక్షకులకు పరిచయం అయిన అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అక్కినేని అమల క్లాప్ ఇవ్వగా...నాగార్జున స్విచ్ ఆన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం కేవలం కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఖిల్ బుధవారం ట్విట్ చేశాడు. హీరో నితిన్, తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి శ్రీ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే టైటన్ వాచెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అఖిల్ పెప్సికో కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైనా 'మౌంటైన్ డ్యూ' డ్రింక్ కోసం తాజాగా యాడ్ చేశాడు. దాంతో సినిమాల్లోకి రాకముందే అఖిల్ తన మార్క్ చూపించుకుంటున్నాడు. ఈ చిత్రంపై దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ...'అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సినిమా స్క్రిప్టును పూజలో ఉంచాం. ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. అభిమానులు కోరుకునే మాస్, మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అఖిల్‌లో మంచి నటుడు ఉన్నాడు' అని అన్నారు. -
చీపురు పట్టిన నాగార్జున
హైదరాబాద్: 'స్వచ్ఛ భారత్' కోసం హీరో అక్కినేని నాగార్జున చీపురు పట్టారు. పరిసరాలను శుభ్రం చేసేందుకు ఆయన నడుం బిగించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అమల, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, నాగసుశీలతో కలిసి అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నాగార్జున చెత్తాచెదారాన్ని ఉడ్చారు. చాముండేశ్వరినాథ్ కూడా చీపుపట్టారు. 'స్వచ్ఛ భారత్' లో పాల్గొనాలని రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీ.. టెన్నిస్ తార సానియా మిర్జా, తెలుగు సినీహీరో నాగార్జునతోపాటు మొత్తం తొమ్మిది మందిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే చీపురు పట్టడంలోనే సరిపెట్టకుండా 'స్వచ్ఛ భారత్' లో ప్రజలను చైతన్య పరిచేందుకు, ఎక్కువమందిని ఇందులో భాగస్వాములు చేసేందుకు నాగార్జున వెబ్సైట్ కూడా ప్రారంభించారు. నాగ్ ఫర్ స్వచ్ఛ భారత్ పేరుతో దీన్ని ఆవిష్కరించారు. పరిసరాల శుభ్రతకు నిరంతరం పాటు పడతామని ఈ సందర్భంగా నాగార్జున ప్రతిజ్ఞ చేశారు. -
జస్ట్ ఫర్ చేంజ్
అది సామాజిక స్పృహకు నిదర్శనం. పేద విద్యార్థులకు భరోసా కల్పించేందుకు సెలిబ్రిటీలు వచ్చి వివిధ రకాల రుచులను ఆస్వాదించారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి ‘ప్రాజెక్ట్ 511’ సంస్థ నిర్వహించిన ఫుడ్ ఫర్ చేంజ్‌లో సెలిబ్రిటీలు హల్చల్ చేశారు. విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఈ బ్లాక్ టై డిన్నర్‌కు ఎంట్రీ టికెట్ రూ.4 వేలు చెల్లించి మరీ తమ ఔదార్యాన్ని చాటారు. నోవాటెల్, ఐటీసీ, ఆవాస, రాడిసన్, మారియట్ హోటళ్ల చెఫ్‌లు తయారు చేసిన 16 రకాల వంటకాలను టేస్ట్ చేశారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఏషియన్ వంటకాలను టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ విందులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నటీమణులు సమంత, మంచు లక్ష్మి, రెజీనా, అమల, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
బుల్లితెరపై అమల
నాగార్జున తరువాత ఇప్పుడు ఆయన సతీమణి అమల వంతు వచ్చినట్లుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర వీక్షకులను నాగ్ ఆకట్టుకుంటూ ఉంటే, తాజాగా అమల ఓ టీవీ సీరియల్‌కు పచ్చ జెండా ఊపినట్లు కోడంబాకమ్ కబురు. తమిళంలో త్వరలో రానున్న ఓ టీవీ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. అందులో ఆమె ఓ డాక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అమల ఆ టీవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. సదరు టీవీ సిరీస్ పేరు -‘ఉయిర్మే’. ‘‘ఇప్పటికే రకరకాల బాధ్యతల్లో తలమునకలుగా ఉంటున్నాను కాబట్టి, ఎంతో ప్రత్యేకమైన పాత్ర అయితే కానీ సినిమాలో అయినా, సీరియల్లో అయినా నటించడానికి ఒప్పుకోవట్లేదు. ఈ స్క్రిప్టు నాకు బాగా నచ్చడంతో, నో చెప్పలేకపోయా’’ అని అమల వ్యాఖ్యానించారు. మొత్తం 12 మంది డాక్టర్ల జీవితాలు, వారి కుటుంబాలు, రోగుల చుట్టూ నడిచే ఈ టీవీ షో ఆగస్టులో ప్రసారం ప్రారంభం కానుంది. -
ఇక బుల్లితెరపై డాక్టర్ అమల!
అక్కినేని నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ బుల్లితెర మీదకు రంగ ప్రవేశం చేసి కొన్ని వారాలు గడిచిందో, లేదో గానీ.. అప్పుడే ఆయన భార్య అమల కూడా మళ్లీ మేకప్ వేసుకుని బుల్లితెర మీదకు వస్తున్నారు. భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ.. టీవీ సీరియళ్లలోకి రాబోతున్నారు. అయితే, నాగార్జున తెలుగులో షో చేస్తుంటే అమల మాత్రం తమిళ టీవీ సీరియల్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అమల.. తాను ఓ తమిళ సీరియల్లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. ''ఉయెర్మి అనే ఈ సీరియల్ షూటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇందులో నేను డాక్టర్ పాత్ర పోషిస్తున్నాను. ఇప్పటివరకు జీవితంలో చాలా పాత్రలు పోషించాను. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలు, టీవీ సీరియళ్లలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీరియల్ విషయానికే వస్తే, దీని స్క్రిప్టు చాలా అద్భుతంగా ఉంది. ఈ పాత్ర గురించి స్క్రిప్టు తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు కాదని ఏమాత్రం చెప్పలేకపోయాను. మొత్తం కథ అంతా 12 మంది వైద్యులు, వాళ్ల జీవితాలు, కుటుంబాలు, రోగుల చుట్టూ తిరుగుతుంటుంది. బహుశా ఆగస్టు రెండోవారం తర్వాత ఇది ప్రసారం కావచ్చు'' అని అమల తెలిపారు. -
మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్
-
మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్
తిరుమల : సినీనటుడు నాగార్జున, ఆయన సతీమణి అమల శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం నాగార్జున విలేకర్లతో మాట్లాడుతూ 'మనం' చిత్రం విజయం సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చానట్లు తెలిపారు. మనం సినిమా తరువాత ఇంకా ఏ సినిమాకు సంతకం చేయలేదని.. మంచి కధ వస్తే అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు. మరో హీరో శ్రీకాంత్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
సేవలోనూ స్టార్లే!
అద్దాల మేడలు, పొడవాటి కార్లు, చిటికేస్తే పనులు చేసిపెట్టడానికి చుట్టూ మనుషులు...చుక్కలనంటే పారితోషికం తీసుకునే చక్కని కథానాయికల జీవితం ఇలా ఉంటుందని చాలామంది ఊహిస్తారు. ఈ సౌకర్యాలన్నీ అనుభవించే స్థాయికి చేరడానికి వాళ్లు పడే కష్టాలు వాళ్లకి ఉంటాయి. ఆ సంగతి వదిలేస్తే.. ఆ దేవుడు తమకు ఇంత మంచి జీవితాన్నిచ్చాడు కాబట్టి, వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తపనపడే తారలు చాలామంది ఉన్నారు. సినిమాల్లో యాక్ట్ చేయడం మాత్రమే కాదు.. షాప్ ఓపెనింగ్స్, యాడ్స్ ఇలా నిమిషాలు లెక్కపెట్టి వీళ్లు పారితోషికం తీసుకుంటున్నారు. అంత ఖరీదైన నిమిషాలను ఎంతో దారాళంగా సేవా కార్యక్రమాలకు ఖర్చుపెట్టి, తమ అంతః సౌందర్యాన్ని చాటుకుంటున్నారు. ‘మహిళా దినోత్సవ’ వేళ ఆ ‘రియల్ హీరోయిన్స్’ గురించి తెలుసుకుందాం... సగం జీవితంసేవలకే... అమల జీవితం వడ్డించిన విస్తరే అనాలి. కథానాయికగా చక్కగానే రాణించారు. వ్యక్తిగత జీవితం ఇంకా సూపర్బ్. మామూలుగా అయితే, ఆ జీవితాన్ని హాయిగా ఆస్వాదించేస్తారు. కానీ, అమల అలా కాదు. తనకెలాగూ మంచి జీవితం లభించింది కాబట్టి, సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. అది కూడా మూగ జీవాలకు. హైదరాబాద్‌లో బ్లూ క్రాస్ సంస్థ ఆరంభించి, సగం జీవితాన్ని దానికే కేటాయించేశారామె. అది మాత్రమే కాకుండా ‘వేగన్’గా మారిపోయారు. జంతు ఉత్పత్తులను కాకుండా కేవలం శాకాహారం మాత్రమే తీసుకునేవారిని వేగన్ అంటారు. దీన్నిబట్టి అమల అంకితభావం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు బ్లూ క్రాస్ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు మహిళలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు అమల. చిన్ననాటి ప్రేరణతో... అది న్యూఢిల్లీలోని డీఎస్పీ స్కూల్. శ్రీయ చదువుకున్నది అక్కడే. ఆ స్కూల్ ఎదురుగా ఓ అంధుల పాఠశాల ఉంది. వీలు కుదిరినప్పుడల్లా అక్కడికెళ్లడం, ఆ పాఠశాలలో ఉన్నవారిని చూడటం శ్రీయకు అలవాటు. పెద్దయిన తర్వాత వాళ్ల కోసం ఏమైనా చేయాలనుకోవడం మాత్రమే కాదు.. ఆచరణలో పెట్టారామె. ‘శ్రీ’ పేరుతో ఓ స్పా ఆరంభించారు. బాడీ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ లాంటి సేవలు లభిస్తాయి. అక్కడ పనిచేస్తున్నవాళ్లల్లో కొంతమంది పూర్తిగా అంధులు కాగా, కొంతమందికి కొంచెం చూపు ఉంటుంది. వాళ్లకి ఏదైనా ఉపాధి కల్పించాలనే ఆకాంక్షతో ఈ స్పా పెట్టానని శ్రీయ తెలిపారు. ఈ స్పాలో వీరు అందిస్తున్న సేవలు అద్భుతం అని ముంబయ్ టాక్. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా... సమంత కథానాయిక అయ్యి నాలుగేళ్లయ్యింది. ప్రస్తుతం తను ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్. తల్చుకుంటే కేలండర్లో ఒక్క డేట్ కూడా మిగలకుండా సినిమాలు, యాడ్స్, షాప్ ఓపెనింగ్స్ కమిట్ అయిపోవచ్చు. కానీ, సమంత అలా చేయలేదు. వాటిని తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారు. అందుకే, ‘ప్రత్యూష ఫౌండేషన్’ ప్రారంభించారు. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం వర్క్ చేస్తున్నారామె. చిన్న స్థాయిలో మొదలుపెట్టి, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయా లన్నది సమంత ఆకాంక్ష. 23 మంది పిల్లలకు సహాయం! హన్సిక వయసు 23. ఆమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్యా ఇరవైమూడే. ఈ పిల్లల చదువు, సంరక్షణకయ్యే ఖర్చుని హన్సికే భరిస్తారు. అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదని, అందుకే పిల్లలను చదివిస్తున్నానని ఆమె ఓ సందర్భంలో తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు హన్సిక. ఇంకా మూగజీవాల సంరక్షణ కోసం త్రిష పాటుపడుతున్నారు. బాలీవుడ్లో కత్రినా కైఫ్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహిస్తున్న ‘బీయింగ్ హ్యూమన్’ సంస్థకు ఇటీవల 5 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారామె. ప్రతి నెలా కొంతమంది వృద్ధులకు వెయ్యి రూపాయలు ఇస్తుంటారట ఏక్తాకపూర్. ఇంకా ఐశ్వర్యా రాయ్, శిల్పాశెట్టి, దియా మీర్జా తదితర తారలు అడపా దడపా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.