Oke Oka Jeevitham Teaser Launch: Sharwanand Interesting Comments On Oke Oka Jeevitham Movie - Sakshi
Sakshi News home page

నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇది

Dec 30 2021 5:13 AM | Updated on Dec 30 2021 9:45 AM

Oke Oka Jeevitham Teaser Launch  - Sakshi

శర్వానంద్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా అమల ప్రధాన పాత్రలో శ్రీ కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కథ చెప్పగానే అమలగారు చేస్తున్నారా? అని అడిగాను. ఎందుకంటే ఈ సినిమాకు ఆత్మ అమలగారి పాత్ర. ఈ సినిమాలోని అమ్మ పాటను ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు 9 నెలలు రాశారు. ఆయన మన మధ్య లేరు కానీ పాటల రూపంలో జీవించే ఉంటారు.

‘ఒకే ఒక జీవితం’ నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా’’ అన్నారు శర్వానంద్‌. ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు ఇందులోని అమ్మ పాత్రను నేనే చేయాలనుకున్నాను’’ అన్నారు అమల. ‘‘ముందు ఓ కథ అనుకున్నాను. కానీ అందులో ఎమోషన్‌ కనిపించలేదు. దురదృష్టవశాత్తు అదే సమయంలో మా అమ్మగారు చనిపోయారు. అమ్మను మళ్లీ చూడాలనిపించి రాసుకున్న ఒక సీన్‌ తర్వాత ‘ఒకే ఒక జీవితం’గా మారింది. శర్వా పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. శర్వా కచ్చితంగా ఏడిపిస్తాడు’’ అన్నారు శ్రీ కార్తీక్‌. ‘‘ఈ సినిమాను ఓ కుటుంబంలా పూర్తి చేశాం’’ అన్నారు ఎస్‌ఆర్‌ ప్రభు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement