‘మంచిగా కనపడేవాళ్లందరూ మంచివాళ్లు కాదురా... ఫర్ ఎగ్జాంపుల్ నేను’ అంటూ మొదలవుతుంది ‘మనమే..’ సినిమా టీజర్. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్లేబాయ్ మనస్తత్వం ఉండే అబ్బాయి, బాధ్యతగా జీవించాలనుకునే ఓ అమ్మాయి జీవితాల్లోకి విక్రమాదిత్య అనే ఓ పిల్లవాడు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి?
అన్నదే ఈ చిత్రం కథాంశమన్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘వాడప్పట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలేం చేశావ్... (కృతీ శెట్టి), ‘తాగటానికెళ్లొచ్చా..’ (శర్వానంద్), ‘ఇల్లు చూసుకోవడం రాదు... పిల్లవాడిని చూసుకోవడం రాదు... పిచ్చిపట్టిందా నీకు...’ (కృతీ శెట్టి), ‘ఇద్దరిలో ఒకళ్లు ఏడ్వండి’ (శర్వానంద్) వంటి సంభాషణలు విడుదలైన టీజర్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల.
Comments
Please login to add a commentAdd a comment