జస్ట్ ఫర్ చేంజ్‌ | Celebrities given support to Poor students | Sakshi
Sakshi News home page

జస్ట్ ఫర్ చేంజ్‌

Published Mon, Oct 6 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

జస్ట్ ఫర్ చేంజ్‌

జస్ట్ ఫర్ చేంజ్‌

అది సామాజిక స్పృహకు నిదర్శనం. పేద విద్యార్థులకు భరోసా కల్పించేందుకు సెలిబ్రిటీలు వచ్చి వివిధ రకాల రుచులను ఆస్వాదించారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి ‘ప్రాజెక్ట్ 511’ సంస్థ నిర్వహించిన ఫుడ్ ఫర్ చేంజ్‌లో సెలిబ్రిటీలు హల్‌చల్ చేశారు. విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఈ బ్లాక్ టై డిన్నర్‌కు ఎంట్రీ టికెట్ రూ.4 వేలు చెల్లించి మరీ తమ ఔదార్యాన్ని చాటారు. నోవాటెల్, ఐటీసీ, ఆవాస, రాడిసన్, మారియట్ హోటళ్ల చెఫ్‌లు తయారు చేసిన 16 రకాల వంటకాలను టేస్ట్ చేశారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఏషియన్ వంటకాలను టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ విందులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నటీమణులు సమంత, మంచు లక్ష్మి, రెజీనా, అమల, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement