బిగ్ ఎఫ్‌ఎంలో మంచు లక్ష్మి సందడి | Big FM hubbub in the Manchu Lakshmi | Sakshi
Sakshi News home page

బిగ్ ఎఫ్‌ఎంలో మంచు లక్ష్మి సందడి

Published Fri, Apr 10 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

బిగ్ ఎఫ్‌ఎంలో మంచు లక్ష్మి సందడి

బిగ్ ఎఫ్‌ఎంలో మంచు లక్ష్మి సందడి

సనత్‌నగర్: బేగంపేట్‌లోని బిగ్ ఎఫ్‌ఎం స్టూడియోలో గురువారం సినీనటి, నిర్మాత మంచు లక్ష్మి సందడి చేశారు. తాను నిర్మాత, నటిగా తెరకెక్కుతున్న ‘దొంగాట’ చిత్ర విశేషాలను నటుడు అడవి శేష్‌తో కలిసి ఆమె శ్రోతలతో పంచుకున్నారు. ఈ చిత్రంలో లక్ష్మి స్వరపరిచిన‘ ఏందిరో మీ అబ్బాయిల గోల’ పాట పాడి శ్రోతలను అలరించారు.

ఆమె మాట్లాడుతూ తాను పాడిన పాట ఆదరణ పొందడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి మోహన్‌బాబు కూడా మెచ్చుకోవడమే గాక, తనను పాడేలా ప్రోత్సహించిన గాయకుడు కుంచె రఘుకు ఫోన్ చేసి ధన్యవాదాలు కూడా చెప్పారని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement