
మంచు కుటుంబంలో మనోజ్, విష్ణు.. హైదరాబాద్ లో ఉంటున్నారు. కానీ మంచు లక్ష‍్మీ మాత్రం ముంబైలో ఉంటోంది. రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ గొడవల్లోనూ ఈమె ఎక్కడా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇన్ స్టాలో మనోజ్ కూతురు గురించి లక్ష‍్మీ క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది.
మనోజ్ కూతురిని తెగ ముద్దు చేసేస్తున్న మంచు లక్ష‍్మీ.. చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమనంతా బయటపెట్టింది. 'నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. పని కూడా ఉంది. కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్.'
(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)
'మనిద్దరి మధ్య మంచి అనుబంధముంది. మాటల్లో అది చెప్పలేను. నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని. నీ తొలి పుట్టినరోజున చాలా చెప్పాలని ఉంది. కానీ నువ్వు ఆనందంగా ఎదగాలి. నీ ప్రపంచం అందంగా ఉండాలి. నువ్వు మా ఇంటి రాణివి. నిన్ను తర్వలో కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా (నవ్వుతూ). ఈ డైమండ్ ని నాకు ఇచ్చినందుకు మనోజ్-మౌనికకు థ్యాంక్యూ' అని మంచు లక్ష‍్మీ రాసుకొచ్చింది.
మనోజ్, అతడి కూతురు దేవసేనతో మంచు లక్ష‍్మీ బాండింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. కానీ కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు.. ఇప్పుడు మనోజ్ కూతురు గురించి లక్ష‍్మీ పోస్ట్ పెట్టడం చూస్తుంటే మోహన్ బాబు-విష్ణు ఒకవైపు.. మనోజ్-లక్ష‍్మీ ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి)