రామంకు శ్రీకారం | Venu Donepudi Announces Pan-India film titled Ramam | Sakshi
Sakshi News home page

రామంకు శ్రీకారం

Published Mon, Apr 7 2025 3:28 AM | Last Updated on Mon, Apr 7 2025 3:28 AM

Venu Donepudi Announces Pan-India film titled Ramam

శ్రీరామ నవమి సందర్భంగా ‘రామం’(Ramam) అనే పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించారు చిత్రాలయం స్టూడియోస్‌ అధినేత వేణు దోనేపూడి(Venu Donepudi). ‘ది రైజ్‌ ఆఫ్‌ అకిరా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. లోకమాన్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రనిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడుస్తూ... ఆయన చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అని చాటి చెప్పే ఓ గొప్ప యోధుడికి సంబంధించిన కథాంశంతో ఈ మూవీని రూపొందించనున్నాం. 

నేటి కాలానికి అలనాటి రామరాజ్యాన్ని కనెక్ట్‌ చేస్తూ, ఇప్పటివరకు రానటువంటి వైవిధ్యమైన కథతో ‘రామం’ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఓ యువ తెలుగు నటుడు హీరోగా నటిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం. దేశవ్యాప్త నటీనటులు, సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ సాంకేతిక విలువలతో, అత్యుత్తమ నిర్మాణ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం’’ అని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement