విశ్వం అన్ని వర్గాలను అలరిస్తుంది: నిర్మాత కామెంట్స్ | Gopichand Latest Movie Viswam Producer Interesting Comments | Sakshi
Sakshi News home page

Viswam Movie: అలాంటి చిత్రాలు నిర్మించడమే లక్ష‍్యం: నిర్మాత

Oct 10 2024 7:43 PM | Updated on Oct 10 2024 8:03 PM

Gopichand Latest Movie Viswam Producer Interesting Comments

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 11న విడుదలవుతోన్న ఈ మూవీ విశేషాలను చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మీడియాతో పంచుకున్నారు.

నిర్మాత వేణు మాట్లాడుతూ.. విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి కమర్షియల్ అంశాలతో అందరినీ అలరిస్తోంది. శ్రీను వైట్ల స్క్రిప్ట్‌, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కథనాన్ని శ్రీను వైట్ల తన స్టైల్‌లో రూపొందించారని అన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. ఇటలీలోని మిలాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్. ఇందులో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అతని కామెడీ టైమింగ్,యాక్షన్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అతని కెరీర్‌లోనే విశ్వం అద్భుతంగా ఉంటుంది. శ్రీను వైట్ల, గోపీచంద్‌లతో కలిసి ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నా. సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే విశ్వం సినిమాను నిర్మించాను. చిత్రాలయం స్టూడియోలో అద్భుతమైన కథలు, సంగీతంతో ఆకట్టుకునే చిత్రాలను నిర్మించడం నా లక్ష్యం అని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement