Venu
-
నిర్వర్ణం
‘ఒకరోజు నలుపు తెలుపు ప్రేమలో పడింది. కానీ ఈ తెలుపు ఆ నలుపుని తనూ ‘తెలుపు’ అయి రమ్మని, అలా మారితేనే ప్రేమిస్తానంటుంది. పాపం ‘నలుపు’! తను తెలుపుగా మారటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. పాల మీగడలు పాత్రలకొద్దీ తింటాడు. ఆకాశాన తెలతెల్లని మబ్బుతరగలపై రోజూ పొర్లుతాడు. సాగర కెరటాల నురగలపై స్నానాలు చేస్తాడు. ధవళ వస్త్రాలెన్నో చుట్టుకుంటాడు. తెల్లని పూలమాలలు లక్షలాదిగా ధరిస్తాడు. హంసలు, పావురాలు వంటి ఎన్నో తెలుపు రంగు పిట్టల రెక్కలను ఎరువు తెచ్చుకుని; ఎగురుతూ, దుముకుతూ క్షీరసాగరాలలో మునకలేస్తాడు. గుడులూ గోపురాలపైన వెలిగే శ్వేతకాంతుల దివ్వెల వెలుగులను తనలోకి స్వీకరిస్తాడు. నింగిచుక్కల తళుకులు తెచ్చుకుని దేహమంతా పులుముకుంటాడు. హేమంత వేళల హిమాద్రుల మంచుమంచెలపై ఎన్నో రాత్రులు శయనిస్తాడు. ఇన్ని చేసినా తీరా నలుపు– తెలుపును సమీపించిన ప్రతిసారీ నలుపుగానే ఉంటున్నాడు. ‘ఎప్పటికైనా నలుపు నలుపే గదా!’ అని దుఃఖిస్తున్నాడు. అలా వేల వసంతాలు వృథా అయిపోవలసిందేనా అని నలుపు ఎంతో బెంగపెట్టుకున్నాడు. చివరికి ఓ క్షణంలో జాలిపడిన తెలుపు నలుపుని దగ్గరకు తీసుకుంటుంది. ఒకే ఒక బిగి కౌగిలి! అంతే! ఆ రాత్రి నక్షత్రాలు నీలాకాశంతో ‘రహస్యంగా’ రమించాయట! నలుపు ప్రాణులన్నీ తెలుపు ప్రాణులను పెనవేసుకున్నాయి. రేయీ పగలూ కలిసి ఒకే మధుపాత్ర నుండి రతిఫలరసాలు తప్పతాగాయి. cవెలుగుల స్పర్శతో ఆ క్షణాన చీకటి ఛాయలన్నీ తీయని స్ఖలనాలు పొందాయట!ఉదయం విరిసింది. వేకువనే లేచి, తెల్లని ఉల్కలను రాలుస్తున్న తన పైటకొంగును సర్దుకుని లేచి వెళ్ళిపోబోతున్న ‘తెలుపు’ చేతిని గట్టిగా పట్టుకుని లాగి ‘అదేంటి? నన్నెందుకు విడిచి పోతున్నావు?’ అని నిలదీస్తాడు నలుపు. అతని బేలతనం చూసి నవ్వుకున్న తెలుపు ‘ఈ లోకం ఏనాడో అనాదిగా నలుపు– తెలుపులుగా విడిపోయిందోయ్! ఎప్పుడైనా, ఎక్కడైనా వాటి మధ్య ఉండే పలుచని విభజన రేఖలు ఒకవేళ ఎవరైనా శాశ్వతంగా చెరపగలిగితేనే, చీకటి వెలుగుల సంగమాల సంజెపొద్దుల్లోనే మనకు శాశ్వత కలయిక సాధ్యం! అప్పటివరకు సెలవా మరీ!’ అంటూ శ్వేత వలయాలుగా పైకి లేచి పరిసరంలోని ప్రతి తెల్లని జీవ నిర్జీవ పదార్థాలలోకి ఇంకిపోయి అదృశ్యమైపోయింది తెలుపు! నలుపు ఎంతో నిస్పృహతో తన కన్నతల్లి అయిన నిశీధి ఒడిలో తలవాల్చి పడుకొని విశ్వంలో కృష్ణబిలాలకు ప్రభాత వేలుగురేఖల కుంచెలతో తెలుపు రంగులద్దుతున్నట్లుగా తెల్లవారు ఝామున కలలు కంటూ ఇంకా తన ప్రేయసి ‘తెలుపు’ తలపులలోనే బతుకెళ్ళదీస్తున్నాడు. యుగాల నిరీక్షణ అది. అయినా నలుపు నలుపే, తెలుపు తెలుపే గదా! వాటి సంగమం అసాధ్యం. సాధ్యమైనా అది క్షణ భంగురమే కదా!’‘ఇప్పుడది ఎందుకే అంత పెద్దగా చదువుతున్నావు?’‘మొత్తం మీద భలే లౌక్యంగా రాశావే మామ్మా, సో క్రాఫ్టీ!’‘తమరి పొగడ్తలేం నాకవసరం లేదులే!’‘సర్లేవే! ఇంతకీ ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన మహానుభావులెవరో? గట్టిగానే లాబీయింగ్ చేసినట్టున్నావు. మూడొందల పేజీల ముచ్చటైన అబద్ధాలు– అబ్బో! ‘కాల–శ్వేత సంగమం’ అంటూ తమరి ఈ మహావచన కావ్యానికి ఆ టైటిలొకటి! అంతా వొట్టిదే!’’‘నోర్ముయ్! వొట్టిదో గట్టిదో మరి నువ్వూ ఇలా రాయవే చేతనైతే!’‘రాస్తాను.. రాస్తాను.. కానీ ఇలా కాదు!’‘అబ్బో! మరెలా?’‘నే రాస్తే నీలా కాదులే, రాసిందే జీవిస్తా! జీవించేదే రాస్తా!’‘రాసేది అంతా చూసేదేనే ఫూల్! చేసేది కాదు!’‘ఏం? చేసేది రాస్తే? ఒకట్రెండు పుస్తకాల్లోనైనా తమరు చేసింది రాస్తే బాగుండేది!’‘గమ్మునుండవే పిల్లా! భయమెరుగని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!’‘నువ్వే గమ్మునుండవే! వృద్ధనారీ పతివ్రతా! నాకూ వచ్చు సామెతలు’‘ఎంతగా బరితెగిస్తున్నారే మీ తరం!’‘మీ తరాలేమన్నా తక్కువ తిన్నారా ఏంటి?’‘ఏం తెలుసే మా గురించి నీకు కోణంగిదానా?’‘క్లబ్బులూ పబ్బులూ చాలా ఉండేవిగా మీ అభ్యుదయ రైటర్స్ గ్యాంగులకు! ఏ అర్ధరాత్రో, అపరాత్రో గూళ్ళకు చేరుకునేవాళ్ళటగా!’‘ఏయ్.. నోర్మూయ్!’‘హేయ్.. నువ్వే మూసుకో!’‘నువ్వా కులం తక్కువోడితో కులికొచ్చినట్లు కాదులే!’‘ఐతే కులం ఎక్కువైనోళ్లతో గెలుక్కోవచ్చన్న మాట– మీలా!’పొగలు సెగలు కక్కుతూ బామ్మ చెప్పు తీసుకొని కొట్టటానికన్నట్లు చేయి పైకి లేపింది. మనుమరాలు వేగంగా కదిలి, బామ్మ చేతినలాగే ఒడిసి పట్టుకొని ఆమెను విసురుగా నెట్టేసింది. గోడకు కొబ్బరికాయలా తగిలిన బామ్మ తల పగిలి కిందికి జారుతూ ఉంటే ఆ గోడపై సన్నగా, బారుగా ఓ నెత్తురు చిత్తరువును అద్దినట్లయింది. అన్ ఫోర్స్డ్ ఎర్రర్ అయినా, ఆవేశపు అనర్థం అనుకున్నా, మొత్తం మీద జరిగింది వర్ధమాన రచయిత్రి చేతిలో వెటరన్ కవయిత్రి దుర్మరణం.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సీనియర్ కవయిత్రి, కథా రచయిత్రి, మూడుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు తీసుకున్న శ్రీమతి సత్యవేణమ్మ హత్య. ఆవేశపరురాలైన ఆమె మనవరాలు విశ్వంభరనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అయితే, ఇంట్లో వాళ్లు తన కులాంతర ప్రేమ వివాహానికి అంగీకరించక హింసించటం వల్లనే అసలిదంతా ఒక్క క్షణంలో ఆవేశకావేశాలు కమ్మి జరిగిపోయిందని హత్యకు పాల్పడ్డ మనవరాలు చెబుతోంది. అతి ఆవేశపరురాలు అయిన ఆ మనవరాలిని సత్యవేణమ్మగారి గదిలో కాకుండా వేరే గదిలో నిర్బంధించి వున్నట్లయితే మహారచయిత్రి ప్రాణాలు నిలిచి ఉండేవని పోలీసులు, నేర నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ ఈ హత్యను ఖండిస్తున్నారు. మన దేశంలో యువతలో ముఖ్యంగా యువతుల్లో నానాటికీ చెలరేగుతున్న హింసా ప్రవృత్తిని చర్చించటానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు జాయినవుతున్నారు ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు, గొప్ప మహిళా అభ్యుదయవాది, మహావక్త శ్రీమతి మౌనమ్మగారు, అలాగే నేషనల్ మెన్స్ రైట్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ శ్రీ వాగేశ్వర్రావుగారు. చర్చకు ముందుగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్!చాలారోజులపాటు ఆ ఒక్క వార్త నాన్–వెజ్ చానళ్ళ నోటికి నల్లిబొక్కలా, వెజిటేరియన్ చానళ్ళకు ఆవకాయ ముద్దల్లా రుచిగా నలిగింది.∙∙ ‘ఒకరోజు తెలుపు నలుపుని ప్రేమిస్తుంది. నలుపు కూడా తెలుపుని ఇష్టపడతాడు. నలుపు తామిద్దరం కలవటం లోకానికి ఇష్టముండదని, ఒకవేళ కలిసినా లోకం సహించలేక తమను అంతం చేస్తుందని, అందుకే నలుపు తన ప్రియురాలు తెలుపుని తనలా ‘నలుపు’గా రూపాంతరం చెంది తిరిగి రమ్మని కోరుకుంటాడు.పాపం ఆ తెలుపు తాను నలుపు కావటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రకృతిలోని కాటుక వర్ణాలన్నీ సేవిస్తుంది. అగ్గిని తొక్కుతుంది. బుగ్గిని బుక్కుతుంది. నిశరాత్రుల గుండెల్లోని తమస్సునంతా తాగుతుంది. కారు మేఘాలను, కాకులూ కోయిలల రెక్కలను ఎరువు తెచ్చుకుని ఎగురుతుంది. నీలి సంద్రపు గర్భాల అంధకారపు నీడలతో తానమాడుతుంది. కృష్ణపక్షపు నీలిమనంతా గంధలేపనాలుగా పులుముకుంటుంది. పాతాళపు ఛాయలు భుజిస్తుంది. ధైర్యం చేసి ఓ అడుగు ముందుకెళ్ళి భీకర రక్తమాంసాలు పారే వైతరణీ నదిలో యమకింకరుల చేతుల్లో గాలాలకు దొరికిన చేపల్లా వేలాడుతూ, భీకర ఘోషల ప్రతిధ్వనులతో నిండిన శాపగ్రస్థులైన వారి ఆత్మల్లో దాగి ఉన్న పశ్చాత్తాపపు చీకటిని సేవించి, పున్నమి జోత్స్నల వెన్నెల రేఖ ఒక్కటి కూడా తనపై పడకుండా జాగ్రత్తగా ఆకాశ వీథులు దాటి బయలుదేరింది. అలా తెలుపు తాను నలుపు రంగు ముగ్ధమనోహరియై సందెపొద్దుల్లో తన ప్రియుని బిగికౌగిళ్లలో కరిగిపోవాలని ఆశగా ఎగిరొస్తుంటే, తన సొంత తెలుపుజాతి వాళ్లే దారుణంగా దాడిచేసి, ‘ఏమే నీచపుదానా! మన జాతి వర్ణాన్నే మార్చాలని చూస్తావే? హంసలా పుట్టి కాకిలా మారటమేంటే భ్రష్టురాలా!’ అంటూ నలుపుగా మారిన తెలుపుపై చెప్పలేని అశ్లీల భాషను ఉపయోగించారు! ఆ నలుపుగా మారిన తెలుపుని పాతకాలంనాటి పెద్ద పెద్ద గంగాళాలలో పురాతన వర్ణ ద్రావకాలలో ముంచి సంప్రోక్షణలు, శుద్ధి క్రియలూ చేసి దానిని మళ్లీ తెలుపురంగులోకి మార్చి వదిలేశారు! అయ్యో పాపం తెలుపు! గుండెలు పగిలే దుఃఖంతో విలపిస్తూ, తను మళ్లీ నలుపు దగ్గరకు తిరిగొచ్చింది. విషయమంతా గ్రహించిన నలుపు తన ప్రేయసి తెలుపుని దగ్గరకు తీసుకొని విశ్వమంత ప్రేమను పంచి శాశ్వత సంగమంతో తనలో కలిపేసుకుంటుంది. ఆశ్చర్యంగా అనంతర యుగాలలో ఈ నలుపు–తెలుపులు రెండూ కూడా క్రమంగా తమ తమ రంగుల్ని విడిచి ‘నిర్వర్ణం’ కాసాగాయి.’‘ఎందుకమ్మా ఆ ఇంట్రోని మళ్ళీ మళ్ళీ బిగ్గరగా చదువుతున్నావు?’‘అబ్బ బామ్మా! ఇంత లోతుగా రాశావంటే నువ్వు ప్రపంచాన్ని ఎంత బాగా చూసి ఉంటావు!’‘నే చూసింది మాత్రమే రాయలేదే!’‘మరి?’‘నేను చేసింది, నాకు నే చేసుకుంది, లోకం నాకు చేసిందీ కూడా!’‘నిర్వర్ణం– ద కలర్ ఈజ్ డెడ్’– ‘అసలీ పుస్తకం టైటిలే అమోఘం బామ్మా! ఈ పుస్తకానికి ఒకే ఏడాది సాహిత్య అకాడమీ, సరస్వతీ సమ్మాన్ అవార్డులు, బుకర్ ప్రైజ్ రావటం రియల్లీ ఆసమ్! యు మేడ్ హిస్టరీ, గ్రాండీ!’‘ఈ అవార్డులు రివార్డుల కన్నా నా మనవరాలులాంటి ఎంతోమంది యూత్ నా పుస్తకాలు చదివి, స్పందించటం అతి గొప్ప ప్రశంస అమ్మా! రోజూ ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజ్‌లో..’ అంటూ మనవరాలి నుదుటిపై ఓ తియ్యటి ముద్దిచ్చింది విశ్వంభర. ‘గ్రేట్ బామ్మా! కీప్ రాకింగ్!’‘షాకింగ్ టూ బేబీ!’ఇద్దరూ ఒక్కసారే ఫెళ్లుమని నవ్వారు.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సంచలనాత్మక, వివాదాస్పద రచయిత్రి శ్రీమతి విశ్వంభరకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం, ఈ ఉదయం ఆమెకు అవార్డు ప్రకటించిన భారతీయ జ్ఞానపీఠ్ కమిటీ. ఒక భారతీయ మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను, బాహాటంగా రాయగలగడం మహా సాహసం అని అవార్డు కమిటీ సభ్యులు విశ్వంభరను ప్రశంసించారు. చిన్ననాడు తను ఈడుకొస్తున్న రోజుల్లో తన మేనమామ వెంటబడి ఎలా హింసించాడో, తాను కులాంతర ప్రేమ వివాహం చేసుకుంటానంటే తన తండ్రి తనను ఎలా గృహనిర్బంధంలో ఉంచాడో, ఆ సమయంలో తనను బంధించిన గదిలో మేనబావలు నీచంగా, నిర్లజ్జగా ‘ఆ జాతి తక్కువ వాడితో కాకపోతే మనలోనే ఎవడో వరసైనవాడిని తగులుకోరాదటే!’అంటూ తనపై తోడేళ్లలా ఆ రోజు ఎలా దాడికి సిద్ధమయ్యారో– ఇవన్నీ తెలిసి కూడా ఖండించని తన బామ్మ, అభ్యుదయ రచయిత్రి అయిన శ్రీమతి సత్యవేణమ్మతో ఒక సందర్భంలో మాటా మాటా పెరిగి చివరికి వారిరువురి మధ్యన జరిగిన చిన్న పెనుగులాటలో సీనియర్ రైటర్ అయిన ఆమె దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవటం ఎలా జరిగిందో; అదంతా అన్ ఫోర్స్డ్ ఎర్రర్లా జరిగిందని తాను పశ్చాత్తాపంతో ఎంత మొత్తుకున్నా ఎవరూ అర్థం చేసుకోలేదని; చివరికి తాను జైలుపాలైనప్పుడు సైతం జైలు అధికారుల్లో ఒకడు దారుణంగా భయపెట్టి తనను ఎలా శారీరకంగా దోచుకున్నాడో; ఇదంతా తెలిసీ తను విడుదలైన తర్వాత తనను స్వీకరించి వివాహం చేసుకున్న భర్తతో కూడా సంసార జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు అనుభవించిందో; భర్త మరణం తర్వాత ఒంటరిదై ఒక తోటి నవలా రచయితతో తను స్నేహం చేసేటప్పుడు ఇంటా బయటా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నదో– అలాంటి ఎన్నో జీవితానుభవాల్ని ధైర్యంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా రాసినందుకు శ్రీమతి విశ్వంభర ఎట్టి అవార్డుకైనా అర్హురాలేనని అభ్యుదయవాదులు అంటున్నారు. అయితే మాజీ నేరస్థురాలు, ముప్పయ్యేళ్లుగా తన రచనలతో హద్దుమీరిన స్వేచ్ఛను, తిరుగుబాటు ధోరణిని, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో ఆడవాళ్ళను తప్పుదారి పట్టిస్తూ వచ్చిన ఈ రచయిత్రికి ఇంత అత్యున్నత సాహితీ పురస్కారం ఇవ్వటం పట్ల అటు పురుషుల ఐక్య సంఘాల జేఏసీనే గాకుండా, ఇటు కొన్ని మహిళా సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ఈ అవార్డు ప్రకటన అంశం గురించి చర్చించటానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవిపండితులు, సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీ అవాకుల అప్పారావుగారు, ప్రముఖ అభ్యుదయవాది, ఎమ్మెల్సీ అయిన శ్రీమతి చెవాకుల సక్కుబాయిగారు– ఇంకా.................గారు, ................. గారు కూడా.’మొదటి వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’రెండవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’మూడవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’‘ఈనాటి ఈ బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా.... లైవ్ డిబేట్ ఇంతటితో ముగిసింది. నిత్యం ‘తాజా లొల్లి’ కోసం మన సత్యం‘బాజా’ చానల్‌ను వీక్షిస్తూనే ఉండండి– వీక్షిస్తూనే ఉండండి– తర్వాతి కార్యక్రమం ‘మేం వాగుతునే ఉంటం– మేం వాగుతునే ఉంటం’‘స్టే ట్యూన్డ్!’ -
తండ్రీకొడుకులను కబళించిన లారీ
దుబ్బాక : ఒడి బియ్యం పోసుకునేందుకు సంతోషంగా అత్తగారింటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్ కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌కు చెందిన చిట్యాల వేణు(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం వేణు ఇద్దరు కుమారులు శివ (15), విష్ణును స్కూటీపై ఎక్కించుకొని ఒడి బియ్యం పోసుకునేందుకు అత్తగారి గ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధరిపల్లికి బయలుదేరాడు. దౌల్తాబాద్ మండలంలోని చెట్టనర్సంపల్లి బైపాస్ రోడ్డు వద్దకు రాగానే గజ్వేల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి వేణు, పెద్ద కుమారుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న కుమారుడు విష్ణు గాయాలతో బయటపడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు రోడ్డుపై గుర్తు పట్టరాకుండా పడిపోయాయి. మృతుడు శివ తిర్మలాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ముత్యంరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
USA: ‘వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ స్థాయి పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది. నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్‌లో క్రికెట్‌ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్‌కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు. ‘టి20 వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్లతో అమెరికా తలపడిన మ్యాచ్‌లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్‌పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు. 1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్‌కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్‌లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్‌లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది. ‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్‌లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్‌పై బాగా దృష్టి పెట్టాయి. అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్‌లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్‌లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు. అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్‌లోని రంజీ టీమ్‌లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు. ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్‌షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్సీఏలో డైరెక్టర్‌గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్‌కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు. -
బలగం వేణు సినిమా లో ఎల్లమ్మ గా సాయి పల్లవి
-
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అన్నీ నిజాలే చెప్తాను.. అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు ? క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలా..’అని సుందిళ్ల బరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) గంగం వేణుబాబుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా మంగళవారం 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏ డిజైన్, డ్రాయింగ్స్ ఉన్నాయా? ..అని విచారణ ప్రారంభంలో ఈఈ గంగం వేణుబాబును కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌లో నిర్మించిన ఇతర బ్లాకుల డిజైన్లు, డ్రాయింగ్స్ ఆధారంగా బ్లాక్–2ఏను నిర్మించాలని నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని వేణుబాబు బదులిచ్చారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ ఆమోదించిన డిజైన్లతోనే బ్లాక్–2ఏ కట్టామని అఫిడవిట్లో మీరు పొందుపరిచిన అంశం అబద్ధమా? ఆమోదిత డ్రాయింగ్స్ లేకుండానే బ్లాక్–2ఏ నిర్మించారా? అఫిడవిట్లో అబద్ధాలు ఎలా చెప్తారు? అని ఈ సందర్భంగా ఆయనపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పొరపాటైంది.. అఫిడవిట్లో పొందుపరిచిన అంశం వాస్తవం కాదు’అని వేణుబాబు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. మీరు ఒక ఇంజనీర్ ? బాధ్యత లేదా? ఏ బ్లాకును కట్టాకా దాని డిజైన్ల ఆధారంగా ఏయే బ్లాకులు కట్టారు? బ్లాక్ –1, 2 కట్టిన తర్వాత బ్లాక్–2ఏ కట్టారా? అని కమిషన్ నిలదీయగా, సమాధానం ఇవ్వలేక వేణుబాబు ఇబ్బందిపడ్డారు. తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం నేరం.. క్రిమినల్ కేసు పెట్టాలా? అని కమిషన్ మందలించింది. బ్లాక్–2, 3ల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారని తదుపరిగా కమిషన్ ప్రశ్నించగా, వేణుబాబు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. తేదీలు తెలియకపోతే కనీసం ఏ సంవత్సరమో తెలపాలని కమిషన్ కోరగా, 2016 నిర్మాణం ప్రారంభమైందని బదులిచ్చారు. బ్లాక్–2, 3, 2ఏల నిర్మాణం 2017లో ప్రారంభించినట్టు రికార్డుల్లో ఉందని మళ్లీ కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఎన్సీ ఆదేశాలతోనే బ్లాక్–2ఏ నిర్మాణం సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏకి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ లేవని రిటైర్డ్ డీఈఈ బండారి భద్రయ్య వెల్లడించారు. బ్లాక్–2, బ్లాక్–3 మధ్య దూరం పెరగడంతో అదనంగా బ్లాక్–2ఏ నిర్మించాల్సి వచి్చందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డ్రాయింగ్స్ లేకుండానే ఇతర బ్లాకులను ఎలా కట్టారో బాక్–2ఏను సైతం అదే తరహాలో కట్టాలని రామగుండం మాజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని తెలియజేశారు. డ్రాయింగ్స్ లేకుండా ఎలా కట్టారు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా బదులిచ్చారు. సుందిళ్ల బరాజ్ పూర్తయినట్టు తాను ధ్రువీకరణ పత్రం జారీ చేశానని మరో డీఈఈ సునీత కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తనకు సంబంధం లేదని చొప్పదండి ఈఈ శ్రీధర్ బదులిచ్చారు. సుందిళ్ల పునరుద్ధరణ పూర్తి అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? నిజం తప్ప మరేమీ చెప్పను.. అని చేసిన ప్రమాణానికి అర్థం తెలుసా? అని రామగుండం ఎస్ఈ సత్యరాజుచంద్రను కమిషన్ ప్రశ్నించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర సిఫారసుల ఆధారంగా సుందిళ్ల బరాజ్‌కు అత్యవసర మరమ్మతులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చులతో చేపట్టిందని, బ్లాక్–8కి ఎదురుగా ఉన్న కాంక్రీట్ బ్లాకుల పునరుద్ధరణ తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయని ఏఈఈ చెన్న అశోక్‌కుమార్ తెలిపారు. ఏ రోజు పనిని అదేరోజు పరిశీలించి ప్లేస్మెంట్ రిజిస్టర్లో నమోదు చేసి సంతకాలు చేశారా? అని ఏఈఈ హరితను కమిషన్ అడగ్గా, అవును అని ఆమె బదులిచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన మిగిలిన ఇంజనీర్లు బరాజ్‌ల నిర్మాణంతో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. -
వేణు ‘ఎల్లమ్మ’ కష్టాలు తీరినట్లేనా?
‘బలగం’ సినిమాకి ముందు ఇండస్ట్రీలో వేణుకి ఉన్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు వేణు అంటే కమెడియన్ మాత్రమే అని అందరికి తెలుసు. ఆయనలో ఓ గొప్ప దర్శకుడు దాగి ఉన్నాడనే విషయం ‘బలగం’ రిలీజ్ ముందు వరకు తెలియదు. అందరికి లాగే తాను కూడా సరదా కోసం మెగాఫోన్ పట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వేణు టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. తొలి సినిమాతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించాడు. ఆ హోదాను వేణు అలాగే కాపాడుకోవాలి అంటే..కచ్చితంగా ‘బలగం’కి మించిన సినిమాను తీయాలి. ఆ విషయం వేణుకి కూడా బాగా తెలుసు. అందుకే కాస్త సమయం తీసుకొని మరోసారి తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణ ‘కాంతార’బలగం తరహాలోనే వేణు మరోసారి పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కథతో ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారట. వేణు కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యం అందుకే చాలా జాగ్రత్తగా ఈ కథను రాసుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ కథను రెడీ చేశాడట వేణు. కాంతార తరహాలోనే ఈ కథకి కూడా బలమైన క్లైమాక్స్ ఉంటుందట.నాని టు నితిన్‘ఎలమ్మ’ కథను పలువురు హీరోలకు వినిపించాడట వేణు. ప్రతి ఒక్కరు బాగుందనే చెప్పారట. తొలుత నానికి కథ చెప్పాడట. ఆయనకు విపరీతంగా నచ్చిందట. అయితే అప్పటికే తెలంగాణ నేపథ్యంలో ‘దసరా’ సినిమా ఒప్పుకోవడంతో ‘ఎల్లమ్మ’ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ‘హను-మాన్’ హీరో తేజ సజ్జను అనుకున్నారట. కానీ ఈ వయసులోనే అంత పెద్ద పాత్రను పోషించలేని తేజ వెనక్కి తగ్గారు. వరుణ్ తేజ్ కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారట. వీరందరికి కంటే ముందే హీరో నితిన్‌కి ఈ కథ చెప్పాడట వేణు. అయితే దిల్ రాజు బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్నాని..మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్లో చేస్తే బాగోదని చెప్పాడట. కానీ మళ్లీ ఈ కథ చివరికి నితిన్ వద్దకే చేరిందట. ఆయన అయితేనే వేణు రాసుకున్న పాత్రకు న్యాయం చేస్తాడని భావించి.. దిల్ రాజు ఒప్పించారట. నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’, ‘రాబిన్‌వుడ్’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ సెట్లోకి అడుగుపెడతారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
విశ్వం అన్ని వర్గాలను అలరిస్తుంది: నిర్మాత కామెంట్స్
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 11న విడుదలవుతోన్న ఈ మూవీ విశేషాలను చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మీడియాతో పంచుకున్నారు.నిర్మాత వేణు మాట్లాడుతూ.. విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి కమర్షియల్ అంశాలతో అందరినీ అలరిస్తోంది. శ్రీను వైట్ల స్క్రిప్ట్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కథనాన్ని శ్రీను వైట్ల తన స్టైల్లో రూపొందించారని అన్నారు.అనంతరం మాట్లాడుతూ.. ఇటలీలోని మిలాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్. ఇందులో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అతని కామెడీ టైమింగ్,యాక్షన్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అతని కెరీర్లోనే విశ్వం అద్భుతంగా ఉంటుంది. శ్రీను వైట్ల, గోపీచంద్‌లతో కలిసి ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నా. సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే విశ్వం సినిమాను నిర్మించాను. చిత్రాలయం స్టూడియోలో అద్భుతమైన కథలు, సంగీతంతో ఆకట్టుకునే చిత్రాలను నిర్మించడం నా లక్ష్యం అని అన్నారు. -
కేరళ చీఫ్ సెక్రటరీగా భర్త తర్వాత భార్య
తిరువనంతపురం: దక్షిణ భారతదేశంలో నెల వ్యవధిలోనే అరుదైన రికార్డు పునరావృతమైంది. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా శారదా మురళీధరన్ బుధవారం నియమితులయ్యారు. ఆమె తన భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వేణు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రణాళిక విభాగంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోనూ ఆగస్టు 1న శాలినీ రజనీష్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భర్త రజనీష్ గోయెల్ రిటైరయ్యాక ఆయన స్థానంలో శాలినీ సీఎస్ అయ్యారు. -
‘రామాయణం’పై మరో సినిమా
రామాయణంపై, రామాయణంను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప గొప్ప నటీనటులు సీతా రాములుగా, రావణ, లక్ష్మణ, ఆంజనేయులుగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు అదే బాటలో రామాయణంను తెరకెక్కించటానికి నిర్మాత వేణు దోనేపూడి సిద్ధమయ్యారు. వి.ఎన్.ఆదిత్య నేతృత్వంలో ఒక టీమ్ ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య సహా పలు చోట్ల లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు మేకర్స్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, భారీగా నిర్మించబోతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి నిర్మాణ సారధ్యం తమ్మారెడ్డి భరద్వాజ. ప్రస్తుతం చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పీపుల్ మీడియా బ్యానర్‌తో కలిసి గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్లో ‘విశ్వం’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. -
వేణు దగ్గర రూ.450 కోట్లు కొట్టేశాడు.. సీఎం రమేష్ పై చీటింగ్ కేసు
-
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే ప్రసక్తే లేదు..
-
బీసీ డిక్లరేషన్ పేరిట బాబు, పవన్ మరో మోసం
సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ అబద్ధాల వీరులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మరో మోసానికి తెర తీశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు–బ్యాక్ బోన్ క్లాసులనే వైఎస్సార్సీపీని కాపీ కొట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం ప్రకటన జారీ చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్‌లో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు 143 వాగ్దానాలిచ్చిన టీడీపీ అందులో ఒకటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు సహా పలు కల్లబొల్లి హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలు బాబు, పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు ఎలాంటి విలువ లేదన్నారు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీల్ని బాగా వాడుకుని చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా అవమానించే సంస్కృతి నుంచి బయటపడలేదన్నారు. రూ.2.55 లక్షల కోట్ల జమ గడచిన 57 నెలల పాలనలో తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేసిందని మంత్రులు చెల్లుబోయిన, జోగి రమేష్ గుర్తు చేశారు. అందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.1.71 లక్షల కోట్ల మేర మేలు చేశామన్నారు. బాబు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తామంటున్నారని, ఈ లెక్కన పరిశీలిస్తే తమ ప్రభుత్వం చేసిన దానికంటే రూ.25 వేల కోట్లు తక్కువే చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. 2014లో బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని, చివరకు రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు దగా చేశారన్నారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు పంపిణీపై కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. బీసీలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందన్న ఘనుడు బాబు అన్నారు. బీసీ అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఇస్తున్న చేయూత వంటి పథకం 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు ఏ ఒక్క రోజైనా అమలు చేశారా అని నిలదీశారు. -
బలగం వేణు దర్శకత్వంలో నాని సినిమా....
-
బీసీ కులగణనకు సన్నాహం
సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి, కాకినాడ: జాతీయస్థాయిలో కులగణన ప్రక్రియను చేపట్టాలనే బీసీల న్యాయమైన డిమాండ్‌ను పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. దీంతో కులగణనను వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమయ్యింది. ఇందుకోసం సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ, మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లో శాఖల వారీగా కసరత్తు ముమ్మరం చేసింది. కులగణనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది. ఇదిలా ఉంటే.. జనాభా లెక్కలు–2022 సేకరణలో బీసీ కులగణన జరపాలంటూ దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ బీసీ కులం కాలమ్ పెట్టి జనగణన చేపట్టడానికి కేంద్రం సమ్మతించకపోవడంతో రాష్ట్ర పరిధిలో నిర్వహించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే బీసీ కులం కాలం చేర్చి జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీహార్‌లో చేపట్టిన కులగణనను అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కులాల వారీగా వివరాలు సేకరించేందుకు (కులగణన) క్షేత్రస్థాయిలో సిబ్బందిని వినియోగించుకునేందుకు నిర్ణయించింది. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఇందుకోసం ఉపయోగించనుంది. సర్వే పారదర్శకంగా జరిగేలా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో స్థాయిలో పునఃపరిశీలన చేస్తారు. రాష్ట్రంలో సమర్థవంతంగా కులగణన నిర్వహించేందుకు అవసరమైన పటిష్ట కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతుండటం విశేషం. బీసీల పక్షపాతి సీఎం జగన్ : మంత్రి వేణు ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదురుచూస్తున్న కులగణన ప్రక్రియను చేపట్టడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి బీసీల పక్షపాతినని నిరూపించుకున్నారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 15 తరువాత ఈ ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమవుతుందన్నారు. ఈ చర్య రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఓ పెద్ద ఊరటని, వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంటుందని చెప్పారు. వెనుకబడిన తరగతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్య, సంక్షేమం, వంటి అంశాలలో ప్రాధాన్యత కల్పించే దిశగా కులగణన జరుగుతుందని తెలిపారు. సాధ్యం కాదనుకున్న బీసీల కోరిక సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి ఆ బాధ్యతను తనకు అప్పగించినందుకు రుణపడి ఉంటానన్నారు. కుల గణనను ప్రారంభించే ముందు వివిధ కుల సంఘాల నాయకులు, పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకుంటామని మంత్రి వివరించారు. -
తాను మరణించలేదు.. కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో.. బతికే ఉన్నాడు!
వరంగల్: రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడు గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూనావత్ వేణు కానిస్టేబుల్ రాత పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చేంత వరకు ఇంటి వద్ద ఖాళీగా ఎందుకు ఉండాలని తండ్రితో కలిసి సూర్యాపేటలో సెంట్రింగ్ కూలీ పనులకు వెళ్లాడు. 2 నెలల క్రితం పనులు ముగించుకొని తండ్రితో కలిసి బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో వేణు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కుమారుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయిన విషయం తెలిసిన తల్లిదండ్రులు భద్రు, కేవూల్య కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు బతికుంటే తమను సాకేవాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా?
స్వయంవరం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటుడు వేణు తొట్టెంపూడి. ఆ తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించిన వేణు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గతేడాది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. తెలుగులో చెప్పవే చిరుగాలి, పెళ్లాం ఊరెళితే, దమ్ము, గోపి గోపిక గోదావరి, హనుమాన్ జంక్షన్, శ్రీకృష్ణ 2006, చిరునవ్వుతో లాంటి చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: 'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే) అయితే ఈ ఏడాది ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. 2013 తర్వాత ఏ చిత్రంలోనూ లీడ్ రోల్లో కనిపించని వేణు.. ప్రస్తుతం గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా వేణు ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చివరగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో పోలీస్ అధికారిగా కనిపించిన వేణు 'అతిథి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో అతనికి జోడీగా అవంతిక మిశ్రా నటిస్తోంది. (ఇది చదవండి: షారుఖ్ ఖాన్ మేనేజర్ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!) అయితే ఈ సిరీస్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా అతిథి వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈనెల 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అయితే హీరోగా ఎమోషనల్, కామెడీ తరహా సినిమాలు చేసిన వేణు.. ఇప్పుడు మాత్రం సరికొత్తగా హారర్ కాన్సెప్ట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. A mansion full of secrets, an unexpected guest and the story unfolds… with a twist you’ll never see coming! Are you ready for it. #ATHIDHI TRAILER OUT NOW! WATCH NOW: https://t.co/0iuJpChB9c#Athidhi streaming from SEP 19 only on @DisneyPlusHSTel #AthidhiOnHotstar… pic.twitter.com/I8XIjwVSpw — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 8, 2023 -
ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి!
సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామని జిన్నారం సీఐ వేణు కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లా పులహరానికి చెందిన సత్యకుమారి, శత్రుధన్ ముఖియా భార్యాభర్తలు. 6 నెలలుగా మండలంలోని మల్కాపూర్‌లో నివాసం ఉంటున్నారు. సత్యకుమారి సోదరి మనీషా కుమారి (11) 2 నెలలుగా ఆమె వద్దే ఉంటోంది. ఈనెల 25న మనీషా కుమారి తెల్లవారుజాము ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బిహారీ, హిందీ మాత్రమే మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56752, 87126 56730, 91775 15983 నంబర్లకు గానీ డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని, 5 వేల నజనారా అందిస్తామని సీఐ వేణు కుమార్, ఎస్ఐ సుభాష్ ప్రకటించారు. -
గ్రామస్తులు వద్దన్నా గుడి వద్ద షూటింగ్ చేసాం
-
అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ సినిమాలకు డైలాగ్స్ రాసా..
-
తెలుగు సినిమా లోనే బలగం ఒక చరిత్ర
-
సినిమాలో నటించాలని ఊరి నుంచి పారిపోయి వచ్చి బార్ షాపులో పని చేశా..
-
‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతుంది. ఈ మూవీ డైరెక్టర్ ఓ హాస్యనటుడు కావడం విశేషం. వెండితెర, బుల్లితెరపై కమెడియన్‌గా అలరించిన వేణు యెల్డండిలీ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం మౌత్ టాక్‌తోనే బలగం మంచి వసూళ్లు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సినిమా మంచి విజయం సాధించాలన్న, ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, కథ ఉంటే చాలని మరోసారి బలగం నిరూపించింది. కేవలం రూ. 2 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ. 25 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ వరుసగా అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ డైరెక్టర్ వేణు తొలిప్రయత్నంలోనే ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును సాధించాడు. ఉత్తమ దర్శకుడిగా వేణు ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డుకు అందుకున్నాడు. కాగా ఇప్పటికే బలగం లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్న ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం. -
'బలగం' మూవీకి మరో అంతార్జాతీయ అవార్డు.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులంటే
అంతర్జాతీయ వేదికపై ‘బలగం’ సినిమా మరోసారి సత్తా చాటింది. ఉక్రెయిన్‌లో జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ మూవీకి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు లభించింది. ప్రియదర్శి, కావ్య జంటగా వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ సమర్పణలో హన్షిత, హర్షిత్ నిర్మించిన ఈ మూవీ మార్చి 3న విడుదలైంది. -
అంతర్జాతీయ పురస్కార బలగం
హాస్య నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించారు. ‘దిల్’ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై, మంచి విజయం సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీతోపాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులకు ఎంపికైన విషయాన్ని చిత్రదర్శకుడు వేణు వెల్లడించారు. ‘నా బలగం’కు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరుస్తోంది’’ అన్నారు. ఈ అవార్డును ఛాయాగ్రాహకుడు ఆచార్య వేణు, దర్శకుడు వేణు అందుకోనున్నారు. -
దూసుకెెళ్తున్న 'బలగం' మూవీ.. అక్కడ కూడా అదే జోరు!
కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఈ విషయం ‘బలగం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సాధించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. బలగం రిలీజై 23 రోజులు పూర్తయ్యేసరికి రూ.23.59 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని తెరపై చక్కగా చూపించారని వేణుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వేణు డైరెక్షన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘బలగం’.. 9వ రోజు రికార్డు కలెక్షన్స్!) ఓటీటీలోనూ అదే దూకుడు ఓటీటీలోకి వచ్చేసిన బలగం సినిమా అక్కడ కూడా అదేస్థాయిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్కడ కూడా టాప్-2 లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ సినిమా తీసేందుకు మొత్తం బడ్జెట్ రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కన చూస్తే బలగం కలెక్షన్స్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నయి. చిన్న సినిమా అయినా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వేణు ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. -
డైరెక్టర్ వేణు మంచి మనసు.. ‘బలగం’ సింగర్‌కు ఆర్థిక సాయం
వరంగల్ జిల్లా : సిరిసిల్లకు చెందిన సినీ హాస్యనటుడు, ‘బలగం’ చిత్ర దర్శకుడు యెల్దండి వేణు మానవత్వం చాటుకున్నారు.‘బలగం’ సినిమాలో క్లైమాక్స్‌లో బుర్రకథతో అందరి హృదయాలను కదిలించారు కొమురవ్వ, మొగిలయ్య. కళాకారుడు మొగిలయ్య కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్నట్లు తెలియడంతో చిత్ర దర్శకుడు యెల్దండి వేణు స్పందించారు. వరంగల్ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్య ఇంటికి వెళ్లి రూ.లక్ష ఆర్థికసాయంగా అందజేశారు. చిత్ర నిర్మాత దిల్‌రాజ్‌తో మరింత ఆర్థికసాయం అందేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా వారిని వేణు సన్మానించారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, పాటల రచయిత శ్యామ్ కాసర్ల, యాంకర్ గీత భగత్, దార్ల సందీప్, సామాజిక వేత్త కాయితి బాలు, నర్సంపేట సీఐ పులి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘బలగం’ మూవీపై చిరంజీవి రివ్యూ, ఏమన్నారంటే..
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న బలగం మూవీపై ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. జబర్దస్త్ ఫేం వేణు తొలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మార్చి 3న థియేటర్లో విడుదలైన ఈ మూవీ అంచనాలను మించి విజయం సాధించింది. దీంతో ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం బలగం చిత్రాన్ని కొనియాడారు. స్వయంగా ఈ మూవీ టీంను కలిసిన చిరు దర్శకుడు వేణును అభినందించారు. చదవండి: తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ.. ఫ్లైట్‌లో ఆమె హడావుడి చూశారా? ఈ సందర్భంగా వేణును శాలువతో సత్కరించారు. ఇది నిజమైన చిత్రమని, ఇది నిజాయితితో తిశావన్నారు. తెలంగాణ సంస్కృతి ఈ చిత్రంలో ఉట్టిపడుతుందన్నారు. రియాలిటీకి ఈ సినిమా చాలా దగ్గర ఉందంటూ ప్రశసించారు. అనంతరం చిరుకి ధన్యవాదాలు తెలుపుతూ బలగం టీం ట్వీట్ చేసింది. మెగా ప్రశంస అంటూ చిరు బలగం టీంను కలిసిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. కాగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి-కావ్య కల్యాణ్ జంటగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. A mega moment for team #Balagam! Thank you megastar @KChiruTweets Garu for your kind words! This means the world to us❤❤@OfflVenu @priyadarshi_i @KavyaKalyanram @dopvenu @LyricsShyam #BheemsCeciroleo @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka pic.twitter.com/piPOsVan5K — Dil Raju Productions (@DilRajuProdctns) March 11, 2023 -
అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా: ‘బలగం’ డైరెక్టర్ వేణు
కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బలగం చిత్రంతో దర్శకుడిగా మారిన వేణు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌తో పాపులర్ అయ్యాడు. అంతకు ముందే సినిమాల్లో కమెడియన్‌గా నటించిన వేణుకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. వేణు వండర్స్ అనే పేరుతో టీంకు లీడర్‌గా వ్యవహరించిన నవ్వులు పండించాడు. ఇప్పుడున్న గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ ఆయన టీంలోనే ఎదిగారు. ఈ కామెడీ షోలో ఎన్నో హిట్ టాస్క్ చేసి బుల్లితెర ప్రేక్షకులను కడుబ్బా నవ్వించిన వేణు జబర్దస్త్‌లో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. చదవండి: Naresh-Pavithra Marriage: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర? కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వేణు ఈ షో నుంచి బయటకు వచ్చాడు. అయితే విభేదాల కారణంగానే వేణు ఈ షో నుంచి బయటకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడంపై తాజాగా వేణు స్పందించాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘బలగం’ మూవీ మంచి విజయం సాధించిన సందర్భంగా వేణు వరుస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు జబర్దస్త్ వీడటంపై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. ‘విబేధాల కారణంగా నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను అనడంలో వాస్తవం లేదు. చదవండి: ఆ ఘనత విజయకాంత్‌దే: హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు కేవలం సినిమాపై ఇష్టంతోనే ఆ షో వదిలేశాను. మొదటి నుండి నా లక్ష్యం సినిమానే. ఫుల్ టైం సినిమాల్లో రాణించాలనే కోరికతోనే జబర్దస్త్ వీడాను. నేను ఉన్నప్పుడు రేటింగ్ బాగుంది. మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అయినప్పటికీ సినిమా కోసం వదులుకొని బయటకు వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అప్పట్లో వేణు చేసిన ఓ స్కిట్ వివాదంలో నిలిచన సంగతి తెలిసిందే. ఓ వర్గం వారు వేణుపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. బలగం చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టిన వేణు మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరి ఊహాలను తలకిందులు చేస్తూ మంచి విజయం సాధించింది. -
‘బలగం’ కోసం ఆరేళ్లు పరిశోధన చేశా.. ఆ కథ చదవలేదు: వేణు
బలగం సినిమా వివాదంపై ఆ చిత్ర దర్శకుడు వేణు స్పందించాడు .ఈ సినిమా సినిమా కథ తనదే అని గడ్డం సతీష్ అనడం హాస్యాస్పదం అన్నారు. తన కుటుంబంలో జరిగిన సంఘటనలతో ఈ కథను రాసుకున్నట్లు వేణు చెప్పారు. 2011లో తాను రాసిన పచ్చి కి కథలో కాస్త మార్పులు చేసి బలగం చిత్రాన్ని తెరకెక్కించారని జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బలగం చిత్ర దర్శకుడు వేణు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. జర్నలిస్ట్ సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదన్నారు. ‘బలగం కథ మా కుటుంబంలో జరిగిన కథ. మా నాన్న చనిపోయినప్పుడు ఈ పాయింట్ నా మైండ్‌లో మెదిలినది. మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో సుమారు 100 మంది ఉంటాం. కాకి ముట్టడు అనేది తెలంగాణ సంప్రదాయ కాదు తెలుగు సంప్రదాయం. నా స్నేహితుడు ప్రదీప్ అద్వైతం ప్రోత్సాహంతో కథగా మలిచాను. ఈ కథ మొదట నా మిత్రుడు, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కు చెప్పా. పిట్ట ముట్టుడులో అసలు వాస్తవాలెంటేనేది చాలా గ్రామాలకు తిరిగి అధ్యయనం చేశా. నేను రాసింది కథ కాదు ప్రజల జీవితాల్లో జరిగే చర్యలు. ఆరేళ్లు ఈ కథపైనే పరిశోధన చేశాను. గడ్డం సతీష్ రాసిన కథ నేను చదవలేదు. నా కథ చరిత్రలో ఉన్న సంప్రదాయం. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తు కాదు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తారు. సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదు. కథ తనదే అయితే రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదు? దిల్ రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేది. బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయి. దిల్ రాజు బొమ్మను వాడి సతీష్ చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సంస్కృతి ఏంటో తెలిసింది’ అని వేణు అన్నారు. -
అనుబంధాలు గుర్తుకొస్తాయి
‘‘తెలంగాణకి చెందిన పల్లెటూర్లో జరిగే కథ ‘బలగం’. మా సినిమా చూస్తే కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. వేణు చక్కగా తీశాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ప్రియదర్శి, కావ్య, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్, హన్షిత నిర్మించారు. -
నాలాంటి వికలాంగులకు ఆ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇండియాకి మెడల్స్ తెస్తాం
-
అవకాశాల కోసం బాత్రూంలు కడిగాను: కమెడియన్
సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లు ఇండస్ట్రీకి రావడం అంత ఈజీయేం కాదు. కొండంత ప్రతిభ ఉన్నా గోరంత లక్ లేకపోతే వెండితెరపై వారు అదృష్టాన్ని పరీక్షించుకోలేరు. ఒక్క చాన్స్, ఒకే ఒక్క చాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగేవారు అప్పటికీ ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. తాను కూడా ఒకప్పుడు ఇలా అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగానంటున్నాడు కమెడియన్ వేణు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్ వచ్చిందని పేర్కొన్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మార్షల్ ఆర్ట్స్ పూర్తి చేశాను. రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచాను. కానీ యాక్టర్ అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. అన్నదానాలు పెట్టిన చోట తిని కృష్ణానగర్‌లో రోడ్ల మీద పడుకునేవాడిని. ఎలాగైనా స్క్రీన్‌లో కనిపించాలని దొరికిన అన్ని పనులు చేశాను. టచప్ బాయ్‌గా, మేకప్ అసిస్టెంట్‌గా, సెట్ బాయ్‌గా, కూలీగా, పేపర్ బాయ్‌గా పని చేశాను. అంట్లు తోమడం దగ్గర నుంచి బాత్రూమ్లు కడగడం వరకు అన్నీ చేశాను. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కోసం అదే చిత్రపరిశ్రమలోని వ్యక్తులను పరిచయం చేసుకుని వాళ్ల రూమ్‌లో ఉన్నాను. కాకపోతే వాళ్లు నన్ను ఇంట్లో పని చేసే బాయ్‌గా ఉంచుకున్నారు. ఆ సమయంలో ఒకతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాను. కొంతకాలానికి యాక్టర్‌గానూ చేశాను' అని చెప్పుకొచ్చాడు కమెడియన్ వేణు. చదవండి: నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్ -
ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్ పలువురు కమెడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్‌తో పాటు ఇప్పుటి కమెడియన్స్ అంతా ఒక్కచోట చేరారు. వేణు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! View this post on Instagram A post shared by Dhanraj (@yoursdhanraj) ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు(టిల్లు) వారందరి గ్రూప్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు. చదవండి: రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ View this post on Instagram A post shared by Venu Tillu (@venu_tilloo) -
మా స్నేహానికి రేంజ్ అడ్డు కాదు!
ఒకరితో స్నేహం చేయడం అంటే ఓకే. ఇద్దరు ముగ్గురు స్నేహితులున్నా ఓకే. అభిప్రాయభేదాలు ఉన్నా సర్దుకుపోవచ్చు. కానీ పదమూడు మంది స్నేహితులంటే సర్దుబాట్లు చాలా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేశ్, తాగుబోతు రమేశ్, ధన్‌రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్ నేని, నందు, రఘు... వీరంతా మంచి స్నేహితులు. స్నేహానికి విలువ ఇచ్చే ఈ 13 మంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇచ్చుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ స్నేహబంధం గురించి అడిగిన ‘సాక్షి’తో నటుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విశేషాలు. ►మా పదమూడు మందికి ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. పేరు ‘ఫ్లయింగ్ కలర్స్’. మేమంతా ఆర్టిస్టులుగా రంగుల ప్రపంచంలో ఉంటాం కాబట్టి, ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు ఫ్లై అవుతుంటాం కాబట్టి మా గ్రూప్‌కి ‘ఫ్లయింగ్ కలర్స్’ అని పెట్టుకున్నాం. ►మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడే ఆర్టిస్టులమే. అయినా కానీ అదంతా ప్రొఫెషనల్ లైఫ్. ఫ్రెండ్షిప్ విషయంలో రేంజ్‌ని పట్టించుకోం. పోటీని దూరంగా ఉంచుతాం. ‘వెన్నెల’ కిశోర్ అయినా ఒకటే.. నవీన్, శ్రీనివాస్ రెడ్డి అయినా ఒకటే. అందరం సరదాగా ఒకరికొకరం అన్నట్లుగా ఉంటాం. ►అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం. ఒకరికొకరు చాన్సులు చెప్పుకునే అవసరం ఉండదు. గ్రూప్‌లో ఇలాంటి విషయాలను కలపం. మా గ్రూప్‌లోని సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా మీట్ అవుతుంటాం. ముఖ్యంగా ఏవైనా పండగలు, శుభకార్యాలప్పుడు కలుస్తుంటాం. ►మేం తీసిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నాం. కానీ ఆర్టిస్టులుగా మేమందరం బిజీగా ఉన్నాం. అయితే మళ్లీ ఓ సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ►ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్నా, ఆ తర్వాత ఎవరికి వారు కంట్రోల్ కాగలిగినవాళ్లమే. సో... మా మధ్య పెద్దగా సమస్యలు రాలేదు. అందరూ సరదాగా ఉంటాం. రిలాక్సేషన్ కోసం ఫన్నీ కౌంటర్స్ వేస్తుంటాం. ∙మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్ టైమ్‌లో కొందరికి హెల్ప్ చేశాం. ►మామూలుగా నెలకోసారి కలవడం మా అలవాటు. అప్పుడు డ్రెస్ కోడ్ అనుకుంటాం. ఉదాహరణకు చిల్డ్రన్స్ డే అంటే స్కూల్ డ్రెస్సులు, పండగలప్పుడు అందుకు తగ్గ డ్రెస్సులు. కరోనా వల్ల మా మీటింగ్స్ కట్ అయ్యాయి. ఈ ఫ్రెండ్షిప్ డేకి కలుద్దామనుకున్నాం కానీ కరోనా టైమ్ కాబట్టి వద్దనుకున్నాం. -
రాష్ట్రాలపై రుణభారం అసంబద్ధం
భారతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం నిధుల పంపిణీ ప్రక్రియ ఇప్పుడొక జాతీయ సమస్యగా మారిపోయింది. ఇతరత్రా అనేక సమస్యల్లో మన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలను ఎవరు తీసుకోవాలి అనే విషయమై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం సమంజసంగా లేదు. కానీ కేంద్రానికి అన్నిరకాలుగా ఉన్న సౌలభ్యం రీత్యా తక్కువ వడ్డీకి మార్కెట్లో రుణాలు సేకరించి వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడమే భేషైన పని. కానీ ఆవైపుగా ఆలోచించకుండా పట్టుదలకు పోతున్న కేంద్రవైఖరి సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. రాష్ట్రాలే మార్కెట్ నుంచి రుణాలు తీసుకుని ఖర్చుపెట్టుకోవాలనడం ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అసంబద్ధమే అవుతుంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం.. గత 85 సంవత్సరాలుగా భారతదేశం కనీవిని ఎరుగని రీతిలో ఎదుర్కొంటున్న మాంద్యాన్ని జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిగా లెక్కించి దాంతో ఆ స్థాయిలో వ్యవహరించడానికి అంగీకరిస్తే, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న డిమాండును అది వెంటనే ఆమోదించాల్సి ఉంటుంది. మార్కెట్లో తక్కువ వడ్డీ రేట్లకు కేంద్రమే అదనపు నిధులను రుణంగా తీసుకుని వాటిని వెంటనే తమకు ఆర్థిక వనరుల కింద అప్పగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్. తార్కికంగా చూస్తే ఇది సమంజసమైన ప్రతిపాదనగానే చెప్పాలి. కానీ జీఎస్టీ (సరుకులు, సేవల పన్ను) భేటీలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఇది తెమలని తగవుగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభం మధ్యలో, ఈ సమస్యలో ఏ ఒక్క భాగాన్ని కూడా కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తగవుగా మోదీ ప్రభుత్వం భావించకూడదు. వాస్తవానికి, 2008 సంక్షోభంలో ద్రవ్య మార్కెట్లు కుప్పగూలిపోయాక, అమెరికా ప్రభుత్వం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, రాష్ట్రాలు కలిసికట్టుగా ఒకే విభాగంగా పనిచేసి, అవసరమైన ప్రతి చర్యనూ సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే 2008నాటి ద్రవ్యమార్కెట్ల పతనం అనేది ఒక లెక్కలోకి కూడా రాదు. ప్రత్యేకించి భారత ఆర్థిక వ్యవస్థ ఈసారి తీవ్రాతితీవ్రంగా దెబ్బతినింది. ఎందుకంటే కోవిడ్–19 మహమ్మారి విరుచుకుపడక ముందే ప్రైవేట్ పెట్టుబడి, ఉపాధికల్పన వంటి నిజమైన ఆర్థిక పరామితులలో భారత్ వ్యవస్థాగతమైన క్షీణతను చవిచూసింది. ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక అవసరాలను తీర్చగలిగిన నిధుల పంపిణీ విషయంలో ఎవరు మొదట అప్పు చేయాలి అనే అంశంపై కేంద్రం ముసుగులో గుద్దులాటకు దిగడం ఏరకంగా చూసినా భావ్యం కాదు. ఆర్థిక వ్యవస్థ ఏటా 14 శాతం వృద్ధిని సాధిస్తుందన్న ప్రాతిపదికన తమకు పూర్తి పరిహారం అందించాలని ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేయడం సమర్థనీయం కాదని ఎవరికైనా అనిపించవచ్చు. అయితే రాష్ట్రప్రభుత్వాలను ఒక అంశంలో పూర్తిగా సమర్థించాల్సి ఉంది. కోవిడ్–19 నేపథ్యంలో ప్రాథమిక సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ఖర్చులను తీర్చడానికి అందుబాటులో లేకుండాపోయిన ఆదాయ వనరుల కోసం ఆర్బీఐ నుంచి లేక మార్కెట్ నుంచి కేంద్ర ప్రభుత్వమే రుణంగా సేకరించి తమకు ఇవ్వాలనే అంశంపైనే రాష్ట్రాలు కేంద్రంతో తగవులాడుతున్నాయి. రాష్ట్రాల వైఖరి సమర్థనీయమైంది కూడా. మొత్తంమీద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3 శాతంకంటే తక్కువకు క్షీణించినప్పుడు బడ్జెట్ అవసరాల కోసం కేంద్రప్రభుత్వం ఆర్బీఐ నుంచి రుణంగా తీసుకోవచ్చని ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం ఆదేశపూర్వకంగా వెల్లడించింది. అందుకే ఈ చట్టాన్ని ఇప్పుడు కేంద్రం ఎందుకు అమలు చేయడానికి సిద్ధపడటం లేదని కొన్ని రాష్టాలు ఇప్పటికే కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఎందుకంటే ఎఫ్ఆర్బీఎమ్ చట్టం పార్లమెంటు ద్వారా రూపొందింది కాబట్టి ఇది తప్పకుండా ప్రజల సంకల్పాన్నే ప్రతిబింబించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య అవిశ్వాసం ఈ నేపథ్యంలో జీడీపీలో 3 శాతం పరిమితికి మించి అప్పు తీసుకోవడంపై అన్నిరకాల షరతులు విధిస్తూనే మరోవైపు రాష్ట్రాలనే అదనపు రుణాలను తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి చేయడం విచారకరం, మన రాజకీయ నాయకత్వంలో ఉండాల్సిన సమాఖ్య స్ఫూర్తికి ఇది వ్యతి రేకం. పెట్టుబడులు, ఉపాధికల్పన, రాబడులు వంటి పలురంగాల్లో సంస్థాగత పతనానికి ప్రధానంగా మోదీ ఆలోచనా రాహిత్యం, రాష్ట్రాలను సంప్రదించకుండానే చేపట్టిన పెద్ద నోట్ల రద్దు వంటి అప్రజాస్వామికమైన ప్రయోగాలే కారణమని, కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవలసి ఉంది. అత్యంత అసమర్థకరమైన రీతిలో అమలు చేసిన జీఎస్టీ, అసంఘటిత రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం కూడా దీనికి తోడయ్యాయి. ఇప్పటికీ వ్యవసాయ క్షేత్రాల బిల్లులు, విద్యుత్ చట్టాల్లో మార్పులు వంటి రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలపై అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో కూడా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రం సంప్రదించడం లేదు. గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా, కోవిడ్–19 నేపథ్యంలో అవసరమైన ఖర్చులు తీర్చుకోవడానికి రాష్ట్రప్రభుత్వాలకు గల అదనపు రుణం అవసరాలపై ఏకపక్ష షరతులను కేంద్రం విధించడం అంటే సమాఖ్య తత్వం పట్ల పరమ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడమే కాకుండా ఉద్దేశ్యపూర్వకంగానే ఆ స్ఫూర్తిని అగౌరవపర్చడం కూడా అవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో ఎమర్జెన్సీని తలపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో పన్ను రూపేణా రాబడి 24 శాతానికి అంటే అత్యంత భారీస్థాయిలో ఏప్రిల్–జూన్ త్రైమాసికం కాలానికి పడిపోయింది. బడ్జెట్లో అంచనా వేసిందానికంటే మొత్తం రాబడులు 25 నుంచి 35 శాతం మేరకు తగ్గిపోయాయి. దీంతో రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, శాంతి భద్రత వంటి రంగాల్లో బడ్జెట్లో భాగంగా పెట్టాల్సిన ఖర్చులు పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికి తోడుగా రాష్ట్రాలకు ఇవ్వవలసిన జీఎస్టీ రూపంలో ఇవ్వాల్సిన 2.35 లక్షల కోట్ల మేరకు పరిహారాన్ని చెల్లించలేకపోతున్నట్లు కేంద్రప్రభుత్వం పేర్కొంది. ఇలా బకాయి పడిన మొత్తాన్ని 2022 లోపలే చెల్లిస్తానని కేంద్రం అంగీకరించింది. అయితే భారీ ఎత్తున అవసరమైన స్వల్పకాలిక నిధుల సేకరణ కోసం మాత్రం రాష్ట్రప్రభుత్వాలు మార్కెట్ నుంచి తమ శక్తి మేరకు రుణాలను స్వీకరించవచ్చని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పడం సరైంది కాదు. ఈ వ్యాసం మొదట్లోనే చెప్పినట్లు రుణాలు లేక నిధులను ఎవరు సేకరిస్తారు అనేది జాతీయ సంక్షోభ సమయంలో పెద్ద విషయమే కాదు. ప్రస్తుత విపత్కర స్థితిలో చౌక వడ్డీలకు సమర్థంగా రుణాలను సేకరించగలిగిన కేంద్రప్రభుత్వమే అందుకు పూనుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు సేకరించడం కేంద్రప్రభుత్వానికే సులభమైన పని అని రాష్ట్రప్రభుత్వాలు వాదిస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన ప్రత్యేక విండో ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలలో కొంత భాగాన్ని రాష్ట్రాలకు కేంద్రం సహాయ నిధికింద ఇవ్వవచ్చు. వడ్డీ ఖర్చులను తగ్గించడానికి, సెస్సు ద్వారా రాష్ట్రాల రుణ సేవలను చెల్లించడానికి కూడా తాను సిద్ధమేనని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఇలాంటి సంక్లిష్టమైన అంశాల్లో తలదూర్చడంకంటే, కేంద్రప్రభుత్వమే నేరుగా మార్కెట్లోంచి రుణాలు సేకరించి అలా వచ్చే డబ్బును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడమే ఉత్తమమైన పని. కానీ ఈ పనిచేయడానికి మాత్రం ప్రధాని నరేంద్రమోదీ ఏమాత్రం సుముఖత చూపుతున్నట్లు లేదు. జీఎస్టీ సంస్కరణల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, 31 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణమైన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రస్తుతం రుణాలను ఎవరు కల్పించాలి అనే విషయమై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఎలా పనిచేయాలి అనే అంశంలో అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అవిశ్వాసం పెరుగుతూ వస్తోంది. సామరస్యంగా పరిష్కారం అవశ్యం కేంద్రప్రభుత్వం 2017 సంవత్సరంలో జీఎస్టీని అమలు చేసినప్పుడు రాష్ట్రాలకు తాను ఇచ్చిన హామీలను అమలు పర్చాల్సిన గురుతర బాధ్యత కేంద్రంమీదే ఉంటుంది. ఎవరు రుణాలు తీసుకోవాలి అనే ప్రస్తుత వివాదానికి సంబంధించి కనీసం 10 రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తామని హెచ్చరిస్తున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకించబోవడం ఇదే మొదటిసారి. ఇప్పటికే 20 బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దన్ను కలిగి ఉన్న కేంద్రప్రభుత్వం తాజాగా జీఎస్టీ కౌన్సిల్లో ఓటింగ్ జరగకూడదని చూస్తోంది. ఎందుకంటే ఇంతవరకు చర్చించడం ద్వారా, ఏకాభిప్రాయ సాధన ద్వారానే జీఎస్టీలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఒకవేళ ఓటింగ్ తప్పనిసరైతే కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా 75 శాతం ఓట్లు అవసరమవుతాయి. ప్రయత్నిస్తే కేంద్రం దీన్ని సాధించి ముందుకుపోవచ్చు. కానీ సమాఖ్య స్ఫూర్తిని సాగించడానికి భారత్‌లో మూడేళ్ల నుంచి మాత్రమే అమలవుతున్న జీఎస్టీలో ఓటింగ్ వరకు రాకుండా జాగ్రత్తపడటం కేంద్రానికి మంచిది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న 10 రాష్ట్రాలతో రాజీపడి ఏకాభిప్రాయ సాధన ద్వారానే ప్రస్తుత సమస్యను పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వం పూనుకుంటేనే పరస్పర సంతృప్తి ఇరుపక్షాలకూ మిగులుతుంది. (ది వైర్ సౌజన్యంతో) ఎంకే వేణు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
బతుకాట
కాలం మాయా స్వరూపం. అది నిరంతరం పరిణామక్రమం చెందుతూ తనతో అన్నిటినీ మార్చుతుంది. గతం వర్తమానానికి భిన్నంగా ఉంటుంది. వర్తమానం భవిష్యత్తు తిప్పే మలుపులో పరిచయాలు కలుపుతుంది. అయినా మనిషి గతం తాలూకు నీడల్నే వెతుక్కుంటుంటాడు. వాస్తవానికి తల్లి గర్భం నుండే ఈ వెతుకులాట మొదలవుతుంది. ఆట నిరంతరం కొనసాగుతుంది. కొందరు ధనం కోసం, ఇంకొందరు సత్యం కోసం, ఇంకొందరు అన్నం కోసం, మరి కొందరు మరొక దానికోసం అన్వేషణ సాగిస్తారు. మంచులో బస్సు లైట్లు దారిని వెతుక్కుంటూ వస్తున్నట్లే. శివుడి విభూదిలా మంచు కురుస్తోంది. ఆ గ్రామానికి జంగమదేవర వచ్చాడని అతడు ఇంటిముందు తొక్కిన ముగ్గులు చెబుతున్నాయి. ఏ ఇంటికీ రాకుండా వీధులెంట తన దారిన తాను తన్మయత్వంతో వెళ్ళిపోయే హరిదాసు రాలేదని మంచుసోనలకు అంటిపెట్టుకున్న గానమాలపించని గాలి చెబుతుంది. అక్కడో ఇంటి ముందు భిక్ష స్వీకరిస్తూ పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ విభూతిని అందరి ముఖాలకు పెట్టి శంఖం ఊదిన శబ్దం వచ్చింది. ఇంకా మంచాల మీద నిద్రపోతున్న వాళ్ళలో గడ్డకట్టుకుపోయిన బద్ధకం బద్దలయిపోయింది. పూజలో కూర్చున్న వారికి ఆ ధ్వని దివ్యమంత్రం. ఆ ఇంటివారికి శుభం పలికి భోళాశంకరుడిలా బయటకొస్తున్నాడు. జంగాలాయన పై నుండి కిందికి అంగరఖాను తొడిగి తలకు తలగుడ్డ మెడకు పొడవాటి అంగవస్త్రాన్ని ధరించి, ముఖానికి విభూతి రేఖలు పూసుకుని ‘సాంబసదాశివ సాంబసదాశివ’ అని పాడుకుంటూ మరో ఇంటి ముంగిటకెళుతున్నాడు. ఓరవాకిలిగా మూసిన తలుపు సందులోంచి సంతోషంలా వెలుతురు చొరబడుతోంది. ఊరంతా తిరిగాక చివరి ఇల్లు దగ్గరకొచ్చి అరుగు మీద కూర్చున్నాడు జంగాలాయన. గోడ పక్కన బావి దగ్గర వేపపుల్లతో పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని వెనక్కి తిరిగి చూసిన నారాయణదాసుకు తన ఇంటి అరుగు మీద కూర్చున్న జంగాల నాగేశ్వరరావు కనబడ్డాడు. ‘‘ఏమోయ్ నాగేశ్వర్రావు ఇప్పుడేనా రావడం!’’ అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో నారాయణదాసు. ‘‘తమరు దంతాధావనం చేస్తున్నప్పుడే దిగబడ్డాను బావగారూ’’ అన్నాడు నవ్వుతూ జంగాల నాగేశ్వరరావు. ‘‘ఏమోవ్! మీ అన్నయ్యొచ్చాడు. రెండు టీ లు పట్టుకురా’’ అంటూ పక్కనే ఉన్న రాగి చెంబులోని నీరు గటగటా తాగాడు నారాయణ దాసు. ‘‘ఈ ఏడాది ఇక నువ్వు హరిదాసు వేషం కట్టనట్టేనా?’’ తనని ఒంటరి చేశాడన్నట్లు బాధని వ్యక్తం చేస్తూ అన్నాడు నాగేశ్వరరావు. ‘‘ఇక ఈ సంవత్సరమే కాదు. ఇక ఏ సంవత్సరమూ కుదరదురా’’ తన జీవితంలోంచి వసంతం వెళ్ళిపోయినట్టు గాద్గదికమైన గొంతుతో అన్నాడు నారాయణదాసు. ‘‘మందులేమైనా వాడుతున్నావా?’’ సంశయాత్మకంగా ప్రశ్నించాడు నాగేశ్వరరావు. ‘‘అల్లోపతి, హోమియోపతి వాడాను. ఫలితం కనిపించలేదు. ఇప్పుడు ఆయుర్వేదం మందు పుచ్చుకుంటున్నాను. పథ్యమే పరమౌషధం అన్నారని పథ్యమూ చేస్తున్నాను. తినే ప్రతి పదార్థంలోనూ ఏదో ఒక వాత గుణం ఉంటుంటే ఇంకేం గుణం కనిపిస్తుంది. నొప్పులు పదిలంగా ఉంటున్నాయి. ఏ విందు భోజనాల్లోనో పిఎల్ బియ్యం తిన్నప్పుడు నొప్పులు పోయి ప్రాణం లేచొస్తుందనుకో! కీళ్ళవాతం కాటికి పోయేదాకా వదలదంటారు కదా. పైగా చలికాలం కావడం మూలాన పొద్దున లేవగానే కీళ్ళు బిగుసుకుపోతున్నాయి. దానికి తోడు వాపు. నాలుగడుగులు నడవడానికి నరకం చూస్తున్నాననుకో. అయినా మనసాగక హరిదాసు దీక్ష తీసుకుని వేషం కట్టినా బియ్యం భిక్షగా స్వీకరిస్తున్నప్పుడు కూర్చుని లేవాలి. అదిప్పుడు నావల్ల అయ్యే పనికాదు. హరికథలు చెబుదామన్నా జనం వాటికి రావడం మానేసి చాలా కాలం అయ్యింది. ఇన్నాళ్ళూ ఈ వృత్తిని కంచంలో కూడు పెడుతుందని చెయ్యలేదు. కళ బతకాలని, దానికి మరణం రానివ్వకూడదని చేశాను. కానీ ఇప్పుడా హరిదాసు వృత్తి అంపశయ్య మీద ఉంది. అది మరణానికి భీష్ముడిలా మకర సంక్రాంతి కోసమే ఎదురు చూస్తోంది’’ అన్నాడు నారాయణదాసు ఆర్ద్రత నిండిన గొంతుతో. ఆ ఆర్ద్రతలో తనకి ప్రాణప్రదమైన వాటిని విడిచి పెడుతున్నప్పుడుండే ఆవేదన కనబడింది జంగాలాయనకు. దాసు భార్య తీసుకొచ్చిన రెండు టీలు తాగుతూ నాగేశ్వరరావుకు నారాయణదాసు తన బాధ ఏకరువు పెట్టాడు. ‘‘ఇద్దరు కొడుకులదీ ఎవరి దారి వాళ్ళదయిపోయింది. పెద్దోడికి ఇద్దరూ ఆడపిల్లలే. ఇద్దరూ పుష్పవతులైతే బంతెయ్యకపోతే చుట్టు పక్కలోళ్ళు, చుట్టాలు వేగనిస్తారా! వాడెక్కడెక్కడో అప్పులు తెచ్చి కుటుంబాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నాడు. మొన్నామధ్య పెద్దకోడలికి వాడికి మాటకు మాటొచ్చి ఆమెను కొడుతుంటే చూడలేక మీ అక్క అడ్డెళ్ళింది. పెద్దోడు విసురుగా తోసేసరికి డ్రైనేజీలో పడిపోయింది. కాలు విరిగింది. అప్పోసప్పో చేసి నాటు కట్టు వేయించాను. అసలే ఆవిడకు షుగరేమో! ఓ ఆర్నెల్లు వంటావార్పు కూడా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇక చిన్నాడేమో ఆర్థికంగా కాస్త బాగానే ఉన్నా పెద్దోడి మీద వంతేసుకుని మమ్మల్ని పట్టించుకోడు. చిన్నకోడలయితే చుట్టపు చూపుగా కూడా ఎప్పుడూ రాదు. ఉపాధి హామీ పథకం పనిలో మస్తర్లు వేసేది మా మేనల్లుడే. నేను పనిచేసినా,చేయకపోయినా నాకు హాజరు వేసి పుణ్యం కట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాడే నా బతుకుదెరువు’’ బరువెక్కిన కళ్ళతో తన బతుకు కథను చెప్పాడు నారాయణదాసు. జంగాలాయన కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. నాగేశ్వరరావు ఎకరం పొలంలోంచి ఆర్బీ రోడ్డు పడింది. మిగిలిన పాతిక సెంట్ల పొలం కట్నంగా ఇచ్చి ఒక్కగానొక్క పిల్ల పెళ్ళి చేశాడు. అల్లుడు పట్నంలో కిరాణా షాపు నడుపుతుంటాడు. భూమి విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందనే ఆర్థిక కోణంలో అల్లుడు దాన్ని అమ్మకుండా మామగారైన నాగేశ్వరరావుతోనే వ్యవసాయం చేయించి సగం బస్తాలు కౌలుగా జమ కట్టుకుంటాడు. మిగిలిన ఆ ఐదారు బస్తాలు నాగేశ్వరరావు దంపతులకు ఎక్కువైపోతాయి. కానీ ఏదో ఒక రోజు అల్లుడు ఆ పొలం అమ్మేసేదే అనే దిగులు ఎప్పుడూ శరీరంలో గూడుకట్టుకునే ఉంటుంది. మూడురోజూల తరువాత.... ఉదయం బస్సు ఊరి మీదనుండి వెళుతుంటే రేగిన దుమ్మును బలిచక్రవర్తిని తొక్కిన వామనుడిలా మంచు నొక్కిపడుతోంది. రుద్రాక్ష ధారణతో వీపుకు వేలాడుతున్న గంట నడుస్తున్నప్పుడు ఆ కాలికి ఈ కాలికి తగులుతున్నప్పుడు పుట్టే లయ బద్ధమైన శబ్దానికి శంఖనాదాన్ని జత కలిపి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తూ జంగాల నాగేశ్వరరావు నారాయణదాసు అరుగు మీద చేరాడు. నెయ్యి వేసిన ముద్దపప్పుతో కూడిన అరిసెలు ఇంట్లోంచి వాళ్ళిద్దరి చేతుల్లోకి చేరాయి. అరిసెలు వాతమని తెలిసినా ఆ అమృతపు రుచి ముందు నారాయణదాసు జిహ్వ వశీకరణానికి గురయినట్టు ఆడుతుంది. ‘‘నువ్వెప్పుడొస్తావోనని ఎదురు చూసిన ఈ మూడ్రోజులు మూడు నెలలుగా గడిచాయి’’ అన్నాడు దవడలు దడదడలాడిస్తూ నారాయణదాసు. ‘‘అల్లుడు పొలం అమ్మేస్తానంటున్నాడు’’ బరువుగా పలికింది నాగేశ్వరరావు గొంతు. కాసేపు నిశ్ళబ్దం. అరిసె చేదుగా అనిపించింది నారాయణదాసుకి. తింటున్న పళ్ళాన్ని గడప మీద పెట్టేశాడు. ‘‘మా నాన్న బతికున్నప్పుడు బాపనాయనలకు తప్ప అందరికీ కర్మలు చేసేవాడు. నాన్నతో నేను కూడా చెరువు దగ్గరకు వెళ్ళేవాడిని. అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులతో నాన్న పిండాలు పెట్టించేవాడు. పిండం పెడుతుండగా గంట మోగిస్తూ నాన్న శంఖం ఊదుతుంటే జీవిత సత్యమేదో అర్థమయ్యేది. చాలా ఊళ్ళు నాన్న మీదే ఆధారపడేవి. మంచి,చెడు కార్యక్రమాలు ఏవైనా ఆయనెళ్ళకపోతే ఎక్కడివక్కడ ఆగిపోవాల్సిందే. జంగాల ప్రభతో పాటు ఆయన కళ్ళలో వెలుగు కూడా ఆరిపోయింది. సంప్రదాయ వృత్తి పోయి ఎంచుకున్న ధర్మప్రచారానికి ఆదరణ సన్నగిల్లి, అర్చక వృత్తిలో స్థానం లభించక నాన్న నానా అగచాట్లు పడ్డాడు. నాన్న చనిపోయేటప్పుడు మనేదితో మంచం పట్టాడు. జంగాలను ఆదరించే వాళ్ళు లేకపోవడంతో ఆయన చిన్నప్పట్నుంచి జంగాలు ఎలాంటి వెలుగు వెలిగేవారో...ఊరంతా కలిసి పండుగలు ఎలా జరుపుకునేవారో చెప్పేవాడు. అవన్నీ ఇప్పుడు కళ్ళముందు కదులుతున్నాయి. ఇప్పుడు అదే మనేది నాలో మొదలైంది. ఆత్మ తృప్తి అన్నిటికంటే ప్రధానం. అదిలేని నాడు మనిషి ఏది సాధించినా అసంపూర్తి జీవితాన్ని గడిపిన అనుభూతే కలుగుతుంది దాసు’’ జీరపోయిన గొంతుతో అన్నాడు జంగాల నాగేశ్వరరావు. ‘‘నిజమే నాగేశ్వరరావు హరికథలు చెప్పిన అనుభవంతో నాటకాలు వెయ్యడానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు నాటకాలు చూసేవాళ్ళు కరువయిపోయారు. చూసేవాళ్ళు లేనప్పుడు నాటకాలతోనే కనుమరుగయ్యిపోయాయి నటుల జీవితాలు. కానీ స్టేజీపై ఉన్నంతసేపు ఎంత సంతృప్తి ఉండేదనుకున్నావ్!’’ ఓ రచయిత గారన్నట్టు ‘అవిగో వినరా చప్పట్లు ఆకలిగొన్న జీవికి అవే పంచభక్ష్య పరమాన్నాలు’ రోజుకొక్కసారైనా తిరిగి బాల్యంలోకి వెళ్ళిపోతే బాగుంటుందనిపిస్తుంది. ‘‘చిన్నప్పుడు నీకు గుర్తుందా నాగేశ్వర్రావ్! మునసబు గారు, కరణంగారి గొడవ. మునసబుగారేమో శైవమతాభిమాని. కరణంగారు వైష్ణవ పక్షపాతి. మునసబుగారు వీధిలో స్టేజీ కట్టించి బుడగ జంగాలతో బుర్రకథ చెప్పిస్తే ఊరు ఊరంతా వీధిలోనే ఉండేది. ఆ మరుసటిరోజు కరణంగారు రామాలయం అరుగు మీద మునసబుగారికి పోటీగా హరికథ వేయిస్తే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేవారు. ప్రతి ఊళ్ళోనూ ఇలాగే రెండు వర్గాల మధ్య పోటీ ఉండేది. అయితే అది ఆరోగ్యకరంగా ఉండేది. మైక్ సెట్టు సుబ్బారావుకు అప్పట్లో చేతినిండా పని...జేబు నిండా సంపాదనే. ఆ రోజులు వేరు బావా’’ జ్ఞాపకాలు కళ్ళనీళ్ళ రూపంలో జారిపోతుంటే వాటిని కండువాతో ఒడిసి పట్టి కళ్ళను అద్దుకున్నాడు దాసు. ‘‘అంతేనా! దాసు. ఊళ్ళో వానలు కురవడానికి గంగానమ్మకు నీళ్ళొయ్యడానికి జాతర బ్రహ్మాండంగా జరిగేది. ఊరంతా గరగలు ఊరేగిస్తూ కొట్టే డప్పుల శబ్దం నిజంగా ఆకాశానికి వినిపించేవేమో అన్నట్టు పిడుగుల్లా మోగేవి. గంగానమ్మకు నీళ్ళొయ్యడానికి మునసబు కరణాలు కృష్ణార్జునుల్లా కలిసిపోయేవారు. వాళ్ళిద్దరు గరగల వెనుక నిలబడి ఊరంతా తిరుగుతుంటే జనం ఇళ్ళలో నుండి బయటకొచ్చి విరగబడి చూసేవారు. వాళ్ళిద్దరి పట్టువిడుపులు, పల్లె పచ్చదనంతో ఊరంతా నిత్యకళ్యాణం, పచ్చతోరణంలా ఉండేది. నువ్వు నేను అప్పట్లో చిన్నపిల్లలమైనా ఒకరితో ఒకరం మాట్లాడుకునే వాళ్ళం కాదు కదూ! పైగా ఒకరికొకరం ఎదురుపడితే ఆగర్భశత్రువుల్లా ఎడమొహం పెడమొహం పెట్టే వాళ్ళం. మునసబు కరణాలని అనుకరించే వాళ్ళం. వాళ్ళు కలిస్తే మనం కలిసేవాళ్ళం. చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్ళం. వీరశైవ జంగాలు వీరభద్రుని పళ్ళెం పట్టి గుండం ఏర్పాటు చేసేవారు. ఆ గుండంలో కణకణమండే నిప్పులుంటాయి. ఆ నిప్పుల గుండం దగ్గరకొచ్చిన బుడిగె జంగాలు వీరావేశంతో దక్షయజ్ఞ దండకం చదువుతూ, నారసాలను నాలుకలోకి గుచ్చుకుని ఆవేశంతో నిప్పుల్లో నడిచిపోయేవారు. అది చూసిన ఊళ్ళో పిల్లలు రెండు మూడ్రోజులు జ్వరంతో మంచం దిగేవారు కాదు. దాసు, నాగేశ్వరావుల ఇద్దరి ముఖాలు బాల్యపు అనుభూతులతో నవ్వుల్తో మతాబుల్లా వెలిగిపోయాయి. ఈలోగా రోడ్డుమీద ఎవరో కుర్రాడు కోడిపుంజుని సంకలో ఉంచి పట్టుకెళ్తుండడం చూసి దాసుకి కోపం నషాళానికెక్కింది. ‘‘పైత్యం కాకపోతే ఏమిటిది పిచ్చి వెధవలకి! ఎలా ఉండేది సంక్రాంతి! ఎలా చేశారు. హరిదాసులు, జంగాలు, పగటి వేషాలు, గంగిరెద్దులు, గాలిపటాలు, రంగుల ముగ్గులు, బొమ్మల కొలువులు, భోగి మంటలు, రేగి పళ్ళు ఇవేమీ లేవు. జూదాలూ, జుగుప్స కలిగించే సినిమాలూనూ. సంప్రదాయమైన కోడిపుంజు జూద వస్తువైంది. వీళ్ళ దృష్టిలొ సంక్రాంతంటే ఇదే! సంక్రాంతి సంస్కృతి కాక సరదా అయిపోయింది. వీధి దారిలోంచి వెళుతున్న అతడిని చూస్తూ ఇంకా రుసరుసలాడిపోయాడు దాసు. మార్పుకు లోనైన సమాజాన్ని, మట్టికొట్టుకుపోయిన సంప్రదాయాల గురించి దీర్ఘాలోచన చేస్తూ ఒకప్పుడు పండుగంటే ఊరొక ఉత్సవం. ఇప్పుడొక సెలవు దినం. కళలే కాదు ఆచారాలు అవసాన దశలో ఉన్నాయి. ఇక వీటిని మనమెవరం బతికించలేం బాధతో అన్నాడు దాసు. బతికిద్దాం...మనం బతికున్నంత కాలం’’ అన్నాడు నాగేశ్వరరావు. అర్ధం కానట్టు చూసాడు దాసు. ‘‘పేడ అలికిన వాకిళ్ళలో మనకోసం ఇత్తడి పళ్ళెంలో బియ్యం పెట్టుకుని సిద్ధంగా ఉన్నవాళ్ళున్నారు. మనం బయలుదేరాలి. వాళ్ళకోసం చలితిరిగే వీధుల్లోకి నువ్వూ–నేనూ తిరగాలి’’ ఆనందం కురుస్తున్న కళ్ళతో చెప్పాడు నాగేశ్వరరావు. ‘‘కానీ, ఈ కీళ్ళ నొప్పులతో నాకది జరిగే పనేనా’’ అంటున్న దాసు చేతిపై చెయ్యి వేసి రెండు కళ్ళు ఆర్పుతూ ఇది భగవంతుడిచ్చిన భరోసా అన్నట్లు తలాడించాడు నాగేశ్వరరావు. జంగాల నాగేశ్వరరావు ఏదో చెప్పాక ఇదమిత్ధమని చెప్పగలిగే అశాంతి నారాయణ దాసు నుండి దూరమైంది. ఆ తెల్లారుజామున మూసిన కిటికీలోంచి ముసుగుదొంగలా చలి చొచ్చుకొస్తుంది. హరిదాసు వస్త్రాలు, తంబురా, చిడతలు, అక్షయ పాత్ర పట్టుకుని వాకిట్లోని సైకిల్ తీసుకుని వీధి అరుగు మీద కూర్చుని మోకాళ్ళు మర్దన చేసుకుంటున్నాడు. గడ్డకట్టే చలిలో గంగమ్మని నెత్తి మీద నుండి దిమ్మరించుకుని ‘హరహర మహాదేవ శంభోశంకర’ అనుకుంటూ, నంది మకుటంగా గల గంటను తీసుకుని, శంఖాన్ని సంచిలో వేసుకుని జంగాల నాగేశ్వరరావు సైకిలెక్కి దాసుని కలుపుకున్నాడు. గోదారి లంకలోని ఊళ్ళమీదుగా, గోదారి నది నుండి రైతుల కోసం కాలువగా మారిన గట్ల మీద నుండి ఆ రెండు సైకిళ్ళు రథాల్లాగా పరిగెడుతున్నాయి. దాసు కీళ్ళనొప్పుల్ని ఉత్సాహం జయించింది. లంకలోని ఒక ఊరు చేరుకుని శివాలయం ముందు ఆగారు. గుడి బయట వీధి లైటొకటి వెలుగుతుంది. చలికి మునగదీసుకుని పడుకుని ఉండడం వల్ల కోళ్ళ, కుక్కల శబ్దం వినబడడం లేదు. జరగబోతున్న అద్భుతాన్ని తిలకించడానికా అన్నట్లు అంతా నిశ్శబ్దంగా ఉంది. నాగేశ్వరరావు తన గంటను, శంఖాన్ని, వస్త్రాల్ని నారాయణ దాసుకిచ్చాడు. దాసు తన హరిదాసు వస్త్రాల్ని, అక్షయ పాత్రను, చిడతల్ని, తంబురాను నాగేశ్వరరావుకిచ్చాడు. దాసు త్రిపుండ్రాలను నుదుటిపై ధరించాడు. నాగేశ్వరరావు తన నుదిటిపై నిలువు నామాన్ని దిద్దుకున్నాడు. ఒకరి వస్త్రాలను మరొకరు వేసుకుని, ఒకరి వస్తువుల్ని మరొకరు పట్టుకున్నారు. ఇప్పుడు నారాయణదాసు జంగముడయ్యాడు. జంగాల నాగేశ్వరరావు హరిదాసయ్యాడు. వేషధారణ పూర్తయ్యాక ఇద్దరూ ఒకరికొకరు అబ్బురంగా చూసుకున్నారు. కాసేపు పలుకే బంగారమయ్యింది. మాటలకందని స్థితొకటి అక్కడ ఆవరించింది. ఆ దృశ్యాన్ని చూడడానికి గాలి కూడా మంత్రబద్ధమైన మహాసర్పంలా నెమ్మదించింది. ‘‘ఇక నీకు మోకాళ్ళ మీద వంగే బాధ ఉండదు దాసు...నీ బాధ నాది. నా సుఖం నీది. ఇంటికెళ్ళాక నీకు దిష్టి తియ్యాలి ఇదంతా మాయా జంగముడి లీల’’ అన్నాడు జంగాలనాగేశ్వరరావు. ‘‘ఏ మాటకామాటే చెప్పుకోవాల్రా...నాకంటే నీకే ఈ వేషం బాగుందిరా. నన్ను మించి ఈ వేషంలో గొప్పగా ఒదిగిపోయావనుకో. కలయా వైష్ణవ మాయా’’ అన్నాడు నారాయణదాసు. ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అవి కురుస్తున్న హిమం వల్లో, కరుగుతున్న హృదయం వల్లో నిర్దిష్టంగా చెప్పలేం. ఇద్దరూ శివాలయం వైపు తిరిగారు. నారాయణదాసు అక్కడున్న మారేడు చెట్టుకు నమస్కరించాడు. జంగాల నాగేశ్వరరావు రావిచెట్టుకు నమస్కరించాడు. తెల్లారుతోంది. ఇద్దరూ ఒకర్నొకరు నిమిషం కళ్ళార్పకుండా చూసుకుని బసవేశ్వరుడు, అపర నారదుల్లా కళ కోసమో, కడుపు కోసమో చెరో వీధివైపు నడిచారు. -
టెన్త్‌లో రెండు, ఇంటర్లో మూడు సార్లు ఫెయిల్..
సూర్యాపేటటౌన్ : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.. సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొచ్చెర్ల వేణు. పదో తరగతిలో రెండు సార్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా చదువును మధ్యలో అపేయకుండా కొనసాగించాలనే సంకల్ఫమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటున్నాడు. ఓ వైపు తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అన్ని సార్లు ఫెయిల్ అయ్యావు.. ఇక ఏం చదువుతావులే అని అన్నప్పటికీ పట్టుదలతో చదివాడు. తండ్రి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు డబ్బులు ఇవ్వకున్నా తాను సొంతంగా లేబర్ పని చేస్తూ వచ్చే డబ్బులతో కోచింగ్ తీసుకొని టెన్త్, ఇంటర్లో పాసయ్యాడు. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు.. సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల వేణు. తాను ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో అదే సబ్జెక్టు టీచర్‌గా కొనసాగుతున్నాడు. సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల రాములు,లక్ష్మమ్మ కుమారుడు కొచ్చెర్ల వేణు. అతని తోడ ఇద్దరు చెల్లెళ్లు, అక్క, అన్నయ్య ఉన్నారు. తండ్రి రాములు సుతారి మేస్త్రీగా పని చేస్తూ పిల్లలను చదివించేవాడు. కాగా వేణు 7వ తరగతి చదువున్న సమయంలో తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి వేణుకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే వారి పెద్ద అక్కకు పెళ్లి చేశారు. ఇద్దరు చెళ్లెళ్లను ప్రభుత్వ హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. సమయానికి ఇంట్లో వండి పెట్టేందుకు ఎవరూ లేకపోవడంతో వేణు, అతని అన్నయ్య ఇద్దరు కలిసి వండిపెట్టే వారు. ఇంట్లో పనులు చూసుకుంటూ వేణు స్కూల్‌కు వెళ్లేవాడు. ఫెయిల్ అయినా కుంగిపోలేదు సూర్యాపేటలోని జెడ్పీ బాలుర పాఠశాలలో వేణు పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. 1982 మార్చిలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వేణు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మళ్లీ సప్లమెంటరీ పరీక్ష రాసి సైన్స్ పాసయ్యాడు. మ్యాథ్స్ ఫెయిలయ్యాడు. 1983 మార్చిలో మళ్లీ పరీక్ష రాసి మ్యాథ్స్ ఉత్తీర్ణుయ్యాడు. అనంతరం ఇంటర్ విద్యకోసం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాడు. 1983–84లో ఇంటర్ ఫస్టియర్‌లో గణితం తప్పాడు. సప్లమెంట్ పరీక్ష రాసినా ఫలితం లేకపోయింది. 1984–85లో ఇంటర్ సెకండరియర్లో ప్రవేశించాడు. ఆ సంవత్సరం వార్షిక పరీక్షలో సెకండరియర్ ఉత్తీర్ణుయ్యాడు. కానీ, ప్రథమ సంవత్సరం గణితం మాత్రం పాస్ కాలేదు. ఎంసెట్ రాస్తే ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు వచ్చింది. కానీ ఇంటర్లో పాస్ కాకపోవడంతో ర్యాంకు వచ్చినా నిష్పయోజనమైంది. ఎఫ్‌సీఐ గోదాంలో పని చేస్తూ.. ఇంటర్ ఫెయిల్ కావడంతో చేసేదేమీ లేక రెండు సంవత్సరాల పాటు ఎఫ్‌సీఐ గోదాంలో లేబర్‌గా పనికి కుదిరాడు. పని చేస్తూనే ఇంటర్లో తప్పిన సబ్జెక్టు కోసం ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యావు ..ఇక ఏం చదువుతావు లే.. పనికి వెళ్లూ అని తన తండ్రి చెప్పినా నిరాశ చెందలేదు. పనికి వెళ్తూనే ఫెయిల్ అయిన సబ్జెక్టులో పాస్ అయ్యేందుకు పట్టుదలతో చదివిడు. ఒక సంవత్సరం ఉప్పలపహాడ్ సమీపంలోని సంగీత కెమికల్స్‌లో పని చేసేవాడు వేణు. అలా పని చేసూకుంటూ 1987 అక్టోబర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టు పరీక్ష రాసి పాసయ్యాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1988లో సిటీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరాడు. డిగ్రీ చేస్తూనే వివిధ కంపెనీల్లో పార్ట్‌టైం పని చేస్తూ తన చదువుకు అయ్యే ఖర్చులు వెళ్లదీస్తూ చదివాడు. గణితంలో ఫెయిల్ అయ్యాననే కసితో... తాను టెన్త్, ఇంటర్లో మ్యాథ్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాననే కసితో మ్యాథ్స్‌ను బాగా నేర్చుకుని అదే సబ్జెక్టులో బీఈడీలో చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. 1994 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు. మొదటి ఉద్యోగాన్ని 1995లో ఆత్మకూర్(ఎం) మండలం కూరెళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్న తి వచ్చింది. ప్రస్తుతం పిల్లలమర్రి జెడ్పీహెచ్ఎస్లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే కానీ.. పరీక్షే జీవితం కాదు. ప్రతి ఓటమిని ఛాలెంజ్‌గా తీసుకోవాలి. మన బల, బలహీనతలను అంచనవేసుకొని ముందుకెళ్లాలి. ఎక్కడ అపజయం ఎదురైందో అక్కడే పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. పరీక్ష ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందనే భావన మన మనసులో ఉండకూడదు. –కొచ్చెర్ల వేణు, స్కూల్ అసిస్టెంట్ పిల్లలమర్రి జెడ్పీహెచ్ఎస్ -
నామాను గెలిపించాలి : సినీహీరో వేణు
చింతకాని: ఖమ్మం పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ హీరో తొట్టెంపూడి వేణు కోరారు. నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో శనివారం వేణు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి నామా విజయానికి పాటుపడాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, సత్యనారాయణ, తోటకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నామాతోనే అభివృద్ధి సాధ్యం ముదిగొండ: ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే నామా నాగేశ్వరరావును గెలిపించాలని సినీహీరో తొట్టెంపూడి వేణు కోరారు. మండలంలోని బాణాపురంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు పచ్చా సీతారామయ్య, మండల నాయకులు దేవరపల్లి ఆదినారాయణరెడ్డి, మరికంటి సత్యనారాయణ, అనిత, శ్రీరాములు పాల్గొన్నారు. -
సచ్చింది..’లో కామెడీ చేస్తా
బుల్లితెర యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ వెండితెరపైనా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, ‘జబర్దస్త్’ రాకేష్, శివారెడ్డి, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో శ్రీధర్‌రెడ్డి యార్వ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీపక్ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటేతో కలిసి సోహామ్ రాక్‌స్టార్ ఎంటర్ టైన్మెంట్– ఎంటర్టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై రూపొందుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి యార్వ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా అయినప్పటికీ డిఫరెంట్ జోనర్లో డార్క్ కామెడీతో తెరకెక్కిస్తున్నా. అనసూయ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘హీరో–హీరోయిన్ అని కాకుండా కేవలం కథే హీరోగా నడిచే చిత్రమిది. ఇందులోని తెలంగాణ సాంస్కృతిక గీతం ఒగ్గు కథ నన్ను ఆకట్టుకుంది. సినిమాటిక్‌గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో నేను ఫస్ట్ టైమ్ కామెడీ రోల్ ట్రై చేస్తున్నా. ఈసారి అందర్నీ నవ్విస్తా’’ అన్నారు అనసూయ. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌కుమార్. -
మూఢ నమ్మకాల నేపథ్యంలో...
‘పంచమి’ చిత్రదర్శకురాలు సుజాత భౌర్య దర్శకత్వంలో మరో సినిమా ఆరంభమైంది. హర్షవర్ధన్, సుజయ్, వేణు, శాంతి మహరాజ్, మమతా కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై చల్లా విజయ్‌కుమార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సిరాజ్ క్లాప్ ఇచ్చారు. దర్శకురాలు మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నాకిది మూడవ చిత్రం. కామెడీ, హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. మూఢ నమ్మకాలను ఆధారం చేసుకుని కథ సిద్ధం చేశా. ఇందులో బాలిక పాత్ర హైలెట్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘కథ వినగానే ఎగై్జట్ అయ్యా. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా’’ అన్నారు నిర్మాత విజయ్ కుమార్. తనికెళ్ల భరణి, జయసుధ, ఉత్తేజ్, జీవా, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందర్ కృష్ణ, సంగీతం: శ్రీ కోటి. -
ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్యం తగదు
9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలను విజయవంతం చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణు గొర్రిపూడి(కరప) : పేదలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ విమర్శించారు. మండలంలోని గొర్రిపూడిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలకోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు అన్ని కలెక్టరేట్ల వద్ద ఈనెల 9న ధర్నాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ల వద్దకు తరలివచ్చి, ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పెద్దనోట్లు రద్దు చేసిందని, గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. నల్లధనం బయట పెట్టటానికే పెద్దనోట్లు రద్దుచేశామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకుంటున్నారేకానీ దానివల్ల మధ్యతరగతి ప్రజలకే ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతుండటం వల్ల గ్రామాల్లో కూలీలకు పనులు ఉండటంలేదని, రైతులు పొలాల్లో పనులు చేయించుకోలేక పోతున్నారన్నారు. పుట్టలో ఉన్న పామును పట్టుకోవాలేకానీ, పాముకోసం పుట్టనే తగలపెట్టడం భావ్యంకాదన్నారు. నల్లకుబేరుల జాబితా ఉన్నప్పుడు వాళ్లను పట్టుకోవాలేకానీ, ప్రజలందరినీ వేధించడం తగదన్నారు. అంతకుముందు ఆయన గ్రామంలో వల్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు. -
వాగులో కొట్టుకుపోయిన బైకర్
- కాపాడిన స్థానికులు మెడ్చల్(రంగారెడ్డి) వాగులో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనదారుడిని స్థానికులు కాపాడిన సంఘటన రంగారెడ్డి జిల్లా మెడ్చల్ మండలం కిష్టాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేణు ఈరోజు ఉదయం బైక్ పై మెడ్చల్ వెళ్తుండగా.. కిష్టాపూర్ శివారులోని వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. ఆ సమయంలో వాగు వద్ద ఉన్న యువకులు వాగులో కొట్టుకుపోతున్న వేణును తాళ్ల సాయంతో యువకుడిని రక్షించారు. -
సెల్ఫీ సరదా.... ముంచేసింది!
మెదక్: సెల్ఫీ సరదా కోసం యువకులు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ప్రమాదమని తెలిసినా సరదా కోసం సెల్ఫీలు దిగడం, అనంతరం సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. సెల్ఫీపై మోజుతో ఇద్దరు యవకులు ఉధృతంగా ఉన్న నీటి ప్రవాహంలో గల్లంతైన ఘటనలు పటాన్‌చెరులోని పెద్దవాగు, జిన్నారంలోని అక్కమ్మ చెరువు అలుగు వద్ద బుధవారం చోటుచేసుకున్నాయి. పెద్దవాగులో వేణు అనే యువకుడు చిక్కుకపోగా, జిన్నారంలోని అక్కమ్మ చెరువు అలుగు వద్ద సెల్ఫీ దిగుతుండగా రాము (24) అనే యువకుడు కొట్టుకపోయాడు. స్థానికుల సమాచారంతో అధికారులు వేణుని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హెలికాప్టర్ తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గల్లంతైన రాము అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా వేణు
నయీంనగర్/ఆత్మకూరు : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆత్మకూరు మండలం పులుకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పరికిపండ్ల వేణు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా నుంచి వేణు జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర మానవవనరుల శాఖ వెబ్సైట్లో పేర్కొంది. సెప్టెంబర్ 5వ తేదీన జరిగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో ఆయన అవార్డు స్వీకరించనున్నారు. తెలంగాణలో మొత్తం ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాగా.. మన జిల్లా నుంచి వేణు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా, వేణు 2003లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2008లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఇదే ఏడాది ఇందిరా ప్రియదర్శిని అవార్డులను అందుకున్నారు. కాగా, 2001 జనాభా గణనలో ఉత్తమ సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఎన్యూమరేటర్‌గా వెండి పతకం, ప్రశంసపత్రంతో సత్కరించింది. వీటితోపాటు ఆయన మరెన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు స్వీకరించారు. ప్రధానంగా 2014లో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు నిర్విరామంగా హాజరై జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొం దారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా వేణు ఎంపిక కావడంపై అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
నిలదీసిందని నిప్పు పెట్టారు...
కొడుకును ఎందుకు కొట్టారని అడిగినందుకు.. ఇంటిపై దాడి, మహిళపై పెట్రోల్ పోసి నిప్పు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న బాధితురాలు ఎనిమిది మంది రిమాండ్.. పరారీలో ఇద్దరు అడ్డగుట్ట: తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీసిన పాపానికి మహిళపై ఓ వ్యక్తి కక్షగట్టాడు. తన కుటుంబసభ్యులతో ఆమె ఇంటిపై దాడి చేశాడు. అందరినీ చితకబాదాడు. అడ్డువెళ్లిన ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం...అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన మల్లేష్ ఆదివారం తన వీధిలో నుంచి కారు తీస్తుండగా అదే ప్రాంతానికి చెందిన వేణు(11) అనే బాలుడు అడ్డంగా వచ్చాడు. ఆగ్రహానికి గురైన మల్లేష్ కారుదిగి ఆ బాలుడ్ని కొట్టాడు. ఇది గమనించిన శ్రీకాంత్ అనే యువకుడు ఎందుకుకొడుతున్నావని ప్రశ్నించడంతో మల్లేష్ అతడిని కూడా కొట్టాడు. దీంతో శ్రీకాంత్ తల్లి చంద్రకళ (40)(గాయపడిన మహిళ) వచ్చి ఎందుకు నా కొడుకును కొడుతున్నావని అడిగింది. దీంతో మల్లేష్-చంద్రకళల మధ్య వాగ్వాదం జరిగింది. బస్తీ నాయకులు వచ్చి ఉదయం మాట్లాడుదామని చెప్పి గొడవను అదుపు చేశారు. ఉదయాన్నే దారుణం... తనతో గొడవపడిన చంద్రకళపై కక్షగట్టిన మల్లేష్ సోమవారం ఉదయాన్నే తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేశాడు. చంద్రకళ కుటుంబసభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. తన పిల్లలను కాపాడుకొనేందుకు అడ్డువెళ్లినచంద్రకళపై మల్లేష్ మేనల్లుడు బంటీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో నిండిపోయింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. కాలినగాయాలతో పడివున్న చంద్రకళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 30 శాతం కాలిన గాయాలతో చంద్రకళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ గొడవ కారణమైన మల్లేష్(50), శివకుమార్, పొట్టికుమార్, శివ, సాయికిరణ్, బంటి, వెంకటేష్, కేతమ్మ, శంకరమ్మ, సాలమ్మ (మొత్తం 10 మంది)పై పోలీసులు 147, 148, 149 ఐపీసీ, 307 కేసులు నమోదు చేశామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే శంకరమ్మ, సాలమ్మలు పరారీలో ఉన్నారని, మిగిలిన 8 మంది నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. -
పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఆకుపాముల (మునగాల) : మండలంలోని ఆకుపాముల గ్రామపంచాయతీ శివారులో ఉన్న భగత్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి మంగళవారం అర్థరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కళాశాల యాజమాన్యం, సహచర విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల డివిజన్ శ్రీరాంపూర్‌కు చెందిన దుర్గం కృష్టయ్య మూడో కుమారుడు దుర్గం వేణు (17) గత సంవత్సరం నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా మండలంలోని ఆకుపాముల భగత్ పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ విభాగంలో సీటు సాధించాడు. వేణు కళాశాల ప్రాంగణంలో ఉన్న డిప్లోమా హాస్టల్ ఉంటూ కళాశాలకు వెళ్తుండేవాడు. ఈ హాస్టల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు జార్ఖాండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 350 మంది విద్యార్థులు ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. సోమవారం సెలవు కావడంతో సహచర విద్యార్థులు, రూమ్మేట్స్తో వేణు సరదాగా కాలం గడిపాడు. సాయింత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లిన వేణు తిరిగి హాస్టల్‌కు రాలేదు. రాత్రి ఎనిమిది గంటల వరకు కనీసం మెస్‌కు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో కళాశాలకు చెందిన విద్యార్థులు, సిబ్బంది జట్లుగా ఏర్పడి కళాశాల చుట్టు దాదాపు మూడు కి.మీ పరిధిలో వెతుకులాట ప్రారంభించారు. కాగా రాత్రి 10 గంటల సమయంలో ఆకుపాముల ఆవాస గ్రామమైన నర్సింహాపురం శివారులో కారింగుల వీరయ్యకు చెందిన వ్యవసాయ బావి ఒడ్డున వేణుకు సంబంధించిన సెల్‌ఫోన్, చెప్పులు ఉండడంతో అనుమానించిన విద్యార్థులు, సిబ్బంది బావిలో వెతకగా వేణు మృతదేహాం లభ్యమైంది. దీంతో వారు కళాశాల యజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం తెల్లవారుజామున ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సాయం తో వేణు మృతదేహాన్ని బయటకు తీశారు. హత్యా..ఆత్మహత్యా? ఇదిలా ఉండగా దుర్గం వేణు మృతి అనుమానాస్పదంగా మారింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్న వేణు హాస్టల్‌కు దూరంగా ఉన్న బావిని ఎందుకు ఎంచుకుంటాడనేది ఓ ప్రశ్న. ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడా అనేది మరో ప్రశ్న. మృతుడి దేహాంపై అక్కడక్కడ గాయాలు కనిపించడంతో ఎవరైన హత్య చేసి బావిలో పడవేశారా అనేది మీమాంసగా మారింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారిస్తే తప్ప వాస్తవాలు తెలియవని పోలీసులు, యాజమాన్యం అంటోంది. కోదాడ రూరల్ సీఐ పి.మధుసూదన్న్రెడ్డి, రూరల్ ఎస్ఐ విజయప్రకాశ్, మునగాల ఎస్ఐ గడ్డం నగేశ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్‌కు చెందిన పలువురు విద్యార్థులను విచారించారు. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకే... ఇటీవల పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్ల ఒత్తిడి తట్టుకోలేక మానసిక వేదనతో వేణు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కళాశాల యాజమన్యం అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. వారం రోజలుగా కళాశాలలో పరీక్ష నిర్వాహకులు విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని పలువురు విద్యార్థులు తమ ముందు వాపోయారని యాజమాన్యం తెలిపింది. కేసు నమోదు... భగత్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన దుర్గం వేణు అనుమానాస్పద మృతిపై మృతుడి తండ్రి కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ సీఐ పి.మధుసూధన్‌రెడ్డి తెలిపారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
బావిలో పడి విద్యార్థి మృతి
పాల్టెక్నిక్ విద్యార్థి బావిలో పడి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం వెలుగుచూసింది. అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన దుర్గం వేణు(22) స్థానిక భగత్ కళాశాలలో పాల్టెక్నిక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. బావిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జైలులో..భలే మంచి రోజు
హీరో సుధీర్ బాబు, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, హాస్య నటుడు వేణులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోశారు. అయ్యో అంత పని ఏం చేశారు వాళ్లు అనుకుంటున్నారా..? అసలు విషయమేమిటంటే.. అనాథ పిల్లలు న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఎఫ్ఎం రేడియో మిర్చి శనివారం కూకట్‌పల్లిలోని మంజీరా మాల్లో ‘ఫండ్ రైజింగ్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జైలు లాంటి సెట్లో ఆర్జే సమీర్ బందీ అయ్యారు. సదుద్దేశంతో అతను చేసిన ఈ సత్కార్యానికి తమ వంతు సహకారమందించాలని ‘భలే మంచి రోజు’ చిత్ర బృందం భావించింది. అందుకే సుధీర్‌బాబు, శ్రీరామ్ ఆదిత్య, వేణు మంజీరా మాల్‌కు వచ్చారు. జైలు లాంటి ఆ సెట్లో తమను తాము బంధించుకున్నారు. అనాథ పిల్లలకు అవసరమయ్యే ఫండ్ సమకూరే వరకూ బందీలుగానే ఉన్నారు. ‘ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించి, మానవత్వాన్ని చాటుకోవాల’ని సుధీర్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జే హేమంత్, ప్రోగ్రామింగ్ హెడ్ సాయి తదితరులు పాల్గొన్నారు. -
పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వేణు
సాక్షి, హైదరాబాద్: జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వేణు, సృజన్ సత్తాచాటుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో ఏపీ పారా అథ్లెట్లు రెండు పతకాలు గెలుపొందారు. ప్రకాశం జిల్లాకు చెందిన వినుకోటి వేణు బంగారు పతకం సాధించాడు. సిట్టింగ్ కేటగిరీ ఎఫ్-56 డిస్కస్ త్రో ఈవెంట్లో అతను విజేతగా నిలువగా... కృష్ణా జిల్లాకు చెందిన వేసంగి సృజన్ కాంస్యం గెలుపొందాడు. టి-46 కేటగిరీ 1500 మీటర్ల పరుగు పందెంలో పోటీపడిన సృజన్ మూడో స్థానంలో నిలిచాడు. తమ క్రీడాకారుల విజయం పట్ల ఏపీ పారాలింపిక్ సంఘం అధ్యక్షుడు బి. రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చాంపియన్‌షిప్‌లో 20 మంది సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ జట్టు పోటీపడింది. -
వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా వేణు
సూర్యాపేటమున్సిపాలిటీ : వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కోదాడ నియోజకవర్గం మోతె మండలానికి చెందిన పచ్చిపాల వేణుయాదవ్ను ఎంపిక చేశారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి ఆదేశానుసారం యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ ఆదివారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పచ్చిపాల వేణు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జాతీయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్నగౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యు న్నతి కోసం శక్తి వంచన లేకుం డాకృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
నవ్విన ధాన్యరాశి: పల్లె సౌందర్యపు కథలు
కథా సంపుటి ఏది మంచి కథ అవుతుంది? అన్న ప్రశ్నకు ఇదమిద్ధమైన జవాబు చెప్పడం కష్టమేమో కానీ కాలానికి నిలిచేది సరి అయిన కథ అని చెప్పుకోవచ్చునేమో! అందుకే ఒక కథ ప్రచురితమైనప్పుడు గొప్పగా అనిపించినా అదే కథ తర్వాతి కాలంలో అంతే అనుభూతిని ఇవ్వని సందర్భాలుంటాయి. ఆ దృష్టితో బేరీజు వేసినప్పుడు నిన్నటి తరం కథకులు సి.వేణు (అసలు పేరు సీకల వేణుగోపాల్ రెడ్డి) కథలు ఈ నాటికీ మన మనసుల్ని తట్టి పలకరిస్తున్నాయి కనుక అవి మంచి కథల కిందే లెక్క. మధురాంతకం రాజారాం మిత్రుడయిన సి.వేణు చిత్తూరు జిల్లా రచయితల సంఘం ద్వారా సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఎనభై ఎనిమిదేళ్ళ ముదిమి వయసులో కూడా కథ అంటే ప్రాణం పెడతారు. అందుకే ‘నవ్విన ధాన్యరాశి’ పేరుతో వారి పాతకథల్ని, తర్వాతి కాలంలో రాసిన కథల్ని సంకలనంగా తీసుకొచ్చారు. ఇటీవల రచయితల మధ్యే దాన్ని ఆవిష్కరింపజేశారు. 1962లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కథల పోటీ నిర్వహించినప్పుడు సి.వేణు కథ ‘నవ్విన ధాన్యరాశి’ మొదటి బహుమతి పొందింది. కథ పేరు ఎంత హాయిగా వుందో కథ మాత్రం అంత విషాదం. ఒక పల్లెటూరి యువకుడికి, యువతికి మధ్య జరిగిన ప్రేమకథ ఇది. ఆ ప్రేమను సహించలేని యువతి తండ్రి కక్ష బూనటం, పంటకుప్పలని తగలబెట్టడం, తోటల్ని నరకడం చివరికి ఆ ప్రేమికులిద్దరూ అసువులు బాయటంతో కథ ముగుస్తుంది. రచయితలోని సౌందర్యదృష్టి కథకో శాశ్వతత్వాన్ని కల్పించింది. ఒకనాటి పల్లె సౌందర్యాన్ని ఈ వాక్యాలెంతగా పట్టుకుంటాయో చూడండి. ‘పడమరగా పల్లెను ఒరుసుకుంటూ పోయే కొండవాగు, గుట్టపై నుండి దట్టంగా పెరిగిన చెట్లు, మెట్లు మెట్లుగా నీలాల నింగికి నిచ్చెన నిలబెట్టినట్లు పర్వతసానువులు’... వేణు గారి వచనం కొంత గ్రాంథికం, కొంచెం కవిత్వం, కొంచెం పల్లెజనుల స్వచ్ఛమయిన భాషతో మూడుపాయలుగా సాగుతుంది. మరొక ఆకుపచ్చని జ్ఞాపకం ‘మారెమ్మ గుడి’ కథ. భూస్వాములు పాలేర్లను ఎంతగా పీల్చి విప్పి చేసేవారో రసాత్మకంగా చెప్పే కథ. భూస్వాముల వైకుంఠపాళిలో పావుగా మారి ప్రేయసిని పోగుట్టుకున్న మల్లన్న కథ ఇది. స్వంతభూమి కోసం తపించి ఆ మట్టిలోనే కలిసిపోవాలనుకునే నారాయుడనే రైతు కూలీ చివరికి చితాభస్మంగా తను తపించిన భూమిలో విసిరివేయబడటం మనకు దుఃఖం కలిగిస్తుంది. సి.వేణు కథలన్నీ అప్పటి కాలం నాటి దౌష్ట్యాన్ని, దుఃఖాన్ని, మానవత్వాన్ని పెనవేసుకుంటూ సాగుతాయి. ప్రతికథలోనూ రచయిత ఆత్మ తొంగి చూస్తూ ఉంటుంది. ఈతరం పాఠకులకి సి.వేణు అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ కథలంటే ఇష్టపడే ఈ తరం పాఠకులు కొంచెం ఓపిక చేసుకుని చదవగలిగితే అచ్చమయిన పల్టె అనేది ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసుకుంటారు. అంతేకాదు రచయితలోని సౌందర్య దృష్టి కథనొక కళాత్మక చిత్రంలా ఏ విధంగా మారుస్తుందో ఆ కథలు చూసి అర్థం చేసుకుంటారు. కథ ఒక చరిత్రని ఎలా రికార్డు చేస్తుందో, ఒక పూరా జ్ఞాపకాన్ని ఎలా తవ్వితోడుతుందో కూడా తెలుస్తుంది. ఈ పుస్తకంలో సి.వేణు కథల్ని పరిచయం చేయడానికి మధురాంతకం నరేంద్ర, పలమనేరు బాలాజీ, టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి రాసిన వ్యాసాలు ఈ కథల్లోని అంతః సౌందర్యాన్ని పాఠకులకు విశదపరుస్తాయి. సి.వేణు కథల్లోనే కాదు, అన్వర్ ముఖచిత్రం వల్ల అందంగా వున్న ఈ సంకలనంలో కూడా ఒక సౌందర్యం తళుకులీనుతూ మనల్ని ఆకర్షిస్తుంది. ఒక సౌందర్య పిపాసకుడి అన్వేషణకు ప్రతిరూపం ‘నవ్విన ధాన్యరాశి’. - సి.ఎస్. రాంబాబు 9490401005 -
విద్యార్థిని బలిగొన్న బోరు బండి
గణతంత్ర వేడుకలకు వెళుతుండగా దుర్ఘటన గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు మల్లంపల్లిలో విషాద ఛాయలు కంచనపల్లి (రఘునాథపల్లి) : అమ్మా .. జెండా పండుగకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరి న ఓ బాలుడు నిమిషాల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరాడు. సైకిల్‌పై పాఠశాలకు వెళుతుండగా బోరు బండి ఢీకొనడంతో తల్లికి పుట్టెడు శోకాన్ని మిగిల్చి అ నంతలోకాలకు చేరాడు. ఈ సంఘటన మండలంలోని కంచనపల్లి సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కంచనపల్లి శివారు మల్లంపల్లికి చెంది న తాళ్లపల్లి ప్రభాకర్, కోమల దంపతుల పెద్ద కుమారుడు వేణు(10) గ్రామంలోని జేసు హృ దయ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చ దువుతున్నాడు. సోమవారం గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు సైకిల్‌పై అతడు పాఠశాలకు బయల్దేరాడు. శివాజీనగర్ దాటాక కంచనపల్లి నుంచి కుర్చపల్లి వైపు వెళ్తున్న బోరుబండి అతడి సైకిల్‌ను ఢీకొంది. దీంతో సైకిల్‌పై నుంచి వేణు కిందపడిపోగా బోరుబండి వెనక టైరు అతడి కాలిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయూలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవర్, దానిపై పనిచేసే కార్మికులు బోరుబండిని వదిలేసి పారిపోయా రు. స్థానికులు వచ్చి చూడగా వేణు మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి బోరుబండిని స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెద్దోన్ని చేస్తాననుకున్న బిడ్డా.. పైసలు పెట్టి చదివించి పెద్దోన్ని చేయాలకున్నా బిడ్డా... మమ్ములను ఆగం చేసి పోయినవా బిడ్డా అంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. గ్రామస్తులు ఘట నా స్థలికి పెద్దఎత్తున చేరుకుని కన్నీటిపర్యంతమయ్యూరు. పాఠశాలలో వేడుకలను నిలిపివేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం తెలిపారు. -
ముందు మనం మనుషులం: మంచు మనోజ్
హైదరాబాద్: కమెడియన్ 'జబర్దస్త్' వేణుపై జరిగిన భౌతికదాడిపై హీరో మంచు మనోజ్ స్పందించారు. వేణుపై దాడిని చావకబారు, అమానవీయ చర్యగా ఆయన పేర్కొన్నారు. కుల, మతాల కంటే ముందు మనం మనుషులం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఈమేరకు తన ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టారు. కమెడియన్ జబర్దస్త్ వేణుపై ఆదివారం ఫిల్మ్ నగర్లో గౌడ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారన్న కోపంతో ఈ దాడికి పాల్పడ్డారు. కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ తో పాటు పలువురు నటులు ఖండించారు. నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమని చిరంజీవి సోదరుడు నాగబాబు అన్నారు. మంచు మనోజ్ ట్వీట్ Soo cheap and inhuman to hit Actor Venu ... Cowards ... Wish I was at chamber then -
‘జబర్దస్త్’ వేణుపై దాడి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న ‘జబర్దస్’్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. దీంతో కిందపడిపోయిన వేణు వారి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న ఫిలింనగర్ అవుట్‌పోస్ట్‌లో దూరాడు. గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టికూట రామారావు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ విద్యార్థులు ఫిలించాంబర్ వద్దకు చేరుకున్నారు. వేణు ప్రదర్శించిన స్క్రిఫ్ట్ వల్ల కోటి మంది గౌడ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువురిపై కేసు నమోదు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
''జబర్దస్త్ టీమ్ క్షమాపణ చెప్పాలి''
-
హాస్యనటుడు జబర్దస్త్ వేణుపై దాడి!
-
అప్పు తీర్చమని బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మాహత్యాయత్నం కుకునూరు: అప్పు తీర్చమని బ్యాంకు మేనేజర్ చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కుక్కునూరులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... స్థానిక ఏపీజీవీబీ బ్యాంకులో పరాంకుశం అనే వ్యక్తి వేణు ఫ్యాన్సీ దుకాణం కోసం ఆ బ్యాంకులో రూ.25 వేలు రుణం తీసుకున్నాడు. గతేడాది జనవరిలో తీసుకున్న రుణాన్ని ఇంతకుముందు ఉన్న బ్యాంకు అధికారులు ఈ ఏడాది రెన్యువల్ చేశారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న మేనేజర్ తాతా అంకాల్ తరచూ వేణును పిలిచి రుణం తీర్చమని, లేకుంటే నోటీసులు పంపిస్తానని, ఇల్లు, దుకాణం జప్తు చేస్తానని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వేణు మంగళవారం బ్యాంకు వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పటించుకునే సమయంలో అక్కడే ఉన్న పలు పార్టీల నాయకులు, రైతులు అడ్డుకున్నారు. స్థానికులు మేనేజర్‌తో వాదనకు దిగారు. -
మిడ్నైట్ బఫే
బిజీ నగర జీవనంలో నైట్ లైఫూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రాత్రి సంచారుల కోసం ఫుడ్ కోర్టులూ వెలుస్తున్నాయి. వారి అభి‘రుచి’కి తగ్గట్టుగా నయా మెనూలతో ఆకర్షిస్తున్నాయి. తాజాగా అమీర్‌పేట హోటల్ ఆదిత్య పార్క్ ‘మిడ్నైట్ బఫే’ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 10 నుంచి రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు మీరూ ఇక్కడి రుచులను ఆస్వాదించవచ్చు. రెండు రకాల స్టాటర్స్, సూపు, మూడు రకాల బిర్యానీలు, హలీమ్, పాయా పోర్బా, మూడు రకాల ఓరియంటల్ రుచులు ఈ బఫేలో ఉంటాయి. వీటితోపాటు పాస్తా, అప్పం వంటివి వేడివేడిగా ఆరగించడానికి లైవ్ కౌంటర్లున్నాయి. చైనీస్ వింగ్లెట్, హైదరాబాద్ కబాబ్, రోస్ట్ ఎగ్ మసాలా, కబాబ్ రైస్, నిజామీ హండీ వంటి వెరైటీలు ఇందులో ఉన్నాయని మాస్టర్ చెఫ్ వేణు నోరూరిస్తున్నారు. - సాక్షి, సిటీ ప్లస్ -
అటెండర్ చేతిలో ‘స్టీరింగ్’
ముప్పారం(నిడమనూరు): పాఠశాల బస్సు డ్రైవర్ బాధ్యతారాహిత్యం చిన్నారుల ప్రాణాలమీదకొచ్చింది.. స్టీరింగ్ అటెండర్‌కు ఇవ్వడం తో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిడమనూరు మండలం ముప్పారం గ్రామ శివారులో శుక్రవారం చో టు చేసుకుంది. వివరాలు.. నిడమనూరుకు చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు రోజు మాదిరిగా మండల పరిధిలోని ఆ యా గ్రామాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చేందుకు బయలుదేరింది. వేంపాడ్, జీ అన్నారం గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని ముప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి గాతులోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో అన్నారం, వేంపాడ్ గ్రామాలకు చెందిన విద్యార్థులు చిమట నందకుమార్, చిమట కోటేష్, బింత కావ్యసుధ, వల్లపు అరవింద్‌లకు తీవ్ర, అక్షయ, వేణు, నందిని, మణిదీప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిం చారు. ప్రమాద సమయంలో చిన్నారు లు తీవ్రంగా రోదించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ముప్పా రం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఆలంపల్లి వెంకన్నలు నిడమనూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ విద్యార్థులకు ప్రథమ చికిత్స చేయించి మిర్యాలగూడకు తీసుకెళ్లారు. అటెండర్ బస్సు తోలడంతోనే.. స్కూల్ బస్సును అటెండర్ తోలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు తెలిపారు. బస్ రెండవ ట్రి ప్పుకని వేంపాడ్, అన్నారం గ్రామాలకు చెందిన 21మంది విద్యార్థులను తీసుకుని వస్తుండగా గుంటిపల్లి సమీపంలో డ్రైవర్ మహేష్ పండ్లు తోమడానికి వేపపుల్ల కోసం దిగాడు. ఆ సమయంలో డ్రైవర్ స్థానంలోకి స్కూల్, బస్‌కు అటెం డర్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్ వచ్చాడు. అక్కడి నుంచి కదిలిన 10నిమిషాలలోపే ప్రమాదం జరిగింది. ప్రతి రోజు అదే ప్రాంతంలో డ్రైవర్ దిగడం, అటెండర్ రావడం జరుగుతుందని బస్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ వేంపాడ్కు చెందిన కార్తీక్ తెలి పాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్,అటెండర్ పరారయ్యారు. గాయపడిన పిల్లల తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు. -
శ్రీవిష్ణు హీరోగా...
‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. సినిమా ప్రమోషన్ రంగంలో పేరు తెచ్చుకున్న ఆర్.కె. మీడియా అధినేత రవికుమార్ పనస, హాంకాంగ్‌కు చెందిన హౌస్‌ఫుల్ మూవీస్ ఇండియా ప్రై. లిమిటెడ్‌తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. దర్శకుడు మదన్ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన వేణు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఓ ప్రముఖ కథానాయిక నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: విజయ్ సి. కుమార్. -
కూనిరాగమొచ్చినా.. కరా ఓకే!
మీరు బాత్రూమ్ సింగర్‌లా..? మీ పాటకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడుంటే బాగుంటుందనుకుంటున్నారా..? మ్యూజిక్ జోడించి మీ గాత్రాన్ని నలుగురికీ వినిపించాలనుకుంటున్నారా..? అయితే, ఓకే...! ఇంకెందుకాలస్యం ‘చలో కరావోకే..’ హైదరాబాద్ పబ్బులు, క్లబ్బుల్లో ఇప్పుడు ‘కరావోకే’ ట్రెండ్ హల్చల్ చేస్తోంది. పాట పాతదైనా, కొత్తదైనా... ఏ భాషలోనిదైనా... రియల్ ఓకల్ వెర్షన్‌ను తొలగించి, మ్యూజిక్కు మన వాయిస్‌ను చేర్చడమే కరావోకే ప్రత్యేకత. అలా పాడిన పాటను రికార్డు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కరావోకే కొన్నేళ్ల కిందటే మొదలైనా, నిన్న మొన్నటి వరకు స్టేజ్ షోలకే పరిమితమైంది. ఇప్పుడిది పబ్బులు, క్లబ్బులు, పార్టీలు, ఫంక్షన్లకు సైతం విస్తరించింది. - సుమన్‌రెడ్డి ఒక్కసారి కరావోకే కిక్కు అలవాటు పడితే, ఎవరూ దాన్ని వదులుకోరు. అందుకే రెగ్యులర్‌గా కరావోకే నైట్స్‌కు అటెండయ్యే యూత్ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పబ్బులు, క్లబ్బుల్లో లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా, పాడటం మ్యూజిక్ లవర్స్‌కు జోష్ ఇస్తోంది. టాలెంట్ ఉంటే, పబ్బుల్లో పాడటం ద్వారా అక్కడకు వచ్చే ప్రముఖుల కళ్లలో పడి సినిమాలు, ఆల్బమ్స్‌లో పాడే చాన్స్ కొట్టేయవచ్చు. కేజేలకు జేజే... కరావోకేల జోరు పెరగడంతో కరావోకే జాకీలు (కేజీలు) పుట్టుకొచ్చారు. మ్యూజిక్ ప్లే చేయడం వరకే డిస్క్జాకీల (డీజే) బాధ్యత. అయితే, పాడేవారి మూడ్స్ పసిగట్టి, వారి గాత్రాన్ని మ్యూజిక్‌తో సమన్వయపరచి, అవసరమైతే పాట సాహిత్యాన్ని సైతం అందించి, వారి ఆసక్తిని రెట్టింపు చేసే వినూత్నమైన బాధ్యతను కేజేలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. నగరంలోని పబ్‌లన్నీ ఏదో ఒకరోజు కరావోకే నైట్స్ నిర్వహిస్తున్నాయి. పోటీలు కూడా... పలు పబ్‌లు ఏటా కరావోకే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాయి. గెలిచినవారికి బహుమతులు అందిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సింగర్ ఫిన్లాండ్లో జరిగిన కరావోకే పోటీల్లో ప్రథమ వరుసలో నిలిచింది కూడా. గాత్రం కోసం... పాడాలనే తపన ఉన్న వారి కోసమే కరావోకే కార్యక్రమాలు నడుస్తున్నాయని కేజే ఆనంద్ ప్రేమ్‌సాగర్ చెబుతున్నారు. హైదరాబాద్ పబ్‌లకు కరావోకేను పరిచయం చేసిన క్రెడిట్ ఆయనదే. స్పెషల్ అట్రాక్షన్ ‘సాఫ్ట్వేర్ జాబ్ కోసం అమెరికాలో ఉన్నప్పుడు తరచు పబ్‌లకు వెళ్లే వాడిని. షికాగో పబ్‌లలో వింటర్లో నిర్వహించే కరావోకే నైట్స్ నన్ను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ పబ్‌లలోనూ ఇలాంటి ఎంజాయ్మెంట్ను అందుబాటులోకి తేవాలని ఆలోచించా. జాబ్ వదిలేసి హైదరాబాద్ పబ్‌లలో కరావోకే స్పెషల్స్ ప్రారంభించా. మొదట మనవాళ్లకు కొత్తగా అనిపించినా, తొందరగానే దీనికి బాగా అటాచ్ అయ్యారు. ఇప్పుడు అన్ని పబ్‌లలోనూ కరావోకే స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. - కేజే ఆనంద్ అప్లాజ్తో క్రేజ్ ఇంగ్లీషు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడూ హమ్ చేసేవాడిని. కానీ, పూర్తి స్థాయిలో పాడేందుకు ధైర్యం చాల్లేదు. మూడేళ్ల కిందట టెన్ డౌనింగ్ స్ట్రీట్ పబ్‌లో ఆనంద్ ప్లే చేస్తున్నప్పుడు అటెండై ఫస్ట్‌టైమ్ కరావోకేలో పాడాను. మంచి అప్లాజ్ వచ్చింది. అప్పటి నుంచి కరావోకే నైట్స్‌కు రెగ్యులర్ అయ్యాను. - వేణు -
యువత పాత్ర కీలకం
వైఎస్సార్ సీపీ నేతలు సునీల్, వేణు భారీఎత్తున అనుచరులతో పార్టీలోకి చేరిన గీసాల శ్రీను కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకమైందని కాకినాడ పార్లమెంటరీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు గీసాల శ్రీను భారీఎత్తున తన అనుచరులతో ఇంద్రపాలెం గొల్లపల్లి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. వీరికి సునీల్, వేణు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సునీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ నిర్మించే నవసమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రజాసేవ లో పాలుపంచుకోవాలని పిలుపుని చ్చారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నా రు. వేణు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలి పించాలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లో తిరుగుతూ, వారి కష్టాలు, కన్నీళ్లు చూసి పార్టీ మేనిఫెస్టో రూపొందించారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలకు జీవం పోయనున్నట్టు చెప్పారు. గీసాల శ్రీను మాట్లాడుతూ కాంగ్రెస్ భూస్థాపితం కా వడంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉందన్న నమ్మకంతో తన అనుచరులతో వైఎస్సార్ సీపీలోకి చేరినట్టు వివరించారు. రజక సం ఘం నాయకులు మాగాపు దుర్గాప్రసాద్, గాడిలంక సూర్యనారాయణ, కాళ్ల కుమార్, ఇరుసుమండ విష్ణు, గాడిలంక సత్యనారాయణ, కొమరపురి వీరరాఘవులు, యాదవ సంఘ నాయకులు కాద అప్పారావు, యనమల సత్యనారాయణ, కొండా అప్పలకొండ, రాయుడు నాగేశ్వరరావు, కండేపల్లి శ్రీను, చొల్లంగి వినయ్‌కుమార్, సీమకుర్తి కిశోర్‌కుమార్, చోడపనీడి గోవిందు, ఎస్సీ సెల్ నాయకులు నరసింహమూర్తి, సుకుమార్, జాన్‌పాటి అప్పారావు తదితరులు పార్టీలోకి చేరా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు గుబ్బల వెంకటశ్రీనివాసరా వు, దాట్ల సత్యనారాయణరాజు, వాసంశెట్టి త్రిమూర్తులు, సలాది శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. -
దాచిన పత్తే..ఉసురు తీసింది
గిట్టుబాటు ధర రాకపోవడంతో పత్తిని అమ్ముకోలేక ఇంట్లో దాచుకుంటే.. అది ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లంతా బయటకు వెళ్లగా.. ఆ చిన్నారులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. అయితే వారు ఆడుకుంటూ పత్తి కూటు పరదాను తాకారో.. లేక బరువుతోనే అది కూలిందో గానీ.. ఆ పత్తి కూటు ఆ చిన్నారులపై పడింది. వారు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు. పెద్దలు ఇళ్లు చేరేసరికి ఆ చిన్నారులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కేసముద్రం, న్యూస్‌లైన్ : ఆ ఇంట్లో బోసినవ్వులు మాయమయ్యూయి. అప్పటిదాక తాతయ్యా అంటూ ఆటలాడిన ఆ ముగ్గురి పిల్లలు అనంతలోకాలను చేరారు. ధర రాకపోవడంతో దాచిపెట్టిన పత్తే వారి ప్రాణం తీసింది. ఇంట్లో ఉన్న పత్తి కూటు అమాంతం మీదపడగా ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కోరుకొండపల్లి గ్రామాని కి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వారిలో వీరన్నకు కురవి మండలం కాంపెల్లికి చెందిన భవానితో వివాహం కాగా వారికి కుమారుడు విక్కీ(3) ఉన్నాడు. పది రోజుల క్రితమే మళ్లీ కుమారుడు జన్మించాడు. సుజాతకు కూడా కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన మేనమామ చిట్టాల వీరన్నతో వివాహమైంది. వారికి కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా సుజాత, చిట్టాల వీరన్న దంపతులు బతుకు దెరువు కోసం సూరత్ వెళ్లారు. అయితే శివరాత్రి పర్వదినంతోపాటు తన అన్న వీరన్నకు కుమారుడు పుట్టాడని తెలియడంతో సుజాత సూరత్ నుంచి కాంపల్లికి వచ్చింది. శివరాత్రి రోజు కురవిలో జాగారం ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న అన్న కుమారుడిని చూసింది. అనంతరం ఆదివారం కోరుకొండపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. కాగా బేతు వెంకటయ్య అన్న కొమురయ్య కోడలు ఉమ పురుగుల మందు తాగి మానుకోట ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా ఆమెను చూసేందు కు సోమవారం వెంకటయ్య భార్య యాదమ్మ, కుమారుడు వీరన్న, కూతురు సుజాత వెళ్లారు. ఇంటి దగ్గర పిల్లలు జాగ్రత్త అని వెంకటయ్యకు చెప్పి వెళ్లారు. మనవళ్లను, మనవరాలిని దగ్గరకు తీసుకుని అప్పటిదాక ఆడించిన వెంకటయ్య వారికి అన్నం తినిపించాడు. విక్కీ నిద్రకు రావడంతో పడుకోబెట్టాడు. మేము టీవీ చూస్తాం తాతయ్య.. బయటకు పోములే అని తలుపు పెట్టుకున్నారు. వారు టీవీ చూస్తున్నారులే అనుకుని వెంకటయ్య బయటకు వెళ్లి వచ్చాడు. పిల్లలను ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీకి ఉన్న జాలిని కోసి చూడడంతో పత్తి కూటు కుప్పకూలి కనిపించింది. దీంతో లబోదిబోమంటూ గట్టిగా కేకలు పెడుతూ తలుపులను ఎంత నెట్టినా రాలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు తలుపులు బద్దలు కొట్టి తెరిచారు. పత్తి మొత్తం ఆ ముగ్గురు పిల్లలను కప్పేసి ఉంది. పత్తిని తోడి తీయడంతో ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. వారిని చూసిన వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు కన్నీరుమున్నీరవుతూ వారిని బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వీరన్న, సుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వచ్చి పిల్లల శవాలపై పడి బోరునవిలపిస్తూ సొమ్మసిల్లారు. కొడుకు పుట్టిన సంబురంలోనే... వీరన్న, భవాని దంపతులకు రెండో కుమారుడు పది రోజుల క్రితమే పుట్టాడు. దీంతో విక్కీ తల్లితోనే కాంపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. అయితే సూరత్ నుంచి తన చెల్లెలి పిల్లలు రావడంతో వీరన్న విక్కీని కోరుకొండపల్లికి తీసుకొచ్చాడు. రెండో సారి కుమారుడు పుట్టాడనే సంబురా న్ని కుటుంబ సభ్యులతో పూర్తిగా పంచుకోకముందే మూడేళ్ల విక్కీ మాయమయ్యూడు. నీ తమ్మున్ని చూద్దువు లేరా కొడుకా అంటూ వీరన్న తన కొడుకు శవంపైపడి బోరున విలపించడాన్ని చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
‘పథకం’ నీటిపాలు!
కోటనందూరు, న్యూస్‌లైన్ : భారీ మంచినీటి పథకానికి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన తూరను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది మూసివేశారు. తుని నియోజక వర్గంలోని 82 గ్రామాలకు తాగునీరు అందించేందుకు తలపెట్టిన మంచినీటి పథకానికి నీటిని తీసుకునేందుకు అనుమతులు ఉన్నాయంటూ జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల మండలంలోని అల్లిపూడిలో నిర్మిస్తున్న మంచినీటి శుద్ధి ప్లాంట్‌కు సమీపంలోని విశాఖ జిల్లా నాతవరం మండలంలోని చినగొలుగొండపేట సమీపంలో విశాఖపట్నానికి నీటిని సరఫరా చేసే ఏలేరు ఏడమ కాలువకు తూరను ఏర్పాటు చేశారు. మంగళవారం జీవీఎంసీ, విస్కో బృందం కాలువ తనిఖీ చేస్తుండగా, మంచినీటి పథకానికి వేసిన తూర కంట పడింది. దీంతో ఆగ్రహించిన అధికారుల బృందం తక్షణమే తూర మూసివేయాలంటూ ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు నీటిని తీసుకునేందుకు తమకు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. జీవీఎంసీ అధికారులకు ఆ ఉత్తర్వులు అందకపోవడంతో శనివారం కాలువకు నీటి విడుదలను దృష్టిలో ఉంచుకుని తూరను మూసివేసినట్టు జీవీఎంసీ వర్క ఇన్స్పెక్టర్ వేణు తెలిపారు. ఉత్తర్వులు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరో ఐదు రోజుల గడువు కోరినట్టు చెప్పారు. ‘మూసుకుపోయిన’ ఆశలు భారీ మంచినీటి పథకానికి నీటిని సర ఫరా చేసేందుకు ఏలేరు కాలువకు ఏర్పాటు చేసిన తూరను జీవీఎంసీ అధికారులు మూసివేయడంతో నీటి సేకరణ ఆశలు మరోమారు మూసుకుపోయాయి. ఈ మంచినీటి పథకానికి మొదట తాండవ జలాశయం నుంచి నీటిని తీసుకోవాలని అనుమతులు పొందినా, ఆయక ట్టు రైతులు ఉద్యమం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపి, ఏలేరు రిజర్వాయర్ నీటిని అందించేందుకు అధికారులు అనుమతులు పొందారు. అయినా ఈ కాలువపై పూర్తి అధికారం తమకే ఉందని, ఎవరికీ అనుమతి ఇవ్వలేదని విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లయి కంపెనీ తేల్చిచెప్పింది. ఇందులో భాగంగానే మంచినీటి పథకానికి వేసిన తూరను తొలగించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఏలేరుతో సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు నీటి సేకరణ సమస్య మొదటికి రావడంతో తలపట్టుకోవాల్సి వచ్చింది. -
పథకం ప్రకారమే...
నాగోలు, న్యూస్‌లైన్: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటనలో నిందితులను హయత్‌నగర్ పోలీసులు శనివారం అ రెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పథకం ప్రకారమే ఆమెను శ్రీశైలం తీసుకెళ్లి అడవిలో హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ రవి వర్మ, వనస్థలిపురం ఏసీపీ ఆనంద భాస్కర్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. నల్లగొండజిల్లాకు చెం దిన పంగాల వేణు(22), బాలం మధు (22), కాసా ని శ్రీను (23), అనంతుల కాటమయ్య (25), నీలం కార్తీక్‌కుమార్ (22)లు మన్సూరాబాద్‌లో నివాసముంటూ లారీడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఐదుగురూ ముఠా క ట్టి పార్కింగ్ చేసిన లారీలను ఎత్తుకెళ్లి.. విడిభాగాలుగా చేసి విక్రయించేవారు. ఈ క్రమంలోనే గతంలో మధు, వేణులు అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. నల్లగొండజిల్లా దేవరకొండ మండలం మల్లేపల్లికి చెందిన రమావత్ అను (30) భర్తతో గొడవ జరగడంతో బీఎన్‌రెడ్డినగర్ సమీపంలో హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ కోర్సు చదువుతోంది. వేణుతో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వేణు వె ంట తిప్పుకున్నాడు. గర్భందాల్చిన అను తనను పెళ్లి చేసుకోవాలని వేణుపై ఒత్తిడి తెచ్చింది. వేణుకు తన స్వగ్రామమైన చందంపేట మండలం గన్నెర్లపల్లిలో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఎలాగైనా అనును అడ్డు తొ లగించుకోవాలనుకున్నాడు. తన స్నేహితులైన మధు, శ్రీను, కాటమయ్యకు తన పథకం చెప్పాడు. 2011 జూన్ 16న శ్రీశైలంలో వివాహం చేసుకుందామని వేణు.. అనును నమ్మించి తన స్నేహితులను వెంటబెట్టుకొని తీసుకెళ్లాడు. శ్రీశైలం అడవుల్లోకి వెళ్లాక కర్నూలుజిల్లా పాణ్యం పోలీస్‌స్టేషన్ పరిధిలో వేణు, మధు, కార్తీక్‌లు కలిసి అను ముఖానికి చున్నీతో బిగించి ఊ పిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మధు బండరాయితో అను ముఖంపై మోదాడు. తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. మృతదేహాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేశారు. పాతనేరస్తుల విచరణలో వెలుగులోకి... దొంగతనాల కేసుల్లో పాతనేరస్తులపై నిఘా పెట్టిన హయత్‌నగర్ పోలీసులు లారీల చోరీలకు పాల్పడుతున్న వేణు, మధు, కార్తీక్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరికి సహకరించిన శ్రీను, కాటమయ్యలను కూడా అరెస్ట్ చేశారు. హత్యకు గురైన అను తల్లిదండ్రులు తమ కుమార్తె అదృశ్యంపై ఎక్కడా కేసు పెట్టకపోవడం వల్లే కేసు విచారణ ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో హయత్‌నగర్ సీఐ శ్రీనివాస్‌కుమార్, సత్యనారాయణరాజు, మురళీకుమార్ తదితరులు పాల్గొన్నారు.