యువత పాత్ర కీలకం
- వైఎస్సార్ సీపీ నేతలు సునీల్, వేణు
- భారీఎత్తున అనుచరులతో పార్టీలోకి చేరిన గీసాల శ్రీను
కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకమైందని కాకినాడ పార్లమెంటరీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు గీసాల శ్రీను భారీఎత్తున తన అనుచరులతో ఇంద్రపాలెం గొల్లపల్లి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. వీరికి సునీల్, వేణు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సునీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ నిర్మించే నవసమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అవసరమన్నారు.
ప్రజాసేవ లో పాలుపంచుకోవాలని పిలుపుని చ్చారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నా రు. వేణు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలి పించాలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో తిరుగుతూ, వారి కష్టాలు, కన్నీళ్లు చూసి పార్టీ మేనిఫెస్టో రూపొందించారన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలకు జీవం పోయనున్నట్టు చెప్పారు. గీసాల శ్రీను మాట్లాడుతూ కాంగ్రెస్ భూస్థాపితం కా వడంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్న నమ్మకంతో తన అనుచరులతో వైఎస్సార్ సీపీలోకి చేరినట్టు వివరించారు. రజక సం ఘం నాయకులు మాగాపు దుర్గాప్రసాద్, గాడిలంక సూర్యనారాయణ, కాళ్ల కుమార్, ఇరుసుమండ విష్ణు, గాడిలంక సత్యనారాయణ, కొమరపురి వీరరాఘవులు, యాదవ సంఘ నాయకులు కాద అప్పారావు, యనమల సత్యనారాయణ, కొండా అప్పలకొండ, రాయుడు నాగేశ్వరరావు, కండేపల్లి శ్రీను, చొల్లంగి వినయ్‌కుమార్, సీమకుర్తి కిశోర్‌కుమార్, చోడపనీడి గోవిందు, ఎస్సీ సెల్ నాయకులు నరసింహమూర్తి, సుకుమార్, జాన్‌పాటి అప్పారావు తదితరులు పార్టీలోకి చేరా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు గుబ్బల వెంకటశ్రీనివాసరా వు, దాట్ల సత్యనారాయణరాజు, వాసంశెట్టి త్రిమూర్తులు, సలాది శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.