ఎన్నికల బెట్టింగ్ ఫలితం | Election Betting result | Sakshi
Sakshi News home page

ఎన్నికల బెట్టింగ్ ఫలితం

Published Mon, Jun 8 2015 5:12 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

ఎన్నికల బెట్టింగ్ ఫలితం - Sakshi

ఎన్నికల బెట్టింగ్ ఫలితం

కున్న యువకుడు
గౌరిబిదనూరు :
ఎన్నికల సమయంలో ఆనేక చోట్ల  గెలుపు ఓటమిలపైన బెట్టింగ్‌లు జరగడం సహజం. గ్రామీణ ప్రదేశాలలో గొర్రెలు, కోళ్ళు, డబ్బు, పందెంగా పెట్టడం విన్నాం అయితే ఒక యువకుడు తన అర గుండు, అర మీసాన్ని పణంగా పెట్టాడు. తాలూకాలోని నగరగెరె గ్రామంలోని అశ్వత్థనారాయణ పక్కా కాంగ్రెస్ కార్యకర్త. తన పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుస్తారని పందెం కట్టాడు.

ఇతను పందెం కాసిన కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యాడు. అశ్వత్థనారాయణ ఎలాంటి పశ్చాతాపం లేక వీర యోధునిలా అరగుండు గీయించుకుని గ్రామంలో సంచరిస్తుంటే ఇతనిని చూసిన మహిళలు కొంగు అడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement