kakinada rural
-
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే నానాజీ అడగ్గా, ఉన్నతాధికారుల అనుమతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్ఎంసీ అధికారులు తెలిపారు.అయితే, వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న జనసేన కార్యకర్తలను ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి ఆయన అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో ఉమామహేశ్వరరావుపై నానాజీ దురుసుగా ప్రవర్తించారు. చంపేస్తానంటూ ఆయనపై నానాజీ దాడి చేశారు. నానాజీ అనుచరులు వీరంగం సృష్టించారు. పంతం నానాజీపై కాలేజీ యాజమాన్యం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
కాకినాడ రూరల్‌లో టీడీపీ-జనసేన మధ్య వార్
సాక్షి, కాకినాడ: జనసేన తీరును టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ తప్పుపట్టారు. నిన్న కాకినాడ రూరల్‌లో పార్టీ కార్యాలయాన్ని జనసేన ప్రారంభించింది. టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటించారు. ఆ ప్రకటనపై సారీ చెబుతూనే జనసేన తీరును పిల్లి సత్యనారాయణ తప్పుపట్టారు. తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటూ పిల్లి వర్గం పశ్నిస్తోంది. తమ కుటుంబంపై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయని పిల్లి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా? అంటూ పిలి అనంతలక్ష్మి ధ్వజమెత్తారు. మాకు తెలియకుండా జనసేన కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు. జనసేన తీరు వల్లే మా క్యాడర్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకు జనసేనే ఊపిరి పోసిందని ఓ ఆసామీ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు మేం చేతకాని వాళ్లలా ఊరుకోవాలా?’’ అని పిల్లి అనంతలక్ష్మి నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్ -
కాకినాడ రూరల్..బలహీనంగా టీడీపీ!
సాక్షి, కాకినాడ రూరల్ : తెలుగుదేశం పార్టీని పైకి లేపేందుకు ఎల్లో మీడియా ఎన్ని జాకీలు వేస్తున్నా ఫలితం కనిపించడంలేదు. ఏ నియోజకవర్గం చూసినా పచ్చ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. కాకినాడ రూరల్ సెగ్మెంట్లో సైకిల్ పార్టీకి కనీసం ఇన్‌చార్జ్‌ను నియమించుకోలేని దుస్థితి కనిపిస్తోంది. నడిపించే నాయకుడు లేకపోవడంతో నియోజకవర్గంలో గ్రూపులు కట్టి రోడ్డున పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్ధాయికి చేరింది. లీడర్ లేకపోవడంతో స్థానిక నేతలంతా గ్రూప్‌లు కట్టి తమకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటుండంతో..ఇక్కడ క్యాడర్ అయోమయ స్ధితిలో కూరుకుపోయింది. గడిచిన సారత్రిక ఎన్నికల తరువాత రూరల్ టీడీపీ పరిస్ధితి చుక్కాని లేని నావలా తయారయింది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీతో పాటుగా ఆమె భర్త పిల్లి సత్యనారాయణ మూర్తి పార్టీలో తమ పదవులకు రాజీనామా చేసి సాధారణ కార్యకర్తల్లానే వ్యవహరిస్తున్నారు. చివరకు పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కు అనుచరుడుగా చెప్పుకునే పేరాబత్తల రాజశేఖర్ కాకినాడ రూరల్ నియోజకవర్గంపై కన్నేశారు. కోనసీమకు చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ లో తిరగడంతో స్ధానిక టీడీపీ నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. దీంతో యనమల రామకృష్ణుడి అనుచరుడైన పెంకే శ్రీనివాసబాబు రంగంలోకి వచ్చారు. కాకినాడ రూరల్ సీటు తనదే అంటూ కొంతమంది అనుచరులతో ప్రచారం ప్రారంభించారు. వీరితో పాటుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అనుచరుడైన వాదిరెడ్డి ఏసుదాసు కూడా సీటు ఆశించి రేసులో తానూ ఉన్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తెరమీదకు వచ్చారు పిల్లి అనంతలక్ష్మీ దంపతులు. ఇలా నాలుగు గ్రూపులుగా విడిపోయిన రూరల్ నియోజకవర్గం నేతలు సీటు కోసం ఫీట్లు చేస్తున్న తరుణంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు అనుచరుడుగా చెప్పుకునే కటకంశెట్టి ప్రభాకర్ కాకినాడ రూరల్ పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన లోకేష్ పాదయాత్రకు అయిన ఖర్చులో కొంత ఆయన భరించినట్లు సమాచారం. మరోవైపు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. జనసేనకు సీటు ఇస్తే తాము సపోర్ట్ చేసేది లేదని పిల్లి దంపతులు అధిష్టానానికి తమ మనస్సులో మాట చెప్పిందనే టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని లోకేష్ కు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే.. ముందు గ్రూపులు వదిలి అందరు కలిసికట్టుగా పని చేసుకోవాలని సూచించారని చెబుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్ధితి ఏమీ బాగా లేదని...తనకు సీటు ఇస్తే ఎంతైనా ఖర్చు చేస్తానని లోకేష్‌కు చెప్పారట కటకంశెట్టి ప్రభాకర్. ఇలా టీడీపీలో ఎవరికి వారు సీటు కోసం ఫీట్లు చేస్తుంటే అంతంతమాత్రంగానే ఉన్న పార్టీ క్యాడర్ మాత్రం ఏం చేయ్యాలో తెలియక సతమతం అవుతుందట . అసలు కార్యకర్తలే లేని జనసేనకు సీటు ఇస్తే.. ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయాల్సిన కర్మ తమకేంటని తెలుగుదేశంలో చర్చించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నాలుగు గ్రూపుల్లో ఎవరో ఒకరికి ఇస్తారా? లేక పార్టీని చక్కదిద్దుకోలేక జనసేనకే వదిలేస్తారో చూడాలి. ఇదీచదవండి..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు..? -
చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కన్నబాబు ఆగ్రహం
-
ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య వర్గ పోరు తమ్ముళ్లకు తలపోటుగా మారింది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంపై పెత్తనం కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. పార్టీలో నంబర్–2గా చలామణీ అవుతున్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు రూరల్ పారీ్టలో అగ్గి రాజేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారిద్దరూ నియోజకవర్గంలో నివాసం, క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అతిథి పాత్ర పోషిస్తున్నారు. పారీ్టలో వర్గాలకు ఊతమిస్తున్నారు. వారిద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరు చివరకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పించే దశకు చేరింది. చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు తద్వారా ఆమెకు, ఆమె భర్త, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి(సత్తిబాబు)కు చెక్ పెట్టాలని రాజప్ప వర్గం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా తనకు అనుకూలుడైన నాయకుడిని నియమించుకోవాలనేది రాజప్ప వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన తెర వెనుక చాలాకాలంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లి దంపతులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటూ అధిష్టానం వద్ద యనమల పట్టుబడుతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా పిల్లి వర్గానికి వెన్నుదన్నుగా ఉండేవారు. భాస్కర రామారావు మరణానంతరం సత్తిబాబు వర్గానికి పార్టీలో యనమల ఒక్కరే పెద్ద దిక్కుగా మిగిలారు. చంద్రబాబుకు సత్తిబాబు వైరి వర్గం ఫిర్యాదు సత్తిబాబును వ్యతిరేకించే నాయకులందరూ తాజాగా ఒక్కటయ్యారు. సత్తిబాబు దంపతులను పార్టీ ఇన్చార్జిగా తప్పించాలనేదే వారందరి ఉమ్మడి లక్ష్యం. ఇదే అవకాశంగా రాజప్ప వర్గీయులు తెర వెనుక పావులు కదుపుతున్నారని ఆ పార్టీలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా సత్తిబాబును వ్యతిరేకించే రూరల్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సత్తిబాబు పార్టీ కోసం ఏ కోశానా పని చేయడం లేదని వారు ఆధారాలతో నివేదించారు. కాకినాడ కార్పొరేషన్లో పలు డివిజన్లకు ఉప ఎన్నికలు జరిగాయి. రూరల్ నియోజకవర్గం పరిధిలోని 3వ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ తరువాత ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో సత్తిబాబుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన అంగీకారంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు చంద్రబాబుకు నాయకులు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ఇటీవలి కాకినాడ కార్పొరేషన్ ఉప ఎన్నికల వరకూ పార్టీ అభ్యర్థులు బరిలో లేకుండా చేసి, టీడీపీకి సత్తిబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సత్తిబాబు దంపతులను ఇన్చార్జిగా ఎలా కొనసాగిస్తారని చంద్రబాబును గట్టిగానే నిలదీశారని సమాచారం. వారిని ఇన్చార్జిగా తప్పించకుంటే రూరల్‌లో పార్టీకి అడ్రస్సే లేకుండా పోతుందనే వాదనను బాబు ముందుకు తీసుకువెళ్లారు. మరోపక్క ఇటీవల పార్టీ పిలుపు మేరకు ఓటీఎస్‌కు వ్యతిరేకంగా ఇరు వర్గాలూ విడివిడిగానే ధర్నాలు చేయడం గమనార్హం. పేరాబత్తుల రాజశేఖర్, మామిడాల వెంకటేష్, పెంకే శ్రీనివాసబాబా తదితర నేతలను చినరాజప్ప వర్గం ఎగదోస్తోందని పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను తప్పించి, సొంత సామాజికవర్గానికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే వ్యూహంలో భాగంగానే రాజప్ప ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. టీ కప్పులో తుపానేనా! గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు, వివాదాలు కాకినాడ రూరల్ టీడీపీలో జరిగాయి. అయితే అవి టీ కప్పులో తుపాను మాదిరిగానే చల్లారిపోయాయి. ఇన్చార్జిగా తప్పుకొని, కార్యకర్తగా కొనసాగుతానని సత్తిబాబు గతంలో ఒక సందర్భంలో పత్రికా ముఖంగా ప్రకటించడం తెలిసిందే. కానీ అంతలోనే ప్లేటు ఫిరాయించేశారు. అధిష్టానం మాట ప్రకారం కొంత కాలం కొనసాగుతానని చెప్పారు. నియోజకవర్గంపై పెత్తనం కోసమే చినరాజప్ప, ఆయన వర్గం తెర వెనుక ఇదంతా జరిపిస్తున్నారని ఆ సందర్భంగా సత్తిబాబు పేర్కొనడం గమనార్హం. అప్పటి నుంచి శుక్రవారం నాటి చంద్రబాబు భేటీ వరకూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే.. రూరల్ నియోజకవర్గ పార్టీ సమీక్షకు సత్తిబాబు దంపతులు గైర్హాజరయ్యారని అంటున్నారు. మరోపక్క సత్తిబాబు పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, నియోజకవర్గంలో ఆయన పెత్తనం లేకుండా చేయాలనే గట్టి పట్టుదలతో వైరి వర్గానికి చినరాజప్ప వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో అధిష్టానం కూడా ఇన్చార్జి మార్పునకే మొగ్గు చూపుతున్నట్టు టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇన్చార్జి పదవి ఆశిస్తున్న నేతలందరూ కట్ట కట్టుకుని మరీ వెళ్లి సత్తిబాబు దంపతులపై ఫిర్యాదుల చిట్టాను చంద్రబాబు ముందు పెట్టడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. అయితే ఇన్చార్జి మార్పునకు చంద్రబాబు “ఊ అంటారా.. ఉఊ అంటారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..
అధికారంలో ఉన్నప్పుడు సామ్రాజ్యాలను విస్తరించుకుపోయారు తెలుగు తమ్ముళ్లు. అప్పుడు ఒకరంటే ఒకరికి పడకున్నా చేతిలో పవర్ ఉండటంతో కిమ్మనకుండా ఉన్నారు. తీరా గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిని, అధికారానికి దూరమయ్యేసరికి వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికలకు వెళ్లడమంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకు ముఖం చాటేస్తున్న నేతలు ఆ నిందను ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల తరువాత జరిగే రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే వ్యూహాల కత్తులకు పదును పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి,రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ నేతల మధ్య చాప కింద నీరులా ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు.. ప్రస్తుత పంచాయతీ పోరు పుణ్యమా అని రచ్చకెక్కాయి. ఆ పార్టీ పదవులకు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, పార్టీ సీనియర్ నాయకుడు వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) శుక్రవారం గుడ్‌బై చెప్పారు. మీడియా ముందు రాజీనామా ప్రకటన వేళ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కంట తడి పెట్టారు. తమ రాజీనామాలకు మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారణమని సత్తిబాబు ఆరోపించారు. (చదవండి: టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా) అయితే సత్తిబాబు దంపతుల మీడియా సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే చినరాజప్ప మాట్లాడుతూ, ఇందులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. ఏడాది కాలంగా అనంతలక్ష్మి దంపతులు పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతామంటూ చెబుతూ వచ్చి, ఇప్పుడు హఠాత్తుగా తనపై నింద వేస్తున్నారని అన్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, బరువు మోయాల్సిన సమయంలో సత్తిబాబు కాడి వదిలేస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదానికి ఇరుపక్షాల నుంచి వినిపిస్తున్న వాదనలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ పచ్చ రచ్చకు అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా) భాస్కర రామారావును తీసుకువచ్చేందుకు.. ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలోకి క్రియాశీలకంగా తీసుకు రావాలనేది సత్తిబాబు వ్యూహం. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తిబాబుకు భాస్కర రామారావు ప్రధాన అనుచరుడనే ముద్ర ఉంది. తాను త్యాగం చేసిన కాకినాడ రూరల్ స్థానానికి భాస్కర రామారావును తీసుకువచ్చి, చినరాజప్ప భవిష్యత్తు వ్యూహానికి చెక్ పెట్టాలనేది సత్తిబాబు ఎత్తుగడగా ఉంది. ఎక్కడో కోనసీమ నుంచి వచ్చి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, తమ నియోజకవర్గంలో వేలు పెడితే తమ వ్యూహం తమకు ఉండదా అని సత్తిబాబు వర్గం ప్రశి్నస్తోంది. ఆర్థిక స్తోమతతో దూకుడుగా వ్యవహరించే భాస్కర రామారావును కాకినాడ రూరల్‌కు తీసుకువస్తే పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించినట్టవుతుందని సత్తిబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఇటీవల ఆయన వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సత్తిబాబే స్వయంగా మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే భాస్కర రామారావును తీసుకు రావాలనుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని చినరాజప్ప వర్గం పేర్కొంటోంది. భాస్కర రామారావును తీసుకురావాలనే సత్తిబాబు వ్యూహం బయటకు పొక్కడంతో తప్పు తమ నాయకుడిపై నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారని చినరాజప్ప వర్గీయులు అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, పవర్ పోయేసరికి పార్టీని వదిలేసిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం తప్పేమిటని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎంపీటీసీ ఎన్నికల నుంచి నేటి పంచాయతీ ఎన్నికల వరకూ నియోజకవర్గ ఇన్చార్జిగా సత్తిబాబు అభ్యర్థులను నిలబెట్టకుండా పార్టీని నిరీ్వర్యం చేయడం వాస్తవం కాదా అని రాజప్ప వర్గీయులు ప్రశి్నస్తున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు పయనిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇరు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. మా కుటుంబంపై మీకేమైనా గౌరవం ఉంటే, మాజీ శాసన సభ్యురాలిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే ఉద్దేశం ఉంటే నేను, నా భార్య అనంతలక్ష్మి చనిపోయిన తరువాత తెలుగుదేశం జెండా కప్పి శ్మశానానికి తీసుకువెళ్లండి. మీతో అభిప్రాయ భేదాలు కాదు.. నేను మనస్తాపం చెందాను. నా కుటుంబం ఇబ్బంది పాలయింది. నా కుర్రాళ్లు ‘తిరం’ కాదు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. అర్హత ఉన్న వారిని పెట్టుకోమని చెబుతున్నాను. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఇబ్బందులు వచ్చాయి. నెల కిత్రం చంద్రబాబుతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. ఆయన సమస్య రెక్టిఫై చేస్తానన్నారు. కానీ రానురానూ జిల్లా పార్టీ యంత్రాంగంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొంతమంది నాయకులకు నేనంటే ఇష్టం లేదు. ఇష్టం ఉన్న నాయకుడిని పెట్టుకోండి. నాకు ఇబ్బంది లేదు. బొడ్డు భాస్కర రామారావు వద్దకు వెళ్లి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నీ వద్ద ఉన్న డబ్బు, సత్తా, ఎప్పియరెన్స్కు కచ్చితంగా నెగ్గుతావని అన్నాను. చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయి. బొడ్డు భాస్కర రామారావును రమ్మనడం వలన ఇబ్బందులు పెడుతున్నారేమో అర్థం కాలేదు. – పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి రూరల్‌పై రాజప్ప కన్ను వేయడమే కారణమా! టీడీపీలో రగిలిన ఈ రచ్చకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కేంద్ర బిందువనే చర్చ నడుస్తోంది. రెండుసార్లుగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప వచ్చే ఎన్నికలకు కాకినాడ రూరల్‌పై కన్ను వేశారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో చినరాజప్ప కాకినాడ రూరల్ నుంచి పోటీకి దిగుతారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చినరాజప్పను పెద్దాపురం నుంచే రెండోసారి బరిలోకి దింపారు. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు చెల్లాచెదురై ఆదరణ తగ్గిపోవడంతో మూడేళ్లు ముందే కొత్త స్థానం కోసం చినరాజప్ప వెతుకులాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో తాను ఆశించిన కాకినాడ రూరల్ నియోజకవర్గంపై ఆయన కన్ను వేశారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాకినాడ రూరల్‌లో లైన్ క్లియర్ చేసుకునే లక్ష్యంతోనే చినరాజప్ప ఆ నియోజకవర్గ ఇన్చార్జి సత్తిబాబు దంపతులపై ఏడాది కాలంగా అధిష్టానానికి వ్యూహాత్మకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేశారని చినరాజప్ప పార్టీ అధినేత చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు చేస్తూ, తమను తక్కువ చేస్తున్నారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. అనంతలక్ష్మి దంపతులను కాకినాడ రూరల్ నుంచి పొమ్మనకుండానే పొగ పెట్టేందుకే రాజప్ప ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజకీయ వేధింపులకు తోడు ఇటీవల కుటుంబ పరంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే పార్టీ పదవులు, ఇన్చార్జి బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తోందని సత్తిబాబు చెబుతున్నారు. ఆ ప్రకటన బాధాకరం.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి నా కారణంగా బయటకు వెళ్తున్నట్టు శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అనంతరం చంద్రబాబు, యనమల రామకృష్ణుడితో పాటు నా వద్దకు కూడా వచ్చి తాను ఇన్చార్జ్గా ఉండలేనని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టాలని రామకృష్ణుడు చెప్పారు. ఆవిధంగానే గ్రామాల్లో అభ్యర్థులను ఏర్పాటు చేశారు. ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు నా కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం బాధాకరం. నేను పార్టీ కోసం పని చేస్తాను. పార్టీకి నష్టం కలిగించే పని చేయను. – నిమ్మకాయల రాజప్ప, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే, పెద్దాపురం -
టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా
కాకినాడ రూరల్/మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వాకలపూడిలోని తమ నివాసంలో శుక్రవారం మీడియా సమక్షంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, కానీ.. పార్టీలో క్రియాశీలక సభ్యులుగా జీవితాంతం కొనసాగుతామని చెప్పారు. పార్టీలో చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయని.. ఆయన తనను ఇబ్బందులు పెడుతున్నారని సత్యనారా యణమూర్తి చెప్పారు. మరోవైపు.. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలంటూ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు అనంతలక్ష్మి దంపతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
అమ్మాయితో మాటల రికార్డింగ్..
సాక్షి, కాకినాడ రూరల్: అమ్మాయితో సెల్ఫోన్లో మాట్లాడిన మాటల రికార్డింగ్ వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. కాల్ రికార్డింగ్ వివాదం చినికిచినికి గాలివానలా మారి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తమ ఇంటిపైకి దాడికి వస్తారని భావించిన ఓ వర్గం, వచ్చిన వారిని తుదముట్టించాలని పథకం పన్నింది. కొందరు మనుషులను ముందుగానే తీసుకువచ్చి కత్తులతో మాటువేసింది. వారు ఊహించినట్టుగానే అర్ధరాత్రి సమయంలో ఇంటి పైకి వచ్చిన ముగ్గురిపై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆరుగురు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో ఫిబ్రవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక జరిగిన కొవ్వూరి ఇంద్రారెడ్డి(50) హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గురువారం ఉదయం కాకినాడలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఉదయం హత్య కేసు, నిందితుల వివరాలను అడ్మిన్ ఎస్పీ కరణం కుమార్, ఇన్చార్జి డీఎస్పీ బీమారావు, రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, పెదపూడి ఎస్సై లక్ష్మి వెల్లడించారు. గొల్లల మామిడాడలో కొవ్వూరి ఇంద్రారెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు మేడపాటి సూర్యనారాయణరెడ్డి(ఏ–1)తో పాటు బిక్కవోలుకు చెందిన జంపా రాజు(ఏ–2), ధనాల మనోజ్‌కుమార్(ఏ–3), తోట ద్రావిడ్(ఏ–4), బీరా సాయికుమార్(ఏ–5), పంపన విజయకుమార్(ఏ–6)లను అరెస్టు చేశామన్నారు. హత్యకు వినియోగించిన కత్తులు గొల్లల మామిడాడలో ఓ అమ్మాయితో సెల్ ఫోన్లో మాట్లాడిన మాటల కాల్ రికార్డింగ్ విషయమై మేడపాటి సూర్యానారాయణరెడ్డి తాడి ఆనందరెడ్డిని కొట్టాడు. ఈ విషయాన్ని ఆనందరెడ్డి తన మేనమాన కొవ్వూరి ఇంద్రారెడ్డికి చెప్పాడు. దీంతో ఫిబ్రవరి 29న అర్ధరాత్రి సమయంలో కొవ్వూరి ఇంద్రారెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపూడి సూర్యచంద్రారెడ్డి అడిగేందుకు సూర్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లారు. రోజంతా దీనిపై వివాదం నెలకొనడం, అడిగేందుకు ఇంటికి వస్తారని తెలుసుకున్న సూర్యానారాయణరెడ్డి ముందు జాగ్రత్తగా బిక్కవోలు నుంచి కొందరిని రప్పించుకుని, ఇంటి వద్ద కత్తులతో మాటు వేయించాడు. ఇంతలో కొవ్వూరి ఇంద్రారెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపూడి సూర్యచంద్రారెడ్డి అక్కడికి రాగా వారిపై కత్తులతో దాడి చేసి కత్తులతో నరికారు. అతను అక్కడికక్కడే రక్తపు మడుగులతో మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో పారిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మార్చి 1న ఉదయం ఏడు గంటలకు ఫిర్యాదు అందడంతో పెదపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనంతరం నిందితులు ఇతర ప్రాంతాలు పరారైనట్టు తెలుసుకుని సీఐ మురళీకృష్ణ, సిబ్బంది ఏలూరు, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలు గాలించారు. సూర్యనారయణరెడ్డి, రాజు, మనోజ్‌కుమార్, సాయికుమార్‌లో హైదరాబాద్‌లో బుధవారం ఒక టీవీ చానల్ వద్ద లొంగిపోవడానికి వెళ్లగా బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారమందుకున్న సీఐ మురళీకృష్ణ, సిబ్బందిని నిందితులను కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే మరో ఇద్దరు ద్రావిడ్, విజయకుమార్‌లను కూడా అరెస్టు చేశారు. నిందితుల నుంచి కత్తులు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
ఆ విషయంలో వైఎస్ జగన్‌కే నా సపోర్ట్: నారాయణమూర్తి
సాక్షి, కరప (కాకినాడ రూరల్): ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటున్నవారే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారని, తెలుగుమీడియంలో చదువుకుంటున్న పేదవర్గాల పిల్లలు సెక్యూరిటీ గార్డు, పోలీసు కానిస్టేబుల్ వంటి చిన్పపాటి ఉద్యోగాలకే పరిమితమవుతున్నట్టు సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. కరప మండలం నడకుదురులో వెలమ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమాన అవకాశం కల్పించినప్పుడే పేదల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధన తీసుకువస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే నా సపోర్టు అని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తాను అనుభవించిన, తనకు ఎదురవుతున్న సమస్యలపైనే సినిమాలు తీస్తున్నట్టు ఆయన చెప్పారు. వెనుకబడిన తరగతులవారు ఇంగ్లిషు చదువులు చదవలేక వెనుకబడిపోతున్నారన్నారు. అదే అంశాన్ని తానుతీసిన ఎర్రసైన్యం సినిమాలో చూపించినట్టు గుర్తు చేశారు. ముందు తరాల కోసమే : మంత్రి కన్నబాబు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ యుద్ధానికి, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన వ్యక్తి తాండ్ర పాపారాయుడు అని శ్లాఘించారు. 20 ఏళ్ల క్రితమే నారాయణమూర్తి ఎర్రసైన్యం సినిమా ద్వారా ఇంగ్లిషు మీడియం ఆవశ్యకతను తెలియజేసిన దార్శనికుడన్నారు. ముందుతరాల భవిష్యత్తు బాగుండాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంగ్లిషు మీడియం బోధన తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనబడకుండా పోతే, సినిమాలద్వారా ప్రశ్నిస్తూనే ప్రజల హృదయాల్లో నారాయణమూర్తి నిలిచిపోయాడన్నారు. వెలమసంక్షేమ సంఘం తరఫున నటుడు నారాయణమూర్తిని మంత్రి కన్నబాబు సత్కరించారు. సంఘ ప్రతినిధులు పైలా గోవిందు, పోతల లోవప్రసాద్, చీపురపల్లి జయేంద్రబాబు, ఎడ్ల రామసుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రూ.2 కోసం గొడవ.. ఒకరి దారుణ హత్య
సాక్షి, తూర్పుగోదావరి : ‘అరవింద సమేత.. వీర రాఘవ’ సినిమాలో ఐదు రూపాలకోసం హత్యలు జరిగినట్టు చూపిస్తే.. ఆశ్చర్యపోయాం. మరీ 5 రూపాయలకోసం హత్యలా..! అని ముక్కున వేలేసుకున్నాం. కానీ, అలాంటి ఘటనే కాకినాడ రూరల్ వలసపాకలో ఆదివారం చోటుచేసుకుంది. రూ.2 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్లో గాలి పెట్టుకునేందుకు సాంబ సైకిల్షాఫ్ వద్దకు వెళ్లాడు. గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ సువర్ణరాజుని అడిగాడు. అయితే, అతను రూ.2 ఇవ్వకపోగా.. సాంబపైనే దాడికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు.. తన స్నేహితుడిని ఎందుకు కొడుతున్నావంటూ సువర్ణరాజుతో గొడవకు దిగాడు. ఈక్రమంలో అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అప్పారావు సువర్ణరావుని కత్తితో పొడిచాడు. సువర్ణరాజు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నం
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ రూరల్ మండలం గైగోలపాడులో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపై ఓ శాడిస్టు తండ్రి అత్యాచారయత్నం చేశాడు. తనపై అత్యాచారయత్నం చేశాడని ఆరోపిస్తూ తండ్రిపై సర్పవరం పోలీసులకు కుమార్తె(బాధితురాలు) ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జనసేన దుష్ప్రచారం.. కేసు నమోదు
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): మార్ఫింగ్ ఫోటోలతో కాకినాడ రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై జనసేన చేస్తున్న దుష్ప్రచారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నబాబుపై సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జనసేన దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలిసి కన్నబాబు స్పందించారు. నాలుగు నెలల కిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని కన్నబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనసేన చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కన్నబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కన్నబాబు ఫిర్యాదుతో సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. జనసేన కార్యకర్తలు కన్నబాబుపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులు.. -
కన్నబాబుపై జనసేన దుష్ప్రచారం
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): కాకినాడ రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై సోషల్ మీడియా వేదికగా జనసేన దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలిసి కన్నబాబు స్పందించారు. నాలుగు నెలల క్రిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనసేన చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కన్నబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘పచ్చ’ నేత అండతో మహిళలతో అసభ్యకర చాటింగులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓ మహిళపై విశ్రాంత ఉద్యోగి వేధింపులకు పాల్పడుతుండగా ... ఈయనకు ‘పచ్చ’ రాజకీయం అండదండలిస్తోంది. అధికారులను ఆటబొమ్మలుగా మార్చేసి అంతా తానై చక్రం తిప్పుతున్న ఆయన మహిళలను మానసిక వ్యథకు గురిచేసే వ్యక్తిని వెనుకేసుకురావడాన్ని నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ షాడో నేతకు ఒక సలహాదారుడిగా ఈ రిటైర్డ్ అధికారి వ్యవహరిస్తుంటాడు. అవినీతి ఎలా చేయాలన్న దర్గరనుంచి ఎక్కడ భూములు కబ్జాలు చేయాలో గుర్తించి మరీ చెబుతాడు. నియోజకవర్గ కీలక నేత తన కనుసన్నల్లో ఉన్నాడనో...ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో తెలియదు గానీ ఆడపిల్లలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. ఆ మహిళల ప్రమేయం లేకుండా వారి నెంబర్ల వాట్సాప్‌ల ద్వారా అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నాడు. ఆ మధ్య ఒక యానిమేటర్‌తో చేసిన చాటింగ్ వ్యవహారం బయటపడి రచ్చరచ్చ అవుతోంది. ఆయనొక రిటైర్డ్ అధికారి. రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో పనిచేశాడు. ఉద్యోగంలో ఉండగానే నియోజకవర్గ షాడో నేతకు అండగా నిలిచాడు. షాడో నేత ఏది చెబితే అదే చేసేవాడు. ఇద్దరూ కలిపి పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఆ నేతకొక కార్యకర్తలా పనిచేశాడు. ఎవరికే పథకం ఇవ్వాలి? ఎవరికి ఏ లబ్ధి చేకూర్చాలనే సలహాల నుంచి ఎక్కడేవిధంగా దోపిడీ చేయాలో కూడా సదరు నేతకు ఈ అధికారి సూచించేవాడు. ఆ విధంగా కార్యాచరణ అమలు చేసేవారు. ఇక, రిటైరయ్యాక ముసుగు తొలగించి ఏకంగా ఆ షాడో నేతకు సలహాదారునిగా, సన్నిహితుడిగా ఉండిపోయాడు. ఇదంతా నాణెంకు ఒకవైపు అన్నట్టుగా ఈయనకు మరో కోణం కూడా ఉంది. ఆయన వయస్సుకు, చేష్టలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నాడు. అవసరాల నిమిత్తం వచ్చే మహిళలను ట్రాప్ చేసే దుర్బుద్ధి ఉండడంతో వారి వద్దనుంచి ఫోన్ నెంబర్లు తీసుకుని సాయంత్రమయ్యాక చాటింగులు చేయడం ప్రారంభించాడు. అసభ్యకర సందేశాలతో...వీడియోలు, ఫొటోలతో ఓ యానిమేటర్ వాట్సాప్‌కు పంపించి నరకం చూపించాడు. ఎవరికి చెప్పుకోలేక...అలా అని మౌనం దాల్చలేక మానసిక వేదనకు ఆమె గురయ్యింది. ఎవరికైనా చెబుతామంటే పరువు పోతుందని... దానికితోడు నియోజకవర్గంలో కీలక నేతకు సన్నిహితుడిగా ఉండటంతో ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని తనలోనే కుమిలిపోయిందామె. ఈ చాటింగ్ క్లిప్పింగులు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈయనతోపాటు ఈయన్ని సమర్ధించే ఆ షాడో నేతను నియోజకవర్గ ప్రజలు ఈసడించుకుంటున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు!
-
టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు!
తూర్పుగోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పిందే నిజమైంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఓటరు జాబితాలో దొంగ ఓట్లు చేర్పించారని వైఎస్సార్సీపీ ఆరోపించిన మాటలు రుజువయ్యాయి. అక్రమంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించడం, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఒకే నియోజకవర్గంలో లేదా పక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరి పేరు మీద రెండు నుంచి మూడు దొంగ ఓట్లు చేర్పించడం చాలా చోట్ల జరిగింది. ఇదే విషయం సాక్షి పరిశీలనలో వెలుగు చూసింది. కాకినాడ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీతో పాటు వాళ్ల ఇంట్లోని సభ్యులకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు ఓట్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే 7 దొంగ ఓట్లు ఉన్న విషయం బయటపడింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల పేరు మీద ఎన్ని దొంగ ఓట్లు సృష్టించి ఉంటారో అంతుపట్టకుండా ఉంది. అధికారులు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించలేదని ఈ ఘటనతో స్పష్టంగా బయటపడింది. ప్రతి ఓటుకు ఆధార్ నంబర్ లింక్ చేస్తే గానీ దొంగ ఓట్ల బెడద పోయేలా లేదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఈ విషయంపై దృష్టి పెడితే గానీ దొంగ ఓట్ల విషయం కొలిక్కి వచ్చేలా లేదు. పిల్లి అనంత లక్ష్మి కుటుంబ సభ్యులకు ఉన్న దొంగ ఓట్లను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆమెకు పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెంబర్ 188లో HSF2456226 ఓటర్ నెంబర్‌తో ఒక ఓటు ఉంది. ఆమె ఫోటో, పేరుతోనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 38లో IMZ2075331 ఓటర్ నెంబర్‌తో మరో ఓటు ఉంది. వాళ్ల కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఓట్లను పరిశీలించగా.. పిల్లి అనంతలక్ష్మీ(టీడీపీ ఎమ్మెల్యే) - 2 ఓట్లు. 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెంబర్: HSF2456226 2).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2075331 పిల్లి సత్యన్నారాయణ మూర్తి (ఎమ్మెల్యే భర్త) - 3 ఓట్లు. 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెం: APO70430519155 2).కాకినాడ రూరల్‌లో... బూత్ నెం: 38 ఓటర్ నెం: INZ2078319 3).కాకినాడ రూరల్‌లో... బూత్ నెం: 106 ఓటర్ నెం: INZ1724087 పిల్లి కృష్ణ ప్రసాద్( ఎమ్మెల్యే మొదటి కుమారుడు)- 2 ఓట్లు 1). పెద్దాపురం నియోజకవర్గంలో బూత్: 188 ఓటర్ నెం: APO70430519410 2).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2068310 పిల్లి కృష్ణ కళ్యాణ్(ఎమ్మెల్యే రెండవ కుమారుడు) - 3 ఓట్లు 1). పెద్దాపురం నియోజకవర్గంలో బూత్: 188 ఓటర్ నెం: HSF1182708 2).కాకినాడ రూరల్‌లో.. బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2068211 3).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 46 ఓటర్ నెం: IMZ1493402 పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడవ కుమారుడు)- 3 ఓట్లు 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెం: HSF1182757 2).కాకినాడ రూరల్‌లో. బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2067205 3).కాకినాడ రూరల్‌లో .. బూత్ నెం: 46 ఓటర్ నెం:IMZ1493550 -
అల్లి ‘పిల్లి’ ఆర్భాటం దేనికీ...
అది టీడీపీ జిల్లా కార్యాలయం... సమయం: శుక్రవారం ఉదయం 11 గంటలు లైట్‌గా చినుకులు పడుతున్నాయ్... ఏపీ 5DA నంబర్‌తో తెలుగురంగు స్కార్పియో వాహనం ఎమ్మెల్యే కాకినాడ రూరల్ అనే స్టిక్కర్‌తో దూసుకొచ్చింది. అంతా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వచ్చారనుకున్నారు.. తీరా డోర్ తెరిచి వైట్ అండ్ వైట్ డ్రెస్‌తో ఆమె భర్త పిల్లి సత్తిబాబు దిగారు. వెంటనే ఆయనకు పక్కన ఉన్న గన్‌మెన్ గొడుగు పట్టాడు. ఇది చూసినవారంతా ‘ఓర్ని...ఎమ్మెల్యే ‘పతి’ గారు ఏం బిల్డప్ ఇచ్చార్రా బాబూ! అని ఆశ్చర్యపోయారు. ఆలిది అధికారం... పెనిమిటి పెత్తంన అనే మాట కాకినాడ రూరల్ మండలంలో విస్తృతంగా వినిపిస్తున్నా... ఎమ్మెల్యే భర్త హడావుడి ఏ మాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా ఎమ్మెల్యే అయిన భార్యను ఇంటికి పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వెళితే రూ.వెయ్యి.. వస్తే మరో రూ.వెయ్యి
మత్స్యకారుల నుంచి అధికారుల వసూళ్లు ఇచ్చుకోలేక మత్స్యకారుల ఆందోళన తుంగలోకి తొక్కిన వేట నిషేధం నిబంధనలు సముద్రంలో చేపల వేట నిషేధం నిబంధనలను అధికారుల అండతోనే మత్స్యకారులు తుంగలోకి తొక్కారన్న విషయం దాదాపుగా రుజువైంది. సూర్యారావుపేట తీరంలో సోమవారం నాటి సంఘటనకు ఇందుకు సాక్ష్యం. అధికారుల వసూళ్ల తీరుకు మత్స్యకారుల ఆందోళనకు దిగి వారితో ఘర్షణకు దిగారు. వేట నిషేధ కాలంలో పరిహారం ఇవ్వలేదని, పస్తులు ఉండలేక ఇలా చేశామని మత్స్యకారులు చెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏమేరకు బాధ్యత వహిస్తుందో వేచి చూడాలి. కాకినాడ రూరల్ : సముద్రంలో వేట నిషేధ కాలంలో కుటుంబాలను పస్తులు ఉంచలేక అధికారులను బతిమాలు కొని వేట సాగిస్తున్నందున పదేపదే అధికారుల వసూలు చేస్తుండడంతో మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పరిహారం దక్కక, ఇటు ఆర్థిక ఇబ్బందులతో పస్తులు ఉండలేకపోతున్నామంటూ వారు ఆందోళనకు దిగారు. సూర్యారావుపేట సమీపంలో వేటకు వెళ్లే సమయంలో రూ.వెయ్యి, మళ్లీ వేట నుంచి తిరిగి వస్తున్న బోట్ల నుంచి రూ.10 వేలు చొప్పున మత్స్యశాఖ అధికారులు వసూలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. మత్స్యకారులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేట నిషేధ కాలంలో పరిహారం ఇస్తే దొంగచాటుగా వేటకు వెళ్లే అవసరం ఉండేదికాదని మత్స్యకారులు అంటున్నారు. ఒకటి, రెండు రోజులు వేటాడి తెచ్చుకున్న సరుకుపై వచ్చే సొమ్మును మత్స్యశాఖ అధికారులు తీసుకోవడం దారుణమంటూ అధికారులతో వారు ఘర్షణకు దిగారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు మత్స్యకారులు ఈ నెల 5 నుంచే వేటను కొనసాగించేందుకు సముద్రానికి వెళుతున్నారని, వేటకు వెళ్లే ఒక్కో మత్స్యకారుడు రూ.వెయ్యి చొప్పున మత్స్యశాఖ అధికారులకు నజరానా ఇచ్చుకోవాల్సి వస్తుందని వారు తెలిపారు. వేట ముగిసిన తరువాత మరో రూ.10 వేలు అదనంగా ఇవ్వాలని ఆ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉప్పాడ, సూర్యారావుపేట తదితర ప్రాంతాల్లో మత్స్యశాఖ అధికారుల కనుసన్నల్లోనే వేట సాగిస్తున్నామని చెబుతున్నారు. గత్యంతరం లేక ఇలా చేస్తున్నామని సూర్యారావుపేటకు చెందిన బొండియ్య, పి.ధర్మరాజు, తిక్కాడ పోలేశ్వరి, ఉప్పాడకు చెందిన చొక్కా డానియేలు అంటున్నారు. మూడేళ్లుగా చాలా మంది మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రావాల్సిన పరిహారం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఎదిరించి మాట్లాడితే వారిపైనే కేసులు పెట్టి జరిమానాలు వేస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు. ఇద్దమిద్ధంగా చెప్పలేదు.. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఫిషరీష్ ఏడీ ఎన్. శ్రీనివాసరావును వివరణ కోరగా మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం అందించాల్సి ఉందన్నారు. జిల్లాలో 30 వేల మందికి పైగా మత్స్యకారులుండగా చాలా మంది పేర్లు నమోదు కాలేదని, ఇప్పటి వరకు ఆరువేల మందిని మాత్రమే ఆన్లైన్ చేశామన్నారు. మత్స్యకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయమై ఆయన ఇద్దమిద్ధంగా సమాధానం చెప్పకుండా దాటేశారు. -
ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి
విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధ ముగిసిన వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు తిమ్మాపురం(కాకినాడ రూరల్) : ఆత్మ విశ్వాసంతో లక్ష్య సాధనకు ముందుకు సాగాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకొండి లక్ష్మి స్మారక గోశాల ఆవరణలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు, ఒత్తిడికి గురి కాకూడదన్నారు. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, కాలాన్ని వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమగ్రతతో పని చేస్తే పరిపూర్ణమైన విజయం సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటిస్తూ పక్కవారిని కూడా పరిశుభ్రత పాటించేలా కృషి చేయాలని సూచించారు. దేశం ఏమి ఇచ్చిందని ఆలోచించకుండా దేశానికి మనం ఏమి ఇచ్చామనే కోణంలో ఆలోచించాలన్నారు. మనం బతుకుతూనే పక్కవారిని బతికించేందుకు చేతనైనంత సాయం చేయాలన్నారు. ధనం సాయం చేస్తే ఖర్చయిపోతుందని, దానాల్లో కల్లా విద్యాదానమే గొప్పదన్నారు. విద్యాదానంతో తరతరాలు గుర్తుండిపోతారన్నారు. మహనీయుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను రోజుకి కనీసం 10 లైన్లను చదవాల్సిందిగా తల్లిదండ్రులకు సూచించారు. ఏపీజే అబ్ధుల్ కలాం రాసిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలన్నారు. సర్వేపల్లి రా«ధాకృష్ణ కోసం తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో పయనించాలని కోరారు. సమాజం, దేశం పట్ల భక్తి, గౌరవభావాలు పెంపొందించుకోవాలన్నారు. మహనీయుల అడుగుజాడల్లో పయనించేందుకు యువత నడుం బిగించాలని కోరారు. మంచి పుస్తకాలు చదవడం, అవగాహనతో కూడిన విద్య నేర్చుకోవడం, చేసే ప్రతి పనిలో ప్రత్యేకత, సృజనాత్మకత ఉండాలన్నారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం రూపొందించిన విజయానికి పది సూత్రాలను తప్పకుండా పాటిస్తామంటూ శిక్షణ తరగతులకు హాజరైన విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
భార్య జుత్తు కత్తిరించేశాడు
ప్రేమించి.. పెళ్లాడిన వైనం విడాకుల కోసం భర్త వేధింపులు ప్రేమించానని నమ్మించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 22 నెలలు కాపురం చేశాక.. ‘నువ్వు ఇష్టం లేదు, విడాకులు ఇచ్చేయ్’ అంటున్నాడు. రెండుసార్లు గర్భం పోవడానికి కారణమై.. అంతటితో ఆగకుండా ఆమె జడను కత్తిరించి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఈ సంఘటన కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీసు స్టేష¯ŒS పరిధిలోని కొవ్వాడలో చోటుచేసుకుంది. బాధితురాలు శనివారం విలేకరుల వద్ద తన ఆవేదన వెళ్లగక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వాడ (కాకినాడ రూరల్) : కొవ్వాడలో నివసిస్తున్న పొన్నమండ రమణ, వెంకటరత్నం దంపతుల కుమారై దేవీప్రసన్న. ఆమెను ప్రేమిస్తున్నానంటూ కాకినాడ రామారావుపేటకు చెందిన జవహర్ వివేక్ నమ్మించాడు. కొంతకాలం దుబాయ్‌లో పనిచేసిన ఇతడు.. ఏడేళ్లుగా దేవీప్రసన్న వెంటపడ్డాడు. ఎట్టకేలకు ఆమె పెద్దలను ఒప్పించి, పెద్దల సమక్షంలో 2015 మార్చి ఏడో తేదీన అన్నవరం దేవస్థానంలో దేవీప్రసన్నను వివాహం చేసుకున్నాడు. అప్పట్లో దేవీప్రసన్న తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ.1.50 లక్షలు ఇచ్చారు. కొవ్వాడలోనే దేవీప్రసన్న తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. కొంతకాలం తర్వాత తనకు డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేయగా.. దేవీప్రసన్న తల్లిదండ్రులు రూ.34 వేలు వివేక్ బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. గర్భిణీగా ఉన్న సమయంలో దేవీప్రసన్న కడుపుపై వివేక్ తన్నడంతో గర్భస్రావం జరిగింది. మరోసారి దేవీప్రసన్నకు గర్భం వస్తే బలవంతంగా మాత్రలు మింగించాడు. ఇంటి తలుపులు మూసి ఆమె జుట్టును కత్తిరించాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. నెల రోజుల క్రితం బంధువుల శుభకార్యానికి వెళ్లిన సమయంలో వివేక్ తన ఇంట్లో రూ.3 లక్షల విలువైన సామాన్లను తరలించుకుపోయాడు. అప్పటి నుంచి ఇంటికీ రావడం మానేశాడు. నిత్యం దేవీప్రసన్నకు ఫో¯ŒS చేసి ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరించాడు. పెద్దల వద్ద తగవు పెట్టినా పట్టించుకోలేదు. ఐదు నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. తమకు న్యాయం చేయాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ దేవీప్రసన్న.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు సిఫారసు చేయగా, అతడి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. దేవీప్రసన్న తండ్రిపైనా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తనకు విడాకులు ఇస్తే వేరే పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నాడు. ఈ విషయమై ఇంద్రపాలెం ఎస్ఐ బి.తిరుపతిరావును వివరణ కోరగా, దేవీప్రసన్న తన భర్త వివేక్‌పై ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై భార్యాభర్తల సమస్య కారణంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు రిఫర్ చేశామన్నారు. అయితే ఆమె భర్త ఒప్పుకోవడం లేదని తెలిసిందని, దీనిపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. -
దేవాదాయశాఖ స్థలంలో అన్యమత ప్రచారం
పాక తొలగింపులో ఉద్రిక్తత కాకినాడ రూరల్ : దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన భూమిని లీజుకు తీసుకుని ఆ భూమిని అన్యమత ప్రచారానికి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు భూమిలో వేసిన పాకలను తొలగించేందుకు ప్రత్నించగా లీజుదారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ సర్వేనంబర్లు 102/1ఏ, 1బి, 1సిల్లో కాకినాడ అన్నదాన సమాజానికి చెందిన 8.41 ఎకరాల స్థలం దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధీనంలో ఉంది. ప్రతి మూడేళ్లకు అందులో ఫలసాయం అనుభవించేందుకు, తోటలు నిర్వహణకు లీజుకిస్తుంటారు. అందులో భాగంగా 2016–18 ఆర్థిక సంవత్సరానికి వన్నెపూడి వెంకటరమణ లీజుకు తీసుకున్నారు. ఈ స్థలంలో క్రైస్తవ సభలు నిర్వహిస్తున్నారని, విద్యార్థులతో క్రైస్తవ తరగతులు నిర్వహిస్తున్నారని కొందరు దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో పాకలను తొలగిస్తే లీజును కొనసాగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా వెంకటరమణ ఆ స్థలంలో పాకను తొలగించకుండా జాప్యం చేయడంతో రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ఆజాద్ ఆదేశాల మేరకు గ్రేడ్–1 ఈవో ఎస్ రాధ నాయకత్వంలో ఈవోలు వుండవిల్లి వీర్రాజుచౌదరి, నరసింహరాజు, రమణమూర్తి, రాజేశ్వరరావు, సూర్యనారాయణ పాకను తొలగించే ప్రయత్నం చేశారు. సగభాగం కూల్చే సమయానికి లీజుదారుడు కొందరు వ్యక్తులతో వచ్చి పాకను తొలగించొద్దని, వచ్చే ఏడాది వరకు లీజు ఉందని, దీనికి సంబంధించి కోర్టు ఆర్డరు కూడా ఉందంటూ వాదనకు దిగారు. దీనిపై అధికారులు స్పందించి కోర్టు ఆర్డర్ ప్రకారం ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో లీజును రద్దు చేయడం జరిగిందని, స్థలాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నామని వివరించారు. లీజు రద్దు చేస్తున్నట్లు కోర్టు ఆర్డర్ ఇవ్వలేదని, కేవలం పాకను మాత్రమే తొలగించమని ఇచ్చిందని లీజుదారుడైన వెంకటరమణ, అతనితో పాటు వచ్చిన కొందరు వాదనకు దిగారు. దీంతో అధికారులు రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌ఆజాద్‌తో మాట్లాడారు. రెండు రోజుల్లో పాకను తొలగిస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని లీజుదారుడు అధికారులకు , రాతపూర్వకంగా ఇవ్వడంతో అధికారులు ఆమోదించారు. లీజుదారుడు అన్యమత ప్రచారాలకు వినియోగించకుంటే కోర్టు తీర్పు ప్రకారం లీజు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. సర్పవరం పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
సామాజిక స్థలాన్ని కాపాడండి
కన్నబాబును ఆశ్రయించిన సత్యదుర్గానగర్ మహిళలు కాకినాడ రూరల్ : తూరంగి సత్యదుర్గానగర్లో సామాహిక స్థలాన్ని జన్మభూమి కమిటీ సభ్యుడు నున్న దుర్గామహేశ్వరరావు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, మహిళలపై దౌర్జన్యానికి దిగేందుకు సిద్ధపడుతున్నాడంటూ మంగళవారం ఆ ప్రాంత మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును కలసి తమ బాధను వెల్లడించారు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ స్థలం ఆక్రమణకు గురైతే ఆక్రమణలు తొలగించి ఆ స్థలంలో కమ్యూనిటీ భవనం కడతామని చెప్పారని వివరించారు. అప్పటి నుంచి ప్రభుత్వ నిధులతో కమ్యూనిటీ భవనం కడతారని ఎదురుచూస్తున్నామన్నారు. ఏడాదిన్న క్రితం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి గ¯ŒSమె¯ŒSగా పనిచేసిన వ్యక్తి వచ్చి ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని ఇంటిని నిర్మించుకుంటానని చెప్పి ట్రాక్టర్ మట్టి తీసుకొచ్చి అక్కడ వేయగా ప్రజలంతా నిలదీయడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారని వివరించారు. ఇప్పుడు అదే వ్యక్తి ఈ స్థలాన్ని తనకు అమ్మాడంటూ జన్మభూమి కమిటీ సభ్యుడు దుర్గామహేశ్వరరావు భూమిలోకి వచ్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామని తెలిపారు. ఈ సామాజిక స్థలాన్ని ఎవరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినా అడ్డుకుంటామని, మీ సహకారం కూడా అందజేయాలంటూ కన్నబాబును మహిళలు అభ్యర్థించారు. కన్నబాబు ఉన్నతాధికారులతో మాట్లాడారు. గతంలో జరిగిన విషయాలను వివరించారు. సామాజిక స్థలం ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని కోరారు. కన్నబాబును కలిసిన వారిలో మత్స్యకార నాయకులు గంగాచలం, స్థానిక మహిళలు శేరు వీరవేణి, చీకట్ల లక్ష్మి, రాయుడు అనసూయ, గేదెల దుర్గ ఉన్నారు. -
కాకినాడకు కొత్త మాస్టర్‌ప్లాన్
కాకినాడ రూరల్ :కాకినాడ నగరానికి కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. నగరానికి 1977లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ఆధారంగా ఈ కొత్త ప్లాన్‌ను సిద్ధం చేశారు. కాకినాడ నగరం, దాని చుట్టుప్రక్కల 5 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలను కలుపుతూ ఈ మాస్టర్ ప్లాన్ తయారైంది. ఆర్వీ అసోసియేట్స్ రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్‌పై అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సును బుధవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట స్పందన ఫంక్షన్‌హాలులో నిర్వహించారు. అసోసియేట్స్ ప్రతినిధుల బృందం ఈ మాస్టర్ ప్లాన్ వివరాలను తెలియజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3లక్షల 25వేల 985 మంది ఈ మాస్టర్ ప్లాన్ కిందకు వస్తారన్నారు. మొత్తం 76,376 గృహాలు ఉన్నాయని, 31.69 చదరపు కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న కాకినాడ నగరంతో పాటు దాని చుట్టుప్రక్కల ఉన్న 34 గ్రామాలను నగరంలో కలుపుతూ ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని వివరించారు. దీనిలో కాకినాడ రూరల్, సామర్లకోట, తాళ్లరేవు, పెదపూడి మండలాలకు చెందిన 34 గ్రామాలను చేర్చినట్టు వివరించారు. ఈ ప్లాన్ ప్రకారం కాకినాడ నగరం, దాని చుట్టుప్రక్కల గ్రామాలతో కలిపి 161.83 చదరపు కిలోమీటర్లు వస్తుందన్నారు. గ్రామాల్లో ఉన్న రోడ్ల చుట్టుకొలతలతో సహా ప్లాన్ రూపొందడంతో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ప్రభుత్వ విప్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎంపీటీసీ సభ్యులు కర్రి సత్యనారాయణ, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మట్టా ప్రకాష్‌గౌడ్, పలువురు సర్పంచ్‌లు పలు సూచనలు చేశారు. పజాప్రతినిధులతో ముందుగానే మాట్లాడి ఉంటే మరింత సమాచారంతో ప్రత్యేక ప్లాన్ తయారై ఉండేదని అభిప్రాయపడ్డారు. అన్నీ రూపొందించిన తరువాత ఇదిగో ఇలా చేశాం, దీన్ని ఆమోదించడం మీ బాధ్యత అని చెప్పడం సబబుకాదని ఎమ్మెల్యే అనంతలక్ష్మి, విప్ చైతన్యరాజు అన్నారు. గ్రామాల వారీ ప్రజాప్రతినిధులు, మేధావులు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని మరింత సమర్ధవంతమైన మాస్టర్ ప్లానును తయారు చేయాలని ఎమ్మెల్యే అనంతలక్ష్మి సూచించారు. రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గోవిందస్వామి, కార్పొరేషన్ ఈఈ రామిరెడ్డి, డిప్యూటీ సిటీప్లానర్ రాంబాబు, అసిస్టెంట్ ప్లానర్ పద్మాజీ, ఆర్వీ అసోసియేట్స్ ప్రతినిధులు రమేష్ తదితరులు మాస్టర్ ప్లాన్‌పై అవగాహన కల్పించారు. మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న గ్రామాలు రమణయ్యపేట, పి.వెంకటాపురం, పండూరు, తమ్మవరం, సూర్యారావుపేట, వలసపాకల, ఉప్పలంక, గురజనాపల్లి, చొల్లంగి, చొల్లంగిపేట, పెనుగుదురు, కొరుపల్లి, నడకుదురు, జెడ్ భావారం, అరట్లకట్ట, గొడ్డటిపాలెం, కొవ్వూరు, తూరంగి, కాకినాడ రెవెన్యూ, కాకినాడ మేడలైన్, ఇంద్రపాలెం, చీడిగ, కొవ్వాడ, రేపూరు, రామేశ్వరం, గంగనాపల్లి, స్వామినగర్, ఎస్ అచ్యుతాపురం, మాధవపట్నం, సర్పవరం, పనసపాడు, అచ్చంపేట, కొప్పవరం. -
యువత పాత్ర కీలకం
వైఎస్సార్ సీపీ నేతలు సునీల్, వేణు భారీఎత్తున అనుచరులతో పార్టీలోకి చేరిన గీసాల శ్రీను కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకమైందని కాకినాడ పార్లమెంటరీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు గీసాల శ్రీను భారీఎత్తున తన అనుచరులతో ఇంద్రపాలెం గొల్లపల్లి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. వీరికి సునీల్, వేణు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సునీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ నిర్మించే నవసమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రజాసేవ లో పాలుపంచుకోవాలని పిలుపుని చ్చారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నా రు. వేణు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలి పించాలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లో తిరుగుతూ, వారి కష్టాలు, కన్నీళ్లు చూసి పార్టీ మేనిఫెస్టో రూపొందించారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలకు జీవం పోయనున్నట్టు చెప్పారు. గీసాల శ్రీను మాట్లాడుతూ కాంగ్రెస్ భూస్థాపితం కా వడంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉందన్న నమ్మకంతో తన అనుచరులతో వైఎస్సార్ సీపీలోకి చేరినట్టు వివరించారు. రజక సం ఘం నాయకులు మాగాపు దుర్గాప్రసాద్, గాడిలంక సూర్యనారాయణ, కాళ్ల కుమార్, ఇరుసుమండ విష్ణు, గాడిలంక సత్యనారాయణ, కొమరపురి వీరరాఘవులు, యాదవ సంఘ నాయకులు కాద అప్పారావు, యనమల సత్యనారాయణ, కొండా అప్పలకొండ, రాయుడు నాగేశ్వరరావు, కండేపల్లి శ్రీను, చొల్లంగి వినయ్‌కుమార్, సీమకుర్తి కిశోర్‌కుమార్, చోడపనీడి గోవిందు, ఎస్సీ సెల్ నాయకులు నరసింహమూర్తి, సుకుమార్, జాన్‌పాటి అప్పారావు తదితరులు పార్టీలోకి చేరా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు గుబ్బల వెంకటశ్రీనివాసరా వు, దాట్ల సత్యనారాయణరాజు, వాసంశెట్టి త్రిమూర్తులు, సలాది శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.