సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి.
కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు.
తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు.
జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
Comments
Please login to add a commentAdd a comment