Pantham
-
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే నానాజీ అడగ్గా, ఉన్నతాధికారుల అనుమతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్ఎంసీ అధికారులు తెలిపారు.అయితే, వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న జనసేన కార్యకర్తలను ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి ఆయన అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో ఉమామహేశ్వరరావుపై నానాజీ దురుసుగా ప్రవర్తించారు. చంపేస్తానంటూ ఆయనపై నానాజీ దాడి చేశారు. నానాజీ అనుచరులు వీరంగం సృష్టించారు. పంతం నానాజీపై కాలేజీ యాజమాన్యం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
కొత్త దర్శకుడితో గోపిచంద్..!
మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇటీవల గోపిచంద్ నుంచి యావరేజ్ స్థాయి సినిమా కూడా రాలేదు. దీంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ మ్యాన్లీ హీరో. తన 25 సినిమాగా పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపిచంద్ తదుపరి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నాడు. అనిల్ సుకంర నిర్మాణలో తిరు సుబ్రహ్మాణ్యాన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్లోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు గోపిచంద్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
రెండోవాడు ఏడి?
ప్లాన్ సక్సెస్ కావాలంటే ఒకే మార్గం.ఫెయిల్యూర్ కావాలంటే వేయి మార్గాలు.2000. ఆగస్టు నెల.‘తప్పదా?’ అంది కళ్యాణి.‘తప్పదు’ అన్నాడు గోవర్ధన్.‘బియ్యం వ్యాపారమంటే రిస్క్ ఎక్కువ. పోటీ జాస్తి అని మీరే చెప్తుంటారు. ఉన్న ఉద్యోగం మానేసి ఇదేం బుద్ధండీ’...‘ఇక ఇలాగే ఉండిపొమ్మంటావా? పావుకిలో చికెను, క్వార్టర్ బాటిల్ మందు... ఇలాంటి బతుకు ఇంకా ఎంత కాలమని? మనం బాగుపడక్కర్లేదా?’‘అయితే పొలం అమ్మేస్తారన్న మాట’‘అమ్మేస్తా’‘దేవుడే ఉన్నాడు’‘దేవుణ్ణి కాదు. నన్ను నా బుర్రను నమ్ము’ఇద్దరికీ పదిహేనేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఖమ్మంలో నివాసముంటున్నారు. ఇద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు. శివారులోని రైస్‌మిల్లులో అతడు నిన్నటి వరకు మేనేజర్‌గా పనిచేసేవాడు. మిల్లు ఓనర్‌తో విభేదాలు వచ్చాయి. మానేశాడు. మానేస్తూ చూపిస్తా తడాఖా అనుకున్నాడు. సొంతంగా బిజినెస్ చేసి, బాగా సంపాదించి, ఓనర్ ముందే దర్జాగా తిరగాలనేది పంతం. పంతం నెర వేర్చుకునేపనిలో పడ్డాడతడు. ఏడాది గడిచింది. ఈ ఏడాదిగా గోవర్ధన్ సరిగా ఇంటిపట్టునే ఉండటం లేదు. ఎప్పుడో వస్తాడు. ఎప్పుడో వెళతాడు. టెన్షన్‌గా ఉంటాడు. ఒక్కోసారి రాత్రుళ్లు ఇంటికి రాడు. ఉద్యోగం చేస్తున్న రోజులే బాగున్నాయిఅనిపించింది కళ్యాణికి.వ్యాపారంలో కారు కొన్నాడు.కారు ఉండి భర్త లేని రోజుల కన్నా కారు లేని భర్త ఉన్న రోజులే మేలు అని ఆమె అనుకుంది.ఆగస్టు 19, 2001.తెల్లవారు జాము.హాల్లో ల్యాండ్‌లైన్ మోగింది.రాత్రి భర్త ఇంటికి రాలేదు. ఇప్పుడు ఏదైనా చెప్పడానికి చేశాడా?నిద్ర కళ్లతో ఫోన్ ఎత్తింది కళ్యాణి.అవతలి మాట వింటూనే భూమి కదిలిపోయినట్లనిపించింది. తేరుకొని, ఉన్నఫళంగా పిల్లలను తీసుకొని బయల్దేరింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే.ఖమ్మం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఓ కారు ఆగి ఉంది. అది పూర్తిగా తగలబడిందనడానికి గుర్తు నల్లగా కాలి కనిపిస్తోంది.చేరుకుంటుంటే కళ్యాణికి గుండెదడగా అనిపించింది.కనిపిస్తున్న దృశ్యం అబద్ధమైతే బాగుణ్ణు అనుకుంది. పోలీసులు ఆమెను సమీపించారు.కారు నంబర్, వివరాలు ఆమెకు చెప్పారు. సగం కాలిన చేతి గడియారం, రెండు ఉంగరాలు ఆమె ముందుంచారు.‘ఇవి మీ భర్తవేనా’వణుకుతున్న చేతులతో వాటిని తడుముతూ ‘అవును సార్’ అంది. కారుకు ఎడమవైపున కళ్యాణిని తీసుకెళ్లారు. ఎదురుగా నేల మీద బాగా కాలిపోయి, గుర్తుపట్టడానికి వీల్లేనంతగా ఉన్న ఓ శరీరం. కారులోంచి తీసి బయట పడుకోబెట్టినట్టున్నారు పోలీసులు.ఆ దృశ్యాన్ని చూస్తూనే అక్కడే కుప్పకూలిపోయింది కళ్యాణి. పిల్లలు బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. కాసేపటికి తెలివి వచ్చింది కళ్యాణికి.‘చూడమ్మా! ఇలాంటప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. ధైర్యం తెచ్చుకొని చూడండి. శవాన్ని పోస్టుమార్టంకి తరలిస్తున్నాం’ చెప్పాడు ఎస్సై. కళ్యాణి ఏడుస్తూనే కాలిన ఆ శరీరం వైపు చూసింది.ఆమె చూపు శవం తాలూకు ఎడుమ చేయి దగ్గర ఆగిపోయింది. మణికట్టు వద్ద చర్మం కాలిపోయి, కండరం బైటకు వచ్చి ఎముక కనిపిస్తోంది. ‘సార్’ అంది కళ్యాణి ఎస్సై వైపు తిరిగి.ఏంటమ్మా’ ‘సర్. ఇతను మా ఆయన కాదు’ఉలిక్కిపడ్డాడు ఎస్.ఐ.‘మా ఆయనకు నాలుగేళ్ల క్రితం ఎడమచేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది. డాక్టర్లు రాడ్ వేశారు. ఈ చేతికి ఎముక కనిపిస్తోంది. రాడ్ లేదు’ ఎస్సై భృకుటి ముడిపడింది. సిబ్బంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘స్టీల్ రాడ్...’ ఆలోచనలో పడ్డాడు ఎస్సై. పోలీసులు టోల్గేట్ వద్ద ఉన్న కెమెరాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. సంఘటన జరిగిన రోజున ఏయే వాహనాలు టోల్గేట్ నుంచి వెళ్లాయో కెమెరా ద్వారా పర్యవేక్షించారు. అర్ధరాత్రి 12 గంటల తెల్లవారుజాము వరకు వెళ్లిన కారు నంబర్లన్నీ నోట్ చేసుకున్నారు. తెల్లవారుజాము 2:30కు గోవర్ధన్ ఉన్న కారు క్రాస్ చేసినట్టుగా పోలీసులు కార్ నంబర్ ఆధారంగా గుర్తించారు. అయితే, అతనితో పాటు ఆ కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ, ప్రమాదం జరిగినప్పుడు మాత్రం కారులో ఒక్కరే ఉన్నారు. అంటే రెండో వాడు ఎవడు? అతనేమైనట్టు?కళ్యాణి నుంచి మరికొన్ని వివరాలు సేకరించారు. కారును గోవర్ధనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటాడని, డ్రైవర్ లేడని చెప్పింది. అదే నిజమైతే ఆ కారులో ఉన్నదెవరు? చనిపోయిన అతను గోవర్ధన్ కాకపోతే గోవర్ధన్ ఏమయ్యాడు? కళ్యాణి నుంచి గోవర్ధన్ ఫొటోలు తీసుకున్నారు పోలీసులు. ఇంటి మీద నిఘా ఉంచారు. బియ్యం షాప్ వద్ద, ఆ చుట్టుపక్కల షాపుల్లోనూ ఎంక్వైరీ చేశారు. గతంలో గోవర్ధన్ పనిచేసే చోటులో కూడా కూపీ లాగారు. చాలా వివరాలే తెలిశాయి.గోవర్ధన్ బియ్యం వ్యాపారం దివాళా తీసిందని, అప్పుల్లో ఉన్నాడని, ఎవరో స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడనీ. షాప్‌లో పనిచేస్తున్న మల్లయ్య ఎస్సై వద్దకు వచ్చాడు అయ్యా, ‘మా సార్ వద్దకు బానోతు అనే అతను నెలకోసారి వచ్చి వెళ్తుంటాడు. అతను వచ్చిన ప్రతీసారి మా సార్ డబ్బులు ఇవ్వడం చూశా. పోయిన నెల సార్ డబ్బులు ఇవ్వలేనని అంటే అతను గొడవ పెట్టుకున్నాడు కూడా’ అన్నాడు.‘అతను ఎక్కడివాడో తెలుసా..’ అడిగాడు ఎస్సై‘అతను కాటవరం దగ్గర తండా అని చెప్పాడు సార్! వెంటనే పోలీసు జీపులు ఆ తండా వైపుగా కదిలాయి. నిందితుడు గోవర్ధన్ తల దించుకొని పోలీసుల ఎదురుగా నిల్చున్నాడు. విచారణలో గోవర్ధన్ ఒక్కో విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ‘నేను రైస్‌మిల్లులో పని చేస్తున్నప్పుడు బిక్కూబాయి కూలీ. ఆమెతో నాలుగేళ్లుగా సంబంధం ఉంది. అది బయటపడటం వల్లే మిల్లులో గొడవపడి ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలెట్టాను. కానీ అంతకు ముందే మా సంబంధం ఆమె భర్త బానోతుకు తెలిసింది. అప్పట్నుంచి నన్ను డబ్బులివ్వమని వేధిస్తున్నాడు. అసలే కొత్త వ్యాపారం మొదలుపెట్టి అప్పులతో ఇబ్బందులు పడుతున్నా ఏదో విధంగా డబ్బులు సర్దుతున్నాను. కానీ, రోజు రోజుకు బానోతును భరించడం కష్టం అనిపించింది. మూడేళ్ల క్రితం 50 లక్షల రూపాయలకు బీమా తీసుకొని ఉన్నాను. బీమా ప్రీమియం చెల్లించే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. చనిపోతేనే ఆ బీమా డబ్బు కుటుంబానికి అందుతుంది.చనిపోకుండానే చనిపోయాననే నాటకం ఆడితే డబ్బులు వస్తాయి. అప్పుల బారినుంచి బయటపడచ్చు అనుకున్నాను. అప్పులు తీర్చే మార్గం, బిక్కూబాయి భర్తను వదిలించుకునే మార్గం ఒకటే అనిపించింది.ప్రమాదంలో చనిపోతేనే బీమా డబ్బులు వస్తాయి. అందుకని కారు ప్రమాదం జరిగేలా చూడాలి అనుకున్నాను. డబ్బులిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి బానోతును ఖమ్మం రమ్మన్నాను. ఇద్దరం కలిసి రాత్రి వరకు అక్కడే బాగా తాగాం. బానోతుకు ఇంకా ఎక్కువ తాగించాను. ఇద్దరం కారులో హైదరాబాద్ వైపు బయల్దేరాం. బానోతు నా పక్కనే ముందు సీటులో కూర్చొని నిద్రపోతున్నాడు. టోల్ గేట్ దాటి 50 కిలోమీటర్ల దూరం వచ్చేశాం. రోడ్డుకు ఎడమవైపున కారు ఆపి, బానోతుకు నా ఒంటిమీది వస్తువులు, బట్టలు తగిలించాను. అతని బట్టలు నేను వేసుకున్నాను. డ్రైవింగ్ సీట్లో అతడిని కూర్చోబెట్టి, నా ఫోన్ కూడా అతని జేబులో ఉంచి కారు డిక్కీలో ముందే ఉంచిన పెట్రోల్ తీసి లోపల, బయట అంతా పోసేశాను. కారు అద్దాలు మూసేసి, లైటర్ని వెలిగించి కారుమీద వేశాను. ఖాళీ పెట్రోల్ క్యాన్ తీసుకొని ఓ చెట్టు చాటుకు వెళ్లి కారు పూర్తిగా తగలబడేవరకు ఉండి, వెళ్లిపోయాను. వారం రోజులు గడిచిపోయాయి. ఎవరికీ అనుమానం రాలేదని, ఇంకొన్ని రోజులకు ఇంటికి వెళ్లచ్చులే అనుకొని ముందుగా బిక్కుబాయి ఇంటికి వెళ్లాను’ అసలు విషయం చెప్పాడు గోవర్ధన్.బిక్కుబాయి ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ గోవర్ధన్‌ని పట్టుకొని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు. ప్లాన్ సక్సెస్ అవడానికి ఒకటే మార్గం.ఫెయిల్ అవడానికి వేయి. – నిర్మలారెడ్డి -
డబుల్ హ్యాపీ
వినాయకచవితి పండగ సెలబ్రేషన్స్ నటుడు గోపీచంద్ ఇంట్లో ఒక రోజు ముందే మొదలయ్యాయి. గురువారం పండగ రోజు డబుల్ అయ్యాయి. ఇంతకీ... విషయం ఏంటంటే... గోపీచంద్ రెండోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘బేబి బాయ్‌కి తండ్రి అయ్యాను. పండగను మించిన సంతోషం కలుగుతోంది’’ అని గోపీచంద్ పేర్కొన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం రేష్మాను వివాహం చేసుకున్నారు గోపీచంద్. ఈ దంపతులకు 2014లో కలిగిన మగ సంతానానికి విరాట్ కృష్ణ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికోస్తే... ఇటీవల ‘పంతం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు గోపీచంద్. ఇప్పుడు గోపీచంద్ హీరోగా కుమార్ అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో ఓ సినిమా రూపొందనుందని టాక్. అలాగే దర్శకుడు సంపత్ నంది వినిపించిన ఓ స్టోరీ లైన్‌కు గోపీచంద్ ఇంప్రెస్ అయ్యారట. -
ఫిదా అయ్యారు
గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ‘‘గ్రాండ్ సక్సెస్ సాధించి రెండో వారంలోకి అడుగు పెట్టింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారి కెరీర్లో 25వ చిత్రం ‘పంతం’ మాబ్యానర్లో నిర్మించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆయనకి ఎంత ముఖ్యమో నాకు అవగాహన ఉండటంతో మేకింగ్‌లో రాజీ పడలేదు. మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. చక్రవర్తి కొత్తవాడైనా క్లారిటీతో అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలోని గ్రాండ్‌నెస్ ఆడియన్స్‌ని మెప్పించింది. కోర్టు సన్నివేశంలో గోపీచంద్‌గారు ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘పంతం’ గోపీచంద్‌గారి కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్‌తో రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఇంతటి సక్సెస్‌కి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, తిరుగులేని విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. -
నా కెరీర్లో పంతం బెస్ట్
‘‘పంతం’ వంటి మంచి సినిమా చేశానని అందరూ అభినందిస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు అభినందనలు అని చాలా మంది ఫోన్ చేశారు’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఎ కాస్’ అన్నది ఉప శీర్షిక. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చక్రి చెప్పింది చెప్పినట్లుగా ఈ సినిమా తెరకెక్కించారు. నా కెరీర్లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. రాధామోహన్‌గారు మంచి అవుట్‌పుట్ రావాలని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మరిన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి’’ అన్నారు. ‘‘కథ వినగానే గోపీచంద్‌గారైతే సరిపోతారని ఆయనకు కథ చెప్పాం. ఆయన కోసమే ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం. చక్రి కొత్తవాడైనా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా తెరకెక్కించారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమిది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి’’ అన్నారు కె.కె.రాధామోహన్. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గోపీచంద్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అన్నారు మెహరీన్. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాధామోహన్‌గారికి థాంక్స్. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కె.చక్రవర్తి. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, పాటల రచయిత భాస్కరభట్ల, రైటర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పంతం’ మొదటి రోజు వసూళ్లు
గోపిచంద్ చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. లౌక్యం సినిమాతో చివరగా విజయాన్ని అందుకున్న గోపిచంద్ పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ అండ్ మెసెజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమా గురువారం (జూలై 5) విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్‌ను, 3 కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని సమాచారం. ఇక వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమా పూర్తి రిపోర్ట్ వస్తుంది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహ్రీన్ జోడిగా నటించారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిచగా, కేకే రాధామోహన్ నిర్మించగా, కె చక్రవర్తి దర్శకత్వం వహించారు. #Pantham starts off with a STRONG OPENING!!! The film collects a gross of ₹5.2cr and a share of ₹3.22cr in its day 1 in worldwide on a THURSDAY. | @YoursGopichand @Mehreenpirzada | pic.twitter.com/bDf9u1PxHt — VamsiShekar (@UrsVamsiShekar) July 6, 2018 -
‘పంతం’ మూవీ రివ్యూ
టైటిల్ : పంతం జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : గోపిచంద్, మెహరీన్, సంపత్ రాజ్, ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : కె.చక్రవర్తి నిర్మాత : కె.కె. రాధామోహన్ యాక్షన్ హీరో గోపిచంద్‌కు కొద్ది రోజులుగా కాలం కలిసిరావటం లేదు. వరుసగా ప్రతీ సినిమా బోల్తా పడుతుండటంతో కెరీర్ కష్టాల్లో పడింది. కామెడీ సినిమాలతో మంచి విజయాలు సాధించిన గోపి మాస్ యాక్షన్ హీరోగా సత్తా చాటడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ టైంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించిన ‘పంతం’ గోపిచంద్ కెరీర్‌ను గాడిలో పెడుతుందా..? మాస్ హీరోగా గోపిచంద్ సక్సెస్ సాధించాడా..? కథ; ఆనంద్ సురానా (ముఖేష్ రుషి) లండన్‌లో ఉండే భారతీయ వ్యాపారవేత్త. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. మినిస్టర్లకు కూడా సురానాను కలవాలంటే నెలల సమయం పడుతుంది. అలాంటి సురానా ఫ్యామిలీ వారసుడు విక్రాంత్ సురానా (గోపిచంద్). ఆనంద్ సురానాకు దానధర్మాలు చేయటం ఇష్టం ఉండదు. (సాక్షి రివ్యూస్) తన భార్య దుర్గాదేవి (పవిత్రా లోకేష్) అలా దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని ఇండియా నుంచి వ్యాపారాలను ఫ్యామిలినీ లండన్ తీసుకెళ్లిపోతాడు. కానీ విక్రాంత్ మాత్రం తల్లి బాటలోనే నడుస్తాడు. తల్లి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం తిరిగి ఇండియా వస్తాడు. అలా ఇండియాకు వచ్చిన విక్రాంత్‌కు ఎదురైన పరిస్థితులేంటి..? ఆ పరిస్థితులపై విక్రాంత్ ఎలా పోరాటం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; మాస్ యాక్షన్ రోల్లో తనకు తిరుగులేదని గోపిచంద్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్‌లో మంచి ఈజ్ చూపించాడు. ఫస్ట్ హాప్లో కామెడీ టైమింగ్‌తోనూ అలరించాడు. ముఖ్యంగా కోర్టు సీన్లో గోపిచంద్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్ మెహరీన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. ఉన్నంతలో తన వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)విలన్‌గా సంపత్ రాజ్ రొటీన్ పాత్రలో కనిపించారు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా తనదైన స్టైల్లో మెప్పించారు. ఇతర పాత్రల్లో జయప్రకాష్, పృథ్వీ, షియాజీ షిండే, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రకటించే సాయం ఎంత మంది బాధితులకు చేరుతుంది.? మధ్యలో మంత్రులు, అధికారులు ఆ డబ్బును ఎలా దోచేస్తున్నారు అన్న పాయింట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించాడు దర్శకుడు చక్రవర్తి. గోపిచంద్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు వరుస యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో లాజిక్లను కాస్త పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది.(సాక్షి రివ్యూస్) విలన్ క్యారెక్టర్‌ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. గోపిసుందర్ సంగీతం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కథనం మధ్యలో పాటలు స్పీడు బ్రేకర్లల ఇబ్బంది పెడతాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా, స్టైలిష్‌గా ప్రజెంట్ చేశారు. నిర్మాత రాధామోహన్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. ప్లస్ పాయింట్స్ ; గోపిచంద్ నటన కోర్టు సీన్ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; హీరోయిన్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. మరిన్ని సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
నంబర్ ఏదైనా ఎఫర్ట్ ఒకటే
‘‘25వ సినిమా ఇలా ఉండాలని ప్లాన్ ఏం చేయలేదు. కథ నచ్చి ఒప్పుకున్నాను. ఆ తర్వాత లెక్కేస్తే ఇది 25వ సినిమా అని తెలిసింది. మైల్స్టోన్ సినిమా అనే కాదు ప్రతీ సినిమాకు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. ఇందులో నాన్న (దర్శకుడు టి.కృష్ణ) గారి సినిమాల్లా సామాజిక స్పృహ ఉన్న కథ చెప్పాం. 25 అనేది జస్ట్ నంబర్ అంతే. ప్రతీ సినిమా ఫస్ట్ సినిమాలానే భావించి, ఎఫర్ట్ పెడతా’’ అని గోపీచంద్ అన్నారు. కొత్త దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పలు విశేషాలు పంచుకున్నారు. ► హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ఫస్ట్ సాంగ్ ‘దేశమంటే మట్టికాదోయ్...’లోనే చెప్పేశాం. అందరూ బావుండాలి, తన చుట్టూ జరిగే సమస్యను తీర్చాలి అనుకునే మనçస్తత్వం ఉన్న హీరో. ప్రస్తుత సమాజంలో ప్రతీ కామన్ మ్యాన్ ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించాం. అలాగే మాకు తెలిసినంతలో దీనికో సొల్యూషన్ కూడా చెప్పే ప్రయత్నం చేశాం. ► అందరూ వ్యవస్థ అలా ఉంది. ఇలా ఉంది అని విమర్శిస్తారు. కానీ సక్రమంగా ఉండరు. ఒకర్ని వేలెత్తి చూపించినప్పుడు మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి. అలాంటి కథ చెప్పాం. ► దర్శకుడు చక్రి కథ బాగా చెప్పాడు. అలానే తీశాడు. నిర్మాతగారు కూడా కొత్త డైరెక్టర్ అనేసరికి సంకోచించారు. కానీ అతన్ని నమ్మి ముందుకెళ్లాం. రాధామోహన్‌గారు జెంటిల్‌మ్యాన్. అనుకున్న బడ్జెట్లో సినిమా తీశాం. ఈ కథకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. గోపీ సుందర్ అయితే బావుంటుందని అనుకొని తీసుకున్నాం. మెహరీన్ చాలా బాగా యాక్ట్ చేసింది. కచ్చితంగా హైట్స్‌కి వెళ్తుంది. ► కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ చెత్త సినిమా చేశాడు అని ఆడియన్స్ ఫీల్ అయ్యే సినిమా నేనెప్పుడూ చేయలేదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా, నేనే బాధ్యత తీసుకుంటాను. సినిమా ఆడనప్పుడు అందులో ఎక్కడ తప్పు జరిగింది? అని చెక్ చేసుకొని మళ్లీ ఆ తప్పు జరగనివ్వను. ► ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్‌లో డైలాగ్స్ ఎప్పుడు చెబుతానా? అని ఎగై్జట్ కూడా అయ్యాను. రమేశ్ ప్రసాద్ డైలాగ్స్ చాలా బాగా రాశారు. కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ల గారు తన అనుభవాన్నంతా ఉపయోగించి ఈ సినిమాకు పని చేశారు. ► బీవీయస్‌యన్ ప్రసాద్‌గారి ప్రొడక్షన్లో కుమార్ అనే కొత్త డైరెక్టర్‌తో నా నెక్ట్స్ సినిమా ఉంటుంది. అది కంప్లీట్ లవ్ స్టోరీ. సంపత్ నందితో ఓ సినిమా కూడా డిస్కస్ చేస్తున్నాను. ► మా అబ్బాయి నా సినిమాలన్నీ చూస్తున్నాడు. వాడికి ఫైటింగ్ సినిమాలంటే ఇష్టం. నేను ఫైటింగ్ చేస్తా అంటాడు. ► నెగటీవ్ క్యారెక్టర్ ఆల్రెడీ టచ్ చేశాను కాబట్టి నాకు నచ్చినప్పుడు ఆ సైడ్ వెళ్తాను. ప్రస్తుతానికైతే హీరోగానే చేస్తాను. -
ఆ వార్తల్లో నిజంలేదు
చికాగో సెక్స్ స్కాండల్ వివాదం టాలీవుడ్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై అప్పట్లో కథానాయిక మెహరీన్ స్పందించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘పంతం’. గోపీచంద్ హీరోగా చక్రవర్తి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. చికాగో వివాదంలోకి అనవసరంగా ఆమెను మీడియా లాగుతోందని ‘పంతం’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మెహరీన్ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్నట్లుగా చికాగో వివాదం గురించి నేను ఎవ్వరికీ ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మీడియాతో నాకు మంచి రిలేషనే ఉంది. ముంబైలో ఉన్న నేను వైరల్ ఫీవర్ వల్ల చివరిగా జరిగిన ‘పంతం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనలేకపోయాను’’ అని అన్నారు. ఇంకా యూఎస్‌లో జరిగిన సంఘటన గురించి చెబుతూ– ‘‘మా ఫ్యామిలీతో వీకెండ్ హాలీడే కోసం లాస్ ఏంజిల్‌కి వెళ్లాను. ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు నన్ను టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్గా గుర్తించారు. చికాగో సెక్స్ స్కాండల్ గురించి చెప్పారు. నిజానికి చికాగో వివాదం గురించి నేను ఫస్ట్ టైమ్ అప్పుడే విన్నాను. ఆ తర్వాత ఈ ఇష్యూతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. వాళ్లు నాకు క్షమాపణలు చెప్పి, నా ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. ఇష్యూ తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా, మరే ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని ఈ విషయంపై పబ్లిక్‌గా మాట్లాడాను. నిజానికి ఈ అనుభవం నాకు ఇబ్బంది కలిగించింది. ఎవరో కొందరి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు రావడం, ఇమేజ్ దెబ్బ తినడం నాకు బాధగా ఉంది. ఈ విషయంలో తప్పు చేసిన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఈ సంఘటన గురించి నేను చివరి సారిగా చెబుతున్నాను. అలాగే నన్ను సంప్రదించకుండా నా గురించిన కథనాలను ప్రచురించవద్దని మీడియా వారిని రీక్వెస్ట్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
వాళ్లే రియల్ హీరోలు
‘‘టి. కృష్ణ మెమోరియల్ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావుగారు నా దగ్గరికి గోపీచంద్‌ని తీసుకొచ్చారు. ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నట్లు గోపీచంద్ అన్నాడు. అందంగా ఉన్నాడు. మంచి వాయిస్. మన బ్యానర్లోనే గోపీచంద్ హీరోగా సినిమా తీద్దామనుకుని ‘తొలివలపు’ తీశాం. గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’ పెద్ద హిట్ అవ్వాలి. తను వంద సినిమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నా. రాధామోహన్ ఇంకా మంచి సినిమాలు తీయాలి’’ అని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పంతం’. కె.చక్రవరి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారు గ్రేట్ డైరెక్టర్. ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చనిపోతే పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఆ కష్టం తెలిసిన మనిషి గోపీచంద్. షూటింగ్స్‌లో నాకు ఎప్పుడూ వాళ్ల అమ్మగారి గురించి చెప్పేవాడు. వాళ్ల అమ్మ అంటే గోపీకి ఇష్టం. గోపీతో వర్క్ చేయడానికి వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నేను రెడీ’’ అన్నారు. ‘‘నాకు ఫస్ట్ చాన్స్ ఇచ్చిన గోపీచంద్‌గారికి రుణపడి ఉంటా. ‘లక్ష్యం, లౌక్యం’ చిత్రాల కంటే ‘పంతం’ ఇంకా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ శ్రీవాస్. ‘‘నాకు బ్రేక్ ఇచ్చిన సత్యసాయి ఆర్ట్స్ సంస్థ దర్శకుడు చక్రిగారికి కూడా పెద్ద బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు సంపత్ నంది. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు మోస్ట్ లవబుల్, కోపరేటివ్ హీరో. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. చక్రిగారికి ఇది తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న డైరెక్టర్లా చేశారు. ఆయనకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు మాటల రచయిత రమేశ్రెడ్డిగారు. ఈ నెల 5న ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. యూఎస్‌లో జూలై 4న రిలీజ్ అవుతుంది. అది లాంగ్ వీకెండ్ కావడంతో పాటు 4న యూఎస్ ఇండిపెండెన్స్ డే. అందరూ మా సినిమాని ఆదరిస్తారనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన రాధామోహన్‌గారికి థ్యాంక్స్. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన గోపీచంద్సార్కి ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా’’ అన్నారు కె. చక్రవర్తి. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘నా 25 చిత్రాలకు పనిచేసిన దర్శకులందరికీ థ్యాంక్స్. నాలాంటి హీరోలను క్రియేట్ చేసేది ఈ హీరోలే (డైరెక్టర్లని చూపిస్తూ). వాళ్లు రాసుకున్న పాత్రల్లో మేం యాక్ట్ చేస్తాం. రియల్ హీరోస్ వీళ్లంతా. నా తొలి సినిమా ‘తొలివలపు’ నిర్మాత నాగేశ్వరరావుగా రు , దర్శకులు ముత్యాల సుబ్బయ్యగారు ఎంకరేజ్ చేయకుంటే ఈ రోజు నేను 25 సినిమాల ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేవాణ్ణి కాదు. ‘పంతం’ సినిమా స్టార్ట్ అవడానికి కారణమైన ప్రసాద్ మూరెళ్లగారికి, రమేశ్రెడ్డిగారికి థ్యాంక్స్. చక్రి తొలి రోజు ఏ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడో చివరి రోజూ అదే కాన్ఫిడెన్స్‌తో తన ‘పంతం’ నిరూపించుకుని చాలా బాగా చేశారు. తొలిరోజు నుంచి ఈరోజు వరకూ రాధామోహన్‌గారు ఒకే మాటపై నిలబడి ఉన్నారు. వెరీ జెన్యూన్ ప్రొడ్యూసర్. ఆయన లెక్క పక్కాగా ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. గోపీచంద్‌తో సినిమాలు చేసిన పలువురు దర్శకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ఆ నమ్మకం నిజమవుతుంది
‘‘మా నాన్నగారు (దర్శకుడు టి. కృష్ణ) చేసిన సినిమాల్లాంటివి చేయాలనుకుంటున్న సమయంలో ఈ కథ కుదిరింది. నాకిది 25వ సినిమా. మంచి సామాజిక ప్రయోజనం ఉన్న కమర్షియల్ స్టోరీ కుదరడం ఆనందంగా ఉంది. కథని నమ్మి ఈ సినిమా చేశాను. పాటలు, టీజర్‌కి ఆల్రెడీ మంచి రెస్పా¯Œ ్స వచ్చాయి. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు గోపీచంద్. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా కేకే రాధామోహన్ నిర్మించిన ‘పంతం’ జూలై 5న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ చూశాక ‘పంతం’.. ఫర్ ఎ కాజ్.. అనే టైటిల్, ట్యాగ్‌లైన్ యాప్ట్ అనిపించింది. ట్రైలర్‌లోని డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతోందో చెబుతోంది. సామాజిక సమస్యను కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించిన సినిమాలన్నీ పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సొంతం చేసుకుంటుందనిపిస్తోంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్లో ఇది ఏడో సినిమా. గోపీచంద్‌గారికి ప్రెస్టీజియస్ 25వ సినిమా. కొత్త డైరెక్టర్ ఎలా తీస్తాడో అనే డౌట్ ఉండేది. అయితే డిస్కషన్స్ స్టేజిలోనే నమ్మకం కుదిరింది. చక్రవర్తి అద్భుతంగా తెరకెక్కించారు. ప్రసాద్ విజువల్స్ ఎక్స్ట్రార్డినరీ’’ అన్నారు. ‘‘టీజర్, పాటలకు మంచి రెస్పా¯Œ ్స వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు కె. చక్రవర్తి. ‘‘విజ యంపై పాజిటివ్‌గా ఉన్నాం’’ అన్నారు మెహరీన్. -
గోపిచంద్ ’పంతం’ ట్రైలర్ విడుదల
-
వాడు కాజేస్తోంది నీ బతుకుని రా..!
టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ మరో యాక్షన్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే ‘పంతం’. కే చక్రవర్తి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్లతోనే ట్రైలర్‌ను కట్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ స్టైలిష్ అప్పీల్‌తో ఆకట్టుకునే యత్నం చేశాడు. ఓవైపు ఎంటర్టైన్మెంట్తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్ సబ్జెక్టును డైరెక్టర్ డీల్ చేశాడు. కోర్టు సీన్ సన్నివేశాన్ని హైలెట్ గా చూపించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. జూలైలో పంతం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కథ బాగా చెప్పాడు... సినిమా బాగా తీశాడు
‘‘ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. ‘చాలా చిత్రాలకు రచయితగా పని చేసిన ఓ కుర్రాడి దగ్గర మంచి కథ ఉంది. ఓసారి విన’మని నాకు చెప్పారు కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, రైటర్ రమేశ్రెడ్డిగారు. విన్నాను. మొదటి సిట్టింగ్‌లోనే నచ్చింది. కథ బాగా చెప్పారు కానీ సినిమా ఎలా తీస్తారు? అని అడిగాను. ఆ రోజు ఆయనేమన్నా ఫీలయ్యాడేమో తెలియదు కానీ ‘అవకాశం ఇవ్వండి సార్ బాగా తీస్తా’ అన్నాడు. చెప్పినట్లే బాగా తీశాడు’’ అన్నారు గోపీచంద్. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో గోపీచంద్, మెహరీన్ జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. కె. చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. గోపీసుందర్ స్వరకర్త. జూలై 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. ఈ వేడుకలో ఆడియో బిగ్ సీడీని, సీడీని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ విడుదల చేసి, గోపీచంద్‌కు అందచేశారు. గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘నేను చేసిన 25 సినిమాల్లో ‘యజ్ఞం’లో మంచి మెసేజ్ ఉంటుంది.అలాంటి మెసేజ్‌తోపాటు మంచి కమర్షియల్ వేల్యూస్ ఉన్న సినిమా ‘పంతం’. ఈ చిత్రం ద్వారా ఓ స్ట్రాంగ్ మెసేజ్ చెప్పగలిగానని తృప్తిగా ఉన్నాను. రాధామోహన్‌గారు మేకింగ్‌లో కాంప్రమైజ్ కాలేదు. గోపీసుందర్‌గారు చక్కని బాణీలతో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు’’ అని చెప్పారు. ‘‘మన దేశాన్ని పట్టి పీడించే సమస్యను ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేశాం. గోపీచంద్ 25వ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు రాధామోహన్. ‘‘కమాండబుల్ యాక్టింగ్, మంచి వాయిస్ ఉన్న హీరో గోపీచంద్. మ్యాన్లీగా ఉంటారు. నేను ఓ సీన్ రాసుకున్నప్పుడు 70 మార్కులు పడితే నూటికి నూరు మార్కులు పడేలా గోపీచంద్ యాక్ట్ చేశారు’’ అన్నారు కె. చక్రవర్తి. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా ఎఫ్.డి.సీ చైర్మన్ అంబికాకృష్ణ, నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, దర్శకులు సంపత్ నంది, బాబి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
చెప్పిన తేదీకి పక్కా
గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘పంతం’. ‘బలుపు, పవర్, జై లవ కుశ ’ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమా నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు నటించిన 25వ సినిమా ఇది. మా సంస్థలో ఏడో చిత్రం. చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మించాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై 5న సినిమా విడుదల చేస్తామని ఏప్రిల్‌లోనే చెప్పాం. ఆ ప్రకారమే ప్రణాళికగా తెరకెక్కించాం. ఇటీవల యు.కె,లండన్, స్కాట్లాండ్లో కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించాం. ఈ నెల 21న విజయవాడలో ఆడియో, 24న వైజాగ్‌లో ఫంక్షన్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను, మా టీమ్ కలిసి మంచి ప్రయత్నం చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అన్నారు కె.చక్రవర్తి. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ పాల్గొన్నారు. పృథ్వీరాజ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
మార్పు కోసం పంతం
సమాజంలో మార్పు రావాలంటే నాయకులను ఎన్నుకునే ఓటర్లలో చైతన్యం రావాలంటున్నారు హీరో గోపీచంద్. కె. చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఎ కాజ్’ అనేది ఉపశీర్షిక. ఇందులో మెహరీన్ కథానాయిక. షూటింగ్ పూర్తయింది. ‘‘డిఫరెంట్ క్యారెక్టర్లో గోపీచంద్‌ను చూడబోతున్నారు. యూ.కె షెడ్యూల్ చిత్రీకరణతో టాకీ పార్ట్, పాటలు పూర్తయ్యాయి. ప్రోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 5న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పృథ్వీరాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్. -
జూలై 5న గోపిచంద్ ‘పంతం’
ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన హీరో గోపిచంద్. కానీ గత కొంత కాలం పాటు సరైన విజయాలు లేక వెనుకపడ్డారు. గోపిచంద్ ప్రస్తుతం పంతం సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (జూన్ 12) గోపిచంద్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పంతం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లోని డైలాగ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించగా, కె. చక్రవర్తి దర్శకత్వం వహించారు. గోపిచంద్‌కు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. -
గోపీచంద్ ‘పంతం’ టీజర్
గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా పంతం. ‘ఫర్ ఏ కాస్’ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ యాక్షన్ కథతో పంతం సినిమాను తెరకెక్కించారు. గోపీచంద్ 25వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో మెహరీన్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
దేశం పుట్టినప్పటి నుండి చెప్పుకునే కథే
-
టీజర్ ఆన్ ది వే
గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఏ కాస్’ అన్నది ఉపశీర్షిక. శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఇది గోపీచంద్‌కి 25వ సినిమా. ఈ సినిమా టీజర్‌ను జూన్ 5న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ సిల్వర్‌జూబ్లీ సినిమాను మా బ్యానర్లో నిర్మించడం ఆనందంగా ఉంది. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. లండన్‌లో పాటల షూట్ జరుగుతోంది. జూలై 5న సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
గోపిచంద్ ‘పంతం’ టీజర్.. ?
రణం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం లాంటి మంచి హిట్లు ఇచ్చిన హీరో గోపిచంద్. కానీ గత కొంత కాలంపాటు విజయాలు లేక వెనుకబడ్డాడు. గతేడాది ఆక్సిజన్, గౌతమ్‌నందా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అవి ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. లౌక్యం తరువాత ఆ స్థాయి హిట్ కోసం ప్రయత్నిస్తున్న ఈ హీరో ప్రస్తుతం ‘పంతం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను జూన్ 5 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కె. చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.